Himayat Nagar
-
నాటి జ్ఞాపకాలు.. నేటి ఆనందబాష్పాల్లో... 50 ఏళ్ల పూర్వ విద్యార్థుల సమ్మేళనం!
హిమాయత్‌నగర్ (హైదరాబాద్): ‘‘ఏరా ఉదయ్ నువ్వేం మారలేదు. అప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉన్నావురా, హేయ్ కేఆర్పీ చాలా రోజుల తర్వాత చూడటం హ్యాపీగా ఉంది. ఇప్పుడు కూడా చాలా యంగ్ ఉన్నావ్రా, రేయ్ నరోత్తమ్..క్యా బాత్హేబై బోత్ దిన్ కా బాద్, జయంత్ నీ అప్డేట్స్ అన్నీ వాట్సప్ స్టేటస్‌లలో చూస్తూనే ఉన్నారా’’ అంటూ 50ఏళ్ల తర్వాత నేరుగా కలిసిన ఆ పూర్వ విద్యార్థులంతా ఒకరినొకరు పలకరించుకుంటూ భావోద్వేగానికి గురైన సంఘటన హైదర్‌గూడలోని సెయింట్ పాల్స్ హైస్కూల్లో జరిగింది. ఒకరిపై మరొకరు సైటైర్లు, ఇతర స్కూల్లో అమ్మాయిలకు రాసిన లవ్ లెటర్స్, క్రికెట్ స్కోర్ కోసం స్కూల్ నుంచి పారిపోయిన సందర్భం, బస్టాప్‌లో నచ్చిన అమ్మాయికి సైట్ కొట్టే తుంటరి చేష్టలను నెమరువేసుకున్నారు. ఆనాటి సంఘటనలను ఒక్కొక్కటిగా గుర్తు చేసుకుంటూ తరగతి గది వాతావరణాన్ని తెచ్చారు 1972 బ్యాచ్‌కు చెందిన పదవ తరగతి విద్యార్థులు. ఈ బ్యాచ్‌కు చెందిన విద్యార్థులు ఇక్కడ టెన్త్ చదివి 50 ఏళ్లు గడిచిన సందర్భంగా బుధవారం స్కూల్లో గోల్డెన్ జూబ్లీ రీయూనియన్‌ను నిర్వహించగా.. 108 స్టూడెంట్స్‌లో 64 మంది హాజరయ్యారు. వీరితో పాటు అప్పుడు పాఠాలు బోధించిన టీచర్స్ రసూల్, కష్ణమూర్తి, మారెడ్డి, షకీనా, ఐరీన్, కిటీ, మెజీలను సైతం ఆహ్వానించారు. స్టూడెంట్స్ అంతా అప్పట్లో యూనిఫాం అయిన బిస్కెట్ కలర్ ప్యాంట్, వైట్‌కలర్ షర్ట్‌ను ధరించి ఉదయం 10 గంటలకు క్లాస్‌రూంలోకి అడుగుపెట్టారు. టెన్త్–సి క్లాస్ రూంలో వీరందరికీ సైన్స్ టీచర్ షకీనా క్లాస్ తీసుకున్నారు. రోల్నంబర్తో పిలుస్తూ..బ్యాగులు లేకుండా క్లాస్‌కు ఎందుకు అటెండ్ అయ్యారంటూ సరదాగా ఆటపట్టించారు. ఉదయ్‌కుమార్ నాయుడు, సేష్ నారాయణ్, కేఆర్పీ రెడ్డి, జితేన్‌కుమార్, అశోక్‌నాథ్, సీఎస్ రావు, జయంత్, నరోత్తమ్‌రెడ్డి తదితరులు తరగతి గదిలో కూర్చుని ఉండగా.. వీరిలో కొందరి సతీమణులు స్టూడెంట్స్‌గా కూర్చున్న భర్తల్ని ఫొటోలు, సెల్ఫీలు తీసుకుని సందడి వాతావారణాన్ని తెచ్చారు. స్కూల్‌కు 27 లక్షలు సాయం నేను ఈ స్కూల్లోనే చదివాను. 50 ఏళ్ల తర్వాత మేం కలిసిన ఈ సుభ సందర్భాన నా వంతుగా స్కూల్‌కు రూ.27లక్షలు డిపాజిట్ చేస్తున్నాను. దీనిలో రూ.18లక్షలు ఇక్కడ స్కూల్లో ఉన్న పేద విద్యార్థుల చదువు నిమిత్తం, రూ.9 లక్షలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం వినియోగిస్తాం. – డి.జయంత్, 1972 స్టూడెంట్ నా బాధలు పోయాయి కల్లా కపటం లేకుండా ఉండి నేడు ఉన్నత స్థానాలకు ఎదిగిన మీరంతా ఒకే వేదికపైకి రావడం ఆనందంగా ఉంది. ఈ వేదికపై 50 ఏళ్ల క్రితం మీకు పాఠాలు చెప్పిన మమ్మల్ని ఆహ్వానించడం అభినందించదగ్గ విషయం. ఈ వయసులో ఎన్నో బాధలు, సమస్యలతో సతమతం అవుతున్న మాకు మిమ్మల్ని చూడగానే బాధలన్నీ పోయాయి. – మారెడ్డి, తెలుగు టీచర్ -
Hyderabad: మూడేళ్లుగా చెల్లెలిపైనే అఘాయిత్యం..
సాక్షి, హైదరాబాద్: చెల్లెలిపైనే అఘాయిత్యానికి పాల్పడ్డ దారుణం నగరంలో వెలుగు చూసింది. నారాయణగూడ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నేపాల్‌కు చెందిన కుటుంబం హిమాయత్‌నగర్‌లో స్థిరపడింది. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. 2019లో బాలిక వయస్సు 16 సంవత్సరాలు. ఇంట్లో ఎవరూ లేనప్పుడు రోహన్ నాయుడు తన చెల్లెలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం తల్లిదండ్రులకు చెబితే వారూ పట్టించుకోలేదు. దీనిని అసరగా తీసుకున్న రోహన్ నాయుడు చెల్లిని భయపెడుతూ అప్పటి నుంచి ఈ ఏడాది జూన్ వరకు లైంగిక దాడిచేశాడు. ఇదిలా ఉండగా జూన్‌లో బాధితురాలు నేపాల్‌కు వెళ్లి వచ్చింది. తిరిగి వచ్చి ఓ హాస్టల్లో ఉంటోంది. అయినా ఆమెను ఫోన్‌చేస్తూ వేధిస్తున్నాడు. దీంతో బాధితురాలు ఆగస్టు 30న నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రోహన్‌నాయుడుపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు. చదవండి: గుజరాత్లో కారు బీభత్సం.. ఆరుగురు మృతి -
Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
Sree Lakshmi Reddy: Social Worker Mobile Counselling In Hyderabad: ‘పని చేసే చేతికి తీరిక ఉండదు... పని చేయని మనిషికి పని కనిపించదు’ ఈ నానుడిని నిజం చేస్తోంది లక్ష్మక్క. సామాజిక కార్యకర్తగా దశాబ్దాల సేవ ఆమెది. కష్టంలో ఉన్న మహిళలకు సహాయం చేయడానికి ఇప్పుడామె... స్వయంగా కదలి వెళ్తోంది. ‘శ్రీలక్ష్మి స్కూల్ ఆఫ్ సోషల్ వర్క్’ తో 1997లో మొదలైన శ్రీలక్ష్మిరెడ్డి సోషల్ సర్వీస్ మొబైల్ ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్ రూపంలో విస్తరించింది. ఇన్నాళ్లూ ఆమె హైదరాబాద్, హిమాయత్ నగర్లో ఆఫీస్‌లో ఉండి, వచ్చిన వాళ్లకు ఉచితంగా సర్వీస్ ఇచ్చారు, స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్లు తమ కాళ్ల మీద తాము నిలబడే వరకు చేయూత అయ్యారు. కొంతమంది ఆమె ఫోన్ నంబరు తెలుసుకుని ఫోన్ చేస్తారు. తమ కష్టమంతా చెప్పుకుంటారు. వాళ్లలో తాము నివసించే కాలనీ దాటి శ్రీలక్ష్మి దగ్గరకు రావడం కూడా చేతకాని అమాయకులు, దారి ఖర్చులకు డబ్బులు లేని వాళ్లు ఎందరో! ‘వాళ్లను అలా వదిలేస్తే