ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో తీన్ తలాక్‌కు సంబంధించిన విచిత్ర ఉదంతం వెలుగు చూసింది. టీచర్‌గా పనిచేస్తున్న తన భార్యకు స్కూలులోనే అతని భర్త తీన్ తలాక్ చెప్పాడు. విద్యార్థులందరి ముందు ఈ చర్యకు పాల్పడిన అతను ఆ తరువాత అక్కడి నుంచి జారుకున్నాడు. ఈ ఘటన అనంతరం బాధిత మహిళ తన భర్తతోపాటు మరో నలుగురిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
బాధితురాలు మీడియాతో మాట్లాడుతూ తాను పాఠశాలలోని తరగతి గదిలో విద్యార్థులకు పాఠాలు చెబుతుండగా తన భర్త తనకు తీన్ తలాక్ చెప్పాడని తెలిపింది. తరువాత మారు మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారని పేర్కొంది. కాగా ఈ ఘటన బారాబంకి పరిధిలోని బేగమ్‌గంజ్ ప్రాంతంలో చోటుచేసుకుంది.
మీడియాకు అందిన సమాచారం ప్రకారం బాధితురాలు తమన్నాకు 2020లో ఫిరోజాబాద్ జిల్లాలోని కరీమ్‌గంజ్‌కు చెందిన షకీల్‌తో వివాహం అయ్యింది. అయితే ఆ సమయంలో కట్నం రూపంలో రెండు లక్షలు కావాలని షకీల్ డిమాండ్ చేశాడు. అంతమొత్తం ఆమె కుటుంబసభ్యులు ఇచ్చుకోలేకపోవడంతో ఆమెను షకీల్ ఇంటి నుంచి గెంటివేశాడు. దీంతో తమన్నా పుట్టింటికి చేరుకుంది.
కొంతకాలం తరువాత షకీల్ భార్యకు చెప్పకుండా సౌదీ అరబ్ వెళ్లిపోయాడు. ఈ విషయం తెలియగానే తమన్నా అత్తవారింటికి వెళ్లింది. అయితే అత్తింటి వారు ఆమెను ఇంటిలోనికి వచ్చేందుకు నిరాకరించారు. దీంతో ఆమె తిరిగి పుట్టింటికి చేరుకుంది. అప్పటి నుంచి ఆమె ఒక ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తూ వస్తోంది. ఇంతలో సౌదీ అరబ్ నుంచి తిరిగి వచ్చిన షకీల్ భార్యకు ఫోన్ చేసి విడాకులు ఇస్తానని బెదిరించాడు. తరువాత ఆగస్టు 24న ఆమె పనిచేస్తున్న స్కూలుకు వచ్చి, ఆమెకు తీన్ తలాక్ చెప్పాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు షకీల్‌పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: 3000 ఏళ్లుగా ఎడారి గర్భంలో రాజు సమాధి.. ఖజానా లెక్కలకు 10 ఏళ్లు!
Comments
Please login to add a commentAdd a comment