నాకిక ఓపిక లేదు.. | Miss Telangana 2018 Winner Hasini Attempted Suicide In Hyderabad | Sakshi
Sakshi News home page

నాకిక ఓపిక లేదు..

Oct 29 2021 4:02 AM | Updated on Oct 29 2021 4:02 AM

Miss Telangana 2018 Winner Hasini Attempted Suicide In Hyderabad - Sakshi

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హాసిని   

హిమాయత్‌నగర్‌: నాకేదో చెప్పాలనిపిస్తోంది.. చెప్పలేకపోతున్నా. మమ్మీ, డాడీ క్షమించండి ఇలా చెప్పకుండా చేస్తున్నందుకు.. నాకు ఏమీ అవసరం లేదు. నాకిక ఓపిక లేదు.. యాసిడ్‌ అటాక్‌ ఫేస్‌ చేశా.. రేప్‌ ఇష్యూ ఫేస్‌ చేశా.. పబ్లిక్‌ నుంచి వచ్చే కామెంట్స్‌ ఫేస్‌ చేశా.. మా అమ్మకు అందరూ కాల్స్‌ చేస్తున్నారు. నాకు అవసరం లేదు. ఇన్ని డేస్‌ నాకు జరిగిన ఘనకార్యాలు, పురస్కారాలు చాలు. నేను నిజంగా చనిపోవాలి అనుకుంటున్నా’అంటూ ఇన్‌స్టా లైవ్‌లో ఆత్మహత్యకు ప్రయత్నించింది మిస్‌ తెలంగాణ–2018 విన్నర్‌ హాసిని. 

నిమిషాల వ్యవధిలో చేరుకున్న పోలీసులు 
కృష్ణా జిల్లాకు చెందిన కాలక నాగభవాని అలియాస్‌ హసిని ఆరేళ్ల కింద హైదరాబాద్‌ వచ్చింది. చిన్నతనం నుంచి మోడలింగ్‌ అంటే చాలా ఇష్టం. ఇటీవల హాసిని హిమాయత్‌నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటోంది. బుధవారం రాత్రి ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌ ప్రారంభించకముందే తన స్నేహితుడుకి తాను చనిపోతున్న విషయాన్ని ఫోన్‌లో తెలిపింది. ఫ్లాట్‌ తలుపులు తెరిచి ఉంచి బెడ్రూంలోని తన చున్నీతో ఫ్యాన్‌కు ముడి వేసింది.

చిన్న స్టూల్‌ వేసుకుని ఏడుస్తూ తన ఇన్‌స్టా ఐడీలో లైవ్‌లో మాట్లాడుతూ ఆత్మహత్యకు యత్నించింది. ఈ లోపు జగిత్యాలలో నివాసం ఉండే హాసిని ఫ్రెండ్‌ షన్నూ డయల్‌ 100కు ఫోన్‌ చేసి వివరాలు చెప్పి అడ్రస్‌ తెలిపాడు. బుధవారం రాత్రి జాయింట్‌ సీపీ, నార్త్‌జోన్‌ డీసీపీ రమేశ్‌రెడ్డి సమాచారం అందుకున్నారు. వెంటనే నారాయణగూడ పోలీసులకు చెప్పడంతో వారు హుటాహుటిన అపార్ట్‌మెంట్‌కు చేరుకున్నారు. అప్పటికే స్పృహ కోల్పోయి ఉన్న హాసినిని హైదర్‌గూడ అపోలో ఆసుపత్రికి తరలిం చి చికిత్స అందించారు. ఆరోగ్య పరిస్థితి బాగానే ఉండటంతో ఉదయం ఆమె తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement