commited suicide
-
నిజామాబాద్ లో వైద్య విద్యార్థి ఆత్మహత్య
-
గుంటూరులో లోన్ యాప్ వేధింపులకు మహిళ ఆత్మహత్య
-
నేతన్న ఇంట విషాదం
చొప్పదండి: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఇంట్లో ఉరేసుకొని మృతి చెందడం కరీంనగర్ జిల్లాలో సంచలనం సృష్టించింది. నేత కార్మిక కుటుంబానికి చెందిన భార్యాభర్తలు, వారి కుమారుడు ఇంట్లో బలవన్మరణం చెందడం మిస్టరీగా మారింది. వివరాలిలా ఉన్నాయి.. చొప్పదండి మండలం కాట్నపల్లి గ్రామానికి చెందిన నేత కార్మికుడు బైరి శంకరయ్య (54) సాంచాలు నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. భార్య జమున (50) వ్యవసాయ కూలి. ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు వారి సంతానం. పెద్ద కుమార్తె అనితకు ఇదివరకే వివాహం కాగా భర్తతో కలసి విదేశాల్లో ఉంటోంది. చిన్న కుమార్తె అఖిలకు మూడు నెలల క్రితం పెళ్లి చేశారు. కుమారుడు శ్రీధర్ (25) బీటెక్ చదివాడు. అతను హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తుండగా, గతేడాది కరోనా కాలం నుంచి వర్క్‌ఫ్రమ్ హోంలో ఉంటూ విధులు నిర్వర్తిస్తున్నాడు. ఏమైందో ఏమో కానీ, ఆదివారం రాత్రి సమయంలో భార్యాభర్తలు, కుమారుడు ఏక కాలంలో ఇంట్లో దూలాలకు ఉరేసుకున్నారు. కరీంనగర్లో ఉంటున్న చిన్న కూతురు సోమవారం ఉదయం తండ్రికి ఫోన్ చేయగా లిఫ్ట్ చేయలేదు. దాంతో ఇంటి పక్కవారికి ఫోన్ చేసి వాకబు చేయగా, వారు వచ్చి చూసేసరికి ఇంటికి తాళం వేసి ఉంది. అదే సమయంలో ఇంట్లో నుంచి ఫోన్ రింగ్ అయిన శబ్దం రావడంతో కూతురుకు అదే విషయం తెలిపారు. అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. గ్రామ పెద్దల సమక్షంలో పోలీసులు ఇంటి తలుపులు తొలగించి చూడగా, ముగ్గురూ దూలాలకు వేలాడుతూ విగతజీవులుగా కనిపించారు. ఎస్ఐ వంశీకృష్ణ ఆధ్వర్యంలో మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. తన వివాహ సమయంలో అప్పులు కావడంతో ఆర్థిక ఇబ్బందులతోనే కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్నారని చిన్న కూతురు అఖిల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
కుట్ల నొప్పి తట్టుకోలేని తల్లి.. ఉరినే భరించింది!
