Uttarparadesh
-
Sambhal Controversy: ‘అది మసీదు కాదు.. హరిహరుల ఆలయం’
మొరాదాబాద్: ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లోని జామా మసీదు సర్వే వివాదం హింసాత్మకంగా మారింది. ఈ ఘర్షణల్లో నలుగురు మృతిచెందగా, 20 మంది గాయపడ్డారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జి, బాష్పవాయువును ప్రయోగించాల్సి వచ్చింది. అయితే ఇంతకుముందు ఈ మసీదు ప్రాంతంలో ఒక దేవాలయం ఉండేదని, దానిని కూల్చివేసి మసీదు నిర్మించారనే వాదన వినిపిస్తోంది.సీనియర్ చరిత్రకారుడు డా. అజయ్ అనుపమ్‌తో మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రాంతంలోని హరిహర దేవాలయం గురించి పలు మత గ్రంథాలలో ప్రస్తావన ఉంది. సంభాల్ పౌరాణిక చరిత కలిగిన ప్రదేశమని అన్నారు. పురాణాల్లో పేర్కొన్న విషయాలను మనం కాదనలేమని, మత్స్య పురాణం, శ్రీమద్ భగవతం, స్కంద పురాణాలలో సంభాల్ ప్రస్తావన ఉందన్నారు.పురాణాలలోని వివరాల ప్రకారం రాజు నహుష కుమారుడు యయాతి ఈ సంభల్ నగరాన్ని స్థాపించాడు. అలాగే ఇక్కడ హరిహర ఆలయాన్ని నిర్మించాడు. హరి అంటే విష్ణువు. హరుడు అంటే శంకరుడు. యయాతి తన పూజల కోసం ఈ ఆలయాన్ని నిర్మించారని చరిత్ర చెబుతోందన్నారు.ఇది కూడా చదవండి: అట్టుడుకుతున్న పాక్.. ఐదుగురు సెక్యూరిటీ సిబ్బంది మృతి -
వేయించిన శనగలు తిని ఇద్దరు మృతి.. నలుగురి పరిస్థితి విషమం
బులంద్‌షహర్: యూపీలోని బులంద్‌షహర్‌లో ఆందోళనకర ఉదంతం చోటుచేసుకుంది. వేయించిన శనగలు తిన్న ఒకే కుటుంబంలోని ఇద్దరు అనారోగ్యానికి గురై మృతిచెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన దౌలత్‌పూర్‌లో చోటుచేసుకుంది.విషయం తెలుసుకున్న బులంద్‌షహర్ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ విపిన్ కుమార్ ఈ ఘటనపై విచారణ చేపట్టారు. బులంద్‌షహర్‌లోని బర్వాలా గ్రామానికి చెందిన కలువా(49) దౌలత్‌పూర్ నుంచి వేయించిన శనగలను ఇంటికి తీసుకువచ్చాడు. దీనిని ఇంటిలోని కుటుంబ సభ్యులంతా తిన్నారు. కొద్దసేపటికి వారంతా అనారోగ్యం పాలయ్యారు. చుట్టుపక్కలవారు వెంటనే బాధితులను ఆస్పత్రికి తరలించారు. కలువాతో పాటు అతని మనుమడు గోలు చికిత్స పొందుతూ మృతిచెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: సంభాల్ ఘటన: యూపీ ప్రభుత్వంపై ప్రియాంక మండిపాటు -
సంభాల్ ఘటన: యూపీ ప్రభుత్వంపై ప్రియాంక మండిపాటు
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్లోగల జామా మసీదు సర్వే పనుల్లో చోటుచేసుకున్న హింసపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా స్పందించారు. ఈ ఘటనలో యూపీ ప్రభుత్వ వైఖరిపై ఆమె విమర్శలు గుప్పించారు. ఎలాంటి విచారణ లేకుండానే అధికారులు హడావుడిగా చర్యలు చేపట్టారని ఆమె ఆరోపించారు.संभल, उत्तर प्रदेश में अचानक उठे विवाद को लेकर राज्य सरकार का रवैया बेहद दुर्भाग्यपूर्ण है। इतने संवेदनशील मामले में बिना दूसरा पक्ष सुने, बिना दोनों पक्षों को विश्वास में लिए प्रशासन ने जिस तरह हड़बड़ी के साथ कार्रवाई की, वह दिखाता है कि सरकार ने खुद माहौल खराब किया। प्रशासन ने…— Priyanka Gandhi Vadra (@priyankagandhi) November 25, 2024అధికారంలో ఉన్నప్పుడు ఏ ప్రభుత్వానికైనా వివక్ష, అణచివేత, విభజన ధోరణి తగదని ప్రియాంక గాంధీ అన్నారు. సుప్రీం కోర్టు సంభాల్ ఘటనను పరిగణలోకి తీసుకుని, న్యాయం చేయాలని ప్రియాంకాగాంధీ కోరారు. సంభాల్‌లోని జామా మసీదు సర్వేను వ్యతిరేకిస్తున్న నిరసనకారులు పోలీసులతో హింసాత్మక ఘర్షణకు పాల్పడ్డారు. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, 20 మంది భద్రతా సిబ్బంది సహా పలువురు గాయపడ్డారు. ఈ ఘటన అనంతరం జిల్లాలో 12వ తరగతి వరకు పాఠశాలలను మూసివేయాలని అధికారులు ఆదేశించారు. దీంతో పాటు ఇంటర్నెట్పై నిషేధం విధించారు. అలాగే నవంబర్ 30 వరకు బయటి వ్యక్తులు జిల్లాలోకి రాకుండా జిల్లా యంత్రాంగం నిషేధం విధించింది. ఇది కూడా చదవండి: డబ్బు కోసం కాదు, మోక్షం కోసం : నృత్యం బాధ నుంచి పుడుతుంది! -
ఏడేళ్ల చిన్నారిపై తోడేలు దాడి
బహ్రాయిచ్: ఉత్తరప్రదేశ్‌లోని బహ్రాయిచ్ జిల్లాలో నరమాస భక్షక తోడేళ్లనన్నింటినీ పట్టుకున్నామని అటవీశాఖ అధికారులు చేసిన ప్రకటన మరువకముందే మరో తోడేలు ఓ చిన్నారిపై దాడి చేసింది. మహసీ ప్రాంతంలో నరమాంస భక్షక తోడేళ్ల దాడులు ఇంకా ఆగడంలేదు. ఇంటి వరండాలోని గదిలో నిద్రిస్తున్న ఏడేళ్ల చిన్నారి అంజుపై తోడేలు దాడి చేసింది.కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం తోడేలు దాడికి దిగిన వెంటనే అంజు కేకలు వేయడంతో అది ఆ చిన్నారిని వదిలి పారిపోయింది. బాధితురాలిని ప్రథమ చికిత్స కోసం కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకువచ్చారు. అక్కడ ప్రథమ చికిత్స అందించాక ఆ చిన్నారిని మెరుగైన వైద్యం కోసం బహ్రాయిచ్ మెడికల్ కాలేజీకి తరలించారు.రాత్రి 11.30 గంటల సమయంలో తోడేలు చిన్నారి అంజు మెడ పట్టుకుని బయటకు ఈడ్చుకెళ్లింది. అంజు కేకలు వేయడంతో తోడేలు బాలికను వదిలి పారిపోయింది. కాగా ఆ చిన్నారికి అయిన గాయాన్ని పరిశీలించిన బహ్రాయిచ్ డీఎఫ్ఓ అజిత్ ప్రతాప్ సింగ్ చిన్నారిపై తోడేలు దాడి చేసిందన్న కుటుంబ ఆరోపణను ఆయన ఖండించారు. ఇది కుక్క దాడిలా కనిపిస్తున్నదన్నారు.బహ్రాయిచ్ ప్రాంతంలో తోడేళ్లు ఇప్పటివరకూ పదిమందిని పొట్టనపెట్టుకున్నాయి. తోడేళ్ల దాడుల్లో 50 మందికి పైగా జనం గాయపడ్డారు. ఇటీవల ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బహ్రాయిచ్‌కు వచ్చి బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారికి ప్రభుత్వ సహాయం అందించారు. నరమాంస భక్షక తోడేళ్లు కనిపించగానే చంపేయాలని ముఖ్యమంత్రి అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. బహ్రాయిచ్ మహసీ ప్రాంతంలో ఆరు తోడేళ్లు ఉన్నాయని అటవీశాఖ అధికారులు తెలిపారు. అందులో ఐదింటిని తొలుత పట్టుకున్నారు. మిగిలిన ఆరో తోడేలును కూడా పట్టుకున్నామని అటవీ శాఖ ప్రకటించినంతలోనే మరో తోడేలు దాడి చోటుచేసుకుంది. ఇది కూడా చదవండి: హమాస్ చీఫ్ బతికే ఉన్నాడు: ఇజ్రాయెల్ మీడియా -
ఇజ్రాయెల్ మెషీన్‌తో చిటికెలో నవయవ్వనం, కట్ చేస్తే రూ. 35 కోట్లు
ఆరుపదుల వయసుదాటినా నవయవ్వనంతో మెరిసిపోవాలి. ముఖం మీద చిన్నముడత కూడా ఉండకూడదు. దీనికోసం ఎంత ఖర్చుపెట్టడానికైనా సిద్ధంగా ఉంటారు కొంతమంది. ఈ క్రేజ్‌నే క్యాష్ చేసుకొంటున్నారు మరికొంతమంది కేటుగాళ్లు. ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకున్న రూ. 35 కోట్ల ఘరానా మోసం ఈ విషయాన్ని రుజువు చేస్తోంది.ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో రాజీవ్ కుమార్ దూబే , అతని భార్య, రష్మీ దూబే జంట అమాయకులను నమ్మించి వలలో వేసుకుంది. "ఇజ్రాయెల్‌లో తయారైన టైమ్ మెషిన్" ద్వారా అందర్నీ నవ యవ్వనంగా మారుస్తామంటూ కొంతమంది వృద్ధులను బుట్టలో వేసుకుంది. కలుషిత గాలి వల్ల వేగంగా వృద్ధాప్యానికి గురవుతున్నామని, ‘ఆక్సిజన్ థెరపీ’ ద్వారా నెలరోజుల్లో యవ్వనం వస్తుందని చెప్పి నమ్మబలికారు. అలా ఏకంగా 35 కోట్ల రూపాయలను దండుకుంది. ఇందుకోసం కాన్పూర్‌లోని కిద్వాయ్ నగర్ ప్రాంతంలో థెరపీ సెంటర్ - ‘రివైవల్ వరల్డ్ ’ ను ప్రారంభించారు. "ఆక్సిజన్ థెరపీ" తో ఏకంగా 60 ఏళ్ల వ్యక్తిని 25 ఏళ్ల యువకుడిగా మార్చేస్తామని చెప్పారు. ఒక్కో సెషన్‌కు ఆరు వేలు, మూడేళ్ల రివార్డ్ సిస్టమ్ కోసం రూ. 90వేలు... ఇలా రకరకాల ప్యాకేజీలను ఆఫర్ చేశారు. అయితే మోసం ఎన్నాళ్లో దాగదు కదా. బాధితుల్లో ఒకరైన రేణు సింగ్ ఫిర్యాదుతో ఈ భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. తాను రూ. 10.75 లక్షలు మోసం చేశారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వందలాది మందిని సుమారు రూజ35 కోట్లు మోసం చేశారని కూడా ఆమె ఆరోపించారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నామని సీనియర్ పోలీసు అధికారి అంజలి విశ్వకర్మ తెలిపారు. ప్రస్తుతం నిందితులు విదేశాలకు పారిపోయినట్లు అనుమానిస్తున్నారు. -
యూపీ, బీహార్లలో భారీ వర్షాలు.. ఉప్పొంగుతున్న నదులు
లక్నో/పట్నా: దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తుండగా, ఉత్తరప్రదేశ్, బీహార్లను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. పలు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో ప్రజలు పలు ఇబ్బందులకు గురవుతున్నారు.వాతావరణ శాఖ తాజాగా అందించిన సూచనల ప్రకారం తమిళనాడుతో పాటు పుదుచ్చేరి, కేరళ, దక్షిణ కర్ణాటక, కోస్తా కర్ణాటకలో ఈరోజు(ఆదివారం) భారీ వర్షాలు కురియనున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో సగటు కంటే అధిక వర్షపాతం నమోదైన కారణంగా, పలు నదుల నీటిమట్టం పెరిగింది. ఫలితంగా పలు జిల్లాలకు వరద ముప్పు పొంచివుంది. ఐఎండీ వెల్లడించిన గణాంకాల ప్రకారం గడచిన 24 గంటల్లో ఉత్తరప్రదేశ్‌లో 27.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఏడుగురు వర్ష సంబంధిత దుర్ఘటనల్లో మృతిచెందారు. Rainfall Warning : 29th September 2024 वर्षा की चेतावनी : 29th सितंबर 2024 #rainfallwarning #IMDWeatherUpdate #stayalert #staysafe #TamilNadu #puducherry #Kerala #karnataka @moesgoi @ndmaindia @airnewsalerts @DDNewslive@KeralaSDMA @tnsdma @KarnatakaSNDMC pic.twitter.com/R5HnYKbhru— India Meteorological Department (@Indiametdept) September 28, 2024బీహార్‌లోని వాల్మీకినగర్, బీర్పూర్ బ్యారేజీల నుంచి నీటి విడుదల, కొనసాగుతున్న వర్షాల దృష్ట్యా కోసి, గండక్, గంగ నదులు ఉప్పొంగే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం వరద హెచ్చరికలు జారీ చేసింది. నేపాల్‌లో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా సంభవించిన వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో 66 మంది మృతిచెందారు. 60 మంది గాయపడ్డారు. నేపాల్‌లోని పలు ప్రాంతాల్లో గురువారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో దేశ విపత్తు అధికారులు ఆకస్మిక వరద హెచ్చరికలు జారీ చేశారు.ఇది కూడా చదవండి: నేడు ‘మూసీ’ పర్యటనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు -
అర్థరాత్రి పోలీసులను పరుగులు పెట్టించిన ఎలుకలు
సమయం అర్థరాత్రి ఒంటి గంట.. నగరం గాఢ నిద్రలోకి జారుకున్న వేళ.. హఠాత్తుగా బ్యాంకు సైరన్ పెద్దగా మోగింది... స్థానికులకు ఉలిక్కిపడి లేచారు. అటు బ్యాంకు అధికారులు, ఇటు పోలీసులు అప్రమత్తమయ్యారు... బ్యాంకులోకి దొంగలెవరో ప్రవేశించారని అనుకున్నారు. అయితే వారు బ్యాంకు దగ్గరకు చేరుకుని అక్కడ జరిగినదేమిటో తెలుసుకుని నవ్వాలో ఏడవాలో తెలియక తెల్లముఖం వేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్‌లో చోటుచేసుకుంది.హర్డోయ్: ఉత్తరప్రదేశ్‌లోని షాహాబాద్‌లోని హర్దోయ్‌లో రాత్రి ఒంటి గంటకు అకస్మాత్తుగా బ్యాంక్ సైరన్ మోగింది. అప్రమత్తమైన స్థానిక పోలీసులు బ్యాంకు దగ్గరకు చేరుకున్నారు. బ్యాంకు క్యాషియర్‌ను పిలిపించి, లోపల తనిఖీలు చేశారు. గంటల తరబడి వెదికినా అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు. అయితే ఎలుకలు సైరన్ వైరును కొరికినట్లు బ్యాంకు అధికారులు గుర్తించారు. అందుకే ఎమర్జెన్సీ సైరన్ మోగిందని తెలుసుకున్నారు. ఊహించిన విధంగా ఏమీ జరగకపోవడంతో బ్యాంకు సిబ్బంది ఊపిరి పీల్చకున్నారు.షహబాద్ పట్టణంలోని బస్టాండ్ వద్దనున్న ఆర్యవర్ట్ గ్రామీణ బ్యాంకులో ఈ ఘటన చోటుచేసుకుంది. బుధవారం అర్థరాత్రి ఒంటిగంట సమయంలో బ్యాంకులోని ఎమర్జెన్సీ అలారం ఒక్కసారిగా మోగింది. దీంతో పోలీసులు అప్రమత్తమై బ్యాంకు చుట్టుపక్కల దొంగలెవరైనా ఉన్నారేమోనని తనిఖీలు కూడా చేశారు. అయితే ఎలుకల కారణంగా సైరన్ మోగిందని తెలుసుకుని నవ్వుకున్నారు. ఇది కూడా చదవండి: నవ్వుతూ.. నవ్విస్తూ.. -
రక్తం మరిగిన తోడేళ్లు.. కనిపిస్తే కాల్చివేత!
