foriegn tour
-
విదేశీ పర్యటనకు బయల్దేరిన ప్రధాని.. 45 ఏళ్లలో తొలిసారి
న్యూఢిల్లీ: పోలాండ్, ఉక్రెయిన్ దేశాల పర్యటనకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ బయల్దేరారు. నేడు ఆయన పోలాండ్ రాజధాని వార్సా వెళ్లేందుకు విమానం ఎక్కారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు చేశారు. పోలాండ్‌తో దౌత్య సంబంధాలకు 70 ఏళ్లు నిండాయని మోదీ తెలిపారు. సెంట్రల్ యూరోప్‌లో పోలాండ్ కీలకమైన ఆర్థిక భాగస్వామి అని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం, బహుళత్వానికి రెండు దేశాలు కట్టుబడి ఉన్నాయని, ఇది రెండు దేశాల బంధాన్ని బలోపేతం చేస్తున్నట్లు ప్రధాని వెల్లడించారు.కాగా గత 45 ఏళ్లలో భారత ప్రధాని పోలాండ్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. చివరిసారి 1979లో అప్పటి ప్రధాని మోరార్జీ దేశాయ్ పోలాండ్‌ను సందర్శించారు. అయితే ఆర్థిక, ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదల లక్ష్యంగా పోలాండ్‌లో మోదీ పర్యటన సాగనుంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జేలెన్ స్కీ ఆహ్వానం మేరకు ఆ దేశంలోనూ ప్రధాని పర్యటించనున్నారు. ఇక ఉక్రెయిన్‌లో భారత ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి. ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి ముగింపు పలకాలని, శాంతి నెలకొనాలని ఆకాంక్షించిన విషయం తెలిసిందే.Leaving for Warsaw. This visit to Poland comes at a special time- when we are marking 70 years of diplomatic ties between our nations. India cherishes the deep rooted friendship with Poland. This is further cemented by a commitment to democracy and pluralism. I will hold talks…— Narendra Modi (@narendramodi) August 21, 2024 -
నక్కి నక్కి తిరుగుతున్న "చంద్ర" మామ
-
అన్న విదేశాలకు.. వదినపై కన్నేసిన మరిది..
యూపీలోని షాజహాన్‌పూర్‌కు చెందిన ఒక మహిళకు సంబంధించిన హృదయవిదారకగాథ అందరినీ కంటతడి పెట్టిస్తోంది. తన భర్త విదేశాల్లో ఉంటున్నాడని, తనను అత్తింటివారు ఇంటిలోనికి రానీయడం లేదని ఆమె ఆరోపిస్తోంది. అలాగే తన మరిది తనను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని బాధితురాలు చెబుతోంది. అతనికి సహకరించకపోవడంతో తనను కాల్‌గర్ల్ అని చెబుతూ, తన ఫోను నంబర్ వైరల్ చేస్తున్నాడని బాధితురాలు పేర్కొంది. ప్రస్తుతం ఆమె అత్తింటి వారు ఇంటికి తాళం వేసి పరారయ్యారు. అయితే బాధిత మహిళ ప్రస్తుతం ఆ ఇంటి ముందు ధర్నా చేస్తోంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం హర్దోయీలోని బెనీగంజ్లో ఉంటున్న బాధిత మహిళకు 2019లో షాజహాన్పూర్లో ఉంటున్న ఒక యువకునితో వివాహం జరిగింది. పెళ్లయిన నెల్లాళ్ల తరువాత ఆ యువకుడు ఉద్యోగం కోసం ఒమన్ దేశం వెళ్లాడు. అది మొదలు అమెను అత్తింటివారు వేధించడం ప్రారంభించారు. ఆమెపై దాడి చేసి, ఆమెను ఇంటి నుంచి గెంటేశారు. ఈ నేధ్యంలో బాధితురాలు మీడియాతో మాట్లాడుతూ తన మరిది తనను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని, కాల్‌గర్ల్ అంటూ తన ఫోన్ నంబర్ వైరల్ చేస్తున్నాడని ఆరోపించారు. ఫలితంగా తనకు లెక్కకుమించిన ఫోన్లు వస్తున్నాయని ఆమె ఆరోపించింది. తనకు న్యాయం జరిగేవరకూ ఈపోరాటాన్ని కొనసాగిస్తానని అమె తెలిపింది. ఆమె తన 3 ఏళ్ల కుమారుడిని కూడా ధర్నాలో తన పక్కనే కూర్చోబెట్టుకుంది. కాగా ఈ సమస్యపై తాను ఇంకా పోలీసులకు ఫిర్యాదు చేయలేదని ఆమె తెలిపింది. బాధితురాలి సోదరుడు మీడియాతో మాట్లాడుతూ తన బావ విదేశాల్లో ఉంటున్నాడని, తన సోదరిని అతను తీసుకువెళతాడని భావిస్తున్నామన్నారు. ఇది కూడా చదవండి: ‘లోకల్’లో యువతి ‘బెల్లీ’ డాన్స్.. పోలీసులకు నెటిజన్ల ఫిర్యాదు! -
‘సొంత ఖర్చులతో అమెరికా వెళ్తున్నా’
బెంగళూరు : నా సొంత ఖర్చులతో త్వరలోనే అమెరికా వెళ్తున్నా అంటున్నారు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి. ఇంత సడెన్‌గా కుమారస్వామి ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి ఓ కారణం ఉంది. ప్రస్తుతం కుమారస్వామి పల్లె నిద్ర పేరిట గ్రామాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం నేటితో ముగింపుకు చేరుకుంది. అయితే సీఎం పల్లె నిద్ర కార్యక్రమం కోసం విపరీతంగా ఖర్చు చేస్తున్నారని.. పల్లెల్లో కూడా ఫైవ్‌స్టార్ హోటల్ అరెంజ్మెంట్స్ చేస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కుమారస్వామి త్వరలోనే తాను అమెరికా వెళ్తున్నాని.. అందుకు అయ్యే ఖర్చును పూర్తిగా తానే భరిస్తున్నానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ.. ‘ఆదిచుంచునగరి మఠం శంకుస్థాపన నిమిత్తం త్వరలోనే న్యూ జెర్సీ వెళ్తున్నాను. ఇది అధికారిక పర్యటన కాదు. నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని అమెరికా వెళ్తున్నాన’ని తెలిపారు. ఇక తన పల్లె నిద్ర కార్యక్రమం గురించి విపక్షాలు చేస్తోన్న ఆరోపణలపై కుమారస్వామి స్పందిస్తూ.. ‘ఈ మధ్యే ఒక పాఠశాలలో బస చేసినప్పుడు అక్కడ ఓ మంచి వాక్యం నా కంట పడింది. అర్థంలేని ప్రశ్నలకు మౌనమే సరైన సమాధానం అని పాఠశాల గోడల మీద రాసి ఉంది. అదే ఇక్కడ నేను పాటిస్తున్నాను’ అన్నారు. -
బాబు హైదరాబాద్‌కు పయనం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్షనేత నారా చంద్రబాబు నాయుడు కుటుంబసభ్యులతో కలిసి హైదరాబాద్‌కు పయనమయ్యారు. రెండు రోజుల పాటు హైదరాబాద్‌లోనే చంద్రబాబు ఉండనున్నారు. కుటుంబసభ్యులతో కలిసి వారం రోజుల పాటు విదేశీ పర్యటనకు వెళ్లే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ ఘోర ఓటమి తర్వాత పార్టీ నాయకులతో పాటు కార్యకర్తలు కూడా తీవ్ర నిరుత్సాహానికి గురైన సంగతి తెల్సిందే. ఈ విషయం నుంచి కాస్త ఉపశమనం పొందేందుకు విదేశీ టూర్ ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. -
