Field Assistant
-
రాజీనామా చేయకపోతే నీ కథ చూస్తాం!
సాక్షి టాస్క్‌ఫోర్స్: రాజీనామా చేయకపోతే.. నీ కథ చూస్తామని దివ్యాంగుడైన ఫీల్డ్ అసిస్టెంట్‌పై టీడీపీ నేతలు బెదిరింపులకు పాల్పడడం కర్నూలు జిల్లా సి.బెళగల్ మండలంలోని బ్రాహ్మణదొడ్డిలో కలకలం రేపింది. కోడుమూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ ఎదురూరు విష్ణువర్ధన్‌రెడ్డి అనుచరుడు, టీడీపీ గ్రామ నాయకుడిగా చెలామణి అవుతున్న వడ్డె బాబు బెదిరింపులకు సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.గత సంవత్సర కాలంగా ఉపాధిహామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్‌గా దివ్యాంగుడైన మౌలాలీగౌడ్ పనిచేస్తున్నాడు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి.. తమ కుటుంబ సభ్యుడిని ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేయిస్తాం.. వెంటనే రాజీనామా చెయ్యాలని టీడీపీకి చెందిన వడ్డె బాబు బెదిరింపులకు దిగుతున్నాడు. అదేవిధంగా గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్‌ను మార్చకపోతే పనులను సైతం నిలిపి వేయాలని అధికారులకు సైతం తేల్చి చెప్పాడు. అయితే గ్రామంలో పనులు కల్పించకపోతే ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి వస్తుందని.. అధికారులు గ్రామంలో కొంతమందికి పనులు కల్పించేలా చర్యలు తీసుకున్నారు. దీన్ని జీరి్ణంచుకోలేని వడ్డే బాబు శుక్రవారం మౌలాలీగౌడ్కు ఫోన్‌చేసి ‘ఫీల్డ్ అసిస్టెంట్‌కు ఎప్పుడు రాజీనామా చేస్తావు, రాజీనామా చేస్తున్నావా లేదా.. సోమవారంలోగా రాజీనామా చెయ్యాలని, గతంలోనే కేసుల్లో ఇరికించే వాళ్లమని, ఇప్పటికైనా రాజీనామా చేయకపోతే నీ కథ చూస్తాం’ అంటూ హెచ్చరించారు. ఈ ఆడియో వైరల్‌గా మారింది. -
ఫీల్డ్ అసిస్టెంట్ హత్య టీడీపీ పాపమే!..
సాక్షి ప్రతినిధి కర్నూలు: రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించిన ఫీల్డ్ అసిస్టెంట్ ఈరన్న హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. లంచాలు తీసుకుంటూ, రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ ఉద్యోగులను మార్చడంలో భాగంగానే ఈరన్న హత్య జరిగినట్టు తెలుస్తోంది. ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాన్ని ఆశించి నియోజకవర్గ టీడీపీ కీలక నేతకు డబ్బులిచ్చిన వ్యక్తి ఈరన్నను హత్య చేసినట్టు అతడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. విశ్వసనీయ వర్గాలు, కుటుంబ సభ్యుల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఆలూరు నియోజకవర్గ పరిధిలోని హరికెర గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్‌గా 2019 నుంచి ఈరన్న కొనసాగుతున్నాడు.టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరన్నను ఫీల్డ్ అసిస్టెంట్‌గా తప్పించాలని టీడీపీ నేతలు భావించారు. నియోజకవర్గానికి చెందిన టీడీపీ కీలక నేత ఒకరు ఫీల్డ్ అసిస్టెంట్లు, రేషన్ దుకాణాలతో పాటు ఇతర పోస్టుల్లో లంచాలు తీసుకుని నియమింపచేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీకి చెందిన ఓ వ్యక్తి నియోజకవర్గ నేతకు రూ.3 లక్షలు లంచమిచ్చి ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులో తనను నియమించాలని కోరాడు. దీంతో ఆ నేత ఈరన్నను తప్పుకోవాలని రెండు నెలలుగా ఒత్తిడి చేస్తున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్‌ను తొలగించేలా గ్రామస్తులు, పంచాయతీ తీర్మానం చేసినట్టు సర్పంచ్ లేఖ ఇవ్వాలి.కాగా.. గ్రామ సర్పంచ్ నాగరాజుకు, నియోజకవర్గ టీడీపీ నేత మధ్య విభేదాలున్నాయి. దీంతో సర్పంచ్ లేఖ ఇవ్వలేదు. టీడీపీ కీలక నేత ఈరన్నపై తీవ్రస్థాయిలో ఒత్తిడి చేయడంతో పాటు బెదిరించాడు. ఈ పరిస్థితుల్లో డబ్బులిచ్చిన వ్యక్తి ఈరన్నను మట్టుపెడితే తప్ప తనకు పోస్టు రాదని భావించి అతడిని హత్య చేసేందుకు నిర్ణయించుకున్నాడు. మరోవైపు రాజీనామాకు సిద్ధపడిన ఈరన్నకు ఈ నెలాఖరు వరకూ విధులు నిర్వర్తిస్తేనే జనవరి వేతనం వస్తుందని అధికారులు చెప్పారు.దీంతో నెలాఖరు వరకూ పనిచేసి రాజీనామా చేయాలని ఈరన్న నిర్ణయించుకున్నారు. శుక్రవారం ఉపాధి హామీ పనుల నుంచి వస్తున్న ఈరన్నను కొందరు దారిలో ఆపి కళ్లల్లో కారం చల్లి కిరాతకంగా హత్య చేశారు. ఈరన్నను గ్రామానికి చెందిన గాదె లింగప్ప, గోవర్ధన్, గోపి, రామదాసు మరికొందరు కలిసి హతమార్చారని ఈరన్న భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.లంచాలు తీసుకుని పోస్టుల్లో నియామకంటీడీపీ ఎమ్మెల్యేలు, ఇన్చార్జిలు రేషన్ డీలర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఇతర పోస్టులకు రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకూ లంచాలు తీసుకుంటున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి ఈ నెల 18న ఆరోపణలు చేశారు. ఇది జరిగిన వారానికే లంచాలతో పోస్టు మార్పునకు సిద్ధపడిన టీడీపీ నేత వల్ల హత్య జరిగిందని గ్రామస్తులు చెబుతున్నారు. ఆలూరు నియోజకవర్గ పరిధిలోని పి.కోటకొండ ఫీల్డ్ అసిస్టెంట్‌ను మార్చి మరొకరిని నియమించేందుకు నియోజకవర్గ కీలక నేత రూ.6 లక్షలు తీసుకున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో 50 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను మార్చేందుకు లేఖలు ఇవ్వగా.. ఇప్పటివరకు 11 మందిని మార్చినట్టు తెలుస్తోంది. -
మీరు గెలిచింది దీనికోసమేనా? ఫీల్డ్ అసిస్టెంట్ హత్యపై విరూపాక్షి స్ట్రాంగ్ రియాక్షన్
-
కష్ట జీవుల కడుపు కొట్టారు!
పలమనేరు: కడుపుకాలే కష్ట జీవులపై కూటమి ప్రభుత్వం కక్షగట్టింది. ఉపాధిహామీ కూలీ పనుల్లోనూ పక్షపాతం చూపిస్తోంది. ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ఓటేశారన్న కారణంతో పనులివ్వకుండా ఉపాధి అధికారులే వేధిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో జాబ్‌కార్డున్న కూలీలను కూడా పక్కన బెట్టారు. అయ్యా మాకు ఉపాధి పనులు కల్పించండి అంటూ వేలాది మంది కూలీలు మండల స్థాయి అధికారుల నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు బతిమలాడినా పనులు ఇవ్వడం లేదు. మరోవైపు చిత్తూరు జిల్లా పలమనేరు రెవెన్యూ డివిజన్లో సగానికిపైగా ఉపాధి ఫీల్ట్ అసిస్టెంట్లను విధుల నుంచి తొలిగించారు. తాము తప్పు చేయకున్నా విధుల్లో నుంచి ఎందుకు తొలగించారని, మా జీవనోపాధిని దెబ్బతీయవద్దని ఫీల్డ్ అసిస్టెంట్లు విన్నవించినా అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో తమకు న్యాయం కావాలంటూ పలువురు ఫీల్డ్ అసిస్టెంట్లు, జాబ్‌కార్డులున్న కూలీలు కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. విన్నవించినా ఫలితం లేదు ఉపాధి పనులు చేసుకునే తమకు రాజకీయాలతో సంబంధం లేదని, జాబ్‌కార్డులున్న తమకు పని కల్పించాలంటూ కూలీలు ఇప్పటికే మండల స్థాయి అధికారుల నుంచి జిల్లా కలెక్టర్ దాకా వినతిపత్రాలిచ్చారు. ప్రభుత్వ కార్యాలయాల వద్ద నిరసనలు చేసినా వారికి ఉపాధి పనులు కల్పించలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయా ప్రాంతాల నేతల హెచ్చరికలతో ఈజీఎస్ ఏపీవోలు, ఏపీడీలు నడుచుకుంటున్నారు. దీంతో జాబ్‌కార్డున్న కూలీలకు పనులు లేకుండా పోయాయి. ఈ విషయమై కుప్పం ఏపీడీని వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన స్పందించలేదు. బైరెడ్డిపల్లి ఏపీవో హరినాథ్ మాట్లాడుతూ.. తాము స్వతంత్రంగా ఏమీ చేసేందుకు వీలు కాదన్నారు. 60 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఔట్పలమనేరు, పుంగనూరు నియోజకవర్గాల పరిధిలో 132 మంది ఉపాధి పనుల ఫీల్డ్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహించేవారు. వీరిలో 60 మందికి పైగా ఫీల్డ్ అసిస్టెంట్లను కూటమి ప్రభుత్వం రాగానే విధుల నుంచి తొలగించింది. కూటమి నేతల ఆదేశాలతో కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండానే వారిని తొలగించేశారు. వారి స్థానంలో అధికారపా ర్టీకి అనుకూలమైన వారిని పెట్టుకున్నారు. వీరు ఉపాధి పనుల్లో జేసీబీలు పెట్టి పనులు చేసి, బినామీ కూలీల పేరిట బిల్లులు చేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. వీరికి సంబంధిత ఏపీవోల సాయం ఉందని సమాచారం.30 వేల మంది కూలీలకు పనులు ఇవ్వని వైనంపలమనేరు రెవెన్యూ డివిజన్లో పుంగనూరు, కుప్పం క్లస్టర్ లైవ్లీహుడ్ రిసోర్స్ సెంటర్ (సీఎల్ఆర్సీ)లు ఉన్నాయి. పుంగనూరు క్లస్టర్లో పుంగనూరు, పెద్దపంజాణి, పలమనేరు, గంగవరం, చౌడేపల్లి, బంగారుపాళెం మండలాలున్నాయి. కుప్పం క్లస్టర్లో కుప్పం, గుడుపల్లి, శాంతిపురం, రామకుప్పం, వి కోట, బైరెడ్డిపల్లి మండలాలున్నాయి. ఈ రెండు క్లస్టర్లలో మొత్తం 132 పంచాయతీలకు కలిపి ఉపాధి జాబ్‌కార్డులు మొత్తం 216,603 మందికి ఉన్నాయి. ఇందులో ప్రస్తుతం 70,630 మంది పనులు చేస్తున్నారు. ప్రస్తుతం ఈజీఎస్‌లో ఫాంపడ్స్, ఫిష్ పాండ్స్, ఫీడర్ ఛానెల్స్, హార్టీకల్చర్ ప్లాంటేషన్స్, క్యాటిల్ పాండ్స్, రోడ్డు పనులు, ట్రెంచిలు, చెక్‌డ్యాం పనులు జరుగుతున్నాయి. అయితే గత ప్రభుత్వంలో పనులు చేసిన 30 వేల మంది దాకా ఉపాధి కూలీలకు ఇప్పటి ప్రభుత్వంలో పనులు ఇవ్వలేదు. దీంతో పనుల్లేక ఉపాధి కరువై కుటుంబ జీవనానికి ఇబ్బందిగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో వీరంతా వైఎస్సార్సీపీకి సానుభూతిపరులుగా ఉన్నారనే అక్కసుతో ఆయా మండలాల కూటమి నేతల సిఫారసులతో సంబంధిత ఏపీవోలు వీరికి ఉపాధి పనులు ఇవ్వకుండా వారి కడుపు కొడుతున్నారు.ఉపాధి పనులు ఇవ్వరంట.. ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మాకు ఉపాధి పనులు ఇవ్వలేదు. ఏమిసార్ అని అడిగితే మీరంతా వైఎస్సార్సీపీకి ఓటేశారంటగా అంటున్నారు. మాకు రాజకీయాలు ఏంటికి సార్. కూలి పనులు చేసుకొని బతికేటోళ్లం. రెండునెలలుగా పనులు లేక ఖాళీగా ఉన్నాం. ఎక్కడ ఏ పనిచి్చనా కష్టపడి చేసుకుంటాం. అధికారులకు చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదు. – ఓ.నాగప్ప, ఉపాధి కూలి, బైరెడ్డిపల్లి, చిత్తూరు జిల్లాపనులివ్వకపోవడం న్యాయమేనా? ఉపాధి పనులకు చేసుకుంటూ మా కుటుంబానికి అండగా ఉంటున్నా. ఈ మధ్య మాకు పనులివ్వడం లేదు. మాలాంటి కూలీలకు రాజకీయాలకు ఏంటి సంబంధం. మేము కష్టపడి కూలి పనిచేస్తేనే కదా డబ్బులు వచ్చేది. అలాంటిది మాకు పనులివ్వకుంటే ఎలా.. ఇది న్యాయమేనా? నాయకులు మాట కాదుగానీ అధికారులైనా ఆలోచించాల. – రాజేష్, ఉపాధి కూలి, బైరెడ్డిపల్లి, చిత్తూరు జిల్లా నిష్కారణంగా విధుల్లోంచి తొలగించేశారు నేను ఫీల్డ్ అసిస్టెంట్‌గా మా పంచాయతీలో పనిచేస్తున్నా. కూటమి ప్రభుత్వం రాగానే నిష్కారణంగా నన్ను విధులనుంచి తీసేశారు. ఇదేంటి సార్ అంటే కూటమి నేతలు నిన్ను తీసేయమన్నారు ఏమన్నా ఉంటే వారితో మాట్లాడుకోమని చెబుతున్నారు. ఇదేమి న్యాయం. – సుబ్రమణ్యం, ఫీల్డ్ అసిస్టెంట్, జీసీపల్లి, బైరెడ్డిపల్లి మండలం, చిత్తూరు జిల్లా -
ఫీల్డ్ అసిస్టెంట్ కు బెదిరింపులు
-
మహిళలపై టీడీపీ నేత వేధింపులు
శింగనమల: అతనో టీడీపీ చోటా నేత. రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్‌గా అనధికారికంగా చలామణి అవుతున్నాడు. ఈ క్రమంలో మహిళా కూలీలపై కన్నేశాడు. తన పక్క మీదకు వస్తేనే బిల్లులు చేస్తానంటూ వేధించసాగాడు. చివరకు అర్ధరాత్రి.. అపరాత్రి అని కూడా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్లు చేసి అసభ్యకర సంభాషణలు కొనసాగిస్తుండడంతో విసుగు చెందిన మహిళలు తమను కాపాడాలంటూ నేరుగా ఎస్పీని ఆశ్రయించారు. వివరాలు ఇలా ఉన్నాయి.రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అనంతపురం జిల్లా శింగనమల మండలం జూలకాల్వ గ్రామానికి చెందిన ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్‌ను తప్పించి ఆ స్థానానికి తన పేరును టీడీపీ నాయకుడు శ్రీనివాసులు నాయుడు ప్రతిపాదించుకున్నాడు. అయితే దీనికి సంబంధించి ఎలాంటి ఉత్తర్వులూ ఆయనకు అందలేదు. అయినా ‘ప్రభుత్వం మాది, అంతా మేము చెప్పినట్లే నడుచుకోవాలి’ అనే ధోరణితో ఫీల్డ్ అసిస్టెంట్ తానేనంటూ చలామణి అవుతున్నాడు. తరచూ ఉపాధి పనులు జరిగే ప్రాంతానికి వెళ్లి మహిళా కూలీల పట్ల అనుచితంగా ప్రవర్తించేవాడు.కొంత మంది మహిళలను లక్ష్యంగా చేసుకుని వారికి రాత్రి సమయంలో ఫోన్లు చేస్తూ అసభ్యకర సంభాషణ సాగించాడు. తన పక్కమీదకు వస్తేనే బిల్లులు చేస్తానని, లేకపోతే ఎవరొచ్చి చెప్పినా వినేది లేదంటూ బెదిరింపులకు దిగాడు. దీంతో విసుగు చెందిన మహిళలు వారం కిందట శింగనమల పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ నేత ఒత్తిళ్లకు తలొగ్గిన పోలీసులు.. శ్రీనివాసులు నాయుడిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండానే మిన్నుకుండి పోయారు. ఈ క్రమంలో అతని వేధింపులు తారస్థాయికి చేరాయి. దీంతో బాధితులు పలువురు సోమవారం అనంతపురంలో జిల్లా ఎస్పీ జగదీష్ ను కలసి తమ గోడు వెల్లబోసుకున్నారు. ఫోన్లో శ్రీనివాసులు నాయుడు మాట్లాడిన సంభాషణకు సంబంధించి వాయిస్ రికార్డులు వినిపించారు. అతని నుంచి తమకు రక్షణ కలి్పంచాలని వేడుకున్నారు. -
చిరుద్యోగులపై కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులు
-
అక్రమంగా తొలగిస్తున్నారు
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఉపాధి హామీ పథకం అమలుకు క్షేత్రస్థాయిలో పనిచేసే ఫీల్డ్ అసిస్టెంట్లను రెండు నెలలుగా రాజకీయ కారణాలతో రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా తొలగిస్తోందంటూ ఫీల్డ్ అసిసెంట్లు ఆందోళన వ్యక్తం చేశారు. రెండు నెలలుగా 2,360 మందిని తొలగించినట్లు తెలిపారు. వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలంటూ రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు శుక్రవారం తాడేపల్లిలోని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం మూడుగంటల వరకు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఏపీ గ్రామీణ ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ల యూనియన్ గౌరవాధ్యక్షుడు కె.ఉమామహేశ్వరరావు, అధ్యక్షుడు ఎం.పరంధామయ్య, ప్రధాన కార్యదర్శి బి.నరసింహులు, కోశాధికారి ఖాదర్‌బాషా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 2,360 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను ప్రభుత్వం తొలగించిందని చెప్పారు. 17 సంవత్సరాలుగా కేవలం గౌరవ వేతనంతో పనిచేస్తున్నవారిని అక్రమంగా తొలగిస్తున్నారని పేర్కొన్నారు. అన్ని జిల్లాల్లో ఇంకా అనేకమందిని తొలగించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టు చెప్పారు. అక్రమ తొలగింపులు, రాజకీయ బెదిరింపుల కారణంగా రాష్ట్రంలో నలుగురు ఫీల్డ్ అసిస్టెంట్లు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. తమ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు తీసుకోదని, ఉద్యోగాల నుంచి తొలగించదని సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ చెబుతున్నా.. రాష్ట్రవ్యాప్తంగా ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లపై రాజకీయ బెదిరింపులు, అక్రమ తొలగింపులు కొనసాగడం విచారకరమని చెప్పారు. అక్రమంగా తొలగించిన వారందరినీ ప్రభుత్వం వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజకీయ బెదిరింపులతో ఆత్మహత్య చేసుకున్న నలుగురి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని, ఆ కుటుంబాల్లో వారికి ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యోగభద్రత కల్పించడంతో పాటు కనీస వేతనం రూ.20 వేలకు పెంచాలని వారు కోరారు.డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళతా: డైరెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేస్తున్న ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ల ప్రతినిధులు కొందరిని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ కృష్ణతేజ తన చాంబర్‌కు పిలిపించుకుని మాట్లాడారు. ఈ సందర్భంగా యూనియన్ ప్రతినిధులు తమ సమస్యలకు సంబంధించిన వినతిపత్రాన్ని ఆయనకు అందజేశారు. ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ల అక్రమ తొలగింపులపై డ్వామా పీడీలతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించి వివరాలు తెప్పించుకుంటానని కృష్ణతేజ హామీ ఇచ్చారని ఏపీ గ్రామీణ ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ల యూనియన్ ప్రధాన కార్యదర్శి బి.నరసింహులు తెలిపారు.ఫీల్డ్ అసిస్టెంట్లు తెలిపిన వివరాలను ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్, శాఖ ప్రధాన కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు చేపడతామన్నారని చెప్పారు. ఈ ఆందోళనలో శ్రామిక మహిళా కన్వీనర్ కె.ధనలక్ష్మి, ఏపీ గ్రామీణ ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ల యూనియన్ రాష్ట్ర నాయకులు వీరే‹Ùగౌడ్, మహే‹Ù, రవినాయక్ తదితరులు పాల్గొన్నారు. -
కిషన్ లీలలెన్నో..!
కుత్బుల్లాపూర్: పారిశుద్ధ్య విభాగం మహిళా కార్మికుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ అడ్డంగా దొరికిన శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ కిషన్ వ్యవహార శైలి ఆది నుంచీ వివాదాస్పదంగానే ఉంది. గతంలో ఆర్టీసీలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా కండక్టర్ విధులు నిర్వర్తిస్తూ డబ్బులు కాజేయడంతో సర్వీసు నుంచి ఇతడిని తొలగించినట్లు తెలిసింది. రాజు కాలనీలో నివాసముండే కిషన్ కూకట్పల్లి ఫీల్డ్ అసిస్టెంట్‌గా పని చేస్తూ అక్కడి నుంచి అయిదేళ్ల క్రితం గాజులరామారం సర్కిల్‌కు బదిలీపై వచ్చి సూరారం కాలనీలో ఉంటున్నాడు. కాగా.. మహిళా కారి్మకులతో కిషన్ రాసలీలలు బయటపడడంతో జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ అతడిని సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కిషన్‌తో పాటు రాసలీలల వీడియోను వైరల్ చేసిన పారిశుద్ధ్య కార్మికుడు ప్రణయ్‌ని సైతం సస్పెండ్ చేయాలని కూకట్పల్లి జడ్సీ అభిలాష అభినవ్‌కు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. మూడు నెలల కిందటే వెలుగులోకి వచ్చినా.. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు వాటిని సెల్ఫోన్లో బంధించి మహిళలను లోబరుచుకునేవాడు. తనకు అనుకూలంగా ఉండే మహిళలతో ఒకలా.. లేనివారితో మరోలా వ్యవహరిస్తూ వచ్చేవాడని.. మొత్తం మూడు యూనిట్ల బాధ్యతలు నిర్వహిస్తూ 21 మంది పారిశుద్ధ్య కారి్మకుల హాజరు వేసే విషయంలో సైతం చేతివాటం ప్రదర్శించేవాడని ఆరోపణలున్నాయి. ఆయా అంశాలు మూడు నెలల క్రితమే షాపూర్‌నగర్ యూనిట్లో వెలుగులోకి వచి్చనా అధికారులు మాత్రం చర్యలు తీసుకోకుండా సూరారం ప్రాంతానికి బదిలీ చేసి చేతులు దులుపుకోవడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ ఎదుట వివరణ.. 👉 గ్రేటర్ పరిధిలో మహిళలపై జరుగుతున్న దాడులను దృష్టిలో పెట్టుకుని ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ (ఐసీసీ) గతంలో ఏర్పాటు అయ్యింది. గురువారం వెలుగు చూసిన శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ కిషన్ వ్యవహార శైలిపై ఐసీసీ కమిటీ ముందు అదే రోజు రాత్రి 11 గంటల వరకు విచారణ చేశారు. ఉప కమిషనర్ మల్లారెడ్డి, వైద్య ఆరోగ్య అధికారి చంద్రశేఖర్ రెడ్డితో పాటు కిషన్ సైతం హాజరయ్యారు. గతంలో బయోమెట్రిక్ మిషన్ ఎక్కడో పోగా.. పారిశుద్ధ్య కారి్మకులు పోగొట్టారని వారి నుంచి డబ్బులు వసూలు చేసినట్లు కమిటీ ముందు స్పష్టం చేశారు. 👉 తన రాసలీలల వీడియో వైరల్ కావడంతో ఉన్నతాధికారులకు విషయం చెప్పిన కిషన్.. అది వైరల్ చేసే క్రమంలో మొత్తం 14 మందికి డబ్బులు ఇచ్చినట్లు తేలింది. వీడియో పలు గ్రూపుల వారీగా చక్కర్లు కొట్టడంతో వాటిని ఇతరులకు పంపకుండా 14 మందికి రూ. వేయి మొదలుకొని రూ.10 వేల వరకు ముట్ట చెప్పినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. మరికొంత మంది బెదిరింపులు చేయడంతో కిషన్.. ఈ నెల 17న ఉప కమిషనర్ మల్లారెడ్డి, వైద్య ఆరోగ్య అధికారి చంద్రశేఖర్‌రెడ్డికి విషయాన్ని చెప్పుకోవడంతో అతడిని విధుల నుంచి తప్పించారు. వీడియోల లీక్‌పై ఆరా.. గురువారం పలు సామాజిక మాధ్యమాల్లో కిషన్ వీడియోలు చక్కర్లు కొట్టడంతో అధికారులు అవాక్కయ్యారు. ఇవి ఎలా లీక్ అయ్యాయి అనే విషయంపై ఆరా తీస్తున్నారు. ఫార్వర్డ్ చేస్తున్న వారిపై సైతం కేసులు నమోదు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిసింది. కాళ్లు మొక్కి.. కవర్ చేసి.. శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ కిషన్ తాను తీసుకున్న గోతిలో తానే పడడంతో.. వీడియో వైరల్ చేసిన ప్రతి ఒక్కరి కాళ్లు మొక్కుతూ కవర్ చేస్తూ వచ్చాడు.. కొంతమంది బెదిరించి డబ్బులు వసూలు చేయగా.. మరి కొంతమంది వదిలేశారు.. ఇలా మూడు నెలల పాటు ముప్పతిప్పలు పెట్టిన పలువురు కార్మికులు, తోటి శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లు ఎట్టకేలకు వీడియోను బయటకు పంపడంతో విషయం వెలుగులోకి వచి్చంది. శుభకార్యానికి వెళ్లి సాయి అనే కారి్మకునికి ఫోన్ ఇవ్వడం.. ప్రణయ్ అనే మరో కార్మికుడు ఈ వీడియోలను పలువురికి వైరల్ చేయడం.. ఆ తర్వాత మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కిషన్ కామలీలలు బయటపడడంతో ఆయనపై ఉన్నతాధికారులు వేటు వేయడం చకచకా జరిగిపోయాయి. -
ఆ వివరాలు ఆఫిడవిట్లో.. పొందుపర్చలేదని.. బీఆర్ఎస్ అభ్యర్ధిపై దుమారం!
సాక్షి, జోగులాంబ: అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల నామినేషన్ల పరిశీలనలో దూమారం రేగింది. బీఆర్ఎస్ అభ్యర్ధి నామినేషన్‌పై ఇతర పార్టీల అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి దాఖలు చేసిన నామినేషన్ పత్రాల్లో, ఆఫిడవిట్లో ఫిల్డ్ అసిస్టెంట్‌గా పని చేసిన వివరాలు పొందుపర్చలేదని ఫిర్యాదు చేశారు. దీంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉత్కంఠత కొనసాగింది. అలంపూర్ తహసీల్దార్ కార్యాలయంలోని అసెంబ్లీ ఎన్నికల బరిలో అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ పత్రాల పరిశీలన సోమవారం జరిగింది. ఈ సందర్భంగా నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులు హాజరయ్యారు. బీఆర్ఎస్ అభ్యర్ధి విజయుడి నామినేషన్ పరిశీలన సమయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి సంపత్ కుమార్, బీజేపీ అభ్యర్ధి రాజగోపాల్, బీఎస్పీ అభ్యర్ధి ప్రసన్న కుమార్‌తోపాటు ఇతర అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు తెలిపారు. బీఆర్ఎస్ అభ్యర్ధి విజయుడి నామినేషన్, ఆఫిడవిట్లో ఫిల్డ్ అసిస్టెంట్‌గా పని చేసిన వివరాలు, రాజీనామా చేసిన కాఫీని పొందపర్చలేదని ఎన్నికల నిబంధనల మేరకు తిరస్కరించాలని రిటర్నింగ్ అధికారిని కోరినట్లు తెలిపారు. కానీ బీఆర్ఎస్ అభ్యర్ధి నామినేషన్‌ను ఎన్నికల రిటర్నింగ్ అధికారిణి అమోదించినట్లు చెప్పారు. దీంతో అభ్యర్థులు కలిసి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి లిఖీతపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. అదే సమయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారిణి బయటికి వెళ్లడానికి వాహనం వద్దకు రాగా వారు అడ్డుపడుతూ.. నామినేషన్‌ను తిరస్కరించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సాధరణ అబ్జర్వర్ వసంత్ కుమార్ అక్కడికి చేరుకున్నారు. దీంతో అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్న అభ్యర్థులతో మాట్లాడారు. అభ్యర్థులు నామినేషన్ కేంద్రం వద్దనే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండటంతో ఉత్కంఠత కొనసాగింది. అనంతరం ఫిర్యాదు చేసిన అభ్యర్థులు బయటికి వచ్చి ప్లకార్డులను ప్రదర్శించారు. నామినేషన్ల పరిశీలనలో ఉత్కంఠత నెలకొనడంతో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. అలంపూర్ సీఐ రాజు, శాంతినగర్ సీఐ శివకుమార్ గౌడ్లు ఎస్ఐలు, పోలీసులు బందోబస్తు నిర్వహించారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు అక్కడికి చేరుకోని పర్యవేక్షించారు. ఇవి కూడా చదవండి: నామినేషన్ల పరిశీలన పూర్తికాగా.. ఎన్నికల సామగ్రి వచ్చేసింది! -
7 వేల మంది ఫీల్డ్ అసిస్టెంట్లకు లబ్ధి
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తాజా నిర్ణయంతో 7 వేలకుపైగా ఫీల్డ్ అసిస్టెంట్లకు లబ్ధి జరుగుతోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో గురువారం ఎమ్మెల్సీ కవితను కలిసిన ఫీల్డ్ అసిస్టెంట్లు, ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం కృతజ్ఞతలు తెలుపుతూ సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఎమ్మెల్సీ కవితకు ధన్యవాదాలు తెలిపినవారిలో.. టీఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగం ఇన్చార్జి రూప్ సింగ్, టీఆర్ఎస్ కేవీ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణ, టీఎస్ ఫుడ్స్ ఛైర్మన్ మేడె రాజీవ్ సాగర్ ఉన్నారు. -
విధుల్లోకి ఫీల్డ్ అసిస్టెంట్లు...కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
సాక్షి, హైదరాబాద్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్షేత్ర సహాయకుల నిరీక్షణ ఫలించింది. రెండున్నరేళ్ల క్రితం 7,561 మంది ఈజీఎస్ నుంచి ఫీల్డ్ అసిస్టెంట్లు సమ్మెకు వెళ్లడంతో వారిని విధుల నుంచి తప్పించిన విషయం విదితమే. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా వారిని తిరిగి విధుల్లోకి తీసుకుంటామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. దీంతో గతంలో వారిని తప్పిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకుంది. ఈనెల 11వ తేదీ నుంచి వారిని తిరిగి విధుల్లోకి తీసుకోనున్నట్లు ప్రకటించింది. ఈమేరకు జిల్లా కలెక్టర్లు, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం తొలిసారిగా 2007 ఫిబ్రవరిలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్ల విధానాన్ని తీసుకొచ్చింది. ఫీల్డ్ అసిస్టెంట్లను నియమించి వారికి ఉపాధి హామీ కూలీల మస్టర్ రోల్స్ రాయడం, పనులను పర్యవేక్షించడం, తదితర బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. ఆ తర్వాత జాబ్ కార్డులున్న వాళ్లలో సాధ్యమైనంత ఎక్కువ మందిని ఉపాధికి వచ్చే విధంగా చూడాలని, తప్పనిసరిగా విధుల్లో ఉండాలని అధికారులు ఆదేశించారు. ఆ తరువాత తమకు జీతాలు సబ్‌ట్రెజరీ ద్వారా ఇవ్వాలని, తమను శాశ్వత ప్రాతిపదికన నియమించాలనే పలు రకాల డిమాండ్లతో విధులు బహిష్కరించి సమ్మెకు దిగారు. దీంతో ఆగ్రహించిన ప్రభుత్వం వారి సేవలను రద్దు చేసింది. తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ పలుమార్లు ప్రభుత్వానికి వినతులు సమర్పించారు. ఈ అంశాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ బుధవారం సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ నిర్ణయం పట్ల ఫీల్డ్ అసిస్టెంట్లు హర్షం వ్యక్తం చేస్తూ... తామంతా విధుల్లో చేరతామని ప్రకటించారు. పలుచోట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, పంచాయతీ రాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. -
హైదరాబాద్ ఎన్ఎండీసీ లిమిటెడ్‌లో భారీగా ఉద్యోగాలు
హైదరాబాద్‌లోని నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎన్ఎండీసీ) లిమిటెడ్... ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 200 ► పోస్టుల వివరాలు: ఫీల్డ్ అసిస్టెంట్(ట్రెయినీ)–43, మెయింటెనెన్స్ అసిస్టెంట్ (మెకానికల్ ట్రెయినీ)–90, మెయింటెనెన్స్ అసిస్టెంట్(ఎలక్ట్రికల్ ట్రెయినీ)–35, ఎంసీఓ గ్రేడ్ 3(ట్రెయినీ)–04, హెమ్ మెకానిక్ గ్రేడ్ 3(ట్రెయినీ)–10, ఎలక్ట్రీషియన్ గ్రేడ్3(ట్రెయినీ)–07, బ్లాస్టర్ గ్రేడ్ 2(ట్రెయినీ)–02, క్యూసీఏ గ్రేడ్–3 (ట్రెయినీ)–09. ► అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత ట్రేడులు/సబ్జెక్టుల్లో ఐటీఐ, ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత సర్టిఫికేట్లతో పాటు పని అనుభవం ఉండాలి. ► వయసు: 02.03.2022 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ► వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకి రూ.18,100 నుంచి రూ.35,040 చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: పోస్టుల్ని అనుసరించి రాతపరీక్ష, ఫిజికల్ ఎబిలిటీ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 02.03.2022 ► వెబ్సైట్: nmdc.co.in -
హుజురాబాద్ నామినేషన్ కేంద్రం వద్ద ఉద్రిక్తత
సాక్షి, కరీంనగర్: హుజురాబాద్‌లోని నామినేషన్ కేంద్ర వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నామినేషన్‌కు చివరిరోజు కావడంతో భారీగా రద్దీ ఏర్పడింది. నామినేషన్ వేసేందుకు పెద్ద ఎత్తున వందలాది మంది ఫీల్డ్ అసిస్టెంట్లు తరలివచ్చారు. కాగా కాసేపట్లో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్ వేయనున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డితో కలిసి వెంకట్ స్వయంగా నామినేషన్ వేయనున్నారు. బీజేపీ నుంచి పోటీచేస్తున్న ఈటెల రాజేందర్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఉపఎన్నిక ఇంచార్జ్ జితేందర్ రెడ్డిలతో పాటు పలువురు నేతలతో కలిసి నామినేషన్ వేయనున్నారు. చదవండి: ఈటల, వెంకట్ తరఫున నామినేషన్లు కాగా హుజూరాబాద్ ఉప ఎన్నికకు గురువారం ఒక్కరోజే అత్యధికంగా 11 నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో మొత్తం నామినేషన్ల సంఖ్య 24కు చేరింది. ఇదిలా ఉండగా తులెత్తి మొక్కుతాం. హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ను ఓడించాలని ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు విజ్ఞప్తి చేశారు. తమను ఉద్యోగాల నుంచి తొలగించినందుకు నిరసనగా ఉపఎన్నికలో నామినేషన్లు వేసేందుకు ఫీల్డ్ అసిస్టెంట్లు భారీగా హుజూరాబాద్‌కు తరలివచ్చారు. అయితే తాము నామినేషన్లు వేయకుండా పోలీసులు, అధికారులు అడ్డుకున్నారని వారు ఆరోపించారు. చదవండి: చేతులెత్తి మొక్కుతాం .. టీఆర్ఎస్ను ఓడించండి -
చేతులెత్తి మొక్కుతాం .. టీఆర్ఎస్ను ఓడించండి
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: చేతులెత్తి మొక్కుతాం..హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ను ఓడించాలని ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు విజ్ఞప్తి చేశారు. తమను ఉద్యోగాల నుంచి తొలగించినందుకు నిరసనగా ఉపఎన్నికలో నామినేషన్లు వేసేందుకు ఫీల్డ్ అసిస్టెంట్లు గురువారం భారీగా హుజూరాబాద్‌కు తరలివచ్చారు. అయితే తాము నామినేషన్లు వేయకుండా పోలీసులు, అధికారులు అడ్డుకున్నారని వారు ఆరోపించారు. ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం జేఏసీ చైర్మన్ శ్యామలయ్య నేతృత్వంలో టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించారు. దండం పెడుతూ, గడ్డం పట్టుకుని బతిమాలుతూ ఈ ఉప ఎన్నికల్లో ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కోరారు. అంతకుముందు హుజూరాబాద్ ఆర్డీవో కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. సుమారు 150 మంది రోడ్డుపైనే నిరసన చేపట్టారు. -
HMDA: స్వీపర్లకు శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ల వేధింపులు
సాక్షి, ఉప్పల్(హైదరాబాద్): ఉప్పల్ సర్కిల్ పరిధిలోని శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ (ఎస్ఎఫ్ఏ)ల ఆగడాలు రోజు రోజుకు తారా స్థాయికి చేరుతున్నాయి. చివరకు డబ్బులిస్తేనే ఉద్యోగం చేయాలని అన్నట్లు వ్యవహారిస్తున్నట్లు ఆరోపణలు నిత్యం వెల్లువెత్తుతున్నాయి. నెల జీతం వచ్చిందంటే చాలు అప్పులోల్ల వలే ఇచ్చేదాక వెంటపడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇవ్వని వారిని నయాన్నో, భయాన్నో దారిన తెచ్చుకుంటున్నారు. అడిగినంత ఇవ్వకుంటే వేధింపులు గురిచేస్తూ స్వీపర్లను నానా హింసలు పెడుతున్నట్లు బాధితులు బాహాటంగానే ఫిర్యాదులు చేస్తున్నారు. డబ్బులు ఇవ్వని వారికి అత్యవసర సమయాల్లో సెలవులు ఇవ్వరు. మెడ తిప్పనీయకుండా పనులు చెబుతూ ఆజమాయిషి చేలాయిస్తున్నారు. ఇదేమని ప్రశ్నించే అవకాశం ఇవ్వకుండా బయోమెట్రిక్ వారి చేతులోనే ఉంటుంది కావునా ఆడిందే ఆటగా ఎస్ఎఫ్ఎలు చలామని అవుతున్నారు. ఇదే విషయం ఉన్నతాధికారులకు తెలిసినా సున్నితంగా మందలించి వదిలేస్తూ పట్టీ పట్టనట్లుగా వ్యవహారిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. ఒక్కో స్వీపరు వద్ద ప్రతినెలా రూ. 500 నుంచి రూ.1000 వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. లేకపోతే వేధింపులు తప్పవని బాధితులు కిమ్మనకుండా అడిగినంతా ఇచ్చుకుంటున్నట్లు సమాచారం. జీహెచ్ఎంసీ పరిధిలోని ఉప్పల్ సర్కిల్లో ఎస్ఎఫ్ఎలు 22 మంది, జవాన్లు 11 మంది, 476 మంది స్వీపర్లు నిత్యం విధులు నిర్వహిస్తున్నారు. వీరంతా శానిటరీ సూపర్ వైజర్ ఆధీనంలో ఉంటూ పనిచేస్తున్నారు. ప్రస్తుతం డీఈ స్థానంలో గతంలో ఏఎంఓహెచ్ ఉండే వారు. గత సంవత్సర కాలంగా ఉప్పల్ సర్కిల్లో ఆ పోస్టు ఖాళీగానే ఉంది. అదే స్థానంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ డీఈని అపాయింట్ చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.. ఎస్ఎఫ్ఐల వేధింపులు మా దృష్టికి రాలేదు. వేధింపులకు పాల్పడే వారిని గుర్తించి తగు చర్యలు తీసుకుంటాం. బాధితులు ఎవ్వరైన ఉంటే నేరుగా సంప్రదించి ఫిర్యాదు చేయాలి. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. – చందన, సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ డీఈ చదవండి: West Godavari: కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు మృతి -
హుజూరాబాద్‌లో వేయి మందితో నామినేషన్
హుజూరాబాద్: హుజూరాబాద్‌లో జరగబోయే ఉపఎన్నికలో వెయ్యి మందితో నామినేషన్ వేస్తామని ఫీల్డ్ అసిస్టెంట్ల జేఏసీ జిల్లా అధ్యక్షుడు పత్యం యాదగిరి, ప్రధాన కార్యదర్శి బోయిని తిరుపతి తెలిపారు. రాష్ట్రంలోని 7,500 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఇక్కడే మకాం వేసి అధికార పార్టీకి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఆదివారం హుజూరాబాద్‌లోని హైస్కూల్ క్రీడా మైదానంలో ఫీల్డ్ అసిస్టెంట్ల జేఏసీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత 2019 డిసెంబర్లో సర్క్యులర్ నెంబర్ 4779ని ప్రభుత్వం జారీ చేసిందని, ఆ జీవోను రద్దు చేయాలని ఫీల్డ్ అసిస్టెంట్లు ఉద్యమిస్తే 2020 మార్చిలో విధుల నుంచి తొలగించారని తెలిపారు. 16 నెలలుగా ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఉపఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపే విధుల్లోకి తీసుకోకపోతే పోటీకి దిగుతామని చెప్పారు. కార్యక్రమంలో హుజూరాబాద్, జమ్మికుంట, ఇల్లందకుంట, కమలాపూర్ మండలాల ఫీల్డ్ అసిస్టెంట్ల జేఏసీ అధ్యక్షులు రమేశ్, శ్రీనివాస్, రవి, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. -
ఏం తప్పు చేశారని వారిని తొలగించారు: వైఎస్ షర్మిల
సాక్షి, హైదరాబాద్ /కవాడిగూడ: నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో సాధించుకున్న తెలంగాణలో కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఎవరైనా సంపాదించుకున్నారూ అంటే.. అది కేవలం కేసీఆర్, ఆయన కుటుంబం మాత్రమేనని ఆరోపించారు. కాళేశ్వరం రీడిజైనింగ్, మిషన్ భగీరథ పేరుతో వేల కోట్ల కమీషన్లు తిని, ఫాం హౌస్‌లో దాచిపెట్టుకున్నారని ఆరోపించారు. ఒక్క కొత్త ఉద్యోగం ఇవ్వడం కాదు కదా ఉన్న ఉద్యోగాలకు భరోసా ఇవ్వని అసమర్థ నాయకుడు కేసీఆర్ అని తీవ్రంగా మండిపడ్డారు. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు ఎంతో సంపాదించారని చెప్పడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. రాష్ట్ర వ్యాప్తంగా 7,651 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించడం అన్యాయమని పేర్కొన్నారు. వారిని వెంటనే ఉద్యోగాల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద ఫీల్డ్ అసిస్టెంట్లు చేపట్టిన దీక్షకు షర్మిల సంఘీభావం తెలిపారు. బీసీ సంక్షేమ సంఘం, వివిధ ప్రజా సంఘాలు కూడా మద్దతు పలికాయి. ఏం తప్పు చేశారని తొలగించారు? ఉపాధి పనులు అందరికీ చేరాలనే ఉద్దేశంతో వైఎస్సార్ ఫీల్డ్ అసిస్టెంట్లుగా ఉద్యోగాలు కల్పించారని షర్మిల గుర్తు చేశారు. కానీ ఏం తప్పు చేశారని కేసీఆర్ వారిని తొలగించారని ప్రశ్నంచారు. జీతాలు పెంచాలని అడగడం తప్పా అని నిలదీశారు. ఉద్యోగాలు పోయాయన్న బాధతో ఇప్పటివరకు 50 మంది ప్రాణాలు విడిచారంటూ కన్నీటిపర్యంతమయ్యారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ ప్రజలు, బాధితుల పక్షాన పోరాడుతుందని స్పష్టం చేశారు. మాట నిలబెట్టుకున్న షర్మిల చనిపోయిన ఫీల్డ్ అసిస్టెంట్ల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చిన షర్మిల.. ఆ మేరకు 9 కుటుంబాలకు పార్టీ కార్యాలయంలో రూ.25 వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. హుజూరాబాద్‌లో నామినేషన్లు: ఆర్.కృష్ణయ్య విధుల్లోకి తీసుకోకపోతే హుజూరాబాద్ ఎన్నికల్లో 1,500 మంది వరకు ఫీల్డ్ అసిస్టెంట్లు నామినేషన్లు దాఖలు చేస్తారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, జేఏసీ చైర్మన్ ముదిగొండ శ్యామలయ్య, సీఐటీయూ నాయకులు వెంకట్ తదితరులు దీక్షలో పాల్గొన్నారు. చదవండి: Huzurabad Bypoll: లెక్కలు వేసి.. ఎంపిక చేసి.. -
తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఫీల్డ్ అసిస్టెంట్లు డిమాండ్
-
తెలంగాణ ప్రభుత్వానికి ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల అల్టిమేటం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు అల్టిమేటం జారీ చేశారు. ఈ సందర్భంగా ఎఫ్‌ఏలు మాట్లాడుతూ.. తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తొలగించిన 7600 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవాలన్నారు. లేకుంటే హుజురాబాద్‌లో వేయి మంది పోటీ చేస్తామని హెచ్చరించారు. కాగా ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు విధానాల కారణంగా తమకు అన్యాయం జరుగుతోందని ఫీల్డ్ అసిస్టెంట్లు అవేదన వ్యక్తం చేశారు. ఇందుకు వ్యతిరేకంగా మార్చి 12న సమ్మె బాట పట్టారు. సమస్యలను పరిష్కరించాలని, గ్రేడింగ్ నిర్ణయానికి వెనక్కి తీసుకోవాలంటూ ఉద్యమించారు. వీటిని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం.. అదే నెల 25న సమ్మెకు దిగిన ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్వాసన పలికిన సంగతి తెలిసిందే. -
ఫీల్డ్ అసిస్టెంట్ల పిటిషన్‌పై హైకోర్టు విచారణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో 8 వేల మంది ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై రాష్ట్ర హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఈ పిటిషన్‌ను తెలంగాణ రాష్ట్ర ఫీల్డ్ అసిస్టెంట్ యూనియన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కోర్టు విచారణ సందర్భంగా పిటిషనర్ తరపున సీనియర్ కౌన్సిల్ మాచర్ల రంగయ్య వాదనలు వినిపించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 2005 చట్టం ప్రకారం ఫీల్డ్ అసిస్టెంట్లు పనిచేస్తున్నారని రంగయ్య హైకోర్టుకు తెలిపారు. (ఉస్మానియా ఆస్పత్రి అంశంపై హైకోర్టులో విచారణ) గత నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వకుండా ఉద్యోగులను తొలగించారని అన్నారు. తొలగించిన 8 వేల మంది ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని రంగయ్య కోర్టును కోరారు. పెండింగులో ఉన్న నాలుగు నెలల జీతం చెల్లించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని తెలిపారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. ఫీల్డ్ అసిస్టెంట్ల పిటిషన్‌పై కౌంటర్ ధాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు ప్రభుత్వం రెండు వారాల సమయం కోరింది. తదుపరి విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది. (ఆ విషయంలో జోక్యం చేసుకోలేం : హైకోర్టు) పరీక్షలపై 24న విచారణ అలాగే.. వివిధ ప్రవేశ పరీక్షలు, చివరి సెమిస్టర్ పరీక్షలపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. నీట్, జేఈఈ పరీక్షల వాయిదాకు సుప్రీంకోర్టు నిరాకరించిందని అడ్వకేట్ జనరల్ తెలిపారు. సుప్రీంకోర్టులో తదుపరి విచారణ రేపు జరగనుందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున ఈ నెల 24న విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది. ఈనెల 23లోగా కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశించింది. (చట్టంలో లోపాలుంటే కేంద్రానికి నివేదించండి) ఒక భవనంపై పిల్ ఎందుకు? మరోవైపు జీవో 111పై సుమారు వంద పిటిషన్లు పెండింగ్ ఉన్నాయని హైకోర్టు పేర్కొంది. కోర్టులు తెరిచాక జీవో 111 అంశాన్ని సీరియస్‌గా తీసుకుంటామని తెలిపింది. జీవో 111 ఉల్లంఘించి ఓ భవనం నిర్మిస్తున్నారని పిల్ దాఖలు అవ్వగా.. జీవో 111 పరిధిలో వందల నిర్మాణాలు ఉండగా, ఒక భవనంపై పిల్ ఎందుని హైకోర్టు ప్రశ్నించింది. వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాలకు పిల్ వాడుకోవద్దని హైకోర్టు వ్యాఖ్యానించింది. -
విధుల్లో చేర్చుకోండమ్మా..!