నేను ఇస్తున్న సర్వీస్‌కి పరిపూర్ణత ఎలా వస్తుంది?... అని చాలా సార్లు అనిపించేది. అందుకే మా అమ్మ ఆరవ వర్థంతి సందర్భం గా నవంబర్ 26వ తేదీన ‘అల్లారెడ్డి కమలమ్మ – వెంకు రెడ్డి మొబైల్ ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్’ పేరుతో సంచార కుటుంబ సలహా కేంద్రాన్ని ప్రారంభించాను’ అని చెప్పారు శ్రీలక్ష్మి. పెళ్లికి ముందే కౌన్సెలింగ్! ‘‘కలహాలు లేని కాపురం ఉండబోదు. కలహం వస్తే విడిపోవడమే పరిష్కారం కాదు. చక్కదిద్దుకోవడానికి ఉన్న అన్ని దారులనూ అన్వేషించాలి. కలిసి ఉండడానికి అన్ని ప్రయత్నాలూ చేయాలి. విడిపోవడం అనేది విధిలేని పరిస్థితుల్లో చివరి ఎంపిక కావాలి తప్ప తొలి ఎంపిక కాకూడదు... అని సమాధాన పరచాల్సి వస్తోంది. అలాగే భార్యాభర్తల మధ్య వివాదాలకు రూట్కాజ్కు వైద్యం చేయాలనుకుని, ప్రీ మ్యారిటల్ కౌన్సెలింగ్ కూడా మొదలుపెట్టాను. పెళ్లయిన తర్వాత భార్యగా నీ బాధ్యతలను మర్చిపోకూడదు, అలాగే భర్తగా అతడి బాధ్యతల గురించి హెచ్చరించగలగాలి... అని అమ్మాయిలకు పాఠంలా చెప్పాల్సి వస్తోంది. ఇంట్లో పెద్దవాళ్లకు ఇవన్నీ చెప్పే తీరిక ఉండడం లేదు. అలాగే ఇంట్లో వాళ్లు అన్నింటినీ చెప్పలేరు కూడా. అందుకే ఆ బాధ్యతను నేను తీసుకున్నాను’’ అని చెప్పారు శ్రీలక్ష్మి. నేర్చుకున్నాను... నేర్పిస్తున్నాను! ‘మహిళలు స్వయం సమృద్ధి సాధించాలంటే వాళ్లకు ఏదో ఒక పనిలో నైపుణ్యం ఉండాలి. ఆ నైపుణ్యం వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఫినాయిల్ తయారీ నుంచి, ఫ్యాషన్ డిజైనింగ్ వరకు పాతిక రకాలలో శిక్షణ తీసుకున్నాను. మహిళలకు స్కిల్ ట్రైనింగ్ ఇస్తున్నాను’ అని కూడా చెప్పారామె. ఫ్యామిలీ కౌన్సెలింగ్ గదికి పక్కనే ఉన్న మరో గదిలో మహిళలకు జాక్ మెషీన్ల మీద ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసులు జరుగుతున్నాయి. వారిలో ఓ యువతి తన రెండేళ్ల బిడ్డను ఒక సోఫాలో పడుకోబెట్టి తాను పని నేర్చుకుంటోంది. అమ్మ వంటి అక్క ఉంది మొబైల్ కౌన్సెలింగ్ కోసం హైదరాబాద్‌లో చార్మినార్, దోమల్‌గూడ, నారాయణగూడ వెళ్లాను. సమస్యలకు దగ్గరగా వెళ్లినకొద్దీ ఇలాంటి సర్వీస్ ఎంత అవసరం ఉందో అర్థమవుతోంది. నేను ఒక్కదాన్ని ఎంత చేసినా నూరోవంతు కూడా పూర్తికాదు. నాకిప్పుడు యాభై ఆరేళ్లు. నేను సర్వీస్ నుంచి రిటైర్ అయ్యే లోపు నాలాగ ఉచితంగా సర్వీస్ ఇచ్చే మరికొందరిని తయారు చేస్తాను. నాకు రామకృష్ణ మఠంలో అలవడిన సమాజసేవ ఇది. కుటుంబ బంధాలు పటిష్టంగా ఉంటే సమాజం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందని నమ్మే స్కూల్లో శిక్షణ పొందాను. అందుకే నా సర్వీస్ అంతా కుటుంబ బంధాలను పటిష్టం చేయడం కోసమే సాగుతుంది. – శ్రీలక్ష్మి రెడ్డి, సామాజిక కార్యకర్త చదవండి: Yamini Mazumdar: ఇంటిని తాకట్టు పెట్టి ఆ డబ్బుతో బెంగళూరులో లాండ్రీ వ్యాపారం చేస్తూ.. -
నెల రోజుల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగిని పెళ్లి.. కాబోయే భర్తను కలిసేందుకు వెళ్తుండగా..
సాక్షి, హిమాయత్‌నగర్: డ్యూటీ ముగించుకుని ఇంటికొచ్చి మరో ఐదు నిమిషాల్లో మళ్లీ వస్తానంటూ చెప్పి బయటకు వచ్చిన యువతి అనంతలోకాలకు వెళ్లిపోయింది. శుక్రవారం రాత్రి నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని కింగ్ కోఠి ఈడెన్ గార్డెన్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనం నడిపిస్తున్న యువతి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది. పోలీసుల సమాచారం మేరకు ఇందుకు సబంధించిన వివరాలిలా ఉన్నాయి. చదవండి: జగిత్యాల: వరద కాల్వలోకి దూకి తల్లి కుమార్తెల ఆత్మహత్య డీఆర్డీఏ పరివార్ ప్రాంతంలో నివాసం ఉండే నిధా రెహమాన్(34) అబిడ్స్‌లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. శుక్రవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్లింది. వెంటనే మరో ఐదు నిమిషాల్లో వస్తా అని ఇంట్లోని తల్లిదండ్రులకు చెప్పి.. యూసఫ్‌గూడలో ఉండే కాబోయే భర్త పఠాన్ షవాజ్ నవాబ్‌ఖాన్‌ను కలిసేందుకు ద్విచక్ర వాహనంపై బయలుదేరింది. కింగ్ కోఠి ఈడెన్ గార్డెన్ రోడ్డులో తన ముందు వేగంగా వెళ్తున్న ఓ లారీని తప్పించబోయే క్రమంలో బైక్ స్కిడ్ అయ్యింది. చదవండి: పెళ్లికి నిరాకరణ.. యువకుడిపై వివాహిత యాసిడ్ దాడి వెనుకే వస్తున్న వాటర్ ట్యాంకర్ వెనక చక్రాల కింద పడటంతో.. తలభాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యింది. యువతిని గుర్తించలేని విధంగా రోడ్డుపై పడి ఉండటంతో స్థానికులు నారాయణగూడ పోలీసులకు సమచారం ఇచ్చారు. నైట్ డ్యూటీలో ఉన్న ఎస్ఐ కొండపల్లి నాగరాజు సంఘటన స్థలానికి చేరుకుని అంబులెన్స్ సాయంతో యువతి మృతుదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. శనివారం పోస్టుమార్టం అనంతరం మృతుదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. నెల రోజుల్లో పెళ్లి... యూసఫ్‌గూడలో నివాసం ఉండే పఠాన్ షవాజ్ నవాబ్ఖాన్ మృతురాలు ప్రేమలో ఉన్నారు. ఇటీవల రెండు కుటుంబాల వారు వివాహానికి కూడా ఒప్పుకున్నారు. మరో నెల రోజుల్లో వివాహం కూడా ఉంది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి నవాబ్‌ఖాన్‌ను కలిసేందుకు వెళ్తున్న సమయంలోనే ఇంతటి ఘోరం జరిగిందని నవాబ్ఖాన్ తెలిపారు. -
నాకిక ఓపిక లేదు..
హిమాయత్‌నగర్: నాకేదో చెప్పాలనిపిస్తోంది.. చెప్పలేకపోతున్నా. మమ్మీ, డాడీ క్షమించండి ఇలా చెప్పకుండా చేస్తున్నందుకు.. నాకు ఏమీ అవసరం లేదు. నాకిక ఓపిక లేదు.. యాసిడ్ అటాక్ ఫేస్ చేశా.. రేప్ ఇష్యూ ఫేస్ చేశా.. పబ్లిక్ నుంచి వచ్చే కామెంట్స్ ఫేస్ చేశా.. మా అమ్మకు అందరూ కాల్స్ చేస్తున్నారు. నాకు అవసరం లేదు. ఇన్ని డేస్ నాకు జరిగిన ఘనకార్యాలు, పురస్కారాలు చాలు. నేను నిజంగా చనిపోవాలి అనుకుంటున్నా’అంటూ ఇన్‌స్టా లైవ్‌లో ఆత్మహత్యకు ప్రయత్నించింది మిస్ తెలంగాణ–2018 విన్నర్ హాసిని. నిమిషాల వ్యవధిలో చేరుకున్న పోలీసులు కృష్ణా జిల్లాకు చెందిన కాలక నాగభవాని అలియాస్ హసిని ఆరేళ్ల కింద హైదరాబాద్ వచ్చింది. చిన్నతనం నుంచి మోడలింగ్ అంటే చాలా ఇష్టం. ఇటీవల హాసిని హిమాయత్‌నగర్‌లోని ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటోంది. బుధవారం రాత్రి ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ ప్రారంభించకముందే తన స్నేహితుడుకి తాను చనిపోతున్న విషయాన్ని ఫోన్లో తెలిపింది. ఫ్లాట్ తలుపులు తెరిచి ఉంచి బెడ్రూంలోని తన చున్నీతో ఫ్యాన్‌కు ముడి వేసింది. చిన్న స్టూల్ వేసుకుని ఏడుస్తూ తన ఇన్‌స్టా ఐడీలో లైవ్‌లో మాట్లాడుతూ ఆత్మహత్యకు యత్నించింది. ఈ లోపు జగిత్యాలలో నివాసం ఉండే హాసిని ఫ్రెండ్ షన్నూ డయల్ 100కు ఫోన్ చేసి వివరాలు చెప్పి అడ్రస్ తెలిపాడు. బుధవారం రాత్రి జాయింట్ సీపీ, నార్త్‌జోన్ డీసీపీ రమేశ్‌రెడ్డి సమాచారం అందుకున్నారు. వెంటనే నారాయణగూడ పోలీసులకు చెప్పడంతో వారు హుటాహుటిన అపార్ట్‌మెంట్‌కు చేరుకున్నారు. అప్పటికే స్పృహ కోల్పోయి ఉన్న హాసినిని హైదర్‌గూడ అపోలో ఆసుపత్రికి తరలిం చి చికిత్స అందించారు. ఆరోగ్య పరిస్థితి బాగానే ఉండటంతో ఉదయం ఆమె తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లారు. -
నాకిక ఓపిక లేదు.. ఆత్మహత్యాయత్నం చేసిన మాజీ మిస్ తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: నాకేదో చెప్పాలనిపిస్తోంది.. చెప్పలేకపోతున్నా. మమ్మీ, డాడీ క్షమించండి ఇలా చెప్పకుండా చేస్తున్నందుకు.. నాకు ఏమీ అవసరం లేదు. నాకిక ఓపిక లేదు.. యాసిడ్ అటాక్ ఫేస్ చేశా.. రేప్ ఇష్యూ ఫేస్ చేశా.. పబ్లిక్ నుంచి వచ్చే కామెంట్స్ ఫేస్ చేశా.. మా అమ్మకు అందరూ కాల్స్ చేస్తున్నారు. నాకు అవసరం లేదు. ఇన్ని డేస్ నాకు జరిగిన ఘనకార్యాలు, పురస్కారాలు చాలు. నేను నిజంగా చనిపోవాలి అనుకుంటున్నా’అంటూ ఇన్‌స్టా లైవ్‌లో ఆత్మహత్యకు ప్రయత్నించింది మిస్ తెలంగాణ–2018 విన్నర్ హాసిని. చదవండి: కడతేర్చి.. కట్టుకథ చెప్పాడు.. చివర్లో బండారం ఇలా బయటపడింది నిమిషాల వ్యవధిలో చేరుకున్న పోలీసులు కృష్ణా జిల్లాకు చెందిన కాలక నాగభవాని అలియాస్ హసిని ఆరేళ్ల కింద హైదరాబాద్ వచ్చింది. చిన్నతనం నుంచి మోడలింగ్ అంటే చాలా ఇష్టం. ఇటీవల హాసిని హిమాయత్‌నగర్‌లోని ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటోంది. బుధవారం రాత్రి ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ ప్రారంభించకముందే తన స్నేహితుడుకి తాను చనిపోతున్న విషయాన్ని ఫోన్లో తెలిపింది. ఫ్లాట్ తలుపులు తెరిచి ఉంచి బెడ్రూంలోని తన చున్నీతో ఫ్యాన్‌కు ముడి వేసింది. చిన్న స్టూల్ వేసుకుని ఏడుస్తూ తన ఇన్‌స్టా ఐడీలో లైవ్‌లో మాట్లాడుతూ ఆత్మహత్యకు యత్నించింది. ఈ లోపు జగిత్యాలలో నివాసం ఉండే హాసిని ఫ్రెండ్ షన్నూ డయల్ 100కు ఫోన్ చేసి వివరాలు చెప్పి అడ్రస్ తెలిపాడు. బుధవారం రాత్రి జాయింట్ సీపీ, నార్త్‌జోన్ డీసీపీ రమేశ్‌రెడ్డి సమాచారం అందుకున్నారు. వెంటనే నారాయణగూడ పోలీసులకు చెప్పడంతో వారు హుటాహుటిన అపార్ట్‌మెంట్‌కు చేరుకున్నారు. అప్పటికే స్పృహ కోల్పోయి ఉన్న హాసినిని హైదర్‌గూడ అపోలో ఆసుపత్రికి తరలిం చి చికిత్స అందించారు. ఆరోగ్య పరిస్థితి బాగానే ఉండటంతో ఉదయం ఆమె తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లారు. -
బిట్ కాయిన్స్ పేరుతో రూ.60 లక్షలు స్వాహా
హిమాయత్‌నగర్: ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగులైన భార్యాభర్తలను టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు బిట్ కాయిన్స్‌గా పిలిచే క్రిప్టోకరెన్సీలో పెట్టుబడి పేరుతో రూ.60 లక్షలు కాజేశారు. బాధితులు శుక్రవారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. అమీర్‌పేటకు చెందిన వంశీమోహన్ దంపతులు ‘జిప్‌బిట్’ యాప్ ద్వారా బిట్ కాయిన్స్ క్రయవిక్రయాలు చేస్తుంటారు. దీని ద్వారానే పరిచయమైన ఓ వ్యక్తి తన ద్వారా పెట్టబడిపెడితే అధిక లాభాలు వచ్చేలా చేస్తానని ఎర వేశాడు. ఇద్దరూ కలిసి అతడి ద్వారా రూ.10 లక్షల ఇన్వెస్ట్ చేశారు. ప్రపంచ మార్కెట్లో బిట్ కాయిన్ విలువ పెరుగుతున్నప్పటికీ... వీరి కాయిన్స్ వివరాలు తెలియట్లేదు.దీంతో అనుమానం వచ్చి ఆ వ్యక్తిని మరోసారి సంప్రదించగా, మీ కాయిన్లు భద్రమని, ప్రస్తుత పరిస్థితుల్లో రూ.50 లక్షలకు పైగా వెచ్చించి కాయిన్స్ ఖరీదు చేస్తేనే అధిక లాభాలు వస్తాయని నమ్మబలికాడు. దీంతో వారు అతడు చెప్పిన మొత్తం ఇన్వెస్ట్ చేశారు. ఇందులో కొంత జిప్‌బిట్ యాప్ ద్వారా, మిగిలింది ముంబై, పూణే నగరాలకు చెందిన పలు బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేశారు. లాభాలు రాకపోవడంతో సదరు వ్యక్తితో చాటింగ్ చేయగా, కచ్చితంగా లాభం వచ్చిందని, ఆన్లైన్లో కాయిన్ వాల్యూ చూసుకోవాలని సూచించాడు. ఆ తర్వాత అతడి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో మోసపోయామని గ్రహించి శుక్రవారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. చదవండి: దారుణం: తుపాకీ గురిపెట్టి లైంగిక వేధింపులు -
రూ. 300 కోసం.. రూ.1.90 లక్షలు పోగొట్టుకున్న యువతి
హిమాయత్‌నగర్: తనకు రావాల్సిన రూ.300 కోసం కొరియర్ సంస్థకు ఫిర్యాదు చేసిందో యువతి. ఇదే అదునుగా భావించిన సదరు సంస్థ ప్రతినిధి యువతి వద్ద నుంచి రెండు దఫాలుగా రూ.1.90లక్షలు కాజేసి ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. దీంతో బంజారాహిల్స్‌కు చెందిన ఉషారాణి శనివారం సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే... ఉషారాణి ఆన్లైన్లో ఒక ఐటెమ్ బుక్ చేసింది. ఐటెంకు సంబంధించిన డబ్బు ఇచ్చాక, కొరియర్ బాయ్ తిరిగి ఇవ్వాల్సిన రూ.300 ఇవ్వకుండా వెళ్లిపోయాడు. ఫోన్ చేసినా స్పందించకపోవడంతో సదరు సంస్థ కస్టమర్ కేర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేసింది. సంస్థకు చెందిన ఓ వ్యక్తి ఉషారాణికి ఒక అప్లికేషన్‌ను పంపి దానిని ఫిల్ చేసి తమకు ఆన్లైన్ ద్వారా పంపితే మీ డబ్బులు మీకు వస్తాయన్నారు. అతను చెప్పినట్టు చేయగా... రూ.300 రాకపోగా ఆమె అకౌంట్ నుంచి తొలుత రూ.91వేలు కట్ అయ్యాయి. ఎందుకు ఇలా జరిగిందని మరోమారు అతనికి ఫోన్ చేయగా..మీరు తప్పుగా ఎంట్రీ చేశారు మళ్లీ ఫిల్ చేసి పంపండి.. ఇంకో అకౌంట్ నంబర్ ఇవ్వండన్నాడు. మరోసారి కూడా అలాగే పంపంగా, ఆ అకౌంట్ నుంచి కూడా రూ.99వేలు కాజేశాడు. చదవండి: దారుణం: అడ్డుగా ఉందని చంపేశాడు -
Himayat Nagar: బయటకు వస్తే చంపేస్తా..!
హిమాయత్‌నగర్: ‘లాక్డౌన్ అమల్లో ఉంది. నువ్వు కానీ బయటకు వచ్చినట్లు తెలిసినా, బయట కనిపించినా చంపేస్తాను’ అంటూ ఓ యువతిని వేధిస్తున్నాడో అనామకుడు. పదే పదే వస్తున్న మేసేజ్‌లను భరించలేని బంజారాహిల్స్‌కు చెందిన ఆమె బుధవారం సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. గుర్తు తెలియని వ్యక్తి ఫేస్బుక్ మెసెంజర్ నుంచి కొద్ది రోజులుగా మెసేజ్‌లు చేస్తున్నాడు. లాక్డౌన్లో నువ్వు ఇంట్లోనే కూర్చోవాలి. బయటకు అస్సలు రావొద్దు. నేను చెప్పింది వినకుండా నువ్వు బయటకు వచ్చినట్లు తెలిసినా, నేను నిన్ను బయట చూసినా చంపేస్తానంటూ బెదిరింపులకు దిగుతున్నాడు. ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు మెసేజ్‌లు చేస్తున్నాడనే విషయాలు మాత్రం తనకు తెలియదని యువతి తెలిపింది. ఏ కారణం చేత తనకు మెసేజ్‌లు చేస్తూ చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడో తనకు అర్థం కావట్లేదని, చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. చదవండి: లోన్‌యాప్స్ కేసులో కొత్త ట్విస్ట్ -
మొన్ననే నవ్వుతూ.. అంతలోనే ఏడిపిస్తూ..!
సాక్షి, హిమాయత్‌నగర్: మరణపు అంచుల వరకు వెళ్లిన అభాగ్యురాలికి అన్నీ తామై కింగ్‌కోఠి వైద్య బృందం బతికించారు. నాలుగు రోజులు గడిచేలోపు నవ్వుతూ కనిపించిన ఆ యువతి విగతజీవిగా మారింది. అభాగ్యురాలు ఉన్నట్టుండి సోమవారం కన్ను మూయడంతో ఇటు వైద్యబృందం, అటు తోటి రోగులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. కొద్దిరోజుల క్రితం గాయాలతో రోడ్లపై సంచరిస్తున్న యువతి(25)ని ఎల్బీనగర్ పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి పంపారు. ఉస్మానియా వారు ఈ నెల 12న కింగ్‌కోఠికి పంపారు. ఒళ్లంతా వికారంగా ఉండటంతో.. ఆమెకు వైద్యం చేసేందుకు సిబ్బంది కూడా వెనకడుగు వేశారు. దీంతో అడిషినల్ సూపరింటెండెంట్ జలజ వెరోనికా ప్రత్యేంగా శ్రద్థ తీసుకుని సిబ్బందితో చికిత్స అందించి, యువతిని శుభ్రంగా చేశారు. కోవిడ్ ర్యాపిడ్ టెస్ట్ చేయగా నెగిటివ్ వచ్చింది. మళ్లీ పరీక్షలో పాజిటివ్ వచ్చి అనంత లోకాలకు.. ‘అభాగ్యురాలికి అన్నీ తానై’ అనే శీర్షికతో ఈనెల 24న ‘సాక్షి’ కథనాన్ని ప్రచురించగా.. పాఠకులు, నెటిజన్లు కింగ్‌కోఠి వైద్యులు, సిబ్బందిని సోషల్ మీడియాలో ప్రశంసించారు. రెండ్రోజుల క్రితం యువతికి ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయగా.. కోవిడ్ పాజిటివ్ వచ్చింది. వెంటనే చికిత్సను కూడా ప్రారంభించారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో యువతి మృతిచెందింది. దీంతో ఇటు సిబ్బంది, అటు తోటి రోగులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. యువతి మృతదేహాన్ని తీసుకెళ్లమని ఎల్బీనగర్ పోలీసులకు నారాయణగూడ పోలీసులు సమాచారం ఇచ్చారు. సుమారు 3 గంటలైనా వారు రాకపోవడంతో వార్డులో నుంచి మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. చదవండి: అభాగ్యురాలికి అన్నీ తానై.. డాక్టర్ ఔదార్యం -
సరైన దుస్తులు లేవు, ఒంటిపై గాయాలు: యువతిని ఆదుకున్న డాక్టర్
సాక్షి, హిమాయత్‌నగర్: తల్లిదండ్రులు లేరు. అయిన వాళ్లెవరో కూడా తెలీదు. కొద్దిరోజుల క్రితం నగరంలోని పలు రోడ్లపై తిరుగుతూ అపస్మారక స్థితికి చేరుకోవడంతో.. ఓ యువతి(25)ని అక్కడి స్థానికులు ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. ఆ తర్వాత ఉస్మానియా వైద్యులు కింగ్‌కోఠి హాస్పిటల్‌కు పంపారు. ఈ నెల 12న యువతిని కింగ్‌కోఠి హాస్పిటల్‌కు తీసుకురాగా.. ఒంటిపై గాయాలు, ఒంటిపై బట్టలు కూడా సరిగ్గా లేవు. ఆమె వద్దకు వెళ్లాలంటేనే సిబ్బంది హడలెత్తారు. ఓ పక్క కోవిడ్ వార్డులోని బెడ్‌పై పడుకోబెడితే అక్కడున్న వారు ఇక్కడ వద్దంటూ ఆందోళన చేస్తున్నారు. దీంతో యువతిని అక్కున చేర్చుకున్న ఆస్పత్రి అడిషినల్ సూపరింటెండెంట్ డాక్టర్ జలజ వెరోనికా తన సిబ్బంది సాయంతో యువతికి వైద్యం అందించి శుభ్రంగా తీర్చిదిద్దారు. అనంతరం రెండుసార్లు కోవిడ్ టెస్టు చేయగా.. నెగిటివ్ వచ్చింది. యువతికి ఎవరూ లేకపోవడంతో ఆమె స్వచ్ఛంద సంస్థల వారికి అప్పగించే యత్నంలో డాక్టర్ జలజ వెరోనికా ఉన్నారు. అభాగ్యురాలికి అండగా నిలిచిన డాక్టర్ జలజ వెరోనికా, సిబ్బంది, కోవిడ్ ఇన్చార్జి డాక్టర్ మల్లిఖార్జున్ తదితరులను ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. -
దారుణం: బస్సు కింద పడి గర్భిణి మృతి
సాక్షి, హిమాయత్‌నగర్ (హైదరాబాద్): బస్సు డ్రైవర్ నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైంది. ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తున్న దంపతుల్ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో దంపతులిద్దరూ తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేరగా...భార్య ఐసీయూలో చికిత్స పొందుతూ మృతి చెందింది. బుధవారం హిమాయత్‌నగర్ వై జంక్షన్ వద్ద జరిగిన ఈ ప్రమాదం ఘటన వివరాలిలా ఉన్నాయి. ముషీరాబాద్ కుమ్మరిబస్తీకి చెందిన సతీశ్‌గౌడ్, భార్య షాలిని దంపతులు కాగా, షాలిని రెండు నెలల గర్భిణి. ఉదయం భార్యాభర్తలిద్దరూ హైదర్‌గూడ ఫెర్నాండెజ్ ఆస్పత్రికి రెగ్యులర్ చెకప్ కోసం వెళ్లి తిరిగి ఇంటికి వచ్చేస్తుండగా ...అదే సమయంలో ముషీరాబాద్ డిపోకు చెందిన ఏపీ28జెడ్0017 నంబర్ గల బస్సు కోఠి నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తుంది. ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన బస్సు హిమాయత్‌నగర్ వై జంక్షన్ వద్ద వేగంగా వస్తూ కుడివైపు బైక్‌పై వెళ్తున్న ఇద్దరు దంపతులను ఢీకొట్టింది. దీంతో ఇద్దరూ అదుపుతప్పి కిందపడ్డారు. బసు వెనుక భాగం చక్రాల్లో పడిపోయిన షాలినికి కాలి తొడ భాగం, ఛాతీ భాగాలు నుజ్జు అయ్యాయి. వెంటనే అక్కడ విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ మల్లేశ్ ఓ అంబులెన్స్ సాయంతో హైదర్‌గూడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా..ఐసీయూలో చికిత్సపొందుతూ మృతి చెందింది. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా బస్సు నడిపిన మహబూబ్‌నగ్ జిల్లా ఫరీద్పూర్ గ్రామానికి చెందిన డ్రైవర్ కమలన్నని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమ్మ ఏదని అడిగితే ఏం చెప్పాలి? షాలిని, సతీశ్‌లకు రెండేళ్ల కుమార్తె ఉంది. ప్రమాదం విషయంపై షాలిని భర్త సతీశ్‌ని ‘సాక్షి’ఫోన్ ద్వారా సంప్రదించగా.. ‘నా భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. షాలిని లేకుండా ఇంటికి వెళ్తే నా రెండేళ్ల బంగారం(కూతురు) అమ్మ ఏది అని అడిగితే నేనేం సమాధానం చెప్పాలి?’అంటూ రోదిస్తున్నాడు. చదవండి: (సహజీవనం చేస్తూ ‘రిచ్’గా బిల్డప్.. పక్కాగా చీటింగ్) -
దంత వైద్యుడి కిడ్నాప్.. భగ్నం చేసిన పోలీసులు
సాక్షి, అమరావతి/రాప్తాడు (అనంతపురం జిల్లా): హైదరాబాద్‌కు చెందిన దంత వైద్యుడిని కిడ్నాప్ చేసి బెంగళూరుకు తరలిస్తుండగా అనంతపురం పోలీసులు భగ్నం చేశారు. వైద్యుడిని రక్షించి ఓ కిడ్నాపర్‌ను అదుపులోకి తీసుకోగా.. మరో ముగ్గురు పరారయ్యారు. బుధవారం వేకువజామున సినీ ఫక్కీలో జరిగిన ఈ ఉదంతానికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ పాతబస్తీలోని హిమాయత్ నగర్ దర్గా సమీపంలో క్లినిక్ నిర్వహిస్తున్న డాక్టర్ బెహజాట్ హుస్సేన్‌ను బురఖాలు ధరించిన వ్యక్తులు మంగళవారం మధ్యాహ్నం కిడ్నాప్ చేశారు. అతడి కుటుంబీకులకు ఫోన్ చేసి రూ.10 కోట్లు డిమాండ్ చేయగా.. వారు హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి, సైబరాబాద్ సీపీ సజ్జనార్ సీసీ ఫుటేజీలను పరిశీలించి కారు అనంత వైపు వెళ్తున్నట్టు నిర్ధారించుకున్నారు. కర్నూలు, అనంతపురం ఎస్పీలకు సమాచారం అందించి కిడ్నాప్‌ను ఛేదించాల్సిందిగా కోరారు. కిడ్నాపర్ల ఆట కట్టించిన ‘అనంత’ పోలీసులు రంగంలోకి దిగిన అనంతపురం ఎస్పీ సత్యయేసుబాబు మంగళవారం సాయంత్రం నుంచి జిల్లా వ్యాప్తంగా ముమ్మర తనిఖీలకు ఆదేశించారు. బుధవారం వేకువజామున అనంతపురంలోని తపోవనం వద్ద జాతీయ రహదారిపై వెళ్తున్న బొలెరో వాహనాన్ని పోలీసులు నిలువరించే ప్రయత్నం చేయగా.. కిడ్నాపర్లు అతి వేగంగా బెంగళూరు వైపు పోనిచ్చారు. దీంతో అక్కడి పోలీసులు రాప్తాడు పోలీసులను అప్రమత్తం చేశారు. ఇటుకులపల్లి సీఐ విజయభాస్కర్‌గౌడ్, రాప్తాడు ఎస్ఐ పీవై ఆంజనేయులు రాప్తాడు మండలంలోని ప్రసన్నాయపల్లి వద్ద డాల్ఫిన్ హోటల్ సమీపంలో జాతీయ రహదారి దగ్గర కాపుగాశారు. దీనిని గమనించిన కిడ్నాపర్లు కుడి వైపు మలుపు తీసుకుని కారును బుక్కచెర్ల వైపునకు మళ్లించారు. వెంటనే పోలీసులు కిడ్నాపర్ల కారును వెంబడించారు. ఎస్ఐ ఆంజనేయులు అయ్యవారిపల్లి, బుక్కచెర్ల, జి.కొత్తపల్లి, గాండ్లపర్తి గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. బుక్కచెర్ల గ్రామంలోకి కారు రాకుండా గ్రామస్తులు రాళ్లు, ముళ్ల కంపల్ని అడ్డుగా పెట్టగా.. కిడ్నాపర్లకు దారి తెలియక బుక్కచెర్ల చెరువు వైపు వెళ్లారు. అక్కడి నుంచి ముందుకు దారి లేకపోవడంతో కారును అక్కడే వదిలేసి పారిపోయారు. కిడ్నాపర్లను వెంబడిస్తూ వచ్చిన పోలీసులు వారిలో ఒకర్ని అదుపులోకి తీసుకోగా.. మిగిలిన నలుగురు పరారయ్యారు. పోలీసులు కారు దగ్గరికి వెళ్లి చూడగా డెంటిస్ట్ హుస్సేన్ కాళ్లు, చేతులు కట్టేసి ఉండటాన్ని గుర్తించారు. డాక్టర్‌ను రక్షించి కారును, అందులో ఉన్న ఓ రివాల్వర్, ఒక కత్తి, మత్తు మందు ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన కిడ్నాపర్లను కూడా పట్టుకునేందుకు పోలీస్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. డీజీపీ అభినందన అనంతపురం జిల్లా పోలీసులను ఏపీ డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ అభినందించారు. యంత్రాంగం సకాలంలో స్పందించి డెంటిస్ట్ కిడ్నాప్‌ను భగ్నం చేసి, కిడ్నాపర్ల ముఠాను పట్టుకోగలిగిందని ఆయన పేర్కొన్నారు. -
క‘రోనా’ పార్టీ: ఇద్దరు మంత్రులు హాజరు?
సాక్షి, హైదరాబాద్ : వనస్థలిపురం ఏ క్వార్టర్స్‌లో ఉండే కిరాణా వ్యాపారి ఏప్రిల్‌లో తన కుమార్తె బర్త్‌డే వేడుకలు నిర్వహించగా, దీనికి హాజరైన 28 మంది వైరస్ బారినపడ్డారు. అదే కుటుంబంలోని తండ్రి, కొడుకు మృతి చెందారు. మలక్‌పేటలోని ఓ అపార్ట్మెంట్లో ఉండే సాఫ్ట్వేర్ ఉద్యోగి మే నెలలో తన కుమార్తె పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. దీనికి హాజరైన పిల్లల ద్వారా అదే అపార్ట్మెంట్లోని 52 మందికి వైరస్ సోకింది. పçహాడీషరీప్‌కి చెందిన మటన్ వ్యాపారి భార్య తరపు బంధువులంతా మే మూడో వారంలో ఒకేచోట చేరారు. మూడు నాలుగు రోజుల పాటు ఒకే ఇంట్లో ఉండి, సామూహిక భోజనాలు, ఆటపాటలతో గడిపారు. ఈ ఘటనలో 30 మందికి కరోనా సోకింది. ఇంత జరుగుతున్నా కొందరు మారడం లేదు. ఆరోగ్యంపై అంతో ఇంతో అవగాహన ఉన్న వారు కూడా వేడుకల పేరుతో విందు వినోదాల్లో మునిగితేలుతున్నారు. తద్వారా పలువురికి వైరస్ సోకడంతో పాటు మరణాలూ చోటుచేసుకుంటున్నాయి. అందుకు ఈ తాజా ఉదంతమే నిదర్శనం. నగరంలోని ప్రముఖ బంగారు, వజ్రాల వ్యాపారి కుటుంబం హిమాయత్‌నగర్ స్ట్రీట్ నంబర్–5లో నివసిస్తోంది. వ్యాపారి 63వ పుట్టిన రోజు వేడుకలను జూన్ 22న కుటుంబసభ్యులు ఘనంగా నిర్వహించారు. ఇద్దరు మంత్రులు సహా పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జువెలరీ అసోసియేషన్‌కు చెందిన ప్రముఖులు.. దాదాపు 150 మంది వరకు హాజరయ్యారు. వీరంతా సామూహిక విందులో పాల్గొన్నారు. అనంతరం రెండ్రోజులకే వ్యాపారి దగ్గు, ఆయాసంతో బాధపడుతూ మాసబ్‌ట్యాంక్‌లోని ఓ ఆస్పత్రికి వెళ్లారు. తాత్కాలికంగా మందులు రాసి, ఎందుకైనా మంచిదని, కరోనా పరీక్ష చేయించుకోవాలని వైద్యులు సూచించారు. మందులు వేసుకున్నా దగ్గు, ఆయాసం తగ్గకపోవడంతో ఐదు రోజుల క్రితం సికింద్రాబాద్‌లోని ఓ ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రిలో చేరగా, ఆ మర్నాడే మృతి చెందారు. ఈ వేడుకలకు హాజరైన జువెలరీ అసోసియేషన్ ప్రతినిధి కూడా కరోనా బారినపడి ఐదు రోజుల క్రితం బంజారాహిల్స్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆ తర్వాత వేడుకలకు హాజరైన వారిలో 20 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణైంది. దీంతో ఈ పార్టీకి హాజరైన ఇతర ప్రముఖులంతా హడలెత్తుతున్నారు. వైద్యుల ట్రేసింగ్‌కు చిక్కకుండా.. వీరంతా మారుపేర్లతో పరీక్షలు చేయించుకుంటున్నట్లు తెలిసింది. -
సూసైడ్‌నోట్ రాసి ప్రియుడితో వెళ్లిపోయింది..
సాక్షి, కాచిగూడ: ‘నాన్నా నా శవాన్ని తీసుకెళ్లు’ అంటూ కొద్దిరోజుల క్రితం ఓ యువతి రాసిన సూసైడ్ నోట్ కలకలం రేపింది. దీంతో నారాయణగూడ పోలీసు కేసుని చాలెంజ్‌గా తీసుకుని యువతి ఆడింది నాటకమని తేల్చారు. నిజామాబాద్ జిల్లా నబీపేటకు విద్యార్థిని(19) హిమాయత్‌నగర్ గౌడ బాలికల హాస్టల్లో ఉంటూ కేశవ మెమోరియల్ డిగ్రీ కాలేజీలో డిగ్రీ చదువుతోంది. అదే గ్రామానికి చెందిన మణిరత్నం హిమాయత్‌నగర్ గౌడ బాయ్స్‌హాస్టల్‌లో ఉంటూ కేశవ మెమోరియల్ డిగ్రీ కాలేజీలోనే చదువుతున్నాడు. ఇద్దరూ ప్రేమించుకున్నారు. గత కొద్ది రోజులుగా వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోంది. దీంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇంట్లో ఒప్పుకోరనే నిర్ణయానికి వచ్చారు. కొద్దిరోజులు ఇక్కడ కనిపించకుండా వెళ్లిపోతే బాగుంటుందనే ఆలోచనతో గత నెల 27వ తేదీన ‘ నా శవాన్ని తీసుకెళ్లు నాన్న’ అంటూ తండ్రికి సూసైడ్ నోట్ రాసి హాస్టల్ నుంచి బయటకు వెళ్లిపోయింది. అదే హాస్టల్లో ఉంటున్న మణిరత్నం కూడా కనిపించకుండా పోయాడు. దీంతో విద్యార్థిని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుంటూరులో ప్రత్యక్షం... మణిరత్నంకు వరసకు బావమరిది అయ్యే వ్యక్తి గుంటూరులో ఉంటున్నాడు. వీరిద్దరూ ఇంటర్ సిటీ ట్రైన్లో గుంటూరు వెళ్లారు. మణిరత్నం బావమరిది దగ్గర ఉన్నారు. మరో మూడురోజులు దాటితే మణిరత్నం మేజర్ కానున్నాడు. వీరిద్దరి కాల్ లిస్ట్‌ని, సీసీ పుటేజీలను పోలీసులు పరీశిలించారు. ఎస్సై నారాయణ సిబ్బందితో కలిసి ఆదివారం గుంటూరులోని బిగ్‌బజార్ వద్ద సంచరిస్తున్న ఈ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. నేడు పోలీసులు వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. (చదవండి: ‘నాన్నా.. నా శవాన్ని తీసుకెళ్లండి’) -
నిమజ్జనానికి వద్దన్నారని.. గోవాకు వెళ్లాడు
సాక్షి, హైదరాబాద్: గణేశ్ నిమజ్జనానికి తల్లిదండ్రులు వెళ్లొద్దన్నందుకు ఓ మైనర్ బాలుడు ఇంట్లో చెప్పకుండా యాక్టివాపై గోవాకు వెళ్లిపోయాడు. పొద్దున్నే లేచి బెడ్రూమ్లో చూడగా కుమారుడు కనిపించడకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెంది బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో వెతికారు. ఆచూకీ లభించకపోవడంతో నారాయణగూడ పోలీసులను ఆశ్రయించారు. ఈ నెల 11వ తేదీ రాత్రి జరిగిన ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న నారాయణగూడ పోలీసులు ఛేదించారు. వివరాల్లోకి వెళితే.. నారాయణగూడ కేశవమెమోరియల్ కళాశాల సమీపంలో ఉండే రాజస్థాన్‌కు చెందిన కుటుంబం ఈ నెల 5న స్వరాష్ట్రం వెళ్లి తిరిగి 11వ తేదీన నగరానికి వచ్చారు. అదేరోజు రాత్రి వారి కొడుకు(16) ఉదయం నిమజ్జనానికి వెళ్తానని అడగ్గా అందుకు తల్లిదండ్రులు వద్దంటూ వారించారు. కాగా 12వ తేదీ తెల్లవారుజామున బాలుడు పాత యాక్టివాపై గోవాకు వెళ్లిపోయాడు. ఉదయం కొడుకు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు తమ కొడుకును ఎవరో కిడ్నాప్ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బాలుడికి ఏ ఫోన్ నుంచి కాల్ చేసినా లిఫ్ట్ చేయకపోగా.. ఆ నంబర్ని బ్లాక్‌లిస్టులో పెట్టసాగాడు. బెల్గాం వద్ద రెండు ముక్కలైన యాక్టివా ఈనెల 12వ తేదీ అర్ధరాత్రికి యాక్టివాపై ‘బెల్గాం’ చేరుకున్న బాలుడు అక్కడ పెద్ద గుంతలో పడ్డాడు. దీంతో యాక్టివా రెండు ముక్కలైంది. ఈ క్రమంలో అడ్మిన్ ఎస్సై కర్ణాకర్‌రెడ్డి సెల్‌ఫోన్ నంబర్ ఆధారంగా సిగ్నల్స్‌ని ట్రేస్ చేసి బాలుడు గోవా హైవేపై మహబూబ్‌నగర్ సమీపంలో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఎస్సై అక్కడి పోలీసులకు సమచారమివ్వగా అక్కడి పోలీసులకు దొరకలేదు. దాంతో పోలీసుల సలహా మేరకు బాలుడి తండ్రి గోవాకు వెళ్లగా బాలుడు ‘అంజునా’ బీచ్ దగ్గర ఓ రూమ్‌లో ఉన్నట్టు సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు తెలుసుకుని తండ్రికి సమాచారమిచ్చారు. దాంతో అక్కడ ఇద్దరూ కలుసుకోవడంతో కథ సుఖాంతమైయ్యింది. నారాయణగూడ ఎస్సై కర్ణాకర్‌రెడ్డి చొరవతో ‘కిడ్నాప్ కథ’ 24 గంటల్లో తేలిపోయింది. -
నగలు.. వగలు
-
దుస్తులు విప్పితేనే.. యాక్టింగ్ నేర్పిస్తా
హైదరాబాద్: యాక్టింగ్ నేర్పిస్తానని, సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని.. అందుకు ‘అన్ని విధాలుగా’సిద్ధంగా ఉండాలని ఓ యువతిపై వేధింపులకు పాల్పడ్డాడో యాక్టింగ్ ఇనిస్టిట్యూట్ నిర్వాహకుడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా వారూ తమకేమీ పట్టనట్లు వ్యవహరించారు. రెండు రోజుల క్రితం హిమయత్‌నగర్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన బాధితురాలు మీడియాను ఆశ్రయించడంతో బుధవారం వెలుగులోకి వచ్చింది. కవాడిగూడకు చెందిన అచ్నిత్ కౌర్‌కు యాక్టింగ్ అంటే ఇష్టం. నటనలో శిక్షణ పొందేందుకు హిమాయత్‌నగర్‌లోని ‘సూత్రధార్’ఇనిస్టిట్యూట్‌లో కొద్ది రోజుల క్రితం చేరింది. ఆ సంస్థ నిర్వాహకుడు వినయ్‌వర్మ 20 ఏళ్లుగా నటనలో శిక్షణ ఇస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 14న యువతులను లైన్లో నిలబెట్టి అందరూ దుస్తులు విప్పాలని వినయ్ ఆదేశించాడు. దీనికి అచ్నిత్ కౌర్ నిరాకరించింది. దుస్తులు విప్పితేనే యాక్టింగ్ నేర్పిస్తానంటూ అతను అసభ్యకరంగా మాట్లాడాడు. ఇలాంటి యాక్టింగ్ శిక్షణ తనకు అవసరం లేదంటూ ఆమె ఇనిస్టిట్యూట్ నుంచి బయటకు వచ్చి షీ టీమ్‌ను ఆశ్రయించింది. చుక్కలు చూపించిన పోలీసులు... తనకు జరిగిన అన్యాయాన్ని అచ్నిత్ కౌర్ షీ టీమ్‌కు వివరించగా.. నారాయణగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీంతో బాధితురాలు ఈ నెల 15న నారాయణగూడ పోలీసులను ఆశ్రయించి జరిగిన సంఘటనపై ఫిర్యాదు చేసినా స్పందించలేదు. మధ్యాహ్నం స్టేషన్‌కు వచ్చిన ఆమె నుంచి రాత్రి 8 గంటల వరకూ ఫిర్యాదు తీసుకోలేదు. తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు బాధితురాలు మీడియాకు వివరించింది. అచ్నిత్ కౌర్ మీడియా ముందుకు రావడంతో.. ఇదే ఇనిస్టిట్యూట్‌లో చేరిన మరికొంత మంది కూడా తమకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేసేందుకు వచ్చినట్లు సమాచారం. ఇన్నిరోజులు యాక్టింగ్‌పై ఉన్న అభిమానంతో మౌనంగా ఉన్నామని ఫోన్లో పోలీసులకు సమాచారం ఇస్తున్నారు. ఇప్పటిదాకా ఇక్కడ యాక్టింగ్ నేర్చుకున్న వారు పడిన ఇబ్బందులపై ఇన్స్పెక్టర్ రమేశ్‌కుమార్ వివరాలు సేకరిస్తున్నారు. అన్నింటికీ ఇష్టపడే వస్తున్నారు: వినయ్‌వర్మ ఈ ఘటనపై నిలదీసేందుకు సదరు ఇనిస్టిట్యూట్‌కు వెళ్లిన బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఛాయదేవి, సెన్సార్ బోర్డ్ సభ్యురాలు భారతికి వినయ్‌వర్మ షాకిచ్చాడు. ‘గత 20 ఏళ్లుగా ఇనిస్టిట్యూట్‌ని నడుపుతున్నాను. బట్టలిప్పాల్సిందేనని ముందే చెబుతా. అందుకు వారు అంగీకరించే వస్తారు. మీరెందుకు హడావుడి చేస్తున్నారు’అంటూ దబాయించాడు. ఈ ఇనిస్టిట్యూట్‌ని మూసివేయాలని, వినయ్వర్మని వెంటనే అరెస్ట్ చేయాలని ఛాయదేవి, భారతి డిమాండ్ చేశారు. మరింత విచారణ చేస్తున్నాం: అబిడ్స్ ఏసీపీ బిక్షంరెడ్డి వినయ్‌వర్మ వ్యవహారశైలిపై లోతుగా విచారణ జరుపుతున్నామని అబిడ్స్ ఏసీపీ బిక్షంరెడ్డి తెలిపారు. ఈ నెల 3 నుంచి ప్రారంభించిన శిక్షణలో ఏడుగురు యువకులు, ఇద్దరు యువతులు చేరినట్లు వివరించారు. 14న వీరందరినీ దుస్తులు విప్పి యాక్టింగ్ చేయండనడంతో అచ్నిత్ కౌర్ వ్యతిరేకించిందన్నారు. ఈ ఘటనపై ఆమె ఫిర్యాదు చేయడంతో వినయ్‌వర్మపై సెక్షన్ 509 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు. -
సీపీఐ ర్యాలీ: భారీగా ట్రాఫిక్ జామ్
హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో సోమవారం ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. హిమాయత్ నగర్ మగ్ధూమ్ భవన్, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, హైదర్ గూడ, బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ ప్రాంతాల్లో ఈ రోజు సీపీఐ ధర్నా చేపట్టింది, ఈ నేపధ్యంలోనే ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడిందని నగర ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. వాహనదారులు ప్రత్యామ్నాయం చూసుకోవాలిని కోరారు. -
హిమాయత్ నగర్‌లోని జువెల్లరీ షాపులో చోరీ
హైదరాబాద్ : హిమాయిత్ నగర్‌లోని ఓ జువెల్లరీ షాపులో గురువారం చోరీ జరిగింది. షాపులో పని చేసే వ్యక్తి ఆరు కిలోల బంగారంతో మహారాష్ట్రకు ఉడాయించాడు.దీంతో షాపు యజమాని నారాయణగూడ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
కాల్పుల కేసులో చంద్రకళ స్టేట్మెంట్
హైదరాబాద్ : హిమాయత్ నగర్ కాల్పుల కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో ఆత్మహత్యకు పాల్పడిన డాక్టర్ శశికుమార్ స్నేహితురాలు చంద్రకళ స్టేట్మెంట్ను మంగళవారం నారాయణగూడ పోలీసులు రికార్డు చేశారు. చంద్రకళ ఏం చెప్పారంటే ' సోమవారం సాయంత్రం కాల్పులు జరిపిన తర్వాత శశికుమార్ నేరుగా నా నివాసానికి వచ్చాడు. తీవ్ర ఒత్తిడిలో ఉన్నానని..ఫాంహౌస్‌కు తీసుకెళ్లాలని కోరాడు. నేను నా కారులో శశికుమార్‌ని ఫాంహౌస్‌కు తీసుకెళ్లాను. ఫాంహౌస్‌లో శశికుమార్‌ను విడిచిపెట్టి జాగ్రత్తగా చూసుకోమని వాచ్మెన్ శంకరయ్యకు చెప్పాను. నేను తిరిగి ఇంటికి వచ్చాక రాత్రి 10 గంటల పమయంలో వాచ్మెన్ ఫోన్ చేశాడు. ఆ ఫోన్లోనే నేను శశికుమార్‌తో 10 నిమిషాలు మాట్లాడాను. తాను ఆత్మహత్య చేసుకుంటాన్నానని చెప్పి ఫోన్ కట్ చేశాడు. నేను వెంటనే పంజాగుట్ట పోలీసులకు సమాచారం ఇచ్చాను. పోలీసులతో కలసి ఫాంహౌస్‌కు వెళ్లాను. అప్పటికే శశికుమార్ చనిపోయాడు'. వ్యాపార లావాదేవిలలో తగాదాల కారణంగా సోమవారం సాయంత్రం డాక్టర్ ఉదయ్ కుమార్‌పై మరో డాక్టర్ శశికుమార్ కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. -
కొత్త ప్రాంగణంలోకి ఎస్బీహెచ్ ఎన్నారై బ్రాంచ్
హైదరాబాద్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌కు చెందిన ఎన్నారై బ్రాంచ్‌ను వేరే ప్రాంతానికి మార్చినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఒక ప్రకటనలో తెలిపింది. 1992, నవంబర్‌లో ఫతే మైదాన్‌లో ఏర్పాటు చేసిన ఈ బ్రాంచ్‌ను ఇప్పుడు హిమాయత్ నగర్‌కు మారింది. ఖాతాదారులకు మరింత మెరుగైన సేవలందించడానికి ఈ మార్పు చేసినట్లు బ్యాంకు ప్రతినిధులు తెలిపారు. కొత్త ప్రాంగణంలో ఈ ఎన్నారై శాఖను ఎస్బీహెచ్ ఎండీ శంతను ముఖర్జీ శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ ఉన్నతాధికారులు, వి. విశ్వనాధన్(సీజీఎం, ఆర్బీ), అనిల్ మల్హోత్ర(జనరల్ మేనేజర్, పీబీ), దేవేంద్ర కుమార్(జీఎం, హైదరాబాద్ నెట్వర్క్), ఎస్.సి. ధావన్ (డీజీఎం, మెట్రోజోన్), హర్షవర్థన్ మాడభూషి(జనరల్ సెక్రటరీ, ఎస్బీహెచ్ ఆఫీసర్స్ అసోసియేషన్), టి. సుధాకర్ రెడ్డి(బ్రాంచ్ హెడ్) తదితరులు పాల్గొన్నారు. -
ట్రైలర్ అదుర్స్..
