
దివ్యాంగుడైన ఫీల్డ్ అసిస్టెంట్‌కు టీడీపీ నేతల బెదిరింపులు
సాక్షి టాస్క్‌ఫోర్స్: రాజీనామా చేయకపోతే.. నీ కథ చూస్తామని దివ్యాంగుడైన ఫీల్డ్ అసిస్టెంట్‌పై టీడీపీ నేతలు బెదిరింపులకు పాల్పడడం కర్నూలు జిల్లా సి.బెళగల్ మండలంలోని బ్రాహ్మణదొడ్డిలో కలకలం రేపింది. కోడుమూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ ఎదురూరు విష్ణువర్ధన్‌రెడ్డి అనుచరుడు, టీడీపీ గ్రామ నాయకుడిగా చెలామణి అవుతున్న వడ్డె బాబు బెదిరింపులకు సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గత సంవత్సర కాలంగా ఉపాధిహామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్‌గా దివ్యాంగుడైన మౌలాలీగౌడ్ పనిచేస్తున్నాడు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి.. తమ కుటుంబ సభ్యుడిని ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేయిస్తాం.. వెంటనే రాజీనామా చెయ్యాలని టీడీపీకి చెందిన వడ్డె బాబు బెదిరింపులకు దిగుతున్నాడు. అదేవిధంగా గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్‌ను మార్చకపోతే పనులను సైతం నిలిపి వేయాలని అధికారులకు సైతం తేల్చి చెప్పాడు.
అయితే గ్రామంలో పనులు కల్పించకపోతే ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి వస్తుందని.. అధికారులు గ్రామంలో కొంతమందికి పనులు కల్పించేలా చర్యలు తీసుకున్నారు. దీన్ని జీరి్ణంచుకోలేని వడ్డే బాబు శుక్రవారం మౌలాలీగౌడ్‌కు ఫోన్‌చేసి ‘ఫీల్డ్ అసిస్టెంట్‌కు ఎప్పుడు రాజీనామా చేస్తావు, రాజీనామా చేస్తున్నావా లేదా.. సోమవారంలోగా రాజీనామా చెయ్యాలని, గతంలోనే కేసుల్లో ఇరికించే వాళ్లమని, ఇప్పటికైనా రాజీనామా చేయకపోతే నీ కథ చూస్తాం’ అంటూ హెచ్చరించారు. ఈ ఆడియో వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment