Talaq
-
తలాక్ అంటే..? ఈ వివరాలు తెలుసా?
దివ్య ఖుర్ఆన్ ఇలా చెబుతోంది...తమ భార్యలను ముట్టుకోము అని ఒట్టు పెట్టుకునే వారికి నాలుగు నెలల గడువు ఉంటుంది. 2:226వివరణ: పండితుల ప్రకారం షరిఅత్ పరిభాషలో దీనిని ‘ఈలా’ అని అంటారు. భార్యాభర్తల మధ్య సంబంధాలు ఎల్లప్పుడూ సుహృద్భావ పూర్వకంగా ఉండవు. అపశ్రుతులు ఏర్పడుతూనే ఉంటాయి. కానీ ఉభయలు చట్టబద్ధంగానైతే దాంపత్య బంధంలోనే ఉంటూ క్రియాత్మకంగా ఇద్దరు భార్యాభర్తలు కానట్టుగానే వేరుగా మసులుకునేటటువంటి విధానాన్ని దైవ శాసనం (షరిఅత్) ఇష్టపడదు. ఇలాంటి అపసవ్యత కొరకు అల్లాహ్ నాలుగు నెలలు గడువు నిర్ణయించాడు. ఈ మధ్యకాలంలో వారు తమ సంబంధాలను సరి చేసుకోవాలి లేదా దాంపత్య బంధాన్నైనా తెంచి వేయాలి. అప్పుడైనా ఆ ఇరువురు పరస్పరం స్వేచ్ఛ ఉంది తమకు కుదురుగా ఉన్న వారితో పెళ్లి చేసుకోగలరు. తన భార్యతో దాంపత్య సంబంధం కలిగి ఉండనని భర్త ఒట్టు పెట్టుకున్న సందర్భానికే ఈ ఆదేశం వర్తిస్తుంది. పోతే ఒట్టు పెట్టుకోకుండా భార్యతో సంబంధాలను తెంచుకునే సందర్భంలోనయితే– అలా ఎంత కాలం సాగినా ఈ ఆదేశం దానికి అతకదని ఈ (ఆయత్) వాక్యం ఉద్దేశం.మరొక విషయం ఏమిటంటే ప్రమాణం చేసినా, చేయకపోయినా రెండు సందర్భాల్లోనూ బంధాన్ని విరమించుకుంటే దానికి గడువు కాలం ఈ నాలుగు మాసాలే. ఈ ఆదేశం కేవలం ఏవైనా మనస్పర్ధల వల్ల ఏర్పడే సంబంధాల ప్రతిష్టంబనకు వర్తిస్తుంది. కానీ మరేదైనా కారణంగా భర్త భార్యతో శారీరక సంబంధాన్ని విరమించుకుంటే సాధారణ సంబంధాలు సుహృద్భావ పూర్వకంగా కొనసాగే పక్షంలో ఈ ఆదేశం వర్తించదు. అయితే కొందరు ధర్మవేత్తల అభిప్రాయం ప్రకారం భార్యాభర్తల మధ్య శారీరక సంబంధాన్ని తెంచివేసే ఏ ప్రమాణమైన సరే అది ఇలా పరిగణించబడుతుంది. ఇది నాలుగు నెలలకు పైగా నిలవరాదు. ఇష్టంలేని పక్షంలోనైనా ఇష్టపూర్వకంగానైనా సరే.ఒకవేళ వారు వెనక్కి మరలినట్లయితే అల్లాహ్ క్షమించేవాడు, దయ చూపేవాడు: 2:227కొంతమంది పండితుల అభిప్రాయం ప్రకారం ఈ గడువు లోపల తమ ప్రమాణాన్ని భగ్ననపరిచి తిరిగి దాంపత్య సంబంధాలను పునరుద్ధరించుకుంటే వారికి ప్రమాణ భంగం చేసినందుకు ప్రాయశ్చిత్తం లేదు. అల్లాహ్ అట్టే క్షమించి వేస్తాడు.మరికొంతమంది పండితుల అభిప్రాయంలో ప్రమాణభంగానికి ప్రాయశ్చిత్తం చెల్లించవలసి ఉంటుంది. వారనేది ఏమిటంటే దేవుడు ‘గఫూరుర్రహీం’ (మన్నించేవాడు కరుణించేవాడు) అన్న విషయానికి భావం ప్రాయశ్చిత్తం మాఫీ జరిగిందని కాదు మీ ప్రాయశ్చితాన్ని స్వీకరిస్తాడని, సంబంధ విరామ కాలంలో ఇరువురు పరస్పరం చేసుకున్న అన్యాయాన్ని మన్నించి వేయడం జరుగుతుందని మాత్రమే.– మొహమ్మద్ అబ్దుల్ రషీద్ -
విద్యార్థుల సాక్షిగా భార్యకు తీన్ తలాక్!
ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో తీన్ తలాక్‌కు సంబంధించిన విచిత్ర ఉదంతం వెలుగు చూసింది. టీచర్‌గా పనిచేస్తున్న తన భార్యకు స్కూలులోనే అతని భర్త తీన్ తలాక్ చెప్పాడు. విద్యార్థులందరి ముందు ఈ చర్యకు పాల్పడిన అతను ఆ తరువాత అక్కడి నుంచి జారుకున్నాడు. ఈ ఘటన అనంతరం బాధిత మహిళ తన భర్తతోపాటు మరో నలుగురిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలు మీడియాతో మాట్లాడుతూ తాను పాఠశాలలోని తరగతి గదిలో విద్యార్థులకు పాఠాలు చెబుతుండగా తన భర్త తనకు తీన్ తలాక్ చెప్పాడని తెలిపింది. తరువాత మారు మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారని పేర్కొంది. కాగా ఈ ఘటన బారాబంకి పరిధిలోని బేగమ్‌గంజ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం బాధితురాలు తమన్నాకు 2020లో ఫిరోజాబాద్ జిల్లాలోని కరీమ్‌గంజ్‌కు చెందిన షకీల్‌తో వివాహం అయ్యింది. అయితే ఆ సమయంలో కట్నం రూపంలో రెండు లక్షలు కావాలని షకీల్ డిమాండ్ చేశాడు. అంతమొత్తం ఆమె కుటుంబసభ్యులు ఇచ్చుకోలేకపోవడంతో ఆమెను షకీల్ ఇంటి నుంచి గెంటివేశాడు. దీంతో తమన్నా పుట్టింటికి చేరుకుంది. కొంతకాలం తరువాత షకీల్ భార్యకు చెప్పకుండా సౌదీ అరబ్ వెళ్లిపోయాడు. ఈ విషయం తెలియగానే తమన్నా అత్తవారింటికి వెళ్లింది. అయితే అత్తింటి వారు ఆమెను ఇంటిలోనికి వచ్చేందుకు నిరాకరించారు. దీంతో ఆమె తిరిగి పుట్టింటికి చేరుకుంది. అప్పటి నుంచి ఆమె ఒక ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తూ వస్తోంది. ఇంతలో సౌదీ అరబ్ నుంచి తిరిగి వచ్చిన షకీల్ భార్యకు ఫోన్ చేసి విడాకులు ఇస్తానని బెదిరించాడు. తరువాత ఆగస్టు 24న ఆమె పనిచేస్తున్న స్కూలుకు వచ్చి, ఆమెకు తీన్ తలాక్ చెప్పాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు షకీల్‌పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: 3000 ఏళ్లుగా ఎడారి గర్భంలో రాజు సమాధి.. ఖజానా లెక్కలకు 10 ఏళ్లు! -
సైబర్ మోసంలో డబ్బు పొగొట్టుకున్న భార్య.. తలాక్ చెప్పిన భర్త
సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయి డబ్బులు పోగొట్టుకుందని భార్యకు తలాక్ చెప్పాడో ఓ వ్యక్తి. ఈ విచిత్ర ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..ఒడిశాలోని కేంద్రపరా జిల్లాకు చెందిన 32 ఏళ్ల మహిళ సైబర్ నేరగాళ్ల చేతిలో డబ్బులు పోగొట్టుకుంది. గుజరాత్లో ఉన్న తన భర్త ఈ విషయం తెలుసుకుని ఏప్రిల్ 1న తనకు మూడుసార్లు తలాక్ చెప్పినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు చట్ట విరుద్ధంగా విడాకులు ఇచ్చారని వాపోయింది. ఆ దంపతులకు పెళ్లై 15 ఏళ్లు, పైగా ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. దీంతో పోలీసులు సదరు వ్యక్తిపై వరకట్న వేధింపుల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఐతే ఆమె సైబర్ నేరగాళ్ల చేతిలో ఎలా డబ్బులు పోగొట్టుకుందనేది తెలియాల్సి ఉంది. (చదవండి: ఏక్నాథ్ షిండే అయోధ్య పర్యటన: 'మా నమ్మకాలకి సంబంధించింది') -
తలాక్‌లపై కేంద్రానికి సుప్రీం నోటీసులు
న్యూఢిల్లీ: ఇస్లాంలో తలాక్–ఎ–కినయా, తలాక్–ఎ–బెయిన్తో పాటు అన్నిరకాల విడాకులనూ రాజ్యాంగ విరుద్ధమైనవిగా ప్రకటించాలంటూ దాఖలైన వ్యాజ్యంపై స్పందన తెలపాల్సిందిగా కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించింది. ఈ మేరకు కేంద్ర న్యాయ, మైనారిటీ వ్యవహారాల శాఖలకు నోటీసులు జారీ చేసింది. కర్నాటకకు చెందిన సయేదా అంబ్రీన్ దాఖలు చేసిన వ్యాజ్యంపై న్యాయమూర్తులు జస్టిస్ ఎస్.ఎ.నజీర్, జస్టిస్ జె.బి.పార్డీవాలాలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. ఇదీ చదవండి: కొలీజియంలో విభేదాలు! -
మోజు తీరగానే ఫోన్లో తలాక్..
ఓ గదిలో కొందరు బాలికలు కూర్చొని ఉన్నారు.. వయసు పైబడిన ఓ వ్యక్తి ఆ గదిలోకి వచ్చాడు. ఒక్కొక్కరిని ప్రశ్నలు అడుగుతున్నాడు. కొద్దిసేపటి తర్వాత వారిలో ఒక బాలికను ఓకే చేశాడు. ఇది ఏ ఉద్యోగం కోసమో జరుగుతున్న ఇంటర్వ్యూకాదు... అమ్మాయిల కొనుగోలు కోసం జరుగుతున్న తంతు. అందం.. ఆరోగ్యం ఉన్న హైదరాబాద్ అమ్మాయిలను ఎంత డబ్బు కుమ్మరించైనా సొంతం చేసుకునేందుకు సొమాలి, సూడానీలు పోటీపడుతున్నారు. ఈ తతంగానికి పెళ్లి అని పేరు పెట్టి.. యువతుల జీవితంతో ఆడుకుంటున్నారు. ఇలాగే ఓ సోమాలీ దేశస్తుడు (అమెరికా పౌరసత్వం ఉన్న వ్యక్తి) పాతబస్తీకి చెందిన మైనర్ అమ్మాయి సబాఫాతిమాను పెళ్లి చేసుకున్నాడు. మోజు తీరగానే అమెరికా వెళ్లి ఫోన్లో తలాక్ చెప్పేశాడు. చదవండి: నెల రోజుల్లో పెళ్లి.. చేతిలో చిల్లిగవ్వ లేక ఏం జరిగింది... : పాతబస్తీ గాజియే మల్లత్ కాలనీకి చెందిన సబా ఫాతిమా(16)కు అబ్ది వలీ అహ్మద్(54)తో పెళ్లి జరిగింది. అప్పటికీ ఫాతిమా మైనర్. టోలిచౌకిలో ఓ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అద్దెకు తీసుకొని ఉన్నారు. అలా 2 నెలలు గడిచిన తర్వాత వారం రోజుల్లో తిరిగి వస్తా అని చెప్పి దుబాయ్ వెళ్లాడు. ఏడాది తర్వాత వచ్చాడు. మళ్లీ రెండు నెలలు ఉండి ఎక్కడికో వెళ్లేవాడు. ఇలా నాలుగుసార్లు జరిగింది. అద్దె ఇళ్లను మారుస్తూ మెహిదీపట్నం, మలక్‌పేట్‌తో పాటు పలుచోట్ల సబాతో ఉండేవాడు. కాగా, 2020, ఫిబ్రవరిలో దుబాయ్‌లో ఉన్న తన తల్లి వద్దకు వెళ్తున్నానని.. తర్వాత వచ్చి సబాను తీసుకెళ్తానని చెప్పి వెళ్లాడు. లాక్డౌన్ ముగిసే వరకు దుబాయ్‌లో ఉండి.. అక్కడి నుంచి అమెరికా వెళ్లాడు. అక్టోబర్ 7న సబా తండ్రి మహ్మద్ ఫరీద్‌కు ఫోన్ చేసి తలాక్ ఇస్తున్నానని మూడుసార్లు ఆ పదం ఉచ్చరించాడు. అప్పటి నుంచి సబా ఫోన్ నంబర్‌ను బ్లాక్ చేశాడు. దీంతో ఆందోళన చెందిన ఫాతిమా కుటుంబ సభ్యులతో కలిసి గురువారం ఘాన్సీబజార్‌లోని ఉమెన్స్ పోలీసులకు ఆశ్రయించింది. న్యాయం చేయండి... ‘మా నాన్నకు మేము ఐదుగురం అమ్మాయిలం. నాన్న ఆటో నడిపిస్తారు. నేనే ఇంట్లో పెద్ద. నాన్న బాధ చూడలేక నా కంటే రెండింతలు ఎక్కువ వయసున్న నల్లజాతీ యుడిని పెళ్లి చేసుకున్నా. తనకు అమెరికా పౌరసత్వం ఉందని, వాళ్లమ్మ దుబాయ్‌లో ఉంటుందని చెప్పాడు. నా కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగుపడుతుందని పెళ్లి చేసుకున్నా. తర్వాత ఎప్పుడూ నెల రోజుల కంటే ఎక్కువ ఉండలేదు. అక్టోబర్‌లో నాన్నకు ఫోన్ చేసి తలాక్ ఇస్తున్నానని చెప్పాడు. దీంతో చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాం. ప్రభుత్వం స్పందించి నాకు న్యాయం చేయాలని కోరుతున్నా’ – సబాఫాతిమా ఇది ఒక్కరి కథ కాదు.. సబాఫాతిమానే కాదు.. పాతబస్తీకి చెందిన ఎందరో అమ్మాయిల దీనగాథ ఇది. సోమాలీ, సూడానీ దేశస్తులు.. ఇక్కడి అమ్మాయిల అందానికి వెల కడుతున్నారు. పెళ్లి కోసం వచ్చే వీరంతా కుర్రాళ్లేం కాదు. 50–60 ఏళ్లు పైబడిన వారే. వీరు సంపన్నులు కాదు. సోమాలియా, సూడాన్‌తో పాటు ఇతర అరబ్బు దేశాల నుంచి విద్య, వ్యాపారం, వైద్యం కోసం వస్తున్నారు. శారీరక అవసరాల కోసం మాత్రమే లక్ష, 2 లక్షలు ఇచ్చి పాతబస్తీ అమ్మాయిలను వివాహం చేసుకుంటున్నారు. ఇక్కడి కుటుంబాల్లో పేదలే ఎక్కువగా ఉండటం.. అమ్మాయిల సంఖ్య కూడా ఎక్కువగానే కావడం, పేదరికం, నిరక్షరాస్యతను ఆసరా చేసుకుని దళారులు ఈ తతంగాన్ని నడిపిస్తున్నారు. ఆయా దేశాల నుంచి వచ్చిన వారు టోలిచౌకి, మెహిదీపట్నం, మాసాబ్ ట్యాంక్ తదితర ప్రాంతాల్లోనే అద్దెకు ఉంటున్నారు. దళారుల ద్వారా అమ్మాయిలను ఇంటర్వ్యూ చేసి నచి్చన అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నారు. అమ్మాయిలకు ఇష్టంలేకపోయినా ఒత్తిడి తెచి్చ మరీ తమ పంతం నెరవేర్చుకుంటారు. పెళ్లి చేసుకునే వ్యక్తి ఇచ్చే డబ్బును దళారులు.. ఏజెంట్లు.. తల్లిదండ్రులు పంచుకుంటారు. అయితే వీటిలో అధిక భాగం దళారుల చేతికే చేరుతుంది. పాతబస్తీలో గోప్యంగా పెళ్లి జరుగుతుంది. అక్కడి నుంచి మకాం కొత్తబస్తీకి మారుస్తారు. -
భార్య ఉండగానే మరో యువతితో చాటింగ్.. తలాక్
బొమ్మనహళ్లి : మరో యువతితో చాటింగ్ చేయడాన్ని ప్రశ్నించడంతో భార్యకు తలాక్ చెప్పిన ఘటన బెంగళూరులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు బాధితురాలు ఆర్టీనగర పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలు...యూఎస్ఏలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న యువతి అక్కడే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న ఆర్టీనగరకు చెందిన సయ్యద్ రెహమాన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇద్దరు కొంత కాలం అన్యోనంగా జీవించారు. మూడు నెలల తరువాత సయ్యద్ జులాయిగా తిరుగుతూ ఉద్యోగం మాని భార్య సంపాదనపై జల్సాలు చేయడం మొదలు పెట్టాడు. అంతేకాకుండా మరో యువతితో నిత్యం చాటింగ్‌లు చేసేవాడు. ఏకంగా ఇంటికే పిలుచుకుని వచ్చేవాడు. దీంతో భార్య ప్రశ్నించడంతో ఆమెను నిత్యం వేధించి కొట్టేవాడు. దీంతో బాధితురాలు విషయాన్ని బెంగళూరులో ఉన్న తల్లిదండ్రులకు తెలిపింది. ఇటీవల ఇద్దరు బెంగళూరు చేరుకున్నారు. ఆర్టీనగరలో నివాసం ఉంటున్నారు. అయినప్పటికీ సయ్యద్‌లో ఎటువంటి మార్పు కనిపించలేదు. దీంతో ఏకంగా మరో వివాహం చేసుకోవడానికి యత్నించాడు. ఈ నేపథ్యంలో భార్యకు తలాక్ చెప్పాడు. దీంతో బాధితురాలు ఆర్టీనగర పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన ఫిర్యాదుపై పోలీసులు ఇప్పటి వరకు స్పందించలేదని బాధితురాలు వాపోయింది. -
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు డీఏ 3 శాతం పెంపు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులకు తీపి కబురు. వారి కరువు భత్యం(డీఏ)ను 3 శాతం పెంచుతూ కేం ద్రం నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీ నేతృత్వంలో మంగళవారం సమావేశమైన కేబినెట్ ఇందుకు అంగీకరించింది. ఈ నిర్ణయంతో సుమారు 48.41 లక్షల మంది ఉద్యోగులకు, 62.03 లక్షల మంది పింఛన్‌దారులకు లబ్ధి చేకూరుతుంది. ఈ పెంపు జనవరి 1 నుంచే అమల్లోకి వస్తుందని కేంద్రం ప్రకటించింది. ఫలితంగా 2019 జనవరి, 2020 ఫిబ్రవరి మధ్యకాలంలో ఖజానాపై సుమారు రూ. 19,864 కోట్ల భారం పడుతుందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. కేబినెట్ మరిన్ని నిర్ణయాలు.. తలాక్ ఆర్డినెన్స్, కంపెనీల చట్టం (రెండో సవరణ) ఆర్డినెన్స్, మెడికల్ కౌన్సిల్ ఆర్డినెన్స్, పోంజి పథకాల నివారణ ఆర్డినెన్స్‌కు ఆమోదం. రాజ్యసభలో సంబంధిత బిల్లు లు నిలిచిపోవడంతో ఆర్డినెన్స్‌లు తెచ్చింది. రూ.30,274 కోట్ల వ్యయంతో ఢిల్లీ–గజియాబాద్–మీరట్ మార్గంలో రీజినల్ ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ (ఆర్ఆర్టీఎస్) ఏర్పాటుకు అంగీకారం. 82 కి.మీ దూరాన్ని 60 నిమిషాల్లో చేరుకునేలా వేగవంతమైన, పర్యావరణ హితమైన రైల్వే వ్యవస్థను అందుబాటులోకి తెస్తారు. 2025నాటికి కోటి ఉద్యోగాల కల్పనే లక్ష్యం గా నూతన ఎలక్ట్రానిక్స్ పాలసీసి ఓకే క్యాప్టివ్ మైనింగ్(సొంత అవసరాలకు మాత్రమే వినియోగించే) ద్వారా ఉత్పత్తి చేసిన బొగ్గులో నిర్వహణ కంపెనీలు 25 శాతాన్ని బహిరంగ మార్కెట్లో విక్రయించేందుకు అనుమతి. చమురు, సహజవాయువు బావుల వేలానికి రెండు దశాబ్దాల క్రితం నాటి విధానం పునరుద్ధరణ. ఇందులో భాగంగా గతంలో మాదిరిగా ప్రభుత్వానికి రెవెన్యూలో నేరుగా వాటా లభించదు. కానీ ఆపరేటర్ సదరు క్షేత్రం నుంచి ఏడాదిలో 2.5 బిలియన్ డాలర్లకు పైగా అనూహ్య లాభాలు గడిస్తే మాత్రం ఆదాయం పొందుతుంది. -
భర్త తలాక్ చెప్పాడని..
-
భర్త తలాక్ చెప్పాడని.. పిల్లల కాళ్లు, చేతులు కట్టేసి..
