విదేశీ పర్యటనకు బయల్దేరిన ప్రధాని.. 45 ఏళ్లలో తొలిసారి | PM Modi Leaves For Poland, First Indian PM To Visit Country In 4 Decades | Sakshi
Sakshi News home page

విదేశీ పర్యటనకు బయల్దేరిన ప్రధాని.. 45 ఏళ్లలో తొలిసారి

Published Wed, Aug 21 2024 10:59 AM | Last Updated on Wed, Aug 21 2024 11:19 AM

PM Modi Leaves For Poland, First Indian PM To Visit Country In 4 Decades

న్యూఢిల్లీ: పోలాండ్‌, ఉక్రెయిన్ దేశాల ప‌ర్య‌ట‌న‌కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ బయల్దేరారు. నేడు ఆయన పోలాండ్‌ రాజధాని వార్సా వెళ్లేందుకు విమానం ఎక్కారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు చేశారు. పోలాండ్‌తో దౌత్య సంబంధాలకు 70 ఏళ్లు నిండాయ‌ని మోదీ తెలిపారు. 

సెంట్ర‌ల్ యూరోప్‌లో పోలాండ్ కీల‌క‌మైన ఆర్థిక భాగ‌స్వామి అని ఆయ‌న పేర్కొన్నారు. ప్ర‌జాస్వామ్యం, బహుళ‌త్వానికి రెండు దేశాలు క‌ట్టుబ‌డి ఉన్నాయ‌ని, ఇది రెండు దేశాల బంధాన్ని బ‌లోపేతం చేస్తున్న‌ట్లు ప్ర‌ధాని వెల్ల‌డించారు.

కాగా గత 45 ఏళ్లలో భారత ప్రధాని పోలాండ్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. చివరిసారి 1979లో అప్పటి ప్రధాని మోరార్జీ దేశాయ్‌ పోలాండ్‌ను సందర్శించారు. అయితే ఆర్థిక, ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదల లక్ష్యంగా పోలాండ్‌లో మోదీ పర్యటన సాగనుంది. 

ఉక్రెయిన్ అధ్యక్షుడు జేలెన్ స్కీ ఆహ్వానం మేరకు ఆ దేశంలోనూ ప్రధాని పర్యటించనున్నారు. ఇక ఉక్రెయిన్‌లో భారత ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి. ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి ముగింపు పలకాలని, శాంతి నెలకొనాలని  ఆకాంక్షించిన విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement