
ప్రతీకాత్మక చిత్రం
హిమాయత్‌నగర్: ‘లాక్‌డౌన్ అమల్లో ఉంది. నువ్వు కానీ బయటకు వచ్చినట్లు తెలిసినా, బయట కనిపించినా చంపేస్తాను’ అంటూ ఓ యువతిని వేధిస్తున్నాడో అనామకుడు. పదే పదే వస్తున్న మేసేజ్‌లను భరించలేని బంజారాహిల్స్‌కు చెందిన ఆమె బుధవారం సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. గుర్తు తెలియని వ్యక్తి ఫేస్‌బుక్ మెసెంజర్ నుంచి కొద్ది రోజులుగా మెసేజ్‌లు చేస్తున్నాడు.
లాక్‌డౌన్‌లో నువ్వు ఇంట్లోనే కూర్చోవాలి. బయటకు అస్సలు రావొద్దు. నేను చెప్పింది వినకుండా నువ్వు బయటకు వచ్చినట్లు తెలిసినా, నేను నిన్ను బయట చూసినా చంపేస్తానంటూ బెదిరింపులకు దిగుతున్నాడు. ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు మెసేజ్‌లు చేస్తున్నాడనే విషయాలు మాత్రం తనకు తెలియదని యువతి తెలిపింది. ఏ కారణం చేత తనకు మెసేజ్‌లు చేస్తూ చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడో తనకు అర్థం కావట్లేదని, చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
చదవండి: లోన్‌యాప్స్ కేసులో కొత్త ట్విస్ట్
Comments
Please login to add a commentAdd a comment