వాట్సప్‌లో తలాక్...
హైదరాబాద్ సిటీ: కట్టుకున్న భార్యను వేధింపులకు గురిచేస్తూ ఎలాగైనా వదిలించుకోవాలనే ఉద్దేశ్యంతో వాట్సప్‌లో తలాక్ తలాక్ తలాక్ అంటూ సందేశం పెట్టాడు ఓ వ్యక్తి. భార్య ఫిర్యాదు మేరకు భర్తతో పాటు ఆమె అత్తపై కూడా కేసు నమోదు చేశారు సనత్‌నగర్ పోలీసులు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎర్రగడ్డలోని ఓల్డ్ ఫోస్టాఫీస్ రోడ్డుకు చెందిన ఓవైసీ తాళిబ్ బోయిగూడకు చెందిన సుమానియ షర్పీ 2015లో వివాహం జరిగింది.
వివాహం అనంతరం భార్యభర్తలు నెల రోజుల పాటు దుబాయ్‌లో ఉండి వచ్చారు. అటు తర్వాత భర్త ఆమెకు తల్లి వరుస అయిన అత్త హిమ్మత్ ఖాతూన్‌లు సుమానియ షర్ఫీని వేధించడం మొదలు పెట్టారు. తన రెండో భర్తకు బిడ్డను కనివ్వాలంటూ హిమ్మత్ ఖాతూన్ సుమానియాను మరింత వేధింపులకు గురిచేస్తుంది. భర్త కూడా హిమ్మత్ ఖాతూన్‌కు మద్దతు తెలుపుతూ వస్తున్నారు. అంతేకాకుండా బాధితురాలిని గదిలో నిర్భందించి హింసించేవారు. ఆమె పుట్టింటికి వచ్చింది.
దీంతో భర్త ఓవైసీ తాలిబ్ వాట్సప్‌లో తలాక్ తలాక్ తలాక్ అంటూ మూడు సార్లు మెసేజ్ చేశారు. బాధితురాలి భర్త వేధింపులను న్యాయస్థానం ద్వార ఈ నెల 16వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు భర్త, అత్తలతో పాటు మరో 10 మందిపై పోలీసులు 420, 406, 506 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.