హిమాయత్‌నగర్‌లోని ఫ్యాషన్ఇన్స్టిట్యూట్ ఐఎన్ఐఎఫ్డీ ఆధ్వర్యంలో విద్యార్థులు క్రియేట్ చేసిన డిజైన్లను ఈ నెల 4న ప్రదర్శించనున్నారు.బేగంపేటలోని హోటల్ మ్యారీగోల్డ్‌లో జరిగే ఈ ఫ్యాషన్ షోకు ప్రీ ఈవెంట్‌ను సోమవారం నిర్వహించారు.ఈ సందర్భంగా స్టూడెంట్స్ తమ స్ప్రింగ్ సమ్మర్ 2015 కలెక్షన్ విశేషాలను పంచుకున్నారు. ఇంటీరియర్విద్యార్ధులు సృష్టించిన వెరైటీ లైట్స్... ప్రదర్శించారు. తమయాన్యువల్ ఈవెంట్ కోసం రూపొందించిన దుస్తుల ట్రయల్స్ కోసం 11 మంది సిటీ టాప్ మోడల్స్ ఇన్స్టిట్యూట్ను సందర్శించనున్నారని నిర్వాహకులు సోమవారం చెప్పారు. -
చెరువుల జీవో రద్దు!
* 111 జీవోను ఉపసంహరించి 80 గ్రామాలకు ఊరటనిస్తాం: సీఎం * హిమాయత్‌సాగర్ ఎగువ గ్రామాల్లో అభివృద్ధికి చర్యలు తీసుకుంటాం * కోర్టు వివాదాల్లోని లక్షల కోట్ల విలువైన భూములను విడిపిస్తాం.. ఆ డబ్బుతో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం * సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే యాదయ్య సాక్షి, హైదరాబాద్: రాజకీయాలకు అతీతంగా తెలంగాణను అభివృద్ధి చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ కలిసి రావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునేందుకు పుష్కలమైన అవకాశాలున్నాయని, కొత్తగా వచ్చిన రాష్ట్రాన్ని నిలబెట్టుకునేందుకు యావత్ తెలంగాణ జాతి కృషి చేయాలని పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు చెందిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ఆదివారం తెలంగాణ భవన్లో కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. లక్షల కోట్ల విలువైన భూములు కోర్టు వివాదాల్లో ఉన్నాయని, వాటిని విడిపించి ఆ డబ్బును రాష్ట్రాభివృద్ధికి ఉపయోగిస్తామని చెప్పారు. రంగారెడ్డి జిల్లాలో 80కి పైగా గ్రామాలకు ఇబ్బందిగా మారిన జీవో నంబర్ 111 ఉపసంహరణకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. హిమాయత్‌సాగర్ కలుషితం కాకుండా.. దాని ఎగువభాగంలో భారీ నిర్మాణాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలను నిషేధిస్తూ ఈ జీవోను తెచ్చారని, కానీ జీవో వల్ల అనేక గ్రామాల్లో అభివృద్ధి ఆగిపోయిందని సీఎం వివరించారు. అన్ని గ్రామాలకూ ఈ జీవోను వర్తింపజే యాల్సిన అవసరం లేదని, కొన్నింటిని మినహాయించేందుకు ముందుగా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖల అధికారులతో ఓ కమిటీ ఏర్పాటు చేసి తదనుగుణంగా ముందుకు వెళ్తామన్నారు. అధికారులు, శాసనసభ్యులతోనూ కమిటీ వేసి దాని నివేదిక ఆధారంగా స్పందిస్తామన్నారు. కొత్త రాష్ట్రంపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, వారి ఆశలను నెరవేర్చేందుకు కృషి చేస్తామని కేసీఆర్ పేర్కొన్నారు. మూడేళ్ల తర్వాత నిమిషం కూడా కరెంటు కోత లేకుండా చేస్తానని ఇప్పటికే చెప్పానని, దాన్ని చేసి తీరుతానని నొక్కిచెప్పారు. అలాగే నాలుగేళ్లలో ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ ఉండేలా చూస్తానని, అందరితోనూ కృష్ణా, గోదావరి నీరు తాగిస్తానని చెప్పారు. ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ ఇవ్వకపోతే.. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఓట్లు అడగదని పునరుద్ఘాటించారు. రంగారెడ్డి జిల్లా అన్ని రంగాల్లో అగ్రగామిగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. రైతులు లక్షాధికారులవుతారని అన్నారు. జిల్లాలోని వెయ్యి ఎకరాల్లో పాలీహౌజ్ వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. బిందు సేద్యం పరికరాలను దళితులకు వంద శాతం రాయితీపై, బీసీలకు 90 శాతం రాయితీపై అందజేస్తామన్నారు. రంగారెడ్డి నుంచి వచ్చే కూరగాయలు రాజధానికి సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇచ్చిన హామీలన్నీ క్రమక్రమంగా నెరవేరుస్తున్నామని తెలిపారు. చేవెళ్లను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. చేవెళ్ల, శంకరపల్లిలో ప్రభుత్వ ఆసుపత్రులు ఏర్పాటు చేయిస్తానన్నారు. రోడ్లను అభివృద్ధి చేయిస్తానని చెప్పారు. కాగా, ఎమ్మెల్యే యాదయ్యతో పాటు పోలీస్ రామిరెడ్డి, వారి అనుచరులు కూడా అధికార పార్టీలో చేరారు. -
మ్యాన్‌హోల్‌లో పడి వృద్ధుడి మృతి
హైదరాబాద్ : మూతలేని మ్యాన్‌హోల్ ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. అధికారుల నిర్లక్ష్యానికి తార్కాణంగా నిలిచిన ఈ సంఘటన శనివారం రాత్రి హిమాయత్ నగర్లో చోటు చేసుకోగా ఆదివారం ఉదయం వెలుగు చూసింది. హిమాయత్‌నగర్ 6వ వీధిలోని సద్గుణ అపార్ట్మెంట్ 403వ నంబర్ ఫ్లాట్‌లో హేమంత్‌కుమార్ సహాయి (60) కుటుంబం నివాసముంటోంది. విజయదశమి వేడుకల్లో పాల్గొనేందుకు హేమంత్‌కుమార్ సహాయి శనివారం సాయంత్రం భార్యతో కలిసి గచ్చిబౌలిలోని బంధువుల ఇంటికి వెళ్లారు. వేడుకలు పూర్తయిన తర్వాత భార్యను అక్కడే ఉంచి తమ్ముడు పియూష్ కుమార్ సహాయి వాహనంపై ఇంటికి బయలుదేరారు. రాత్రి 10.30 సమయంలో హివూయత్ నగర్ 6వ వీధి ప్రధాన రహదారిపై దిగిపోయూరు. 30 అడుగుల దూరం నడిచిన తర్వాత 8 అడుగుల లోతున్న మూతలేని మ్యాన్‌హోల్‌లో పడి హేమంత్ ప్రాణాలొదిలారు. ఆదివారం ఉదయం మ్యాన్‌హోల్‌లో హేమంత్ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. నారాయణగూడ డీఐ లక్ష్మీనారాయణ, ఎస్సై జగన్నాథ్ అనుమానాస్పద మృతిగా పేర్కొంటూ 174 పీఆర్సీ సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీధి దీపాలు వెలగకపోవడం, మ్యాన్‌హోల్‌పై మూతలేకపోవడం వల్లే నిండు ప్రాణం బలైపోయిందని, జీహెచ్ఎంసీ అధికారులు, నిర్మాణ కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే దీనికి కారణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, హేమంత్‌కుమార్ (60) మృతికి బాధ్యులుగా పేర్కొంటూ జీహెచ్ఎంసీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్లను సస్పెండ్ చేస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.