సాక్షి, హైదరాబాద్: తలాక్ ఇస్తానంటూ భర్త వేధించడంతో ఓ గృహిణి ఆత్మహత్యకు ప్రయత్నించింది. తన పిల్లలతో సహా ట్యాంక్‌బండ్‌లో దూకేందుకు యత్నించింది. పిల్లల కాళ్లు, చేతులు కట్టేసి నీటిలోకి దూకేందుకు వెళ్తున్న ఆమెను స్థానికులు అడ్డుకున్నారు. వారి సమాచారం మేరకు ఘటన స్థలికి చేరుకున్న లేక్ పోలీసులు మహిళలను పోలీస్ స్టేషన్‌కు తరలించి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. కాగా గత కొద్దిరోజులుగా తలాక్ ఇస్తానంటూ తన భర్త తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నాడని ఆమె పోలీసుల వద్ద వాపోయింది. ఆత్మహత్యయత్నానికి యత్నించిన మహిళను నగరంలోని టోలీచౌక్ ప్రాంతానికి చెందినదిగా పోలీసులు గుర్తించారు. -
సామాజిక న్యాయంలో కాంగ్రెస్‌దే పైచేయి: ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: సామాజిక న్యాయం అమలు చేయడంలో కాంగ్రెస్‌కు మించిన పార్టీ లేదని, అణగారిన వర్గాలను ఆదుకోవడమే తమ పార్టీ మూల సిద్ధాంతమని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై టీఆర్ఎస్ అనుసరిస్తున్న తీరుపై కాంగ్రెస్ పార్టీ న్యా యపోరాటానికి సిద్ధమవుతుందని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ 134వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుక్రవారం గాంధీభవన్‌లో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఉత్తమ్ మాట్లాడారు. ట్రిపుల్ తలాక్ విషయంలో బీజేపీ ఏకపక్ష తీరును విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన అవకతవకల వల్లే తాము ఓడిపోయామని, ఇందుకు సంబంధించిన ఆధారాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఎల్పీ మాజీ నేత కె. జానారెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, వి.హనుమంతరావు, మాజీ మంత్రి షబ్బీర్‌అలీ, ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీగౌడ్, టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి, సేవాదళ్ చైర్మన్ కనుకుల జనార్దనరెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి బండ్లగణేశ్, ప్రధాన కార్యదర్శులు కైలాశ్, బొల్లు కిషన్ తదితరులు పాల్గొన్నారు. -
వాట్సాప్‌లో తలాక్..అమెరికాకు పరార్
యశవంతపుర (బెంగళూరు): విభేదాలు పరిష్కరించుకుందామంటూ అమెరికా నుంచి భార్యను తీసుకువ్చన ఓ భర్త.. ఆమెకు తెలియకుండా తిరిగి అమెరికా చెక్కేశాడు. ఆ తర్వాత వాట్సాప్‌లో ఆమెకు తలాక్ చెప్పాడు. ఈ ఘటన బెంగళూరులో జరిగింది. బెంగళూరుకు చెందిన డాక్టర్ జావేద్ ఖాన్, రేష్మా అజీజ్‌లకు 2003లో పెళ్లయింది. అమెరికాలోని ఇల్లినాయిస్లోఉంటున్న వీరికి 13 ఏళ్ల కూతురు, 10 ఏళ్ల కొడుకు ఉన్నారు. కాగా దంపతుల మధ్య విభేదాలు తలెత్తడంతో పెద్దల సమక్షంలో పరిష్కరించుకోవాలని నవంబర్ 30వ తేదీన వారు బెంగళూరుకు చేరుకున్నారు. బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో దిగగానే ఇప్పుడే వస్తానంటూ చెప్పి భార్యను ఇంటికి పంపించి వేశాడు. తాను మాత్రం విమానంలో మళ్లీ అమెరికా వెళ్లిపోయాడు. తర్వాత తలాక్ అంటూ మూడుసార్లు వాట్సాప్‌లో పోస్టులు, వాయిస్ మెసేజ్‌లు పంపించాడు. దీంతో బాధితురాలు తల్లిదండ్రుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
పిల్లలు పుట్టలేదని తలాక్
నంద్యాల: పిల్లలు పుట్టలేదని వేధించడమే కాకుండా తలాక్ చెప్పి అన్యాయం చేసిన భర్త ఇంటి ముందు భార్య ధర్నాకు దిగింది. ఈ సంఘటన నంద్యాల పట్టణంలో సోమవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని సాయిబాబానగర్‌కు చెందిన సయ్యద్‌హుసేన్, బిజాన్బీ కుమారుడు అలీ మిర్జాన్తో ఇదే కాలనీకి చెందిన షేక్జలీల్, తస్మీన్ల కూతురు షేక్ సల్మాతో 2014లో వివాహం జరిగింది. ఈ వివాహం సందర్భంగా రూ.5లక్షలు నగదు, 20తులాల బంగారు, 4లక్షల ఇంటి సామగ్రి, కట్నం కింద ఇచ్చారు. పెళ్లి అయిన 4సంవత్సరాలు అవుతున్నా పిల్లలు పుట్టలేదని అత్తామామ, భర్త, ఆడపడుచులు వేధిస్తూ వచ్చారు. ఈ వేధింపులు తట్టుకోలేక ఆరునెలల క్రితం సల్మా పుట్టింటికి వెళ్లింది. ఈ విషయంపై ఫ్యామిలీ కౌన్సెలింగ్‌లో ఫిర్యాదు చేసినా భర్త బంధువులు ఎవరూ హాజరు కాలేదు. అంతేగాకుండా ఆలీమిర్జాను భార్య షేక్సల్మాకు లాయర్ ద్వారా తలాక్ చెబుతూ నోటీసు పంపారు. తన అనుమతి లేకుండా తలాక్ ఎలా ఇస్తారని భార్య వాపోయినా భర్త పట్టించుకోలేదు. టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని, బాధితురాలు ఇంటి ముందు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా షేక్‌సల్మా విలేకరులతో మాట్లాడుతూ తన భర్త, ఆడపడుచు అనునిత్యం వేధిస్తూ కొడుతూ చిత్రహింసలకు గురి చేస్తున్నారన్నారు. అధికారులుస్పందించి న్యాయం చేయాలని వేడుకున్నారు. సల్మాపై అత్త, అడపడచుల దాడి... సోమవారం ఉదయం నుంచి భర్త ఇంటి వద్ద ధర్నా చేస్తున్న షేక్సల్మాపై అత్త, ఆడపడచు దాడి చేశారు. ఈ దాడిలో సల్మాకు తీవ్రగాయాలయ్యా లు కాగా స్థానికులు నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అత్త బీజాన్బీ, ఆడపడచు యాస్మిన్లపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు టూటౌన్ ఎస్ఐ హరినాథరెడ్డి తెలిపారు. -
నిఖాతో పాటే తలాఖ్నామా..!
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలో ఒమన్ షేక్‌ల అరాచకాలు ఒకొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. దళారులు, కొందరు ఖాజీల సహకారంతో పేదరికంలో ఉన్న మైనర్లు, యువతుల్ని పెళ్లాడుతున్న వీరు వివాహ సమయంలోనే విడాకుల పత్రాలపైనా సంతకాలు చేయించుకుంటున్నారని బయటపడింది. ఫలితంగా పెళ్లయిన కొన్ని రోజులపాటు ఇక్కడే జల్సాలు చేస్తున్న వృద్ధ షేక్‌లు.. ఆపై వారిని విడిచిపెట్టి పోతున్నారు. ఈ తరహా వ్యవహారాలకు సహకరిస్తున్నాడనే ఆరోపణలపై గ్రేటర్ హైదరాబాద్ చీఫ్ ఖాజీ అలీ అబ్దుల్లా రిఫాయ్ అలియాస్ ఓల్టా ఖాజీని దక్షిణ మండల పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఇతడి సహాయకుడిని, ముగ్గురు ఒమన్ జాతీయుల్ని పట్టుకున్నట్లు డీసీపీ వి.సత్యనారాయణ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. 40 వివాహాల్లో 22 మంది మైనర్లే.. ఓల్టా ఖాజీపై గతంలోనూ మైనర్ బాలికలతో ఒమన్ షేక్‌లకు వివాహాలు జరిపిస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఇతడికి గల్ఫ్ దేశాల్లో మంచి నెట్వర్క్ ఉంది. ఎవరైనా ఒమన్ షేక్ వివాహం చేసుకోవడానికి మైనర్ కావాలంటూ అక్కడి ఏజెంట్ల నుంచి సమాచారం అందిన వెంటనే ఇక్కడున్న తన దళారులతో పాటు సహాయకుడు ఇబ్రహీం షరీఫ్ ద్వారా ఏర్పాట్లు చేస్తుంటాడు. గత నాలుగేళ్లలో దాదాపు 40 మంది గల్ఫ్ షేక్‌లకు సిటీలో వివాహాలు జరిపించాడు. ఇతడు వివాహాలు జరిపించిన 40 మందిలో 35 మంది బాధితుల్ని పోలీసులు గుర్తించారు. వీరిలో 22 మంది మైనర్లే. మిగిలిన వాళ్లు 22 నుంచి 23 ఏళ్ల మధ్య వయస్కులు. ఫలక్‌నుమ బాలిక రుక్సా వివాహం చేయించిందీ ఇతగాడే. మాటమార్చినా ఆధారాలు చిక్కడంతో.. దక్షిణ మండల పోలీసులు గత వారం అరెస్టు చేసిన 20 మంది నిందితుల్లో ఐదుగురు ఒమన్ షేక్‌లు ఉన్నారు. ఈ విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే ఓల్టా ఖాజీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయి గల్ఫ్ పారిపోయే ప్రయత్నాలు చేశాడు. ఇతడి నుంచి స్వాధీనం చేసుకున్న పత్రాలు పరిశీలించిన నేపథ్యంలో మరికొందరు షేక్‌ల వ్యవహారాలు వెలుగులోకి వచ్చాయి. ఒమన్‌కు చెందిన 70 ఏళ్ల అల్ షియాదీ సులేమాన్ బిన్ ఖామిస్ బిన్ సాలమ్ మైనర్‌ను వివాహం చేసుకోవడానికి వచ్చాడు. ఓల్టా ఖాజీకి రూ.20 వేల అడ్వాన్స్ ఇచ్చాడు. కొందరు మైనర్లను ఇతడికి చూపించినా నచ్చలేదని చెప్పాడు. ఐదుగురు ఒమన్ షేక్‌ల వ్యవహారం తెలియడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్న సమయంలో తాను వైద్యం కోసం వచ్చానంటూ చెప్పుకొచ్చాడు. ఓల్టా ఖాజీ ద్వారా ఆధారాలు దొరకడంతో పోలీసులు సాలమ్ను అరెస్టు చేశారు. అంధుడైన షేక్‌ను తీసుకొచ్చిన ఏజెంట్.. ఒమన్‌కు చెందిన దళారి అల్ షియాది మహ్మద్ ఖాల్ఫన్ మహ్మద్‌ను సైతం దక్షిణ మండల పోలీసులు పట్టుకున్నారు. ఓల్టా ఖాజీతో వాట్సాప్, ఫోన్ ద్వారా సంప్రదింపులు జరిపిన ఇతడు అల్ షియాదీ సులేమాన్ ఖమిస్ సలామ్ అనే షేక్‌కు మైనర్ యువతిని వెతికిపెట్టాల్సిందిగా కోరాడు. గత వారం సలామ్‌ను పట్టుకున్న పోలీసులు అతడి కాల్ రికార్డుల ఆధారంగా ఖాల్ఫన్ వ్యవహారం గుర్తించి మంగళవారం అరెస్టు చేశారు. మరో ఒమన్ జాతీయుడైన అల్ అవ్ధీ యాసీర్ అబ్దుల్లా హమ్దాన్.. కొన్నాళ్ల క్రితం ఒమన్‌కే చెందిన అంధుడు అబ్దుల్లా ముబారక్‌కు మైనర్‌తో వివాహం చేయిస్తానంటూ ఒప్పందం కుదుర్చుకుని తీసుకొచ్చాడు. రుక్సా కేసులో దళారిగానూ వ్యవహరించిన ఇతడినీ సౌత్ జోన్ పోలీసులు అరెస్టు చేశారు. వీరితో పాటు మరో ఇద్దరు ఒమన్ షేక్‌లను వారి దేశానికి డిపోర్టేషన్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. గత వారం అరెస్టు చేసిన ముంబై చీఫ్ ఖాజీ సహా 10 మంది నిందితుల్ని తదుపరి విచారణ నిమిత్తం కస్టడీలోకి తీసుకున్నారు. పెళ్లి.. విడాకులు ఒకేసారి.. ఓల్టా ఖాజీ వివాహం చేసే సమయంలో ఆ ఒప్పంద పత్రం (నిఖానామా)తో పాటే విడాకుల పత్రం (తలాఖ్నామా) సైతం రాసేస్తాడు. పెళ్లి జరుగుతున్నప్పుడే దీనిపైనా సంతకాలు చేయిస్తాడు. దీంతో వివాహానంతరం గరిష్టంగా రెండు నెలల పాటు సిటీలోనే ఉంటున్న ఒమన్ షేక్‌లు అమాయక బాలికలతో జల్సాలు చేసి ఆపై అర్ధంతరంగా వదిలి తమ దేశాలకు వెళ్లిపోతున్నారు. నాలుగేళ్లలో ఇలా మోడుల్లా మిగిలిపోయిన బాధితుల సంఖ్య 25 మంది అని దక్షిణ మండల పోలీసులు గుర్తించారు. రుక్సా వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత పోలీసులు ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాల దర్యాప్తులో ఇతడి వ్యవహారంతో పాటు సహాయకుడు షరీఫ్ ఆగడాలూ బయటపడ్డాయి. దీంతో వీరిద్దరినీ అరెస్టు చేసి పలు పత్రాలు, స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు. -
రాజస్థాన్‌లో ‘తలాక్’
సాక్షి, జోధ్‌పూర్ : ట్రిపుల్ తలాక్‌పై సుప్రీం కోర్టు తాత్కాలిక నిషేధం విధించిన తరువాత.. కూడా ఒక ముస్లిం మహిళకు తలాక్ చెప్పి.. మరో పెళ్లి చేసుకున్న ఘటన జోధ్‌పూర్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో నివాసముంటున్న అఫ్సానాకు భర్త మున్నా.. సెప్టెంబర్ 18న ఫోన్లో ముమ్మారు తలాక్ చెప్పి పెట్టేశాడు. తలాక్ చెప్పి రెండు రోజుల గడవకముందే మున్నా మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడని బాధితురాలు అఫ్సానా చెబుతున్నారు. మున్నాతో.. తనకు ఎనిమిదేళ్ల కిందట వివాహం జరిగిందని.. అప్పటినుంచీ అదనపు కట్నం కోసం భర్త, అత్తమామలు హింసించేవారని అఫ్సానా చెప్పారు. కట్నం తేలేదని.. 2015లో ఒకసారి ఒంటిమీద కిరోసిన్ పోసి నిప్పంటించే ప్రయత్నం చేశారని ఆమె తెలిపారు. ట్రిపుల్ తలాక్‌పై తాత్కాలిక నిషేధం ఉందని.. ఇప్పుడు ఇది చెల్లదు కాబట్టి.. భర్త కుటుంబం మీద కేసు పెడతానని ఆమె చెప్పారు. ఇద్దరు పిల్లల పోషణకు భరణం కోసం కోర్టును ఆశ్రయిస్తానని అఫ్సానా తెలిపారు. -
నీకు మౌనమేల సోనియా!
న్యూఢిల్లీ: ముస్లిం మహిళలకు ట్రిపుల్ తలాక్ ద్వారా విడాకులిచ్చే మత సంప్రదాయం చెల్లదంటూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ, తీర్పు చరిత్రాత్మకమని, ముస్లిం మహిళల సాధికారికతను ఇది ఉపయోగపడుతుందని వ్యాఖ్యానించారు. బీజేపీ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా కూడా స్పందిస్తూ, ఈ తీర్పు ముస్లిం మహిళలకు, వారు గౌరవంగా జీవించే హక్కుకు విజయమని వ్యాఖ్యానించారు. ఈ తీర్పు కొత్త భారత ఆవిర్భావానికి ముందడుగు అని కూడా అన్నారు. ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షరాలు సోనియా గాంధీ అసలు స్పందించ లేదు. పార్టీ తరఫున పార్టీ అధికార ప్రతినిధి మాట్లాడుతూ రణ్‌దీప్ సుర్జేవాలా తీర్పు గురించి మాట్లాడుతూ ఎంతోకాలంగా వివక్షంగా గురవుతున్న వారికి ఉపశమనం కల్పిస్తుందని, మహిళల హక్కులకు మరింత ధ్రువీకరణ లభించినట్లయిందని డొంక తిరుగుడుగా స్పందించారు. ఇక సాయంత్రం వరకు ఈ అంశంపై మౌనం పాటించిన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వివిధ వర్గాల నుంచి ఒత్తిళ్లు రావడంతో ఎట్టకేలకు స్పందించారు. ట్రిపుల్ తలాక్‌పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నానని, న్యాయ కోసం పోరాడిన మహిళలను అభినందిస్తున్నానని ఆయన ట్వీట్ చేశారు. మొదటి నుంచి ముస్లిం మైనారిటీ ఓట్లను దష్టిలో పెట్టుకొని ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా దేశంలో సాగిన ఉద్యమానికి హదయపూర్వకంగా మద్దత ప్రకటించలేదు, అలాఅని వ్యతిరేకించలేదు. తటస్థంగానే ఉంటూ వచ్చింది. సహజంగానే ముస్లింల వ్యతిరేక భావాజాలం కలిగిన భారతీయ జనతా పార్టీ మాత్రం మొదటి నుంచి తలాక్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాన్ని నెత్తికెత్తుకుంది. ఉత్తరప్రదేశ్‌కు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ వచ్చింది. సాధారణంగా మహిళల హక్కులను ప్రోత్సహించే కాంగ్రెస్ పార్టీ మాత్రం ట్రిపుల్ తలాక్‌పై తన వైఖరిని తేల్చుకోలేక పోయింది. ట్రిపుల్ తలాక్ వ్యతరేకమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా చెప్పుకోవడం, మహిళల హక్కుల కోసం పోరాటం జరిపేది ఒక్క బీజేపీ మాత్రమేనని పార్టీ ప్రచారం చేసుకోవడం ఆ పార్టీ యూపీ ఎన్నికల్లో లబ్ధి చేకూరింది. ఆ ఎన్నికల్లో మొదటిసారి ముస్లిం మహిళలు బీజేపీకి ఓటేసినట్లు అంచనాలు ఉన్నాయి. మొన్న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కూడా మోదీ తలాక్ అంశాన్ని ప్రస్తావించారు. ట్రిపుల్ తలాక్ వల్ల ముస్లిం మహిళలు దుర్భర జీవితాలను అనుభవిస్తున్నారని అన్నారు. ట్రిపుల్ తలాక్ దురాచారాన్ని ఎత్తి చూపడం వల్ల మైనారిటీలను విమర్శించినట్లవుతుంరని, మైనారిటీ మహిళలను ఆకర్షించవచ్చని, ఇంకోపక్క హిందూ ఓట్లను సమీకరించుకోవచ్చన్నది మోదీ వ్యూహం. ఓ పక్క మోదీ వ్యూహాలు విజయం సాధిస్తుండగా, ఏ వ్యూహం లేకపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ చాలా వెనకబడి పోతున్నది. -
తలాక్ ఇస్లాంలో భాగం కాదు
ఇది సమాజం అంతర్గత సంఘర్షణ మాత్రమే - ట్రిపుల్ తలాక్ వివాదంలో సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం - 69 ఏళ్లుగా చట్టం తేకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నించిన ధర్మాసనం - ప్రాథమిక హక్కుల సంరక్షణ బాధ్యత సుప్రీందే: అటార్నీ జనరల్ న్యూఢిల్లీ: ట్రిపుల్ తలాక్ అంశం ఇస్లాంలో భాగం కాదని ఇది ఇస్లాం సమాజంలోని అంతర్గత సంఘర్షణ మాత్రమేనని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ముస్లిం మహిళల ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతున్నందున ఈ అంశంపై న్యాయపరమైన సూక్ష్మ పరిశీలన జరగాలని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ బుధవారం ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి తెలిపారు. ముస్లిం మహిళలకు, పురుషులకు మధ్యనున్న తీవ్రమైన అంతరాన్ని సూచించే ఈ అంశం నుంచి కోర్టు తప్పించుకోజాలదన్నారు. రోహత్గీ ప్రశ్నలపై ధర్మాసనం స్పందిస్తూ.. ట్రిపుల్ తలాక్‌తోపాటు ముస్లిం వివాహాలపై నియంత్రణ తెస్తూ ప్రభుత్వం చట్టం ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించింది. ‘కోర్టు ట్రిపుల్ తలాక్ కేసును కొట్టేస్తే మీరు (కేంద్రం) చట్టం చేస్తారా? గత 69 ఏళ్లుగా మీరు ఎందుకు చట్టం తీసుకురాలేదు’ అని న్యాయస్థానం ప్రశ్నించింది. ‘నేను చేయాల్సింది నేను చేస్తాను. కానీ మీరు (కోర్టు) ఏం చేస్తారనేదే ప్రశ్న?’ అని రోహత్గీ పేర్కొన్నారు. ట్రిపుల్ తలాక్ మహాపాపం అంటూనే.. ముస్లిం మహిళల ప్రాథమిక హక్కులతోపాటు ఇస్లాం మూల సూత్రాలను పరిశీలించాల్సిన అవసరం ఉందని ట్రిపుల్ తలాక్‌ను సమర్థిస్తున్న సీనియర్ న్యాయవాదులను రోహత్గీ కోరారు. ట్రిపుల్ తలాక్ ‘మహా పాపం’, ‘అవాంఛితం’ అంటున్న ముస్లిం పర్సనల్ లా బోర్డు ఈ అంశం మతంలో భాగమని చెప్పటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందన్నారు.‘విశాఖ వర్సెస్ రాజస్తాన్ ప్రభుత్వం’ కేసులో పనిచేస్తున్న చోట లైంగి క వేధింపుల విషయంలో ప్రత్యేక చట్టాలేమీ లేకున్నా సుప్రీం మార్గదర్శకాలు విడుదల చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. హిందూసంప్రదాయంలోని సతీసహగమనం, దేవదాసీ, అస్పృశ్యతలు కూడా కాలానుగుణంగా నిర్మూలించబడ్డాయన్నా రు. ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకుని ‘వీటిని కోర్టులు నిర్మూలించాయా? లేక చట్టాల ద్వారా రూపుమాసిపోయాయా?’ అని ప్రశ్నించింది. అయితే అలాంటప్పుడు విశాఖ కేసులో కోర్టు ఎందుకు జోక్యం చేసుకుందని రోహత్గీ తిరిగి ప్రశ్నించారు. కోర్టులు నిస్సహాయతను వ్యక్తం చేయలేవన్నారు. ‘దేశంలో ప్రాథమిక హక్కుల సంరక్షణ బాధ్యత సుప్రీంకోర్టుదే’ అని చెప్పారు. ట్రిపుల్ తలాక్‌ను మహిళలు తిరస్కరించొచ్చా? నిఖానామా (వివాహ ఒప్పందం) సమయంలో ముస్లిం మహిళలు ట్రిపుల్ తలాక్‌ను తిరస్కరించే అవకాశం కల్పిస్తారా? అని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్)ను ధర్మాసనం ప్రశ్నించింది. ట్రిపుల్ తలాక్‌కు నో చెప్పే లా నిఖానామా సమయంలో మహిళలకు అవకాశం కల్పించే నిబంధనను తేవాలని సూచించింది. ‘దీన్ని అమల్లోకి తీసుకురావటం ఏఐఎంపీఎల్కు సాధ్యమేనా? ఖాజీలంతా ఈ ఆదేశాలను పాటిస్తారా?’ అని ప్రశ్నించింది. దీనిపై న్యాయవాది యూసుఫ్ హతీమ్ ముచ్ఛాల స్పందిస్తూ.. ఏఐఎంపీఎల్ ఆదేశాలను ఖాజీలు పాటించాల్సిన అవసరం లేదన్నారు. ట్రిపుల్ తలాక్ ద్వారా విడాకులు తీసుకున్న వారిని సామాజికంగా బహిష్కరించాలని ఏప్రిల్ 14న పర్సనల్ లా బోర్డు ఇచ్చిన ఆదేశాలను ఎవరూ పాటించటం లేదన్నారు. -
తలాక్‌పై సుప్రీంకోర్టులో రెండోరోజూ విచారణ
-
ఝలక్: భర్తకు ముస్లిం మహిళ తలాఖ్!
లక్నో: భర్త పెట్టే చిత్రహింసలు తాళలేక ఓ ముస్లిం మహిళ తన భర్తకు విడాకులు ఇచ్చేందుకు తలాఖ్ చెప్పింది. సాధారణంగా ముస్లిం పురుషులు తమ భార్యలకు విడాకులు ఇచ్చేందుకు తలాఖ్ చెబుతుంటారు. అయితే ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో భార్య తలాఖ్ చెప్పిన విషయం శుక్రవారం వెలుగుచూసింది. పుట్టింటికి వచ్చి చాలా రోజులైన భర్త నుంచి ఎలాంటి సమాచారం లేదని, కనీసం తన కూతురు కోసమైనా మా పుట్టింటికి వచ్చి చూడలేదని బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. మరోవైపు మూడుసార్లు తలాఖ్ అనే పదాన్ని పలకడం ద్వారా ముస్లిం పురుషులు వైవాహిక బంధాన్ని తెంచేసుకునే పద్ధతిపై దాఖలైన పలు పిటిషన్లను విచారించేందుకు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ప్రత్యేకంగా వేసవి సెలవులు కూడా రద్దు చేసుకుని పనిచేస్తోన్న విషయం తెలిసిందే. ఆరేళ్ల కిందట తన వివాహం జరిగిందిని చెప్పిన మహిళ భర్త, వారి కుటుంసభ్యులు అదనపు కట్నం కోసం చిత్రహింసలు పెట్టేవారని వాపోయింది. కూతురు పుట్టిన తర్వాత నుంచి వేధింపులు మరింత తీవ్రమయ్యాయని, పాపను ఒకసారి కిడ్నాప్ కూడా చేశాడంటోంది. అత్తింటి వారి ఆగడాలను భరించలేక ఇటీవల పుట్టింటికి వెళ్లినట్లు జాతీయ మీడియాకు చెప్పింది. తాను, తన పాప బతికున్నామో లేదో కూడా భర్త వాకబు చేయకపోవడంపై కన్నీటి పర్యంతమైంది. అతడితో జీవించాల్సిన అక్కర్లేదని భావించడంతో తాను భర్తకు తలాఖ్ చెప్పినట్లు వివరించింది. తనకు, తన భార్యకు పోషణ కోసం భర్త నుంచి నగదు(భరణం) ఇప్పించాలని కోర్టును ఆశ్రయిస్తానని చెప్పింది. షరియత్ చట్టాల ప్రకారం వివాహ సమయంలో చెప్పినట్లుగా చేశాను.. భార్యను, కుటుంబాన్ని పట్టించుకోని భర్త నుంచి విడిపోవడం సరైనదేని మత పెద్దలు చెప్పినట్లు గుర్తుచేసుకుంది. కట్నం కోసం వేదించిన వ్యక్తిపై ఐపీసీ 498 సెక్షన్ ప్రకారం ఫిర్యాదు చేసినట్లు బాధితురాలి తరఫు లాయర్ చెప్పారు. ఈ ఫిర్యాదుపై స్పందించి చట్టప్రకారం ఆమెకు న్యాయం చేయాలని, భర్త నుంచి పరిహారం ఇప్పించడం సబబేనని అభిప్రాయపడ్డారు. -
మూడు గంటల్లో విడాకులు, మళ్లీ పెళ్లి
రాంచీ: జార్ఖండ్‌లోని ఛాంద్వా గ్రామంలో రుబీనా పర్వీన్ అనే 18 ఏళ్ల యువతి బుధవారం నాడు తాను పెళ్లి చేసుకున్న భర్త ముంతాజ్ అన్సారీ అనే యువకుడికి మూడు గంటల్లో విడాకులిచ్చి అదే రోజు మొహమ్మద్ ఇలియాస్ అనే యువకుడి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న మూడు గంటల్లోనే మొదటి భర్తను వదిలేయడానికి కారణం కట్నం కింద మోటార్ సైకిల్‌ను డిమాండ్ చేయడమే. పెళ్లి కట్నం కింద మోటార్ బైక్ మాట్లాడుకోనప్పటికీ పెళ్లయిన వెంటనే మొదటి భర్త ముంతాజ్ మోటార్ సైకిల్ కావాలంటూ అత్తింటి వారిని డిమాండ్ చేశారు. తన డిమాండ్‌ను నెరవేర్చకపోతే పెళ్లి కూతరును ఇంటికి తీసుకెళ్లేలేదని మొండికేశారు. అదే గ్రామంలో ఓ మోస్తరు హోటల్‌ను నడుపుతున్న పెళ్లి కూతురు తండ్రి బషీర్ ఉద్దీన్ అన్సారీ ఆగమేఘాల మీద మార్కెట్‌కు వెళ్లి హీరో హోండా ఫ్యాషన్ బైక్‌ను కొనుగోలుచేసి అల్లుడి కోసం తెచ్చారు. ఆ బైక్ తనకొద్దని, అంతకంటే ఖరీదైన బైక్ కావాలని అల్లుడు మళ్లీ గొడవ చేశారు. పెళ్లి కూతురు కుటుంబ సభ్యులు, పెళ్లి పెద్దలు ఎన్ని విధాలుగా నచ్చ చెప్పేందుకు ప్రయత్నించినా వినిపించుకోలేదు. దీంతో తనకు ఈ భర్త వద్దని, ఇప్పుడే ఇంతగా వేధిస్తే మున్ముందు ఎంతగా వేధిస్తాడోనని పెళ్లి కూతురు రుబానా పర్వీన్ కుటుంబ సభ్యులకు స్పష్టం చేశారు. దాంతో పెళ్లి తెగతెంపులు చేసుకొనేందుకు సిద్ధపడ్డ పెళ్లి కూతురు కుటుంబ సభ్యులు ముస్లిం పెళ్లి పెద్ద ‘కాజా’కు కబురు పెట్టారు. పెళ్లి కొడుకు ముంతాజ్ మెడలో చెప్పుల దండ, కట్నం కోసం కక్కుర్తిపడ్డాను అన్న బోర్డును తగిలింగి పెళ్లి పందిట్లో తిప్పి, గుండు గీయించి ఇంటికి పంపారు. పెళ్లి కొడుకును సమర్థించినందుకు అతని తమ్ముడికి కూడా సగం గుండు గీయించి పంపారు. ఈలోగా కాజా వచ్చి రుబానా మొదటి పెళ్లిని రద్దు చేశారు. ఆమె తండ్రి బషీరుద్దీన్ అదే ఊరికి చెందిన మొహమ్మద్ ఇలియాస్ అనే యువకుడి తల్లిదండ్రులతో మాట్లాడి అదే పందిట్లో అదే రోజు రాత్రి తన కూతురికి రెండో పెళ్లి చేశారు. జరిగిన సంఘటనల పట్ల తనకు ఎలాంటి విచారం లేదని, జీవితాంతం ఎదురయ్యే వేధింపుల నుంచి తన కూతురుని రక్షించుకున్నానన్న ఆనందం తనకుందని బషీరుద్దీన్ వ్యాఖ్యానించారు. -
వాట్సప్‌లో తలాక్...