బహ్రయిచ్: యూపీలోని బహ్రయిచ్ జిల్లాలో తోడేళ్ల భయోత్పాతం కొనసాగుతూనే ఉంది. తాజాగా హర్ది ప్రాంతంలో అవి ఓ పసికందును పొట్టన పెట్టుకున్నాయి. ఇద్దరు వృద్ధురాళ్లపై దాడి చేసి గాయపరిచాయి. దాంతో గత రెండు నెలల్లో తోడేళ్లకు బలైన వారి సంఖ్య తొమ్మిదికి పెరిగింది. వీరిలో ఎనిమిది మంది చిన్నారులే! 34 మంది గాయపడ్డారు. ఆరు తోడేళ్లలో నాలుగింటిని పట్టుకోగా రెండు మాత్రం నిత్యం అధికారులకు చుక్కలు చూపుతున్నాయి. ఆవాసాలు మారుస్తూ, రోజుకో గ్రామాన్ని లక్ష్యం చేసుకుంటూ తప్పించుకుంటున్నాయి. తప్పనిసరైతే వాటిని కాల్చివేయాల్సిందిగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మంగళవారం ఆదేశాలిచ్చారు. దాంతో ట్రాంక్విలైజర్లతో షూటర్లను రంగంలోకి దించారు. తోడేళ్లను గుర్తించి పట్టుకునేందుకు, వీలవని పక్షంలో మట్టుపెట్టేందుకు డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. ‘ఆపరేషన్ భేడియా’కీలక దశకు చేరిందని బహ్రయిచ్ డీఎఫ్‌వో అజీత్ ప్రతాప్ సింగ్ తెలిపారు. తోడేళ్ల పీడ విరగడయ్యేదాకా ప్రజలు ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.బహ్రయిచ్‌లో మంగళవారం తెల్లవారుజాము 3.35గంటలకు మహసీ సబ్ డివిజన్లోని నౌవన్ గరేతి గ్రామంలో తోడేలు ఓ ఇంట్లో దూరి అంజలి అనే రెండున్నరేళ్ల చిన్నారిని ఎత్తుకెళ్లింది. షాక్‌కు గురైన తల్లి అరిచేలోపే పాపను నోట కరుచుని పారిపోయింది. రెండు గంటల తర్వాత కిలోమీటరు దూరంలో చేతుల్లేకుండా చిన్నారి మృతదేహం దొరికింది. అనంతరం ఉదయాన్నే అక్కడికి 2 కిలోమీటర్ల దూరంలోని కొటియా గ్రామంలో వరండాలో నిద్రిస్తున్న కమలాదేవి (70) అనే వృద్ధురాలిపై తోడేలు దాడి చేసింది. ఆమె అరుపులతో కుటు ంబీకులు అప్రమత్తమయ్యారు. తీవ్ర గాయాలైన ఆమె పరిస్థితి విషమంగా ఉంది. మరో అరగంట తరువాత మూడో దాడిలో సుమన్ దేవి (65) అనే మరో వృద్ధురాలు గాయపడింది. సోమవారం రాత్రి పండోహియా గ్రామంలో తోడేళ్ల దాడిలో గాయపడ్డ అఫ్సానా అనే ఐదేళ్ల బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆదివారం రాత్రి హర్ది దర్హియా గ్రామంలో తల్లి పక్కన నిద్రిస్తున్న చిన్నారిపై తోడేలు దాడి చేసింది. మెడను కరిచి లాక్కెళ్లబోయింది. తో డేలుతో తల్లి ధైర్యంగా పోరాడి తన బాబును కాపాడుకోగలిగింది. అదే రాత్రి మరో 50 ఏళ్ల వ్యక్తిపైనా తోడేలు దాడి జరిగింది.శ్మశాన నిశ్శబ్దం... తోడేళ్ల దెబ్బకు బహ్రయిచ్‌లో మార్కెట్లు మూతపడ్డాయి. వీధులు పగలు కూడా నిర్మానుష్యంగా ఉంటున్నాయి. మహసీ సబ్ డివిజన్లోనైతే జనజీవనం పూర్తిగా స్తంభించింది. ప్రభావిత సీతాపూర్, లఖింపూర్ ఖేరి, పిలిభీత్, బిజ్నోర్ డివిజన్లలోనూ తోడేళ్ల భయం నెలకొని ఉంది. ఆ ప్రంతాలకు అదనపు ఫారెస్ట్ గార్డులు, ట్రాప్ బృందాలను పంపుతున్నారు. తోడేళ్లు నిత్యం తమ ఆవాసాలను మారుస్తుండటంతో పట్టుకోవడం కష్టమవుతోందని జిల్లా మేజి్రస్టేట్ మోనికా రాణి తెలిపారు. ‘‘అవి తెలివిగా ప్రతిసారీ కొత్త గ్రామా న్ని లక్ష్యం చేసుకుంటున్నాయి. ఇప్పటిదాకా నాలుగింటిని పట్టుకున్నాం. ఇంకో రెండు దొరకాల్సి ఉంది’’అన్నారు. తమ బృందం నిరంతరం గస్తీ కాస్తోందని, వాటినీ పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చీఫ్ ఫారెస్ట్ కన్జర్వేటర్ (సెంట్రల్ జోన్) రేణుసింగ్ చెప్పారు. పిల్లలను ఇళ్ల లోపలే ఉంచాలని, రాత్రిపూట తలుపులకు తాళం వేసుకోవాలని అధికారులు లౌడ్ స్పీకర్ల ద్వారా ప్రచారం చేస్తున్నారు.వీడియో ఆధారాలడిగారు...తోడేళ్లు తమ ఇళ్ల పక్కనే కనిపిస్తూ వణికిస్తున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. అటవీ అధికారులకు చెబితే వీడియో ఆధారాలు అడుగుతున్నారని మండిపడుతున్నారు. ‘‘మా ఇంటి పక్కన తోడేలు కనిపిస్తే కుక్కనుకొని తరిమికొట్టాం. పొలాల వైపు పరుగెత్తడంతో తోడేలని గుర్తించాం. దాంతో పిల్లలంతా క్షేమంగా ఉన్నారా, లేరా అని చూసుకున్నాం. అంజలి తోడేలు బారిన పడిందని తేలింది’’అని నౌవన్ గరేతికి చెందిన బాల్కే రామ్ వెల్లడించారు. -
అఖిలేష్ ర్యాలీలో గందరగోళం.. పత్తాలేని పోలీసులు
కన్నౌజ్ : యూపీలోని కన్నౌజ్ జిల్లాలో జరిగిన పలు కార్యక్రమాల్లో సమాజ్‌వాదీ చీఫ్ అఖిలేష్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సమయంలో ఆయనకు భద్రతను కల్పిచడంలో లోపం కనిపించింది.అఖిలేష్ ఛిబ్రామౌ చేరుకోగానే ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అయితే ఈ సమయంలో పోలీసులు పత్తాలేకుండా పోయారు. ఇంతలో అఖిలేష్ ఓ ఇంటికి వెళుతుండగా అక్కడున్నవారు కూడా బలవంతంగా ఆ ఇంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. ఎస్పీ చీఫ్ సెక్యూరిటీ సిబ్బంది పరిస్థితిని అతికష్టం మీద అదుపు చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి. ఈ వీడియోలలో ఎస్పీ కార్యకర్తలు పోట్లాడుకోవడం కనిపిస్తుంది. -
యూపీలో బీజేపీ త్రివర్ణ పతాక మార్చ్
లక్నో: ఇండిపెండెన్స్ డే సందర్భంగా రాష్ట్రంలోని మొత్తం 403 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ‘త్రివర్ణ పతాక మార్చ్’నిర్వహించాలని ఉత్తరప్రదేశ్ బీజేపీ నిర్ణయించింది. ఆదివారం(ఆగస్టు11) నుంచి 13 దాకా మూడురోజులపాటు మార్చ్ జరగనుంది. ఈ విషయాన్ని పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. హర్‌ఘర్‌తిరంగా క్యాంపెయిన్‌లో భాగంగా త్రివర్ణ పతాక మార్చ్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది.యువతలో దేశభక్తిని పెంపొందించడంతో పాటు అన్నింటికంటే దేశమే ముందు అని ప్రాధాన్యతను తెలియజేసేందుకు ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులందరూ కలిసి నియోజకవర్గాల్లో త్రివర్ణ పతాకాలతో ర్యాలీలు నిర్వహిస్తారు. -
గురుపౌర్ణమి వేళ.. సీఎం యోగి పూజలు
దేశవ్యాప్తంగా గురు పూర్ణిమ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌నాథ్ ఆలయంలో పూజలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. గురు పూర్ణిమను వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. #WATCH | UP CM Yogi Adityanath offers prayers at Gorakhnath Temple, on the occasion of #GuruPurnima2024 pic.twitter.com/goky8Ro8eK— ANI UP/Uttarakhand (@ANINewsUP) July 21, 2024 మహర్షి వేద వ్యాసుడు ఈ రోజున జన్మించాడు. ఆయనను గుర్తు చేసుకుంటూ ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు. హిందువులు గురు పూర్ణిమకు ఎంతో ప్రాధాన్యతనిస్తుంటారు. హిందువులు గురువును దేవునితో సమానంగా భావిస్తారు. హరిద్వార్‌లో గురు పూర్ణిమ సందర్భంగా భక్తులు పవిత్ర గంగా నదిలో స్నానాలు చేస్తున్నారు. భక్తుల రద్దీతో గంగా ఘాట్లు నిండిపోయాయి. యూపీలోని అయోధ్యలోగల సరయూ నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. #WATCH | Haridwar, Uttarakhand: Devotees take a holy dip in the Ganga River, on the occasion of Guru Purnima pic.twitter.com/UcVQYZQAOY— ANI (@ANI) July 21, 2024 -
టోల్ అడిగినందుకు బుల్డోజర్తో విధ్వంసం
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో బుల్డోజర్లు దూకుడు కొనసాగిస్తున్నాయి. రాష్ట్రంలోని హపూర్ జిల్లాలో మంగళవారం(జూన్11)బుల్డోజర్ బీభత్సం సృష్టించింది. జిల్లాలోని పిల్కువా ప్రాంతం ఛాజార్సి టోల్ బూత్ వద్ద ఉదయం 8.30 గంటలకు ఒక బుల్డోజర్ వచ్చి ఆగింది. టోల్ ప్లాజా సిబ్బంది బుల్డోజర్ డ్రైవర్‌ను టోల్ ఛార్జీలు చెల్లించాలని అడిగారు. దీంతో ఆగ్రహానికి గురైన బుల్డోజర్ డ్రైవర్ టోల్ ప్లాజాకు చెందిన రెండు బూత్‌లతో పాటు సీసీ కెమెరాలను ధ్వంసం చేశాడు. బుల్డోజర్ వి ధ్వంసాన్ని టోల్‌ప్లాజా సిబ్బంది వీడియో తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు బుల్డోజర్ డ్రైవర్‌ను అరెస్టు చేశారు. బుల్డోజర్ను స్వాధీనం చేసుకున్నారు. -
చంబల్ నదిలో 900 చిరు మొసళ్ల సందడి
మొసలి... ఈ పేరు వినగానే మనకు దాని రూపం గుర్తుకు వచ్చి, మనసులో భయం కలుగుతుంది. భారీ మొసలి రూపాన్ని పక్కన పెడితే, చిరు మెసలిని చూసినప్పుడు ఎంతో కొంత ముచ్చటేస్తుంది. మరి వందల సంఖ్యలో చిరు మొసళ్లు ఒకేసారి కనిపిస్తే..ఆసియాలోని అతిపెద్ద మొసళ్ల అభయారణ్యం ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లా బాహ్‌లో ఉంది. ఇక్కడ ఇప్పుడు వందలకొద్దీ చిరు మొసళ్లు సందడి చేస్తున్నాయి. మహుశాల, నంద్గావాన్, హత్కాంత్ ఘాట్ల మీదుగా సుమారు 900 చిరు మొసళ్లు భారీ మగ మొసళ్లను అనుసరిస్తూ చంబల్ నదికి చేరుకున్నాయి.అటవీ రేంజ్ నుండి వస్తున్న శబ్ధాన్ని విన్న అటవీ శాఖ అధికారుల బృందం చంబల్ నది సమీపానికి చేరుకుంది. అక్కడి దృశ్యాన్ని చూసిన అటవీశాఖ అధికారులు ఆశ్చర్యపోయారు. మొసళ్లు పిల్లలను కనే ప్రక్రియ దాదాపు వారం రోజుల పాటు కొనసాగుతుంది. అటవీశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం అంతరించిపోయే స్థితికి చేరుకున్న మొసలి జాతిని 1979 నుండి చంబల్ నదిలో సంరక్షిస్తున్నారు. ఈ నది మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల గుండా పాలి (రాజస్థాన్) మీదుగా ప్రవహిస్తుంది.2008లో బాహ్, ఇటావా, భింద్, మోరెనాలలోని చంబల్ నదిలో వందకుపైగా మొసళ్లు మృతి చెందాయి. ఆ సమయంలో మొసళ్ల మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు విదేశీ నిపుణులను సంప్రదించాల్సి వచ్చింది. అప్పట్లో లివర్ సిర్రోసిస్ వ్యాధి కారణంగా మొసళ్లు చనిపోయాయని గుర్తించారు. అయితే ఆ తరువాత నుంచి మొసళ్ల సంఖ్య పెరుగుతూ వచ్చింది. తాజా లెక్కల ప్రకారం చంబల్ నదిలో 2,456 మొసళ్లు ఉన్నాయి. -
డిజిటల్ కేఫ్.. కమ్మనైన ఆటలు, పసందైన టాస్క్‌లు లభ్యం
ఉత్తరప్రదేశ్‌కు వచ్చే పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రయాగ్‌రాజ్ మరో కొత్తదనాన్ని సింగారించుకుంది. ప్రయాగ్‌రాజ్ డెవలప్మెంట్ అథారిటీ ఈ కొత్త సొబగును సిద్ధం చేసింది. రాష్ట్రంలోని మొట్టమొదటి ఫ్లోటింగ్ రెస్టారెంట్, బోట్ క్లబ్, మొదటి ట్రాఫిక్ పార్క్ ప్రయాగ్‌రాజ్‌లో ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి. తాజాగా ఈ జాబితాలో ఇప్పుడు డిజిటల్ కేఫ్ అందరికీ అందుబాటులోకి వచ్చింది.ప్రయాగ్‌రాజ్‌లోని ట్రాఫిక్ పార్క్ లో ప్రారంభించిన ఈ డిజిటల్ కేఫ్‌కు అత్యధిక సంఖ్యలో యువత తరలివస్తున్నారు. ఈ కేఫ్‌లో అల్పాహారానికి బదులుగా డిజిటల్ గేమ్స్ అందుబాటులో ఉంటాయి. ఇందుకోసం మూడు పెద్ద ఎల్ఈడీలు ఏర్పాటు చేశారు. ఇక్కడకు వచ్చేవారు సోఫాలపై కూర్చుని, హెడ్‌ఫోన్ పెట్టుకుని వీడియో గేమ్‌లను ఆడవచ్చు. టెంపుల్ రన్, బైక్ రేసింగ్, కార్ రేసింగ్ ఇలాంటి ఏ గేమ్ అయినా ఇక్కడ ఆడుకోవచ్చు.ఈ పార్కులోకి ప్రవేశించేందుకు పిల్లలకు రూ.5, పెద్దలకు రూ.10 టిక్కెట్టుగా నిర్ణయించారు. డిజిటల్ కేఫ్, మోషన్ థియేటర్లకు ఎంట్రీ ఫీజుగా రూ.150 చెల్లించాల్సి ఉంటుంది. ఈ పార్క్ ఉదయం 9:00 నుండి రాత్రి 9:00 వరకు తెరిచి ఉంటుంది. ఈ పార్కును ప్రయాగ్‌రాజ్ డెవలప్మెంట్ అథారిటీ పర్యవేక్షిస్తున్నది. -
పిల్లల వెంట తండ్రులు.. యూపీలో ఆసక్తికర రాజకీయాలు!
2024 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో ఆసక్తికర రాజకీయాలు నెలకొన్నాయి. రాష్ట్రంలోని పలువురు సీనియర్ నేతలు తాము ఎన్నికల బరిలోకి దిగకుండా, తమ పిల్లలకు అవకాశం కల్పించారు. ఈ జాబితాలో సమాజ్‌వాదీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ రామ్ గోపాల్ యాదవ్, జాతీయ ప్రధాన కార్యదర్శి శివపాల్ యాదవ్, సుభా ఎస్పీ అధ్యక్షుడు ఓం ప్రకాష్ రాజ్‌భర్, నిషాద్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ సంజయ్ నిషాద్, కాంగ్రెస్ నాయకుడు పిఎల్ పునియా, ఇంద్రజిత్ సరోజ్, బ్రజ్భూషణ్ శరణ్ సింగ్ తదితరులు ఉన్నారు.ఫిరోజాబాద్ లోక్ సభ స్థానం నుంచి సమాజ్ వాదీ పార్టీ నేత ప్రొఫెసర్ రామ్ గోపాల్ యాదవ్ కుమారుడు అక్షయ్ యాదవ్ ఎన్నికల బరిలో దిగారు. ప్రొఫెసర్ రామ్ గోపాల్ సమాజ్ వాదీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి. ప్రస్తుతం ఆయన తన కుమారుని విజయం కోసం శ్రమిస్తున్నారు. శివపాల్ యాదవ్ కుమారుడు ఆదిత్య యాదవ్ బదౌన్ నుంచి ఎన్నికల బరిలోకి దిగారు. బదౌన్‌లో మూడో దశలో ఎన్నికలు జరిగాయి. శివపాల్ తన కుమారుని విజయం కోసం ప్రచార కార్యక్రమాల్లో విరివిగా పాల్గొన్నారు.సంత్ కబీర్ నగర్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా ప్రవీణ్ నిషాద్ ఎన్నికల బరిలోకి దిగారు. ఆయన విజయం కోసం ఆయన తండ్రి, యోగి ప్రభుత్వ మంత్రి, నిషాద్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ సంజయ్ నిషాద్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇక్కడ మే 25న ఓటింగ్ జరగనుంది. భారత రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ ఇటీవ పలు ఆరోపణల్లో చిక్కుకున్నారు. కైసర్‌గంజ్ లోక్‌సభ స్థానం నుంచి ఆయన కుమారుడు కరణ్ భూషణ్ సింగ్ బీజేపీ తరపున ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.ఓం ప్రకాష్ రాజ్‌భర్‌కు రాజ్‌భర్ ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు. ఆయన కుమారుడు అరవింద్ రాజ్‌భర్ ఘోసీ లోక్‌సభ స్థానం నుంచి పోటీకి దిగారు. ఓం ప్రకాష్ రాజ్‌భర్ తన కుమారుని విజయం కోసం ప్రయత్నిస్తున్నారు. బారాబంకి లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత పీఎల్ పునియా కుమారుడు తనూజ్ పునియా ఎన్నికల బరిలోకి దిగారు. ఎస్పీ-కాంగ్రెస్ కూటమి కింద తనూజ్ ఈ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. -
స్టేషన్ మాస్టర్‌కు నిద్రొచ్చింది.. లోకో పైలెట్ హారన్ మోగించినా..
రైలు ప్రయాణాన్ని ఇష్టపడని వారెవరూ ఉండరనడంలో అతిశయోక్తి లేదు. మరి రైలు ప్రయాణంలో అనుకోని ఘటన ఏదైనా జరిగితే అది వార్తల్లో నిలుస్తుంది. తాజాగా అటువంటి ఉదంతమే సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా సమీపంలోని ఉదీ మోడ్ రైల్వే స్టేషన్లో చోటుచేసుకుంది. డ్యూటీలో ఉన్న స్టేషన్ మాస్టర్ నిద్రపోవడంతో పట్నా-కోటా ఎక్స్‌ప్రెస్ రైలు గ్రీన్ సిగ్నల్ కోసం అరగంట పాటు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ స్టేషన్ ఆగ్రా డివిజన్ పరిధిలోకి వస్తుంది. ఈ సంఘటనను సీరియస్‌గా తీసుకున్న ఆగ్రా రైల్వే డివిజన్ అధికారులు ఈ నిర్లక్ష్యానికి కారణాన్ని వివరించాలని స్టేషన్ మాస్టర్‌ను ఆదేశించారు.ఈ ఘటన గురించి ఆగ్రా రైల్వే డివిజన్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (పీఆర్ఓ) ప్రశస్తి శ్రీవాస్తవ మాట్లాడుతూ తాము ఈ విషయంలో స్టేషన్ మాస్టర్‌కు ఛార్జ్ షీట్ జారీ చేశామని, క్రమశిక్షణా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కాగా ఘటన జరిగిన సమయంలో స్టేషన్ మాస్టర్‌ను నిద్రలేపడానికి రైలులోని లోకో పైలట్ పలుమార్లు హారన్ మోగించారు.అరగంట తరువాత స్టేషన్ మాస్టర్ నిద్రనుంచి మేల్కొని రైలు వెళ్లడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తరువాత స్టేషన్ మాస్టర్ తన తప్పును అంగీకరించి, క్షమాపణ చెప్పారని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. డ్యూటీలో ఉన్న ‘పాయింట్‌మెన్’ ట్రాక్‌ను పరిశీలించడానికి వెళ్లాడని, దీంతో ఆ సమయంలో తాను స్టేషన్లో ఒంటరిగా ఉన్నానని ఆ స్టేషన్ మాస్టర్ తెలిపారు. -
అఖిలేష్ ర్యాలీ, ప్రియాంక రోడ్ షో..
ఉత్తరప్రదేశ్‌లోని ఎనిమిది లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుంది. నేటి (బుధవారం) సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ నేపధ్యంలో నేడు ఘజియాబాద్‌లో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కలిసి ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించనున్నారు. మరోవైపు సహరాన్‌పూర్‌లో పార్టీ అభ్యర్థి ఇమ్రాన్ మసూద్‌కు మద్దతుగా ప్రియాంక గాంధీ రోడ్‌షో నిర్వహించనున్నారు. అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చౌదరి భూపేంద్ర సింగ్ కూడా సంస్థాగత సమావేశాన్ని నిర్వహించి, బూత్ నిర్వహణకు కార్యకర్తలకు పలు సూచనలు చేయనున్నారు. ఎన్నికల ప్రచారానికి చివరి రోజున పార్టీలన్నీ తమ ప్రచారహోరును పెంచాయి. ఉత్తరప్రదేశ్‌లోని సహారన్పూర్, కైరానా, ముజఫర్‌నగర్, బిజ్నోర్, నగీనా, మొరాదాబాద్, రాంపూర్, పిలిభిత్‌లలో మొదటి దశలో ఓటింగ్ జరగనుంది. ఈ ఎనిమిది స్థానాల్లోని ఏడు స్థానాల్లో బీజేపీ అభ్యర్థి, ఒక స్థానంలో ఆర్ఎల్డీ అభ్యర్థి పోటీలో ఉన్నారు. అలాగే ఎస్పీ నుంచి ఏడుగురు, కాంగ్రెస్ నుంచి ఒకరు ఎన్నికల బరిలోకి దిగారు. మొత్తం ఎనిమిది స్థానాల్లో బీఎస్పీ తమ అభ్యర్థులను నిలబెట్టింది. ఎస్పీ అధినేత అఖిలేష్ ప్రచార ర్యాలీని కూడా నిర్వహించనున్నారని సమాచారం. -
18 ఏళ్ల నిరీక్షణకు తెర.. కల్కి ధామ్‌కు ప్రధాని మోదీ శంకుస్థాపన
‘తాను నెరవేర్చేందుకే కొందరు మంచి పనులను తన కోసం వదిలి వెళ్లారని’ ప్రధాని నరేంద్ర మోదీ యూపీలో జరిగిన కల్కి ధామ్ శంకుస్థాపన కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ పరిధిలోని ఐంచోడ కాంబోహ్‌లోని శ్రీ కల్కి ధామ్ ఆలయానికి ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను కల్కి ధామ్‌కు శంకుస్థాపన చేయడం తనకు దక్కిన వరమని, ఈ ఆలయం భారతీయుల విశ్వాసానికి మరో కేంద్రంగా అవతరిస్తుందని అన్నారు. ఇక్కడి ప్రజల 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత కల్కి ధామ్‌కు శంకుస్థాపన చేసే అవకాశం తనకు లభించిందని మోదీ పేర్కొన్నారు. తన కోసమే కొందరు మంచి పనులు వదిలి వెళ్లారని, భవిష్యత్తులో ఏ మంచి పని మిగిలిపోయినా మహనీయులు, ప్రజల ఆశీస్సులతో వాటిని పూర్తి చేస్తామన్నారు. ఈ ఆలయంలో పది గర్భాలయాలు ఉంటాయని తెలిపారు. ఈరోజు ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి అని, ఈ రోజు మరింత పవిత్రమైనదని, ఈ కార్యక్రమం స్ఫూర్తిదాయకంగా మారుతుందని అన్నారు. ఒకవైపు దేశంలోని యాత్రా స్థలాలను అభివృద్ధి చేస్తూనే, మరోవైపు నగరాల్లో అత్యాధునిక మౌలిక సదుపాయాలను కూడా కల్పిస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారీ స్థాయిలో నిర్మితం కాబోతున్న ఈ కల్కిధామ్ ఎంతో ప్రత్యేకంగా నిలవనున్నదని, గర్భాలయంలో దశావతారాలు ఉంటాయన్నారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ నేడు భారతదేశ వారసత్వ సంపద ప్రపంచ వేదికపై గుర్తింపు పొందుతున్నదన్నారు. #WATCH | At the foundation stone laying ceremony of Hindu shrine Kalki Dham in Sambhal, Uttar Pradesh CM Yogi Adityanath says, "In the last 10 years, we have seen a new Bharat... The country is moving ahead on the path of development in the new Bharat..." pic.twitter.com/fjSfnwyLpa — ANI (@ANI) February 19, 2024 -
వరుణ్ గాంధీ సీటుపై వివాదాలెందుకు? బీజేపీ నేతలు ఏమంటున్నారు?
2024 లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు వేడందుకుంటున్నాయి. ఈ క్రమంలో యూపీలోని పిలిభిత్ లోక్‌సభ స్థానంపై చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఈ స్థానంలో బీజేపీ అభ్యర్థి వరుణ్ గాంధీ ఎంపీగా ఉన్నారు. అయితే ఈసారి ఆయనకు టికెట్ వస్తుందా లేదా అనే దానిపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. వరుణ్ సొంత పార్టీ ప్రభుత్వంపై ఎప్పుడూ ఏవో విమర్శలు చేస్తుంటారు. ఫలితంగా ఈసారి బీజేపీ నుంచి వరుణ్ గాంధీకి టికెట్ రాదని స్థానిక బీజేపీ నేతలు అంటున్నారు. ఈ నేపధ్యంలో లోక్‌సభ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు స్థానిక నేతలతో పాటు బయటి బీజేపీ నేతలు కూడా ఈ స్థానం నుంచి బరిలో దిగేందుకు దరఖాస్తు చేసుకుంటున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తూ ఇప్పటివరకూ 33 దరఖాస్తులు వచ్చాయని పిలిభిత్‌కు చెందిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు సంజీవ్ ప్రతాప్ సింగ్ తెలిపారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కూడా తెలిపారు. ఈ దరఖాస్తులను పార్టీ హైకమాండ్‌కు పంపుతామని, వీటిపై అగ్రనేతలు తుది నిర్ణయం తీసుకుంటారన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సమాజ్‌వాదీ నుంచి ఇప్పటివరకు నాలుగు దరఖాస్తులు వచ్చాయని, వాటిని అధిష్టానానికి పంపిస్తామని సమాజ్‌వాదీ పార్టీ జిల్లా అధ్యక్షుడు జగదేవ్ సింగ్ జగ్గా తెలిపారు. 90వ దశకంలో నైనిటాల్ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా ఉన్న బల్రాజ్ పాసి గత ఆరు నెలలుగా పిలిభిత్‌లోనే ఉంటూ, ఎన్నికల్లో పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. బిత్రీ చైన్పూర్ ఎమ్మెల్యే పప్పు భరతౌల్ కూడా పిలిభిత్ నుండి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి దరఖాస్తు చేసుకున్నారు. ఎంపీ వరుణ్ గాంధీ తన సొంత ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేయడం ప్రారంభించినప్పటి నుండి స్థానిక నేతలు ఈ పార్లమెంట్ సీటుపై కన్నువేశారు. -
ఆ జిల్లాతో శ్రీరామునికి విడదీయరాని అనుబంధం!
ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలో శ్రీరాముని జీవిత చరిత్రకు సంబంధించిన అనే కథలు ముడిపడివున్నాయి. బస్తీ జిల్లాను వశిష్ఠ మహర్షి తపోప్రదేశంగా గుర్తిస్తారు. శ్రీరాముని తండ్రి దశరథుడు బస్తీ జిల్లాలోని మస్ఖధామ్‌లో పుత్రకామేష్ఠి యాగాన్ని నిర్వహించాడని చెబుతారు. వేదాలు, పురాణాలలో ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రస్తావనలు కనిపిస్తాయి. శ్రీరాముని నగరమైన అయోధ్యకు కొద్ది దూరంలోనే బస్తీ జిల్లా ఉంది. ఈ జిల్లాకు రాముని నగరమైన అయోధ్యతో సన్నిహిత సంబంధం ఉంది. శ్రీరాముడు.. రావణుని సంహరించి, తన భార్య సీతామాతతో కలిసి లంక నుండి తిరిగి వచ్చినప్పుడు, ఇక్కడి మనోరమ- కువానో సంగమం ఒడ్డున లిట్టిచోఖాను తిన్నారని స్థానికులు చెబుతుంటారు. నాటి నుండి ఈ ప్రాంతంలో జాతర నిర్వహిస్తున్నారు. పవిత్రమైన మనోరమ నదిలో స్నానం చేయడం ద్వారా పాపాలు పోతాయని భక్తులు నమ్ముతారు. ప్రతీయేటా చైత్ర పూర్ణిమ రోజున రాష్ట్రంలోని పలు జిల్లాల నుండి వేలాది మంది జనం ఇక్కడికి వచ్చి మనోరమ కువానో సంగమం ఒడ్డున స్నానాలు చేస్తారు. ఆ తరువాత వారు లిట్టి చోఖాను తయారు చేసి పరస్పరం పంచుకుంటారు. ఈ జాతర ఐదు రోజుల పాటు జరుగుతుంది. ఇది కూడా చదవండి: 2,100 కిలోల గంట.. 108 అడుగుల అగరుబత్తి -
పొగమంచుతో పెరిగిన వాహన ప్రమాదాలు
చలికాలంలో పొగమంచు రోడ్డు ప్రమాదాలకు కారణంగా మారుతోంది. విజిబులిటీ తగ్గిన కారణంగా రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా పొగమంచు కారణంగా యూపీలోని ఆగ్రాలో పలు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్‌లో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బహ్రైచ్-బలరాంపూర్ హైవేపై డబుల్ డెక్కర్ బస్సు, ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ప్రైవేట్ బస్సు గుజరాత్ నుంచి బలరాంపూర్ జిల్లా వైపు వెళ్తోంది. ఈ క్రమంలో బహ్రైచ్-బలరాంపూర్ హైవేలోని ధరస్వాన్ గ్రామం సమీపంలో బియ్యం లోడుతో వస్తున్న ట్రక్కును డబుల్ డెక్కర్ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్, ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. మరో 25 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. హాపూర్‌లో పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారి-9పై సుమారు 15 వాహనాలు ఒక్కొక్కటిగా ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో పలువురు గాయాలపాలయ్యారు. ఈ ప్రమాదం కారణంగా రోడ్డుపై చాలాసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మరోవైపు ఆగ్రాలోనూ పొగమంచు కారణంగా రోడ్డుపై డ్రైవింగ్ ఇబ్బందికరంగా మారింది. పొగమంచు కారణంగా పలు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో దాదాపు ఐదుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన జాతీయ రహదారిలోని ఎత్మాద్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సిద్ధార్థనగర్లోనూ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బన్సీ కొత్వాలి పరిధిలోని బెల్బన్వా గ్రామంలో ఒక పికప్ వాహనం, బైక్ ఢీకొన్నాయి. పశువులను తప్పించబోయిన పికప్ వాహనం బైక్‌ను ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందారు. కాగా పికప్ వాహనంలో అక్రమంగా పశువులను తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించి, వాటిని గోశాలకు తరలించారు. ఈ ఉదంతంలో ఇద్దరి అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు. పికప్ వాహనాన్ని సీజ్ చేశారు. ఇది కూడా చదవండి: హిమాచల్‌కు టూరిస్టుల తాకిడి! -
పెళ్లిలో రసగుల్లా కోసం కొట్లాట.. ఆరుగురికి తీవ్రగాయాలు!
యూపీలోని ఆగ్రాలో ఒక విచిత్ర ఉదంతం వెలుగులోకి వచ్చింది. దీనిని విన్నవారంతా కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. ఇక్కడి శంషాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఒక వివాహ వేడుకలో రసగుల్లా విషయమై ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కర్రలతో కొట్టుకునేంత వరకూ వివాదం దారితీసింది. ఈ గొడవలో ఒక మహిళతో సహా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నయాబన్స్ రోడ్డు సమీపంలోని సంతోషి మాత దేవాలయం దగ్గర ఒక వివాహ వేడుకలో విందు జరిగింది. ఈ సందర్భంగా రసగుల్లా తినే విషయంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. అది పరస్పరం కొట్టుకునేవరకూ దారితీసిందని పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ అనిల్ శర్మ తెలిపారు. క్షతగాత్రులందరినీ వైద్య చికిత్స కోసం ఆస్పత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు. విందు ఏర్పాటు చేసిన గౌరీశంకర్ శర్మపై కేసు నమోదు చేశామని, ఈ వివాదంపై విచారణ చేస్తున్నామన్నారు. ఇది కూడా చదవండి: హిమాచల్‌లోనూ సొరంగ ప్రమాదం.. ఎప్పుడంటే.. -
అలీగడ్.. హరిగఢ్ ఎందుకయ్యింది? రామాయణంతో సంబంధం ఏమిటి?