కోల్‌సిటీ (రామగుండం): పెళ్లయిన 11 ఏళ్లకు గర్భం దాల్చి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది ఆ తల్లి. సిజేరియనైనా కొడుకు పుట్టాడన్న ఆనందంలో నొప్పిని భరించింది. వారమైనా కుట్లు సరిగ్గా అతుక్కోకపోవడంతో ప్రసూతి వార్డులోనే ఉండాల్సి వచ్చింది. రెండుసార్లు కుట్లేసినా అతుక్కోకపోవడం, ఇన్ఫెక్షన్ తగ్గకపోవడం, మూడోసారి కుట్లేస్తామని వైద్యులు చెప్పడంతో హడలిపోయింది. ఓ పక్క నొప్పి.. మరోపక్క వైద్యుల నిర్లక్ష్యంతో మనోవేదన చెంది ఆదివారం వేకువజామున ప్రసూతి వార్డులోని బాత్రూమ్లో చున్నీతో ఉరేసుకుంది. వెంటనే గమనించి ఉరి నుంచి తప్పించిన కుటుంబీకులు వైద్యులకు సమాచారమిచ్చినా పట్టించుకోకపోవడంతో కళ్లముందే చనిపోయింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఆదివారం ఈ సంఘటన జరిగింది. నొప్పితో తల్లడిల్లి.. పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండలం రొంపికుంట గ్రామానికి చెందిన గుమ్మడి ఉమ (29)ను ప్రసవం కోసం ఈ నెల 11న గోదావరిఖని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చేరింది. నార్మల్ డెలివరీ కోసం ప్రయత్నించినా సాధ్యం కాకపోవడంతో మర్నాటి రాత్రి ఉమకు సిజేరియన్‌చేసి వైద్యులు మగబిడ్డకు పురుడు పోశారు. ఉమతో పాటు శిశువును ప్రసూతి వార్డుకు తరలించారు. ఉమ (ఫైల్) సిజేరియన్ చేసిన వైద్యులు కుట్లు సరిగా వేయలేదో ఏమోగాని అవి అతుక్కోలేదు. దీంతో ఇన్ఫెక్షన్ వచ్చింది. 18న వైద్యులు రెండోసా రి కుట్లేశారు. అయినా ఇన్ఫెక్షన్ తగ్గలేదు. శనివారం పరిశీలించిన వైద్యులు మరోసారి కుట్లు వేయాల్సి వస్తుందన్నారు. అప్పటికే కుట్లు వేసిన ప్రాంతంలో నొప్పిగా ఉందని తల్లడిల్లిందని ఉమ తల్లి రాజేశ్వరి, అత్త మల్లమ్మ, ఆడబిడ్డ స్వప్న తెలిపారు. వేకువజామున ఉరేసుకొని.. బిడ్డను తన అత్త మల్లమ్మ వద్ద పడుకోబెట్టిన ఉమ.. ఆదివారం వేకువజామున 4.50 సమయంలో బాత్రూమ్కు వెళ్లింది. ఎంతకూ బయటకు రాకపోవడంతో అనుమానంతో అత్త, ఆడపడుచు వెళ్లిచూడగా షవర్‌కు చున్నీతో ఉరేసుకుని వేలాడుతూ కనిపించింది. వెంటనే ఆమెను ఉరి నుంచి తప్పించి బెడ్‌పైకి తరలించారు. విషయం ఆస్పత్రి సిబ్బందికి తెలిపినా ఎవరూ పట్టించుకోలేదని, అరగంటైనా వైద్యులు రాకపోవడంతో చనిపోయిందని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సకాలంలో ఆక్సిజన్ అందించి చికిత్స చేస్తే ప్రాణాలు దక్కేవని.. వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఉమ తమ కళ్లముందే ప్రాణాలు కోల్పోయిందని చెప్పారు. బాలింత మృతికి ఆస్పత్రి వైద్యులు, సిబ్బందే కారణమని, వాళ్ల నిర్లక్ష్యంతోనే ఇన్ఫెక్షన్ సోకిందని కుటుంబీకులు ఆందోళనకు దిగారు. డీసీహెచ్ఎస్ విచారణ ఉమ మృతిపై డీసీహెచ్ఎస్ డాక్టర్ వాసుదేవరెడ్డి ఆస్పత్రిలో విచారణ చేపట్టారు. ఉమకు సిజేరియన్ చేసిన డాక్టర్, శనివారం రాత్రి డ్యూటీలోని డాక్టర్, సిబ్బంది నుంచి వివరాలు సేకరించారు. ఆత్మహత్యకు యత్నించిందని తెలిసిన తర్వాత సిబ్బంది ఎప్పటిలోగా వెళ్లారు వంటి వివరాలను నమోదు చేసుకున్నారు. మృతురాలి భర్త సంజీవ్‌తో మాట్లాడారు. నివేదికను కలెక్టర్‌కు సమర్పిస్తామని డీసీహెచ్ఎస్ తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యం లేదు వైద్యుల నిర్లక్ష్యం లేదు. డీసీహెచ్ఎస్ దర్యాప్తు చేస్తున్నారు. కొందరిలో కుట్లు మానకపోవడమనేది జరుగుతుంది. – డాక్టర్ భీష్మ, ఆర్ఎంవో నా బిడ్డను పొట్టనబెట్టుకున్నారు రెండుసార్లు కుట్లేసినా ఇన్ఫెక్షన్ తగ్గలేదు. మూడోసారి కుట్లు వేస్తామని డాక్టర్లు చెప్పారు. శనివారం రెండు గంటలు లేబర్ రూంలో డ్రెస్సింగ్ చేసి నరకం చూపించారు. లేబర్ రూం నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి మంట, నొప్పి అంటూ తల్లడిల్లిపోయింది. ప్రైవేట్‌కు తీసుకుపోవాలనుకున్నాం. ఇంతలోనే ఆత్మహత్య చేసుకుంది. డాక్టర్లపై చర్యలు తీసుకోవాలి. – రాజేశ్వరి, మృతురాలి తల్లి -
Miss Telangana 2018 Winner: హాసిని మళ్లీ ఆత్మహత్యాయత్నం..
కంచికచర్ల (నందిగామ): ఉరేసుకుని ఆత్మహత్యకు యత్నించిన మోడల్, మిస్ తెలంగాణ–2018 కలక భవానీ అలియాస్ హాసిని మరోసారి ఆత్మహత్యా యత్నం చేసింది. కృష్ణా జిల్లా కంచికచర్ల సమీపంలోని కీసర బ్రిడ్జి పైనుంచి మున్నేరు వాగులోకి దూకి శుక్రవారం ఆత్మహత్యకు యత్నించింది. కృష్ణా జిల్లా వీరులపాడు మండలం బోడవాడ గ్రామానికి చెందిన హాసిని హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లోని ఓ అపార్ట్మెంట్లో నివసిస్తోంది. బుధవారం రాత్రి హైదరాబాద్‌లో ఇస్టాగ్రామ్‌లో లైవ్ ప్రారంభించి చున్నీతో ఉరేసుకుని చనిపోవాలని ప్రయత్నించగా, ఆమె స్నేహితుడు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఆమెను కాపాడారు. అయితే గురువారం ఆమె కుటుంబసభ్యులతో హైదరాబాద్ నుంచి బోడవాడకు వచ్చింది. శుక్రవారం మున్నేరు వాగులోకి దూకి మరోసారి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది. గమనించిన స్థానికులు ఆమెను రక్షించారు. నేషనల్ హైవే అంబులెన్స్‌లో నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. (చదవండి: జియాగూడ: పెళ్లయిన నాటి నుంచి గొడవలే.. తట్టుకోలేక..) -
నాకిక ఓపిక లేదు..
హిమాయత్‌నగర్: నాకేదో చెప్పాలనిపిస్తోంది.. చెప్పలేకపోతున్నా. మమ్మీ, డాడీ క్షమించండి ఇలా చెప్పకుండా చేస్తున్నందుకు.. నాకు ఏమీ అవసరం లేదు. నాకిక ఓపిక లేదు.. యాసిడ్ అటాక్ ఫేస్ చేశా.. రేప్ ఇష్యూ ఫేస్ చేశా.. పబ్లిక్ నుంచి వచ్చే కామెంట్స్ ఫేస్ చేశా.. మా అమ్మకు అందరూ కాల్స్ చేస్తున్నారు. నాకు అవసరం లేదు. ఇన్ని డేస్ నాకు జరిగిన ఘనకార్యాలు, పురస్కారాలు చాలు. నేను నిజంగా చనిపోవాలి అనుకుంటున్నా’అంటూ ఇన్‌స్టా లైవ్‌లో ఆత్మహత్యకు ప్రయత్నించింది మిస్ తెలంగాణ–2018 విన్నర్ హాసిని. నిమిషాల వ్యవధిలో చేరుకున్న పోలీసులు కృష్ణా జిల్లాకు చెందిన కాలక నాగభవాని అలియాస్ హసిని ఆరేళ్ల కింద హైదరాబాద్ వచ్చింది. చిన్నతనం నుంచి మోడలింగ్ అంటే చాలా ఇష్టం. ఇటీవల హాసిని హిమాయత్‌నగర్‌లోని ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటోంది. బుధవారం రాత్రి ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ ప్రారంభించకముందే తన స్నేహితుడుకి తాను చనిపోతున్న విషయాన్ని ఫోన్లో తెలిపింది. ఫ్లాట్ తలుపులు తెరిచి ఉంచి బెడ్రూంలోని తన చున్నీతో ఫ్యాన్‌కు ముడి వేసింది. చిన్న స్టూల్ వేసుకుని ఏడుస్తూ తన ఇన్‌స్టా ఐడీలో లైవ్‌లో మాట్లాడుతూ ఆత్మహత్యకు యత్నించింది. ఈ లోపు జగిత్యాలలో నివాసం ఉండే హాసిని ఫ్రెండ్ షన్నూ డయల్ 100కు ఫోన్ చేసి వివరాలు చెప్పి అడ్రస్ తెలిపాడు. బుధవారం రాత్రి జాయింట్ సీపీ, నార్త్‌జోన్ డీసీపీ రమేశ్‌రెడ్డి సమాచారం అందుకున్నారు. వెంటనే నారాయణగూడ పోలీసులకు చెప్పడంతో వారు హుటాహుటిన అపార్ట్‌మెంట్‌కు చేరుకున్నారు. అప్పటికే స్పృహ కోల్పోయి ఉన్న హాసినిని హైదర్‌గూడ అపోలో ఆసుపత్రికి తరలిం చి చికిత్స అందించారు. ఆరోగ్య పరిస్థితి బాగానే ఉండటంతో ఉదయం ఆమె తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లారు. -
నన్ను క్షమించండి..
హాలియా: మూగ కుమారుడితో కలసి ఓ తల్లి హాలియా వద్ద సాగర్ ఎడమ కాల్వలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పంది. ‘నన్ను క్షమించండి..ఎలా బతకాలో అర్థం కావడం లేదు’అని ఓ సూసైడ్ నోట్ రాసి ఈ దారుణానికి ఒడిగట్టింది. ఈ ఘటనలో ఆమె కొడుకు విశాల్ శివ (5) మృతి చెందగా తల్లిని స్థానికులు రక్షించారు. ఆదివారం నల్లగొండ జిల్లా హాలియా పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్ఐ శివకుమార్ కథనం ప్రకారం.. అనుముల మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన పోలేపల్లి బక్కయ్య, అచ్చమ్మ దంపతుల కుమార్తె హేమలతని నిడమనూరు మండలం బంకాపురం గ్రామానికి చెందిన బొడ్డుపల్లి చిన వెంకట లింగయ్యకు ఇచ్చి ఐదేళ్ల క్రితం వివాహం జరిపించారు. వీరికి ఇద్దరు మగ పిల్లలు. పెద్ద కుమారుడైన విశాల్ శివ (5) పుట్టుకతో మూగ. కాగా, లింగయ్య పీహెచ్డీ చదువు నిమిత్తం కుటుంబంతో కలసి హైదరాబాద్‌లోని తార్నాకలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. విశాల్ శివ పుట్టుమూగ కావడంతో తల్లి హేమలత ప్రతి రోజు కొడుకు పరిస్థితిని తలుచుకుంటూ కుమిలిపోయేది. ఈ నెల 15న దసరా పండుగకు హేమలత పిల్లలతో కలసి తల్లిగారి ఊరు కొత్తపల్లికి వచ్చింది. భర్త లింగయ్య స్వగ్రామైన బంకా పురానికి వెళ్లాడు. కాగా, విశాల్ శివకు ఈ నెల 20న ఆపరేషన్ చేయాల్సి ఉంది. దీంతో తన కుమారుడి పరిస్థితిపై మనస్తాపం చెందిన హేమలత షాపింగ్ పేరుతో విశాల్‌ను తీసు కుని హాలియాకు వచ్చింది. అక్కడ సాగర్ కాల్వ వద్దకు వచ్చి కుమారుడిని చీరకొంగు తో నడుముకు కట్టుకొని కాల్వలోకి దూకింది. హేమలతను కాపాడిన స్థానికులు.. తల్లి, కుమారుడు కాల్వలో కొట్టుకుపోతున్న విషయాన్ని గమనించిన స్థానికులు తాళ్ల సహాయంతో వారిని ఒడ్డుకు చేర్చారు. తర్వాత చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చిన్నారి విశాల్ శివ మృతి చెందగా, హేమలతను మెరుగైన చికిత్స కోసం నల్లగొండలోని ఓ ఆస్పత్రికి తరలించారు. భర్త లింగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
కాపురానికి వెళ్లిన యువతిపై కన్నేసిన యువకుడు.. తీరా..