తుర్కపల్లి (ఆలేరు) : ‘మాపై దయ ఉంచి విధుల్లో చేర్చుకోడమ్మా’ అంటూ ఫీల్డ్ అసిస్టెంట్లు, ప్రభుత్వ విప్ గొంగిడి సునితామహేందర్‌రెడ్డి, కలెక్టర్ అనితారామచంద్రన్‌ను వేడుకున్నారు. 6వ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా గురువారం మండల పరిధిలోని బీల్యానాయక్‌తండాలో వారు చిట్టడవి కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. హరితహారం జరుగుతున్న ప్రాంతానికి ఫీల్డ్ అసిస్టెంట్ల జిల్లా ముఖ్య నాయకులు, మండల ఫీల్డ్ అసిస్టెంట్లు వచ్చి ఫ్లకార్డుల ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరారు. కార్యక్రమం ముగిశాక బయలుదేరి వెళ్తున్న కలెక్టర్ అనితారామచంద్రన్‌కు వారి సమస్యను తెలిపారు. కొంత మంది ఫీల్డ్అసిస్టెంట్లు కలెక్టర్ కళ్ల మీద పడి తమను విధుల్లోకి తీసుకోవాలని కోరారు. కలెక్టర్ వారికి నచ్చజెప్పి మీ సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళతామని తెలిపారు. అనంతరం ప్రభుత్వ విప్ సునితామహేందర్‌రెడ్డి వద్దకు వెళ్లి తమను విధుల్లోకి తీసుకోవాలని, ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని, ఇక్కడే సమస్య పరిష్కారం కాదని ఆమె తెలిపారు. కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి రమేశ్, కోశాధికారి జెర్రిపోతుల ఉపేందర్, చాంద్‌పాషా, ఇంద్రయ్య, మల్లేశ్, మాధవి, భవాని, స్వాతి, కవిత, మహేశ్, కరుణాకర్ పాల్గొన్నారు. -
సమ్మెతో రోడ్డున పడ్డారు..
సాక్షి, హైదరాబాద్: సమ్మె వారిని రోడ్డున పడేసింది. 7,500 ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. వారం రోజుల్లోనే సమ్మె విరమించినా.. దిగిరాని ప్రభుత్వం ఫీల్డ్ అసిస్టెంట్ల విధులను పంచాయతీ కార్యదర్శులకు అప్పగించింది. 14 సంవత్సరాలుగా ఉపాధి హామీ పథకంలో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది పనితీరు ఆధారంగా గత డిసెంబర్లో ప్రభుత్వం సంస్కరణలు చేపట్టింది. జాబ్ కార్డు పొందిన ప్రతి కుటుంబానికి ఎఫ్‌ఏలు కనీసం 40 రోజుల పని కల్పించాలని నిబంధన విధించింది. ఈ మేరకు గతేడాది పనితీరును పరిగణనలోకి తీసుకొని గ్రామీణాభివృద్ధి శాఖ.. ఫీల్డ్ అసిస్టెంట్లను గ్రేడింగ్ చేసింది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎఫ్‌ఏలు మార్చి 12న సమ్మె బాట పట్టారు. సమస్యలను పరిష్కరించాలని, గ్రేడింగ్ నిర్ణయానికి వెనక్కి తీసుకోవాలంటూ ఉద్యమించారు. ఈ పరిణామాలను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం.. అదే నెల 25న సమ్మెకు దిగిన ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్వాసన పలికింది. కరోనా నేపథ్యంలో వారం రోజుల్లోనే సమ్మె విరమించినా అధికారులు తమపై కనికరం చూపకపోవడం దారుణమని ఫీల్డ్ అసిస్టెంట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విధుల్లో చేర్చుకోవాలని 2 నెలలుగా ఎంపీడీవోలు, డీఆర్డీవోల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవట్లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 14 ఏళ్లుగా అరకొర జీతాలు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005లో అమల్లోకి రావడంతో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ప్రభుత్వం ఫీల్డ్ అసిస్టెంట్లను నియమించింది. టెన్త్, ఇంటర్, డిగ్రీ విద్యార్హతగా చేరిన వారికి రూ.1,200 వేతనం ఇచ్చిన ప్రభుత్వం.. 2007లో దీన్ని రూ.2 వేలు, 2008లో రూ.3,200, 2009లో రూ.6 వేలకు పెంచింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత అలవెన్స్‌లు సహా రూ.8,900కు పెంచింది. ఇలా అరకొర జీతాలతో 14 ఏళ్లుగా నెట్టుకొస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లకు 4779 సర్క్యులర్ శాపంగా మారింది. గ్రామాల్లో కల్పించిన పని దినాలను బట్టి ఎఫ్ఏల పని తీరును మూడు కేటగిరీలుగా గ్రామీణాభివృద్ధి శాఖ విభజించింది. జాబ్‌కార్డు ఉన్న కుటుంబాలకు సగటున 30కిపైగా పనిదినాలు కల్పించిన ఎఫ్ఏల కాంట్రాక్ట్ రెన్యువల్ చేసి, రూ.10 వేలు జీతం ఇవ్వాలని, అంతకు తక్కువ పనిదినాలు కల్పించిన వారికి రూ.5 వేల జీతం మాత్రమే ఇవ్వాలని, సగటున 10 లోపు పని దినాలు కల్పించిన వారిని తొలగించాలని నిర్ణయించింది. సర్కారు నిర్ణయానికి వ్యతిరేకంగా.. తమ ఉద్యోగ భద్రతకు ముప్పుగా పరిణమించిన 4779 సర్క్యులర్ రద్దు చేయాలని, వేతనాలు పెంచాలనే డిమాండ్‌తో ఫీల్డ్ అసిస్టెంట్లు ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చారు. మార్చి 12న సమ్మెకు దిగారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో అదే నెల 20న ఆందోళన విరమించారు. అయితే, అప్పటికే నోటీసులు జారీ చేసిన అధికారులు వారిని విధుల్లో చేర్చుకోలేదు. తమను విధుల్లోకి చేర్చుకోవాలని ప్రభుత్వ పెద్దలను కలిసినా సానుకూల స్పందన రాలేదు. ఈ క్రమంలోనే తొలగించిన ఎఫ్ఏల విధులను పంచాయతీ కార్యదర్శులకు కట్టబెడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది ఫీల్డ్ అసిస్టెంట్లను మరింత ఆందోళనకు గురిచేసింది. విధుల్లోకి తీసుకోవాలి డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తున్న తమను తొలగించడం అన్యాయం. ఉద్యోగాలు లేకపోవడంతో కుటుంబం గడవడం ఇబ్బందిగా మారింది. ప్రభుత్వం స్పందించి తమను విధుల్లో చేర్చుకోవాలి. సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలి. – కొత్త రాములమ్మ, ఫీల్డ్ అసిస్టెంట్, అడవి దేవులపల్లి, నల్లగొండ జిల్లా తొలగించటం సరికాదు.. ప్రభుత్వం ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల నుంచి తొలగించటం సరికాదు. 14 ఏళ్లుగా సేవలందిస్తున్న మాపై అకారణంగా వేటు వేయడంతో రో డ్డున పడ్డాం. ప్రభుత్వం పునరాలోచన చేసి తక్షణమే విధుల్లోకి తీ సుకోవాలి. 14 ఏళ్లకు పైగా పనిచేస్తున్న వారిని క్రమ బద్ధీకరించి.. హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి. – మేకపోతుల సరిత, ఫీల్డ్ అసిస్టెంట్, గరిడేపల్లి మండలం, సూర్యాపేట జిల్లా -
ఫీల్డ్ అసిస్టెంట్ల తొలగింపు అనైతికం: ఆర్.కృష్ణయ్య
ముషీరాబాద్ (హైదరాబాద్): గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేసే 7,500 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యానగర్‌లోని బీసీ భవన్లో శనివారం జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య సత్యాగ్రహదీక్ష చేపట్టారు. ఆయనకు మద్దతుగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి.హనుమంత్‌రావు, టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్సీ రాములు, తెలంగాణ జనసమితి నగర అధ్యక్షులు ఎం.నర్సయ్యలతో పాటు వివిధ కుల, ప్రజా సంఘాల నాయకులు దీక్షకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ...గత 14 ఏళ్లుగా పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లను ప్రభుత్వం తొలగించడం అనైతికమని, ఏ కారణం చేత వారిని తొలగించారో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. జీతాలు పెంచాలని సమ్మె చేస్తే ఉద్యోగం నుంచి తొలగిస్తారా అని ప్రశ్నించారు. ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు చేసే 7,500 మంది ఉద్యోగులలో 7,450 మంది అంటే 90% బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందినవారని ఆయన గుర్తుచేశారు. ఈ అక్రమ తొలగింపుపై జాతీయ బీసీ,ఎస్సీ, ఎస్టీ కమిషన్లు జోక్యం చేసుకుని వారికి న్యాయం చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ, జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, నీల వెంకటేశ్ తదితరులు సత్యాగ్రహదీక్షలో పాల్గొన్నారు. దీక్షకు జాతీయ బీసీ సేన అధ్యక్షులు బర్క కృష్ణతో పాటు ఇతర బీసీ నాయకులు మద్దతు తెలిపారు. బీసీ భవన్లో సత్యాగ్రహ దీక్ష చేస్తున్న ఆర్.కృష్ణయ్య. పక్కన చాడ వెంకట్‌రెడ్డి, ఎల్.రమణ తదితరులు -
ఉపాధి హామీలో వేతన ‘విభజన’
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ పేదలకు ఏడాదికి 100 రోజుల పని కల్పించేందుకు ఉద్దేశించిన ఉపాధి హామీ పథకం అమల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొం టున్న ఫీల్డ్ అసిస్టెంట్లను దారి లోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా ఫీల్డ్ అసిస్టెంట్లకు నిర్దేశించిన నెలకు రూ.10 వేల వేతనాన్ని పనితీరు ఆధారంగా విభజించనుంది. ఈ మేరకు గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ రఘునందన్‌రావు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్లకు కేటాయించిన పంచాయతీల్లోని జాబ్‌కార్డుదారులకు కల్పించే పనిదినాల ఆధారంగా వారిని విభజించాలని, మరీ తక్కువ పని దినాలు కల్పించిన ఫీల్డ్ అసిస్టెంట్లను వెంటనే తొలగించాలని, ఫీల్డ్ అసిస్టెంట్ల కేటగిరైజేషన్తో పాటు తొలగింపు ప్రక్రియను ఈనెల 14కల్లా పూర్తి చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. మూడు కేటగిరీలుగా విభజన.. ఇప్పటివరకు రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం కింద కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న వారికి నెలకు రూ.10 వేల వేతనం ఇస్తున్నారు. ప్రతి యేటా జూలై 1 నుంచి వచ్చే ఏడాది జూన్ 30 వరకు వారిని రెన్యువల్ చేస్తుంటారు. వీరు ఈ పథకం కింద వారికి కేటాయించిన పంచాయతీల్లోని జాబ్‌కార్డు దారులందరికీ పనిదినాలు కల్పించాల్సి ఉంటుంది. అయితే, ఈ పనిదినాల కల్పన ఆధారంగానే ఫీల్డ్ అసిస్టెంట్లను ఇప్పుడు ప్రభుత్వం విభజిస్తోంది. పంచాయతీలోని జాబ్‌కార్డు ఉన్న వారికి కనీసం 30 అంతకన్నా ఎక్కువ పనిదినాలు కల్పించిన వారిని కేటగిరీ–1లో పెట్టి వారికి గతంలో ఇస్తున్న విధంగానే నెలకు రూ.8,900 వేతనం, రూ.1,100 అలయెన్సులు కలిపి రూ.10 వేలు చెల్లించనుంది. కేటగిరీ–1.. జాబ్‌కార్డుదారులకు కనీసం 30 అంతకన్నా ఎక్కువ పనిదినాలు కల్పించిన వారికి రూ.10 వేలు చెల్లించనుంది. వీరి కాంట్రాక్టును రెన్యువల్ చేయనుంది. కేటగిరీ–2ఏ.. 29–20 రోజుల పని దినాలు కల్పించగలిగిన ఫీల్డ్ అసిస్టెంట్లను ఈ కేట గిరీలో ఉంచి వారి రెన్యువల్‌ను పెండింగ్‌లో పెట్ట నున్నారు. వేతనం నెలకు రూ.9వేలకు పరిమితం చేయనున్నారు. కేటగిరీ–2బీ.. నెలకు 19–10 పని దినాలు కల్పించగలిగిన వారిని ఈ కేటగిరీలో పెట్టి వారి కాంట్రాక్టును కూడా రెన్యువల్ చేయరు. వారి వేతనాన్ని రూ.7,500గా నిర్ధారించనున్నారు. వీరి కాంట్రాక్టును గత ఏడాది జూలై నుంచి ఈ ఏడాది జూన్ వరకు రెన్యువల్ కూడా చేయనుంది. ఇక, 29–20 రోజుల పనిదినాలు కల్పించగలిగిన ఫీల్డ్ అసిస్టెంట్లను కేటగిరీ–2ఏలో ఉంచి వారి రెన్యువల్‌ను పెండింగ్‌లో పెట్టాలని, వారి వేతనాన్ని నెలకు రూ.9వేలకు పరిమితం చేయనున్నారు. అలాగే నెలకు 19–10 పనిదినాలు కల్పించగలిగిన వారిని కేటగిరీ–2బీలో పెట్టి వారి కాంట్రాక్టును కూడా రెన్యువల్ చేయవద్దని, వారి వేతనాన్ని రూ.7,500గా నిర్ధారించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇక, సగటున కనీసం 10 పనిదినాలు కూడా కల్పించలేని వారిని వెంటనే తొలగించాలని, ఈ మేరకు వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించారు. ఈ పనిదినాల కల్పన పనితీరును 2018, జూలై 1 నుంచి 2019 జూన్ 30 మధ్య పరిగణనలోకి తీసుకోవాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ల అసంతృప్తి.. ప్రభుత్వ నిర్ణయంపై ఫీల్డ్ అసిస్టెంట్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి పనుల కల్పన విషయంలో పంచాయతీల వారీగా వ్యత్యాసం ఉంటుందని అంటున్నారు. చిన్న పంచాయతీల్లో 50ఐ100 కార్డులు మాత్రమే ఉంటాయని, ఆయా కుటుంబాలకు సగటున ఏటా 30 పనిదినాల కల్పన అంత కష్టమేమీ కాదంటున్నారు. అలాగే 1000 జాబ్‌కార్డులున్న గ్రామాలు, వాటి హ్యామ్లెట్లలోని అన్ని కుటుంబాలకు సగటున 30 పనిదినాలు కల్పించడం అంత సులువైన కాదని చెబుతున్నారు. గత 14ఏళ్లుగా గ్రామాల్లో చాలా చేశామని, ఇప్పుడు కొత్తగా చేయడానికి పనులు కూడా లేవని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో 30 పనిదినాల ప్రాతిపదికన తమను విభజించడం సరైంది కాదని తెలంగాణ ఫీల్డ్ అసిస్టెంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ముదిగొండ శ్యామలయ్య వ్యాఖ్యానించారు. ఈ సర్క్యులర్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ఇప్పటికే సమ్మెకు నోటీసు ఇచ్చామని, సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ల ముట్టడి ఉందని, 11న చలో హైదరాబాద్ కార్యక్రమం చేపడతామని, అప్పటికీ ప్రభుత్వం ఈ ఉత్తర్వులను రద్దు చేయకపోతే ఈనెల 12 నుంచి విధులు బహిష్కరించి పూర్తిస్థాయి సమ్మెకు దిగిపోతామని హెచ్చరించారు. ఫీల్డ్ అసిస్టెంట్లపై వస్తున్న విమర్శలివే... గత 14 ఏళ్లుగా గ్రామాల్లో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ల పనితీరు విమర్శలకు కారణమవుతోంది. ప్రభుత్వం ఇచ్చే వేతనానికి తోడు కొన్ని నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా సంపాదిస్తున్నారని, పని దినాల కల్పనలో పేదలను తమ ఇళ్ల చుట్టూ తిప్పించుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. సొంత పనులు చక్కబెట్టుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, తమకు అనుకూలంగా ఉన్న వారికి, సన్నిహితులు, బంధువులకు పని కల్పించేలా వారి పేర్లను మస్టర్లలో రాస్తున్నారని, కొన్ని చోట్ల పని చేయకుండానే మస్టర్లను రాస్తున్నారని ప్రభుత్వం నిర్ధారించింది. ముఖ్యంగా గ్రామాల్లోని పేదలను, రాజకీయ నాయకులను తమ గుప్పిట్లో పెట్టుకుని ఆయా గ్రామాలను ఓ రకంగా శాసించే స్థాయికి కొందరు ఫీల్డ్ అసిస్టెంట్లు చేరిపోయారనే తీవ్ర ఆరోపణలు కూడా వారిపై ఉన్నాయి. -
పచ్చరంగు పూసుకున్న ఫీల్డ్ అసిస్టెంట్
సాక్షి, కణేకల్లు: ఆదిగానిపల్లికి చెందిన ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ తిప్పేస్వామి పచ్చరంగు పూసుకున్నాడు. టీడీపీ నాయకులతో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరగడమే కాదు ఏకంగా ఊళ్లో ఎన్నికల ప్రచారం చేస్తున్నాడు. అసలే కూలీలు అత్యధికంగా ఉన్న గ్రామం ఆదిగానిపల్లి. ‘ఎన్నికల్లో టీడీపీకి ఓటేస్తే మీకు ఉపాధి పని కల్పిస్తా.. లేకపోతే పని ఉండదు మీ ఇష్టం. ఆలోచించండి... ఉపాధి లేకపోతే ఊరు వదిలి బతుక్కునేందుకు బెంగళూరుకు వెళ్లాల్సి వస్తుంది’ అంటూ కూలీలను హెచ్చరిస్తున్నాడు. గ్రామంలో టీడీపీ తరఫున జరిగే ఎన్నికల ప్రచారంలో కీలకపాత్ర పోషిస్తూ కూలీలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు. అంతేకాకుండా టీడీపీకి ఓటేస్తేనే మీ పింఛన్ వస్తాది.. లేకపోతే పింఛన్ కూడా పోతుంది అంటూ పింఛన్‌దారులనూ బెదిరిస్తున్నట్లు సమాచారం. ఎన్నికల్లో ప్రత్యక్షంగా టీడీపీకి ప్రచారం చేస్తూ ప్రజలను భయపెడ్తున్న ఫీల్డ్ అసిస్టెంట్‌పై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నాయకులు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి విజ్ఞప్తి చేస్తున్నారు. -
పని చేయకపోయినా ‘కూలి’
సాక్షి, కందుకూరు రూరల్ (ప్రకాశం): మండలంలో టీడీపీకి ఓటు వేసే పనైనా పనులకు రావాల్సిన అవసరం లేదు. పనులకు వచ్చినా కనిపించి వెళ్తే చాలు.. మీరు ఎప్పుడు పనికి వచ్చినా ఫర్వాలేదు. మీకు రావాల్సిన పూర్తి కూలి వస్తుందంటూ బహిరంగంగానే చెబుతున్నారు. కూలీలు పని చేయకుండానే మస్టర్లు వేస్తుంటే ఎవరికైనా ఆశ కలుగుతుంది కదా అని వారిని అనుకూలంగా మార్చుకుంటున్నారు. పనికి రాకుండా ఉపాధి మస్టర్లు వేసి కూలీలను సైతం ప్రలోభాలకు గురి చేస్తున్నారు. అంతా అనుకూలమైన వాళ్లే టీడీపీ 2014 ఎన్నికల తర్వాత టీడీపీ ప్రభుత్వంలోకి రాగానే పాత ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించి టీడీపీకి అనుకూలమైన సీనియర్ మేట్లు, టీడీపీ కార్యకర్తలను ఫీల్డ్ అసిస్టెంట్లుగా నియమించారు. దీంతో ప్రస్తుతం ఎన్నికల్లో వారి ప్రభావం చూపిస్తున్నారు. ఎలాగైనా కూలీలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకూ మస్టర్ల ద్వారా ఎర వేస్తున్నారు. దీనిపై అధికారులు కూడా పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తుండడంతో ఫీల్డ్ అసిస్టెంట్ వారి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. అందరికీ వాటా... ఎన్నికల ప్రలోభాలతో పాటూ ఎన్ఆర్ఈజీఎస్ అధికారులు వారి వాటా వారు పంచుకుంటున్నారు. పనికి రాక పోయినా ఫర్వాలేదు. రూ.180ల నుంచి రూ.200లు వరకు రోజుకొక కూలి వేసి మీకు వారానికి రూ.1000ల నుంచి రూ.1100ల వరకు కూలి వచ్చేలా చేస్తామంటున్నారు. ఒక కూలి వారికి రూ.100ల వరకు ఇస్తే చాలంటున్నారు. ఇలా మండలంలో 19 పంచాయతీలు ఉంటే సుమారు 3500 మంది పనులకు హాజరవుతున్నారు. వారికి వంద రూపాయిలు చొప్పున రూ.3.50 లక్షలు వసూళ్ల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఈ సొమ్మును ప్రాజెక్టులోని ప్రతి అధికారికి చేరుతున్నట్లు సమాచారం. ఇలా మండలంలో కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్ము పక్కదారి పడుతున్నా ఉన్నతాధికారులు పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తుండటంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక పక్క ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగమవుతున్నా దానిని ఓట్ల ప్రలోభాలకు కూడా మార్చుకుంటున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్థానికులు సూచిస్తున్నారు. -
ఉపాధి హామి ‘ప్రచార’ పథకం
ఉపాధి హామి పథకం అంటే చెరువుల పూడిక తీయడమో, కాలవలు తవ్వడమో, మొక్కలు నాటడమో ఉంటుంది కాని సదరు మంత్రి ఇలాకాలో మాత్రం ఉపాధి హామి ప్రచార పథకంగా మారింది. తన తరుపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే చాలు పనికి వెళ్లకున్నా వారం రోజులు హాజరు పడుతుంది. ఇదిలా ఉంటే మాకు పని కల్పించి వేతనం ఇవ్వండి మహాప్రభో.. మీ ఎన్నికల ప్రచారం మీరే చేసుకోండి అంటూ ఉపాధిహామి వేతనదారులు వేడుకోవడం కొసమెరుపు. సాక్షి, కోటబొమ్మాళి: టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తున్న మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు నామినేషన్ కార్యక్రమానికి తరలివస్తే వారం రోజులు పనికి రాకుండానే మస్టర్లు వేస్తామని మండలంలోని ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు హామీ ఇస్తూ తమపై ఒత్తిడి తెస్తున్నారని ఉపాధిహామీ వేతనదారులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు మండలంలోని చీపుర్లపాడు, లఖందిడ్డి, ఎత్తురాళ్లపాడు, జర్జంగి, హరిశ్చంద్రపురం, అక్కయ్యవలస, గంగారాం తదితర పంచాయతీలకు చెందిన ఉపాధి వేతన దారులు ఆరోపించారు. లఖందిడ్డి పంచాయతీకి చెందిన ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ సంజీవరావు తమపై ఒత్తిడి తెస్తున్నారని, తాము చెప్పిన ప్రకారం నడుచుకోకపోతే భవిష్యత్‌లో ఉపాధి పనులు లేకుండా చేస్తామని బెదిరించాడని లఖందిడ్డి, మూలపేట గ్రామాలకు చెందిన వేతనదారులు బమ్మిడి ఆదినారాయణ, పైడి జగన్నాథరావు, బమ్మిడి శ్రీరాములు, మూల సింహాచలం, మూల గోవిందరావు, మూల జోగారావు, బమ్మిడి అమ్మలు, పైడి అన్నపూర్ణ, పైడి ఉత్తరమ్మ, పైడి వేణమ్మ తదితరులు ఆరోపించారు. ఈ నెల 20 వ తేదీన మంత్రి అచ్చెన్నాయుడు టెక్కలిలో టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమానికి విధిగా హాజరు కావాలని మండలంలో గల అన్ని పంచాయతీల çపరిధుల్లోని ఉపాధి వేతనదారులకు సంబంధిత ఫీల్డు అసిస్టెంట్లు హుకుం జారీచేసినట్లు వేతనదారులు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని లఖందిడ్డి వేతనదారులు స్పష్టం చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్లను తప్పించాలి శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లు అధికార పార్టీకి అండగా ఉంటూ పింఛన్లు , ఇతర పథకాల గురించి ప్రచారం చేస్తూ టీడీపీకి ఓటేయాలని, లేకుంటే పింఛన్లు రద్దు చేస్తామని బెదిరిస్తూ ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని చీపుర్లపాడు పంచాయతీకి చెందిన వైఎస్సార్సీపీ నాయకులు ఆరోపించారు. ఈ మేరకు సోమవారం నేతింటి అప్పలస్వామి, చల్లరాము, కాకి లక్ష్మణరావు, నెయ్యిల సురేష్ తదితరులు ఎన్నికల సహాయ రిటర్నింగ్ అధికారి కె. ఆది మహేశ్వరరావుకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కి ఓటర్లను ప్రభావితం చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ ఇప్పిలి రమేష్‌ను, అలాగే ఇతర ఫీల్డ్ అసిస్టెంట్లను సంక్షేమ పథకాల పంపిణీ భాద్యత నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అనంతరం స్థానిక ఎంపీడీఓ ఎం.సతీష్‌కు వినతిపత్రాన్ని అందించారు. -
ఫీల్డ్ అసిస్టెంట్లపై అధికారుల కొరడా
సాక్షి, శంకరపట్నం: చెరువులు, కుంటల్లో ఫిష్‌పాండ్ పనుల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయి. మండలం లోని 24 గ్రామాల్లో ఉపాధిహామీ పథకంలో ఫిష్ పాండ్, ఎస్సారెస్పీ కాలువ పూడితక తీత, హరిత హారంలో మొక్కల పెంపకం, పంట కాలువల త వ్వకం, కిచెన్షెడ్లు, ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు పనులుచేశారు. మండలంలో11వేల పైచిలుకు జాబ్‌కార్డులు ఉన్నాయి. జాబ్‌కార్డులలో 26 వేలవరకు కూలీలు ఈ పథకంలో పనులు చేస్తున్నారు. 2017 ఆగస్టు నుంచి ఏడాదిలో చేపట్టిన పనులపై సోషల్ఆడిట్ నిర్వహించారు. ఫిబ్రవరి 18న సామాజిక తనిఖీ ప్రజావేదిక ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో నిర్వహించారు. ఈ ప్రజావేదికలో మండలంలో ఎక్కువ మొత్తంలో కూలీల కు అదనపు వేతనాలు చెల్లింపులు చేశారని నివేది క ఇచ్చారు. వెలుగులోకి అక్రమాలు.. ఫిష్‌పాండ్ నిర్మాణాల్లో కూలీలు చేసిన పనికి అద నంగా వేతనాలు చెల్లించేటట్లు కొలతలు తీశారని తేలింది. మండలంలోని కరీంపేట, కొత్తగట్టు, లింగాపూర్,రాజాపూర్, చింతలపల్లె, ధర్మారం, మెట్‌పెల్లి గ్రామల ఫీల్డ్‌అసిస్టెంట్లపై ఆరోపణలు రావడంతో సస్పెన్సన్ చేసినట్లు డీఆర్డీవో వెంకటేశ్వర్రావు ఆదేశాలు జారీచేశారు. మండలవ్యాప్తంగా రూ.15,95,844 చేసిన పనుల కంటే అత్యధికంగా కూలీలకు వేతనాలు చెల్లించినట్లు సోషల్ ఆడిట్లో వివరాలు వెల్లడయ్యాయి. కూలీల చేత పనులు చేయించాల్సిన ఫీల్డ్అసిస్టెంట్లు చేయని ప నులకు రూ. లక్షల్లో వేతనాలు చెల్లించడానికి కారుకులయ్యారని తేలింది. అత్యధికంగా కరీంపేటలో రూ.7.32 లక్షలు, చింతలపల్లెలో రూ.2.41 లక్షలు మెట్పల్లిలో రూ.1.13లక్షలు, కొత్తగట్టులో రూ.1. 10 లక్షలు, రాజాపూర్ రూ.32వేలు, లింగాపూర్ రూ.26వేలు అదనంగా కూలీలకు చెల్లించినట్లు తే లింది. మెట్పల్లి ఫీల్డ్అసిస్టెంట్ స్రవంతి భర్త మధు ఉపాధిహామీ పనులు చేయకున్నా పనులు చేసినట్లు రూ.19వేల వేతనం చెల్లింపులు చేసినందుకు గతనెల 18న సస్పెన్సన్ చేసిన విషయం విధిత మే. ఉపాధిహామీ పథకంలో అక్రమలు వెలుగు చూడడంతో కరీంపేట ఫీల్డ్అసిస్టెంట్ సల్మా, కొత్తగట్టు ఫీల్డ్అసిస్టెంట్ కలీషా, చింతలపల్లె చంద్రమౌళి, లింగాపూర్ ఫీల్డ్అసిస్టెంట్ రవి, ధర్మారం ఫీల్డ్అసిస్టెంట్ శంకర్, రాజాపూర్ ఫీల్డ్అసిస్టెంట్ ప్రభాకర్‌ను సస్పెన్సన్ చేస్తూ డీఆర్డీవో ఆదేశాలు జారీచేయడం సంచలనం కలిగించింది. రూ.15 లక్షల రికవరీ.. ఉపాధిహామీ పథకంలో కూలీలకు అదనంగా వేతనాలు చెల్లింపులు చేయడానికి కారణమైన ఫీల్డ్అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, జేఈల నుంచి రూ. 15,95,844 రికవరీ చేసేందుకు నోటీసులు జారీచేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే సస్పెన్సన్‌కు గురైన ఫీల్డ్అసిస్టెంట్లు 14 రోజుల్లో వివరణ ఇవ్వా లని డీఆర్డీవో జారీచేసిన మెమోలో సమాచారం అందించారు. -
ఫీల్డ్ అసిస్టెంట్ హత్య
గుడిబండ: గుడిబండ మండలం తిమ్మళాపురంలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ మోహన్ (32) హత్యకు గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మోహన్ మోరుబాగల్ పంచాయతీలో ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ఇతను స్వగ్రామంలో ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. రెండు, మూడేళ్లుగా ఈ వ్యవహారం కొనసాగుతోంది. ఆదివారం రాత్రి మోహన్ ఇంటి బయట పడుకున్నాడు. సోమవారం ఉదయానికి ఇంటి వెనుక వీధిలో విగతజీవిగా పడి ఉన్నాడు. కుటుంబ సభ్యులకు విషయం తెలియడంతో అక్కడకు చేరుకుని బోరున విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పరిశీలిస్తే.. గొంతుకు తాడుతో బిగించిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. శరీరంపై డ్రాయర్ మాత్రమే ఉంది. ఇంటి బయట పడుకుని ఉన్న యువకుడిని దుండగులు బలవంతంగా ఎత్తుకెళ్లి, గొంతుకు తాడు బిగించి చంపి పడేసి ఉంటారని తెలుస్తోంది. పోలీసులు డాగ్‌స్క్వాడ్‌ను పిలిపించి పరిశీలించారు. జాగిలాలు మృతుడి ఇంటి వద్ద నుంచి మరో ఇంటి వద్ద వరకు వెళ్లి ఆగాయి. ప్రేమ వ్యవహారం నేపథ్యంలో హత్యకు గురయ్యాడా.. లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది. హతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సీఐ శుభకుమార్, ఎస్ఐ శరత్చంద్ర తెలిపారు. -
భారత సంతతి వ్యక్తికి అరుదైన పురస్కారం
న్యూయార్క్ : ఆస్ట్రేలియాకు చెందిన భారత సంతతి వ్యక్తిని ప్రతిష్టాత్మక ‘ఫీల్డ్స్’ మెడల్ వరించింది. ఇండో - ఆస్ట్రేలియన్ అయిన అక్షయ్ వెంకటేష్ ఈ అరుదైన ఘనత సాధించారు. గణిత శాస్త్ర రంగంలో విశేష కృషి చేసిన వారికి ‘ఫీల్డ్స్ మెడల్’ను బహుకరిస్తారు. దీన్ని గణిత శాస్త్ర రంగంలో నోబెల్‌గా భావిస్తారు. ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి ప్రకటించే ఈ పురస్కారం ఈ సారి భారత సంతతి వ్యక్తి అక్షయ్‌ను వరించింది. ఈ అరుదైన పురస్కారాన్ని అక్షయ్ మరో నలుగురితో కలిసి పంచుకునున్నారు. ఈ అవార్డు అందుకున్న వారిలో కచేర్ బిర్కర్(ఇరానీయన్ కుర్దిషియ్, కేంబ్రిడ్జి యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు), పీటర్ స్కాల్జ్ (జర్మనికి చెందిన వ్యక్తి, ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ బాన్ అండ్ అలెస్సియో ఫిగల్లిలో ప్రొఫెసర్), మరో ఇటాలియన్ మ్యాథమేటిషియన్లు ఉన్నారు. వీరితో కలిసి అక్షయ్ బ్రెజిల్‌లోని రియో డీ జెనిరాలో ఉన్న ‘ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ మ్యాథమేటిషియన్స్’లో బుధవారం (నిన్న) నాడు ఈ అవార్డును అందుకున్నారు. దీంతో పాటు ప్రతి ఒక్కరు 15 వేల కెనడియన్ డాలర్ల(ఇండియన్ కరెన్సీలో 7, 88, 358 రూపాయలు) విలువైన ప్రైజ్ మనీని గెలుచుకున్నారు. న్యూఢిల్లీలో జన్మించిన అక్షయ్(36) రెండేళ్ల వయసులో తన తల్లిదండ్రులతో కలిసి ఆస్ట్రేలియా, పెర్త్‌కు వెళ్లిపోయారు. ప్రస్తుతం స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో మ్యాథ్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. అక్షయ్‌కు భౌతిక శాస్త్రం, గణిత శాస్త్రలంటే చాలా ఇష్టం. ఇప్పటికే గణిత శాస్త్ర రంగంలో చేసిన కృషికి గాను పలు అవార్డులు అందుకున్నారు. 1924 టొరంటోలో జరిగిన మ్యాథ్య్ కాంగ్రెస్‌లో భాగంగా కెనడియన్ గణితశాస్త్రవేత్త జాన్ చార్లెస్ ఫీల్డ్ అభ్యర్ధన మేరకు 1932లో ఫీల్డ్ మెడల్‌ను ఇవ్వడం ప్రారంభించారు. అప్పటి నుంచి గణిత శాస్త్రరంగంలో అపార కృషి చేసిన వారికి ప్రతి నాలుగేళ్లకు ఒకసారి ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నారు. నలభై ఏళ్లలోపు ఉన్న వారికి మాత్రమే దీన్ని ఇవ్వడం ఆనవాయితి. -
వైఎస్ జగన్‌ను కలిసిన ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు
-
పిట్ట కొంచెం.. చేసింది ఘనం
బెర్లిన్ : ‘పిట్ట కొంచెం కూత ఘనం’ సామెత వినే ఉంటాము. జర్మనిలో ఓ చిన్న పిట్టను చూసిన వారు కూడా ఇదే మాట అంటున్నారు. జాలీ కూడా పడుతున్నారు. కారణం కరెంట్ షాక్ తగిలిన ఆ చిన్న పిట్ట తను కాలిపోవడమే కాక దాదాపు 17 ఏకరాల విస్తీర్ణంలో కార్చిచ్చు రగిల్చింది. ఈ సంఘటన జర్మన్ తీర ప్రాంతం రోస్టాక్‌లో జరిగింది. వివరాల ప్రకారం.. ఒక చిన్న పక్షి అనుకోకుండా కరెంటు తీగలకు తాకడంతో మంటలు అలముకున్నాయి. దాంతో ఆ పక్షి అక్కడే ఉన్న పొలాల్లో పడిపోయింది. అసలే అవన్ని ఎండు గడ్డి పోలాలు. ఇంకేముంది దాంతో క్షణాల్లో మంటలు వ్యాపించాయి. అగ్నికి ఆజ్యం పోసినట్లు.. సరిగ్గా ఇదే సమయానికి ఈదురు గాలులు కూడా తోడవడంతో ఆ మంటలు కాస్తా అలా అలా దాదాపు 17 ఎకరాల మేర వ్యాపించాయి. అయితే సమయానికి చుట్టు పక్కల జనాలు ఎవరూ లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పిందంటున్నారు అధికారులు. మంటలు గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటాన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఇలాంటి సంఘటనే ఒకటి ఈ ఏడాది మార్చిలో జరిగింది. కొందరు అమెరికన్ విద్యార్ధులు పాస్తాలో నీళ్లు పోయకుండా వండుదామని ప్రయత్నించారు. ఆ ప్రయోగం కాస్తా ఫెయిల్ అయ్యి అపార్ట్మెంట్ మొత్తం మంటలు వ్యాపించిన సంగతి తెలిసిందే. -
అద్దంకి కోర్టు ఫీల్డ్ అసిస్టెంట్ ఆత్మహత్య
ఒంగోలు: అద్దంకి కోర్టులో ఫీల్డ్ అసిస్టెంట్ (అమీనా)గా పనిచేస్తున్న గుంజి వెంకటేశ్వర్లు (51) పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ వివరాల్లోకెళ్తే... శనివారం రాత్రి పురుగుమందు డబ్బా పట్టుకుని కేకలు వేసుకుంటూ తాలూకా పోలీసుస్టేషన్‌కు వెంకటేశ్వర్లు చేరుకున్నాడు. స్టేషన్ ఆవరణలో ఉన్న కానిస్టేబుల్ కృపారావు అతడిని గమనించేలోపే కుప్పకూలిపోవడంతో ఆటోలో ఎక్కించుకుని హుటాహుటిన రిమ్స్‌కు తరలించారు. రిమ్స్ వైద్యులు పరిశీలించి వెంకటేశ్వర్లు మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతుని జేబులో రెండు రకాల ఫిర్యాదు కాపీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒక ఫిర్యాదు గుంటూరు జిల్లా ఎస్పీకి సంబంధించి మే 26న రాసుకున్న కాపీ కాగా, రెండోది శనివారం స్థానిక తాలూకా పోలీసులకు రాసుకున్నది. వాటిలోని సారాంశం ప్రకారం... 2015లో గుంటూరుకు చెందిన ఒక అడ్వకేట్ ఉద్యోగాలు ఇప్పిస్తామని రూ.10 లక్షలను గుంజి వెంకటేశ్వర్లు వద్ద తీసుకున్నాడు. ఉద్యోగాలు ఇప్పించకపోగా, డబ్బులు తిరిగి ఇవ్వకపోవడం, తదితర కారణాలతో వెంకటేశ్వర్లు కుటుంబంలో కలతలు చెలరేగాయి. ఈ నేపథ్యంలోనే వెంకటేశ్వర్లు అప్పుల బాధకు లోనై తనకు నెహ్రూకాలనీలో ఉన్న రూ.30 లక్షల విలువైన ఇంటిని అమ్ముకున్నాడు. దీంతో కుటుంబంలో కలతలు చెలరేగి భార్య కల్పన, కొడుకు మణిదీప్‌లు అతన్ని 2016లో కొట్టారు. అతను ప్రైవేటు ఆస్పత్రిలో వారంరోజుల పాటు ఉండి చికిత్స చేయించుకున్నాడు. కుటుంబంలో కలతలు పెరగడం సరికాదని భావించి కేసు కూడా పెట్టలేదు. కాగా, శనివారం మరోమారు భార్య, కుమారుడు అతన్ని వేధించి పోలీసుస్టేషన్లో కేసు పెడతామంటూ బెదిరించారు. దీంతో వెంకటేశ్వర్లు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై సీఐ గంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రాథమికంగా తమకు అందిన సమాచారం మేరకు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పిన అడ్వకేట్‌కు, బాధితులకు గుంజి వెంకటేశ్వర్లు మధ్యవర్తిగా ఉన్నాడా.. లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనేది తెలియరావాల్సి ఉందన్నారు. నెలరోజుల కిందటే జిల్లా కోర్టు నుంచి అద్దంకి కోర్టుకు వెంకటేశ్వర్లు బదిలీ అయ్యారని దర్యాప్తులో వెల్లడైందన్నారు. మృతుడి భార్య, కుమారుడు కేసు పెడతారేమోనన్న భయంతోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని ప్రాథమికంగా తెలుస్తోందన్నారు. మృతుడి భార్య, కుమారుడిని విచారించాల్సి ఉందన్నారు. మరణించిన గుంజి వెంకటేశ్వర్లు స్థానిక ఎన్జీవో కాలనీలో నివాసం ఉంటున్నాడని తెలిపారు. -
15 మంది ఫీల్డ్ అసిస్టెంట్ల సస్పెన్షన్
కర్నూలు(అర్బన్) : ఉపాధి హామీ అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 15 మంది ఫీల్డ్ అసిస్టెంట్ల(సీనియర్ మేటీలు)ను సస్పెండ్ చేసినట్లు డ్వామా పీడీ ఎం.వెంకటసుబ్బయ్య తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 2018–19 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం నిర్ణయించిన పనిదినాలను పూర్తి చేయడంలో ఫీల్డ్ అసిస్టెంట్లు పూర్తిగా విఫలమయ్యారన్నారు. ఆర్థిక సంవత్సరం ప్రారంభమై నెల రోజులు పూర్తి కావొస్తున్నా ఇంతవరకు ఆయా గ్రామ పంచాయతీల్లో ఉపాధి పనులు ప్రారంభం కాని విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుపోయాన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆదోని మండలం బసాపురం, చిన్నహరివాణం, ఆత్మకూరు మండలం సున్నిపెంట, చాగలమర్రి మండలం నేలంపాడు, హొళగుంద మండలం పెద్దగోనేహాల్, కోసిగి మండలం జంబులదిన్నె, మిడుతూరు మండలం కలమందలపాడు, ఓర్వకల్లు మండలం మీదివేముల, అవుకు మండలం చెర్లోపల్లి, రామాపురం, పాణ్యం మండలం కొత్తూరు, ప్యాపిలి మండలం మెట్టుపల్లి, ఎన్.రంగాపురం, పెద్దపూదిర్ల, వెల్దుర్తి మండలం అల్లుగుండు ఫీల్డ్ అసిస్టెంట్లను సస్పెండ్ చేశామన్నారు. -
పొలం పనికి ఎండ దెబ్బ!
ఎండలు పెరుగుతున్నా పొలం పనులు చేసుకోవడం తప్పదు. ఏటేటా ఎండలు పెరుగుతున్నాయి. అలా.. ఎండ దెబ్బ బెడద ఏటేటా పెరుగుతూనే ఉంది గానీ తగ్గడం లేదు. ఎండనకా వాననకా కాయకష్టం చేసే రైతులు, రైతు కూలీలు, ముఖ్యంగా మహిళల ఆరోగ్యం ఎర్రని ఎండల్లోనూ భద్రంగా ఉండాలంటే.. అప్రమత్తత అవసరం. ఎండ దెబ్బకు చెమట చిందుతుంది. తగినంత నీరు తాగకపోతే శరీరం బరువు తగ్గుతుంది.. పనిసామర్థ్యమూ తగ్గుతుంది... ప్రాణానికే ముప్పొస్తుంది. ఈ ముప్పు మహిళా రైతులకు మరింత ఎక్కువని ఆహార–వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఏ.ఓ.) హెచ్చరిస్తోంది.. తస్మాత్ జాగ్రత్త! ప్రపంచవ్యాప్తంగా శ్రామికుల సంఖ్యలో 31.8 శాతం మంది వ్యవసాయంలోనే పనిచేస్తున్నారు. ఆసియా, ఆఫ్రికా దేశాల్లో వ్యవసాయ కార్మికులు ఎక్కువగా ఎండ దెబ్బకు గురవుతున్నారు.వేసవి ఎండలో పనులు చేసే మనుషులు చెమట ద్వారా బయటకు పోతున్న నీటికి తగినంత నీటిని తాగాలి. లేకపోతే దేహంలో నీటి కొరత ఏర్పడుతుంది.. ఆ మేరకు ఆ మనిషి పని సామర్థ్యం కూడా తగ్గిపోతుంది. చెమట వల్ల దేహం బరువులో 3% వరకు నీటిని కోల్పోతే ఆ ప్రభావం శ్రామికుని పని సామర్థ్యంపై అంతగా ఉండదు. 4% తగ్గితే.. ఆ వ్యక్తి శారీరక శ్రమ చేసే సామర్థ్యం సగానికి సగం తగ్గిపోతుంది. ఎండ తీవ్రత, గాలిలో వేడి–తేమ తదితర పరిస్థితులను, శ్రమ తీవ్రతను బట్టి ఎండలో పనిచేసే ఒకరికి రోజుకు 2 నుంచి 15 లీటర్ల వరకు నీరు అవసరమవుతుందని అంచనా. ► మనిషి దేహంలో 37 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్నప్పుడే అంతర్గతంగా దేహక్రియలు సక్రమంగా జరుగుతాయి. ఎండలో పనిచేసే వారికి ఎంత ఎక్కువ చెమట పడితే.. ఎండను తట్టుకునే శక్తి అంతగా పెరుగుతుంది. సాధారణంగా మహిళలకు పురుషులకన్నా తక్కువ చెమట పడుతుంది. వృద్ధులు, పిల్లల పరిస్థితి కూడా అంతే. కాబట్టి, వీరికి వడ దెబ్బ ప్రమాదం ఎక్కువ. ► ఎక్కువ వేడి వాతావరణంలో వరుసగా చాలా గంటల పాటు పనిచేస్తున్న మనిషి దేహంలో నీరు తగ్గిపోయి.. చెమట పట్టటం తగ్గినప్పుడు.. దేహం లోపలి ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు మించి పెరుగుతుంది. అప్పుడే వడ/ఎండ దెబ్బ తగులుతుంది. అలాంటి అత్యవసర పరిస్థితుల్లో వారిని చల్లని ప్రాంతానికి తరలించడం, తగిన వైద్య సహాయం అందించగలిగితే ప్రాణానికి ముప్పు తప్పుతుంది. ► సాధారణ వ్యక్తి ఆహారం ద్వారా రోజుకు 8–14 గ్రాముల ఉప్పు తీసుకుంటూ ఉంటారు. ఎండలో పనిచేసే అలవాటు అంతగా లేని వ్యక్తి ప్రతి లీటరు చెమటతోపాటు 4 గ్రాముల ఉప్పును కోల్పోతారు. కాబట్టి, ఎండలో ఎక్కువ గంటల పాటు పొలం పనులు చేసే వారు ఆహారంలో ఎక్కువ ఉప్పు తీసుకోవాల్సి ఉంటుంది. ► మనిషికి చెమట వల్ల దేహం బరువులో 2% మేరకు నీటిని కోల్పోతే మానసిక స్థితిలో మార్పు వస్తుంది.. పని చేయాలన్న ఆసక్తితో పాటు.. పని సామర్థ్యమూ తగ్గుతుంది. ► చెమట ద్వారా కోల్పోయే బరువు సాధారణ (3%)స్థితిలో ఉన్నప్పటికీ.. మోస్తరు ఎండలోనూ పని సామర్థ్యం 80% తగ్గుతుంది. అయితే, చెమట ద్వారా కోల్పోయే నీటిని, లవణాలను తగినంతగా తీసుకునే మనిషి పని సామర్థ్యం తీవ్రమైన ఎండలో కూడా 55% మాత్రమే తగ్గుతుందని అధ్యయనాల్లో తేలింది. ► వేడి నుంచి రక్షణ కల్పించడంలో దుస్తులు కీలకపాత్ర పోషిస్తాయి. ఎండాకాలంలో వ్యవసాయ, అటవీ పనులు చేసే మనుషులు తగినంతగా శరీరాన్ని కప్పి ఉంచే పల్చటి నూలు వస్త్రాలు వేసుకోవడం ఉత్తమం. లేత రంగు దుస్తులు ఎండను తిరగ్గొట్టడం ద్వారా రక్షణ కల్పిస్తాయి. తల గుడ్డ చుట్టుకోవాలి లేదా అంచు పెద్దగా ఉండే టోపీ పెట్టుకోవాలి. ► విశ్రాంతిగా ఉన్న మనిషి శరీరం నుంచి రోజుకు సుమారు 400–700 గ్రాముల నీరు చెమట రూపంలో బయటకు వెళ్లిపోతుంది. దీనితోపాటు 150–200 గ్రాముల నీరు శ్వాస ద్వారా బయటకు వెళ్తుంది. అయితే, సమశీతల పరిస్థితుల్లో శారీరక శ్రమ చేసే మనిషి దేహం నుంచి ప్రతి గంటకూ 600 గ్రాముల చొప్పున నీరు చెమట రూపంలో బయటకు వెళ్లిపోతుంది. ► సాధారణంగా పురుషుల శరీర ఆకారం పెద్దగా ఉంటుంది. అంటే, దేహాన్ని కదిలించడానికి ఎక్కువ శక్తి అవసరమవుతుంది, తద్వారా వారి దేహంలో ఎక్కువ వేడి పుడుతుంది. మహిళలతో పోల్చినప్పుడు పురుషుల శరీరంపై స్వేద గ్రంధులు తక్కువగా ఉంటాయి. అయితే, పురుషుల స్వేదగ్రంధి నుంచి అధికమొత్తంలో చెమట వెలువడుతుంది. ► ఎండలో పనిచేసే గర్భవతులకు ఇబ్బందులు మరీ ఎక్కువ. నెలలు నిండని బిడ్డను ప్రసవించడం వంటి సమస్యలు రావచ్చు. ► పెద్దల కన్నా పిల్లలకు స్వేద గ్రంధుల సంఖ్య తక్కువగా ఉంటుంది. అందువల్ల అధిక వేడి నుంచి పిల్లలకు ఎక్కువ సమస్యలు రావడానికి అవకాశం ఉంది. ► వృద్ధుల దేహంపైన ఉండే స్వేద గ్రంధులు తక్కువ మొత్తంలో చెమటను స్రవిస్తాయి. అధిక వేడి వల్ల వృద్ధుల హృదయ స్పందనలు, రక్తప్రసరణ నెమ్మదించవచ్చు. అందువల్ల వారికి వేడిని తట్టుకునే సామర్థ్యం తగ్గుతుంది. ► మధుమేహం, ఊబకాయం ఉన్న వ్యక్తులు అధిక వేడి వల్ల అనారోగ్యం పాలుకావడానికి ఆస్కారం ఉంది. ► ఎండలో పనిచేసే అలవాటు లేని వారు.. 7–9 రోజుల పాటు తక్కువ శారీరక శ్రమ ఉంటే పనులను రోజూ కొద్ది గంటల పాటు చేస్తూ.. అలవాటు చేసుకోవాలి. సాధారణంగా శారీరక శ్రమ చేయటం అలవాటున్న వారు.. అంతకుముందు శారీరక శ్రమ అంతగా అలవాటు లేనివారికన్నా ఎక్కువ చెమటను విడుదల చేయగలగడం వల్ల త్వరగా వేడి వాతావరణానికి అలవాటు పడగలుగుతారు. వేడి వాతావరణంలో పనిచేయడానికి అలవాటు పడిన వారికి గంటకు వెయ్యి గ్రాముల నీటిని వెలుపలికి పంపేంత చెమట పడుతుంది. ► అలవాటు లేకుండా కొత్తగా ఎండలో పనులు చేయడం ప్రారంభించిన వారు తమకు తెలిసినప్పటికీ.. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల ఎండదెబ్బకు గురవుతూ ఉంటారని సర్వేలలో తేలింది. ► ఎండదెబ్బ తగలకుండా చూసుకోవడంలో రైతు కూలీలకు తగిన తాగునీటి సదుపాయం కల్పించాలి. తాగునీరు ఒక మోస్తరు చల్లగా(15–20 డిగ్రీల సెంటీగ్రేడ్) ఉంటే చాలు. నీరు కొద్ది కొద్దిగా తరచూ తాగడం మంచిది. అవకాశాన్ని బట్టి అంబలి, మజ్జిగ తాగొచ్చు. టీ, కాఫీ, మద్యం తాగకూడదు. ఎండలో పనిచేసే పిల్లలపై మరింత శ్రద్ధ తీసుకోవాలి. రైతులు, వ్యవసాయ క్షేత్రాల మేనేజర్లు, సూపర్వైజర్లు ఈ ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటే.. వ్యవసాయ కార్మికుల పని సామర్థ్యం తగ్గకుండా పని బాగా జరగడంతోపాటు.. వారూ అనారోగ్యం పాలవకుండా ఉంటారు.పురుషుల కన్నా మహిళలకు చాలా తక్కువ చెమట పడుతుంటుందన్నది పరిశోధకుల అభిప్రాయం. అయితే, శరీరంలో ఉష్ణోగ్రత బాగా పెరిగినప్పుడే మహిళలకు చెమట పడుతుంది. అందువల్ల తీవ్రమైన ఎండ వల్ల ముప్పు మహిళలకే ఎక్కువ. ► పురుషుల కన్నా మహిళలకు చాలా తక్కువ చెమట పడుతుంటుందన్నది పరిశోధకుల అభిప్రాయం. అయితే, శరీరంలో ఉష్ణోగ్రత బాగా పెరిగినప్పుడే మహిళలకు చెమట పడుతుంది. అందువల్ల తీవ్రమైన ఎండ వల్ల ముప్పు మహిళలకే ఎక్కువ. -
శ్రమకు తగ్గ వేతనం ఇవ్వాలి
మెదక్‌రూరల్: ఫీల్డ్అసిస్టెంట్లకు అసిస్టెంట్లకు శ్రమకు తగిన వేతనం ఇవ్వాలని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ పేర్కొన్నారు. సోమవారం మెదక్ కలెక్టరేట్ కార్యాలయం ఎదురుగా పిల్లికోటల్ వద్ద జిల్లాకు చెందిన ఫీల్డ్అసిస్టెంట్లు విధులు బహిష్కరించి ఒక్కరోజు ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ ధార్మారెడ్డికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ జాతీయ హమీ పథకంలో విధులు నిర్వహిస్తున్న ఫీల్డ్అసిస్టెంట్లకు అసిస్టెంట్ పంచాయతీ కార్యదర్శిగా హోదా కల్పించాలని, పెరిగిన నిత్యవసర ధరలకు అనుగునంగా ప్రస్తుతం ఉన్న రూ. 8900 వేతనాన్ని రూ. 20వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఫీల్డ్‌అసిస్టెంట్ల కుటుంబాలకు ఆరోగ్య భద్రత కార్డులు ఇవ్వాలని, వేతనం పై 20 శాతం ఇంక్రిమెంట్ సౌకర్యం కల్పించడంతో పాటు డబుల్ బెడ్రూం ఇళ్ళను ఇవ్వాలన్నారు. వికలాంగులైన ఫీల్డ్అసిస్టెంట్లకు అలవెన్స్ ఇవ్వాలని తెలిపారు. సీనియర్ మేట్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలన్నారు. గ్రామ పంచాయతీ కేటగిరి లిస్టు 1, 2 ,3గా కాకుండా గతంలో మాదిరిగానే కొనసాగించాలని కోరారు. , నూతనంగా ఏర్పాటుచేస్తున్న మున్సిపాలిటీలో, నగర పంచాయతీలలో పనిచేస్తున్న ఫీల్డ్అసిస్టెంట్లను యదావిధిగా ఉపాధిహామీలోనే ఉద్యోగ అవకాశం కల్పించాలని తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు రవి, పోచయ్య, శ్రీశైలం, ప్రసాద్, శేఖర్, రాములు, దామోదర్, సిద్దిరాములు పాల్గొన్నారు. -
ఆంధ్రాబ్యాంకు రిటైర్డ్ ఫీల్డ్ అధికారి అరెస్ట్
ఆకివీడు: నకిలీ ధ్రువపత్రాలతో రూ.కోటి మేర రుణాలు ఇప్పించి అనంతరం ఉద్యోగ విరమణ చేసి పోలీసులకు దొరకకుండా తిరుగుతున్న ఆంధ్రాబ్యాంక్ రిటైర్డ్ ఫీల్డ్ అధికారి చేబ్రోలు పాండురంగాచార్యులును శుక్రవారం భీమవరం రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాండురంగాచార్యులు 2007–10 మధ్య కాలంలో ఆకివీడుకు చెందిన కూన సత్యనారాయణ అనే వ్యక్తికి నకిలీ ధ్రువపత్రాల ద్వారా రూ.కోటి పైనే రుణాలు అందజేశాడు. అప్పట్లోనే దీనిని గుర్తించి బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. సత్యనారాయణను అరెస్టు చేశారు. అయితే పాండురంగాచార్యులు ఉద్యోగ విరమణ అనంతరం తప్పించుకుని హైదరాబాద్, బెంగళూరు ప్రాంతాల్లో తిరుగుతున్నాడు. శుక్రవారం భీమవరంలోమేనల్లుడి వివాహానికి హాజరైన పాండురంగాచార్యులును భీమవరం రూరల్ సీఐ ఎస్.ఎస్.వి.నాగరాజు ఆధ్వర్యంలో పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. అతనిని శనివారం కోర్టులో హాజరుపరుస్తామని ఆకివీడు ఎస్సై కె.సుధాకరరెడ్డి చెప్పారు. -
‘కంచె’ పట్టు చీరలు
దోమకొండ: ప్రతియేటా రైతులు పండించిన పంటలు ఎదో కారణంగా దిగుబడులు రాక అప్పులపాలవుతున్నారు. అతివృష్టి లేదా అనావృష్టి రైతులను దెబ్బతీస్తుంది. ఈ సారి రబీలోనైనా పంటలను పండించుకుందామనుకున్న రైతులకు అడవి పందుల బెడదతో కష్టాలు ఎదురవుతున్నాయి. రైతులు పంటలను కాపాడుకోవడానికి చీరలను కొనుగోలు చేసి వాటిని పంట చుట్టూ కంచెలాగా ఏర్పాటు చేసి కాపాడుకుంటున్నారు. పంట పొలాలు ఊరికి దూరంగా ఉడటం వలన రాత్రిల్లు అడవి పందులు దాడులు చేస్తున్నాయి. వీటి నుండి కాపాడుకోవడానికి గతంలో కరెంట్ తీగలను ఏర్పాటు చేసేవారు. కాని వీటి వలన మనషుల ప్రాణాలు పోయిన సంఘటనలు ఉన్నాయి. దోమకొండకు చెందిన రైతు నెతుల మల్లేషం తన వ్యవసాయ బావి వద్ద 6 ఎకరాలు మొక్కజొన్న పంటను కాపాడుకోవడానికి ఇంటిలోని పాత పట్టు చీరలను పంట చుట్టూ వేసాడు, దీనికి తోడు కామారెడ్డి నుండి రూ.20కి ఒక చీర చొప్పున వంద చీరలను కోనుగోలు చేసి పంట చుట్టూ కట్టినట్లు సాక్షితో తెలిపారు. -
అదృశ్యమైన వ్యక్తి శవమై కనిపించాడు
సాక్షి, ముత్తారం: పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం సీతంపల్లి గ్రామంలో పండగపూట విషాదం నెలకొంది. ఐదు రోజులుగా కనిపించకుండా పోయిన కొడారి రాములు(32) అనే వ్యక్తి మృతుడై కనిపించాడు. గ్రామంలో ఉన్న పత్తి చేనులో సోమవారం ఉదయం శవమై కనిపించాడు. అయితే ఇతడిని ఎవరో హత్య చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. -
కలకలం: మళ్లొస్తోంది.. మైనింగ్ జోన్ !
సాక్షి, యాచారం(ఇబ్రహీంపట్నం): రంగారెడ్డి జిల్లా యాచారంలో మైనింగ్ జోన్ మళ్లీ తెరపైకి వచ్చింది. దీంతో స్థానిక రైతుల్లో భయాందోళన మొదలైంది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో యాచారం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 105, 121, 126, 132, 200లోని 662.16 ఎకరాల్లో మైనింగ్ జోన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. స్టోన్ క్రషర్లు, క్వారీలు నెలకొల్పేం దుకు అప్పట్లో వివిధ కంపెనీలకు చెందిన 47 మంది ప్రతినిధులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే, పచ్చటి పొలాల మధ్య మైనింగ్ జోన్ ఏర్పాటు చేస్తే వ్యవసాయ రంగం దెబ్బతింటుందని, స్టోరీ క్రషర్లు, క్వారీల వల్ల యాచారం గ్రామంతో పాటు మొండిగౌరెల్లి, చింతపట్ల, గడ్డమల్లయ్యగూడ, గునుగల్, నక్కగుట్టతండా, మొగుళ్లవంపు, చౌదర్పల్లి, గాండ్లగూడెం గ్రామాలకు ముప్పు ఏర్పడుతుందని రైతులు, స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. మైనింగ్ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన హద్దురాళ్లను, గుర్తులను తొలగించారు. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లో ఉన్నా స్థానికుడైన కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎ మ్మెల్యే ముదిరెడ్డి కోదండరెడ్డి రైతులకు మద్దతుగా ఆం దోళనలో పాల్గొన్నారు. అప్పట్లో టీడీపీలో ఉన్న స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి కూడా మైనింగ్ జోన్ రద్దు పోరాటాల్లో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన కొత్తలో మైనింగ్ జోన్ ఏర్పాటు తెరపైకి రావడంతో రై తుల్లో మళ్లీ ఆందోళనలు చేశారు. ప్రజల ఒత్తిడికి దిగివచ్చిన తెలంగాణ ప్రభుత్వం కూడా రెండేళ్ల కింద మైనింగ్ జోన్‌ను విరమించుకుంటున్నట్లు ప్రకటించింది. దీం తో మైనింగ్ జోన్ రద్దయినట్లేనని రైతులు భావించారు. అభ్యంతరాల కోసం గ్రామ పంచాయతీ వద్ద నోటీసు అప్పట్లో మైనింగ్ జోన్ కింద ఎంపిక చేసిన యాచారం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 200లోని భూమిలో స్టోన్ క్రషర్లు, క్వారీలకు అనుమతులు ఇవ్వాలని మైనింగ్ శాఖ అధికారులు కొన్ని రోజుల క్రితం యాచారం తహసీల్దార్ పద్మనాభరావుకు లేఖ ఇచ్చారు. స్థానికంగా మైనింగ్ జోన్ వ్యవహారంపై ప్రజలు మర్చిపోయారని భావించిన అధికారులు గుట్టుచప్పుడు కాకుండా నెల రోజుల క్రితం 105, 121, 126, 132, 200 సర్వే నంబర్లల్లోని 662.16 ఎకరాల భూమిని పరిశీలించారు. 200 సర్వే నంబర్లోని 90.17 ఎకరాల్లో మొదటగా కార్వీలు, స్టోన్ క్రషర్లు ఏర్పాటు చేయడానికి నిర్ణయించి శాఖపరమైన అనుమతుల (ఎన్ఓసీ) కోసం తహసీల్దార్‌ను సంప్రదించారు. దీంతో స్టోన్ క్రషర్లు, క్వారీల ఏర్పాటుకు అభ్యంతరాల కోసం సోమవారం యాచారం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద తహసిల్దార్ నోటీసు అంటించారు. కొద్ది రోజులుగా యాచారం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద భూరికార్డుల ప్రక్షాళన జరుగుతుండడం వల్ల వందలాది మంది రైతులు పంచాయతీ కార్యాలయానికి వస్తున్నారు. సోమవారం గ్రామ పంచాయతీ నోటిస్ బోర్డుపై మైనింగ్ జోన్ కోసం అభ్యంతరాల నోటిసు అందించిన విషయం తెలుసుకుని రైతుల్లో మళ్లీ భయాందోళన మొదలైంది. దీనికి వ్యతిరేకంగా మరోసారి ఉద్యమించడానికి రైతులు సన్నద్ధమవుతున్నారు. మైనింగ్ జోన్ రద్దు చేసినట్లు ప్రకటించాక... యాచారంలోని పలు సర్వే నంబర్లల్లో ఏర్పాటు చేయడానికి నిర్ణయించిన మైనింగ్ జోన్‌ను రద్దు చేసినట్లు అధికారులే ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు కూడ హామీ ఇచ్చారు. అయినా మళ్లీ మైనింగ్ జోన్ వ్యవహరం తెరపైకి రావడం జీర్ణించుకోలేకపోతున్నాం. ప్రభుత్వం పునరాలోచన చేయకపోతే మళ్లీ ఉద్యమాలకు సిద్ధం కావాల్సి వస్తది. ఆందోళనలు తప్పవు.స్టోన్ క్రఫర్లు, క్వారీలు ఏర్పాటు చేస్తే భూగర్భజలాలు అడుగంటిపోతాయి. జోగు యాదయ్య, రైతు యాచారం నోటీసు అందించింది వాస్తవమే యాచారం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 200ల్లో 90.17 ఎకరాల్లో క్వారీలు ఏర్పాటు చేయడానికి ప్రజల అభ్యంతరాల కోసం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నోటిసు అతికించింది వాస్తావమే. మైనింగ్ శాఖ అధికారులు వ్యపారులకు స్థలాలు అప్పగించాలని కోరారు. మైనింగ్ శాఖ అధికారుల సూచన మేరకు ఎన్ఓసీ జారీ చేయడానికి ముందు ప్రజల అభ్యంతరాలు తెలుసుకుంటాం. ప్రజల నిర్ణయం మేరకు మైనింగ్ శాఖ అధికారులకు నివేదిక పంపుతాం. నోటిసు అందించిన వెంటనే మైనింగ్ జోన్‌కు వ్యతిరేకంగా ప్రజలు ఫిర్యాదులు చేస్తున్నారు. పద్మనాభరావు, తహసీల్దార్ యాచారం -
రూ.4.5 కోట్లు స్వాహా..!
బ్యాంకులో ఫీల్డ్ ఆఫీసర్‌గా నమ్మకంగా పనిచేశాడు. అతనికున్న సాంకేతిక పరిజ్ఞానం మరింత కలిసివచ్చింది. అంచెలంచెలుగా ఎదిగిన ఆ బ్యాంకు చైర్మన్‌కు దగ్గరయ్యాడు. అదే బ్యాంకులో పనిచేసిన ఉన్నతాధికారి సహకారంతో అక్రమాలకు తెరతీశాడు. లక్ష కాదు..రెండు లక్షలు కాదు..ఏకంగా రూ.4.5కోట్లు స్వాహా చేశాడు. మిర్యాలగూడ పట్టణంలోని నందిపాడు రోడ్డులో గల ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులో చోటు చేసుకున్న ఈ అవినీతి బాగోతం వివరాలు ఇలా... మిర్యాలగూడ అర్బన్ : సంతోష్..ఇతను సదరు బ్యాంక్ నందిపాడు శాఖలో ఫీల్డ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. మూడున్నరేళ్ల కాలంగా విధులు నిర్వహిస్తున్నాడు. ఇతనికి కంప్యూటర్ హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్ పరిజ్ఞానం మెండుగా ఉంది. ఫీల్డ్ ఆఫీసర్‌గా పనిచేస్తూనే బ్యాంకులో ఏమైనా సాంకేతిక సమస్యలు వచ్చినప్పుడు సరిచేసేవాడు. ఇలా సిబ్బందికి దగ్గరయ్యాడు. ఒకానొక దశలో ఏపీజీవీబీ చైర్మన్‌కు దగ్గరయ్యాడు. దీంతో డివిజన్లోని ఏ శాఖలో సాంకేతిక సమస్య వచ్చినా ఇతనినే పంపించేవారు. సాంకేతిక పరిజ్ఞానంతో తప్పుడుమార్గం తనకున్న పరిజ్ఞానంతో తప్పుడు మార్గం పట్టాడు. లేని సమభావన సంఘాలను సృష్టించాడు. ఆన్లైన్లో పలువురి ఆధార్‌కార్డులు డౌన్‌లోడ్‌చేసి తన మిత్రుల కుటుంబ సభ్యులతో బ్యాంకు అకౌంట్లు తెరిపించాడు. తను సృష్టించిన సమభావన సంఘాలకు రుణాలు మంజూరు చేయడం ప్రారంభించాడు. ఈ విషయంలో బ్యాంకు ఉద్యోగుల ఐడీలను హ్యాక్చేశాడు. ఈ తతంగం 2017 మార్చి నుంచి నడుస్తున్నట్లు స్పష్టమవుతోంది. సదరు ఉద్యోగి ఒకేరోజు 20 డాక్యుమెంట్లను పూర్తిచేసి వాటికి రుణాలు మంజూరు చేశాడు. ఈ క్రమంలో బ్యాంకు సిబ్బంది ఐడీలను సైతం సంపాదించడంతో పాటు మేనేజర్ ఐడీని సైతం హ్యాక్‌చేసినట్లు సమాచారం. దీంతో ఇప్పటివరకు వివిధ సంఘాల పేరుతో రూ.4.50కోట్లను నకిలీ సంఘాలకు మంజూరుచేసి స్వాహా చేశాడు. ఒకేసారి 20సంఘాలకు రుణాలు మంజూరు చేసినందుకు గాను సదరు ఉద్యోగిని బ్యాంకు చైర్మన్ సైతం ప్రసంశించాడు. అంతే కాకుండా అతడి ఫొటోనే బ్యాంకు వెబ్సైట్లో పెట్టి ప్రశంసలు కురిపించినట్లు తెలుస్తోంది. వెలుగులోకి ఇలా.. బ్యాంకులో ఎలాంటి ఖాతాలేని ఒక మహిళ సెల్‌నంబర్‌కు సమభావన సంఘం రుణాల డబ్బులు మంజూరైనట్లు మెసేజ్ వచ్చింది. కంగుతిన్న ఆ మహిళ బ్యాంకులో ఎలాంటి ఖాతాలేదు. నేను ఏ సమభావన సంఘంలో సభ్యురాలిని కాను కాని నాసెల్ఫోన్కు బ్యాంకునుంచి మెసేజ్ రావండమేంటి అని బ్యాంకు అధికారులను సంప్రదించింది. దీంతో అక్రమాల విషయం వెలుగులోకి వచ్చింది. గత ఐదురోజులుగా విచారణ.. బ్యాంకులో చోటు చేసుకున్న అక్రమాలపై నిజాలను నిగ్గుతేల్చేందుకు రంగంలోకి దిగిన స్టేట్ విజిలెన్స్, సీబీఐ, నాబార్డు సిజియన్స్కు సైతం ఫిర్యాదులు అందాయి. విజిలెన్స్ బృందాలు ఐదురోజులుగా విచారణను వేగవంతం చేసింది. పూర్తిస్థియిలో నివేదిక తయారుచేసి ఉన్నతాధికారులకు అందజేసేందుకు చర్యలు తీసుకుంది. అక్రమాల్లో ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో అధికారులు విచారణ చేపట్టి తొలుత సదరు ఉద్యోగిని బదిలీచేసినట్లు తెలిసింది. కానీ ఆ బదిలీ స్థానంలోకి విధుల్లోకి చేరలేదు. అధిక మొత్తంలో బ్యాంకు సొమ్ము స్వాహా కావడంతో ఉన్నా«తాధికారులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. బ్యాంకు మేనేజర్‌తో పాటు మరో ఆరుగురిపై వేటు.. కాగా ఏపీజీవీబీ ప్రధాన బ్యాంకులో చోటు చేసుకున్న అక్రమాలపై విచారణ చేస్తున్న బృందం ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఆరుగురిపై వేటు వేసినట్లు సమాచారం. బ్యాంకులో భారీ మొత్తంలో అక్రమాలు జరుగుతున్నా పట్టించుకోవడంలో నిర్లక్ష్యం వహించిన మేనేజర్‌ను నల్లగొండలో ఈ నెల 7న జరిగిన జిల్లా ఏపీజీవీబీ బ్యాంకర్ల సమావేశంలో విచారించి విధులనుంచి విధులనుంచి తొలగించినట్లు తెలిసింది. ఫలితంగా మూడు రోజులుగా ఆయన విధుల్లోకి రావడంలేదని తెలిసింది. కాగా సోమవారం నుంచి నూతన మేనేజర్ విదుల్లో చేరుతారని సమాచారం. బ్యాంకులో ఎంతసోమ్ము స్వాహా అయ్యింది..? ఎన్నికోట్ల కుంబకోణం జరిగిందనే విషయాన్ని అధికారికంగా ప్రకటించి త్వరలో బ్యాంకులపై క్రిమినల కేసులు నమోదు చేసేందుకు విజిలెన్స్ బృందం విచారణను వేగవంతం చేసినట్లు తెలిసింది. చర్యలు తీసుకుంటాం మిర్యాలగూడ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులో అక్రమాలు జరిగిన విషయం అంతర్గత సమస్య. ఫీల్డ్ ఆఫీసర్ అక్రమాలకు పాల్పడినట్టు తెలసింది. దీనిపై విచారణ జరిపి బాధ్యులపై శాఖాపరమైన చర్య తీసుకుంటాం. –రఘునాథరెడ్డి జీఎం ఏపీజీవీబీ, నల్లగొండ -
వేధింపులతో ఫీల్డ్ అసిస్టెంట్ ఆత్మహత్య!
సాక్షి, మానకొండూర్ : కరీంనగర్జిల్లా మానకొండూర్ మండలం గట్టుదుద్దెనపల్లి ఫీల్డ్ అసిస్టెంట్ రమేష్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అధికారుల వేధింపులతోనే ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని పీడీ వెంకటేశ్వరరావును గ్రామస్తులు, మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి వద్ద ఘెరావ్ చేశారు. -
నందవరంలో విషాదం
- పొలానికి మందు పిచికారీ చేసేందుకెళ్లి అస్వస్థతకు గురైన భార్యా భర్తలు - చికిత్స పొందుతూ భార్య మృతి - భర్త పరిస్థితి విషమం నందవరం : నందవరంలో విషాదం చోటు చేసుకుంది. పత్తి పంటకు పురుగు మందు పిచికారీ చేయడానికి వెళ్లిన భార్యాభర్త తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఒకరి మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళితే.. మండలకేంద్ర నందవరంలోని చాకలి గేరిలో నివసించే వీరాంజినేయులు, ఆదెమ్మ భార్య,భర్తలు. వీరికి ఏడాది కుమారుడు ఉన్నాడు. పత్తి పంటకు పురుగుల మందు పిచికారీ చేయడానికి మంగళవారం వారు పొలానికి వెళ్లారు. పంటకు పిచికారీ చేసి సాయంత్రం ఇంటికి ఆలస్యంగా వచ్చారు. భార్య,భర్తలిద్దరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వాసుత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆదెమ్మ (24) తుది శ్వాస విడిచింది. భర్త వీరాంజినేయులు మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ జగన్మోహన్ తెలిపారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చెప్పారు. -
తీవ్ర విషాదాన్ని మిగిల్చిన స్టడీ టూర్
పనాజి: విద్యార్థుల స్టడీ టూర్ తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మికా యూనివర్శిటీ విద్యార్థుల స్టడీ టూర్ ఇద్దరు తెలివైన విద్యార్థుల పాలిట మృత్యుపాశమైంది. గోవాలోని కండోలిం బీచ్ వద్ద గురువారం ఉదయం చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో అనూజా సుసాన్ పాల్ , గుర్రంచెంచు సాయి జ్ఞానేశ్వర్ అనే ఇద్దరు విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. క్రాఫ్టింగ్ క్రియేటివ్ కమ్యూనికేషన్ (సీసీసీ) ప్రోగ్రాంలో భాగంగా 47 మంది మికా విద్యార్ధులు గోవా వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ బీచ్‌కు వెళ్లినపుడు ప్రమాదవశాత్తూ ఇద్దరు బీచ్‌లో కొట్టుకుపోయారు. స్థానికుల సహాయంతో అంజు మృతదేహాన్ని, ఐదు గంటల తరువాత జ్ఞానేశ్వర్ బాడీని గుర్తించారు. దీంతో మృతుల కుటుంబ సభ్యులు, సహచర విద్యార్థులు కన్నీటి సంద్రమయ్యారు. పౌర్ణమి రాత్రి కావడంతో గురువారం తెల్లవారుఝామున 3 గంటల సమయంలో, ఆరుగురు విద్యార్థుల బృందం కండోలిం బీచ్‌కు వెళ్లారని, దురదృష్టవశాత్తు ఇద్దరు మునిగిపోయి, ప్రాణాలను కోల్పోయారని ఇన్సిస్టిట్యూట్ జారీ చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. వెంటనే ఈ దుర్ఘటనపై తల్లిదండ్రులకు వెంటనే సమాచారం అందించామని అసోసియేట్ డీన్ సిద్దార్థ్ దేశ్‌ముఖ్ తెలిపారు. ఈ ప్రమాదంపై ఆయన తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. ఇది తీవ్ర విషాదమంటూ వారి ఆత్మకుశాంతి కలగాలన్నారు. ఇద్దరు కో-ఆర్డినేటర్లు సహా ప్రొ. ప్రవీణ్ మిశ్రా, సీసీసీ ప్రోగ్రాం డైరెక్టర్ ప్రొ. నితేశ్ మొహంతి విద్యార్థులతో ఉన్నట్టు చెప్పారు. అక్కడి పరిస్థితిని మికా బృందం పరిస్థితిని పరిశీలిస్తోందని, బాధితులకు పూర్తి సహాయం అందిస్తున్నామని ఆయన చెప్పారు. -
పచ్చని పల్లెల్లో ‘పతంజలి’ పడగ!
►పతంజలి కోసం దళితులు, బలహీన వర్గాల భూములు ►40 ఏళ్ల క్రితం నుంచి సాగు చేసుకుంటున్న రైతులు ►బలవంతంగా 137 ఎకరాల భూసేకరణ ►అధికార పార్టీ నేతల భూములకు మాత్రం మినహాయింపు ►ఎకరా రూ.75 లక్షలు పలికే భూమి రూ.2.50 లక్షలకే ►ఐదు గ్రామాల రైతుల దీనగాథ చినరావుపల్లి, పెదరావుపల్లి, కాటకాపల్లి, గొల్లపేట, భీమాళి.. ఇవి ఉత్తరాంధ్రలో చాలా చిన్న గ్రామాలు. కరవొచ్చి ఊళ్లకు ఊళ్లే వలస వెళ్లినా ఈ గ్రామ ప్రజలకు అదేంటో తెలియదు. కారణం ఈ గ్రామాల్లో తయారయ్యే మామిడి తాండ్రకు రాష్ట్రవ్యాప్తంగా మంచి పేరుండటమే. కానీ ఇప్పుడీ గ్రామాలు భయంతో వణికిపోతున్నాయి. నిద్రలేని రాత్రులు గడుపుతున్నాయి. కన్నీరు పెట్టని ఇల్లు లేదు. తృప్తిగా పట్టెడన్నం తిని చాలా రోజులైంది. ఈ గ్రామాలపై పతంజలి సంస్థ కన్నుపడ్డప్పటి నుంచీ ఇదే పరిస్థితి. వాళ్ల భూములను ప్రభుత్వం కబళించి పతంజలికి కట్టబెట్టింది. రాళ్లూరప్పలు, గుట్టలు చదును చేసి తాతముత్తాతల కాలం నుంచి సాగు చేస్తున్న భూమిపై హక్కు లేదంటోంది. కన్నబిడ్డల్లా పెంచుకున్న పచ్చటి మామిడి, జీడి మామిడి తోటలను అధికారులు నరికేస్తామంటున్నారు. ఇదీ ఆ ఐదు గ్రామాల రైతుల దైన్య స్థితి. విజయనగరం జిల్లా కొత్తవలస మండల పరిధిలోని ఈ గ్రామాలు విశాఖపట్నానికి 35 కి.మీ దూరంలో ఉన్నాయి. 40 ఏళ్ల క్రితం వృధాగా ఉన్న భూములను 130 రైతు కుటుంబాలు బాగు చేసుకుని మామిడి, జీడి తోటలను సాగు చేస్తున్నాయి. ఆ రైతులకు కొన్నేళ్ల క్రితం ప్రభుత్వమే డీ పట్టాలు కూడా ఇచ్చింది. ఎకరా రూ.75 లక్షలు పలుకుతోంది. ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెడతామంటూ పతంజలి సంస్థ ముందుకొచ్చింది. దీంతో ఈ ఐదు గ్రామాల్లో దళిత, బలహీనవర్గాలకు చెందిన 137 ఎకరాలను ప్రభుత్వం ఈ సంస్థకు కట్టబెట్టింది. మార్కెట్ ధర ప్రకారం ఎకరా కనీసం రూ.25 లక్షలైనా ఉంటుందని కలెక్టర్ చెప్పినా.. పతంజలికి ఎకరా రూ.2.5 లక్షలకే అప్పగిస్తూ ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వం జీవో జారీ చేసింది. పతంజలి ప్రతినిధులు జెండాలు కూడా పాతేశారు. రైతులకు తెలియకుండానే.. పతంజలికి భూములు కేటాయించే వరకూ రైతులెవరికీ దీని గురించి తెలియదు. గుట్టుచప్పుడు కాకుండా గ్రామసభ తీర్మానం చేయించారు. తర్వాత రైతులు ఎదురుతిరగడంతో ప్రభుత్వం అనేక రకాలుగా వారిని మభ్యపెట్టింది. మొదట ఎకరాకు రూ.25 లక్షలని, తర్వాత రూ.15 లక్షలని, ఇప్పుడు కేవలం రూ.7.50 లక్షలు మాత్రమే ఇస్తామంటున్నారని రైతులు తెలిపారు. దీన్ని కూడా పూర్తిగా ఇవ్వడం లేదని వారు ఆరోపిస్తున్నారు. రికార్డు పరంగా ఉన్న భూమికే పరిహారం ఇవ్వడం వల్ల సగం మంది రైతులు నష్టపోనున్నారు. భూమిని కొనుగోలు చేసిన రైతులకు ఇది కూడా ఇవ్వడం లేదు. భూమార్పిడి నిషేధం (పీవోటీ) చట్టాన్ని ముందుకు తెచ్చి 25 మంది రైతులకు పరిహారం ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని చినరావుపల్లి గ్రామస్తులు చెప్పారు. పెద్దల భూములను వదిలేసి.. ఈ గ్రామాల్లో అధికార పార్టీ నేతల భూములున్నప్పటికీ వాటి జోలికి మాత్రం వెళ్లకపోవడం గమనార్హం. చినరావుపల్లి రెవెన్యూ పరిధిలోని 88, 89, 92, 93, 104, 105 సర్వే నెంబర్లలోని పేద రైతుల భూముల పక్కనే జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లగుడు సింహాద్రి సోదరుడు ఎర్రినాయుడి భూమి ఉంది. ఆ పక్కనే జీవీఆర్ కన్స్ట్రక్షన్ క్వారీ ఉంది. ఇందులో సెంటు భూమి కూడా పోకుండా అధికారులు జాగ్రత్తపడుతున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ పేరుతో ఉన్న 16.8 ఎకరాలను కూడా పతంజలికిచ్చే భూముల జాబితాలోంచి తొలగించడం గమనార్హం. ఉపాధీ ఉత్తమాటే! భూములు కోల్పోయే ఐదు గ్రామాల్లో దాదాపు వేయి మంది వరకు జనాభా ఉంటారు. వీళ్లంతా మామిడి, జీడి మామిడి తోటలను సాగు చేస్తూ బతుకుతున్నారు. ఇప్పుడీ అవకాశం ఉండదు. వీళ్లకు మరో పని కూడా తెలియదు. ప్రభుత్వం ఎకరాకు ఇచ్చే రూ.7.5 లక్షలను కుటుంబంలో ముగ్గురు వరకూ పంచుకోవాలి. ఇలాంటి కుటుంబాలు 45 వరకూ ఉన్నాయి. కేటాయించిన భూముల్లో ఆయుర్వేదిక ఉత్పత్తులు తయారుచేస్తామని ప్రభుత్వానికి పతంజలి నివేదిక సమర్పించింది. ఈ రంగంలో అనుభవం, అవగాహన ఉన్నవారిని మాత్రమే ఉద్యోగాల్లోకి తీసుకుంటామని పేర్కొంది. దీన్ని బట్టి స్థానికులకు ఎవరికీ ఉపాధి అవకాశాలు లభించే అవకాశం లేదు. ఎక్కడికి పోవాలి... మాది చినరావుపల్లి. నాకు 1.40 ఎకరాల భూమి ఉంది. మాకు తెలియకుండానే మా పొలంలో జెండాలు పాతారు. ఎమ్మెల్యే, అధికారుల చుట్టూ తిరిగా. మొదట్లో ఎకరాకు రూ.15 లక్షలు ఇస్తామన్నారు. కానీ ఆ తర్వాత రూ.7.50 లక్షలు అన్నారు. అది కూడా ఇంత వరకూ ఇవ్వలేదు. అందరికీ ఉద్యోగాలు వస్తాయని మొదట్లో చెప్పారు. ఇప్పుడు అలాంటిదేమీ లేదంటున్నారు. - బొబ్బిలి అర్జున్, బాధిత రైతు ఎలా బతకాలి? మా నాన్న 1981లో 1.33 ఎకరాలు వేరే వ్యక్తి వద్ద కొనుగోలు చేశాడు. ఈ భూమి పీవోటీ పరిధిలో ఉంది కాబట్టి పరిహారం కూడా ఇవ్వమంటున్నారు. ఉద్యోగం కూడా ఇస్తామని కలెక్టర్ చెప్పారు. ఇప్పుడు అసలుకే ఎసరు పెట్టారు. మా కుటుంబం ఎక్కడికి వెళ్లాలి? ఎలా బతకాలి? - బొబ్బిలి ఎర్రయ్య, బాధిత రైతు మాయమాటలు చెప్పి నేను వికలాంగుడిని. నాకున్న రెండు ఎకరాలు లాగేసుకుంటున్నారు. ఈ భూమి లేకుండా బతకలేను. జాయింట్ కలెక్టర్‌ను కలిసినా కనికరించలేదు. అన్యాయం జరగదని మాయమాటలు చెప్పి భూమి లాక్కున్నారు. -పెట్ల ఎర్రయ్య, బాధిత రైతు అడ్డుపడితే గెంటేశారు.. చెప్పకుండానే నా పొలంలో జెండాలు పాతారు. అడ్డుపడితే గెంటేశారు. భూమి తీసుకుంటే ఆత్మహత్య చేసుకుంటా. ఇదే విషయాన్ని కలెక్టర్‌కు చెప్పా. ఇన్నాళ్లూ ప్రభుత్వ భూమిలో ఫలసాయం తిన్నారు కదా అంటూ చులకనగా మాట్లాడారు. -సీర సన్యాసి, బాధిత రైతు -
విద్యుదాఘాతంతో రైతు మృతి
సి.బెళగల్: బురాన్‌దొడ్డి గ్రామానికి చెందిన రైతు రామాంజినేయులు (36) విద్యుదాఘాతంతో మృతి చెందాడు. తనకున్న ఎకరన్నర పొలంలో ఉల్లి పంటను సాగు చేశాడు. గురువారం ఉల్లిపంటకు నీళ్లు పెట్టేందుకు పొలానికెళ్లిన రామాంజినేయులు మధ్యాహ్నం 12.15 గంటలకు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద త్రీ ఫేస్ విద్యుత్‌ను సింగల్ ఫేస్‌గా మార్చే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో విద్యుత్ తీగ యువ రైతు మీద పడడంతో అక్కడిక్కకడే మృతి చెందాడు. మృతుడికి భార్య సువర్ణ, కుమార్తె ఉషారాణి (5వ తరగతి), కుమారుడు గోపిచంద్ (3వ తరగతి) ఉన్నారు. విద్యుత్ ప్రమాదంతో రైతు మృతి చెందిన విషయం తెలుసుకున్న కోడుమూరు మాజీ ఎమ్మెల్యే, వైఎసార్సీపీ కోడుమూరు సమన్వయ కర్త మురళీకృష్ణ గ్రామానికి చేరుకుని మృతదేహానికి పూలమాలవేసి నివాళ్లు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
చేలు మాయం.. చెరువుల మయం
సాక్షి ప్రతినిధి, ఏలూరు : డెల్టాలో వరి చేలు మాయమవుతున్నాయి. సాగు భూములు ఆక్వా చెరువులుగా మారుతున్నాయి. అనధికారికంగా తవ్వుతున్న చెరువుల కారణంగా డెల్టా ప్రమాదంలో పడింది. నాలుగేళ్లుగా వరి సాగు విస్తీర్ణం తగ్గుతూ వస్తోంది. గతంలో జిల్లాలో 7 లక్షల ఎకరాల్లో వరి సాగయ్యేది. ఆక్వా చెరువుల కారణంగా 5.30 లక్షల ఎకరాలకు తగ్గిపోయినట్టు అధికారులు చెబుతున్నారు. కానీ.. ప్రస్తుతం వరి విస్తీర్ణం 4 లక్షల ఎకరాల లోపే ఉన్నట్టు సమాచారం. ఇదే పరిస్థితి కొనసాగితే డెల్టాలో పొలాలు పూర్తిగా కనుమరుగవుతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఖరీఫ్ సీజన్లో వరిసాగు విస్తీర్ణం 5.30 లక్షల ఎకరాలు కాగా, రబీలో 4.60 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నట్టు అధికారిక గణాం కాలు వెల్లడిస్తున్నాయి. అయితే జిల్లాలో 2.50 లక్షల ఎకరాల్లో చేపల, రొయ్యల చెరువులు ఉన్నట్టు మత్స్య శాఖ అధికారులే చెబుతున్నారు. అనధికారికంగా మరో లక్ష ఎకరాల వరకూ చెరువులుగా మారినట్టు అంచనా. అనుమతి లేనివే అధికం ఉండి, ఆకివీడు, కాళ్ల, పాలకోడేరు, పెంటపాడు, గణపవరం, నిడమర్రు, యలమంచిలి, పాలకొల్లు మండలా ల్లోని అత్యధిక విస్తీర్ణంలో చేపల చెరువులు తవ్వారు. ఇందులో అనుమతి లేనివే అధికం. తాజాగా ఇరగవరం, పెనుమంట్ర, ఆచంట, పెరవలి, అత్తి లి మండలాల్లోనూ చెరువుల తవ్వకాలు ప్రారంభమయ్యాయి. డెల్టా మండలాల్లో ఏటా రెండు పంటలు కలిపి 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతోంది. ఇటీవల కాలంలో కొత్త వంగడాలు సాగు చేయడం, ప్రకృతి వైపరీత్యాలు లేకపోవడం, తెగుళ్లు తప్పడంతో దిగుబడి బాగా పెరిగింది. గతంలో రెండు పంటలకు 60 నుంచి 65 బస్తాల వరకూ దిగుబడి వస్తే.. ఇప్పుడు సగటున 80 బస్తాల వరకూ పెరిగింది. అయితే, సాగు భూములు మాత్రం తగ్గిపోయాయి. ఆక్వా జోన్లుగా ప్రకటించడంతో.. ప్రభుత్వం ఆక్వా సాగును ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా డెల్టాలోని కొన్ని మండలాల్లో అక్వా జోన్లను ప్రకటించింది. దీంతో ధనిక రైతులు వ్యవసాయం నుంచి అక్వా వైపు మళ్లుతున్నారు. సముద్ర తీర ప్రాంతంలో తప్ప ఎక్కడా రొయ్యల చెరువులకు అనుమతి లేదు. ఇటీవల కాలంలో రొయ్యల చెరువులు డెల్టాలోనూ విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో గ్రామాల్లోని భూములన్నీ ఉప్పునీటి కయ్యలుగా మారుతున్నాయి. ఉప్పునీటి బోర్లకు అనుమతి లేకపోయినా ఇష్టారాజ్యంగా తవ్వేస్తు్తన్నారు. సెలనిటి చాలకపోతే చెరువుల్లో నేరుగా బస్తాలకొద్దీ ఉప్పు కలుపుతున్నారు. రొయ్యల సాగు కోసం యాంటీబయోటిక్స్ సైతం అధికంగా వాడుతున్నారు. ఈ నీటిని పంట కాలువల్లోకి వదులుతున్నారు. దీనినే చాలా గ్రామాల్లో తాగునీటికి ఉపయోగించాల్సిన దుస్థితి దాపురించింది. పని దినాలు తగ్గిపోయాయి ఆక్వా చెరువుల కారణంగా కూలీలకు పని దినాలు తగ్గిపోయాయి. ఆ భూముల్లో వరి సాగైన సమయంలో కూలీలకు సగటున 50 పని దినాలు ఉంటే అక్వా వచ్చిన తర్వాత పదికి తగ్గిపోయాయి. దీంతో కూలీలకు ఉపాధి దొరకని పరిస్థితి ఏర్పడుతోంది. రొయ్యల చెరువులున్న గ్రామాల్లోని వ్యవసాయ భూముల్లో ఉప్పు నీటి కారణంగా పంటలు పండటం లేదు. దీనివల్ల రైతులు, కౌలుదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. డెల్టాలో వ్యవసాయ భూములు తగ్గిపోతుండటంతో కౌలు రేట్లు పెంచేశారు. గతంలో ఎకరానికి 24 బస్తాలు (రెండు పంటలకు కలిపి) ఉండే కౌలు ఇప్పుడు 32 నుంచి 34 బస్తాలకు పెరిగింది. వ్యవసాయ శాఖ అధికారులు ఎక్కడా అధికారిక గణాం కాల్లో తగ్గిన విస్తీర్ణం చూపించడం లేదు. గతంలో ఎంత ధాన్యం దిగుబడి వచ్చిందో ఇప్పుడూ అంతే చూపిస్తున్నారు. వాస్తవానికి దిగుబడి పెరిగిన నేపథ్యంలో పంట ఉత్పత్తి కూడా పెరగాలి. అయితే, తగ్గిన విస్తీర్ణాన్ని చూపించకుండా అధికారులు పాత లెక్కలతోనే సరిపెడతున్నారు. డెల్టా పరిరక్షణకు నడుం కట్టాలి ఏటా పెరుగుతున్న అక్రమ చెరువుల కారణంగా డెల్టాలో సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోతోంది. దీనివల్ల కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వ్యవసాయ కార్మికులకు పని దొరకడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్‌లో తిండి గింజలు దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. – కె.శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి, కౌలు రైతు సంఘం -
పిడుగుపడి అక్కడికక్కెడే మృతి
దుద్యాల(కొత్తపల్లి): పిడుగుపడడంతో పొలం పనిచేస్తున్న రైతు అక్కడికక్కెడే మృతి చెందాడు. ఈ ఘటన శనివారం.. దుద్యాల గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చాకలి ఆంజనేయులు(52).. తన భార్య శేషమ్మను వెంటబెట్టుకుని గ్రామ శివారులోని జమ్ములమ్మ గుడి వద్ద పొలంలో చెత్త కుప్పలకు నిప్పంటించడానికి వెళ్లాడు. అకాలంగా కురిసిన వర్షంలో అతనిపై పిడుగుపడి అక్కడికక్కెడే మృతి చెందాడు. పొలం ఆవలి గట్టు వద్ద ఉండే భార్య ఈ ఘటన చూసి భయాందోళనకు గురయ్యారు. మృతునికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఎస్ఐ శివశంకర్‌నాయక్.. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రాణాలతో ‘ఉపాధి’ చెలగాటం
- ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు - పని ప్రదేశంలో నీడ, నీళ్లు కరువు - 15 ఏళ్లు కూడా నిండని చిన్నారులతోనూ పనులు - మస్టర్లలో పనులకు రాని వారి పేర్లు.. గిట్టుబాటు కాని కూలి - ఉపాధి పనుల్లోనూ అధికార ముద్ర - 10 వారాలుగా అందని బిల్లులు గుంతకల్లు రూరల్ : అధికార పార్టీ నాయకుల అండదండలతో ఎంపికైన ఫీల్డ్ అసిస్టెంట్లు ఉపాధి పనుల నిర్వహణలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ నిబంధనలకు పాతర వేస్తున్నారు. మండుటెండలో కష్టపడి పనులు చేసే కూలీలు కాసేపు సేద తీరడానికి కాసింత నీడగానీ, గొంతు తడుపుకొనేందుకు గుక్కెడు నీళ్లుగానీ ఏర్పాటు చేయకుండా వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఫలితంగా వడదెబ్బకు గురవుతున్న కూలీలు పిట్టల్లా రాలిపోతున్నారు. అయినప్పటికీ అధికారులు చోద్యం చూస్తున్నారే తప్ప ఉపశమన చర్యలు తీసుకోవడం లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో చంటి బిడ్డలను పనులకు తీసుకొస్తున్న కూలీల పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. కనీసం పని ప్రదేశంలో చెట్లు కూడా లేకపోవడంతో తమతోపాటు పిల్లలు కూడా మండుటెండలో మాడిపోతున్నారని తల్లులు తీవ్ర వేదనకు గురవుతున్నారు. 18 సంవత్సరాలు నిండినవారు మాత్రమే ఉపాధి పనులు చేయడానికి అర్హులనే నిబంధన ఉన్నప్పటికీ 500 మందికి పైగా జాబ్కార్డుల్లేని చిన్నారులు పనులకు వస్తున్నారు. నీరు, నీడ లేకుండా మండుటెండలో కఠినతరమైన పనులు చేస్తుండటంతో వృద్ధులు, మహిళలు వారం రోజులకు శక్తి కోల్పోతున్నారు. అందువల్ల వారు పనికా రాలేక మధ్యమధ్యలో తమ పిల్లలను పంపుతున్నారు. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరిగి వడదెబ్బ మృతుల సంఖ్య అధికమవుతున్నప్పటికీ చిన్నారులను ఉపాధి పనులకు పంపుతున్నారంటే వారెంత దయనీయ పరిస్థితుల్లో ఉన్నారో అని అధికారులు ఆలోచించడం లేదు. - ఏరోజుకారోజు మస్టర్లలో కూలీల చేత సంతకాలు చేయించుకోవాల్సి ఉన్నప్పటికీ వారాంతంలో ఒక్కరోజు మాత్రమే సంతకాలు చేయించుకుంటున్నారు. పనులకు హాజరు కాని వారి పేర్లను సైతం మస్టర్లలో చేర్చి కూలీల నోట్లో మట్టి కొడుతున్నారు. ఫలితంగా రోజుకు రూ.100 కూలి కూడా రావడం లేదని ఉపాధి కూలీలు ఆవేదన చెందుతున్నారు. - ఉపాధి పనులు తప్ప మరో గత్యంతరం లేని తరుణంలో గ్రామీణులు పూర్తిగా ఈ పనులపైనే ఆధారపడితే నెలల తరబడి కూలి డబ్బులు రావడం లేదు. దీంతో కుటుంబ పోషణ భారమై అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఏ ఒక్కరూ స్పందించడం లేదని వారు వాపోతున్నారు. అవ్వకు ఆరోగ్యం బాలేదు మా అవ్వ లక్ష్మీదేవి ఆరోగ్యం బాగోలేక డాక్టర్ దగ్గర చూపించుకోవడానికి ఊరికి వెళ్లింది. అందుకే మా అవ్వ బదులు నేనొస్తున్నాను. - బ్రహ్మేశ్వరి ఎక్కడా నీడ లేదు మా పెళ్లయిన 20 ఏళ్లకు పుట్టిన ఏకైక సంతానం మా పాప. కుటుంబ పోషణకు వేరే మార్గం లేకపోవడంతో నేను, మా ఆయన ఇద్దరం ఉపాధి పనులపైనే ఆధారపడ్డాం. ఇంటిదగ్గర పాపను చూసుకోవడానికి ఎవరూ లేకపోవడంతో మాతోపాటే పాపను తీసుకొస్తున్నాం. కూర్చోడానికి ఎక్కడా నీడ లేకపోవడంతో పని చేస్తున్నంతసేపూ నా వెంటే తిరుగుతూ ఉంటుంది. - రామలక్ష్మి, ఉపాధికూలి, వైటీ.చెరువు వారం రోజులకు నాలుగొందలా? పోయినవారమంతా పనిచేస్తే రూ.400 కూలి పడింది. అదైనా ఇస్తారా అంటే అదీ లేదు. పదివారాలుగా కూలి డబ్బులు పెండింగ్‌లో పెట్టారు. ఇలాగైతే ఏం తిని బతకాలి. - లక్ష్మీదేవి, వైటీ చెరువు. -
గుక్కెడు నీటితో గంపెడు రోగాలు
- నిరుపయోగంగా ఫీల్డ్ టెస్టింగ్ నీటి పరీక్షల కిట్లు - శ్యాంపిల్స్ తీసుకోవడంలో ల్యాబ్‌ల నిర్లక్ష్యం - కలుషిత నీటితోనే కాలం వెల్లదీస్తున్న అధికారులు అనంతపురం సిటీ : గుక్కెడు నీరుతాగితే గంపెడు రోగాలు వెంటాడుతున్నాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో భూగర్భజలాలు అడుగంటిపోవడంతో నీటిలో ఫ్లోరైడ్ శాతం పెరిగింది. ఆ నీరు కూడా లభించని పల్లెల్లో కుంటలు, వంకలు, వ్యవసాయ బోరుబావుల ద్వారా లభించే నీటితోనే ప్రజలు దాహం తీర్చుకుంటున్నారు. ఆ నీరు ఏమాత్రం సురక్షితమో తేల్చి చెప్పేవారు లేకపోవడంతో పల్లెవాసులు అనారోగ్యాలతో పడకేస్తున్నారు. కాళ్లు చచ్చుబడి కొందరు, పళ్లు పాచిపట్టి మరికొందరు, టైఫాయిడ్‌తో ఇంకొందరు ఆస్పత్రుల పంచన చేరుతున్నారు. వేసవి ఆరంభం నుంచి టైఫాయిడ్, కీళ్లనొప్పులు, కామెర్లు తదితర జబ్బుల బారిన పడి అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. కలుషిత నీరు తాగి ఎంతమంది రోగాల బారిన పడుతున్నారో తెలుసుకునే ప్రయత్నం కూడా అధికారులు చేయడం లేదు. అనంతపురం, గుంతకల్లు, ధర్మవరం, రామగిరి, కనగానపల్లి తదితర ప్రాంతాల్లో ఈ తరహా జబ్బుల బారిన పడుతున్న వారు అధిక సంఖ్యలో ఉన్నారు. ఈ విషయమై వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు కూడా నిర్ధారణకు వచ్చారు. పథకాలున్నా ఫలితం శూన్యం జిల్లాలో 56 రక్షిత మంచినీటి పథకాలున్నా సమృద్ధిగా తాగునీరు లేదు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ట్యాంకర్లతో సరఫరా చేస్తున్న నీరు కలుషితంగా ఉందని, వ్యవసాయ బోరు బావుల నుంచి తీసుకొస్తున్న నీటిలోనూ ఫ్లోరైడ్ శాతం అధికంగా ఉందని పలు గ్రామాల ప్రజలు ఆవేదన చెందుతున్నారు. నీరు ఏమాత్రం తాగడానికి యోగ్యమైనదో కనీస పరీక్షలు కూడా చేయకుండా సరఫరా చేస్తుండటం వల్లే ఈ సమస్య తలెత్తుతోంది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పంచాయతీల్లోని కార్యదర్శులు, అంగన్వాడీలు, సోషల్ వర్కర్లకు నీటి పరీక్షలు ఎలా చేయాలో గత ప్రభుత్వం శిక్షణ ఇచ్చింది. కలుషిత నీటి ద్వారా వచ్చే పలురకాల జబ్బులను ఆదిలోనే గుర్తించి నియంత్రించేందుకు అది దోహదపడింది. గ్రామాల్లో నీటి పరీక్షలు నిర్వహించి స్థానికంగా లభించే నీటి ద్వారా ఏవైనా ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందో, లేదో నిగ్గు తేల్చేవారు. 2013, 2014లో జిల్లాలోని 1,003 గ్రామ పంచాయతీలకూ ఫీల్డ్ టెస్టింగ్ టూల్ కిట్ అందజేశారు. క్రమేణా పర్యవేక్షణ లేకపోవడంతో కొందరు అధికారులు ఆ కిట్లను వాడటం మానేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటి ప్రభుత్వం మండలానికి ఒక కిట్ మాత్రమే ఇచ్చింది. దీంతో ఆయా పంచాయతీల కార్యదర్శులు ఆ కిట్‌ను తెచ్చుకుని నీటి పరీక్షలు నిర్వహించేందుకు శ్రద్ధ చూపడం లేదు. శాంపిల్స్ తీయడం లేదు గ్రామాల్లో ఎక్కువగా తాగునీటిని వినియోగించే బోర్లు, చెరువులను గుర్తించి తాగునీటి శాంపిల్స్‌ను జిల్లా కేంద్రంలోని ల్యాబ్‌లకు పంపాల్సి ఉంటుంది. ఆ నీరు కలుషితమైనట్లు తేలితే తక్షణం ఆ నీటిని ఎవరూ తాగకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఫ్లోరైడ్ శాతం అ«ధికంగా ఉంటే ప్రజలు రోగాల బారిన పడకుండా తగు సూచనలు చేయాలి. అయితే గ్రామాల్లోనే పరీక్షలు చేయకపోవడంతో శాంపిల్స్ ఇచ్చే నాథులే లేకుండాపోయారు. సరైన పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్లు అతి తక్కువ దూరంలో లభించే నీటిని సరఫరా చేసి చేతులు దులిపేసుకుంటున్నారు. ఎవరైనా నీరు సరిగా లేదని ప్రశ్నిస్తే తమ జేబులోంచి డబ్బులు ఖర్చు చేసి తోలుతున్నామని, ఆరు నెల్లకో, ఏడాదికో గానీ బిల్లులు రావడం లేదని ట్యాంకర్లవాళ్లు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నగరపాలక సంస్థలు, ఆర్డబ్ల్యూఎస్ శాఖలకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసి రక్షిత మంచినీటిని అందించేందుకు కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
ఫీల్డ్ అసిస్టెంట్లపై వేటు
ఇందూరు (నిజామాబాద్ అర్బన్) : జిల్లాలోని ఐదుగురు ఫీల్డ్ అసిస్టెంట్లపై వేటు పడింది. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాంలో నిర్లక్ష్యం చేసి, పురోగతి సాధించనందుకు గాను వారిని సస్పెండ్ చేయాలని జిల్లా కలెక్టర్ యోగితా రాణా జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి (డీఆర్డీఓ)ను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ తన చాంబర్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. పక్షం రోజులలో నిర్దేశించిన లక్ష్యం సాధించని వారిపై క్రమ శిక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో 15 రోజుల్లో మొత్తం 5,160 వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణాలు పూర్తి చేయగా నవీపేట్ మండలంలోని నందిగామ, కోస్లి, అబంగపట్నం, యంచ గ్రామాల్లో ఏ ఒక్క వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టలేదు. దీంతో ఆ గ్రామాల్లో పని చేస్తున్న ఫీల్డ్ అ సిస్టెంట్లను సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నా రు. అదే విధంగా డిచ్పల్లి మండలం నడ్పల్లి ఫీల్డ్ అసిస్టెంట్‌ను కూడా సస్పెండ్ చేశారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ రాహుల్ రాజ్, డీఆర్డీఓ వెంకటేశ్వర్లు, జడ్పీ సీఈఓ గోవింద్ తదితరులు పాల్గొన్నారు. -
అప్పుడు ఒప్పు.. ఇప్పుడు తప్పు
మధ్యలో కొనుగోలుదారులకు ముప్పు ►13 ఏళ్ల క్రితం యథేచ్ఛగా అనుమతులు జారీ ►సర్వే నెంబర్ 329లో అన్నీ ప్రైవేట్ భూములేనని నిర్థారణ ►వాటి ఆధారంగా వందల ప్లాట్ల క్రయవిక్రయాలు ►ఇప్పుడవి సర్కారు భూములంటున్న అధికారులు ► ఖాళీగా ఉన్న ప్లాట్లలో బోర్డుల ఏర్పాటు.. ►రిజిస్ట్రేషన్లు చేయరాదని ఆదేశాలు ►చేయని తప్పునకు బలైపోయామంటున్న ప్లాట్ల యజమానులు అది మధురవాడ ప్రాంతం.. అప్పుడే నగరీకరణ ఊపందుకున్న ఆ ప్రాంతంలో ఓ హౌస్ బిల్డింగ్ సొసైటీ ప్లాట్లు అభివృద్ధి చేసి విక్రయానికి పెట్టింది.. దానికి వుడా అప్రూవల్‌తోపాటు అవసరమైన అన్ని అనుమతులు ఉన్నాయి..ఇంకేముంది.. చాలామంది మధ్యతరగతి ప్రజలు ప్లాట్లు కొనుగోలు చేశారు.. అనేకమంది భవంతులు నిర్మించుకొని నివాసం కూడా ఉంటున్నారు.. చిన్నారావులాంటి కొద్ది మంది మాత్రం ఏవో కారణాలతో నిర్మాణాలు చేపట్టలేక.. ప్లాట్లను ఖాళీగా ఉంచేశారు.. ఇదంతా 12 ఏళ్లనాటి మాట. కట్ చేస్తే.. ఇప్పుడు అటువంటి ఖాళీ స్థలాల్లో.. అవి ప్రభుత్వ స్థలాలన్న బోర్డులు వెలిశాయి.. వాటిని చూసి ప్లాట్ల యజమానులు బెంబేలెత్తిపోతున్నారు. మామూళ్ల మత్తులో పడి.. ఫీల్డ్ వెరిఫికేషన్ చేయకుండా ఇష్టారాజ్యంగా ఏ శాఖకు ఆ శాఖ అనుమతిలిచ్చేయడం వల్లే ఈ అవస్థలన్నది సుస్పష్టం. దీనివల్ల కష్టార్జితంతో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు నిలువునా మునిగిపోతున్నారు. విశాఖపట్నం: పిల్లి కళ్లు మూసుకున్న చందంగా తయారైంది జిల్లా యంత్రాంగం తీరు. మామూళ్ల మత్తులో జోగే విద్యుత్, వుడా, జీవీఎంసీ అధికారులు మాకు ఫీజులఒస్తే చాలు ఏ భూములకైనా విద్యుత్ కనెక్షన్లు ఇచ్చేస్తాం.. లే అవుట్ అప్రూవ్ చేసేస్తాం.. ప్లాన్ అప్రూవల్స్ ఇచ్చేస్తాం.. అన్న దోరణిలో వ్యవహరిస్తున్నారు. రెవెన్యూ అధికారుల అవినీతికి తోడు శాఖల మధ్య సమన్వయ లోపంతో వందల కోట్ల విలువైన భూములు అన్యాక్రాంతమై పోతున్నాయి. తీరా అధికారులు కళ్లు తెరిచి అడ్డుపుల్లలు వేస్తుండటంతో మధ్యలో కొనుగోలుదారులు ఇరుక్కుంటున్నారు. అప్పుడు అన్నీ ఓకే మధురవాడ సర్వే నెంబర్ 329లోని 18.36 ఎకరాల భూమిలో శ్రీకృష్ణ కో ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ లే అవుట్ అభివృద్ధికి బీఎల్పీ నెం.10/2000 కింద వుడాకు దరఖాస్తు చేసింది. దీనికోసం ప్రొసెసింగ్ ఫీజు రూ.74,303, రెన్యూవల్స్ ఫీజు రూ.74,303 చెల్లించింది. ఈ భూమిలో కల్వర్టు, గెడ్డ రక్షణ గోడల నిర్మానానికి మరో రూ.7.41లక్షలను జోన్–1 డీఈ పేరిట చెల్లించింది. దీంతో ఎటువంటి అబ్జక్షన్స్ లేవంటూ వుడా చీఫ్ అర్బన్ ప్లానర్ 2004 జూన్ 11న లే అవుట్ అప్రూవల్ జారీ చేసింది. 10.98 ఎకరాల్లో 200 నుంచి 250 గజాల విస్తీర్ణం కలిగిన 242 ప్లాట్ల అభివృద్ధికి అనుమతినిచ్చింది. మిగిలిన భూమిని రహదారి, ఓపెన్ స్పేస్ కింద వదిలిపెట్టాలని పేర్కొంది. ఆ మేరకు ప్లాట్లు అభివృద్ధిఛస్త్రష/æ విక్రయించారు. కొనుగోలుదారుల్లో చాలామంది ఇళ్లు, అపార్ట్మెంట్లు నిర్మించుకున్నారు. వీటికి జీవీఎంసీ ప్లాన్ అప్రూవల్స్, కుళాయి కనెక్షన్లు కూడా మంజూరయ్యాయి. ఈపీడీసీఎల్ విద్యుత్ కనెక్షన్లు జారీ చేసింది. ఈ డాక్యుమెంట్ల ఆధారంగా పలువురికి వివిధ జాతీయ బ్యాంకులు లక్షల్లో రుణాలు కూడా మంజూరు చేశాయి. కాలక్రమంలో భవనాలు, ప్లాట్లు పలు చేతులు మారాయి. ఇదంతా గత పదమూడేళ్లుగా సాగుతూనే ఉంది. ప్రస్తుతం ఇక్కడ గజం రూ.30వేల పైమాటే. అంటే ఈ లేవుట్లోని ప్లాట్స్ విలువ వందకోట్ల పైమాటే. అమ్ముకుందామంటే.. కాగా హెచ్డీఎఫ్సీ బ్యాంకు డిప్యూటీ మేనేజర్ కాజా రమేష్ తన తండ్రి రిటైర్డ్ ఎఎస్ఐ కాజా చిన్నారావుతో కలిసి అప్పటికే రెండుసార్లు చేతులు మారిన ప్లాట్–86లో 200 చదరపు గజాల స్థలాన్ని పలివెల కృష్ణవేణి వద్ద 2012లో కొనుగోలు చేశారు. ఆ తర్వాత కొద్ది కాలానికే రమేష్ రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో ఆ కుటుంబం తీవ్ర మనోవేదనకు గురైంది. ఇల్లు కట్టుకునే స్తోమత లేకపోవడంతో ఈ ప్లాట్‌ను అమ్ముకునేందుకు రమేష్ తండ్రి చిన్నారావు బేరం కుదుర్చుకున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు వెళ్లినప్పుడు మధురవాడ సబ్‌రిజిస్ట్రార్ చెప్పిన సమాధానం విని షాక్‌కు గురయ్యారు. ఆ భూములు ప్రభుత్వానికి చెందినవని అక్కడ ఎలాంటి రిజిస్ట్రేషన్స్ చేయకూడదని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారని చెప్పడంతో హతాశుడయ్యారు. గత నాలుగేళ్లుగా తన ప్లాట్ కోసం పోరాటం సాగిస్తూనే ఉన్నాడు. ఎన్వోసీ కోసం రెవెన్యూ అధికారుల చుట్టూ చెప్పులరిగాలే తిరుగుతూనే ఉన్నారు. చిన్నారావులాగే అన్యాయమైపోయిన చాలామంది న్యాయం కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. న్యాయపోరాటం ఒకప్పుడు వాటిని ప్రభుత్వ భూములు కావని నిర్థారించిన అధికారులే నేడు అవి ప్రభుత్వ భూములంటూ రిజిస్ట్రేషన్స్‌కు మోకాలడ్డడంపై ఆయన న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారు. లే అవుట్ అప్రూవుల్ సమయంలో అప్పటి ఆర్డీవో ఈ సర్వే నెంబరులో 9.18 ఎకరాలకు వ్యవసాయ భూమి నుంచి మినహాయింపునిస్తున్నట్టు నిర్ధారిస్తూ ఉత్తర్వులు కూడా ఇచ్చారు. సర్వే నెం. 298–1,2లతో పాటు 329లో ఉన్న భూములు ఏపీ ల్యాండ్ రిఫారŠమ్స్ యాక్ట్ పరిధిలో లేవని అదే ఆర్డీవో ఎన్వోసీ కూడా ఇచ్చారు. తమ వద్ద ఉన్న ప్రభుత్వ రికార్డుల ప్రకారం అడంగల్‌లో కూడా ఈ సర్వే నెంబర్లలో భూమి వ్యవసాయ భూములు కానీ, ప్రభుత్వానికి చెందిన భూములు కానీ ఈ సర్వే నెంబర్లలో ఎక్కడా లేవని అప్పటి రూరల్ తహశీల్దార్ జగదీష్ ధ్రువీకరించారు. వీటి ఆధారంగా చిన్నారావు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా. విచారణ బాధ్యతను జేసీ జి.సృజనకు అప్పగించారు. 60 రోజుల్లో విచారణ చేపట్టాల్సిన రెవెన్యూ అధికారులు సదరు పిటిషన్‌ను గల్లంతు చేయడంతో ఇటీవల మరోసారి తనకు న్యాయం చేయాలంటూ ఆశ్రయించారు. దాంతో జరిగిన తప్పిదాన్ని గుర్తించి విచారణ చేపట్టారు. అసలు ఇక్కడ ప్రభుత్వ భూములున్నాయా? లేవా? ఏ విధంగా లే అవుట్స్ అప్రూవల్స్ ఇచ్చారు? జీవీఎంసీ, ఈపీడీసీఎల్ వంటి శాఖలు ఏ విధంగా అనుమతులిచ్చాయి? ఈ వ్యవహారం వెనుక రెవెన్యూ అధికారుల హస్తం..ప్రోద్భలం ఏ మేరకు ఉందనే కోణంపై విచారణ చేపట్టారు. న్యాయం చేయాలి వుడా లే అవుట్ అప్రూవ్ కావడంతోనే మేం అక్కడ ప్లాట్ కొనుగోలు చేశాం. మా తర్వాత వందలాది మంది ప్లాట్లు కొనుగోలు చేసి ఇళ్లు కూడా నిర్మించుకున్నారు. ఖాళీగా ఉన్న మా భూముల్లోనే ప్రభుత్వ భూములంటూ నోటీసులు పెట్టారు. చట్ట పరంగా అన్ని మాకు అనుకూలంగా ఉన్నప్పటికీ రెవెన్యూ అధికారులు మాత్రం ఎన్వోసీ ఇవ్వడం లేదు. న్యాయం చేయకపోతే న్యాయపోరాటం చేస్తా. -
కోర్టు తీర్పునూ పట్టించుకోరా
శ్రీకాకుళం: తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవాలని కోర్టు తీర్పు ఇచ్చినా అధికారులు వారిని విధుల్లోకి తీసుకోవడంలేదు. మందస మండలంలో 12 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను రాజకీయ కోణంలో ప్రభుత్వం తొలగించింది. వారిని విధుల్లోకి తీసుకోవాలని ఉమ్మడి హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే కోర్టు తీర్పును ధిక్కరించిన మండల అధికారులు తమను విధుల్లోకి తీసుకోవడంలేదని ఫీల్డ్ అసిస్టెంట్లు స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. వీరి ధర్నాకు వైఎస్సార్సీపీ నేతలు సంఘీభావం తెలిపారు. -
కూలీ.. కడుపు ఖాళీ
► నెలలుగా వేతనానికి నోచుకోని ‘ఉపాధి’ కూలీలు ► పనులకు వెళ్లేందుకు విముఖత ► గణనీయంగా తగ్గిన కూలీల సంఖ్య ► హాజరుకావాలని కోరుతున్న ఫీల్డ్ అసిస్టెంట్లు ► జిల్లాలో రూ. 8.45 కోట్ల వేతన బకాయిలు ► ప్రగతిపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం స్వేదం చిందించి శ్రమను నమ్ముకున్న బతుకులు భారంగా కాలం వెళ్లదీస్తున్న దృశ్యాలు జిల్లాలో అడుగడుగునా కళ్లకు కడుతున్నాయి. ఎన్నో నిరుపేద కుటుంబాలకు ‘ఉపాధి’ పనులే ఊతం. వీటి ఆధారంగా వచ్చే వేతనాలతోనే వారు జీవనం సాగిస్తున్నారు. నిధుల విడుదలలో తీవ్ర జాప్యం చోటుచేసుకోవడంతో చేతిలో డబ్బులు లేక కూలీలు అగచాట్లు పడుతున్నారు. తమ దయనీయ పరిస్థితిపై అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో చివరకు వారు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘పది వారాలపాటు పనిచేసిన డబ్బులు ఇంతవరకు రాలేదు. ఎప్పుడొస్తాయో ఇప్పటికీ తెలియదు. ఉపాధి పనుల డబ్బులు వస్తేనే.. మా కుటుంబం గడిచేది. నెలల తరబడి ఒక్క పైసా కూడా మా ఖాతాల్లో పడకుంటే ఏం తినాలి? ఎలా బతకాలి? నిధులు విడుదల చేశాకే మళ్లీ పనులకు వస్తాం. అప్పటిదాకా మా దారి వేరే’. జిల్లాలోని ఉపాధి హామీ పథకం కూలీల మనోవేదన ఇది. ఏ కూలీని పలకరించినా దాదాపు ఇదే సమాధానం వస్తోంది. ఫలితంగా పనులపై వారు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో ప్రస్తుతం పనుల్లోకి వచ్చే కూలీల సంఖ్య క్రమేపీ గణనీయంగా తగ్గుముఖం పడుతోంది. ఉపాధి పనుల నిర్వహణకు మార్చి నెల అత్యంత కీలకం. ఇదే నెలాఖరుతో ఆర్థిక సంవత్సరం ముగియనున్న విషయం తెలిసిందే. ఈ లోగా నిర్దేశించుకున్న లక్ష్యాలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ నెలలో వ్యవసాయ, దాని అనుబంధ పనులు కాస్త తక్కువగానే ఉంటాయి. దీంతో ప్రత్యామ్నాయంగా ఉపాధి పనులకు కూలీలు అధిక సంఖ్యలో హాజరవుతారు. గతేడాది ఇదే నెలలో పనుల్లోకి వచ్చిన వారి సంఖ్య దాదాపు 41 వేలు. ప్రస్తుతం 31 వేలకే పరిమితం కావడం ఆందోళన కలిగిస్తోంది. తీవ్ర నష్టమే.. ప్రతి నిరుపేద కుటుంబం ఒక ఆర్థిక సంవత్సరంలో ఉపాధి పథకం ద్వారా వంద రోజుల పని పొందవచ్చు. దీనికి గడవు ఈ నెలాఖరు. ఇప్పటివరకు జిల్లాలో దాదాపు 9,300 కుటుంబాలు వంద రోజుల ఉపాధి పొందాయి. మరో 4 వేలకు పైగా కుటుంబాలు 80 రోజుల పని మార్క్‌ను చేరుకున్నాయి. మరో 20 రోజులు పనుల్లోకి వెళ్తే ఉపాధి లక్ష్యం పరిపూర్ణం అవుతోంది. అయితే ఇప్పటికే చేసిన పనులకు సంబంధించిన వేతనాలు విడుదల కావడంతో వారంతా కొన్ని నెలలుగా పనులకు దూరంగా ఉంటున్నారు. నిధుల విడుదల మరింత జాప్యమైతే ఈ కూలీలు పని దినాలను నష్టపోయినట్లేనని స్పష్టమవుతోంది. మిగిలిన కుటుంబాలు కూడా ఉపాధిని కోల్పోయినట్లేనని కార్మిక నేతలు చెబుతున్నారు. పనులపై ప్రతికూల ప్రభావం.. ఉపాధిలో భాగంగా నీటి సంరక్షణ, స్వచ్ఛత పనులపై గ్రామీణాభివృద్ధి శాఖాధికారులు దృష్టి సారించారు. నీటి, ఊట కుంటలు, ఇంకుడు గుంతలు, వ్యక్తిగత మరుగుదొడ్ల తదితర పనుల లక్ష్యాలను ఈనెలాఖరులోగా చేరుకోవాల్సి ఉంది. అయితే ఆశించిన స్థాయిలో కూలీలు పనుల్లోకి రాకపోవడంతో ప్రగతిపై కొంత ప్రతికూల ప్రభావం అవకాశం లేకపోలేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ పరిస్థితి తలెత్తకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లను పనుల్లోకి రాని కూలీల వద్దకు రాయబారం పంపుతున్నారు. డబ్బులు ఎక్కడికీ పోవని.. త్వరలో వస్తాయని వారికి నచ్చేజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి పనులకు హాజరుకావాలని వారిని కోరుతున్నారు. అయితే చాలా మంది కూలీలు మెట్టు దిగడం లేదు. వేతనాలు రాకపోవడంతో కుటుంబం గడవడం లేదని.. ఇలాంటప్పుడు పనుల్లోకి ఎలా వస్తామని వారు ప్రశ్నిస్తున్నారు. పెండింగ్‌లో రూ. 8 కోట్లకు పైమాటే.. జిల్లాలో ప్రస్తుతం నిత్యం సగటున 32 వేల మంది కూలీలు పనులకు వెళ్తున్నారు. ఏడాది ఆసాంతం (గతేడాది వేసవి నుంచి ఇప్పటి వరకు) దాదాపు 1.30 లక్షల మంది ఉపాధి పనులకు హాజరయ్యారని అంచనా. వివిధ రకాల అభివృద్ధి పనుల కోసం ఈ ఏడాదిలో ఇప్పటివరకు సుమారు రూ. 62 కోట్లు ఖర్చు పెట్టినట్లు అధికారులు చెబుతున్నారు. ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు వ్యయం చేసినా.. కూలీలకు మాత్రం సకాలంలో వేతనాలు అందడం లేదు. దాదాపు 65 వేల మంది కూలీలకు రూ. 8.45 కోట్లు వేతన బకాయిలు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. గత నవంబర్ వరకు అరకొరగా వేతనాలు ఇస్తూ నెట్టుకొచ్చారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఒక్కపైసా విడుదల కాలేదని సమాచారం. పనిచేసిన 15 రోజుల్లోగా కూలీలకు వేతనాలు అందాల్సి ఉంది. కానీ, ఆ మేరకు జిల్లాలో పరిస్థితులు లేకపోకవడంతో కూలీలు సతమతం అవుతున్నారు. ఒక్కో కూలీకి వేల రూపాయల వేతనం రావాల్సి ఉంది. అయినా ఆలస్యమే... గతంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే నిధులను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని కూలీల ఖాతాల్లో జమచేసేది. ఈ విధానంతో వేతనాల అందజేతలో తీవ్ర జాప్యం చోటుచేసుకునేది. అంతేగాక సకాలంలో రాష్ట్ర ప్రభుత్వం.. కూలీల ఖాతాల్లో జమ చేయ కపోవడంతో కొంత వ్యతిరేకత వచ్చింది. దీన్ని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల మరో నిర్ణయం తీసుకుంది. నేరుగా కూలీల బ్యాంకు ఖాతాల్లోనే వేతనాలు జమ చేయాలని నిశ్చయించుకుంది. గత జనవరి నుంచి ఈ విధానం అమల్లోకి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. అయితే రాష్ట్రానికి కేటాయింపులు జరిపిన నిధుల్లోంచే.. కేంద్రం కూలీలకు వేతనాలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఏడాది కేంద్రం.. రాష్ట్ర కోటా కింద రూ.300 కోట్లను కేటాయించినట్లు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ మొత్తం నిధుల వినియోగం ఇప్పటికే పూర్తయ్యిందని అధికారులు చెబుతున్నారు. మరో దఫా నిధుల విడుదలపై కార్యాలయాల మధ్య ఫైళ్లు కదులుతున్నాయని.. తొందరలోనే ఈ సమస్య కొలిక్కి వస్తుందని వివరిస్తున్నారు. దీనిపై డీఆర్డీఓ ప్రశాంత్ కుమార్‌ను వివరణ అడగగా.. త్వరలోనే డబ్బులు కూలీల ఖాతాల్లో జమ అవుతాయని సమాధానమిచ్చారు. పెండింగ్‌లో ఉన్న మొత్తం నిధులు వస్తాయని చెప్పారు. రూ.6వేలు రావాలి నేను, నా భర్త ఉపాధి హామీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాం. వచ్చిన కూలిడబ్బులే మాకు ఆధారం. ఇప్పటివరకు ఏడు వారాలకు సంబంధించిన దాదాపు రూ. 6 వేలు అందాల్సి ఉంది. కాని నేటికీ నయాపైసా అందలేదు. ఫీల్డ్ అసిస్టెంట్‌ను అడిగితే.. గడువు పెడుతున్నా మార్పు లేదు. చేతిలో పైసలు లేక ఇంట్లకు అవసరమైన వస్తువులు కొనాలంటే చాలా ఇబ్బందిగా మారింది. చివరకు ఉప్పు, పప్పు, కూరగాయలకూ వెనకాముందు ఆలోచిస్తున్నాం. అత్యవసరమైతే అప్పు చేస్తున్నాం. – కట్టెలబాలమ్మ, ఉపాధి కూలి, పోల్కంపల్లి రూ.3,653 రావాల్సి ఉంది ఐదు వారాలు పనులు చేస్తే ప్లే స్లిప్పులు వచ్చాయి. మొత్తం రూ.3,653 రావాల్సి ఉంది. కాని నేటికీ చెల్లించలేదు. ఎర్రటి ఎండల్లో కష్టపడి పని చేస్తే శ్రమకు తగిన ఫలితం రావడం లేదు. బయట పనికి వెళ్లకుండా ఉపాధిని నమ్ముకుంటే నిరాశకు గురి కాకతప్పడం లేదు. అధికారులను అడిగితే మేము బిల్లులు చేసి పంపించాం.... ప్రభుత్వం నుంచే రావడం లేదని చెబుతున్నారు. కూలి డబ్బులు తొందరగా అందించి ఆదుకోవాలి. –గూడెం దానయ్య, కూలీ, పోల్కంపల్లి -
పల్లెపల్లెనా పశుగ్రాస క్షేత్రాలు
- గ్రామాలు, మండలాల వారీగా వివరాలు సేకరించండి - జేడీ డాక్టర్ సుదర్శన్‌కుమార్ ఆదేశం - పశువైద్యుల డైరీ ఆవిష్కరణ కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో కరువు తీవ్రత ఎక్కువగా ఉందని, ఈ పరిస్థితుల సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని పశు సంవర్ధకశాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సుదర్శన్‌కుమార్ అన్నారు. గ్రాసం కొరత ఏర్పడకుండా చూడాలని, ఇందులో భాగంగా అన్ని గ్రామాల్లో అవసరమైన మేరకు పశుగ్రాసం క్షేత్రాలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. మండలాల వారీగా ఇచ్చిన లక్ష్యాలను అధిగమించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. శుక్రవారం గోకులం సమావేశ మందిరంలో కర్నూలు డివిజన్ పశువైద్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కరువు నేపథ్యంలో గ్రాసం కొరత ఏర్పడకుండా సైలేజీ, మొలకగడ్డి, అజొల్లా పెంపకాన్ని ప్రోత్సహించాలన్నారు. దాణ, దాణామృతం అవసరాన్ని గుర్తించి వివరాలు అందించాలన్నారు. మండలాలు, గ్రామాల వారీగా పశుగ్రాసం కొరతను ఎదుర్కొనే రైతుల వివరాలు సేకరించాలన్నారు. ఎస్సీ సబ్ ప్లాన్ కింద పాడి పశువుల పంపిణీకి అర్హలైన ఎస్సీలను గుర్తించాలన్నారు. అనంతరం వెటర్నేరియన్ 2017 ప్లానర్ డైరీని జేడీ ఆవిష్కరించారు. డీడీ చిన్నయ్య, కర్నూలు ఏడీ సీవీ రమణయ్య, ఏడీలు చంద్రశేఖర్, రాజశేఖర్, నారాయణస్వామి, రామిరెడ్డి, పశువైద్యుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ ఆర్‌నాగరాజు, జిల్లా అధ్యక్షుడు రామసుబ్బారెడ్డి పాల్గొన్నారు. -
ఐటీ రంగంలో మార్పులతో పెరిగిన ఉపాధి అవకాశాలు
ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ భాస్కర్ బాలాజీచెరువు (కాకినాడ): ఐటీ రంగంలో వచ్చిన మార్పులతో సాఫ్ట్వేర్ రంగంలో ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయని ఏపీపీఎస్సీ చైర్మన్ పి.ఉదయభాస్కర్ తెలిపారు. ప్రగతి ఇంజనీరింగ్ కళాశాలలో ప్రగతి కల్చరల్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ప్రిజమ్ 2కే17 కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఐటీ రంగంలో వచ్చిన మార్పులను యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. నిరంతర నైపుణ్యాల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చుపుతూ ప్రైవేట్ రంగంలోనే కాకుండా ప్రభుత్వ రంగంలో కూడా చేరి తమ వంతు బాధ్యతలను నిర్వర్తించాలన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ శంభుప్రసాద్ కళాశాల ప్రగతిని వివరించారు. పరుచూరి కమలాంబ జ్ఞాపకార్థం 2013 నుంచి అన్ని విభాగాల్లో అకడమిక్ టాపర్స్‌కు ఇచ్చే నగదు పురస్కారం అందజేశారు. ప్రగతి కళాశాల చైర్మన్ కృష్ణారావు టీసీఎస్ సంస్థ తమ కళాశాలతో ఒప్పందం చేసుకుని ఉత్తమ అవార్డును అందజేయడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డైరెక్టర్ మేనేజ్మెంట్ ఎం.వి.హరినాథబాబు, డైరెక్టర్ రఘురామ్, వైస్ ప్రెసిడెంట్ సతీష్, మాచిరాజు తదితరులు పాల్గొన్నారు. -
సిడ్నీ వేడుకల్లో 200 మందిపైగా అరెస్ట్
సిడ్నీ: ఆస్ట్రేలియాలోని సిడ్నీ మ్యూజిక్ ఫెస్టివల్ లో 200 మందిపైగా అరెస్టయ్యారు. మత్తుపదార్థాలు సేవించడం, విక్రయించడం ఆరోపణలతో వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు స్థానిక మీడియా వెల్లడించింది. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో 130 మత్తు పదార్థాల మాత్రలు, 1,443 డాలర్ల నగదుతో పట్టుబడిన 24 ఏళ్ల యువతి కూడా ఉంది. కొత్త సంవత్సర వేడుకల్లో భాగంగా సిడ్నీలో దశాబ్దం క్రితం నుంచి మ్యూజిక్ ఫెస్టివల్ నుల ప్రతియేట నిర్వహిస్తున్నారు. ఎన్నో ప్రత్యేకతలు కలిగిన ఈ వేడుకల్లో పాల్గొనేందుకు స్థానికులతో పాటు అంతర్జాతీయ పర్యాటకులు అమితాసక్తి చూపుతుంటారు. దాదాపు 30 వేల మంది ఈ వేడుకలకు హాజరయ్యారు. మరోవైపు ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో మత్తుపదార్థాలు వినియోగిస్తున్న వారిలో ఆస్ట్రేలియన్లు కూడా ఉన్నారు. మిగతా దేశాలతో పోల్చుకుంటే ఇక్కడ ఎక్కువ ధరకు డ్రగ్స్ అమ్ముతారు. అందుకే కొలంబియా, పనామా, మెక్సకో నుంచి మత్తుపదార్థాలు ఇక్కడికి అక్రమంగా రవాణా చేస్తుంటారని అధికార సమాచారం ఆధారంగా తెలుస్తోంది. -
ఉపాధి హామీలో అవినీతి
► పనులు తక్కువ కొలతలు ఎక్కువ ► ధర్మారంలో రూ.68875, ► సైదాబాద్‌లో రూ.64877 రికవరీ జమ్మికుంట రూరల్ : ఉపాధి పథకంలో చేపట్టిన పలు పనులపై వివిధ గ్రామాల్లో సామాజిక తనిఖీలు నిర్వహించగా సోమవారం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో 9వ, విడత సామాజిక తనిఖీ ప్రజా వేదిక జరిగింది. పలు గ్రామాలలో తక్కువ పనులు చేసి ఎక్కువ ప్రతిపాదనలు చూపిన ఆధారాలను తనిఖీ బృందం బయట పెట్టింది. మండల స్థారుు అధికారుల పర్యవేక్షణ కొరవడడడంతో ఫీల్డు అసిస్టెంట్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నారుు. ధర్మారం గ్రామంలో వరద కాల్వ నిర్మాణ పనుల్లో తక్కువ పనికి ఎక్కువ ప్రతిపాదనలు తయారు చేయడంతో రూ.68875లను,సైదాబాద్‌లో బినామీ పేర్లతో సొమ్మును కాజేయగా రూ.64,877లను రికవరీకి సిద్ధం చేశారు. కనగర్తి గ్రామంలో గ్రామ ఫీల్డు అసిస్టెంట్ తన భర్తకు 84రోజుల పని దినాలు కల్పించి రూ.9991లను పొందినట్లు గుర్తించారు. దగ్గరి బంధువులకు మాత్రమే పని దినాలు కల్పించిన విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వంతడుపుల గ్రామంలో ప్రభుత్వ ఉద్యోగం ఉన్న వారికి జాబ్‌కార్డు ఇవ్వడాన్ని, వరద కాల్వ నిర్మాణంలో తక్కువ కొలతలను గుర్తించారు. వావిలాల ఫీల్డు అసిస్టెంట్‌ను తొలగించాలని పలువురు గ్రామస్తులు రాత పూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదును అధికారులకు అందజేశారు. లక్ష్మాజిపల్లి సీఎస్పీ లావణ్య రూ.16 వేలను ఇప్పటికీ కూలీలకు చెల్లించలేదని గుర్తించగా చర్యకు నిర్ణరుుంచారు. ఎంపీడీవో పనితీరుపై డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్రావు అసహనం వ్యక్తం చేశారు. జమ్మికుంట, ఇల్లందకుంట మండలాలలో మొత్తం 32 గ్రామాలు ఉండగా సోమవారం రాత్రి వరకు 15 గ్రామాల పనితీరుపై ప్రజావేదిక జరిగింది. మిగతా గ్రామాల ప్రజావేదిక బుధవారం జరగనుందని అధికారులు తెలిపారు. ఎంపీపీ గంగారపు లత, ఏపీడీ రాంరెడ్డి, ఎంపీడీవో రమేష్, ఏపీవో రాణి, అసిస్టెంట్ విజిలెన్స అధికారి కొమురయ్య, స్టేట్ మానిటరింగ్ అధికారి అశోక్‌కుమార్, ఎస్ఆర్పీలు నవీన్, అనిల్‌కుమార్, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. -
ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్‌పై ‘దేశం’ నేతల దాడి
► దాడిలో కానిస్టేబుల్ కూడా.. ► అడ్డుకున్న వారిపై దుర్భాషలు ► ఫిర్యాదు చేసిన ఫీల్డ్ అసిస్టెంట్ లావేరు : ఉపాధి హామీ పథకంలో కొత్తకోట పంచాయతీ ఫీల్డ్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న రొక్కం అనిల్‌కుమార్‌పై అదే గ్రామానికి చెందిన తెలుగుదేశం నాయకులు మేడబోరుున శ్రీరాంమూర్తి, రొక్కం సాంబమూర్తి, మేడబోరుున సంపత్‌కుమార్, టీడీపీ నేత కుమారుడైన పోలీస్ కానిస్టేబుల్ రొక్కం దినేష్‌కుమార్ శుక్రవారం దాడి చేసి గాయపరిచారు. అడ్డుకున్న కూలీలను దుర్భాషలాడారు. దీంతో అనిల్‌కుమార్ తనపై దాడి చేసిన వారిపై ఎస్ఐ రామారావుకు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి ఫీల్డ్ అసిస్టెంట్, ఉపాధి కూలీలు తెలిపిన వివరాలు... కొత్తకోట గ్రామంలో అక్కురోడ్డు నుంచి లచ్చిరాజు చెరువు వరకు కొత్తగా మట్టి రోడ్డు వేయడం కోసం 2015-16లో పంచాయతీ తీర్మానం చేస్తూ ఉపాధి నిధులు మంజూరు చేశారు. అప్పట్లో పనులు కొంత మేరకు చేసి మధ్యలో నిలిపివేశారు. గ్రామానికి చెందిన ఎస్సీ ఉపాధి కూలీలు తమ వంద రోజుల పని దినాలు పూర్తి కాకపోవడంతో ఉపాధి పనులు కల్పించాలని ఇటీవల ఉపాధి అధికారులను కోరారు.దీంతో ఫీల్డ్ అసిస్టెంట్ అనిల్‌కుమార్ ఉన్నతాధికారుల ఆదేశాలతో ఆ కూలీలతో నిలిచిన పనులను గురువారం తిరిగి చేపట్టారు. శుక్రవారం కూడా పనులు చేసేందుకు వెళ్లగా గ్రామానికి చెందిన తెలుగుదేశం నేతలు మేడబోరుున శ్రీరాంమూర్తి, రొక్కం సాంబమూర్తి, మేడబోరుున సంపత్‌కుమార్, సాంబమూర్తి కుమారుడు అరుున హైదరాబాద్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న రొక్కం దినేష్‌కుమార్ పనులు వద్దకు వచ్చి జిరారుుతీ భూముల్లో రోడ్డు వేస్తున్నారని పనులు నిలుపుదల చేయాలని కూలీలు, ఫీల్డ్ అసిస్టెంట్‌తో వాగ్వివాదానికి దిగారు. జిరారుుతీ భూముల్లో పనులు చేయడం లేదని పీల్డ్ అసిస్టెంట్ చెప్పినా వారు వినిపించుకోలేదు. దీంతో పనులను నిలుపుదల చేసి ఫీల్డ్ అసిస్టెంట్ అనిల్‌కుమార్ కూలీల వద్ద మస్టర్లు వివరాలు నమోదు చేసుకుంటుండగా కానిస్టేబుల్ దినేష్‌కుమార్ తొలుత వచ్చి ఫీల్డ్ అసిస్టెంట్ కడుపులో కాలితో తన్నాడు. తరువాత మిగతా ముగ్గురు నాయకులు అతనిపై దాడికి పాల్పడి కొట్టారు. వెంటనే అక్కడ ఉన్న కూలీలు అడ్డుకోగా వారిని కానిస్టేబుల్, టీడీపీ నాయకులు తిడుతూ నానా దుర్భాషలాడారు. విషయం కొత్తకోటలో ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్ కుటుంబ సభ్యులుకు, వైఎస్సార్ సీపీ సాంసృతిక విభాగం జిల్లా అధ్యక్షుడు రొక్కం బాలక్రిష్ణలకు తెలియడంతో వారు తన అనూయులతో ఘటనా స్థలానికి వచ్చారు. దీంతో తెలుగుదేశం, వైఎస్సార్సీపీ నేతల మధ్య కొంతసేపు ఘర్షణ నెలకొంది. ఎస్ఐకు ఫిర్యాదు పీల్డ్ అసిస్టెంట్‌పై దాడి జరిగిన విషయం తెలుసుకొని లావేరు ఎస్ఐ సీహెచ్ రామారావు, హెచ్‌సీ రాంబాబు, ఉపాధి హామీ పథకం లావేరు మండల ఏపీవో శ్రీనివాసులనాయుడు, టీఏ రవి కొత్తకోట గ్రామానికి వెళ్లారు. కానిస్టేబుల్, టీడీపీ నాయకులు చేసిన దాడి గురించి ఫీల్డ్ అసిస్టెంట్ అనిల్‌కుమార్‌తో పాటు ఎస్సీ కూలీలు టి దుర్గాభవానీ, యాగాటి రమణమ్మ, చిన్నమ్మడు, లింగాల లక్ష్మి, కె.బోడమ్మలు పాటు పలువురు ఎస్ఐ రామరావుకు వివరించారు. దాడికి పాల్పడిన టీడీపీ నాయకులకు చెందిన జిరారుుతీ భూములు లేవని, సంబంధం లేకపోరుునా టీడీపీ నాయకులు, కానిస్టేబుల్ జోక్యం చేసుకున్నారని ఫీల్డ్ అసిస్టెంట్ చెప్పారు. దాడికి పాల్పడిన కానిస్టేబుల్‌పై, టీడీపీ నాయకులపైన చర్యలు తీసుకోవాలని వారంతా డిమాండ్ చేశారు. -
చిత్తూరు జిల్లాలో ఏనుగుల బీభత్సం
వీకోట: చిత్తూరు జిల్లా వీకోట మండలంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. మద్దిమాకులపల్లిలో ఐదు ఏనుగులు సోమవారం తెల్లవారుజామున పంటలపై దాడి చేసి విధ్వంసం సృష్టించాయి. పదిమంది రైతులకు చెందిన సుమారు 15-20 ఎకరాల్లోని వరి మడి, క్యాబేజీ, బీన్స్ పంటలను అవి ధ్వంసం చేశాయి. దీంతో రైతులకు రూ.5 నుంచి రూ.7 లక్షల వరకు నష్టం వాటిల్లింది. అటవీ అధికారులకు రైతులు ఫిర్యాదు చేశారు. -
రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే
ఈడుపుగల్లు (కంకిపాడు) : నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పల్లంరాజు డిమాండ్ చేశారు. ఈడుపుగల్లు గ్రామంలో ఎన్టీఆర్ మసూరి విత్తనాలు సాగు చేసిన వరి పొలాలను ఆదివారం మధ్యాహ్నం పల్ల్లంరాజుతో పాటు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు పరిశీలించారు. ఈ సందర్భంగా బాధిత రైతులు వీరమాచనేని శ్రీనివాసరావు, ముక్కామల రాజా తదితరులు మాట్లాడుతూ ఘంటసాలకు చెందిన ఉప్పాల ప్రసాద్ అనే రైతు నుంచి తాము ఎన్టీఆర్ మసూరి కొని వరి సాగు చేశామని చెప్పారు. పంట కాలం పూర్తి కావస్తున్నా ధాన్యం కంకులు రాలేదని ఎకరాకు రూ.22 వేలు వరకూ పెట్టుబడులు పెట్టామని తెలిపారు. కౌలు రూ.18 వేలు అదనమని వాపోయారు. తెగుళ్లు తట్టుకుంటుందని నమ్మి సాగు చేసి మోసపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిపించాలని కోరారు. మాజీ మంత్రి పల్లంరాజు విలేకరులతో మాట్లాడుతూ వ్యవసాయ శాఖ సర్టిఫై చేయని విత్తనాల వల్ల రైతులకు భారీగా నష్టం వాటిల్లిందన్నారు. ఈడుపుగల్లులో 150 ఎకరాల్లో రూ.40 లక్షలు మేర రైతులు పెట్టుబడులు కోల్పోయారన్నారు. రైతులు నష్టానికి ప్రభుత్వం బాధ్యత వహించి బాధిత రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రయోగాలు తప్పుకాదని, విత్తనం ఎంపిక సజావుగా జరగాలని, రైతులకు చేయూత అందించాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, డీసీసీ అధ్యక్షుడు ధనేకుల మురళీమోహన్, పీసీసీ కార్యదర్శులు నరహరిశెట్టి నర్సింహారావు, అన్వర్ హుస్సేన్, రత్నారావు, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ, అన్నే సుబ్బారావు (చంటి), మొవ్వా మోహన్‌రావు పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం ఇబ్రహీంపట్నం : రెండున్నరేళ్ల పరిపాలనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నిఅంశాల్లో పూర్తిగా విఫలం చెందాయని కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పల్లంరాజు విమర్శించారు. తుమ్మలపాలెంలో కాంగ్రెస్ పార్టీ డీసీసీ ప్రధాన కార్యదర్శి రామ్ లక్ష్మణ్ నివాసంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నూతన రాజధాని పేరుతో బలవంతపు భూసేకరణ చేయటం పాలకుల బాధ్యతారాహిత్యంగా పేర్కొన్నారు. -
సేద్యం విభాగంలో కృష్ణాజిల్లా ఎడ్లు సై
గన్నవరం : మండలంలోని కేసరపల్లిలో జరుగుతున్న తెలుగు రాష్ట్రాల స్థాయి ఒంగోలు జాతి పశు బలప్రదర్శన పోటీల్లో కృష్ణాజిల్లా ఎడ్లు సత్తా చాటుతున్నాయి. శ్రీవీరాంజనేయస్వామి, శ్రీషిర్డి సాయిబాబా దేవస్థానం ఆధ్వర్యంలో గురువారం రాత్రి వరకూ జరిగిన వ్యవసాయ సేద్యం విభాగంలో పోటాపోటీగా జరిగిన ప్రదర్శనలో వరుసగా నాలుగు స్థానాలను జిల్లా ఎడ్లు కైవసం చేసుకున్నాయి. కృష్ణాజిల్లా గన్నవరం మండంల మెట్లపల్లికి చెందిన చిలకపాటి రాజీవ్ ఎడ్లజత నిర్ణీత వ్యవధిలో బండను రికార్డు స్థాయిలో 4,346 దూరం లాగి ప్రథమ స్థానం సాధించాయి. పెనమలూరు మండలం కానూరుకు చెందిన డీవీఆర్ మెమోరియల్ దేవభక్తుని సుబ్బారావు ఎడ్లజత 3,989 అడుగులతో ద్వితీయం, పెనమలూరుకు చెందిన కోయి జగన్మోహన్రావు ఎడ్లజత 3,636 అడుగులతో తృతీయ స్థానంలో నిలిచాయి. మెట్లపల్లికి చెందిన చిలకపాటి రాజీవ్‌కు చెందిన మరో ఎడ్లజత 3,600 దూరంలాగి నాల్గో స్థానం, గుంటూరు జిల్లా ప్రత్తిపాడుకు చెందిన కాకాని శ్రీహరిరావు ఎడ్లజత 3,545 అడుగులతో ఐదో స్థానంలో నిలిచాయి. అనంతరం వరుసగా ఐదు స్థానాల్లో నిలిచిన ఎడ్లజతలకు డీవీఆర్ మెమోరియల్ ద్వారా వైఎస్సార్ సీపీ జిల్లా నాయకులు దేవభక్తుని సుబ్బారావు మొత్తం రూ.72వేల బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతరించిపోతున్న ఒంగోలు జాతి పశువులను వృద్ధి చేసేందుకు, వాటి పోషకులను ప్రోత్సహించేందుకు ఈ పోటీలు దోహదపడతాయన్నారు. కాగా, శుక్రవారం సబ్‌జూనియర్స్ విభాగంలో పోటీలు కొనసాగుతున్నాయి. ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాల నుంచి వచ్చిన 15 ఎడ్లజతలు ఈ పోటీల్లో బలప్రదర్శన చేస్తున్నాయి. పోటీల నిర్వాహకులు మల్లంపాటి బాబూరావు, వింత సాంబిరెడ్డి, శనగల శ్రీనివాసరెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు దేవభక్తుని చక్రవర్తి, పుర ప్రముఖులు కంఠమనేని శ్రీనివాసరావు, పెదకడిమి సొసైటీ అధ్యక్షుడు చల్లగుళ్ల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. బలప్రదర్శనను తిలకించేందుకు పలు జిల్లాల నుంచి రైతులు పెద్ద సంఖ్యలో రావడంలో పోటీ ప్రాంగణం కోలాహలంగా మారింది. -
దేవుళ్ల పేర్ల మీద మాన్యం భూములు
– వీడియో కాన్ఫరెన్స్‌లో సీసీఎల్ఏ కర్నూలు(అగ్రికల్చర్): మాన్యం భూములు దేవుళ్ల పేరుమీదే ఉండాలని..వాటిని అర్చకులు సాగు చేసుకంటుంటే వెబ్‌ల్యాండ్‌లో అనుభవదారులు(అక్రమణదారులు)గా నమోదు చేయాలని రాష్ట్ర భూపరిపాలన శాఖ ముఖ్య కమిషనర్ అనిల్చంద్రపునీట ఆదేశించారు. గురువారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రెవెన్యూ అంశాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రజాసాధికార సర్వేను ఈ నెల 25లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ స్థలం 100 గజాలలోపు ఆక్రమించుకొని ఇళ్లు నిర్మించుకంటే ఎలాంటి రుసుం తీసుకోకుండా క్రమబద్ధీకరించాలన్నారు. అదే 500లోపు గజాలు అక్రమించుకొని ఇళ్లు నిర్మించుకంటే నిర్ణీత పీజుపై క్రమబద్ధీకరించాలన్నారు. కౌలు రైతులకు బ్యాంకుల నుంచి పంట రుణాలు ఇప్పించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జేసీ హరికిరణ్, డీఆర్ఓ గంగాధర్‌గౌడు, కలెక్టర్ కార్యాలయ పరిపాలనాధికారి వెంకటనారాయణ, సెక్షన్ సూపరింటెండెంట్లు రామాంజనమ్మ, ఈరన్న, ప్రియదర్శిని, మీసేవ కేంద్రాల పరిపాలనాధికారి వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
పంటపొలాల్లో మారణాయుధాలు
కుంభం : ప్రకాశం జిల్లా కుంభం మండలం లింగోజీపల్లి సమీపంలోని పంటపొలాల్లో నాటుతుపాకీ, కత్తి, పేలుడు సామగ్రి కనిపించటం కలకలం రేపింది. శనివారం ఉదయం వీటిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. శుక్రవారం రాత్రి ఇక్కడ కొందరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుండగా స్థానికులు గుర్తించారు. వారిలో ఇద్దరిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. విచారించిన పోలీసులు వారిని వదిలేశారు. శనివారం ఉదయం రావూరి చిన వెంకటరాజు పొలం సమీపంలో మారణాయుధాలు కనిపించటంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఎవరినైనా చంపేందుకు సదరు వ్యక్తులు మాటువేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. -
పొలాలు.. ప్లాట్లు
లేఔట్‌ను తలపించేలా హంగూ ఆర్భాటాలు హద్దు రాళ్లు తొలగిస్తున్నా ఆగని వ్యాపారం తాజాగా హాజీపూర్ మండల ప్రకటన ఇక జోరందుకోనున్న భూ వ్యాపారాలు మంచిర్యాల రూరల్ : జిల్లా కేంద్రంగా మారనున్న మంచిర్యాల మండలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతోంది. పచ్చని పంట పొలం వెంచర్ గా మారుతోంది. మంచిర్యాల జిల్లా, నస్పూర్, హాజీపూర్ మండలాల ప్రకటనతో రియల్ వ్యా పారం వేగం పుంజుకుంది. లేఔట్ పొలాలు.. ప్లాట్లు అనుమతి లేకున్నా.. హంగూ ఆర్భాటాలతో లేఔట్‌ను తలపిస్తూ ప్లాట్లు విక్రరుుస్తున్నారు. అనుమతి లేని లేఔట్లపై కొరడా ఝళిపించాలని ఇప్పటికే కలెక్టర్ జగన్మోహన్ డివిజన్, మండల స్థారుు అధికారులను ఆదేశించారు. దీంతో జిల్లా పంచాయతీ అధికారి పోచయ్య ఆధ్వర్యంలో డివిజనల్ పంచాయతీ అధికారి ప్రత్యేక అధికారిగా ఈవోపీఆర్డీ, పంచాయతీ కార్యదర్శులతో ఐదు ప్రత్యేక బృందాలు ఏర్పాటయ్యూరుు. నెల రోజుల క్రితం మంచిర్యాల మండల పరిధిలోని పలు గ్రామాల్లో 120 ఎకరాల్లో ఏర్పాటు చేసిన అనుమతిలేని లేఔట్లలో హద్దు రాళ్లు తొలగించారు. అరుునా రియల్ వ్యాపారులు అదేం పట్టించుకోకుండా భూ దందా సాగిస్తున్నారు. అధికారులు ఓ వైపు నోటీసులు జారీ చేస్తూ దశలవారీగా హద్దు రాళ్లు తొలగిస్తున్నా రియల్ వ్యాపారుల ఆగడాలు ఆగడం లేదు. మండలంలో 16 గ్రామ పంచాయతీలు ఉండగా.. ప్రధానంగా నస్పూర్, తీగల్‌పహాడ్, వేంపల్లి, ముల్కల్ల, గుడిపేట, హాజీపూర్, దొనబండ, నర్సింగాపూర్, రాపల్లి గ్రామాల్లో రియల్ దందా సాగుతోంది. తాజాగా హాజీపూర్ మండల ప్రకటనతో భూముల ధరకు రెక్కొలొచ్చాయి. మంచిర్యాల జిల్లా ఏర్పాటుతోపాటు హాజీపూర్, నస్పూర్ మండలాల ప్రకటనతో భూములకు భారీగా డిమాండ్ పెరిగింది. ఇదే అదునుగా రియల్ వ్యాపారులు ఇష్టారాజ్యంగా వెంచర్లు ఏర్పాటు చేస్తున్నారు. రోడ్లు, విద్యుత్ స్తంభాలు వేస్తున్నారు. పచ్చని పంట పొలాల మధ్య.. జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న పంట పొటాలు, మామిడి వనాల్లో వెంచర్లు తయారవుతున్నాయి. గత నెలలో తొలగించిన హద్దురాళ్లను తిరిగి యధాస్థానంలో ఏర్పాటు చేస్తూ కొత్తగా ప్లాట్లు చేస్తున్నారు. అమాయక ప్రజలకు లేఔట్లేని ప్లాట్లను అంటగడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. అనుమతి లేకుండా ప్లాట్లు చేస్తున్న వారికి నోటీసులు అందతున్నా స్పందించని కారణంగా అధికారులు చర్యలకు సిద్ధమయ్యూరు. నిర్ధారించుకుని కొనుగోలు చేయాలి.. మండలంలోని ఆయా గ్రామాల్లో అనుమతి లేకుండా అక్రమ లేఔట్లు వెలుస్తున్నారుు. అలాంటి స్థలాలు కొనుగోలు చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు ఉంటాయి. రియల్ వ్యాపారుల వలలో పడి మోసపోవద్దు. ఇప్పటికే నోటీసులు జారీ చేయగా హద్దురాళ్లను సైతం తొలగించాం. ప్రజలు స్థలాలు కొనుగోలు చేసే సమయంలో అన్ని పరిశీలించి తగిన నిర్ధారణకు వచ్చిన తర్వాత కొనుగోలు చేయూలి. - శంకర్, ఈఓపీఆర్డీ, మంచిర్యాల -
పలమనేరులో ఏనుగుల బీభత్సం
చిత్తూరు: చిత్తూరు జిల్లా పలమనేరు మండలం మండిపేట కోటూరులో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. బుధవారం గ్రామంలోకి ప్రవేశించిన ఏనుగు పంట పొలాలను నాశనం చేసింది. వరి, రాగి, బీన్స్ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పంటలు దెబ్బతినడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సమీపంలోని రామసముద్రం నుంచి ఏనుగు వచ్చిందని గ్రామస్తులు తెలిపారు. ఏనుగుల దాడిపై గ్రామస్థులు అటవీ శాఖ అధికారలకు సమాచారం అందించారు. -
ఉధృతంగానే..
ఉప్పొంగుతున్న మంజీర, గోదావరి నదులు ఇద్దరు మృత్యువాత పడగల్లో గల్లంతైన బాలుడి మృతదేహం లభ్యం జిల్లాలో 25 వేల హెక్టార్లలో దెబ్బతిన్న పంటలు నేడు ఎస్సారెస్పీకి రానున్న ముఖ్యమంత్రి వర్షం, వరద నష్టంపై అధికారులతో సమీక్షించనున్న సీఎం సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : జిల్లాలో వరుణుడు జోరు తగ్గించినా వరద ఉధృతి మాత్రం ఉగ్రంగానే కొనసాగుతోంది. మంజీర, గోదావరి నదులు ఉధృతంగా పారుతున్నాయి. సోమవారం జిల్లాలో 26.3 మిల్లీ మీటర్ల సగటు వర్షపాతం నమోదయ్యింది. అత్యధికంగా ధర్పల్లిలో 7 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లావ్యాప్తంగా 25 వేల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. ఎస్సారెస్పీ ప్రాజెక్టును వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ప్రశాంత్‌రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీ వీజీ గౌడ్ సందర్శించారు. అధికారులతో మాట్లాడి వరద ప్రభావం గురించి తెలుసుకున్నారు. ముంపు ప్రాంతాల్లో పంట నష్టం అంచనా వేసేందుకు మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి బోధన్, ఆర్మూర్, బాన్సువాడ తదితర ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి సుడిగాలి పర్యటన చేశారు. పంటనష్టంపై వెంటనే సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిస్తామని, తక్షణమే సహాయం అందేలా చూస్తామన్నారు. పీఆర్, ఆర్అండ్బీ రోడ్లు దెబ్బతిన్నాయని, మరమ్మతులకు ప్రతిపాదనల సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. జిల్లాలో 10 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. సాలూర పునరావాస కేంద్రాన్ని జిల్లా ప్రత్యేక అధికారి అశోక్ కుమార్ సందర్శించారు. కలెక్టర్ యోగితారాణా, జేసీ రవీందర్‌రెడ్డి, అధికార యంత్రాంగం పనితీరును మెచ్చుకున్నారు. కలెక్టర్ నేతృత్వంలో అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ అవసరమైన సహాయ చర్యలు చేపట్టారంటూ అభినందించారు. బోధన్ మండలంలోని సాలూర వద్ద గల మంజీర నది పాత వంతెనపై నుంచి వరద నీరు ఉప్పొంగి ప్రవహిస్తోంది. మందర్న, హున్సా, ఖాజాపూర్, తగ్గెల్లి గ్రామ శివార్లలోని పంటలు నీట మునిగాయి. ముందస్తుగా సాలూర గ్రామ ప్రాథమిక పాఠశాలలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. తుంగవాగులో ఇద్దరి మృతదేహాలు లభ్యం సదాశివనగర్‌లో తుంగవాగులో పడి ఇద్దరు యువకులు మరణించారు. ఈ సంఘటన మూడు రోజుల తర్వాత వెలుగు చూసింది. సదాశివనగర్‌కు చెందిన కోతి విష్ణువర్ధన్ రెడ్డి(21), పోలబోయిన రంజిత్‌కుమార్(23) గిద్దలో ఉన్న బంధువుల వద్దకు వెళ్లి శనివారం రాత్రి బైక్‌పై తిరిగి వస్తూ సదాశివనగర్ శివారులోని తుంగవాగులో ప్రమాదవశాత్తూ కొట్టుకుపోయారు. వారి మృతదేహాలు సోమవారం కనిపించాయి. దెబ్బతిన్న ఇళ్లు.. కోటగిరి మండలంలో 18 ఇళ్లు పూర్తిగా, 55 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. వర్ని మండలంలో ఏడు ఇళ్లు పూర్తిగా, 74 ఇళ్లు పాక్షికంగా, బీర్కూర్ మండలంలో రెండు ఇళ్లు పూర్తిగా, 29 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. బోధన్ మండలంలోని సాలూర వద్ద గల మంజీర నది పాత వంతెనపై నుంచి వరద నీరు ఉప్పొంగి ప్రవహిస్తోంది .మందర్న, హున్సా, ఖాజాపూర్, తగ్గెల్లి గ్రామ శివార్లలోని పంటలు నీటమునిగాయి. సోయా, చెరుకు, వరి పంటలు నీటమునిగాయి. వరదల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండి పరిస్థితిని సమీక్షిస్తోంది. ఆదివారం రాత్రి గ్రామంలో తహసీల్దారు, రెవెన్యూ, పోలీసు శాఖల సిబ్బంది పర్యటించారు. ముందస్తుగా సాలూర గ్రామ ప్రాథమిక పాఠశాలలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. ప్రజలను ఆదివారం అర్ధరాత్రి నుంచే పునరావాస కేంద్రానికి ఆర్టీసీ బస్సుల్లో తరలించారు. సుమారు 200 మంది వరకు ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారు. సాలూర ప్రాథమిక పాఠశాల పునరావాస కేంద్రంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. భోజన వసతి, తాగు నీటి సౌకర్యం కల్పించారు. బోధన్ మండలంలోని హున్పా, మందర్న , ఖాజాపూర్ గ్రామాల ప్రత్యేక అధికారి, స్టెప్ సీఈవో ఉపేందర్‌రెడ్డి, ఆర్డీవో సుధాకర్‌రెడ్డి, తహసీల్దార్ వినోద్ కుమార్, టౌన్ సీఐ వెంకన్న, ఎస్సై ప్రభాకర్, రెవెన్యూ, పోలీసు సిబ్బంది సమన్వయంతో మూడు గ్రామాల్లో వరద పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. రెంజల్ మండలంలోని కందకుర్తి వద్ద గల త్రివేణి సంగమ క్షేత్రం వద్ద గోదావరి నదిలో మంజీర నది వరద నీటితో ఉప్పొంగి ప్రవహిస్తోంది. కందకుర్తి శివారులో 1,500 ఎకరాలలోని సోయా, పత్తి, పొగాకు పంటలు నీట మునిగాయి. గోదావరి తీరంలో రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు, సిబ్బంది వరద పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. నవీపేట మండలంలోని బినోల గ్రామంలో పెద్ద చెరువు కట్ట మళ్లీ కోతకు గురైంది. నీళ్లు వృథాగాపోతున్నాయి. బాన్సువాడ దిగువన ఉన్న మంజీర నది ఉధృతంగా ప్రవహిస్తోంది. భారీ వరదల కారణంగా బాన్సువాడ నియోజకవర్గంలోని పలు చెరువులు, కుంటల కట్టలు ప్రమాదకరంగా మారాయి. చెరువు కట్టలు తెగిపోయే ప్రమాదం ఉండడంతో రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో వర్షం తగ్గుముఖం పట్టింది. సోమవారం వర్షం కురవ లేదు. మాక్లూర్ మండలంలోని అమ్రాద్ వద్ద, ఆర్మూర్ మండలం రాంపూర్‌లో కాలువలకు పడిన గండ్లను మంత్రి పోచారం, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి పరిశీలించారు. ఆర్మూర్ పట్టణంలోని గూండ్ల చెరువులో పూజలు చేశారు. అధికారులు నష్టాన్ని అంచనా వేస్తున్నారు. బాల్కొండ నియోజక వర్గంలోని మోర్తాడ్ కమ్మర్పల్లి, బాల్కొండ, వేల్పూర్, భీమ్‌గల్ మండలాల్లో సోయా పంట పూర్తిగా తడిసి ముద్దఅయ్యింది. పంటకు చేనులోనే మొలకలు వచ్చాయి. పంట ఎంత మాత్రం పనికిరాకుండా పోతుంది. రైతులు ప్రైవేటుగా కొనుగోలు చేసిన సీడ్ వల్లనే నష్టం ఏర్పడింది. చెరువులు, కుంటలు పూర్తిగా నిండాయి, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి గోదావరి నదిలోకి నీటి విడుదల కొనసాగుతుంది. పెద్దవాగు ప్రవాహం జోరుగా ఉంది. నిజామాబాద్‌రూరల్ నియోజకవర్గంలో సోమవారం సాధారణ వర్షపాతం నమోదైంది. డిచ్పల్లి మండలం ఘన్పూర్ రాజేశ్వర్ చెరువు కట్ట కోతకు గురైంది. ఇసుక బస్తాలు వేసి మరమ్మతులు చేశారు. జక్రాన్‌పల్లి, సిరికొండ మండలాల్లో పంటలు నీటిలోనే ఉన్నాయి. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో భారీ వర్షాలు, వరదలకు వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. పోచారం ప్రాజెక్టులోకి 29 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. బోధన్-హైదరాబాద్ రోడ్డుపై నీరు అలాగే ఉండడంతో రాకపోకలు సాగడం లేదు. వరద నష్టాలను అధికారులు అంచనా వేశారు. ముఖ్యమంత్రి రాక నేపథ్యంలో.. ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం జిల్లాకు రానున్నారు. నాలుగైదు రోజులు గా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలతో జిల్లాలో ప్రాజెక్టులు నిండుకుండలా మారగా.. చెరువులు, కుంటలు నిండిపోయాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి ఇంకా నాలుగు లక్షల క్యూసెక్కుల వరకు ఇన్‌ఫ్లో వచ్చి చేరుతుండగా.. 41 వరద గేట్ల ద్వారా రెండు లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. అలాగే నిజాంసాగర్ తదతర ప్రాజెక్టులు సైతం నిండిపోయాయి. నాలుగైదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చాలాచోట్ల పంటలు, ఇళ్లు, రోడ్లు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం 11 గంటలకు సీఎం కేసీఆర్ జిల్లాకు రానున్నారని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కలెక్టరేట్‌కు సోమవారం రాత్రి సమాచారం అందింది. దీంతో అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిన కలెక్టర్ యోగితారాణా.. అనంతరం ఎస్పీ విశ్వప్రసాద్, జాయింట్ కలెక్టర్ రవీందర్ రెడ్డి, ఆర్అండ్బీ, పీఆర్, వైద్య ఆరోగ్యశాఖల అధికారులతో కలిసి సోమవారం రాత్రి పోచంపాడ్ వెళ్లి, హెలిపాడ్ స్థలాన్ని, ఏర్పాట్లను పరిశీలించారు. ఇదే సమయంలో సీఎం కేసీఆర్ నిజాంసాగర్ ప్రాజెక్టును కూడా సందర్శిస్తారన్న సమాచారం మేరకు మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధికారులతో కలిసి సోమవారం రాత్రి నిజాంసాగర్ వెళ్లి, హెలిపాడ్ ఏర్పాట్లను పరిశీలించారు. నూటికి నూరు శాతం వాతావరణం అనుకూలిస్తే హెలికాప్టర్ ద్వారానే సీఎం కేసీఆర్ జిల్లాకు రానున్నారని, లేదంటే రోడ్డుమార్గంలోనైనా వస్తారని అధికారవర్గాల ద్వారా తెలిసింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టును సందర్శించిన అనంతరం సీఎం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. -
ఇద్దరు ఫీల్డ్ అసిస్టెంట్ల సస్పెండ్
నెల్లికుదురు : జాతీయ ఉపాధి హామీ పథకం పనుల్లో జాప్యం చేస్తున్నారనే కారణంతో ఇద్దరు ఫీల్డ్ అసిస్టెంట్లను డ్వామా పీడి వై.శేఖర్‌రెడ్డి సోమవారం సస్పెండ్ చేశారు. స్థానిక ఈజీఎస్ కార్యాలయంలో సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించిన పీడీ.. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉపాధి పనుల పనితీరును పరిశీలించి, సక్రమంగా నిర్వహించని బొడ్లాడ, చిన్నముప్పారం ఫీల్డ్ అసిస్టెంట్లు కొత్తపల్లి బిక్షం, రాజయ్యను సస్పెం డ్ చేస్తున్నట్లు చెప్పారు. రైతులకు కాంపోస్ట్ పిట్స్ మంజూరయ్యాయని, వాటిని నిర్మించుకున్న వారికి రూ.4500 అందిస్తామని తెలి పారు. ఏపీడీ హనుమంతరావు, ఎంపీడీఓ హరి ప్రసాద్, ఏపీఓ మధు పాల్గొన్నారు. -
పంటలను పరిశీలించిన అధికారులు
నార్కట్‌పల్లి: అతివృష్టితో నీట మునిగిన పంటపొలాలను వ్యవసాయ శాఖ అధికారులు సోమవారం పరిశీలించారు. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టు, ఎల్లారెడ్డిగూడెం గ్రామాల్లో వరదతో దెబ్బతిన్న వరి, పత్తి పొలాలను వ్యవసాయ శాఖ డీడీఏ మాధవి, ఏడీఏ శైలజ పరిశీలించారు. మండలంలో పంట నష్టంపై పూర్తి స్థాయి నివేదిక అందజేయాలని ఏవో జగదీశ్వర్‌రెడ్డిని వారు ఆదేశించారు. వారి వెంట ఎంపీపీ మల్లికార్జున్‌రెడ్డి, తహశీల్దార్ విజయలక్ష్మి ఉన్నారు. -
మోదం.. ఖేదం
వర్షాలకు కొన్నిచోట్ల ఉభాలు.. మరికొన్ని చోట్ల నీటమునిగిన పంటలు మెంటాడ : మండలంలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొంతమంది రైతులు ఆనందం వ్యక్తం చేస్తుండగా, మరికొంతమంది రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. మండలంలోని పోరాం, పెదమేడపల్లి, కుంటినవలస, గుర్రమ్మవలస, కూనేరు తదితర గ్రామాల్లో ఉభాలు జరుగుతుండగా.. రాబంద, గుర్ల, వానిజ, పిట్టాడ, ఆండ్ర, లోతుగెడ్డ, తదితర గ్రామాల్లో సుమారు 50 ఎకరాల్లో వరి పొలాలు నీట మునిగాయి. ప్రతి ఏడాదీ ఏదో ఒక రూపంలో పంటలు నాశనమవుతున్నాయని రైతులు వాపోతున్నారు. -
జల దిగ్బంధం
సాక్షి ప్రతిని«ధి, ఏలూరు :జిల్లాలోని మెట్ట, ఏజెన్సీ ప్రాంతాలను కుండపోత వర్షం ముంచెత్తింది. వాగులు, కొండకాలువలు పొంగి పొర్లుతున్నాయి. పంటలు నీటమునిగాయి. పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఎర్రకాలువ ప్రమాదం అంచున ప్రవహిస్తోంది. ఈ కాలువపై శనివారం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం కనిపిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, నైరుతి రుతుపనాల ప్రభావంతో మెట్ట, ఏజెన్సీ ప్రాంతాల్లో గురువారం అర్ధరాత్రి నుంచి కుండపోత వర్షం కురిసింది. జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, కామవరపుకోట, గోపాలపురం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, చింతలపూడి, కుక్కునూరు మండలాల్లోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి. గోపాలపురంలో పిచ్చిగండి కాలువ పొంగి దొండపూడి–గోపాలపురం రోడ్డు మీదుగా ప్రవహించడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎర్రకాలువ ఉధృతితో సుమారు వెయ్యి ఎకరాల్లో పంట నీట మునిగింది. దీంతో ఆ ప్రాంత రైతులు ఆందోళనకు దిగారు. శుక్రవారం ఉదయం 8 గంటల సమయానికి గడచిన 24 గంటల్లో జంగారెడ్డిగూడెంలో రికార్డు స్థాయిలో 14.74 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొయ్యలగూడెంలో 12 సెంటీమీటర్లు, కామవరపు కోటలో 10.82, గోపాలపురంలో 10.8, బుట్టాయగూడెంలో 9.22, జీలుగుమిల్లిలో 8.26, కుక్కునూరులో 8.22, పోలవరంలో 9.22, తాళ్లపూడిలో 6.22, చింతలపూడిలో 6.04 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. జిల్లాలో మిగిలిన చోట్ల చెదురుమదురు వర్షాలు పడ్డాయి. మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు జల్లేరు జలాశయంలో నీటిమట్టం పెరిగింది. దీని సామర్థ్యం 217.14 మీటర్లు కాగా, ఇప్పటికే 216.08 మీటర్లకు చేరుకుంది. ఎర్రకాలువ జలాశయంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. 83.5 మీటర్లు సామర్థ్యం గల ఈ జలాశయంలో నీటిమట్టం శుక్రవారం మధ్యాహ్నానికి 81.48 మీటర్లకు చేరింది. ప్రస్తుతం 5,700 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ఇదిలావుండగా, చింతలపూడి మండలం ముక్కంపాడులోని చెరువు పంట కాలువలో అదే గ్రామానికి చెందిన రవీందర్‌రెడ్డి, టి.వెంకట కేశవరావు కొట్టుకుపోతుండగా స్థానికులు రక్షించారు. పొంగుతున్న వాగులు వాగులు, కొండకాలువలు పొంగుతుండటంతో బుట్టాయగూడెం, జంగారెడ్డిగూడెం మండలంలో అనేక గ్రామాల జలమయమయ్యాయి. జంగారెడ్డిగూడెం మండలం తిరుమలాపురంలో తామర చెరువు పొంగి ఎస్సీపేటను ముంచెత్తింది. సుమారు 25 ఇళ్లు వరదబారిన పడ్డాయి. లక్కవరంలో వెదుళ్ల వాగు ఉధతి రాకపోకలు నిలిచిపోయాయి. చిన్నవారిగూడెంలోని పెద్దచెరువు పొంగి చిన్నవారిగూడెం–ఎ.పోలవరం రోడ్డు మీదుగా ప్రవహిస్తోంది. దీంతో రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. గుర్వాయిగూడెంలో చెరువుకు గండిపడటంతో వరి చేలు ముంపుబారిన పడ్డాయి. పోలవరం మండలం కొత్తదేవరగొంది సమీపంలోని ఇసుక కాలువకు గండిపడటంతో వరిచేలు నీట మునిగాయి. కొయ్యలగూడెం మండలంలో పులివాగు వద్ద ఉన్న తవ్వుడు కాలువకు గండిపడి వరద నీరు చేలను ముంచెత్తింది. రామానుజపురం–వేదాంతపురం గ్రామల మధ్య కనకరాజు చెరువు కాలువకు గండిపడి వరిచేలు ముంపునకు గురయ్యాయి. దిప్పకాయలపాడు రాజు చెరువు డ్యామ్‌లో వరద నీరు పోటెత్తి దిగువకు ప్రవహిస్తోంది. చెరువు మురుగు తూము వరద ఉధతికి కొట్టుకుపోవడంతో చేలు ముంపుబారిన పడ్డాయి. జీలుగుమిల్లి మండలంలో సంగంవాగు,అశ్వారావుపేట వాగు పొంగి ప్రవహిస్తున్నాయి. ఎర్రకాలువ పొంగి ప్రవహిస్తోంది. బైనేరు, పులివాగు, కొండవాగుల నుంచి వరద నీరు వచ్చి చేరుతుండటంతో ఎర్ర కాలువ పొంగుతోంది. దీని ఉధతితో తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురంలో వెయ్యి ఎకరాలకు పైగా ఆయకట్టులో వరి చేలు నీట మునిగాయి. నందమూరు పాత ఆక్విడెక్ట్‌ను తొలగించకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు తాత్సారం చేస్తున్నారంటూ ఆక్విడెక్ట్ వద్ద రైతుల బైఠాయించారు. దీంతో రెండు గంటలకు పైగా ట్రాఫిక్ నిలిచిపోయింది. బుట్టాయగూడెం మండలం ఇప్పలపాడు సమీపంలోని జల్లేరు వాగు, పట్టినపాలెం సమీపంలోని వాగు, రెడ్డిగణపవరం వాగు పొంగి పొర్లుతున్నాయి. ముంజులూరు, కన్నారపాడు, కోపల్లి వద్దగల కొవ్వాడ కాలువ వాగులు పొంగాయి. వేలేరుపాడు మండలాన్ని వాన ముంచెత్తింది. జనజీవనం స్తంభించింది. పెదవాగు ప్రాజెక్టు ఉగ్రరూపం దాల్చింది. రెండు గేట్లు ఎత్తివేయటంతో మండలంలోని అనేక గిరిజన గ్రామాలకు మండల కేంద్రంతో సంబంధాలు తెగిపోయాయి. కమ్మరిగూడెం, ఒంటిబండ, రామవరం ఊటగుంప గ్రామాలు గురువారం సాయంత్రం నుండి జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. విద్యుత్ శాఖ అప్రమత్తం కొవ్వూరు:గడచిన నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతినే అవకాశం ఉండటంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్టు చేసేందుకు సిద్ధమయ్యారు. 500 ట్రాన్స్ఫార్మర్లు, 400 విద్యుత్ స్తంభాలు, 30 కిలోమీటర్ల విద్యుత్ వైర్లను సిద్ధం చేసినట్టు ఈపీడీసీఎల్ ఎస్ఈ సీహెచ్.సత్యనారాయణరెడ్డి తెలిపారు. ఏలూరులో సర్కిల్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. స్తంభాలు కూలిపోవడం, వాలడం, తీగలు తెగడం వంటి పరిస్థితులు ఎదురైతే చక్కదిద్దేందుకు 21 బందాలను సిద్ధంగా ఉంచామని చెప్పారు. ఒక్కొక్క బందంలో 15 చొప్పున మొత్తం 315 మంది కార్మికుల్ని సిద్ధం చేశామన్నారు. ప్రస్తుతం గాలుల తీవ్రత అంతా లేకపోయినప్పటికీ వర్షం పూర్తిగా తగ్గిన తర్వాత సమస్యలు బయటపడుతుంటాయన్నారు. -
తడిసి ముద్దయిన జిల్లా
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లాలో రెండో రోజు గురువారం విస్తారంగా వర్షాలు కురిశాయి. ఊరూవాడా అనే తేడా లేకుండా వర్షాలకు తడిసి ముద్దయ్యాయి. పల్లపు ప్రాంతాలు నీట మునిగాయి. పంట పొలాలు ముంపు బారినపడ్డాయి. పలు కాలనీలు జలదిగ్బంధనంలో చిక్కుకున్నాయి. కొవ్వూరు : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తారు వర్షం కురిసింది. గడిచిన ఇరవై నాలుగు గంటల్లో గురువారం ఉదయం 8 గంటల వరకు 34.3 మి.మీటర్లు సరాసరి వర్షపాతం నమోదైంది. ఆచంట, జంగారెడ్డిగూడెం, ఉండ్రాజవరం మండలాల్లో భారీ వర్షం కురిసింది. అల్పపీడన ప్రభావంతో గురు, శుక్రవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేప«థ్యంలో ఉదయం నుంచి జిల్లా అంతటా ఓ మోస్తారు వర్షం పడింది. కొన్ని మండలాల్లో భారీ వర్షం పడింది. చింతలపూడి, లిం గపాలె ం,తాడేపల్లిగూడెం మండలాల్లో చెదురుమదురు జల్లులు పడ్డాయి. ఉదయం నుంచి జల్లులతో కూడిన వర్షం కురుస్తుండడంతో జనజీవనం స్తంభించింది. మధ్యాహ్నం కొవ్వూరు, తాళ్లపూడి, చాగల్లు మండలాల్లో భారీ వర్షం కురిసింది. రాత్రి కూడా జిల్లాలో కొన్ని మండలాల్లో జడివాన పడుతూనే ఉంది. గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఆచంట మండలంలో గరిష్టంగా 68.0 మి.మీటర్లు నమోదు కాగా, లింగపాలెం మండలంలో 8.0 మి.మీటర్లు కురిసింది. గురువారం మధ్యాహ్నం జంగారెడ్డిగూడెంలో భారీ వర్షం పడింది. కామవరపు కోట, గోపాలపురం, దేవరపల్లి, నల్లజర్ల, ద్వారకా తిరుమల, నిడదవోలు, పెరవలి, ఉండ్రాజవరం, తణుకు, పెనుగొండ, ఆచంట, అత్తిలి, నరసాపురం, మొగల్తూరు మండలాల్లో ఓ మోస్తారు వర్షం పడింది. మిగిలిన మండలాల్లో చిరుజల్లులు పడ్డాయి. జిల్లాలో వర్షపాత వివరాలు ఉండ్రాజవరంలో 61.4, జంగారెడ్డిగూడెంలో 60.4, తణుకు, దేవరపల్లిలో 57.8, నిడదవోలులో 57.2, పోడూరు 54.6, బుట్టాయిగూడెం 53.8, చింతలపూడిలో 53.4, తాడేపల్లిగూడెంలో 49.6, పెనుగొండలో 45.4, కామవరపుకోట 39.2, మొగల్తూరులో 36.8, వేలేరుపాడులో 36.8, కొవ్వూరులో 36.0, కొయ్యలగూడెం, ఉంగుటూరులో 35.4, వీరవాసరం 34.2, ఆకివీడులో 24.0, తాళ్లపూడి పెనుమంట్రలో 23.6, పెదపాడులో 23.2, నిడమర్రులో 23.0, పెదవేగిలో 20.4, ఏలూరు, దెందులూరులో 18.2, యలమంచిలిలో 15.4, నరసాపురంలో 13.2 మి.మీటర్లు వర్షపాతం నమోదైంది. -
నెట్టింటి చిచ్చు!
తికమక పెడుతున్న వెబ్‌ల్యాండ్ – రాత్రికి రాత్రి మారిపోతున్న భూముల వివరాలు – పెరుగుతున్న భూ వివాదాలు – విలువ లేని ఈ–పాస్ పుస్తకాలు – తహశీల్దార్ కార్యాలయాల చుట్టూ రైతుల ప్రదక్షిణ – దోచుకుంటున్న అధికారులు, దళారులు – ప్రభుత్వ నిర్ణయంపై గుర్రు ప్రయివేట్ భూమి.. వెబ్‌ల్యాండ్‌లో ప్రభుత్వ భూమి...(పోటో: 43బి – చిన్న చెంచన్న ప్యాపిలి మండలం రాచర్ల గ్రామానికి చెందిన 1–3 సర్వే నెంబర్లో 7.30 ఎకరాల భూమి ఉంది. ఇందులో నేరడుచెర్ల గ్రామానికి చెందిన ముసలన్న, చిన్న చెంచన్న, పెద్ద చెంచన్న, శ్రీనివాసులు, శివమ్మల పేరుతో పట్టాదారు పాసు పుస్తకాలు ఉన్నాయి. ఈ సర్వే నెంబర్లోని భూములపై 1924 నుంచే రిజిస్ట్రేషన్లు జరిగాయి. కానీ ఆర్‌ఎస్‌ఆర్‌లో చుక్కలు ఉన్నాయనే కారణంతో వెబ్‌ల్యాండ్‌లో ప్రభుత్వ భూమిగా నమోదు చేశారు. ఇది ప్రయివేటు భూమిగా పేర్కొంటు రెవెన్యూ అధికారులు ఎన్ఓసీకి రెకమెండ్ చేశారు. కర్నూలు(అగ్రికల్చర్): వెబ్‌ల్యాండ్ ప్రక్రియ కొత్త చిక్కులు తెచ్చి పెడుతోంది. మొన్నటి వరకు ఆన్లైన్లో ఒకరి పేరు మీదున్న భూమి.. రాత్రికి రాత్రి మరొకరి పేరిట మారిపోతోంది. టెక్నాలజీ ఆధారంగా తహశీల్దార్ కార్యాలయంలోని కంప్యూటర్ ఆపరేటర్లు.. వీఆర్వోలు.. అక్రమార్కులు రైతుల తలరాత మార్చేస్తున్నారు. భూమి విలువను బట్టి ఆన్లైన్లో ఎక్కించేందుకు రూ.5వేల నుంచి రూ.50వేల వరకు డిమాండ్ చేస్తుండటం చూస్తే అక్రమాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో తెలుస్తోంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో గ్రామాల్లో పెద్ద ఎత్తున భూ వివాదాలు చోటు చేసుకునే ప్రమాదం ఉంది. ఇప్పటికే టైటిల్డీడ్స్ను ప్రభుత్వం రద్దు చేసింది. తాజాగా పట్టాదారు పాసు పుస్తకాలతో సంబంధం లేకుండా వెబ్‌ల్యాండ్‌లోని వివరాలతోనే రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కొన్ని నెలలుగా ఈ–పాసు పుస్తకాలు జారీ చేస్తుండగా.. వీటికి విలువ లేదని ప్రభుత్వమే ప్రకటిస్తోంది. రైతులకు భూములు ఉన్నాయనడానికి ఇవి ఆధారం మాత్రమేనని.. అన్నింటికీ వెబ్‌ల్యాండ్ వివరాలే ప్రామాణికమని తేల్చడం గందరగోళానికి తావిస్తోంది. ఆన్లైన్లో సవరణలకు పేరుకుపోతున్న దరఖాస్తులు వెబ్‌ల్యాండ్‌లో భుముల వివరాలను సర్వే నెంబర్ల వారీగా నమోదు చేయడంలో వీఆర్ఓలు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. పట్టాదారు పాసు పుస్తకంలో ఎన్ని ఎకరాలు నమోదు చేసి ఉంటే వెబ్‌ల్యాండ్‌లోనూ అన్నే ఎకరాలు న మోదు చేయాలి. వీఆర్ఓలు మాత్రం తక్కువగా నమోదు చేయడం.. వందలు, వేలాది సర్వే నెంబర్లను ఎగ్గొట్టడం వల్ల రైతులు తహశీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. వీటిని సవరించుకోవాలంటే మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్లో భూముల వివరాలను సవరించుకునేందుకు జిల్లా వ్యాప్తంగా 45వేల ధరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. అయితే ఇందులో మామూళ్లు ఇచ్చుకున్న వాటిని ఆమోదిస్తూ.. తక్కిన దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు. ఇలాంటి దరఖాస్తులే దాదాపు 25వేల వరకు ఉండటం గమనార్హం. ప్రభుత్వ భూముల జాబితాలో ప్రయివేటు భూములు ప్రయివేటు భూములను సైతం రెవెన్యూ అధికారులు వెబ్‌ల్యాండ్‌లో ప్రభుత్వ భూములుగా చూపించారు. ఇందువల్ల వేలాది మంది రైతులు భూములను అమ్ముకోలేక, రిజిస్ట్రేషన్ చేయించుకోలేక అల్లాడుతున్నారు. ఆర్‌ఎస్‌ఆర్‌లో చుక్కలు ఉన్నాయనే కారణంతో 1915 నుంచే రిజిస్ట్రేషన్లు అయిన భూములను నేడు వెబ్‌ల్యాండ్‌లో ప్రభుత్వ భూమిగా కనపర్చారు. వీటికి దశాబ్దాల క్రితమే పట్టాదారు పాసు పుస్తకాలు జారీ అయ్యాయి. అయితే తాజాగా ప్రభుత్వం వెబ్‌ల్యాండ్‌లో ప్రభుత్వ భూమిగా ముద్రవేయడం వల్ల రైతులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. సొంత భూమిపైనే ప్రభుత్వం రైతులకు హక్కు లేకుండా చేసింది. జిల్లాలో దాదాపు 1.20 లక్షల సర్వే నెంబర్లను ప్రభుత్వ భూముల జాబితాలో చేర్చి 1.60 లక్షల రైతుల కుటుంబాల్లో చిచ్చు పెట్టింది. -
ముగ్గురు ఫీల్డ్‌అసిస్టెంట్ల సస్పెన్షన్
దామరచర్ల : దామరచర్ల మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ఉపాధి హామీ ప్రజావేదికలో ముగ్గురు ఫీల్డ్ అససిస్టెంట్లు, ఒక టెక్నికల్ అసిస్టెంట్ సస్పెండ్ అయ్యారు. దామరచర్ల మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం అర్ధరాత్రి దాటేవరకూ ప్రజావేదిక జరిగింది. 25 గ్రామాల్లో తొలుత సామాజిక తనిఖీలు చేశారు. తేదీ 1.4.2015 నుంచి 31.5.2016 వరకు రూ.3.93కోట్ల విలువైన 1818 పనులకు సంబంధించిన నివేదికలను సభలో ప్రవేశపెట్టారు. దీనిపై సమగ్ర చర్చలు జరిగిన అనంతరం వివిధ పనుల్లో తేడాలు గుర్తించారు. తనిఖీల్లో గుర్తించిన పనులకు సంబంధించి రూ.4.43లక్షల రికవరీకి ఆదేశాలు జారీచేశారు. దీనికి సంబంధించి బాల్నెపల్లి, ఇర్కిగూడెం, చాంప్లాతండాలకు చెందిన ఫీల్డ్ అసిస్టెంట్లను, ఒక టెక్నికల్ అసిస్టెంట్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఏపీడీ శ్రీనివాస్, ఎంపీడీవో ఉమాదేవి, ఏపీఓలు నాగేశ్వరావు, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ముగ్గురు ఫీల్డ్‌అసిస్టెంట్ల సస్పెన్షన్
దామరచర్ల : దామరచర్ల మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ఉపాధి హామీ ప్రజావేదికలో ముగ్గురు ఫీల్డ్ అససిస్టెంట్లు, ఒక టెక్నికల్ అసిస్టెంట్ సస్పెండ్ అయ్యారు. దామరచర్ల మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం అర్ధరాత్రి దాటేవరకూ ప్రజావేదిక జరిగింది. 25 గ్రామాల్లో తొలుత సామాజిక తనిఖీలు చేశారు. తేదీ 1.4.2015 నుంచి 31.5.2016 వరకు రూ.3.93కోట్ల విలువైన 1818 పనులకు సంబంధించిన నివేదికలను సభలో ప్రవేశపెట్టారు. దీనిపై సమగ్ర చర్చలు జరిగిన అనంతరం వివిధ పనుల్లో తేడాలు గుర్తించారు. తనిఖీల్లో గుర్తించిన పనులకు సంబంధించి రూ.4.43లక్షల రికవరీకి ఆదేశాలు జారీచేశారు. దీనికి సంబంధించి బాల్నెపల్లి, ఇర్కిగూడెం, చాంప్లాతండాలకు చెందిన ఫీల్డ్ అసిస్టెంట్లను, ఒక టెక్నికల్ అసిస్టెంట్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఏపీడీ శ్రీనివాస్, ఎంపీడీవో ఉమాదేవి, ఏపీఓలు నాగేశ్వరావు, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులు ఎంచుకున్న రంగాల్లో రాణించాలి
కనగల్ : విద్యార్థులు ఎంచుకున్న రంగాల్లో రాణించాలని హైదరాబాద్ జేఎన్టీయూ కోఆర్డినేటర్ పి.చంద్రశేఖర్‌రెడ్డి సూచించారు. శుక్రవారం చర్లగౌరారం పరిధిలోని ఎస్‌ఆర్‌టీఐఎస్‌టీ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతి«థిగా హాజరై మాట్లాడారు. ఇంజనీరింగ్‌లో ప్రవేశం పొందిన మొదటి సంవత్సరం విద్యార్థులు సబ్జెక్టులపై అవగాహన కలిగి విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు. అనంతరం కళాశాల వైస్ చైర్మన్ ఎంసీ కోటిరెడ్డి, కళాశాల డైరెక్టర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ మూల దయాకర్‌రెడ్డి, యానాల ప్రభాకర్‌రెడ్డిలు మాట్లాడుతూ స్వామి రామానంద తీర్థ ఎడ్యుకేషనల్ సొసైటీలో అభ్యసించిన విద్యార్థులు దేశవిదేశాల్లో మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారన్నారు. అంతకుముందు జేఎన్టీయూ కోఆర్డినేటర్‌ను శాలువాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ బి.హరినాథరెడ్డి, హెచ్ఓడీలు గిరీశ్‌రెడ్డి, హైమావతి, టి.మధు, శశిదర్‌రెడ్డి, శ్రీనివాస్‌కుమార్, ధర్మ, భార్గవ్‌కుమార్, టీపీఓ, శ్రీనివాస్, రవికుమార్, రాజారాంరెడ్డి, బాబా నసీరోద్దీన్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
అన్నపై తమ్ముడు దాడి
చాగల్లు : పొలం తగాదా నేపథ్యంలో అన్నపై తమ్మడు దాడిచేసిన ఘటన గురువారం జరిగింది. చాగల్లు పోలీసుల కథనం ప్రకారం.. చంద్రవరం గ్రామంలో పొలం తగాదా నేపథ్యంలో గ్రామానికి చెందిన ముమ్మారెడ్డి నర్సింహమూర్తిని, అతని తమ్ముడు వరప్రసాద్ కొట్టి గాయపర్చాడు. నర్సింహమూర్తిని 108 వాహనంలో కొవ్వూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్‌సీ పెరవలి శ్రీను తెలిపారు. -
వరుణ దేవా.. ఎంత పని చేశావయ్యా..!
-
విద్యుదాఘాతంతో రైతు మృతి
సిరికొండ : సిరికొండ మండలం చీమన్‌పల్లి గ్రామంలో రైతు సింగిరెడ్డి ఎల్లయ్య(50) విద్యుదాఘాతంతో మృతి చెందాడు. ఎల్లయ్య శుక్రవారం సాయంత్రం పొలం వద్దకు వెళ్లాడు. విద్యుత్ తీగలను సరి చేస్తుండగా షాక్‌కు గురై అక్కడికక్కడే మరణించాడు. రాత్రి వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పొలం వద్దకు వెళ్ళి శవాన్ని గుర్తించారు. -
వీఆర్ఓలు ఫీల్డ్‌కు వెళ్లాలి
వచ్చిన 2,01,762 దరఖాస్తులన్నీ పరిశీలించాలి.. ప్రభత్వ నిర్ణయం మేరకు పాసుపుస్తకాలు అందజేస్తాం జాయింట్ కలెక్టర్ దివ్య బోనకల్ : సాదా బైనామాకు వచ్చిన 2,01,762 దరఖాస్తులన్నింటినీ పరిశీలించాలని, అందుకు వీఆర్ఓలు క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని, కార్యాలయాల్లో కూర్చోకుండా ఫీల్డ్‌కు వెళ్లాలని జాయింట్ కలెక్టర్ దివ్య సూచించారు. తహసీల్దార్ కార్యాలయంలో అధికారులు, సిబ్బందితో సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఆమె విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో ఖమ్మం జిల్లా మూడో స్థానంలో ఉందని, పేద రైతులకు సాదాబైనామాలు వరమన్నారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు పాసు పుస్తకాలను అందజేస్తామన్నారు. ముష్టికుంట్ల గ్రామంలో 129 ఎకరాల దేవుడుమాన్యం ఆక్రమణలో ఉందని, సంబంధిత రికార్డులను తనకు పంపాలని తహసీల్దార్ సుదర్శన్‌రావును కోరారు. అదేవిధంగా గ్రామకంఠం భూమితో ఎవరికి సంబంధం లేదని, ఎటువంటి కట్టడాలకు అనుమతి లేదన్నారు. మండలంలో ఇసుక రేవుల నుంచి అనుమతి లేకుండా వేలాది ట్రిప్పుల ఇసుకను ఖమ్మంకు అక్రమ రవాణా చేస్తున్నారని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బంధం శ్రీనివాసరావు లిఖిత పూర్వకంగా జేసీకి ఫిర్యాదు చేశారు. అదేవిధంగా గ్రామంలోని ఊర చెరువు కట్టను ఒక వ్యక్తి తొలగించి కోళ్లఫారం పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడని తెలిపారు. ఆ వ్యక్తిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని తహసీల్దార్‌ను జేసీ ఆదేశించారు. అనంతరం ఎంపీడీఓ విద్యాలతను హరితహార లక్ష్యం ఎప్పుడు పూర్తవుతుందని ప్రశ్నించారు. దీపం పథకం కింద రూ.2వేలకే గ్యాస్ కనెక్షన్‌ను ఇస్తున్న విషయాన్ని అధికారులు పేదలకు తెలియజేయాలన్నారు. త్వరలోనే పొగరహిత గ్రామాలుగా ప్రకటించాలని కోరారు. సమావేశంలో డిప్యూటీ తహసీల్దార్ వీరభద్రం, ఆర్ఐలు కష్టాల వెంకటేశ్వర్లు, జహేద, వీఆర్ఓలు తదితరులు పాల్గొన్నారు. -
ఉన్న జాబులు పీకేస్తావా చంద్రబాబూ?
ముమ్మిడివరం : బాబు వస్తే జాబు వస్తుంది..అంటూ ఎన్నికల ముందు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి యువత ఓట్లు కొల్లగొట్టి ఇప్పుడు ఉన్న జాబులు పీకేసీ వారిని రోడ్డున పడేయడం న్యాయమా చంద్రబాబూ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడిరాజా ప్రశ్నించారు. ముమ్మిడివరంలో ఉపాధి హమీ పథకం ఫీల్డ్అసిస్టెంట్లు చేపడుతున్న దీక్ష శిబిరాన్ని సోమవారం ఆయన సందర్శించి సంఘీభావం తెలిపారు. ఆరోగ్యమిత్ర, ఆదర్శ రైతులు, ఫీల్డ్ అసిస్టెంట్లు వివిధ శాఖ లలో చాలీచాలని వేతనాలతో పనిచేసే వారిని తొలగించి జన్మభూమి కమిటీల పేరుతో పచ్చచొక్కాలకు అప్పగించే ప్రయత్రం చేస్తున్నారని విమర్శించారు. కోర్డు ఉత్తర్వుల మేరకు జిల్లావ్యాప్తంగా ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకోగా ఈ నియోజకవర్గంలో రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడటం తగదన్నారు. ఈ సమస్యను పార్టీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని వారికి హమీ ఇచ్చారు. అసెంబ్లీలో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పిన విధంగా తమ పార్టీ అధికారంలోకి రాగానే ఫీల్డ్అసిస్టెంట్లతో పాటు కాంట్రాక్టర్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తామన్నారు. రాజాకు ఘనస్వాగతం : పదవి చేపట్టి తొలిసారి ముమ్మిడివరం వచ్చిన రాజాకు ఘన స్వాగం లభించింది. నియోజకవర్గ కోఆర్డినేటర్ గుత్తుల సాయి ఆధ్వర్యంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెయ్యల చిట్టిబాబు, పెన్మత్స చిట్టిరాజు, జగతా పద్మనాభం(బాబ్జీ) నగర పంచాయతీ ఫ్లోర్‌లీడర్ కాశి బాలమునికుమారి, పలువురు నాయకులు, కార్యకర్తలు పూలమాలలువేసి స్వాగతం పలికారు. పోలమ్మ చెరువు వద్ద గల దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖరరెడ్డి శిలా విగ్రహానికి రాజా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వీరి వెంట రాజమహేంద్రవరం కౌన్సిలర్ బొంతా శ్రీహరి, కోడి కోటయ్య, వీరబాబు ఎం.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఆకుపచ్చ నిరసన
భోపాల్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని వ్యవసాయాన్ని ప్రోత్సహించమని భారీ స్థాయిలో పంటను పండించి వినూత్న రీతిలో రైతులు నిరసన తెలిపిన ఘటన మధ్యప్రదేశ్ లోని పరద్ సింగా గ్రామంలో చోటు చేసుకుంది. అర్కిటెక్టులు, రైతులు కలిసి ఆకాశం నుండి చూస్తే 'డియర్ ప్రైమ్ మినిస్టర్ ప్లీస్ గ్రో ఆన్ ఇండియా ' అని కనబడే విధంగా పంటను పండిచారు . 7,200 స్కేర్ ఫీట్ విస్థీర్ణంలో పండించిన ఈ పంట బహుశా దేశంలోనే అతి పెధ్ద పంటగా భావిస్తున్నారు.దీనికి మూడు నెలల సమయం పట్టింది . మోదీకి రైతులు ఒక లేఖను కూడా రాశారు . ఇందులో వారు సేంద్రీయ పంటను పండించడానికి పడుతున్న ఇబ్బందులను, విత్తనాలు, ఎరువులు అందక రైతులు ఎదుర్కొంటన్న సమస్యలను మోదీకి వివరించారు. యువత ఎందుకు వ్యయసాయం వైపు రావడంలేదో ఆలోచించాలని, ప్రాధమికరంగానికి చేయూతనందిచే చర్యలు తీసుకోవాలని అందులో వారు కోరారు. కళ కలం కన్నా శక్తి వంతమైందని,అందుకే ఇలా కళతో తమ నిరసనను ప్రధానికి తెలియజేశామని రైతు శ్వేతా భట్టద్ పేర్కొన్నారు. ఈనిరసన పంట చాలా మంది ని ఆకర్షిస్తుంది. -
కాలి బూడిదైన వరికుప్పలు
రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో పంటపొలాల్లో అగ్నిప్రమాదం జరిగింది. సోమవారం మధ్యాహ్నం నుంచి నాలుగు కిలోమీటర్ల మేర వరికుప్పలు, ఎండు గడ్డి తగలబడుతోంది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సమీప ప్రాంతాల్లోని అగ్నిమాపక యంత్రాలు వచ్చి ప్రయత్నిస్తున్నా మంటలు అదుపులోనికి రాలేదు. -
గెంటేశారు!
►353 మంది ఫీల్డ్ అసిస్టెంట్ల తొలగింపు ►పదేళ్లు వెట్టిచాకిరీ చేయించుకుని పంపించేశారని ఆవేదన ►అధికార పార్టీ సానుభూతిపరుల నియామకానికి కసరత్తు ‘మేము విధుల్లో చేరేటప్పటికి కోరిన వారికి మాత్రమే పనిచూపాలని ఉపాధి హామీ చట్టం చెప్పింది. ఆ తర్వాత పాలకులు లేబర్ కమిషన్, బడ్జెట్.. అంటూ ఏవేవో కుంటిసాకులు చూపుతున్నారు. పదేళ్లు పనిచేయించుకుని అన్యాయంగా గెంటేశారు. ఇప్పుడు మాతోపాటు మమ్మల్ని నమ్ముకున్న కుటుంబాలూ వీధినపడ్డాయి. ఎలా బతకాలో తెలియడం లేదు..’ అంటూ జిల్లాలో తొలగింపునకు గురైన ఫీల్డ్ అసిస్టెంట్లు ఆవేదన వెళ్లగక్కుతున్నారు. తమకు న్యాయం చేయకుంటే ఆత్మహత్యే శరణ్యమంటున్నారు. సాక్షి ప్రతినిధి, తిరుపతి: జిల్లాలో 353 మంది క్షేత్ర సహాయకులపై ప్రభుత్వం వేటు వేసింది. వారి స్థానాల్లో కొత్తవారిని నియమించేందుకు కసరత్తు ప్రారంభించింది. మరో కొన్ని రోజుల్లో ‘పచ్చ’ ఫీల్డ్ అసిస్టెంట్లు కొలువుదీరనున్నారు. కుంటిసాకులు చూపుతూ.. గత ఏడాది ఆగస్టులో జిల్లాలో పనిచేస్తున్న 353 వుంది క్షేత్ర సహాయుకులు లేబర్ బడ్జెట్ లక్ష్యాన్ని చేరుకోలేదన్న సాకుతో ప్రభుత్వం వారిని పక్కనపెట్టింది. బాధిత ఫీల్డ్ అసిస్టెంట్లుతమ యుూనియున్ నాయకుల సహాయుంతో కోర్టు తలుపు తట్టారు. న్యాయు స్థానం నుంచి తాత్కాలిక ఉత్తర్వులు తెచ్చుకొని విధులు నిర్వర్తించారు. కానీ ప్రభుత్వం వారికి వేతనాలు మంజూరు చేయలేదు. ప్రభుత్వ, క్షేత్ర సహాయుకులకు సంబంధించిన న్యాయువాదుల వాదనలు విన్న హైకోర్టు రెండు నెలల క్రితం ఆర్డీవో నేతృత్వంలో త్రిసభ్య కమిటీ విచారణకు ఆదేశించింది. కమిటీ నిర్ణయుమే తుది నిర్ణయువుని తన తీర్పులో వెల్లడిందించి. రెండు నెలలుగా జిల్లాలోని తిరుపతి, వుదనపల్లి, చిత్తూరు ఆర్డీవో నేతృత్వంలో వుూడు కమిటీలు వేసి వారివారి పరిధిలోని వుండలాల క్షేత్ర సహాయుకులను విచారించారు. తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లను విచారించారు. ఈ మేరకు త్రిసభ్య కమిటీ గతంలో తొలగించిన ఫీల్డ్అసిస్టెంట్లందరీ శాశ్వతంగా తొలగిస్తున్నట్లు నివేదిక అందించారు. దీంతో జిల్లాలో 353 పంచాయతీల్లో కోర్టు స్టే ద్వారా పనిచేస్తున్న క్షేత్ర సహాయుకులను శాశ్వతంగా తొలగిస్తున్నట్లు ప్రకటించారు. తొలగించిన వారి స్థానాల్లో కొత్తవారి నియూవుకానికి వెంటనే చర్యలు చేపట్టాలని 61 వుండలాల ఎంపీడీవోలకు ఆదేశాలు అందారుు. క్షేత్ర సహాయుకుల కొత్త జాబితాను వీలైనంత త్వరగా జిల్లా కేంద్రానికి పంపించాలని డ్వావూ పీడీ వేణుగోపాల్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. పెత్తనమంతా జన్మభూమి కమిటీలదే జన్మభూమి కమిటీలే కొత్త ఫీల్డ్ అసిసెంట్ల పేర్లలను ప్రతిపాదించనున్నాయి. వీరు పంపిన జాబితాను మండల కమిటీలు పరిశీలించి తుది జాబితా డ్వామాకు పంపాల్సి ఉంటుంది. కొత్తగా ఎంపికయ్యే అభ్యర్థులు.. ఆ గ్రామస్తులై ఉండాలి. 10వ తరగతి పాస్గాని, ఫెయిల్ అయినా ఫర్వాలేదు. 18-35 వయస్సులోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్ల మినహాయింపు ఉంటుంది. విధిగా ఏడాదిలో 25 రోజులు పనిచేసి ఉండాలి. ఆ గ్రామంలో సర్పంచ్ రిజర్వేషన్ ఏది ఉంటే. ఆ రిజర్వేన్ కేటగిరికి చెందిన వారిని ఫీల్డ్ అసిస్టెంట్లుగా ఎంపిక చేయాల్సి ఉంటుంది. వీధినపడ్డ 353 కుటుంబాలు పదేళ్లుగా తవు వద్ద వెట్టి చాకిరీ చేరుుంచుకొని ఇప్పుడు గెంటేశారని తొలగించిన క్షేత్ర సహాయుకులు విలపిస్తున్నారు. 2006లో తావుు పనిలో చేరినప్పుడు పనికోరిన వారికి వూత్రమే పని కల్పించాలన్న ఉపాధి హామీ చట్టాన్ని తవుకు నేర్పారని, కానీ ప్రస్తుతం తవుకు లేబర్ బడ్జెట్ల ద్వారా లక్ష్యాలను చేరుకోలేదంటూ తవు కడుపులు కొట్టారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయుం వల్ల తవుకుటుంబాలు వీధిన పడ్డాయుని బోరువుంటున్నారు. బాబు వస్తే జాబు వస్తుందన్న హామీతో గద్దెనెక్కిన పాలకులు అధికారంలోకి రాగానే ఉన్న జాబులు ఊడగొట్టడం ఎంత వరకు సమంజసవుని పలువురు ప్రశ్నిస్తున్నారు. తమకు ఆత్మహత్యలే శరణ్యమని హెచ్చరిస్తున్నారు. -
శ్రీకాకుళం జిల్లాలో ఏనుగుల బీభత్సం
కొత్తూరు: శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం గొరండి గ్రామంలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇంటి ముందు ఉంచిన ధాన్యం కుప్పల పై దాడి చేసిన ఏనుగుల గుంపు 50 బస్తాల ధాన్యాన్ని నాశనం చేశాయి. అనంతరం గ్రామంలోకి ప్రవేశించి కనిపించిక వాడిని తొక్కుతూ బీభత్సం సృష్టిస్తున్నాయి. ఏనుగుల గుంపు సంచరిస్తుండటంతో గ్రామస్థులు బిక్కు బిక్కు మంటున్నారు. ఏ సమయంలో దాడి చేస్తాయేమోనని భయాందోళనలకు గురవుతున్నారు. -
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్
సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగతున్న ఐదో వన్డేలో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే 0-4తో సిరీస్‌లో వెనకంజలో ఉన్న భారత్ శనివారం జరిగే వన్డేలోనైనా విజయం సాధించాలని చూస్తోంది. వరుస విజయాలు ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో జోరు మీదున్న కంగారూలు క్లీన్‌స్వీప్‌పై కన్నేశారు. -
వైఎస్ఆర్ జిల్లాలో ఎడతెరిపిలేని వర్షం
జమ్మలమడుగు: అల్పపీడన ద్రోణి ప్రభావంతో కడప జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. పెద్దముడిగం, జమ్మలమడుగు మండలాల్లో రాత్రి నుంచి ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తోంది. ప్రొద్దుటూరు, మద్దనూరు మండలాల్లో ఉదయం నుంచి వర్షం పడుతోంది. దీంతో జొన్న, వేరుశనగ పంటలు నీటమునిగాయి. పొలాల్లో నీళ్లు నిలిచిపోవడంతో పంటలకు నష్టం వాటిల్లింది. వందల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లడంతో బాధిత రైతులు లబోదిబోమంటున్నారు. -
శ్రీకాకుళంలో చైన్ స్నాచింగ్
శ్రీకాకుళం జిల్లా సరిబుజ్జిలి సమీపంలో విధి నిర్వహణలో ఉన్న ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ కృష్ణవేణి మెడలోంచి బంగారు చైన్‌ను దుండ గుడు లాక్కెళ్లాడు. ఈ సంఘటన బుధవారం మధ్యాహ్నం జరిగింది. కృష్ణవేణి పీల్డ్ నుంచి ఇంటికి సైకిల్‌పై వెళుతుండగా మోటార్‌బైక్‌పై వచ్చిన దుండగుడు ఆమె మెడలోని రెండున్నర తులాల బంగారు గొలుసును లాక్కెళ్లాడు. ఈ విషయమై ఆమె సరిబుజ్జిలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
నా పొలంలో మేత మేస్తావా..
హొసూరు: మామిడి తోటలో ఆవు మేత మేసిందని దానిని కొ్టి చంపాడో ప్రబుద్ధుడు. ఈ సంఘటన చంబరసనపల్లి గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన చంద్రన్ సూళగిరిలో మెకానిక్ షాపు నిర్వహిస్తున్నాడు. ఇతనికి చంబరసనపల్లిలో మామిడి తోట ఉంది. ఈ తోటలో రెండు ఆవులు, రెండు గొర్రెలు మేత మేస్తుండగా పొలం వద్దకు వచ్చిన చంద్రన్ గొర్రెలను, పశువులను తాళ్లు తెంచి వెళ్లగొట్టాడు. ఒక ఆవును తాడుతో కడుపు పై బాదాడు. గర్భంతోవున్న ఆవు అతను కొట్టిన దెబ్బలకు మరణించింది. జీవనోపాధికి పశుపోషణ చేసుకుంటున్న లక్ష్మీ తన ఆవును చంపేశాడని బోరున విలపించింది. చంబరసనపల్లి గ్రామంలో ఈ సంఘటనపై ఇరువర్గాలుగా ఏర్పడి కేసు పెట్టాలని సూళగిరి పోలీస్‌స్టేషన్‌కు బాధితురాలిని తీసుకొచ్చారు. -
పొలాల్లో ఎముకల దహనం
ఎడపల్లి: నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జాన్కంపేట్ శివారులో కొంతమంది పశువుల ఎముకలను ఆరబెట్టడంతో ఆదివారం స్థానిక యువకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎముకలపై కిరోసిన్, డీజిల్ పోసి నిప్పంటిచారు. కొంత కాలంగా పంట పొలాల్లో పశువుల ఎముకలను ఆరబెట్టడంతో తీవ్ర దుర్గంధం వస్తోందని రైతులు, యువకులు ఆభ్యంతరం తెలిపారు. అయినా తొలగించకపోవడంతో యువకులు ఎముకలు ఆరబెడుతున్న స్థలానికి వెళ్లి అక్కడి వారితో వాగ్వాదానానికి దిగారు. ఇరువురి మధ్య మాట-మాట పెరిగి ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.సమాచారం అందుకున్న ఎడపల్లి ఎస్సై ఆసిఫ్ ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను శాంతింపచేశారు. ఆరబెడుతున్న ఎముకలను తొలగించాలని సూచించారు. లేని పక్షంలో కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. -
బిడ్డ కోసం చిరుతతోనే పోరాడిన తల్లి
లక్నో: అమ్మ అంటే నవమాసాలు మోసి బిడ్డకు జన్మనివ్వడమే కాదు.. కలకాలం వెన్నంటి కాపాడే అమృతమూర్తి. కాలయముడే ముందు నిలబడినా బిడ్డల కోసం ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి పోరాడే దేవత.. ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఓ మాతృమూర్తి ఈ విషయాలను మరోసారి రుజువు చేసింది. అకస్మాత్తుగా దాడిచేసి తన బిడ్డను నోట కరుచుకొని పోతున్న చిరుతతో ధైర్యంగా పోరాడింది. అత్యంత సాహసంగా వ్యవహరించి క్రూర జంతువు సైతం తోక ముడిచేలా చేసింది. కాట్రాయన్ ఘాట్ గ్రామానికి చెందిన ఫూల్మతి (30) తన ఇద్దరు ఆడబిడ్డల్ని తీసుకుని పొలానికి బయలుదేరింది. అంతలో అక్కడకు దగ్గర్లో ఉన్న వన్యప్రాణుల అభయారణ్యం లోంచి వచ్చిన చిరుత వాళ్లపై దాడిచేసి, నాలుగేళ్ల గుడియాను ఈడ్చుకుంటూ పారిపోవడానికి ప్రయత్నించింది. ఒక్కసారిగా షాకైన ఫూల్మతి.. క్షణం ఆలస్యం చేయకుండా.. సాయం కోసం బిగ్గరగా అరవడం మొదలుపెట్టింది. పొద్దునే కావడంతో ఆ చుట్టుపక్కల ఎవరూ స్పందించలేదు. అయినా పెద్దగా కేకలు వేస్తూ.. చేతికి దొరికిన రాళ్లు, కర్రలతో చిరుతను కొట్టడం మొదలుపెట్టింది. దాదాపు అరగంటపాటు ఆ చిరుతపై ఒంటరి పోరాటం చేసింది. తర్వాత ఆమె కుటుంబసభ్యులు ఆమెకు తోడయ్యారు. చివరకు చిరుత బారినుంచి ఆ పాపను కాపాడి ఆసుపత్రికి తరలించారు. ఈ దాడిలో ఇద్దరు చిన్నారులు సహా, మరో ఇద్దరికి కూడా గాయాలయ్యాయి. -
పొలాల్లో ఏనుగుల మంద విధ్వంసం
సీతంపేట: శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలంలో ఏనుగుల మంద విధ్వంసం సృష్టించింది. స్థానిక మోహన్ కాలనీ సమీపంలో ఆదివారం రాత్రి గ్రామ పరిసరాల్లోకి వచ్చిన ఏనుగులు వరి, అరటి పంటలను ధ్వంసం చేశాయి. రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు అక్కడే తిష్ట వేయడంతో గిరిజనులు భయాందోళనలకు గురయ్యారు. కాలనీ వాసులు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఏనుగుల రాకతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచి పోయాయి. -
పంచారామ క్షేత్రాల్లో ప్రత్యేక పూజలు
-
'రుణమాఫీపై ఆశలు వదులుకోండి'
గోరంట్ల: గతంలో రుణమాఫీ అమలు కాని రైతులు ఇక ఆశలు వదులుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. శనివారం ఉదయం బెంగళూరు నుంచి రోడ్డు మార్గంలో పుట్టపర్తికి వెళుతూ అనంతపురం జిల్లా గోరంట్ల మండలం చింతలపల్లి బస్టాండ్ వద్ద ఆయన రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రస్తుత వర్షాలకు పంటల నష్టంపై రైతలు ప్రత్తిపాటి దృష్టికి తీసుకువచ్చారు. ప్రస్తుత పంట నష్టాన్ని అంచనావేసి రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. రుణమాఫీపై ప్రత్తిపాటి స్పందిస్తూ... గతంలో విడుదల చేసిన మేరకే రుణమాఫీ వర్తిస్తుందన్నారు. -
ఎల్‌ఎన్‌పేటలో ఏనుగుల బీభత్సం
ఎల్‌ఎన్‌పేట: శ్రీకాకుళం జిల్లా ఎల్‌ఎన్‌పేటలో గురువారం రాత్రి ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఎల్‌ఎన్‌పేట మండలం అటవీ ప్రాంత పరిధిలోని కరకవలస, డొంకలబడవంజ, కుశమలపాడు గ్రామాల్లో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. పలువురు రైతులకు చెందిన వరి పొలాలను నాశనం చేశాయి. గ్రామస్తుల సమాచారంతో అటవీ శాఖ, రెవెన్యూ సిబ్బంది గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పంటనష్టం వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. -
ఫీల్డ్ అసిస్టెంట్ ఆత్మహత్య
నాంపల్లి: నల్లగొండ జిల్లాలో ఓ ఫీల్డ్ అసిస్టెంట్ ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన బుధవారం చోటు చేసుకుంది. వివరాలు.. జిల్లాలోని నాంపల్లి మండలం రేవెల్లి గ్రామానికి చెందిన సరిత(32) ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తోంది. ఈ రోజు ఇంట్టో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుంది. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. -
ఫీల్డ్ అసిస్టెంట్ బలవన్మరణం
కొనిజెర్ల (ఖమ్మం) : అప్పుల బాధ భరించలేక ఫీల్డ్ అసిస్టెంట్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా కొనిజెర్ల మండలం బసవాపురం గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన చల్లా వీరబాబు(38) గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఔట్సోర్సింగ్ ఫీల్డ్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన రెండెకరాలలో పత్తి సాగు చేశాడు. నీళ్లు లేక అది ఎండిపోవడంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
శ్రీకాకుళం జిల్లాలో ఏనుగుల భీభత్సం
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో ఏనుగులు భీభత్సం సృష్టించాయి. జిల్లాలోని ఎల్ఎన్ పేట మండలం జింబాడ అటవీ ప్రాంతంలో శుక్రవారం ఏనుగుల గుంపు దాడి చేసింది. ఈ దాడుల్లో ఐదు ఎకరాల్లో వరి పంట పూర్తిగా ధ్వంసం అయింది. ఏనుగుల దాడులతో స్థానికులు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. పలు సార్లు ఏనుగులు దాడులు నిర్వహించినా అటవీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
వి.కోటలో ఏనుగుల భీభత్సం
వి.కోట: చిత్తూరు జిల్లా వి.కోట మండలంలో ఏనుగుల గుంపు భీభత్సం సృష్టించాయి. మండలంలోని కొత్తకోట, పుదుగుడ్డ, రామకుప్పం, నన్యాల, పొద్దూరులో గురువారం అర్ధరాత్రి నుంచి ఏనుగులు దాడులు చేస్తున్నాయి. వరి, బీన్స్, టమాట, రాగి పంటలపై దాడి చేసి నాశనం చేశాయి. దీంతో తీవ్ర నష్టం వాటిల్లింది. స్థానిక గ్రామాల ప్రజలు ఇళ్ల బయటకు రావడానికి భయపడుతున్నారు. ఏనుగుల దాడులపై ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. -
నేతల కనుసన్నల్లోనే...
