నల్లగొండ: నల్లగొండ జిల్లా నిడమనూర్ మండలం కన్నేకల్ గ్రామంలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్, ఆమె భర్త ఆత్మహత్యాయత్నం చేశారు. గ్రామానికి చెందిన మారేపల్లి లక్ష్మి ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. కాగా, గురువారం సాయంత్రం లక్ష్మి, ఆమె భర్త సుధాకర్‌రెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. కుటుంబసభ్యులు వారిని నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు. ఎంపీటీసీ సభ్యుడు ఉయ్యాల నర్సింహగౌడ్ తమను వేధిస్తున్నాడని మండల తహశీల్దార్‌కు ఇచ్చిన వాంగ్మూలంలో భార్యాభర్తలు పేర్కొన్నారు. ఇదిలావుంటే రాజకీయ విభేదాలే ఈ ఘటనకు పురిగొల్పాయని స్థానికులు అంటున్నారు.
(నిడమనూర్)
ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్ ఆత్మహత్యాయత్నం
Published Thu, Feb 5 2015 8:01 PM | Last Updated on Sat, Sep 2 2017 8:50 PM
Advertisement
Advertisement