ఉత్తరప్రదేశ్‌లో అలహాబాద్ తర్వాత మరో నగరమైన అలీగఢ్ పేరు మారింది. తాజాగా అలీగఢ్ మునిసిపల్ కార్పొరేషన్ అలీగఢ్ పేరును హరిగఢ్‌గా మార్చే ప్రతిపాదనకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. యూపీలోని నగరాల పేర్లను మార్చడం ఇదేమీ మొదటిసారి కాదు. అయితే దీనిలో అలీగఢ్ పేరు మార్పు వెనుక ఒక ప్రత్యకత, ఘనమైన చరిత్ర ఉంది. అలీగఢ్‌ను పూర్వకాలంలో అంటే 200 ఏళ్ల క్రితం కోయిల్ లేదా కోల్ అని పిలిచేవారు. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం వాల్మీకి మహర్షి రచించిన రామాయణంలో ఈ ప్రాంతాన్ని పాలించిన కౌశిరివ్ పేరు కనిపిస్తుంది. అతనిని యుద్ధంలో ఓడించిన కోల్ అనే రాక్షస రాజు ఈ ప్రదేశానికి పాలకునిగా మారతాడు. అతని పేరును అనుసరించి ఈ ప్రదేశానికి కోల్ అని పేరు పెట్టారు. కాగా సయ్యద్ రాజవంశం కాలంలో కోల్ ప్రాంతం పేరు అలీగఢ్గా మారింది. అలీగఢ్ ఉత్తరప్రదేశ్‌లోని ప్రముఖ నగరం. దీనిని లాక్ సిటీ అని కూడా అంటారు. మొఘలుల కాలం నుండి తాళాల తయారీకి ప్రాంతం ప్రసిద్ది చెందింది. ఈ నగరంలో సెంట్రల్ యూనివర్శిటీ ఉంది. ఇక్కడ వందలాది మంది విద్యార్థులు తమ చదువులను పూర్తి చేస్తున్నారు. భారతీయత ఉట్టిపడాలనే ఉద్దేశంతోనే అలీగఢ్‌ను హరిగఢ్‌గా మార్చారు. ఇది కూడా చదవండి: దుబాయ్‌లో దీపావళికి ఏం చేస్తారు? బుర్జ్ ఖలీఫాలో ఏం జరుగుతుంది? -
21 ఏళ్లకు యాసిడ్ బాధితురాలికి న్యాయం!
ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో 2002లో 14 ఏళ్ల బాలికపై యాసిడ్ దాడి జరిగింది. అయితే ఈ ఉదంతంపై పోలీసులు వెంటనే కేసు నమోదు చేయకపోవడంతో బాధితురాలు న్యాయం కోసం పరితపించింది. అయితే 2014లో ఆమెకు ఆగ్రాలోని ఓ కేఫ్‌లో ఉద్యోగం వచ్చింది. ఒకరోజు ఆగ్రా జోన్ ఏడీజీ రాజీవ్ కృష్ణ ఈమె పనిచేస్తున్న కేఫ్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన యాసిడ్ బాధితురాలితో మాట్లాడారు. ఆమె తన కథను ఏడీజీ రాజీవ్ కృష్ణకు వివరించింది. దీంతో ఆయన ఈ ఉదంతంపై కేసు నమోదు చేయించారు. జనవరి 2023లో ఈ కేసు అలీఘర్‌లోని ఉపర్కోట్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయ్యింది. పోలీసులు దర్యాప్తు చేపట్టి, నిందితుడు ఆరిఫ్‌ను అరెస్టు చేసి జైలుకు తరలించారు. 2002లో అలీగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోరావర్ వాలీ ప్రాంతంలో ఉంటున్న బాలికపై ఆరిఫ్ అనే యువకుడు యాసిడ్ పోశాడు. యాసిడ్ దాడిలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం ఆమె ఆరీఫ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు ఈ కేసులో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 2014లో యాసిడ్ బాధితులకు ఆగ్రాలోని ఓ కేఫ్‌లో ఉద్యోగాలు ఇచ్చారు. పోలీసు అధికారి రాజీవ్ కృష్ణ 2022, డిసెంబరులో ఈ కేఫ్‌కు వచ్చారు. అలీఘర్ బాధితురాలి కథ విన్న ఆయన కేసు దర్యాప్తు జరిగేలా చర్యలు తీసుకున్నారు. పోలీసుల విచారణలో ఆరిఫ్ దోషి అని తేలింది. ఈ నేపధ్యంలో పోలీసులు అతనిని జైలుకు తరలించారు. ఇది కూడా చదవండి: దేశ రాజకీయాల్లో మహరాణులెవరు? ఎక్కడ చక్రం తిప్పుతున్నారు? -
ప్రధాని మోదీ భద్రతా వలయంలో కలకలం
లక్నో: వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ భద్రతా వలయంలో కలకలం రేగింది. ఉద్యోగం కావాలంటూ ఓ యువకుడు ప్రధాని మోదీ కాన్వాయ్ ముందు దూకాడు. ప్రధాని మోదీ కాన్వాయ్ లాల్ బహదూర్ శాస్త్రి విమానాశ్రయానికి వెళ్తుండగా రుద్రాక్ష సెంటర్ వెలుపల ఈ ఘటన జరిగింది. The man has been identified as a #BJP worker and has been held. He was just 10 feet away from the #PMModi's car after he jumped. Police and security officials immediately caught him. @AbshkMishra https://t.co/wvrQvG1N2V — IndiaToday (@IndiaToday) September 23, 2023 ప్రధాని నరేంద్ర మోదీ నిన్న వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి భూమిపూజ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమం పూర్తి చేసుకుని తిరుగుప్రయాణంలో ఓ యువకుడు ప్రధాని మోదీ కాన్వాయ్ భద్రతా వలయాన్ని చీల్చుకుని లోపలికి వెళ్లాడు. ఉద్యోగం కావాలంటూ కాన్వాయ్ వెంట పరుగులు పెట్టాడు. గుర్తించిన పోలీసులు.. అతన్ని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ప్రధాని మోదీకి కేవలం 20 మీటర్ల దూరంలోనే ఉన్నాడని పోలీసులు చెప్పారు. నిందితున్ని ఘాజీపూర్‌కు చెందిన కృష్ణ కుమార్‌గా పోలీసులు గుర్తించారు. బీజేపీ కార్యకర్తగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మానసికంగా ఇబ్బందుల్లో ఉన్నట్లు పోలీసులు చెప్పారు. అయితే.. ప్రధాని మోదీ భూమి పూజ చేసిన క్రికెట్ స్టేడియా 2025 డిసెంబర్ నాటికి పూర్తికానుంది. యూపీలో కాన్సూర్, లక్నో తర్వాత వారణాసిలో నిర్మించేదానితో మూడో క్రికెట్ స్టేడియం కానుంది. ఇదీ చదవండి: అధికారంలోకి వస్తే బిల్లును సవరిస్తాం: ఖర్గే