ధరూరు: తన కోరిక తీర్చాలంటూ ఓ వివాహితను వేధించడంతో మనస్తాపం చెందిన ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటనలో వేధించిన యువకుడితో పాటు సహకరించిన 8 మందిపై కేసు నమోదైంది. మహబూబ్‌నగర్ జిల్లా రేవులపల్లి ఎస్ఐ రవి కథనం ప్రకారం.. మండలంలోని మార్లబీడుకు చెందిన రేణుక (20)కు కొన్ని నెలల కిందట జాంపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో వివాహమైంది. చదవండి: మనసిచ్చిన మేనబావ.. మనువాడుతానని మరదలుకు చెప్పి ఈ క్రమంలో ఈనెల 25వ తేదీన వ్యవసాయ పొలానికి వెళ్లింది. ఒంటరిగా ఉన్న రేణుకను అదే గ్రామానికి చెందిన గాళ్ల వీరేశ్ తన కోరిక తీర్చాలంటూ వేధించాడు. అదే గ్రామానికి చెందిన వీరేశ్ బంధువులు మరో ఎనిమిది మంది వీరేశ్‌ను పెళ్లి చేసుకోవాలని వేధించారు. దీంతో 26న ఆమె తన పుట్టింటికి మార్లబీడు వెళ్లింది. తీవ్ర మనస్తాపంతో 28న రేణుక మంగళవారం మార్లబీడులో పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఆలస్యంగా గమనించిన కుటుంబసభ్యులు ఆమెను కర్నూలులోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రేవులపల్లి ఎస్ఐ రవి తెలిపారు. చదవండి: హుజురాబాద్.. తుపాకులు అప్పగించాలె.. లేదంటే -
సూసైడ్ నోట్: నా చావుకు వారే కారణం..!
సాక్షి, నర్సంపేట రూరల్ : ఎక్సైజ్ పోలీసులు, వైన్స్ యజమాని వేధిస్తున్నారని ఆరోపిస్తూ పురుగుల మందు తాగి ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ మేరకు ఆయన జేబులో సూసైడ్ నోట్ లభించడంతో మృతదేహంతో ఎక్సైజ్ స్టేషన్ ఎదుట కుటుంబీకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసు, ఎక్సైజ్ అధికారులు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండ మండలం సూరిపల్లికి చెందిన ఊడ్గుల రాజమల్లు(52) వికలాంగుడు కావడంతో గౌడ వృత్తి చేయలేక కిరాణం షాపు అందులోనే బెల్టుషాపు నడిపిస్తున్నాడు. చెన్నారావుపేటలోని వైన్స్ నుంచి మద్యం తీసుకొచ్చి అమ్ముకునేవాడు. కోవిడ్ మొదలైనప్పుడు లాక్డౌన్ విధించగా, అధికారులు తనిఖీలు చేపట్టి రూ.70వేల విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే, ఈ మద్యాన్ని తిరిగి ఇప్పిస్తానని ఒకరు నమ్మబలికినట్లు తెలుస్తుండగా, అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం కానరాలేదు. దీంతో మనస్తాపం చెందిన రాజమల్లు బుధవారం తెల్లవారుజామున పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రాజమల్లు మృతదేహం అయితే ఆయన చొక్కా జేబులో సూసైట్ నోట్‌ను కుటుంబీకులు గుర్తించారు. నా చావుకు కారణం ఎక్సైజ్ ఎస్సై, సీఐ గారు మరియు చెన్నారావుపేట బ్రాండీ షాప్ యాజమాని కృష్ణారెడ్డి గారు కారణం. వీరి మధ్యల ఇబ్బంది పడ్డాను అని ఉండడంతో ఆయన మృతదేహాన్ని తీసుకుని నర్సంపేటలోని ఎక్సైజ్ స్టేషన్ ఎదుట వేసి ధర్నాకు దిగారు. సుమారు ఐదుగంటల పాటు ధర్నా కొనసాగగా, వరంగల్ రూరల్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, నర్సంపేట ఏసీపీ ఫణీందర్ చేరుకుని బాధిత కుటుంబంతో చర్చించారు. అన్ని విధాలుగా న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో రాజమల్లు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కాగా, మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు ఎక్సైజ్ ఎస్సై, సీఐ, కృష్ణారెడ్డిపై కేసు నమోదు చేసినట్లు సీఐ కరుణాసాగర్‌రెడ్డి తెలిపారు. ఈ అంశంపై నర్సంపేట ఎక్సైజ్ సీఐ శశికుమారిని వివరణ కోరగా లాక్డౌన్ సమయంలో రూ.2వేల మద్యం స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామే తప్ప ఆయనను తానెప్పుడూ చూడలేదని చెప్పారు. ఇక వరంగల్ రూరల్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ కేసుపై పోలీసులతో పాటు తమ శాఖ తరఫున పూర్తి స్థాయిలో విచారణ చేయిస్తామని తెలిపారు. -
సిద్దిపేటలో విషాదం: ప్రేమికుల ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్ : సిద్దిపేట రూరల్ మండలం వెంకటాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. పురుగుల మందు తాగి ఇద్దరు ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటాపూర్ గ్రామానికి చెందిన హరిక (14), ఆనంద్ (23) గతకొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలోనే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే వీరి ప్రేమకు పెద్దలు అంగీకారం తెలపలేదు. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన ప్రేమికులు ఆదివారం సాయంత్రం వ్యవసాయ బావివద్ద పురుగుల మందు సేవించారు. విషయం తెలుసుకున్న ఇరు వర్గాల కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అయినప్పటికీ కొంత సమయంలోనే చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి చెందారు. దీంతో వెంకటాపూర్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. హరిక, ఆనంద్ మృతితో ఇరు వర్గాల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
ఒత్తిడితో సచ్చిపోతున్నా..
మిర్యాలగూడ అర్బన్: ‘చదివి.. చదివి ఒత్తిడితో సచ్చిపోతున్నాం కేసీఆర్ సార్.. పుస్తకం తీయాలంటే వణుకు వస్తుంది. త్వరగా ఉద్యోగ నోటిఫికేషన్లను ఇవ్వండి’అంటూ సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఓ యువకుడు విషం తాగాడు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో శనివారం చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన సెల్ఫీ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. మిర్యాలగూడ శాంతినగర్‌కు చెందిన సంపత్‌కుమార్ చాలా రోజులుగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాడు. అయితే ఉద్యోగ నోటిఫికేషన్లు లేకపోవడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. కుటుంబానికి భారం అవుతున్నానని భావించి ఓ పురుగుల మందు డబ్బాను తెచ్చుకున్నాడు. సెల్ఫీ వీడియోలో తను పడిన మానసిక వేదనను వివరించి ఆ పురుగుల మందు తాగేశాడు. తన తండ్రి సత్యనారాయణ టైలర్‌గా పనిచేస్తూ ఉన్నత చదువులు చదివించినా, ఎప్పుడు ఉద్యోగం వస్తుందో తెలియక, చేసేదిలేక చివరకు ప్రాణాలు తీసుకుంటున్నానని ఆ సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. విషం తాగి అపస్మారక స్థితిలోకి పోయిన సంపత్‌కుమార్‌ను గుర్తించిన తల్లితండ్రులు స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
భర్త పేకాటలో రూ.40 లక్షలు పోగొట్టుకున్నాడని..