అనంతపురం సెంట్రల్ : ఉపాధిహామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్ల తొలగింపు, నియామకం రెండూ రాజకీయనాయకుల చేతుల్లోనే జరిగిపోతున్నాయి. ప్రతి స్థానానికి ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలను జోడించి తొలగింపులు, నియామకాలు చేపడుతున్నారు. జిల్లా నీటియాజమాన్య సంస్థలో ఇటీవల ఒకేసారి 437 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించారు. పనితీరులో వెనుకబడిన వారిని మాత్రమే తొలగించామని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఇందుకు విరుద్ధంగా జరిగింది. 75 శాతం కన్నా తక్కువ పనిదినాలు కల్పించిన వారిని తొలిగించామని అధికారులు పేర్కొంటున్నారు. వాస్తవానికి పనిదినాలు కల్పించడంతో పాటు సర్వీసులో నయా పైసా కూడా నిధులు పక్కదారి పట్టకుండా పనిచేస్తున్న సిబ్బంది ఉన్నారు. కొంతమంది న్యాయస్థానాలను ఆశ్రయించగా తొలగింపులు విరుద్ధంగా జరిగాయని, వెంటనే విధుల్లో కొనసాగించాలని ఉత్తర్వులు వస్తున్నాయి. ఇవేమి అధికారులు పట్టించుకోవడం లేదు. త్వరలో 437 స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటికి తోడు గత 18వ తేదీన 82 స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం స్థానాల్లో అధికారపార్టీకి చెందిన వారినే నియమించాలని ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఆదేశాలు జారీ చేశారు. దీంతో 82 స్థానాలకు కేవలం 8 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. వాటిలో కూడా అన్నీ సక్రమంగా లేవని తెలుస్తోంది. నిబంధనల మేరకు సర్పంచు రిజర్వేషన్ ప్రకారం అభ్యర్థులు 25 రోజులు తప్పనిసరిగా పని చేసిన వారు అర్హులు. దీనికి తోడు జన్మభూమి కమిటీలు ఆమోదించాలని మెలికపెట్టారు. దీంతో అధికారపార్టీకి చెందిన వారు మాత్రమే అర్హులన్నట్లు తయారైంది. రిజర్వేషన్లు, పనిదినాలు అన్నీ సక్రమంగా ఉన్నా జన్మభూమి కమిటీలు ఆమోదించడం లేదు. ఒకసారి ఎమ్మెల్యేను కలిసి అక్కడి నుంచి లేఖ తీసుకుని రావాలని చెబుతున్నారు. ఎమ్మెల్యేల కటాక్షం ఉంటేనే ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం వస్తుందని అభిప్రాయం సర్వత్రావ్యక్తమవుతోంది. ధర్మవరం నియోజకవర్గంలో ముందే నియామకాలు : ధర్మవరం నియోజకవర్గంలో అధికారులు చేయాల్సిన పనిని అక్కడున్న రాజకీయ నేతలే చేసేస్తున్నారు. ఇంకా నోటిఫికేషన్ కూడా విడుదల చేయని స్థానాల్లో అనధికారికంగా ఫీల్డ్ అసిస్టెంట్లను నియమించుకున్నారు. ముదిగుబ్బ మండలంలో ఈ పరిస్థితి ఎక్కువశాతం నెలకొంది. దీంతో అర్హులైన వారు ధరఖాస్తు చేసుకోవడానికే వెనుకంజ వేయాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే తొలుత విడుదల చేసిన 82 స్థానాలను మాత్రమే భర్తీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖాళీ ఏర్పడిన 437 స్థానాలకు భర్తీ విషయం హైకోర్టుకు చేరింది. నిబంధనలకు విరుద్ధంగా తమను తొలగించారని కొంతమంది బాధిత ఫీల్డ్ అసిస్టెంట్లు కోర్టును ఆశ్రయించారు. అధికారులు త్వరలో కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. కోర్టు నుంచి ఉత్వర్వులు వెలువడేంత వరకూ ఫీల్డ్ అసిస్టెంట్ల నియమాకం జరిగే అవకాశాలు కనిపించడం లేదు. -
ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ల ధర్నా
విధుల నుంచి సస్పెండ్ అయిన ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ లు కర్నూలు కలెక్టరేట్ ముందు మంగళవారం ధర్నాకు దిగారు. కూలీలకు నిబంధనల మేరకు ఉపాధి కల్పించడంలో విఫలమయ్యారంటూ 60 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల నుంచి తొలగిస్తూ గత నెల 23న డ్వామా పీడీ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే విధుల నుంచి సస్పెండ్ అయిన 60 ఫీల్డ్ అసిస్టెంట్ లు ధర్నాలో పాల్గొన్నారు. తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. -
11మంది ఫీల్డ్ అసిస్టెంట్ల సస్పెన్షన్
అనంతపురం: లక్ష్యం మేరకు ఉపాధి కల్పనలో విఫలమయ్యారంటూ అనంతపురం జిల్లా తలుపుల మండలంలో 11 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను సస్పెండ్ చేశారు. ఉపాధి హామీ పథకం జిల్లా ప్రాజెక్టు డెరైక్టర్ నాగభూషణం బుధవారం సాయంత్రం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. మండలంలోని 75 శాతం మంది కూలీలకు పని కల్పించాల్సి ఉండగా విఫలమయ్యారని, అందుకే ఫీల్డ్ అసిస్టెంట్లపై చర్యలు తీసుకుంటున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
ఉపాధికి గొడ్డలిపెట్టు
రాజకీయ దురుద్దేశం మహత్తర పథకాన్ని నీరుగారుస్తోంది. దిశ చూపే సారథి లేకుండా రథాన్ని సాగించాలని చూస్తోందీ ప్రభుత్వం. ఉపాధి హామీ పథకంలో కీలక పాత్ర వహించే క్షేత్ర సహాయకులను కుంటి సాకులతో తొలగించి కూలీల పొట్టగొడుతోంది. వలసలను నివారించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం జాతిపిత పేరుతో ప్రారంభించిన ఉపాధి హామీ పథకాన్ని రాష్ట్రంలోని టీడీపీ సర్కారు కుహనా రాజకీయాలతో అతలాకుతలం చేస్తోంది. ఫలితంగా ఏ పాపం ఎరుగని కూలీ బతుకుదెరువు కోసం నగరాలకు వలస పోతున్నాడు. - 640 పంచాయతీల్లో ఫీల్డు అసిస్టెంట్లు ఖాళీ - 491 పంచాయతీల్లో మాత్రమే లక్ష్యం మేరకు పనులు - మిగిలిన చోట్ల అరకొర పనులు సాక్షి, చిత్తూరు: ఫీల్డు అసిస్టెంట్ల తొలగింపు వ్యవహారం ఉపాధిహామీ పథకంలో లక్ష్యం చేరడానికి మరింత అడ్డంకిగా మారింది. అసలే అరకొర పనులు జరుగుతున్న ఈ పథకంలో నిర్దేశిత లక్ష్యాలు చేరుకోలేదంటూ ఒక్కసారిగా 365 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించడం మూలిగే నక్కపై తాటికాయ పడినట్లైంది. జిల్లా వ్యాప్తంగా 1363 పంచాయతీల్లో ప్రస్తుతం 640 పంచాయతీల్లో ఫీల్డు అసిస్టెంట్లు, సీనియర్ మేట్లు లేరు. ఇక వెయ్యి పనిదినాలు కూడా కల్పించలేని పరిస్థితిలో 159 పంచాయతీల్లో ఉపాధి హామీకి క్షేత్రస్థాయి సిబ్బందిని నియమించలేదు. దీంతో ఈ పంచాయతీలు ఖాళీగా ఉన్నాయి. ఇక వెయ్యి నుంచి ఐడు వేల లోపు పనిదినాలు మాత్రమే కల్పిస్తున్నారన్న కారణంగా 405 పంచాయతీలలో పీల్డ్ అసిస్టెంట్ల కు బదులు సీనియర్మేట్ల ను మాత్రమే నియమించారు. కాని వాటిలో కూడా క్షేత్రస్థాయి సిబ్బంది లక్ష్యాలను అధిగమించలేదంటూ ఇటీవల 165 మందిని తొలగించారు. ఇక మిగిలిన 759 పం చాయతీల్లో మాత్రమే ఇటీవల వరకు ఫీల్డ్అసిస్టెంట్లు ఉన్నారు. అయితే పంచాయతీల్లో 5 వేల పనిదినాలకు తగ్గకుండా పనులు కల్పించడమే కాక ముందస్తు ప్రణాళికలో చూపించిన పనుల్లో 75 శాతం పైగా పనులు చేయించాల్సి ఉంది. ఈ రెండు లక్ష్యాలను అధిగమిస్తేనే ఫీల్డ్ అసిస్టెంట్లు కొనసాగుతారు. కానీ వీరిలో లక్ష్యాలు చేరలేదంటూ 216 మంది క్షేత్ర సహాయకులను తాజాగా తొలగించా రు. దీంతో మొత్తం 381 మందిని తొలగించినట్లైంది. దీనికి తోడు ఖాళీగా ఉన్న 165 పంచాయతీలను కలిపితే జిల్లా వ్యాప్తంగా మొత్తం 1363లో 640 పంచాయతీల్లో ఉపాధి హామీ పనులకు సంబంధించి క్షేత్రస్థాయి సిబ్బంది లేరు. అయితే ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా పేరుకు ఉపాధి పనులు జరుగుతున్నా కేవలం 491 పంచాయతీల్లో మాత్రమే నిర్దేశిత లక్ష్యాల మేరకు పనులు జరుగుతున్నట్లు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ తేల్చింది. మిగిలిన పంచాయతీల్లో మొక్కుబడి పనులు మాత్రమే జరుగుతున్నాయి. జిల్లావ్యాప్తంగా 6.5 లక్షల మంది ఉపాధి హామీ జాబ్‌కార్డులు పొందగా డ్వామా లెక్కల ప్రకారం రోజుకు 1.10 లక్షల మంది కూలీలకు పనులు కల్పిస్తున్నట్లు తెలుస్తోంది. అరకొరగా మాత్రమే పనులు జరుగుతుండడంతో ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.293.43 కోట్ల ఖర్చు చేయాలన్న లక్ష్యం నెరవేరేలా కనిపించడం లేదు. ఉపాధి హామీకి క్షేత్రస్థాయి సిబ్బంది లేకపోవడంతో పాటు కూలీలకు గిట్టుబాటు కూలీ లభించకపోవడంతో ఉపాధి పనులపై వారు మొగ్గు చూపించడం లేదు. మరోవైపు కనీస వేతనం రూ.169కి పెంచినట్లు చెబుతున్నా అది కూడా సక్రమంగా అమలు జరగడం లేదు. కోర్టును ఆశ్రయించిన ఫీల్డు అసిస్టెంట్లు నిర్ధాక్షిణ్యంగా తొలగించారంటూ చం ద్రగిరి నియోజకవర్గం నుంచి ముగ్గురు ఫీల్డు అసిస్టెంట్లు తొలగింపును సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్లారు. మరో 50 మంది ఫీల్డు అసిస్టెంట్లు కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమైనట్లు సమాచారం. అయితే నిబంధనల మేరకే ఫీల్డు అసిస్టెంట్ల తొలగింపు చర్యలు చేపట్టినట్లు డ్వామా అధికారులు చెబుతున్నారు. 2011 నుంచి డ్వామాలో ప్రోగ్రెస్ రిపోర్టు నిబంధనలు అమలు చేస్తున్నట్లు వారు చెబుతున్నారు. ఫీల్డు అసిస్టెంట్ల పనితీరు ఆధారంగా 2012 డిసెంబర్లో 256 మందిని తొలగించగా, 2013 అక్టోబర్ 13లో 113 మందిని తొలగించినట్లు అధికారులు చెబుతున్నారు. 2014లో కొత్తప్రభుత్వం ఏర్పడ్డాక ఫీల్డు అసిస్టెంట్ల తొలగింపు వ్యవహారాన్ని పక్కన పెట్టారు. తాజాగా 356 మందిని తొలగించినట్లు అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ సూచనల మేరకే ఈ కార్యక్రమం జరుగుతోందని అధికార వర్గాల భోగట్టా. తక్షణం ఖాళీగా ఉన్న పంచాయతీల్లో క్షేత్రస్థాయి సిబ్బందిని నియమించి మరింత మంది కూలీలకు పనులు కల్పిస్తేనే లక్ష్యాలు చేరే అవకాశం ఉంటుంది. -
ఫీల్డ్ అసిస్టెంట్‌ను సస్పెండ్ చేసిన మంత్రి
గద్వాల్ (మహబూబ్‌నగర్) : గ్రామ జ్యోతి కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లిన మంత్రికి సరైన వివరాలు తెలుపకపోవడంతో.. ఫీల్డ్ అసిస్టెంట్‌ను విధుల నుంచి తొలగించారు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల్ మండలంలోని జమ్మిచేడ్ వద్ద జరిగిన గ్రామజ్యోతి కార్యక్రమంలో శనివారం జరిగింది. గ్రామజ్యోతి కార్యక్రమానికి వెళ్లిన పౌర సరఫరాల శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావుకు గ్రామానికి సంబంధించి సరైన వివరాలు తెలపకపోవడంతో ఆగ్రహం చెందిన ఆయన వెంటనే గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ నర్సింహులు గౌడ్‌ను విధుల నుంచి సస్పెండ్ చేశారు. -
బిక్నూరులో అడవి పందుల భీభత్సం
నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో అడవి పందులు భీభత్సం సృష్టించాయి. జిల్లాలోని బిక్నూరు మండలం ఆరెపల్లి గ్రామ పరిధిలో శుక్రవారం అర్థరాత్రి చెరకు పంటపై దాడిచేసి ధ్వంసం చేశాయి. గ్రామానికి సమీపంలో 9 ఎకరాల చెరకు పంటపై దాడికి దిగిన అడవి పందులు సుమారు రూ.3.50 లక్షల పంటను నాశనం చేశాయి. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగిన అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎకరా చెరకు సాగు చేస్తే సుమారు 50 టన్నుల దిగుబడి వస్తుందని, అలాంటిది 9 ఎకరాల మేరా పంట నాశనం అయిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. అధికారులు తమ మొర ఆలకించాలని కోరుతున్నారు. -
ఎలుగుబంటి దాడిలో వ్యక్తికి గాయాలు
కర్నూలు(ఆత్మకూరు): ఆత్మకూరు మండలంలోని ఎస్ఎన్ తాండాలో బుధవారం ఓ వ్యక్తిపై ఎలుగుబంటి దాడి చేసింది. కాలేనాయక్ అనే వ్యక్తి పొలంలో పనులు చేసుకుంటుండగా ఎలుగుబంటి ఒక్కసారిగా దాడిచేసి చేతిపైన, ముఖంపైన తీవ్రంగా గాయపరిచింది. గాయపడిన నాయక్‌ను ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
పని పోయినట్లే!
ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లకు ఎసరు ♦ 5వేల పనిదినాల కంటే తక్కువున్న గ్రామాల్లో తొలగింపు ♦ మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం ♦ జిల్లాలో 231 పోస్టులకు మంగళం ♦ నిర్ణీత లక్ష్యంలో 75 శాతం పనిదినాలు కల్పించని ఎఫ్ఏలపైనా వేటు ♦ వచ్చే నెల నుంచే అమలుకు అవకాశం? బాబొస్తే.. జాబొస్తుంది. ఈ నినాదంతో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం.. ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతోంది. ఒకపక్క నిరుద్యోగుల ఆశలతో చెలగాటం ఆడుతూ.. చిరుద్యోగుల తొలగింపుతో ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేస్తోంది. ఆ జాబితాలో తాజాగా ఫీల్డ్ అసిస్టెంట్లు కూడా చేరిపోయారు. పనితనం పేరిట పక్కకు తప్పించే చర్యలను ప్రభుత్వం ముమ్మరం చేసింది. సాక్షి ప్రతినిధి, కర్నూలు : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంఎన్ఆర్ఈజీపీ)లో ఫీల్డ్ అసిస్టెంట్లు(ఎఫ్ఏ)గా పనిచేస్తున్న వారికి గడ్డుకాలం వచ్చింది. జిల్లాలో ఏకంగా 231 ఎఫ్ఏ పోస్టులకు మంగళం పాడనున్నారు. ఏడాదిలో 5వేల పనిదినాల కంటే తక్కువున్న గ్రామాల్లో ఎఫ్ఏ పోస్టులను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా కేవలం 664 గ్రామాల్లో మాత్రమే ఏడాదిలో 5వేల పనిదినాల కంటే ఎక్కువగా ఉన్నాయి. ఈ గ్రామాలకు మాత్రమే ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులకు అధికారిక అనుమతి ఉంటుంది. మిగిలిన గ్రామాల్లో ప్రస్తుతం ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించనున్నారు. ఆ మేరకు ఇప్పటికే ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు జారీ అయ్యాయి. వచ్చే నెల మొదటి వారం నుంచి అమలు చేసే అవకాశం ఉందని సమాచారం. మూడు జాబితాలుగా గ్రామాలు జిల్లాలో మొత్తం 895 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిని పనిదినాల ఆధారంగా మూడు జాబితాలు(లిస్టు)గా విభజించనున్నారు. మొదటి జాబితాలో ఏడాదికి 5వేల పనిదినాల కంటే ఎక్కువ కల్పించే పంచాయతీలను చేర్చనున్నారు. ఇక రెండో జాబితాలో 5వేల కంటే తక్కువ... వేయి కంటే ఎక్కువ పనిదినాలు కల్పించే గ్రామ పంచాయతీలను, ఇక వేయి కంటే తక్కువ పనిదినాలు కల్పిస్తున్న పంచాయతీలను మూడో జాబితాగా పరిగణించనున్నారు. ఈ విధంగా వర్గీకరించిన తర్వాత.. మొదటి జాబితాలో ఉన్న గ్రామ పంచాయతీలకు మాత్రమే అధికారికంగా ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టును మంజూరు చేయనున్నారు. ఇక రెండో జాబితాలోని గ్రామ పంచాయతీల్లో ఫీల్డ్ అసిస్టెంటును తొలగించి.. అప్పటికే ఉన్న మేటీల్లో సీనియర్‌ను గుర్తించి బాధ్యతలు అప్పగించాలనేది ప్రభుత్వ నిర్ణయం. వేయి కంటే తక్కువ పనిదినాలు కల్పిస్తున్న గ్రామ పంచాయతీల్లో సీనియర్ మేటీ పోస్టు కూడా ఉండదు. కేవలం మేటీలు మాత్రమే పనులు చేయించాల్సి ఉంటుంది. ఈ విధంగా జిల్లాలో 664 గ్రామాల్లో 5వేల పనిదినాల కంటే ఎక్కువ కల్పిస్తున్నారు. ఈ గ్రామాల్లో మాత్రమే ఫీల్డ్ అసిస్టెంట్లు కొనసాగుతారు. ఇక 166 గ్రామాల్లో 5వేల కంటే తక్కువ.. వేయి కంటే తక్కువ పనిదినాలు కల్పిస్తున్నారు. ఈ గ్రామాల్లో ఫీల్డ్ అసిస్టెంట్ల స్థానంలో సీనియర్ మేటీల వ్యవస్థ అమల్లోకి రానుంది. అదేవిధంగా 65 గ్రామాల్లో వేయి కంటే తక్కువ తక్కువ పనిదినాలు కల్పిస్తున్నారు. అంటే ఈ గ్రామాల్లో కేవలం మేటీల వ్యవస్థ మాత్రమే అమల్లో ఉండనుంది. జిల్లావ్యాప్తంగా మొత్తం 231 ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులకు మంగళం పాడనున్నారు. 75 శాతం పనిదినాలు కల్పించకుంటే అవుట్ ఒకవైపు పనిదినాల ఆధారంగా ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులను పూర్తిగా ఎత్తివేయనున్న ప్రభుత్వం.. పనిదినాలు కల్పించని ఎఫ్ఏలపైనా వేటు వేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా నిర్ణీత లక్ష్యంలో 75 శాతం పనిదినాలను కల్పించని ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించాలని భావిస్తోంది. వీరి స్థానంలో మళ్లీ కొత్త వారిని నియమించాలనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. అయితే.. 75 శాతం కాకుండా 60 శాతం పనిదినాలను పరిగణలోనికి తీసుకోవాలనే అంశంపైనా ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతున్నట్టు సమాచారం. దేనిని కటాఫ్‌గా తీసుకోవాలనే అంశం ఈ నెలాఖరులోగా కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్టు ప్రభుత్వవర్గాల ద్వారా తెలిసింది. -
రామకుప్పంలో ఏనుగుల భీభత్సం
రామకుప్పం: చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో ఏనుగులు భీభత్సం సృష్టిస్తున్నాయి. గుట్టూరుతండాకు చెందిన ఒక రైతు ఏనుగుల దాడిలో గాయపడ్డాడు. తండాకు చెందిన గోపాల్‌నాయక్ మంగళవారం రాత్రి వేరుశెనగ చేనుకు కాపలాగా వెళ్లగా ఏనుగుల గుంపు పంటను ధ్వంసం చేసింది. అదే క్రమంలో అక్కడున్న గోపాల్‌నాయక్ పై దాడి చేసిన ఏనుగు తీవ్రంగా గాయపరిచింది. క్షతగాత్రుడిని కుప్పం ఆస్పత్రికి తరలించారు. అదేవిధంగా ఏనుగుల గుంపు గ్రామానికి పొరుగునే ఉన్న పందేలమడుగు, గొల్లపల్లి గ్రామాల రైతులు సాగు చేసిన టమాటా, వరి, చెరుకు పంటలను ధ్వంసం చేశాయి. గత నెల రోజులుగా రాత్రి వేళల్లో ఈ గ్రామాలపై ఏనుగులు విరుచుకుపడుతున్నాయి. వాటి కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. అటవీ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
పిడుగు పడి రైతు మృతి
పాల్వంచ రూరల్: ఖమ్మం జిల్లా పాల్వంచ మండలం తొగ్గుడెంలో పిడుగుపాటుకు రైతు మృతి చెందాడు. గ్రామానికి చెందిన కొమరం రామారావు (34) మంగళవారం మధ్యాహ్నం పొలం పనుల్లో ఉండగా వర్షం మొదలైంది. దీంతో చెట్టు కిందకు వెళ్లాడు. అదే సమయంలో పిడుగుపడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. -
ఆంధ్రాబ్యాంక్ ఉద్యోగి అరెస్ట్
కోయిలకుంట: నకిలీ పాస్ పుస్తకాలతో రుణం తీసుకొని తిరిగి చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్న బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. కర్నూలు జిల్లా సంజామల మండంలంలోని పేరుసోమల గ్రామంలో ఉన్న ఆంధ్రా బ్యాంక్‌లో ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న నర్సింహారెడ్డి 2009 సంవత్సరంలో నకిలీ పాస్ పుస్తకాలు పెట్టి అదే బ్యాంక్‌లో రూ. 19 లక్షలు లోన్ తీసుకున్నాడు. అప్పటి నుంచి లోను చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న పోలీసులు పూర్తి ఆధారలతో మంగళవారం నర్సింహారెడ్డిని అరెస్ట్ చేశారు. -
విద్యుదాఘాతంతో ఫీల్డ్ అసిస్టెంట్ మృతి
తాడిమర్రి (అనంతపురం) : వ్యవసాయ మోటర్ వేయడానికి వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం చిన్నకొండయ్యపల్లి గ్రామంలో ఆదివారం ఉదయం జరిగింది. వివరాల ప్రకారం.. చిన్నకొండయ్యపల్లి గ్రామానికి చెందిన చెడిపోతుల ఆనంద్(30) ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తూ తనకున్న రెండెకరాల పొలంలో వెరుశెనగ సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం పొలంలో మోటర్ ఆన్ చేయడానికి వెళ్లాడు. రాత్రి వర్షం వచ్చి ఉండటంతో ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. ఇది గమనించిన తోటి రైతులు కుటుంబసభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి భార్య రాధ, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
అన్నీ మాకే!
శింగనమల మండలం వెస్ట్ నరసాపురం పంచాయతీ నాగలగుడ్డం తాండా ఫీల్డ్ అసిస్టెంట్ హనుమంతనాయక్‌ను తొలగించాలని కొంతకాలంగా టీడీపీ నాయకుల నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వ విప్ యామనీబాల కూడా నేరుగా రంగంలోకి దిగినట్లు సమాచారం. అయితే సంబందిత ఫీల్డ్ అసిస్టెంట్‌పై ఎలాంటి అభియోగాలు లేవు. దీంతో తొలగించడం ఎలా అనే అంశంపై అధికారులు తలలు పట్టుకుంటున్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని కుందిర్పి మండలం తూముకుంట ఫీల్డ్ అసిస్టెంట్ గంగప్ప 60 వేలు దుర్వినియోగానికి పాల్పడినట్లు సోషల్ ఆడిట్లో తేలింది. అయితే ఆయనను కొనసాగించాలని టీడీపీ నాయకులు పట్టుబడుతున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి నుంచి సిఫార్సు లేఖ కూడా తీసుకొచ్చారు. అయితే ప్రభుత్వం విడుదల చేసిన 797 జీవో మేరకు ఇలాంటి వారిని కొనసాగించడానికి వీలు లేదు. అనంతపురం సెంట్రల్ : జిల్లా నీటియాజమాన్య సంస్థ (డ్వామా)లో అధికార పార్టీ నేతల పెత్తనం ఎక్కువయింది. సిబ్బంది తొలగింపు నుంచి నియామకం వరకూ వారు చెప్పిందే జరగాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. ఎమ్మెల్యే సిఫార్సు లేఖలతో నిత్యం పదుల సంఖ్యలో తెలుగు తమ్ముళ్లు కార్యాలయంలో తిష్ట వేస్తున్నారు. నేరుగా పరిపాలనా విషయాల్లోకే జోక్యం చేసుకుంటుండంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. వారంలోగా ఫీల్డ్ అసిస్టెంట్ భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ వెలువడుతుండడంతో జిల్లా వ్యాప్తంగా ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులన్నీ క్లీన్‌స్వీప్ చేయాలనే ఉద్దేశంతో తెలుగుతమ్ముళ్లు ఉన్నారు. జిల్లాలో 1003 పంచాయతీలు ఉన్నాయి. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 243 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించారు. మరికొంత మందిని తొలగించాలని పట్టుబడుతున్నారు. ‘ఎమ్మెల్యే చెప్పారు. ఆ ఫీల్డ్ అసెస్టింట్ తొలగించండి. ఇదిగో ఈయన మా పార్టీకి చెందిన వ్యక్తి.. ఆ స్థానంలో ఈయనను నియమించండి’ అంటూ తొలగించడం.. నియమించడం రెండు పనులు వారే చేస్తున్నారు. ముఖ్యంగా ధర్మవరం, కళ్యాణదుర్గం, శింగనమల నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేల సిఫార్సుల లేఖలతో తెలుగుతమ్ముళ్లు వాలిపోతున్నారు. రోజూ రాత్రి పదిగంటల వరకూ కార్యాలయంలోనే గడుపుతున్నారు. రాప్తాడు నియోజకవర్గంలో మంత్రి పరిటాల సునీత పేరు చెప్పి ఆయా మండలాల నాయకులు ఒత్తిళ్లు తెస్తున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు నేరుగా అధికారులకు ఫోన్ల ద్వారా లైన్లోకి వస్తున్నారు. టీడీపీ ప్రజాప్రతినిధుల్లో ఓ పెద్దాయన.. ఆయన కుమారుడు వారంలో రెండు, మూడుసార్లు డ్వామాకు వస్తున్నారు. ఏదైనా ప్రజాసమస్యపై వచ్చారేమో అని ఆరా తీస్తే ఫీల్డ్ అసిస్టెంట్‌ను తొలగించడం.. నియమించడంపై చర్చించారని తెలుస్తోంది. క్లస్టర్ ఏపీడీల పరిస్థితి మరీ దారుణంగా తయారువుతోంది. నిబంధనల ప్రకారం ఒక ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించాలంటే ఉపాధి నిధులు దుర్వినియోగం చేశాడని సోషల్ ఆడిట్లో గుర్తించాలి, కూలీలకు పని పెట్టకుండా ఉండాలి, కూలీలకు అందుబాటులోనైనా లేకుండా ఉండాలి. నియమించాలంటే గ్రామాల్లో జన్మభూమి కమిటీ ముగ్గురుని గుర్తించాలి. అందులో అర్హులైన ఒకరిని మండల పరిషత్ అభివృద్ది అధికారి(ఎంపీడీఓ) సిఫార్సు చేయాలి. ఈ రెండు లేకుండానే ఫీల్డ్ అసిస్టెంట్ తొలగించడం.. నియమించడం జరిగిపోతోంది. తెలుగుతమ్ముళ్ల వ్యవహార శైలిని చూసి డ్వామా అధికారులు విస్తుపోతున్నారు. -
అక్రమాల నిగ్గు తేల్చేందుకు సన్నద్ధం!
సాక్షి ప్రతినిధి, విజయనగరం: క్షేత్రస్థాయిలో మొక్కలు ఉన్నాయో లేవో చూడకుండా ఇష్టారీతిన ఒకేసారి పెద్దమొత్తంలో చెల్లింపులు, పూర్తి స్థాయిలో పనులు జరగకుండానే చెరువు గ ట్టు అభివృద్ధి పనుల బిల్లుల చెల్లింపులు, పని దినాలకు మించి మస్తర్లు వేసి పెద్ద ఎత్తున వేతనాలు డ్రా చేయడం వంటి పరిణామాలు తెర్లాం మండలంలో బయటపడ్డాయి. అంతా కుమ్మక్కయ్యే ఇదంతా చేశారన్న అభిప్రాయానికి అధికార వర్గాలొచ్చాయి. ఈ ఒక్క మండలంలోనే రూ.50 లక్షల మేరకు అవినీతి జరిగి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నాయి. దీనికంతటికీ మండల స్థాయిలో పర్యవేక్షణ లేకపోవడమే ప్రధాన కారణమని భావిస్తున్నారు. అందుకనే తెర్లాం వ్యవహారంలో ఎంపీడీఓను సైతం బాధ్యుడ్ని చేస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇకపై నిర్లక్ష్యంగా వ్యవహరించే ఎంపీడీఓలకు నోటీసులివ్వడమే కాకుండా శాఖాపరమైన చర్యలు తీసుకునే యోచనలో ఉన్నతాధికారులున్నారు. తెర్లాం వ్యవహారంలో ఫీల్డ్ అసిస్టెంట్ల పాత్ర కూడా ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. నలుగురు ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ దిశగా విచారణతో పాటు నివేదిక తయారవుతోంది. ఈ అనుభవాల్ని దృష్టిలో ఉంచుకుని జిల్లా వ్యాప్తంగా తనిఖీలు, పరిశీలన చేయాలని డ్వామా వర్గాలు భావిస్తున్నాయి. ఈమేరకు ప్రత్యేక బృందాల్ని నియమిస్తున్నాయి. అనుమానం వచ్చిన చోట ముందుగా తనిఖీలు చేయనున్నారు, ఆ తరువాత మిగతా చోట్ల దశల వారీగా పరిశీలన చేయాలని యోచిస్తున్నారు. పరిశీలనకు సంబంధించి ఒక నమూనా తయారు చేసినట్టు తెలిసింది. ఉన్నతాధికారులిచ్చిన నమూనా ప్రకారం క్షేత్రస్థాయి అధికారులు నిశితంగా పరిశీలించనున్నారు. మరోవైపు క్వాలిటీ కంట్రోల్ అధికారులు కూడా రంగంలోకి దిగనున్నారు. ఇంకోవైపు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కూడా తనిఖీలు చేయనుంది. తెర్లాం తరహా భాగోతం ఎక్కడెక్కడ జరిగిందో నిగ్గు తేల్చేందుకు సిద్ధమవుతున్నాయి. కలెక్టర్ ఎం.ఎం.నాయక్ కూడా సీరియస్‌గా ఉన్నారు. ఆరోపణలొచ్చినా, అభియోగాలు నిర్ధారణైనా వెంటనే చర్యలు తీసుకునే యోచనలో ఉన్నారు. కొంతమందిని ఏరిపారిస్తే తప్ప అక్రమార్కులు అదుపులోకి రారని భావిస్తున్నారు. -
సీతంపేటలో ఏనుగుల భీభత్సం
సీతంపేట: శ్రీకాకుళం జిల్లా సీతంపేటలో మంగళవారం ఏనుగులు బీభత్సం సృష్టించాయి. సమీపంలోని అడివి నుంచి వచ్చిన నాలుగు ఏనుగులు సీతంపేట మండలంలోని ముకుందాపురంతో పాటు సమీప గ్రామాల్లో అరటి, పైన్ఆపిల్ పంటలను ధ్వంసం చేశాయి. గ్రామాల్లోకి ఒక్కసారిగా ఏనుగులు రావడంతో గ్రామస్తులు భయాందోళనకు గురైయ్యారు. చివరికి రైతులు వాటిని పంట పొలాల నుంచి అడవిలోకి తరిమారు. అటవీ అధికారులకు సమాచారం అందించారు. -
దోపిడీ దందా! జోరుగా నీటి అక్రమ వ్యాపారం
- పొలాల బోర్ల నుంచి 24 గంటలూ తోడుతూ.. - పట్టణాలు, పరిశ్రమలకు అక్రమ రవాణా - నిత్యం 50 లక్షల లీటర్ల నీటి తరలింపు - నెలకు రూ.3 కోట్ల వ్యాపారం - ‘వాల్టా’కు తూట్లు నీటి దోపిడీ దందా జోరుగా సాగుతోంది. దోపిడీదారులు రైతుల పంట పొలాలను అక్రమంగా వాడుకుంటున్నారు. డబ్బు ఆశ చూపి వారి పొలాల్లోని బోర్ల నుంచి నిత్యం లక్షల లీటర్ల నీటిని తోడుతున్నారు. పట్టణాలు, పరిశ్రమలకు రవాణా చేస్తున్నారు. ఈ బోర్లకు ఉచిత కరెంటును వినియోగించుకుంటున్నారు. 24 గంటలూ నీటిని ఇష్టారీతిగా తోడడం వల్ల భూగర్భ జలాలు మరింత లోతుకు పడిపోతున్నాయి. ‘వాల్టా’కు తూట్లు పొడుస్తున్నారు. అక్రమ దందా యథేచ్ఛగా సాగుతోన్నా పట్టించుకునే వారే లేకుండా పోయారు. ఈ వ్యాపారం ఇలాగే సాగితే ఇక్కడి బోర్లన్నీ ఎండిపోయి ఎడారిగా మారే ప్రమాదం పొంచి ఉంది. జిన్నారం : జిన్నారం మండలంలోని గడ్డపోతారం, బొల్లారం, బొంతపల్లి, ఖాజీపల్లి పారిశ్రామిక వాడల్లో సుమారు 400 వరకు వివిధ రకాల పరిశ్రమలు ఉన్నాయి. వీటికి నీటి వినియోగం ఎక్కువగా ఉంటుంది. దీన్ని ఆసరా చేసుకొని స్థానిక ప్రజాప్రతినిధులు, వారి బంధువులు నీటి దందా నిర్వహిస్తున్నారు. దశాబ్ద కాలంగా ఈ అక్రమ వ్యాపారాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఫలితంగా పారిశ్రామిక వాడల్లోని గ్రామాల్లో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటాయి. సదరు వ్యాపారులు ఈ దందాను కొనసాగించేందుకు సమీప గ్రామాలను ఎంచుకున్నారు. రైతులకు డబ్బు ఆశ చూపి వారి పొలాల వద్ద ఉన్న బోర్ల నుంచి నీటిని పరిశ్రమలకు తరలిస్తున్నారు. మరో ఏడాదిపాటు ఇదే విధంగా కొనసాగితే భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయి రైతులు రోడ్డున పడే పరిస్థితులు ఏర్పడతాయి. ఈ గ్రామాల నుంచి... పారిశ్రామిక శివారు గ్రామాలైన కిష్టాయిపల్లి, కొర్లకుంట, నల్తూర్, బొంతపల్లి, దోమడుగు, అన్నారం తదితర గ్రామాల నుంచి నీటిని అక్రమంగా తరలిస్తున్నారు. అన్నా రం శివారులోని పొలాల నుంచి రంగారెడ్డి జిల్లాకు చెందిన కొంతమంది నిత్యం వందలాది ట్యాంకర్ల ద్వారా నీటిని రవాణా చేస్తున్నారు. మెదక్ జిల్లా సరిహద్దులోని రంగారెడ్డి జిల్లా గ్రామాలైన ప్రగతినగర్, దుండిగల్, గాగిల్లాపూర్, గండిమైసమ్మ, కూకట్పల్లి వరకు ఉండే అపార్ట్మెంట్లకు కూడా ఇక్కడి నుంచే నీటిని తరలిస్తున్నారంటే వ్యాపారం ఎలా జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. జిన్నారం మండలంలోని ఆయా గ్రామాల నుంచి నిత్యం సుమారు 400 వరకు పెద్ద ట్యాంకర్లు, 500 వరకు ట్రాక్టర్ ట్యాంకర్ల ద్వారా నీటిని తరలిస్తున్నారు. పెద్ద ట్యాంకర్ నీటిని రూ.1,500 నుంచి రూ.2,000 వరకు, చిన్న ట్యాంకర్ నీటిని రూ.500 నుంచి రూ.1,000 వరకు విక్రయిస్తుంటారని సమాచారం. అంటే మండల వ్యాప్తంగా రోజుకు సుమారు రూ.10 లక్షలు, నెలకు సుమారు రూ.3 కోట్ల మేర నీటి వ్యాపారం సాగుతోంది. దీంతో మండల వ్యాప్తంగా రోజుకు సుమారు 50 లక్షల లీటర్ల నీటిని బోర్ల ద్వారా తోడి ఇతర ప్రాంతాలకు, పరిశ్రమలకు, అపార్ట్మెంట్లకు తరలిస్తున్నారు. ఉచిత కరెంటు దుర్వినియోగం.. ప్రభుత్వం వ్యవసాయానికి ఉచిత కరెంట్ సదుపాయాన్ని కల్పిస్తోంది. కొందరు వ్యక్తులు పంట పొలాల్లోని బోర్ల నుంచి నీటిని తోడేందుకు ఉచిత కరెంటును వినియోగిస్తున్నారు. ఫలితంగా ఈ పథకం దుర్వినియోగమవుతోంది. విద్యుత్ సరఫరా లేని సమయంలో ఎక్కువ సామర్థ్యం గల జనరేటర్లను వాడుతూ 24 గంటలూ నీటిని తోడుతూనే ఉన్నారు. పెద్ద పెద్ద గుంతలను తీసి వీటిలో ప్లాస్టిక్ కవర్లను వేసి నీటిని నిల్వ చేస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున నీటి వ్యాపారం కొనసాగుతోన్నా సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. కలెక్టర్‌తోపాటు ఉన్నతాధికారులు స్పందించి నీటి అక్రమ వ్యాపారాన్ని అడ్డుకోవాలని లేనిపక్షంలో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటుతాయని రైతులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
‘ఉపాధి’.. పచ్చ పునాది
ఎఫ్ఏల నియామక బాధ్యత జన్మభూమి కమిటీలకు - 939 మంది ఫీల్డ్ అసిస్టెంట్ల నియామకాలకు సన్నాహాలు - జన్మభూమి కమిటీలు సూచించిన వారికే ఉద్యోగాలు సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో కిందిస్థాయిలో పచ్చ చొక్కాల పంట పండుతోంది. గతంలో ‘పనికి ఆహారం’ తరహాలోనే ఇప్పుడు పచ్చ చొక్కాలకు పనులు అప్పగిస్తున్నారు. సామాజిక కార్యకర్తల పేరుతో అధికార తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులతో ప్రతి గ్రామంలో ఇప్పటికే ఏర్పాటు చేసిన జన్మభూమి కమిటీలు సిఫారసు చేసిన వారికే ప్రభుత్వ ప్రయోజనాలు చేకూరనున్నాయి. ఆఖరుకు ప్రభుత్వ ఉద్యోగులను నియమించే బాధ్యతలను కూడా ఆ కమిటీలకే అప్పగించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. తాజాగా ఉపాధి హామీ పథకంలో ఫీల్డు అసిస్టెంట్ ఉద్యోగాలు కూడా ఈ కమిటీలు సూచించిన వారికే దక్కబోతున్నాయి. వారికే ‘ఉపాధి’ చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పింఛనుదారులలో అనర్హుల ఏరివేత కోసమంటూ గతేడాది సెప్టెంబర్ 17వ తేదీన గ్రామ, మున్సిపల్ వార్డు స్థాయిలో కమిటీల నియామకానికి ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం ఆరుగురు ఉండే ఈ కమిటీలో నలుగురు ఆయా జిల్లా మంత్రి సూచించినవారే ఉంటారు. మిగిలిన ఇద్దరిలో ఒకరు సర్పంచ్, మరొకరు ఆ గ్రామ ఎంపీటీసీ సభ్యుడు. అప్పట్లో గ్రామాల్లో పింఛన్లలో కోతలు పెట్టడానికి అనర్హుల గుర్తింపు బాధ్యతను ఈ కమిటీలకు అప్పగించారు. అవి ఫింఛన్లకు అర్హులైన లక్షలాది మందిని కూడా ఈ కమిటీలు ఏరివేశాయి. వీటిపై మరోసారి పరిశీలన జరిపినప్పుడు అర్హులను ఏరివేశారని తేలింది. దీంతో చివరికి ప్రభుత్వం పునఃవిచారణ చేసి.. తొలగించిన వారిలో సగానికి ఎక్కువమందికి తిరిగి పింఛన్లు మంజూరు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అటువంటి ఈ కమిటీలను ఆ తరువాత ప్రభుత్వం అనేక ఇతర సంక్షేమ కార్యక్రమాల లబ్ధిదారుల ఎంపికలోనూ భాగస్వాములుగా చేసింది. ప్రభుత్వం నిర్వహించే జన్మభూమి-మావూరు కార్యక్రమ బాధ్యతలను ఈ కమిటీలకే అప్పగించారు. ఇప్పుడు ఇదే కమిటీలకు ఉపాధి హామీ పథకంలో ఫీల్డు అసిస్టెంట్ల ఎంపిక ప్రక్రియను అప్పగించారు. ఇప్పటికే ఫీల్డు అసిస్టెంట్ ఉద్యోగం ఖాళీగా ఉన్న గ్రామంలో ఉన్న ఈ జన్మభూమి కమిటీ ముగ్గురు పేర్ల జాబితాను స్థానిక ఎంపీడీవోకు అందజేస్తుంది. ఆ ముగ్గురిలో ఒకరిని ఎంపీడీవో తప్పనిసరిగా ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు ఫీల్డు అసిస్టెంట్ల ఎంపిక ప్రక్రియకు సంబంధించి మార్గదర్శకాలను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి శాఖ సర్క్యులర్ నం. 3141ని జారీ చేసింది. పదిరోజుల్లో నోటిఫికేషన్లు రాష్ట్రంలో 13,083 గ్రామపంచాయతీల్లో ఉపాధి హామీ పథకం అమలులో ఉంది. అయితే గ్రామంలోని మొత్తం కూలీలందరికీ కలపి ఏడాదికి వెయ్యి రోజులకు మించి పనిదినాలు కల్పించేచోట్ల మాత్రమే ఫీల్డు అసిస్టెంట్‌ను నియమిస్తారు. ఇలాంటివి దాదాపు పదివేల గ్రామాల వరకు ఉండగా.. వీటిలో ప్రస్తుతం 939 గ్రామపంచాయతీల్లో ప్రస్తుతం ఫీల్డు అసిస్టెంట్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తీకి పదిరోజుల్లో ఆయా జిల్లాల డ్వామా పీడీలు నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు. ఫీల్డు అసిస్టెంట్ ఎంపికకు గాను ఐదు రకాల నిబంధనలను పాటించాలని గ్రామ జన్మభూమి కమిటీలకు ప్రభుత్వం సూచించింది. రేషన్ కార్డుల్లోనూ... గతేడాది ప్రభుత్వం నిర్వహించిన జన్మభూమి-మా ఊరు కార్యక్రమం సందర్భంగా రేషన్ కార్డుల్లేని వారినుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. ఇందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా 11.05 లక్షల మంది నుంచి దరఖాస్తులు వచ్చాయి. ఈ రకంగా అందిన దరఖాస్తుల్లో అర్హులను గుర్తించే బాధ్యతను జన్మభూమి కమిటీలకు అప్పగించారు. ఇది అందరికీ ఆందోళన కలిగిస్తోంది. -
నోళ్లు తెరుస్తున్న పంటపొలాలు
రాఘవాపురం (నందిగామ రూరల్) : మునేటి వాగునీటిని నమ్ముకొని దాళ్వా వరి సాగు చేసిన రైతులకు తిప్పలు తప్పటం లేదు. మునేటి వాగులో నీరు వట్టిపోవడంతో పంటను కాపాడుకునేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. వివరాల్లోకి వెళితే రాఘవాపురం గ్రామ సమీపంలో మునేటి తీరాన శ్రీసీతారామ అగ్రికల్చరల్ ఇంప్రూవ్మెంట్ కో-ఆపరేటివ్ సొసైటీ స్కీమ్ ఉంది. ఈ స్కీమ్ పరిధిలో రాఘవాపురం, కమ్మవారిపాలెం గ్రామ పరిధిలో సుమారు 650 ఎకరాల మాగాణి భూములు ఉన్నాయి. ఈ ఏడాది ఖరీఫ్‌లో పలు కారణాల వలన స్కీమ్ పనిచేయక పంట సాగు కాలేదు. ఈ నేపథ్యంలో మునేటిలో నీరు అధికంగా ఉందనే ఆలోచనతో రైతులు సుమారు 400 ఎకరాల్లో దాళ్వా వరిసాగు చేశారు. ప్రస్తుతం పంట పొట్టదశలో ఉంది. ఈ నేపథ్యంలో మునేటి వాగులో నీరు పూర్తిగా ఎండిపోయింది. పంటలను కాపాడుకునేందుకు స్కీమ్ నిర్వాహకులు ఇప్పటికే పొక్లెయిన్ల ద్వారా మునేటిలో పూడిక తీతలు తీసి సాగు నీటి కోసం ప్రయత్నాలు చేశారు. అయినా నీరు లేకపోవడంతో ప్రస్తుతం లంకప్రాంతంలో బోరులు వేసి వాటి ద్వారా వచ్చే నీటిని కాలువల ద్వారా పంట పొలాలకు పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా నీరు సరిపోకపోవడంతో పలువురు రైతులకు చెందిన పంటలు ఇప్పటికే ఎండుదశకు చేరుకోగా కొన్ని భూములు నీరు లేక బీటలు వారి దర్శనమిస్తున్నాయి. పంట సాగు కోసం వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టిన రైతుల కళ్లముందే పంటలు ఎండుతుండడంతో కన్నీరు పెట్టుకుంటున్నారు. ఆందోళన చెందుతున్న రైతులు శ్రీ సీతారామ అగ్రికల్చరల్ ఇంప్రూవ్మెంట్ కో-ఆపరేటివ్ సొసైటీ స్కీమ్ పరిధిలో రైతులందరూ దాదాపుగా చిన్న, సన్నకారు వారే. మాగాణిలో దిగుబడి వచ్చిన ధాన్యాన్ని ఎక్కువశాతం మంది రైతులు తిండి గింజలకే వినియోగించుకుంటారు. ఈ ఏడాది పలు కారణాల వలన ఖరీఫ్‌లో స్కీమ్ పరిధిలో పూర్తిగా పంట సాగు కాలేదు. ఈ నేపథ్యంలో దాళ్వా సాగు ద్వారా అయినా తిండిగింజలు సంపాదించుకుందామనుకున్న రైతులకు నిరాశే మిగిలింది. పొట్టదశలో సమయానికి నీరందించకపోవడంతో ధాన్యం ఎక్కువ శాతం తాలుగా మారే ప్రమాదం ఉందని పలువురు రైతులు ఆందోళన చెందుతున్నారు. బీటలు వారిన భూములను చూసిన రైతులు కంటతడి పెడుతున్నారు. సాగర్ ద్వారా నీరు విడుదల చేయాలి వరి పొట్ట దశలో నీరు లేకపోవడం వలన పంట పూర్తిగా నష్టపోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వం చొరవ తీసుకొని ఒక్కసారి సాగర్ జలాలను మునేటికి విడుదల చేస్తే పంటలకు జీవం పోసినట్లు అవుతుంది. ఈ ఏడాది కౌలుకు తీసుకొని 50 ఎకరాల్లో దాళ్వా వరిసాగు చేశాను. పంట సాగుకు సుమారు రూ.10లక్షల వరకు పెట్టుబడి పెట్టా. లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టినా నీరు లేకపోవడంతో పంటలు కళ్లముందే ఎండిపోతున్నాయి. -కోట శ్రీనివాసరావు, రైతు పంట పూర్తిగా ఎండిపోయింది ఎకరాకు రూ.25వేల వరకు పెట్టుబడి పెట్టి రెండు ఎకరాల్లో దాళ్వా వరిసాగు చేశా. పంట పొట్టదశలో ఉంది. పొలాలకు నీరందకపోవడంతో పంట కళ్లముందే తెల్లబారిపోతోంది. ఎండిపోయిన పంట చివరకు పశువుల మేతకు కూడా పనికిరాని విధంగా ఉంది. ఏమి చేయాలో తెలియడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే వ్యవసాయం రానురాను మరింత భారం అవుతుంది. సాగర్ నీరు ఇచ్చి పంటలను కాపాడాలి. -ఓరుగంటి ఆంజనేయులు, రైతు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం స్కీమ్ పరిధిలో పంట పొలాలకు నీరందించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెట్టాం. మునేటిలో నీరు పూర్తిగా నీరు ఎండిపోవడంతో పంట పొలాలకు నీరందించేందుకు అధిక వ్యయ ప్రయాసల కోర్చి లంక ప్రాంతంలో 12 బోర్లు వేశాం. వాటిలో 4 బోరుల్లో నీరు పడాయి. ఆ నాలుగు బోరుల్లో రెండు బోర్లలో నీరు వెంటనే ఇంకిపోయింది. ప్రస్తుతం రెండు బోర్ల ద్వారా సుమారు రెండు కిలోమీటర్ల పైప్‌లైన్ వేసి కాలువల ద్వారా పంట పొలాలకు నీరందించే ప్రయత్నాలు చేస్తున్నాం. -చెన్నుపాటి వెంకటేశ్, స్కీమ్ అధ్యక్షుడు -
పాక్ ఆటగాళ్ళ దురుసు ప్రవర్తన
-
ముదుమాణిక్యం మేజర్ కాల్వకు గండి
నల్గొండ: నల్గొండ జిల్లా త్రిపురారం మండల పరిధిలోని ముదుమాణిక్యం మేజర్ కాల్వ ఎన్-17 వద్ద శుక్రవారం గండి పడింది. ఈ సంఘటనతో సుమారు 200 ఎకరాల మేరా పంట పూర్తిగా నీట మునిగింది. నీటి ప్రవాహానికి ఈ మధ్యే నాటేసిన ఎనిమిదెకరాల పొలం వేర్లతో సహా కొట్టుకుపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. స్థాయికి మించి నీటిని విడుదల చేయడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. కాగా కాల్వకట్టలు బలహీనంగా ఉండటం వల్లే తరుచూ గండ్లు పడుతున్నాయని రైతులు ఆందోళ న వ్యక్తం చేస్తున్నారు. (త్రిపురారం) -
ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్ ఆత్మహత్యాయత్నం
నల్లగొండ: నల్లగొండ జిల్లా నిడమనూర్ మండలం కన్నేకల్ గ్రామంలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్, ఆమె భర్త ఆత్మహత్యాయత్నం చేశారు. గ్రామానికి చెందిన మారేపల్లి లక్ష్మి ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. కాగా, గురువారం సాయంత్రం లక్ష్మి, ఆమె భర్త సుధాకర్‌రెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. కుటుంబసభ్యులు వారిని నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు. ఎంపీటీసీ సభ్యుడు ఉయ్యాల నర్సింహగౌడ్ తమను వేధిస్తున్నాడని మండల తహశీల్దార్‌కు ఇచ్చిన వాంగ్మూలంలో భార్యాభర్తలు పేర్కొన్నారు. ఇదిలావుంటే రాజకీయ విభేదాలే ఈ ఘటనకు పురిగొల్పాయని స్థానికులు అంటున్నారు. (నిడమనూర్) -
తమ్ముళ్లకు ఉపాధి!