-
వాట్సప్‌లో తలాక్...
హైదరాబాద్ సిటీ: కట్టుకున్న భార్యను వేధింపులకు గురిచేస్తూ ఎలాగైనా వదిలించుకోవాలనే ఉద్దేశ్యంతో వాట్సప్‌లో తలాక్ తలాక్ తలాక్ అంటూ సందేశం పెట్టాడు ఓ వ్యక్తి. భార్య ఫిర్యాదు మేరకు భర్తతో పాటు ఆమె అత్తపై కూడా కేసు నమోదు చేశారు సనత్‌నగర్ పోలీసులు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎర్రగడ్డలోని ఓల్డ్ ఫోస్టాఫీస్ రోడ్డుకు చెందిన ఓవైసీ తాళిబ్ బోయిగూడకు చెందిన సుమానియ షర్పీ 2015లో వివాహం జరిగింది. వివాహం అనంతరం భార్యభర్తలు నెల రోజుల పాటు దుబాయ్‌లో ఉండి వచ్చారు. అటు తర్వాత భర్త ఆమెకు తల్లి వరుస అయిన అత్త హిమ్మత్ ఖాతూన్‌లు సుమానియ షర్ఫీని వేధించడం మొదలు పెట్టారు. తన రెండో భర్తకు బిడ్డను కనివ్వాలంటూ హిమ్మత్ ఖాతూన్ సుమానియాను మరింత వేధింపులకు గురిచేస్తుంది. భర్త కూడా హిమ్మత్ ఖాతూన్‌కు మద్దతు తెలుపుతూ వస్తున్నారు. అంతేకాకుండా బాధితురాలిని గదిలో నిర్భందించి హింసించేవారు. ఆమె పుట్టింటికి వచ్చింది. దీంతో భర్త ఓవైసీ తాలిబ్ వాట్సప్‌లో తలాక్ తలాక్ తలాక్ అంటూ మూడు సార్లు మెసేజ్ చేశారు. బాధితురాలి భర్త వేధింపులను న్యాయస్థానం ద్వార ఈ నెల 16వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు భర్త, అత్తలతో పాటు మరో 10 మందిపై పోలీసులు 420, 406, 506 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
స్పీడ్ పోస్టులో తలాఖ్ పంపిన భర్త
-
పేపర్ లో విడాకుల ప్రకటన, కంగుతిన్న భార్య
హైదరాబాద్: ‘తలాక్..తలాక్..తలాక్’ అంటూ భార్యకు ఉర్దూ దినపత్రికలో ప్రకటన ద్వారా విడాకులిచ్చిన భర్తపై మొఘల్‌పురా పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ దేవేందర్ కథనం మేరకు... శాస్త్రిపురం కింగ్స్‌కాలనీ కి చెందిన ముస్తాక్ ఉద్దీన్, నాజ్మీన్కు 2015 జనవరిలో వివాహం జరిగింది. ఐదునెలల అనంతరం దంపతులిద్దరూ సౌదీకి వెళ్లారు. ఈ ఏడాది ఫిబ్రవరి 2న భార్యాభర్తలు నగరానికి వచ్చారు. 19న నాజ్మీన్ మొఘల్‌పురాలోని తల్లిగారింటికి రాగా, 24న ముస్తాక్ ఉద్దీన్ భార్యకు చెప్పకుండా తిరిగి సౌదీకి వెళ్లాడు. అదే రోజు ఫోన్ చేసి తలాక్ నోటీసులు పంపిస్తున్నట్లు చెప్పిన అతను గత నెలలో ఒక ఉర్దూ దినపత్రికలో తలాక్ అంటూ విడాకుల ప్రకటన ఇచ్చాడు. దీంతో కంగుతిన్న నాజ్మీన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితునిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. -
మోదీ దేశంలో అంతర్యుద్ధాన్ని సృష్టిస్తున్నారు
-
మోదీ దేశంలో అంతర్యుద్ధాన్ని సృష్టిస్తున్నారు
ఉమ్మడి పౌరస్మృతిపై ముస్లిం పర్సనల్ లా బోర్డు మండిపాటు న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై దేశంలోని అత్యున్నత ముస్లిం సంస్థ ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు భగ్గుమంది. ఇస్లామిక్ చట్టాన్ని రద్దుచేసి.. ఆ స్థానంలో ఉమ్మడి పౌరస్మృతిని తేవడానికి, దేశంలోని విభిన్న సంస్కృతులను ధ్వంసం చేయడానికి మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని విరుచుకుపడింది. ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) విషయంలో ప్రజాభిప్రాయాన్ని కోరుతూ కేంద్ర న్యాయశాఖ రూపొందించిన ప్రశ్నావళిని లాబోర్డ్ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. దేశంలోని బహుళ సంస్కృతిని ప్రభుత్వం గౌరవించాలని సూచించింది. 'మోదీ దేశంలో అంతర్యుద్ధాన్ని సృష్టించాలని చూస్తున్నారు. ముస్లింలదరూ దీనిపై పెద్దసంఖ్యలో స్పందిస్తారు. భారత్‌లో ఒకే భావజాలాన్ని రుద్దలేరు' అని ముస్లిం లా బోర్డు పేర్కొంది. ముస్లిం ప్రజల్లోని ట్రిపుల్ తలాక్, బహుభార్యత్వం వంటి సంప్రదాయాలను తాము వ్యతిరేకిస్తున్నామని, రాజ్యాంగం మౌలిక లక్షణమైన లింగ సమనత్వం విషయంలో ఎలాంటి సంప్రదింపులకు తావులేదని సుప్రీంకోర్టుకు గతవారం కేంద్రం తెలిపిన సంగతి తెలిసిందే. ఇస్లామిక్ చట్టమైన షరియా ప్రకారం ఒక ముస్లిం వ్యక్తి తన భార్యకు మూడుసార్లు 'తలాక్' అని చెప్పడం ద్వారా విడాకులు ఇవ్వొచ్చు. అంతేకాకుండా ముస్లిం వ్యక్తి నలుగురు భార్యలను కలిగి ఉండవచ్చు. అయితే, ఈ విధానాలు స్త్రీల పట్ల వివక్ష చూపడమేనని ముస్లిం మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ వివాదాస్పద అంశాలపై తొలిసారి కేంద్రం తన వైఖరిని వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే దేశమంతటా ఒకే చట్టబద్ధమైన విధానం ఉండేలా ఉమ్మడి పౌరస్మృతిపై ప్రజాభిప్రాయాన్ని కోరుతూ కేంద్ర న్యాయశాఖ ప్రశ్నావళిని రూపొందించిదన్న వార్తలపై ముస్లిం లా బోర్డ్ భగ్గుమంటోంది. త్రిపుల్ తలాక్ ఉండాల్సిందేనని, ఉమ్మడి పౌరస్మృతి ప్రమాదకరమని పేర్కొంటున్నది.