చిత్తూరు : చిత్తూరు నగరంలో ఒక వ్యక్తి పేకాటలో రూ.40 లక్షలు పోగొట్టాడు. ఉన్న ఇంటిని సైతం అప్పుల వారు స్వాధీనం చేసుకున్నారు. దీంతో కలత చెందిన భార్య శుక్రవారం ఆత్మహత్యకు యత్నించింది. వన్‌టౌన్ సీఐ శ్రీధర్ కథనం మేరకు.. లాలూగార్డెన్‌కు చెందిన సురేష్ (45) కేబుల్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య సుజాత (40) ఓ కొడుకు ఉన్నారు. పేకాటకు బానిసైన సురేష్ రెండేళ్లుగా తమిళనాడులోని పరదరామి వద్ద పేకాట ఆడి రూ.40 లక్షలు పోగొట్టాడు. చిత్తూరు లాలూగార్డెన్లో ఉన్న ఇంటిని సైతం అప్పుల వారు రాయించుకున్నారు. ఇంటిని ఖాళీ చేయాలని చెప్పడంతో తీవ్ర మనస్తాపం చెందిన సుజాత శుక్రవారం పురుగుల తాగి మందు తాగింది. ఆమెను కుటుంబ సభ్యులు చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమె ఫిర్యాదు మేరకు చిత్తూరుకు చెందిన ఏకే రవి, పీజే బాబు, సుబ్రమణ్యం, వేలూరుకు చెందిన హరినాథ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్ ఆత్మహత్యాయత్నం
నల్లగొండ: నల్లగొండ జిల్లా నిడమనూర్ మండలం కన్నేకల్ గ్రామంలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్, ఆమె భర్త ఆత్మహత్యాయత్నం చేశారు. గ్రామానికి చెందిన మారేపల్లి లక్ష్మి ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. కాగా, గురువారం సాయంత్రం లక్ష్మి, ఆమె భర్త సుధాకర్‌రెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. కుటుంబసభ్యులు వారిని నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు. ఎంపీటీసీ సభ్యుడు ఉయ్యాల నర్సింహగౌడ్ తమను వేధిస్తున్నాడని మండల తహశీల్దార్‌కు ఇచ్చిన వాంగ్మూలంలో భార్యాభర్తలు పేర్కొన్నారు. ఇదిలావుంటే రాజకీయ విభేదాలే ఈ ఘటనకు పురిగొల్పాయని స్థానికులు అంటున్నారు. (నిడమనూర్) -
రైలు కింద పడి ఎంసీఏ విద్యార్థి మృతి
వరంగల్: వరంగల్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి బోడ శ్రీనివాస్(25) అనే ఎంసీఏ విద్యార్థి మృతి చెందాడు. మృతుడు కాకతీయ యూనివర్సిటీ విద్యార్థిగా గుర్తించారు. చనిపోయిన ప్రదేశంలో ఎటువంటి సూసైడ్ నోట్ దొరక్కపోవడంతో ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. శ్రీనివాస్ సొంతూరు మంగంపేట మండలం నర్సాపూర్ గ్రామం. తండ్రి చాన్నాళ్ల కిందే చనిపోయాడు. తల్లి టైలరింగ్ పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. ఒక్కగానొక్క కొడుకు చనిపోవటంతో ఆ కుటుంబం దుఃఖసాగరంలో మునిగిపోయింది.