స్పీకర్ విదేశీ పర్యటనకు ట్రంప్ చెక్
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డెమొక్రటిక్ పార్టీ నేత, ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీకి షాకిచ్చారు. అమెరికా–మెక్సికో సరిహద్దు గోడకు నిధుల్ని అడ్డుకుంటున్నందుకు ప్రతీకారంగా ఆమె బ్రస్సెల్స్, ఈజిప్టు, అఫ్గానిస్తాన్ పర్యటనకు మిలటరీ విమానాన్ని ఇచ్చేందుకు సర్వసైన్యాధ్యక్షుడి హోదాలో నిరాకరించారు. ఈ మేరకు ట్రంప్ ఆమెకు లేఖ రాశారు. ‘షట్‌డౌన్ కారణంగా మీ విదేశీ పర్యటన వాయిదా పడింది. షట్‌డౌన్ ముగిశాక పర్యటనను రీషెడ్యూల్ చేస్తాం. కానీ మీరు ఈ పర్యటనకు ప్రైవేటుగా వెళ్లాలని అనుకుంటే నిరభ్యంతరంగా వెళ్లొచ్చు. అమెరికాకు చెందిన 8 లక్షల మందికిపైగా గొప్ప ఉద్యోగులకు 27 రోజులుగా వేతనాలు అందడం లేదన్న విషయాన్ని మీరు ఒప్పుకుంటారనే అనుకుంటున్నా. మన సరిహద్దుకు అత్యవసరంగా కావాల్సిన భద్రత, నిధుల విషయంలో మిమ్మల్ని త్వరలోనే కలుసుకుంటానని ఆశిస్తున్నా’ అని ట్రంప్ లేఖలో తెలిపారు. మరోవైపు, షట్‌డౌన్ నేపథ్యంలో స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ఐదురోజులపాటు జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్) సదస్సుకు అమెరికా ప్రతినిధుల బృందం పర్యటనను ట్రంప్ రద్దుచేశారు. -
సెలవులు మొదలు
ప్రొఫెషనల్ లైఫ్‌ని ఎంత బాగా ప్లాన్ చేసుకుంటారో అంతే పక్కాగా పర్సనల్ లైఫ్‌ని కూడా ప్లాన్ చేసుకుంటుంటారు మహేశ్‌బాబు. షూటింగ్ గ్యాప్స్ మధ్య కాస్త టైమ్ దొరికితే చాలు ఫ్యామిలీకి టైమ్ కేటాయిస్తుంటారాయన. ఇటీవల ‘మహర్షి’ సినిమా షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో కంప్లీట్ చేసిన మహేశ్‌బాబు ఫ్యామిలీతో ఫారిన్ వెళ్లారు. అక్కడ హాలిడేస్‌ను ఎంజాయ్ చేస్తున్న ఫొటోను హాలిడేస్ బిగిన్స్ అనే క్యాప్షన్‌తో షేర్ చేశారు మహేశ్ సతీమణి నమ్రత. అయితే ఈ హాలిడేకి ముందు హైదరాబాద్‌లో రామ్‌చరణ్, మహేశ్‌బాబు కలిసి సరదాగా సందడి చేశారు. ఆ ఫొటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు ‘మహర్షి’ నెక్ట్స్ షెడ్యూల్ పొల్లాచిలో జనవరిలో స్టార్ట్ కానుంది. కాబట్టి న్యూ ఇయర్ వేడుకలను మహేశ్ ఫారిన్లోనే సెలబ్రేట్ చేసుకుంటారని ఊహించవచ్చు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా రూపొందుతున్న ‘మహర్షి’లో ‘అల్లరి’ నరేశ్ కీలక పాత్ర చేస్తున్నారు. పూజాహెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. ఇందులో రిషి పాత్రలో మహేశ్‌బాబు, రవి పాత్రలో నరేశ్, మహా పాత్రలో పూజ కనిపిస్తారు. ప్రకాశ్ రాజ్, జయసుధ, సాయి కుమార్, పోసాని కృష్ణమురళి తదితరులు నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల కానుంది. -
సోలో ట్రావెల్ సో బెటరూ..
ఒంటరిగా విదేశీ ప్రయాణాలు చేసే మహిళల సంఖ్య పెరిగింది. బ్రిటీష్ ఎయిర్వేస్ నిర్వహించిన గ్లోబల్ సోలో ట్రావెల్ స్టడీ ప్రకారం – ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 50 శాతం మంది మహిళలు స్వతంత్రంగా ప్రపంచ దేశాలు చుట్టొస్తున్నారు. రానున్న కొద్ది సంవత్సరాల్లో 75 శాతం మంది సోలో ట్రిప్స్ ప్లాన్ చేసుకున్నారు. ఆసక్తులకు అనుగుణంగా గడపడానికి, తమ గురించి తాము తెలుసుకోవడానికి ఒంటరి ప్రయాణాలను ఒక సాధనంగా మలచుకుంటున్నారు. ఇండియా, బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, బ్రెజిల్, చైనాల్లో 18 – 64 వయోశ్రేణికి చెందిన 9,000 మందిపై జరిగిన ఈ సర్వేలో.. సంప్రదాయ ప్రయాణ తీరుతెన్నుల్లో వచ్చిన మార్పులు వెలుగుచూశాయి. ఒంటరి ప్రయాణాలు చేస్తున్న వారిలో ఇటలీ మహిళలు (63శాతం) ముందున్నారు. జర్మన్లు ఆ తర్వాత (60 శాతం) వున్నారు. ఆఖరులో అమెరికా స్త్రీలున్నారు. ఒంటరిగా విదేశీయానం చేసే అమెరికా మహిళలు 17 శాతం మందే (పురుషులు 46 శాతం) కానీ, వారంతా దాదాపుగా ఆరునెలల ప్రయాణానికి మోగ్గు చూపే వారే. చైనాలో పురుషులతో పోల్చుకుంటే స్త్రీలు పదిసార్లు ఎక్కువగా ఒంటరి ప్రయాణాలు చేస్తున్నారు. మొత్తంగా.. 67 శాతం మహిళా ప్రయాణికులు తమ ఖండంలోని అద్భుతాలు ఆస్వాదించడం కోసం స్వల్ప కాలిక యాత్రలు చేస్తున్నారు. 50 శాతం మందికి పైగా స్త్రీలు స్వల్ప కాలిక ప్రయాణాలు ఎంపిక చేసుకుంటున్నారు. మార్కెట్ సర్వేల ప్రకారం – 3.05 కోట్లకు పైగా స్త్రీలు ఆరు మాసాలకు పైగా విదేశీ సందర్శనలో గడుపుతున్నారు. చాలా తరచుగా విదేశీ యాత్రలు చేస్తున్న వారిలో జర్మనీ మహిళలు ముందున్నారు. అక్కడ ప్రతి ఐదుగురిలో ఒకరు ఏడాదికి పదిసార్లకు పైగా ప్రయాణాలు గడుతున్నారు. 50 శాతం మంది తమకు చాలా దూరంగా వున్న చైనా యాత్రకు పోతున్నారు. భారతీయ యువతుల జోరు.. మన దేశంలో కనీసం రెండు నుంచి ఐదుసార్లు ఒంటరి ప్రయాణాలు చేసిన మహిళలు 47 శాతం మంది. వీరిలో అత్యధికులు 18 – 25 ఏళ్ల యువతులే. 37 శాతం మంది భారతీయ మహిళలు ఒంటరిగా ఐరోపా దేశాలు తిరిగొచ్చారు. 33 శాతం మంది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, మధ్య ప్రాచ్య దేశాలు సందర్శించారు. 30 శాతం మంది రెండు మూడు మాసాల్లో ఒంటరిగా విదేశాలు సందర్శించబోతున్నట్టు చెబుతున్నారు. థాయిలాండ్, వియత్నాం, కంబోడియా, శ్రీలంక దేశాలకు ఒంటరి ప్రయాణాలు సర్వసాధారణమయ్యాయి. స్వేచ్ఛగా.. కోరినట్టుగా.. ఒంటరి ప్రయాణాల్లో స్వేచ్ఛ వుంటుంది.. అందుకే సోలో ట్రిప్స్ ప్లాన్ చేసుకుంటున్నాం.. అంటున్నారు 55 శాతం మంది. ఇష్టమైన ప్రదేశాన్ని ఎంపిక చేసుకోవచ్చు. కోరుకున్నది తినొచ్చు. కోరిన చోట తిరగొచ్చు. ఈ వెసులుబాటు కోసమే సోల్ ట్రిప్స్‌కు ప్రాధాన్యతనిస్తున్నామని చెబుతున్నారు. సరికొత్త అనుభవాలు.. కొత్త కొత్త వ్యక్తుల్ని కలవడాలు.. వంటివి కూడా తమ ప్రాధాన్యతల జాబితాలో వున్నాయంటున్నారు 55 శాతం పైగా భారతీయ మహిళలు. మారుతున్న ప్రయాణ పోకడలపై వ్యాఖ్యానిస్తూ.. స్త్రీలు ఒంటరి ప్రయాణాన్ని తప్పుగా పరిగణించే ఆలోచనలకు కాలం చెల్లిందంటున్నారు సోలో ట్రిప్స్ ఏర్పాట్లు చూసే ట్రావెల్ బ్లాగర్ జన్నా వన్ డిజ్క్. -
సుదృఢ బంధానికి 10 సూత్రాలు
న్యూఢిల్లీ: భారత్, ఆఫ్రికా దేశాల బంధం బలోపేతం కావడానికి ప్రధాని నరేంద్ర మోదీ 10 మార్గదర్శక సూత్రాలను ప్రతిపాదించారు. ఆఫ్రికా ఆర్థికాభివృద్ధికి, పర్యావరణ సవాళ్లు, ఉగ్ర ముప్పు ఎదుర్కొనేందుకు ఇవి దోహదపడతాయన్నారు. రక్షణ, పర్యావరణం, సైబర్ భద్రత, వ్యవసాయం, సముద్ర వనరుల సద్వినియోగం తదితరాలకు సంబంధించి ఈ సూత్రాలను వివరించారు. అంతర్జాతీయ సంస్థల్లో ఆఫ్రికా దేశాలకు సమాన ప్రాధాన్యత లభించేంత వరకూ, అందులో సంస్కరణల కోసం భారత్ చేస్తున్న కృషి సంపూర్ణం కాదని తెలిపారు. ఉగాండా పర్యటనలో ఉన్న మోదీ బుధవారం ఆ దేశ పార్లమెంటులో ప్రసంగిం చారు. సమానత్వం, గౌరవం, పారదర్శకత కోసం ఆఫ్రికా చేస్తున్న ప్రయత్నాల్లో అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మరోసారి ఆఫ్రికా వైరి రాజకీయాలకు వేదిక కాకుండా, యువత ఆకాంక్షలు నెరవేర్చే ప్రాంతంగా భాసిల్లాలని వ్యాఖ్యానించారు. మిగతా ప్రపంచంతో కలసి ఆఫ్రికా దేశాలు ముందుకు సాగాలని, భారత్ వాటితో కలసి పనిచేసేందుకు సిద్ధంగా ఉందని అన్నారు. అపారమైన ఖనిజ వనరులు, వార సత్వ సంపదకు నిలయమైన ఉగాండాకు తమ ఆఫ్రికా విధానంలో కేంద్రక స్థానం ఉంటుంద ని చెప్పారు. వలస పాలన, స్వాతంత్య్ర ఉద్యమం, తీరప్రాంత సంబంధాలు తదితరాల్లో రెండు దేశాలకు చాలా సారూప్యతలు ఉన్నా యని చెప్పారు. సముద్ర సంపద నుంచి అన్ని దేశాలు ప్రయోజనం పొందేలా, భారత్ ఆఫ్రికా దేశాలతో కలసిపనిచేస్తుందని మోదీ అన్నారు. తూర్పు ఆఫ్రికా, తూర్పు హిందూ మహాసముద్రాల్లో సహకారం తప్ప పోటీ ఉండొద్ద న్నారు. ఉగాండా పార్లమెంట్లో ప్రసంగించిన తొలి భారత ప్రధానిగా మోదీ నిలిచారు. రాజధాని కంపాలాకు 85 కి.మీ దూరంలోని జింజా అనే గ్రామంలో జాతిపిత గాంధీ జ్ఞాపకార్థం వారసత్వ కేంద్రాన్ని ఏర్పాటుచేస్తామని చెప్పారు. కాగా, బ్రిక్స్ సదస్సులో పాల్గొనేం దుకు మోదీ దక్షిణాఫ్రికా చేరుకున్నారు. -
వ్యూహాత్మక భాగస్వామ్యంతో..!
జకార్తా: ఇండో–పసిఫిక్ ప్రాంతంలో శాంతి నెలకొల్పడంతోపాటు పరస్పర ప్రయోజనాలను కాపాడుకునేందుకు వ్యూహాత్మక భాగస్వామ్యంతో ముందుకెళ్లాలని భారత్, ఇండోనేసియా నిర్ణయించాయి. ఉగ్రవాదంపై పోరులోనూ ప్రపంచదేశాలన్నీ ఒకేతాటిపైకి రావాలని పిలుపునిచ్చాయి. బుధవారం జకార్తాలో భారత ప్రధాని మోదీ, ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడో మధ్య విస్తృతస్థాయి చర్చలు జరిగాయి. ఆర్థిక, సాంస్కృతిక సంబంధాల బలోపేతంతోపాటు, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాల్లో పరస్పర ప్రయోజనాలను గౌరవిస్తూ, ఇతర అంశాల్లోనూ సహకరించుకోవాలని వీరిద్దరూ నిర్ణయించారు. ఈ సందర్భంగా భారత్, ఇండోనేసియా మధ్య రక్షణ రంగంలో సహకారం, అంతరిక్ష ప్రయోగాలు, శాస్త్ర–సాంకేతికత, రైల్వేలు, వైద్యం, సాంస్కృతిక సంబంధాల బలోపేతం సహా 15 ఒప్పందాలు జరిగాయి. అనంతరం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో.. విస్తృతస్థాయిలో వ్యూహాత్మక భాగస్వామ్యంతో ముందుకెళ్లాలని ఇరుదేశాలు నిర్ణయించినట్లు మోదీ చెప్పారు. ఉగ్రవాదంపై సమైక్యపోరు ఇండోనేసియాలో ఇటీవల చర్చిలపై జరిగిన దాడిని ప్రధాని ఖండించారు. ఇరువురు నేతలు కూడా ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దీన్ని అంతం చేసేందుకు కలిసి పనిచేస్తామని సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. అన్ని దేశాలూ ఉగ్రవాదం, వీరికి ఆర్థిక సాయం చేస్తున్న మార్గాలపై పోరాటంలో ఒకే తాటిపైకి రావాలని కోరారు. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2025 కల్లా 50 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.3.37 లక్షల కోట్లు) తీసుకెళ్లే దిశగా రెట్టింపు కృషితో పనిచేయాలని కూడా నిర్ణయించారు. సముద్రం ద్వారా జరిగే వ్యాపారాన్ని పెంచే అంశాలపై చర్చించారు. దక్షిణ చైనా సముద్రంపై.. భారీగా ఇంధన నిల్వలున్న తూర్పు, దక్షిణ చైనా సముద్రాలపై వివాదం నెలకొన్న నేపథ్యంలో ఇండో–పసిఫిక్ ప్రాంతంలో శాంతి నెలకొల్పేందుకు పారదర్శకమైన నియమాలతో కూడిన విధానం ప్రాముఖ్యతనూ మోదీ–విడోడోలు చర్చించారు. 1982లో చేసిన సముద్ర చట్టాలపై ఐరాస సదస్సు (యూఎన్సీఎల్ఓఎస్), 1976 నాటి ఆగ్నేయాసియా మైత్రి, సహకార ఒప్పందం (టీఏసీ)ల ప్రకారం భారత్, ఇండోనేసియా, ఇతర ఇండో–పసిఫిక్ దేశాల హక్కులను కాపాడాల్సిన ఆవశ్యకతనూ చర్చించారు. అండమాన్ (భారత్), సబంగ్ (ఇండోనేసియా) మధ్య అనుసంధానతను పెంచడం ద్వారా ఇరు ప్రాంతాల్లో వాణిజ్యం, పర్యాటకం, ప్రజల మధ్య సంబంధాలను వృద్ధి చేసేందుకు ఓ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటుచేయాలని మోదీ–విడోడో నిర్ణయించారు. అర్జునుడి విగ్రహం సందర్శన ఈ చర్చల అనంతరం మోదీ, విడోడో కలిసి జకార్తాలోని అర్జునుడి రథం విగ్రహాన్ని సందర్శించారు. 1987లో ఈ విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. ఆ తర్వాత రామాయణ, మహాభారతాల థీమ్‌తో ఏర్పాటుచేసిన కైట్ ఫెస్టివల్‌ను ప్రారంభించారు. 30 రోజుల ఉచిత వీసా ఇండోనేసియా పౌరులు భారత్‌లో పర్యటించాలని మోదీ కోరారు. ఇందుకోసం వీరికి 30రోజుల పాటు ఉచిత వీసా ఇస్తామన్నారు. నవభారత అనుభవాన్ని పొందేందుకు భారత ఇండోనేసియన్లు భారత్‌కు రావాలన్నారు. జకార్తా కన్వెన్షన్ సెంటర్లో భారత సంతతి ప్రజలనుద్దేశించి మోదీ ప్రసంగించారు. ఇండియా–ఇండోనేసియాల పేర్లలో సారూప్యత ఉన్నట్లే ఈ రెండు దేశాల సంస్కృతి సంప్రదాయాల్లోనూ బలమైన స్నేహబంధం ఉందని పేర్కొన్నారు. భారత ఇండోనేసియన్లు తరచూ ఇండియాను సందర్శించే అలవాటు చేసుకోవాలని.. అక్కడి తమ అనుభూతులను ఇక్కడి వారితో పంచుకునే వారధుల్లా పనిచేయాలని ప్రధాని కోరారు. ‘భారత్‌లో పర్యటించాలని ఇండోనేసియన్లను ఆహ్వానిస్తున్నాం. వచ్చే ఏడాది అలహాబాద్‌లో ప్రయాగ కుంభమేళా ఉంది. ఇక్కడికొస్తే మీకు నవభారతాన్ని ఒకేచోట చూసే అవకాశం కలుగుతుంది. భారత్‌లో పర్యటించేందుకు 30 రోజుల వరకు ఉచిత వీసా ఇస్తాం’ అని కరతాళధ్వనుల మధ్య మోదీ వెల్లడించారు. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో మనుషులు ఒకచోట చేరే అతిపెద్ద కార్యక్రమంగా ప్రయాగ కుంభమేళా ప్రత్యేకత సంతరించుకుంది. కార్యక్రమంలో ప్రసంగిస్తున్న ప్రధాని మోదీ -
