సాక్షి, హైదరాబాద్: సోషల్ మీడియా ద్వారా యువతిని వేధిస్తున్న ఓ యువకుడిని నగర షీ టీమ్ సభ్యులు శనివారం అరెస్టు చేశారు. నగర క్రైమ్ అండ్ సిట్ అ డిషనల్ పోలీసు కమిషనర్ స్వాతిలక్రా కథనం మేరకు.. నిందితుడు ముస్తాఫా ఖాన్ ఫేస్‌బుక్ ద్వారా పంపిన ఫ్రెండ్ రిక్వెస్ట్‌ను బాధితురాలు యాక్సెప్ట్ చేసింది. ఆ తర్వాత వీరిద్దరూ గోల్కొండ కోటలో కలిశారు. తన స్నేహితురాళ్లతో కలిసి ముస్తాఫాఖాన్‌ను కలిసిన బాధితురాలు గోల్కొండ కోటలో మొబైల్‌లో ఫొటోలు తీసుకున్నారు. ఆ తర్వాత కొన్ని రోజులకు పెళ్లి చేసుకుందామని బాధితురాలిని కోరాడు.
అయితే అప్పటికే ఆమెకు మరొకరితో ఎంగేజ్‌మెంట్ అవడంతో అందుకు తిరస్కరించింది. ఇది మనస్సులో పెట్టుకున్న ముస్తాఫాఖాన్ గతంలో గోల్కొండ కోటలో దిగిన ఫొటోలను బాధితురాలికి కాబోయే భర్త వాట్సాప్ నంబర్‌కు పంపి ఆమెతో ప్రేమలో ఉన్నానని, పెళ్లి చేసుకోవద్దని హెచ్చరించాడు. ఆ తర్వాత తనను పెళ్లి చేసుకోకపోతే చంపుతానంటూ బాధితురాలిని కూడా బెదిరించాడు. దీంతో ఆమె షీ బృందాన్ని సంప్రదించింది.
ఆ వెంటనే రంగంలోకి దిగిన షీ సభ్యులు ఆ నేరానికి సంబంధించిన పూర్తి డేటాను సేకరించి లంగర్‌హౌస్ ఠాణా పరిధిలో ముస్తాఫాఖాన్‌రు అరెస్టు చేసి స్థానిక పోలీసులకు అప్పగించారు. అలాగే షీటీమ్స్ ఏసీపీ డి.కవిత ఆదేశాల మేరకు సంజీవయ్య పార్కుకు వెళ్లిన షీ టీమ్ సభ్యులు ఈవ్‌టీజింగ్ చేస్తున్న నలుగురిని పట్టుకొని షీ టీమ్ కార్యాలయానికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment