![Brother in Law Viral Number Instagram Allegations Married Woman - Sakshi](/styles/webp/s3/article_images/2023/09/20/woman.jpg.webp?itok=0sCRDItW)
యూపీలోని షాజహాన్‌పూర్‌కు చెందిన ఒక మహిళకు సంబంధించిన హృదయవిదారకగాథ అందరినీ కంటతడి పెట్టిస్తోంది. తన భర్త విదేశాల్లో ఉంటున్నాడని, తనను అత్తింటివారు ఇంటిలోనికి రానీయడం లేదని ఆమె ఆరోపిస్తోంది. అలాగే తన మరిది తనను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని బాధితురాలు చెబుతోంది. అతనికి సహకరించకపోవడంతో తనను కాల్‌గర్ల్ అని చెబుతూ, తన ఫోను నంబర్ వైరల్ చేస్తున్నాడని బాధితురాలు పేర్కొంది. ప్రస్తుతం ఆమె అత్తింటి వారు ఇంటికి తాళం వేసి పరారయ్యారు. అయితే బాధిత మహిళ ప్రస్తుతం ఆ ఇంటి ముందు ధర్నా చేస్తోంది.
మీడియాకు అందిన సమాచారం ప్రకారం హర్దోయీలోని బెనీగంజ్‌లో ఉంటున్న బాధిత మహిళకు 2019లో షాజహాన్‌పూర్‌లో ఉంటున్న ఒక యువకునితో వివాహం జరిగింది. పెళ్లయిన నెల్లాళ్ల తరువాత ఆ యువకుడు ఉద్యోగం కోసం ఒమన్ దేశం వెళ్లాడు. అది మొదలు అమెను అత్తింటివారు వేధించడం ప్రారంభించారు. ఆమెపై దాడి చేసి, ఆమెను ఇంటి నుంచి గెంటేశారు.
ఈ నేధ్యంలో బాధితురాలు మీడియాతో మాట్లాడుతూ తన మరిది తనను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని, కాల్‌గర్ల్ అంటూ తన ఫోన్ నంబర్ వైరల్ చేస్తున్నాడని ఆరోపించారు. ఫలితంగా తనకు లెక్కకుమించిన ఫోన్లు వస్తున్నాయని ఆమె ఆరోపించింది. తనకు న్యాయం జరిగేవరకూ ఈపోరాటాన్ని కొనసాగిస్తానని అమె తెలిపింది. ఆమె తన 3 ఏళ్ల కుమారుడిని కూడా ధర్నాలో తన పక్కనే కూర్చోబెట్టుకుంది. కాగా ఈ సమస్యపై తాను ఇంకా పోలీసులకు ఫిర్యాదు చేయలేదని ఆమె తెలిపింది. బాధితురాలి సోదరుడు మీడియాతో మాట్లాడుతూ తన బావ విదేశాల్లో ఉంటున్నాడని, తన సోదరిని అతను తీసుకువెళతాడని భావిస్తున్నామన్నారు.
ఇది కూడా చదవండి: ‘లోకల్’లో యువతి ‘బెల్లీ’ డాన్స్.. పోలీసులకు నెటిజన్ల ఫిర్యాదు!
Comments
Please login to add a commentAdd a comment