ఇండోనేసియా చేరుకున్న మోదీ
జకార్తా: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మూడు దేశాల పర్యటనలో భాగంగా మంగళవారం ఇండోనేసియాకు చేరుకున్నారు. భారత ప్రధాని హోదాలో ఇండోనేసియాలో మోదీ పర్యటించడం ఇదే తొలిసారి. ఆ దేశ రాజధాని జకార్తా చేరుకున్న వెంటనే మోదీ ఇంగ్లిష్, ఇండోనేసియా భాషల్లో ట్వీట్ చేస్తూ ‘జకార్తాలో దిగాను. నాగరికత, చారిత్రక విషయాల్లో భారత్, ఇండోనేసియాల మధ్య బలమైన బంధం ఉంది. ఇరు దేశాల రాజకీయ, ఆర్థిక, ప్రయోజనాలను నా పర్యటన మరింత విస్తృతం చేస్తుంది’ అని పేర్కొన్నారు. ఇండోనేసియా అధ్యక్షుడు జొకో విడొడోతో మోదీ బుధవారం భేటీ అయ్యి, తీరప్రాంత అభివృద్ధి, వాణిజ్యం, పెట్టుబడులు సహా వివిధ అంశాలపై చర్చించనున్నారు. వారిద్దరూ కలసి వివిధ కంపెనీల సీఈవోల సదస్సులో పాల్గొంటారు. అనంతరం ఇండోనేసియాలోని భారతీయులతో మోదీ సమావేశమవుతారు. గురువారం మలేసియా వెళ్లి, కొత్తగా ఎన్నికైన ప్రధాని మహథిర్ మహ్మద్‌ను మోదీ కలిసి శుభాకాంక్షలు చెబుతారు. మహథిర్తో చర్చలు జరిపిన అనంతరం సింగపూర్ వెళ్తారు. శుక్రవారం అక్కడ షాంగ్రీ లా డైలాగ్‌లో ప్రసంగిస్తారు. భద్రతాంశాలపై ప్రతి ఏడాదీ జరిగే సదస్సును షాంగ్రీ లా అని పిలుస్తారు. ‘ఈ సదస్సులో ఓ భారత ప్రధాని ప్రసంగించడం ఇదే తొలిసారి. ప్రాంతీయ భద్రత, శాంతి, స్థిరత్వాల పరిరక్షణ పట్ల భారత వైఖరిని తెలియజేసేందుకు ఇదొక అవకాశం’ అని మోదీ ట్వీట్ చేశారు. సింగపూర్ అధ్యక్షురాలు హలీమా యాకుబ్, ప్రధాని లీ హ్సీన్ లూంగ్‌లను కూడా మోదీ కలుస్తారు. మహాత్మా గాంధీ అస్థికలను సముద్రంలో కలిపిన చోటైన ‘క్లిఫర్డ్ పియర్’ వద్ద మోదీ ఓ శిలా ఫలకాన్ని ఆవిష్కరిస్తారు. -
అత్యాచారాలు సిగ్గుచేటు
లండన్: చిన్నారులపై అత్యాచారాలు సిగ్గుచేటని, దీనిపై రాజకీయాలు తగవని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. కఠువా, ఉన్నావ్ ఘటనలపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. తాను ప్రధానమంత్రిని కాదని, 125 కోట్ల మంది భారతీయులకు సేవకుడినని మోదీ పేర్కొన్నారు. అభివృద్ధి ప్రజా ఉద్యమంగా మారాల్సిన అవసరం ఉందన్న ప్రధాని.. భారత్ పట్ల ప్రపంచ దేశాల దృక్కోణం మారిందన్నారు. భారత్ శాంతికాముక దేశమే కానీ.. దేశ ప్రజల భద్రత ప్రమాదంలో పడితే ఉపేక్షించబోమంటూ పాక్‌పై గతంలో జరిపిన సర్జికల్ స్ట్రైక్స్‌ను గుర్తు చేశారు. బ్రిటన్ పర్యటనలో భాగంగా బుధవారం ఆయన లండన్‌లోని ప్రఖ్యాత సెంట్రల్ హాల్, వెస్ట్ మినిస్టర్ వేదికగా తన అభిప్రాయాలను ‘భారత్ కీ బాత్.. సబ్ కే సాథ్’ పేరుతో స్థానిక భారతీయులతో పంచుకున్నారు. సోషల్ మీడియాలో వచ్చిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ చైర్మన్ ప్రసూన్ జోషి ప్రయోక్తగా వ్యవహరించిన ఈ కార్యక్రమం దాదాపు గంటన్నర పైగా సాగింది. ఈ సందర్భంగా పలువురికి మోదీ ఇచ్చిన సమాధానాలు ఆయన మాటల్లోనే.. భారత్‌లో చిన్నారులపై అత్యాచారాలపై.. రేప్ అనేది దారుణం. ఆందోళనకరం. దాన్ని ఎలా అంగీకరిస్తాం? మన బిడ్డలపై అత్యాచారాలు దేశానికే సిగ్గుచేటు. ఈ దారుణాలకు పాల్పడే వారు కూడా ఒక తల్లి బిడ్డలే. దేశవ్యాప్తంగా చిన్నారులపై జరుగుతున్న ఆకృత్యాలు అత్యంత బాధాకరం. చిన్న బాలికపై అత్యాచారం జరిగినపుడు చాలా బాధనిపిస్తుంది. ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలి. కానీ మీ ప్రభుత్వంలో ఇలాంటి ఘటనలు ఇన్ని జరిగాయి. మా ప్రభుత్వంలో తక్కువ జరిగాయని చెప్పవచ్చా. వయసొచ్చిన కూతురు సాయంత్రం ఇంటికి ఆలస్యంగా వస్తే తల్లిదండ్రుల్లో ఆందోళన నాకు తెలుసు. విమర్శలపై..: విమర్శలను స్వాగతిస్తాను. వాటికి మాటలతో సమాధానం ఇవ్వాలనుకోను. తప్పు ఎక్కడ జరిగిందో సమీక్షించుకుంటాను. నేను చరిత్రలో నిలిచిపోవాలనుకోవడం లేదు. నా విధిని సక్రమంగా నిర్వర్తిస్తే చాలనుకుంటున్నాను. నోట్ల రద్దుపై..: నోట్ల రద్దు చారిత్రక నిర్ణయం. నిజాయితీ, పారదర్శకత కోసం ప్రజలు కొంతవరకు త్యాగం చేస్తారని నేను విశ్వసించాను. బలహీనతలపై..: నేను సామాన్యుడినే. అందరిలో ఉండే బలహీనతలు నాకూ ఉన్నాయి. సామాన్య స్థాయి నుంచే వచ్చాను. నాకు గొప్పగొప్ప నానమ్మలు, తాతయ్యలు లేరు. నేను కష్టపడతాను. ఈ విషయాన్ని నా దేశ ప్రజలు కూడా నమ్ముతారు. అధికారంలోకి వచ్చాక..: గత ప్రభుత్వాలతో పోలిస్తే అభివృద్ధి దిశగా దేశం దూసుకుపోతోంది. అధికారమిచ్చాం, అవకాశమిచ్చాం.. ఎందుకు చేసి చూపించరని ప్రజలు ప్రశ్నించటమే నాకు సంతోషాన్నిస్తుంది. ప్రజలకు నా ప్రభుత్వంపై ఉన్న నమ్మకానికి ఇదే సంకేతం. 125 కోట్ల మంది భారతీయులు నా కుటుంబం. ఓ చాయ్ అమ్ముకునే వ్యక్తి ప్రధాని కావటమే.. భారత ప్రజాస్వామ్యం గొప్పదనం. నేను రాయల్ ప్యాలెస్‌కు అతిథిగా రావటం 125 కోట్లమంది భారతీయుల సంకల్పమే. ప్రజాఉద్యమంలా అభివృద్ధి: అభివృద్ధి కూడా స్వాతంత్య్రోద్యమం లాంటిదే. ప్రజలందరూ అభివృద్ధిపై తమ ఆలోచనలో మార్పు తెచ్చుకోవాలి. అభివృద్ధి మన బాధ్యత. దేశం నాది, ఈ ప్రభుత్వం నాదనే భావన పెంచుకోవాలి అప్పుడు అభివృద్ధి ప్రజా ఉద్యమంలా దూసుకెళ్తుంది. ప్రజల భాగస్వామ్యం లేకుంటే మరుగుదోడ్ల నిర్మాణం కార్యక్రమం విజయవంతం కాకపోయేది. రైల్వే సబ్సిడీని 4 లక్షల మంది సీనియర్ సిటిజన్లు, ఎల్పీజీ సబ్సిడీని 1.25 కోట్ల మంది పౌరులు స్వచ్ఛందంగా వదులుకోవటమే దేశంలో ప్రజా భాగస్వామ్యానికి తార్కాణం. సర్జికల్ స్ట్రైక్‌పై.. యూఎన్ శాంతిపరిరక్షక దళాల్లో ఎక్కువ భాగస్వామ్యం భారత్‌దే. అలాంటి శాంతికాముక దేశమైన భారత్.. పొరుగున్న పాకిస్తాన్‌పై సర్జికల్ స్ట్రైక్స్ ఎందుకు చేయాల్సి వచ్చింది? ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ.. నా దేశ ప్రజలను చంపేస్తూ.. వెన్నుపోటు పొడిచేందుకు ప్రయత్నిస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? మా జవాన్ల తలలు నరుకుతున్నా నేను ఓపికగా ఉండలేకపోయాను. ఏ భాషలో చెబితే అవతలి వారికి అర్థమవుతుందో అలా చెప్పాను. సర్జికల్ స్ట్రైక్స్‌తో నా సైనికులు చేసిన పనికి నేను గర్వంగా ఫీలవుతున్నాను. ఈ విషయంపై ముందు పాకిస్తాన్ మిలటరీకి సమాచారం ఇచ్చాకే భారత్‌లోనూ, మిగతా ప్రపంచానికి వెల్లడించాం. పేదరికంపై.. నేను పుస్తకాలు చదివి పేదరికం అంటే ఏంటో తెలుసుకోలేదు. అది ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఈ విషయంలో రాజకీయం సరికాదు. రాజకీయం వేరు, పేదల జీవితంలో మార్పు తీసుకురావాలనే నా సమాజ నీతి వేరు. 70 ఏళ్ల తర్వాత 18వేల గ్రామాలకు విద్యుత్ లేకపోవటం దారుణం కాదా? మా ప్రభుత్వం ఈ పరిస్థితిని మార్చకపోతే అది పెద్ద తప్పు అవుతుంది. సౌభాగ్య పథకం ద్వారా 4కోట్ల కుటుంబాలకు (ఇళ్లకు) వెలుగునిచ్చాం. కొండలు, లోయలు, ఉగ్రవాద, తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లోని గ్రామాలకు విద్యుత్ ఇచ్చాం. 3 లక్షల గ్రామాలు బహిరంగ మల విసర్జన లేని గ్రామాలయ్యాయి. ‘గరీబీ హఠావో’ నినాదంతో తొలగిపోదు. ఆ దిశగా పనిచేయాలి. ఆయుష్మాన్ భారత్ పిల్లలకు సరైన విద్య, యువతకు ఉపాధి, అసహాయులకు సరైన వైద్యం అందించటమే మా ప్రభుత్వ లక్ష్యం. దీనికోసమే పనిచేస్తున్నాం. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని మోదీ కేర్‌గా పిలిస్తే నాకు అభ్యంతరమేం లేదు. సమగ్ర వ్యూహంతో ఈ పథకాన్ని రూపకల్పన చేశాం. తొలిగా దేశవ్యాప్తంగా 2 లక్షల వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేస్తాం. మాతా, శిశు ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెడతాం. పేదల కుటుంబాలకు ఏడాదికి 5 లక్షల వైద్య ఖర్చులను ప్రభుత్వం భరిస్తుంది. జెనరిక్ మందులను అందుబాటులోకి తెచ్చాం. స్టెంట్ల ధరలు తగ్గించాం. పిల్లల ఆరోగ్యం కోసం గర్భిణులకు 26వారాల ప్రసూతి సెలవులిస్తున్నాం. ఇదే నా జీవితం సీఎంగా ఉన్నప్పుడు నాకు వచ్చిన కానుకలను వేలం వేసి.. ఈ డబ్బును బాలిక విద్యకు వెచ్చించాను. ఈ మొత్తం 100 కోట్లకు పైమాటే. రాజకీయ జీవితంలో ఉన్నందున రెండు దశాబ్దాలుగా రోజూ విమర్శలు నాకు అలవాటైపోయాయి. ఎవరిపైనా ఆధారపడకుండా.. నవ్వుతూ, ఆహ్లాదంగా ఉంటూ ప్రాణాలు పోవాలి. అందుకే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు యోగ, ధ్యానం చేస్తాను. యువతకూడా యోగపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. అంతర్గత ఆరోగ్యానికి అదే అసలైన శక్తినిస్తుంది. గాంధీ, మార్టిన్ లూథర్ కింగ్, డయానా! ప్రధాని మోదీ ప్రసంగించిన లండన్‌లోని సెంట్రల్‌హాల్ వెస్ట్‌మినిస్టర్‌కు ఎంతో ప్రత్యేకత ఉంది. మహాత్మా గాంధీ, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ వంటి ఎందరో గొప్ప వ్యక్తులు గతంలో ఆ వేదికపై నుంచి ఉపన్యాసాలిచ్చారు. 1912 అక్టోబరులో ఈ వేదికను ప్రారంభించారు. అప్పట్లో ఇది మెథడిస్ట్ సెంట్రల్ హాల్ పేరుతో చర్చి, సమావేశ మందిరంగా ఉండేది. అప్పట్లో అనేక రకాల సమావేశాలకు, వేడుకలకు, చర్చలకు వేదికగా ఉండేది. 1946లో తొట్టతొలి ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం జరిగింది కూడా సెంట్రల్‌హాల్ వెస్ట్‌మినిస్టర్‌లోనే. 1931లో భారత స్వాతంత్య్ర ఉద్యమం ఉధృతంగా సాగుతున్నప్పుడు గాంధీ యూకేలో పర్యటించి ఇక్కడే ప్రసంగించారు. దక్షిణాఫ్రికాలో వర్ణవివక్షకు వ్యతిరేకంగా, మానవ హక్కుల కోసం పోరాడిన మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, బౌద్ధమత గురువు దలైలామా, యువరాణి డయానా తదితరులు ఈ వేదికపై నుంచి ప్రసంగించిన వారిలో అత్యంత ప్రముఖులు. బసవేశ్వరుడికి పుష్పాంజలి ప్రధాని మోదీ బుధవారం థేమ్స్ నది ఒడ్డున అల్బర్ట్ ఎంబ్యాంక్మెంట్ గార్డెన్‌లోని 12వ శతాబ్దపు సంఘ సంస్కర్త బసవేశ్వరుడి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. లండన్‌లోని బసవేశ్వర ఫౌండేషన ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. కర్ణాటకలో లింగాయత్‌లు, వీరశైవులకు రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీ హోదా కల్పిస్తూ ప్రతిపాదనలు చేసిన నేపథ్యంలో మోదీ బసవేశ్వరుడికి నివాళులర్పించటం ప్రాధాన్యత సంతరించుకుంది. అదే స్నేహం..బలమైన బంధం! భారత్–యూకే ద్వైపాక్షిక బంధాలపై మోదీ, థెరిసా మే లండన్: బ్రెగ్జిట్ (ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగటం)తో సంబంధం లేకుండా భారత–యూకే సంబంధాలు మునుపటిలాగే బలంగా ఉన్నాయని భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. కామన్వెల్త్ దేశాధినేతల (చోగమ్) సదస్సుకోసం లండన్ చేరుకున్న మోదీ.. బ్రిటన్ ప్రధాని థెరిసా మేతో చర్చలు జరిపారు. ద్వైపాక్షిక సంబంధాల్లో మరింత పురోగతితో ముందుకెళ్లాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. బుధవారం ఉదయం 10, డౌనింగ్ స్ట్రీట్ (బ్రిటన్ ప్రభుత్వ కార్యాలయం)లో జరిగిన ఈ సమావేశంలో.. నేరస్తుల అప్పగింత, న్యాయపరమైన అంశాలు, రక్షణ, భద్రతాపరమైన అంశాలు, పరస్పర మిలటరీ సహకారంతోపాటుగా ఉగ్రవాద వ్యతిరేక పోరాటం, ఆన్లైన్ ఉగ్రవాదం తదితర అంశాల్లో కలిసి పనిచేసేందుకు నిర్ణయించినట్లు ఇరుదేశాధినేతలు సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. ‘ఇరు దేశాధినేతల మధ్య ద్వైపాక్షిక బంధాలకు కొత్త నిర్వచనం పలికేలా చర్చలు జరిగాయి. భారత్–యూకే సంబంధాల్లోని బహుముఖ అంశాలపై వీరిద్దరు విస్తృతంగా చర్చించారు’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ పేర్కొన్నారు. బ్రెగ్జిట్ అనంతరం కూడా భారత్–యూకే సంబంధాల్లో ఎలాంటి మార్పు ఉండబోదని మోదీ తెలిపారన్నారు. చోగమ్ సదస్సుకోసం మంగళవారం రాత్రి ప్రధాని లండన్ చేరుకున్న మోదీకి ఆ దేశ విదేశాంగ మంత్రి బోరిస్ స్వాగతం పలికారు. కాగా, బ్రిటన్ యువరాజు చార్లెస్ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో భాగంగా సైన్స్ మ్యూజియంను మోదీ సందర్శించారు. భారత్–బ్రిటన్ కొత్త వాణిజ్య భాగస్వామ్యం మోదీ పర్యటనను పురస్కరించుకుని బ్రిటిష్ ప్రభుత్వం బుధవారం కొత్త భారత్–యూకే వాణిజ్య భాగస్వామ్య పథకాన్ని ప్రకటించింది. ఈ కొత్త భాగస్వామ్యంలో భాగంగా బ్రిటన్‌లో భారత్ పెట్టే బిలియన్ పౌండ్ల (రూ.9,340 కోట్లు) పెట్టుబడితో 5,750 కొత్త ఉద్యోగాలు వస్తాయని యూకే అంతర్జాతీయ వాణిజ్య విభాగం వెల్లడించింది. దీని లెక్కల ప్రకారం భారత్, బ్రిటన్ మధ్య వస్తు, సేవల రూపంలో 2017లో 18 బిలియన్ పౌండ్ల వ్యాపారం జరిగింది. 2016తో పోలిస్తే ఇది 15% పెరిగింది. బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో ఎలిజబెత్ రాణితో మోదీ లండన్‌లోని డౌనింగ్ స్ట్రీట్‌లో మోదీ వ్యతిరేక నినాదాలు చేస్తున్న నిరసనకారులు -
మోదీ విదేశీ పర్యటన షురూ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ మూడు దేశాల పర్యటన నిమిత్తం సోమవారం స్వీడన్ బయలుదేరి వెళ్లారు. ఏప్రిల్ 20 వరకు ఐదురోజుల పాటు జరిగే పర్యటనలో ఆయన తొలుత స్వీడన్, అనంతరం బ్రిటన్, జర్మనీ దేశాల్లో పర్యటించనున్నారు. స్వీడన్ పర్యటనలో భాగంగా మంగళవారం ఆ దేశ ప్రధాని స్టెఫాన్ లోఫెన్తో ద్వైపాక్షిక అంశాలపై విస్తృతమైన చర్చలు జరుపుతారు. ‘భారత్–స్వీడన్ మధ్య హృదయపూర్వక స్నేహ సంబంధాలున్నాయి. మా భాగస్వామ్యం ప్రజాస్వామ్య విలువల ఆధారంగా నిర్మించబడింది. ప్రపంచవ్యాప్తంగా ఓ సానుకూల వాతావరణం ఏర్పడాలనేది మా అభిమతం. మా అభివృద్ధి కార్యక్రమాల్లో స్వీడన్ విలువైన భాగస్వామి’ అని పర్యటనకు ముందు మోదీ పేర్కొన్నారు. కాగా, స్వీడన్ రాజధాని స్టాక్‌హోమ్‌లో స్టెఫాన్‌తో చర్చల తర్వాత ఆ దేశ రాజు కార్ల్ గుస్తాఫ్‌తోనూ మోదీ భేటీ కానున్నారు. అనంతరం భారత్, స్వీడన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఇండియా–నోర్డిక్ (ఫిన్లాండ్, నార్వే, డెన్మార్క్, ఐస్లాండ్ దేశాల కలిపి) సదస్సును ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారు. లండన్‌లో రాణితోనూ భేటీ స్వీడన్ నుంచి మంగళవారం రాత్రి వరకు మోదీ చోగమ్ (కామన్వెల్త్ ప్రభుత్వాధినేతల) సదస్సులో పాల్గొనేందుకు బ్రిటన్ చేరుకుంటారు. బ్రిటన్ ప్రధాని థెరిసా మేతో మోదీ చర్చలు జరుపుతారు. బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2తోనూ ప్రధాని ప్రత్యేకంగా భేటీ అవుతారు. లండన్‌లో ఆయుర్వేద సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ప్రారంభిస్తారు. కాగా, 53 కామన్వెల్త్ దేశాల సృజన్మాతక జాబితాలో భారత్ పదో స్థానంలో నిలిచింది. బ్రిటన్ మొదటి స్థానం లో, కెనడా, సింగపూర్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. -
మళ్లీ విదేశాలకు రాహుల్
సాక్షి, న్యూఢిల్లీ : రాజకీయ ప్రత్యర్థుల విమర్శలను కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సీరియస్‌గా తీసుకోవడం లేదు. ఈశాన్య రాష్ట్రాల్లో పార్టీ పరాజయం పాలైన నేపథ్యంలో రాహుల్ ఇటలీ పర్యటనలో ఉండటంపై బీజేపీ విమర్శలు గుప్పించింది. అయితే వీటిని పట్టించుకోని రాహుల్ మళ్లీ విదేశాల బాట పట్టనున్నారు. మార్చి 8 నుంచి మూడురోజుల పాటు రాహుల్ సింగపూర్, మలేషియాలను చుట్టిరానున్నారు. ఈ నెల 8-9 తేదీల్లో సింగపూర్‌లో భారత సంతతిని ఉద్దేశించి రాహుల్ ప్రసంగిస్తారు. భారత ప్రొఫెషనల్స్, సింగపూర్ పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతారు. ఇక మలేషియాలో భారత సంతతితో పాటు అక్కడ పెద్దసంఖ్యలో ఉన్న భారతీయ ఉద్యోగులు, వ్యాపారులతో సమావేశాల్లో పాల్గొంటారు. ప్రధాని మోదీ విదేశీ పర్యటనల్లో భాగంగా ఎన్ఆర్ఐలతో భేటీ అవుతుంటారు. అదే పద్ధతిని ప్రస్తుతం కాంగ్రెస్ చీఫ్ అనుసరిస్తున్నారు. గతంలోనూ రాహుల్ పలు విదేశీ పర్యటనల సందర్భంగా ఎన్ఆర్ఐలతో సమావేశమయ్యారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.అయితే విదేశాల్లో ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ రాహుల్ విమర్శల దాడి చేస్తున్నారని బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. -
మోదీ విమానాలకు పాకిస్తాన్ బిల్లు
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ రష్యా, అఫ్గానిస్తాన్, ఇరాన్, ఖతార్ సహా పలుదేశాలకు పాక్ మీదుగా వెళ్లినందుకు ఆ దేశానికి కేంద్రం రూ.2.86 లక్షలు చెల్లించినట్లు సమాచారహక్కు(ఆర్టీఐ) చట్టం కింద వెల్లడైంది. తమ గగనతలాన్ని వాడుకున్నందుకు ఈ మొత్తాన్ని నేవిగేషన్ చార్జీల కింద పాకిస్తాన్ వసూలుచేసినట్లు పాక్‌లోని భారత హైకమిషన్ కార్యాలయం తెలిపింది. నేవీ మాజీ అధికారి లోకేశ్ బత్రా దాఖలుచేసిన ఆర్టీఐ పిటిషన్‌కు కమిషన్ ఈ మేరకు జవాబిచ్చింది. రష్యా, అఫ్గానిస్తాన్ పర్యటనల నుంచి స్వదేశానికి తిరిగివస్తూ పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ పుట్టినరోజు వేడుకల కోసం మోదీ లాహోర్‌లో దిగిన సంగతి తెలిసిందే. ఇందుకోసం పాకిస్తాన్ రూ.1.49 లక్షలు వసూలుచేసిందని తెలిపింది. 2016లో మోదీ ఇరాన్ పర్యటనకు రూ.77,215, ఖతార్ పర్యటనకు రూ.59,215 లను పాక్‌కు చెల్లించినట్లు వెల్లడించింది. -
అవకాశం చేజార్చుకుంటారా?
కేవలం ఒక్క ఏడాది కాలంలో మోదీ ప్రపంచంలోనే తీరుబడిలేనిదైన న్యూయార్క్ నగరంలో సైతం ఎక్కువగా మాట్లాడుకునే ప్రపంచ నేతల్లో ఒకరుగా ఎదగడం విశేషం. కొత్తగా సమకూరిన ఈ అంతర్జాతీయ ఖ్యాతి తలకెక్కి ఆయన ఇకపై తన విదేశాంగ పర్యటనలు తగ్గించుకుని, దేశంలోని తన ప్రతిష్టను ఇనుమడింప జేసుకోవడంపై దృష్టిని కేంద్రీకరించకుండా ఉంటారా? అనేదే ఆయన ముందున్న పరీక్ష. ఆయన తన వాక్చాతుర్యంతో, కష్టపడి పనిచేయడం ద్వారా ప్రపంచ వేదికపై నిజమైన విజయాన్ని సాధించే ఆవకాశాన్ని సృష్టించారు. దాన్ని పరిణతితో ఉపయోగించుకోవాలి. ఆ పని చేయకపోతే నష్టపోయేది ఆయనే. పత్రికా విలేకరులు ట్యాక్సీ డ్రైవర్ల మాటలను ఉల్లేఖిం చడం నగుబాటుకు, పరిహాసాలకు దారితీసేటంతటి అతి పాత ఎత్తుగడ. అయినాగానీ ట్యాక్సీ డ్రైవర్ వివేకం, పరిశీలనా శక్తి నుంచి నేర్చుకోవడం ఆపేయాల్సిన అవస రమేమీ లేదు. వాళ్లు, ప్రత్యేకించి న్యూయార్క్ ట్యాక్సీ డ్రైవర్లు మన పాత్రికేయుల కంటే ఎక్కువ చూస్తారు, వింటారు. పోప్ ఫ్రాన్సిస్ గురించి ఈ వారం వాళ్లు అదే పనిగా విన్నారు. పోప్ పర్యటన ఎప్పుడూ ట్రాఫిక్‌ను చిందరవందర చేసేస్తుంది. కాబట్టి ట్యాక్సీ డ్రైవర్లు ఆయన పర్యటనంటే చిరాకు పడటాన్ని మన్నించవచ్చు. ఐక్యరాజ్య సమితి వార్షిక సాధారణ సమావేశాలకు హాజ రయ్యే మరో ప్రభుత్వాధినేత గురించి కూడా వాళ్లిప్పుడు మాట్లాడుతున్నారు. నరేంద్ర మోదీ రెండో న్యూయార్క్ పర్యటనలో మొదటి దఫా ఉన్నంతటి సంరంభం లేదు. కానీ న్యూయార్క్‌లో ఈ వారం అతి ఎక్కువగా మాట్లాడుకుం టున్న దేశాధినేతల్లో ఆయన... ఒబామా, పోప్‌ల తదు పరి మూడోవారు. ఆయన వచ్చినప్పుడల్లా అక్కడి దేశీ మద్దతుదార్లు రంగు రంగుల దుస్తులు, తలపాగాలు, డోలక్లు, పోస్టర్లు, బ్యానర్లతో భారదేశాన్ని ఆధునీకరి స్తున్న గొప్ప నేతగా ఆయన్ను కీర్తిస్తూ చేస్తే కోలాహలమే అందుకు చాలా వరకు కారణం. అందుకు భిన్నమైన స్వరం భారతీయులు ఎక్కువగా సందర్శించే మన్ హట్టన్ దిగువ తూర్పునున్న లిటిల్ ఇండియాగా పిలిచే ప్రాంతం నుంచి వినవస్తుంది. అది ఆయనను హంతకు డని అంటుంది. స్వదేశంలోలాగే విదేశాల్లో కూడా భార తీయులు మోదీ విషయంలో రెండు శిబిరాలుగా చీలి పోయి ఉంటారు. అయినా న్యూయార్క్ ట్యాక్సీ డ్రైవర్లు కూడా గమనించిన మొట్టమొదటి భారత నేత ఆయనే. మోదీకి ట్యాక్సీ డ్రైవర్ పరీక్ష కేవలం ఒక్క ఏడాది కాలంలో ఆయన ప్రపంచంలోనే తీరుబడిలేనిదైన ఆ నగరంలో సైతం ఎక్కువగా మాట్లా డుకునే ప్రపంచ నేతల్లో ఒకరుగా మోదీ స్థాయి ఎదగడం విశేషం. ఆయనకు రాజకీయ కుటుంబ వారసత్వ నేప థ్యం లేదు. ఇంగ్లిషులో పరిమితంగానే మాట్లాడుతారు. విద్యార్హతల విషయంలో ఆయన మునుపటి ప్రధానులు లేదా సహచరులలో చాలా మందికి సాటిరారు. ఇన్ని ప్రతికూలతలున్నా ఆయన అలాంటి గుర్తింపును పొంద డం మరింత విశేషం. ఏడాది క్రితం వరకు ఆయన పాశ్చాత్య ప్రపంచానికి ప్రయాణించడాన్ని సైతం అను మతించేవారు కారు. అయితేనేం నేడాయన ట్యాక్సీ డ్రైవర్ నాయకత్వ పరీక్షలో నెగ్గారు. ఈ సందర్భంగా నాకు ‘వాషింగ్టన్ పోస్ట్’ పత్రిక యజమాని, ప్రచురణకర్త అయిన డాన్ గ్రాహమ్‌తో 1993లో జరిపిన సంభాషణ గుర్తుకొస్తోంది. వారి పత్రిక సహా అమెరికన్ ప్రసారమాధ్యమాలన్నీ పాకిస్తాన్, బెన జీర్ భుట్టోల గురించి తరచూ తగినన్ని కథనాలను వెలు వరిస్తున్నా, భారత్ గురించి మాత్రం అంత తక్కువ కథ నాలను, వార్తలను ఇస్తాయేమని అడిగాను. అదీ కూడా పీవీ నరసింహారావు ప్రపంచానికి భారత ఆర్థిక వ్యవస్థ తలుపులను తెరిచిన నాటి పరిస్థితి. (ఆ తదుపరి ఏడాది పీవీని అమెరికన్ కాంగ్రెస్ స్పీకర్ ఉభయ సభల సమా వేశానికి పరిచయం చేస్తూ ‘‘నర్ శర్మా రావ్’’ అనేటం తగా భారత్ విషయంలో వారి అజ్ఞానం ఉండేది.) ‘‘మా అమెరికన్లకు బలమైన వ్యక్తులు లేదా వంశాలు ప్రాతిని ధ్యం వహించని దేశాలపైన దృష్టిని కేంద్రీకరించేటంత తీరిక ఉండదు’’ అని గ్రాహం వివరించాడు. అంతర్జాతీయ అయస్కాంతం ఇరవై ఐదేళ్ల తర్వాత మోదీ ఆ లోటును పూడ్చారు. ఆయ నకు నెహ్రూ లేదా ఇందిరలకున్న నైతిక స్థాయిగానీ లేదా రాజీవ్గాంధీకున్న యవ్వనోత్సాహం నిండిన ఆకర్షణ గానీ ఉండకపోవచ్చు. కానీ ఆయన తనకున్న శక్తిని, అధి కారాన్ని ప్రదర్శించడం ద్వారా, క్షమాపణలు చెప్పుకునే ధోరణితోగాక బాహాటంగా మాట్లాడటం ద్వారా, భార తీయులకు అసహజమైన ఉద్వేగ భరితంగా మాట్లా డటం ద్వారా ఆ లోటును భర్తీ చేసుకున్నారు. దాదా పుగా ఆయన ఇంటర్వ్యూలే ఇవ్వకపోయినా పెద్ద పెద్ద మీడియా సంస్థలు ఆయన్ను గుర్తిస్తున్నాయి. రూపర్ట్ మర్దోక్ ఆయన్ను కలుసుకున్నందువల్ల ఇలా అనడం లేదు. చైనాలో పునాదులు కదులుతున్న బడా వ్యాపార సంస్థలు ఆయనవైపు చూస్తున్నాయి. ఆయనకంటే చాలా చిన్నవారైన ప్రపంచ నేతలు లాంఛనప్రాయం కాని ఆయన స్వాభావిక ప్రవర్తనకు ఆకర్షితులవుతున్నారు. మోదీ ఎన్ఆర్ఐలను - ప్రత్యేకించి వ్యాపారులు, కిరాణా దుకాణదార్లు, హోటల్ యజమానులు, ఇమ్మి గ్రేషన్ న్యాయవాదులను గొప్పగా ఉపయోగించుకు న్నారు. తద్వారా ఆయన తను ప్రముఖంగా కనిపించేలా చేసుకున్నారు. ఆయన జరిపిన గత పర్యటనలో వారంతా మాడిసన్ స్క్వేర్ గార్డెన్ నిండిపోయేలా చేశారు. అదే ఆయన పర్యటనలోని మైలురాయి అయిం ది. అయితే ఆంతకన్నా ముఖ్యంగా ఆయన ఇప్పుడు భారత సాంకేతికవేత్తలను కూడా తన గుడారంలోకి తెచ్చుకోగలిగారు. గుజరాతీ ఎన్ఆర్ఐల లాగా వారంతా బీజేపీ మద్దతుదార్లేమీ కారు. కానీ వారికంటే అత్యంత ఎక్కువ పలుకుబడిగలవారు. కాబట్టే ఆయన సిలికాన్ వ్యాలీ, ఫేస్‌బుక్‌లలో ఒక రోజంతా గడిపారు. ప్రపంచ దేశాధినేతలందరిలోకీ ఒబామా తరువాత సామాజిక మాధ్యమాలను అత్యంత విస్తృతంగా, విజయవంతంగా ఉపయోగించుకున్నది ఆయనే. దౌత్య విజయానికి అపూర్వ అవకాశం అయితే అయన నూతనంగా సముపార్జించుకున్న ఈ అంతర్జాతీయ ఖ్యాతిని దేశంలోని అంతర్గత రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటారా లేక విదే శాంగ విధానపరమైన భారత ప్రయోజనాల పురోభి వృద్ధికి ఉపయోగిస్తారా అనేదే కీలక ప్రశ్న. ఐరాస సాధా రణ సమావేశాలకు ఏటా తీర్థయాత్ర సాగే దేశాధినేత లంతా తమ దేశ ప్రజలను లక్ష్యంగా చేసుకునే సుదీర్ఘ మైన ఉపన్యాసాలిస్తారని తరచుగా అంటుంటారు. మోదీ కూడా అలాంటి పని అంతో ఇంతో చేస్తారనడం ఖాయం. అయితే ఆయన తనకు కొత్తగా లభించిన స్థాయిని భారత విదేశాంగ విధానాల ప్రయోజనాలను పెంపొందింపజేయడానికి ఉపయోగించుకునే అపూర్వ అవకాశం కూడా ఉంది. ప్రత్యేకించి మన విదేశాంగ విధా నంలోని కొన్ని అంశాలను గతం కంటే విప్లవాత్మకంగా భిన్నమైన రీతిలో పునర్నిర్వచిస్తున్నట్టుంది. కాబట్టి ఇది మంచి అవకాశం అవుతుంది. సంకోచం వీడిన మన దౌత్యం గత రెండు దశాబ్దాలుగా భారత-అమెరికా సంబం ధాలు మరింత సుహృద్భావ పూర్వకమైనవిగా మారు తున్నాయి. మోదీ కాంగ్రెస్ ప్రభుత్వాల పాత సంకోచ ం లేదా తటపటాయింపును వీడి వాటికి కొత్త ఊపును ఇచ్చారు. మన్మోహన్సింగ్, వాజ్‌పేయి ప్రభుత్వాలతో కూడా అమెరికాలోని కీలక విధానకర్తలకు సుహృద్భావ పూరితమైన, పరస్పర విశ్వాసం గలిగిన సత్సంబంధా లుండేవి. కానీ వారిద్దరిలో ఎవరూ మోదీ అంతటి ఉత్సాహభరితంగా, శక్తివంతంగా, తటపటాయింపులు లేనితనాన్ని ప్రదర్శించలేదు. బాగా వంటబట్టిపోయిన పాత అమెరికా వ్యతిరేకతకు ఆయన అంతం పలికేశా రనేది అంతా గుర్తించినదే. ప్రభుత్వం నుంచి ప్రభు త్వానికి ఆయుధ సంపత్తి సరఫరాకు ఆర్డర్లను ఇవ్వడాన్ని ఆయన విదేశాంగ విధాన సాధనంగా కూడా ఉపయో గిస్తున్నారు. పారిస్‌లో రాఫేల్ యుద్ధ విమానాల కొను గోలు ప్రకటన చేసిన వెంటనే ఆయన తన పర్యటన సందర్భంగా అమెరికా హెలికాప్టర్ల కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చారు. అమెరికా వ్యతిరేకతకు చెల్లు చీటీ పాకిస్తాన్, చైనాలతో కలసిన ఊపిరి సలపని త్రికోణపు విదేశాంగ విధానం నుంచి బయటపడే విషయంలో ఆయన మన్మోహన్సింగ్ విధానానికి సరికొత్త రూపు రేఖలు దిద్దారు. మన్మోహన్ సింగ్ పాకిస్తాన్‌తో సంబం ధాల కోసం చేయిచాస్తే, మోదీ ముందుగా చైనాతో మాట్లాడటమే మంచిదనుకున్నారు. ఆయన నూతన పాకిస్తాన్ వ్యూహపు ముఖ్య రూపురేఖలను మీరు సైతం చూడవచ్చు. పాకిస్తాన్వారితో చర్చలు జరపడం లేదా వారిని గౌరవించడం గాక, దానికి దూరంగా ఉండి... దాని నలుగురు అతిపెద్ద మద్దతుదార్లయిన అమెరికా, చైనా, యూఏఈ, సౌదీ అరేబియాలతో మాట్లాడుతు న్నారు. ఢిల్లీలోని రేపిస్టు సౌదీ దౌత్యవేత్త విషయంలో, అక్కడ భారతీయ కార్మికుడ్ని చావబాదుతుండటం చూపుతున్న వీడియో విషయంలో భారత్ ఆగ్రహం ప్రద ర్శించకపోవడాన్ని కూడా అదే వివరించవచ్చు. మోదీ ఒక ప్రణాళిక ప్రకారం చేపట్టిన సౌదీ అరేబియా పర్య టనకు హాని కలిగించేదేదీ చేయవద్దనుకుంటున్నారు. ఆ నాలుగు దేశాల పూర్తి మద్దతుంటే, పాకిస్తాన్ తన విధా నాలను మెత్తబరచక తప్పనిస్థితి ఏర్పడుతుందని ఆయన అంచనా. పరిణతి చూపుతారా? విదేశాంగ విధానం ప్రధానంగా ఓపికగా, జాగ్రత్తగా నిర్వహించాల్సిన కార్యకలాపం. దాని లక్ష్యాల సాధనలో పరస్పర వ్యక్తిగత సత్సంబంధాలు, సంభాషణలు, వృద్ధి చెందుతున్న భారత్ అనే ప్రతిష్ట, గొప్ప సానుకూలత లవుతాయి. మోదీలో ఈ లక్షణాలు కావలసినంతగా ఉన్నాయని ఆయన విమర్శకులు సైతం అంగీకరిస్తారు. కొత్తగా సమకూరిన ఈ అంతర్జాతీయ ఖ్యాతి తలకెక్కి మోదీ ఇకపై తన విదేశాంగ పర్యటనలు తగ్గించుకుని, దేశంలోని తన ప్రతిష్టను ఇనుమడింపజేసుకోవడంపై దృష్టిని కేంద్రీకరించకుండా ఉంటారా? అనేదే ఆయన ముందున్న పరీక్ష. ఆయన తన వాక్చాతుర్యంతో, కష్ట పడి పనిచేయడం ద్వారా ప్రపంచ వేదికపై నిజమైన విజ యాన్ని సాధించే ఆవకాశాన్ని సృష్టించారు. దాన్ని పరిణ తితో ఉపయోగించుకోవాలి. ఆ పని చేయకపోతే నష్టపోయేది ఆయనే. - శేఖర్ గుప్తా twitter@shekargupta