వీఆర్పీలుగా టీడీపీ కార్యకర్తలను నియమించేందుకు రంగం సిద్ధం నిబంధనలు బేఖాతర్.. జన్మభూమి కమిటీ సిఫార్సుచేసిన వారికే పోస్టులు నక్కపల్లి: ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్లు (వీఆర్పీలు)గా టీడీపీ కార్యకర్తలను నియమించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. దీనిలో భాగంగా కేంద్రప్రభుత్వ నిబంధనలు, ఎన్ఆర్ఈజీఎస్ చట్టాన్ని తుంగలో తొక్కేందుకు యత్నిస్తోంది. జన్మభూమి కమిటీల సిఫార్సు మేరకు వారిని ఫీల్డ్ అసిస్టెంట్లుగా నియమించాలంటూ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీచేసినట్టు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. వివిధ కారణాల వల్ల తొలగించిన వారి స్థానంలో ఖాళీలు భర్తీచేసే క్రమంలో ఈ ఆదేశాలు పాటించాలని పేర్కొన్నట్లు సమాచారం. ఉపాధి హమీ పథకం ద్వారా గ్రామల్లో చేపట్టే పనులకు హాజరయ్యే కూలీలకు మస్తర్లువేయడం, పనులు గుర్తించడం, పేఆర్డర్లు జనరేట్ చేయడం, జాబ్‌కార్డులు జారీ చేయడం వంటి పనులు ఫీల్డ్ అసిస్టెంట్లు చేస్తున్నారు. ఆరేళ్ల క్రితం ప్రారంభమైన ఈ పథకానికి అప్పట్లో పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన వారిని మెరిట్ ఆధారంగా ఎంపిక చేశారు. వీరికి సుమారు రూ. 4 వేల వరకు వేతనం ఇచ్చేవారు. కొద్దిరోజుల పాటు కూలీలకు పేమెంట్లు కూడా వీఆర్పీలే చెల్లించారు. త ర్వాత పోస్టాఫీసుల ద్వారా చెల్లిస్తున్నారు. ఉపాధి హమీ పథకంలో కొంతమంది వీఆర్పీలు అవకతవకలకు పాల్పడ్డారని, గ్రామంలో లేనివారి పేరున, చనిపోయిన వారిపేరున మస్తర్లు వేసి లక్షలాది రూపాయలు స్వాహా చేశారని సామాజిక తనిఖీల్లో వెల్లడవడంతో కొంతమంది వీఆర్పీలను తొలగించారు. ప్రస్తుతం జిల్లాలో సుమారు 350 వీఆర్పీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీరి స్థానంలో కూలీల్లో సంతకం చేయడం వచ్చి మస్తర్లు వేయడం తెలిసిన ఒకరిని మేట్‌గా నియమించి పనులకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు. ఈ నేధ్యంలో టీడీపీ కార్యకర్తలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో వీఆర్పీ పోస్టులను వారితో భర్తీచేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు భోగట్టా. నిబంధనల ప్రకారం తొలగించిన వీఆర్పీ స్థానంలో గ్రామంలో ఎక్కువ రోజులు ఉపాధి పనులకు వచ్చిన వ్యక్తిని వీఆర్పీగా నియమించాలి. కానీ ప్రస్తుతం నియమించబోయే వీఆర్పీల విషయంలో ప్రభుత్వం ఈ నిబంధనలను పక్కన పెట్టాలని నిర్ణయించింది. జన్మభూమి కమిటీ ముగ్గురు పేర్లను సిఫార్సు చేసి ఎంపీడీవోకు పంపిస్తే వారిలో ఒకరిని ఎంపీడీవో ఫీల్డ్ అసిస్టెంట్‌గా ఎంపికచేయాలని పేర్కొన్నట్టు సమాచారం. -
‘ఉపాధి’ కోసం ఊపిరి తీశారు..!
సస్పెండైన ఫీల్డు అసిస్టెంట్ దారుణ హత్య డోన్‌టౌన్: అధికారం తమ చేతిలో ఉంది కదా అని టీడీపీ నాయకులు బరితెగిస్తున్నారు. తమ మాట వినని వారిపై దాడులకు పాల్పడుతున్నారు. తాము చెప్పినట్టే వినాలని, తమ వారికే ఉద్యోగాలు, పదవులు ఉండాలని పట్టుబడుతున్నారు. ఉపాధి పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టు కోసం ఏకంగా ఓ వ్యక్తినే హత్య చేశారు. ఈ ఉదంతం డోన్ మండలం కొత్తబురుజు గ్రామంలో చోటుచేసుకుంది. ఓ చిరుద్యోగం కోసం అధికారం అడ్డుపెట్టుకొని ఇంతటి దారుణానికి ఒడిగట్టడం ఇదే ప్రథమమని పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు అభిప్రాయ పడుతున్నారు. భవిష్యత్తులో ఇంకెంతటి దారుణాలు చూడాల్సి వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. పథకం ప్రకారమే.. డోన్ మండలంలోని కొత్తబురుజు గ్రామంలో సస్పెండైన ఫీల్డు అసిస్టెంట్ శాంతరాజ్ అలియాస్ మద్దిలేటి(37)ని మంగళవారం రాత్రి ప్రత్యర్థులు పట్టుడు కట్టెలతో దాడి చేసి, వేటకొడవళ్ల పిడులతో గుద్ది అతి కిరాతంగా హతమార్చారు. గ్రామంలోని ఇద్దరు అధికార పార్టీ నాయకుల కుట్రతోనే ఈ హత్య జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు. అధికారంలోకి వచ్చాక టీడీపీ నాయకులు ప్రతి పదివిలో తామే ఉండాలని పట్టుబడుతున్నారు. ఉపాధి హామీ పథకంలోని గ్రామ ఫీల్డు అసిస్టెంట్ పోస్టులో తమ వారినే నియమించుకోవాలని నిశ్చయించుకున్నారు. ఈ క్రమంలో గత ఏడాది డిసెంబర్ 6వ తేదీన డోన్ మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సామాజిక తనిఖీ (ఓపెన్ ఫోరం)ను వేదికగా చేసుకున్నారు. పలువురు ఫీల్డు అసిస్టెంట్లను తొలగించాలనే దురుద్దేశంతో నిరాధారమైన ఆరోపణలు చేశారు. దీంతో కొత్తబురుజు, చనుగొండ్ల, వెంకటనాయునిపల్లె, వెంకటాపురం, కన్నపుకుంట, మల్లెంపల్లె, దొరపల్లె, కోట్రాయి తదితర గ్రామాల ఫీల్డ్ అసిస్టెంట్లను సస్పెండ్ చేశారు. ఆరోపణలు పూర్తి స్థాయిలో రుజువు కాకముందే రాజకీయ ఒత్తిళ్ల కారణంగా వీరిని సస్పెండ్ చేయడం విమర్శలకు తావిచ్చింది. ఫోరంలో నివేదించిన ఆరోపణలు రుజువైతే విధుల నుంచి ఫీల్డు అసిస్టెంట్లను తప్పించాల్సిన నిబంధన ఉంది. అయితే ఆరోపణలు రుజువు కాకపోతే ఉద్యోగంలో కొనసాగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కొత్తబురుజు ఫీల్డు అసిస్టెంట్ శాంతరాజ్ అలియాస్ మద్దిలేటిపై ఆరోపణలు రుజువు కాకపోతే విధుల్లో ఎక్కడ కొనసాగుతాడేమోనన్న అక్కసుతో అదే గ్రామంలోని మరో వర్గాన్ని సృష్టించి ఈ హత్యకు పథకం పన్నినట్లు తెలుస్తోంది. ఓపెన్ ఫోరంలోనే.. గత డిసెంబర్ 6వ తేదీన స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ఓపెన్ ఫోరంలోనే శాంతరాజ్పై కొత్తబురుజు గ్రామానికి చెందిన ఈరన్న అధికారుల సాక్షిగా గొంతుపట్టుకొని దాడికి పాల్పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో పుటేజిలు, ఫొటోలు సైతం ఉపాధి హామీ సిబ్బంది చేతిలో ఉన్నట్లు తెలిసింది. ఎలాగైనా తమ వారికే ఫీల్డు అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పించుకోవాలంటే శాంతరాజ్ను తప్పించాలనే లక్ష్యంతోనే ప్రత్యర్థులను ఉసి గొల్పి ఈ దారుణానికి తెగబడినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా శాంతరాజ్ కదిలికలను గమనిస్తూ వచ్చిన ప్రత్యర్థులు చిన్న వివాదాన్ని సాకుగా పెట్టుకొని పట్టుడు కట్టెలు, వేటకొడవళ్లతో దాడి చేసి అంతమొందించారు. భయం భయంగా ఫీల్డు అసిస్టెంట్లు.. చిరుద్యోగం ఉందన్న భరోసాతో జీవనం సాగిస్తున్న ఫీల్డు అసిస్టెంట్లు జరిగిన దారుణాన్ని చూసి హడలెత్తిపోతున్నారు. ఊపిరి ఉంటే ఉప్పు అమ్ముకొని బతకొచ్చు..అకారణంగా హత్యలు చేయడమేంటని ఫీల్డు అసిస్టెంట్లు కలవర పడుతున్నారు. 1080 జీవో మేరకు సస్పెండ్ చేసే నిబంధనలు లేకున్నప్పటికీ రాజకీయ ఒత్తిళ్లతో సస్పెండ్ చేయడం అన్యాయమని ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్ సంఘం రాష్ట్ర కార్యదర్శి నాగేశ్వరరెడ్డి అన్నారు. ఉపాధి హామీ సిబ్బందికి భద్రత కల్పించాలని మండల పరిషత్ కార్యాలయం ఎదుట వీరు బుధవారం నిరసన తెలిపారు. కాగా.. ఎస్పీ రవికృష్ణ బుధవారం కొత్తబురుజు గ్రామానికి వెళ్లి ఇరువర్గాల వారితో మాట్లాడారు. ఘర్షణలకు దిగితే గ్రామ బహిష్కరణ ఉంటుందని హెచ్చరించారు. -
కదంతొక్కిన అంగన్వాడీలు
నెల్లూరు (వైద్యం): తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గురువారం అంగన్వాడీ కార్యకర్తలు, సీఎస్సీలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, కాంట్రాక్ట్ సిబ్బంది చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తతకు దారి తీసింది. సీఐటీయూ ఆధ్వర్యంలో పెద్దఎత్తున మహిళలు కలెక్టరేట్ ఎదుట బైటాయించారు. అధికారులు స్పందించకపోవడంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కలెక్టర్ వచ్చి సమాధానం చెప్పే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని మహిళలు భీష్మించారు. పోలీసులు ఆందోళన కారులను సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఒక దశలో పోలీసులు, మహిళలకు మధ్య తోపులాట జరిగింది. దీంతో ఆ ప్రాంతమంతా ఉద్రిక్తత చోటు చేసుకుంది. వర్షాన్ని సైతం మహిళలు లెక్క చెయకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా గర్జించారు. దాదాపు 5 గంటల పాటు ఆ ప్రాంతం ఉద్రిక్తత నెలకొంది. డీఆర్ఓ ఇచ్చిన హామీతో మహిళలు శాంతించారు. ఓట్లు దండుకుని మహిళల కడుపు కొడతారా - చంద్రబాబుపై పుణ్యవతి ఫైర్ ఎన్నికల్లో మహిళలకు కల్లబొల్లి మాటలు చెప్పి ఓట్లు దండుకున్న చంద్రబాబు ఇప్పుడు వారి కడుపు కొట్టే ప్రయత్నం చేస్తున్నారని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షురాలు పుణ్యవతి మండిపడ్డారు. జపాన్, సింగపూర్ కాంట్రాక్టర్లపై ఉన్న శ్రద్ధ ప్రజలపై లేదని తీవ్రస్థాయిలో ఆమె విమర్శించారు. ఐకేపీ సిబ్బంది 90 రోజులుగా సమ్మె చేస్తుంటే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమన్నారు. బాబు వస్తే జాబు గ్యారెంటీ అని చెప్పి ఇప్పుడు ఉన్న ఉద్యోగాలకే ఎసరు పెట్టడం శోచనీయమన్నారు. సీఐటీయూ శ్రామిక మహిళ గౌరవాధ్యక్షురాలు షేక్ రెహనాబేగం మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలకు 2013లో పెంచిన రూ.800 వేతనాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ముట్టడి కార్యక్రమానికి సంఘీభావం తెలిపిన వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, పోలుబోయిన అనిల్‌కుమార్‌కు ఆమె ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు స్వరూపారాణి, శేషమ్మ, షాహినాబేగం, అన్నపూర్ణమ్మ, విజయమ్మ, కొండమ్మ, బుజ్జమ్మ పాల్గొన్నారు. సోమవారం జాయింట్ యాక్షన్ సమావేశం : సుదర్శన్‌రెడ్డి డీఆర్వో అన్ని యూనియన్ల నాయకులతో సోమవారం జాయింట్ యాక్షన్ సమావేశం నిర్వహిస్తాం. తమ పరిధిలో ఉన్న పెన్షన్లు, ఇళ్ల స్థలాలు వంటి సమస్యలను కచ్చితంగా పరిష్కరిస్తామన్నారు. -
కదం తొక్కిన కార్మికులు
పాడేరులో భారీ ర్యాలీ ఐటీడీఏ ముట్టడిని అడ్డుకున్న పోలీసులు 2 గంటలు రోడ్డుపై ధర్నా ప్రభుత్వ పోకడలకు నిరసనగా కార్మికులు గురువారం పాడేరులో కదం తొక్కారు. ఏజెన్సీలోని పలు ప్రభు త్వ సంస్థల్లో పని చేస్తున్న ఆశ కార్యకర్తలు, హాస్టల్ వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, వైద్య ఆరోగ్య శాఖలో ని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, మధ్యాహ్న భోజన కార్మికులు, ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు, వెలుగు యాని మేటర్లు సీఐటీయూ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. అనంతరం ఐటీడీఏను ముట్టడించారు. కార్యాలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో రెండు గంటలపాటు బైఠాయించి ధర్నా చేపట్టారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాడేరు: ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, కక్షసాధింపు చర్యలకు నిరసనగా ఏజెన్సీలోని పలు ప్రభుత్వ సంస్థల్లో పని చేస్తున్న కార్మికులు గురువారం ఐటీడీఏను ముట్టడించారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ పాడేరులో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. మన్యంలోని 11 మండలాల్లో పని చేస్తున్న ఆశ కార్యకర్తలు, హాస్టల్ వర్కర్లు, అంగన్ వాడీ కార్యకర్తలు, వైద్య ఆరోగ్య శాఖలోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, మధ్యాహ్న భోజన కార్మికులు, ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు, వెలుగు యానిమేటర్లు సీఐటీయూ ఆధ్వర్యంలో తొలుత భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఐటీడీఏను ముట్టడించారు. కార్యాలయం లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించగా పోలీసులు గేట్లు మూసివేసి అడ్డుకున్నారు. శాంతియుతంగానే ఆందోళన చేపడతామని పోలీసు అధికారులకు చెప్పినా ఫలితం లేకపోయింది. సీఐ ఎన్.సాయి, ఎస్ఐలు ధనుంజయ్, సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో పోలీసులు గేటు వద్ద అడ్డుకోవడంతో కార్మికులు ఐటీడీఏ ఎదుట బైఠాయించారు. వేలాదిమందితో ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. కాంప్లెక్స్ రోడ్డుపై కూడా కార్మికులు కూర్చొని సుమారు 2 గంటలపాటు ధర్నా చేపట్టారు. నినాదాలతో ఐటీడీఏ దద్దరిల్లింది. కార్మికులకు అన్యాయం ప్రభుత్వం కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తున్నదని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు జి.కోటేశ్వరరావు ఆరోపించారు. ఆందోళనకారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ అతి తక్కువ రూ.400 వేతనంతో వెట్టి చాకిరీ చేస్తున్న ఆశ కార్యకర్తలకు 14 నెలలుగా జీతాలివ్వకపోవడం దుర్మార్గం అన్నారు.అంగన్వాడీ కార్యకర్తలకు ఉద్యోగ భద్రత కరువైందన్నారు. డ్వాక్రా సంఘాల నిర్మాణానికి అహర్నిశలు కృషి చేస్తున్న వెలుగు యానిమేటర్లకు కూడా బకాయి వేతనాలు చెల్లించకుండా ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తున్నదన్నారు. మధ్యాహ్న భోజన కార్మికులపై కూడా టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజకీయ వేధింపులు అధికమయ్యాయన్నారు. ఉపాధి హామీ పథకం ఫీల్డ్ సిబ్బంది, హౌసింగ్లోని వర్క్ఇన్స్పెక్టర్లను కూడా అకారణంగా తొలగిస్తున్నారన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించకుంటే రాష్ట్రస్థాయిలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఐటీడీఏ ఏపీవో పీవీఎస్ నాయుడుకు ఇచ్చారు. వారం రోజుల్లో ఆశ కార్యకర్తల14 నెలల బకాయిలు చెల్లిస్తామని, ఇతర కార్మికుల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వె ళతామని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ నేతలు ఉమా మహేశ్వరరావు, శంకరరావు, ఎల్.సుందరరావు, సీపీఎం నేత కె.సురేంద్ర, గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి.అప్పలనర్సయ్య, అంగన్వాడీ వర్కర్ల సంఘం ప్రతినిధులు అంబాలమ్మ, వి.భాగ్యలక్ష్మి, అన్నపూర్ణ, కళావతి, ఆశ కార్యకర్తల సంఘం ప్రతినిధులు వై.మంగమ్మ, శ్రీదేవి, మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘం ప్రతినిధులు పి.లక్ష్మి, ఎస్.హైమావతి, వీఆర్పీల సంఘం నేతలు రామస్వామి, కోటేశ్వరరావు, యానిమేటర్ల సంఘం ప్రతినిధులు ప్రకాష్, భాను పాల్గొన్నారు. -
'రాజధాని నిర్మాణంపై స్పష్టత లేదు'
గుంటూరు : తెలుగుదేశం ప్రభుత్వంపై బీజేపీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. రాజధాని నిర్మాణంపై ఆంధ్రప్రదేశ్ సర్కార్ వద్ద స్పష్టత లేదని బిజెపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమ్ముల శ్యాంకిషోర్ బాబు ఆరోపించారు. పచ్చని భూములను రియల్ ఎస్టేట్ మాఫీయా చేతుల్లో ఉండాలనుకోవటం సరికాదని ఆయన సోమవారమిక్కడ అన్నారు. ఏపీ సర్కార్ మొండి వైఖరి అవలంభిస్తే బాధితుల తరపున న్యాయపోరాటం చేస్తామని శ్యాంకిషోర్ బాబు హెచ్చరించారు. ఎన్నికల సమయంలో రుణమాఫీ అని చెప్పి ఏం చేశారో ప్రజలందరికీ తెలుసునని ఆయన అన్నారు. రైతు సాధికారిత సంస్థకు ఇస్తామన్న రూ.5వేల కోట్ల...విషయాన్ని ప్రజలకు వివరించాలని శ్యాంకిషోర్ బాబు డిమాండ్ చేశారు. -
బ్రహ్మదేవరచేనులో ఏనుగుల బీభత్సం
చిత్తూరు : చిత్తూరు జిల్లా ప్రజలకు ఏనుగుల బెడద తప్పటం లేదు. తాజాగా రామకుప్పం మండలం బ్రహ్మదేవరచేను గ్రామ శివారులోని పంట పొలాలపై ఏనుగులు గత అర్థరాత్రి దాడి చేశాయి. పంటలను పూర్తిగా నాశనం చేశాయి. ఏనుగుల దాడిలో వరి పంటతో పాటు అరటి, చెరకు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అప్పు చేసి సాగు చేసిన పంటలను ఏనుగులు పొట్టనపెట్టుకుంటున్నాయని, అధికారులు స్పందించి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. సోలార్ కంచె ఏర్పాటు చేసినా ఏనుగులు లెక్కచేయటం లేదని, ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఏనుగుల దాడితో గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్నారు. -
వర్షాలు, పంట నష్టంపై వైఎస్ జగన్ ఆరా
-
ఏపీలో భారీ వర్షాలు, పంట నష్టంపై వైఎస్ జగన్ ఆరా
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు, పంట నష్టంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరా తీశారు. ఆయన సోమవారం అన్ని జిల్లాల పార్టీ నేతలతో సమీక్ష నిర్వహించనున్నారు. మరోవైపు వైఎస్ఆర్ సీపీ నవంబర్ 5న రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసనలు తెలుపనున్న విషయం తెలిసిందే. దీనిపై కూడా వైఎస్ జగన్ పార్టీ నేతలతో చర్చించనున్నారు. -
రంగారెడ్డి జిల్లాలో నలుగురు రైతుల ఆత్మహత్య
హైదరాబాద్ : తెలంగాణలో రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. కరువుకాటుకు అన్నదాతలు పిట్టల్లా రాలిపోతున్నారు. కంటికి రెప్పలా కాపాడుకున్న పంట కళ్లముందే ఎండిపోతుంటే గుండె ధైర్యం చెడి వారు ప్రాణాలు తీసుకుంటున్నారు. చేసిన అప్పులు ఒకవైపు, వర్షాల లేమి, విద్యుత్ కోతలతో పెట్టిన పెట్టుబడులు కూడా రావని తనువు చాలిస్తున్నారు. వేర్వేరు ప్రాంతాల్లో అయిదుగురు రైతులు మృతి చెందారు. గురు, శుక్రవారాల్లో జిల్లాలో నలుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకోగా, మరో రైతు గుండె ఆగిపోయింది. షాబాద్ మండలం కుమ్మరిగూడకు చెందిన కుమ్మరి సత్తయ్య (38), వికారాబాద్ మండలం ధన్నారం గ్రామానికి చెందిన ఆలూరి బాలయ్య (40) ఉరి వేసుకోగా, పరిగి మండలం సదయ్యద్ పల్లికి చెందిన రైతు మల్లిగారి రామస్వామి (40), మర్పల్లి మండలం తిమ్మాపూర్‌కు చెందిన అంజయ్య పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇక వికారాబాద్ మండలం పులుసుమామిడిలో బురాన్ (45) అనే రైతు గుండెపోటుతో మృతి చెందాడు. -
5 మంది ఫీల్డ్ అసిస్టెంట్లపై వేటు
తాండూరు రూరల్: ఉపాధి హామీ పథకంలో సిబ్బంది అవకతవకలకు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. గురువారం పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో 7వ సామాజిక తనిఖీ బహిరంగ సభ జరిగింది. కార్యక్రమానికి డ్వామా జిల్లా అడిషనల్ పీడీ ప్రభాకర్‌రెడ్డి, జిల్లా విజిలెన్స్ అధికారి రమేష్‌గుప్తాలు హాజరయ్యారు. ఉపాధి సిబ్బంది అవకతవకలకు పాల్పడినట్లు అధికారులు నిర్ధారించారు. రూ.31,515ను రికవరీ చేస్తామని వారు చెప్పారు. 5 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు తొలగింపు.. బినామీ పేర్లు సృష్టించి రూ.15 వేలు స్వాహా చేయడంతో చెన్‌గేస్‌పూర్ గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ కతలప్పను తొలగించామని అధికారులు చెప్పారు. చెంగోల్ గ్రామంలో రూ. 6 వేలు కాజేసిన ఫీల్డ్ అసిస్టెంట్ ఎల్లమ్మను తొలగించారు. ఒక్క దగ్గర పనిచేయాల్సి ఉండగా మరో దగ్గర కూలీలతో పని చేయించడంతో జినుగుర్తి ఫీల్డ్ అసిస్టెంట్ అనంతయ్య అధికారులు విధుల నుంచి విధుల నుంచి తొలగించారు. అల్లాపూర్‌లో పాత మరుగుదొడ్ల పేరు మీద డబ్బులు డ్రా చేసుకోవడంతో ఫీల్డ్ అసిస్టెంట్ గోపాల్‌పై వేటు పడింది. ఉద్దాండపూర్‌లో బినామీ పేర్లు సృష్టించి నిధులు స్వాహా చేసిన ఫీల్డ్ అసిస్టెంట్ బసప్పను తొలగించినట్లు అధికారులు చెప్పారు. అనంతరం అడిషనల్ పీడీ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ...సామాజిక తనిఖీల్లో అవకతవకలకు పాల్పడిన సిబ్బందిపై చర్యలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ జగన్మోహన్రావు, వైస్ ఎంపీపీ శేఖర్, ఏపీఓ శారద, ఆయా గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. -
‘ఉపాధి’లో కొత్త నిబంధన భయం
ఆందోళనలో ఫీల్డ్అసిస్టెంట్లు - లక్ష్యం చేరుకోకుంటే విధుల నుంచి తొలగింపు - కూలీలపై ప్రభావం జగిత్యాల రూరల్ : ఉపాధిహామీలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనపై సర్వత్రా భయాందోళన వ్యక్తమవుతుంది. లక్ష్యం చేరుకోకపోతే ఎలా అనే భయాందోళన లో ఫీల్డ్అసిస్టెంట్లు ఉన్నారు. సర్కిల్ నం బర్ 481లో పొందుపర్చిన 28 అంశాల నిబంధనలతో ఫీల్డ్ అసిస్టెంట్లు ఆందోళ న చెందుతున్నారు. లక్ష్యాన్ని చేరుకోకపో తే విధుల నుంచి తొలగిస్తామని హెచ్చరించడంతో ఆందోళన చెందుతున్నారు. ఏంటీ నిబంధన? ఒక్కోఫీల్డ్ అసిస్టెంట్ 15 వేల పనిదినాలు కల్పించాలి. లేకుంటే వారిని విధుల నుంచి తొలగిస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. జిల్లాలోని 1207 గ్రామపంచాయతీలకు ప్రస్తుతం 880 మంది ఫీల్డ్అసిస్టెంట్లు విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం 6,56,543 జాబ్‌కార్డు లబ్ధిదారులు ఉన్నారు. వీరు 27,870 గ్రూపులుగా పనిచేస్తున్నారు. ఒక్కో గ్రూపులో 12 నుంచి 25 మంది ఉన్నారు. రానున్న రోజుల్లో వీరందరికి పని కల్పించడం కష్టతరంగా మారనుంది. కోరిన వారికి పనికల్పించాలని పాత నిబంధన. దీంతో ఎవరు వచ్చి దరఖాస్తు పెట్టుకుంటే వారి గ్రూప్ సభ్యులకు పని చూపెట్టేవారు ఫీల్డ్అసిస్టెంట్లు. భయాందోళన ప్రభుత్వం కొత్త నిబంధన తేవడంతో ఫీల్డ్ అసిస్టెంట్ల ఉద్యోగానికి ఎసరొచ్చింది. పనిదినాల లక్ష్యాన్ని చేరుకోలేని వారు ఉద్యోగం కోల్పోనున్నారు. ఈ ప్రభావం పరోక్షంగా కూలీలపై పడనుంది. ఒక గ్రామంలోని ఫీల్డ్ అసిస్టెంట్ లక్ష్యం చేరుకోక ఉద్యోగం కోల్పోతే అక్కడి కూలీలకు పని కల్పించే వారు కరువు కానున్నారు. దీంతో గ్రామాల్లో ఎంపిక చేసిన పనుల నిర్వహణ కష్టతరంగా మారనుంది. నిబంధనలు సడలించాలి ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలు సడలించాలి. గ్రామాల్లో కూలీలకు పనికల్పిస్తున్న తమను తొలగించడం అన్యాయం. - పోతుగంటి వెంకటేశ్, ఫీల్డ్ అసిస్టెంట్, పొరండ్ల తొలగింపునకు సన్నాహాలు ఉపాధిహామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించేందుకు నిబంధనలు తీసుకొస్తున్నారు. గ్రామాల్లోని కూలీలకు పని కల్పిస్తున్న మమ్ములను తొలగించడం సబబు కాదు. - లక్ష్మీరాజం, ఫీల్డ్ అసిస్టెంట్, తిమ్మాపూర్ -
అధికార పార్టీ అండ ఉంటే..
బొబ్బిలి రూరల్: నాయకుడి అండ ఉండి..మనోడు అని నాయకుడు భావిస్తే ఎలాంటి నిబంధనలూ వర్తించవు. ఈ క్రమంలోనే అవినీతి ఆరోపణలున్న ఉపాధిహామీ పథకం ఫీల్డు అసిస్టెంట్‌ను పునర్నియమించారు. మండలంలోని కోమటపల్లిలో వడ్డివెంకటరమణ అనే గ్రామీణఉపాధిహామీ పథకం ఫీల్డు అసిస్టెంట్ గతంలోఅనేక అవకతవకలకు పాల్పడ్డాడు. కోమటపల్లి-లింగంవలస పంచాయతీరాజ్ రోడ్డు పనుల్లో ఇతరుల పేరిట బిల్లులు స్వాహాచేశారనే ఆరోపణలతో 2014 మార్చి 4న విధుల్లో నుంచి తొల గించారు. టీడీపీ అధికారంలోకి రాగానే వెంకట రమణ తన ప్రయత్నాలను ప్రారంభించారు. చోటామోటా నాయకులను పట్టుకుని తన పని సాధించాడు. మళ్లీ తన ఉద్యోగం పొందాడు. ఈ ఏడాది ఆగస్టు 6న వెంకటరమణ రూ.7,500 అపరాధ రుసుము చెల్లించినందున ఆతనిని తిరిగి నియమిస్తున్నట్లు డ్వామా పీడీ గోవిందరాజులు నుంచి ఈనెల 10వతేదీన ఏపీఓ కె.కేశవరావుకు ఆదేశాలు అందాయి. ఈ మేరకు సోమవారం నుంచి వెంకటరమణ విధుల్లో చేరారు. ఒక్కొక్కరికి ఒక్కోరూలా? సోషల్ ఆడిట్లో రూ.3,600 స్కాం రుజువైందని రంగరాయపురం ఫీల్డు అసిస్టెంట్ గేదెల శ్రీనివాసరావును ఈ ఏడాది ఫిబ్రవరిలో తొలగించారు. నిజానికి సోషల్ ఆడిట్లో ఆరోపణలు వస్తే రికవరీ చేసి నిబంధనల మేరకు కొనసాగిస్తారు. అయితే శ్రీనివాసరావు సోదరుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నందునే కక్షసాధింపుగా ప్రభుత్వం తొలగించిందని, కోమట పల్లి ఫీల్డు అసిస్టెంట్‌కు ఒక రూలు రంగరాయపురం ఫీల్డ్ అసిస్టెంట్‌కు మరో రూలా? అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
కొండను తవ్వి.. ఎలుకను పట్టారు!
తాండూరు రూరల్ (పెద్దేముల్): పెద్దేముల్లో అధికారులు చేపట్టిన ఉపాధి హామీ సామాజిక తనిఖీ తీరు ‘కొండను తవ్వి ఎలుకను పట్టిన’ చందంగా ఉంది. గత ఉపాధి హామీ తనిఖీలో అవకతవకలకు పాల్పడిన ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, సీఎస్పీలపై చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పినా ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విడ్డూరంగా ఉందనే విమర్శలు వినిపిస్తుండగా.. మండలంలో 1-8-2013 నుంచి 31-5-2014 వరకు చేసిన ఉపాధి పనులపై తాజాగా సోషల్ ఆడిట్ జరిగింది. ఇందుకు 25 గ్రామ పంచాయతీల్లో రూ.3 కోట్ల 97 లక్షల 69 వేల పనులు జరిగాయి. కానీ రూ. లక్ష 50 వేలు మాత్రమే అవకతవకలు జరిగినట్లు అధికారులు నిర్ధారించారు. నెల రోజుల నుంచి మండలంలో 36 మంది వీఎస్ఓ (విలేజ్ సోషల్ అడిటర్స్)లు సోషల్ అడిట్ నిర్వహించారు. సోమవారం పెద్దేముల్ ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఉపాధి హామీ 7వ సామాజిక తనిఖీ కార్యక్రమం జరిగింది. డ్వామా అడిషినల్ పీడీ ప్రభాకర్‌రెడ్డి, జిల్లా విజిలెన్స్ ఆఫీసర్ రమేష్ గుప్తా, డ్వామా ఎగ్జిక్యూటివ్ రాంచందర్, ఏపీడీ ఉమాదేవి, డీపీఎం సునీల్ సోషల్ అడిట్ నిర్వహించారు. సోషల్ ఆడిట్ అనంతరం డ్వామా అడిషినల్ పీడీ ప్రభాకర్‌రెడ్డి పలు అంశాలను వెల్లడించారు. ► రేగొండి కూలీలకు రూ.92,825 చెల్లించాల్సిన డబ్బులు ఇవ్వనందున మండల కమిటీ కో ఆర్డినేటర్ శివకుమార్‌పై క్రిమినల్ కేసు నమోదు. ►తట్టేపల్లి ఫీల్డ్ అసిస్టెంట్ సంజీవ్‌కుమార్.. బినామీ కూలీల పేర్లను సృష్టించి రూ.21,548 అవకతవకలకు పాల్పడటంతో అతడిని విధుల నుంచి తొలగించారు. ►అత్కూర్ ఫీల్డ్ అసిస్టెంట్ బినామీ పేర్లతో రూ.1980 కాజేయడంతో సొమ్ము రికవరీకి ఆదేశం. ►బుద్దారం కూలీలకు చెల్లించాల్సిన రూ.60 వేలను గ్రామ సీఎస్పీ ఇవ్వనందు న తొలగింపునకు ఆదేశాలు. ►నాగులపల్లి ఫీల్డ్ అసిస్టెంట్ రాములు బినామీ కూలీల పేర్లు సృష్టించి డబ్బులు కాజేయడంతో తొలగింపు. ►గోపాల్పూర్ ఫీల్డ్ అసిస్టెంట్ కృష్ణ రూ.56 వేల అవకతవకలకు పాల్పడటంతో తొలగింపు. ►పాషాపూర్ ఫీల్డ్ అసిస్టెంట్ బినామీ కూలీల పేర్లను సృష్టించి రూ.5,158 కాజేయడంతో రికవరీకి ఆదేశం. ►కోట్‌పల్లి ఫీల్డ్ అసిస్టెంట్ భీమయ్య రూ.18,850, అడికిచర్ల ఫీల్డ్ అసిస్టెంట్ స్వామిదాస్ రూ.14,208 కాజేయడంతో విధుల్లోంచి తొలగింపు. పలువురు సీఎస్పీలు.. వీబీకేల తొలగింపు.. గ్రామాల్లో కూలీలకు డబ్బులు ఇవ్వడంలో నిర్లక్ష్యం, విద్యార్థుల స్కాలర్‌షిప్‌లలో అవకతవకలకు పాల్పడిన సీఎస్పీలు, వీబీకేలను తొలగించినట్లు ఏపీడీ ఉమాదేవి పేర్కొన్నారు. కోట్‌పల్లి, పాషాపూర్, ఇందూర్, నాగులపల్లి, కందనెల్లి, బుద్దారం, మారెపల్లి, గాజీపూర్ సీఎప్పీలను తొలగిం చామన్నారు. విద్యార్థుల స్కాలర్‌షిప్‌లలో అవకతవకలు జరగడంతో రుక్మాపూర్, పాషాపూర్, నాగులపల్లి, ఓమ్లనాయక్ తండా వీబీకేలను తొలగించామని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ వాణిశ్రీ, వైస్ ఎంపీపీ నర్సమ్మ, జెడ్పీటీసీ సభ్యురాలు స్వరూప, ఎంపీడీఓ సంధ్య, ఏపీడీ శోభారాణి, ఏపీఓ శారద పాల్గొన్నారు. -
కుండపోత
నీటమునిగిన లోతట్టు ప్రాంతాలు జలమయమైన రహదారులు త హశీల్దార్ను నిలదీసిన బాధితులు రాయచూరు రూరల్ : నగరంలో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. రాత్రి 12 గంటలకు ప్రారంభమైన వర్షం ఉదయం ఐదు గంటల వరకు కురిసింది. ఈ వర్షానికి రహదారులు, వీధులు, పొలాలు జలమయమయ్యాయి. నగరంలో జనతా కాలనీ, ఆజాద్ నగర్, హాజీ కాలనీలో మురికి కాలువలు బంద్ కావడంతో వర్షం నీరు ఇళ్లలో చేరాయి. రాయచూరు తాలూకా చిక్కస్గూరు-హేగ్గసనళ్లిలో కూడా వర్షం నీరు ఇళ్లలోకి చేరింది. ఆహారధాన్యాలు, బట్టలు పూర్తిగా తడిసాయి. సోమవారం ఉదయం రాయచూరు తహశీల్దార్ బాలరాజు చిక్కస్గూరు-హేగ్గసనళ్ళిని సందర్శించారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే తాము తీవ్రంగా నష్టపోయామని బాధితులు ఆయన్ను నిలదీశారు. నష్టాన్ని జిల్లాధికారితో చర్చించి సమస్య సరిష్కారిస్తామని హమీ ఇచ్చారు. దీంతో బాధితులు శాంతించారు. కాగా, రాయచూరులో 114 మీల్లీమీటర్లు, మాన్విలో 16, లింగస్గూరులో 14, సింధనూరులో 6, దేవదుర్గలో 29.4, గబ్బూరులో 49.4, మస్కి 32, వలకందిన్ని 32, కల్లూరు 52, కల్మాల 50, యరమరస్ 85, జేగరకల్ 80 మీల్లీమీటర్ల వర్షం కురిసిందని జిల్లాధికారి శశికాంత సింథల్ సోమవారం తెలిపారు. -
రికవరీ ఏదీ?
సాక్షి ప్రతినిధి, కడప: వలస జీవితాలకు స్వస్తి పలికి స్వగ్రామాల్లోనే ఉపాధి పనుల ద్వారా కూలీలకు భృతి కల్పించాలనే సదుద్దేశంతో ప్రభుత్వం ప్రవేశ పెట్టిన జాతీయ ఉపాధి హామీ పథకం కొంతమంది సిబ్బందికి కల్పతరువుగా మారింది. అందివచ్చిన అవకాశాన్ని ఫీల్డ్అసిస్టెంట్లు సద్వినియోగం చేసుకుంటున్నారు. లక్షలాది రూపాయలు స్వాహా చేస్తున్నా రికవరీ చేయకుండా జిల్లా యంత్రాంగం చేష్టలుడిగి చూస్తోంది. జిల్లాలో ఇప్పటి వరకు సుమారు రూ.7.5 కోట్లు ఫీల్డ్ అసిస్టెంట్లు, ఏపీఓలు స్వాహా చేశారంటే వీరి అవినీతి ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థమవుతోంది. అందుకు నిదర్శనం వీరబల్లి ఫీల్డ్అసిస్టెంట్ ఉదంతం. చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించిన పీడీ.. జిల్లాలో ఇప్పటివరకు 8సార్లు సోషల్ ఆడిట్ నిర్వహించారు. అందులో అక్రమాలకు పాల్పడిన సిబ్బందిని గుర్తించి రికవరీ చేయాల్సిందిగా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటివరకు సుమారు రూ. 7.5 కోట్లు అక్రమాలకు పాల్పడినట్లు రుజువైంది. అందులో సుమారు రూ.2.5 కోట్లు మాత్రమే రికవరీ చేశారు. మిగిలిన మొత్తం రికవరీలో జాప్యం జరుగుతోంది. అందుకు కారణం మండల స్థాయిలో ఉండే ఏపీఓలేనని తెలుస్తోంది. ఉపాధి హామీ పథకంపై వీరబల్లి మండలంలో సోషల్ ఆడిట్ నిర్వహించారు. అనంతరం రూ.18.53 లక్షల రికవరీకి డ్వామా పీడీ బాలసుబ్రమణ్యం ఆదేశించారు. మే 24న ఆమేరకు ఉత్తర్వులు సైతం జారీ చేశారు. ఐదుమంది ఫీల్డ్‌అసిస్టెంట్లపై ఆర్ఆర్ యాక్టు ప్రయోగించి రిక వరీ చేయాలని ఆదేశాల్లో స్పష్టం చేశారు. అందులో రమేష్‌బాబు అనే ఫీల్డ్ అసిస్టెంట్ ఒక్కరే రూ.16లక్షలు స్వాహా చేశారు. ఇప్పటి వరకూ స్థానిక ఏపీఓ చిన్నపాటి చర్యలు తీసుకున్న దాఖలాలు కూడా లేవు. ఉన్నతాధికారులకు మాత్రం ఫీల్డ్అసిస్టెంట్ పరారీలో ఉన్నట్లు రికార్డులు పొందుపర్చినట్లు సమాచారం. అయితే రమేష్‌బాబు యథేచ్ఛగా తన కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా ప్రభుత్వ సొమ్ము స్వాహా చేసి దర్జాగా స్థానిక రాజకీయ నాయకుడి అవతారం ఎత్తారు. అధికారపార్టీ అండతో స్వాహా మొత్తంలో చిల్లిగవ్వ కూడా రికవరీ కాకుండా చూసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితి జిల్లా వ్యాప్తంగా ఉంది. రమేష్‌బాబు వ్యవహారం పరిశీలిస్తాం... పీడీ బాలసుబ్రమణ్యం జిల్లాలో ఉపాధి సొమ్ము స్వాహాపై రికవరీ చేస్తున్నాం. సోషల్ ఆడిట్లో తప్పు చేశారని తేలిన సిబ్బందిపై చర్యలకు సిఫార్సు చేస్తున్నాం. ఏ ఒక్కరినీ వదలడంలేదు. వీరబల్లి ఫీల్డ్అసిస్టెంట్ రమేష్‌బాబు వ్యవహారాన్ని పరిశీలిస్తా. తన ఆదేశాలను ఏపీఓ ఎందుకు అమలు చేయలేదో పరిశీలిస్తాను. -
ఉపాధి పనులకు రూ. 430 కోట్లు
జిల్లాలో 29 వేల కుటుంబాలకు 100రోజుల పని 20 నర్సరీల్లో టేకు దుంపల పెంపకం 220 మంది ఫీల్డ్ అసిస్టెంట్లకు షోకాజ్ నోటీసులు డ్వామా పీడీ శ్రీరాములనాయుడు బుచ్చన్నపాలెం(మాకవరపాలెం) : ఈ ఏడాది ఉపాధి పథకంలో వివిధ పనులు చేపట్టేందుకు రూ. 430 కోట్లు కేటాయించామని డ్వామా ప్రాజెక్టు డెరైక్టర్ శ్రీరాములనాయుడు తెలిపారు. వీటిలో ఇప్పటివరకు రూ.198 కోట్లు ఖర్చు చేశామన్నారు. మండలంలోని పాపాయ్యపాలెం పంచాయతీ శివారు బుచ్చన్నపాలెంలో ఏర్పాటు చేసిన టేకు నర్సరీని ఆయన శుక్రవారం తనిఖీ చేశారు. ఈ నర్సరీలో టేకు దుంపల పెంపకానికి వేసిన బెడ్లను పరిశీలించారు. పెంపకానికి సంబంధించి ఎన్ని పని దినాలు కేటాయించారు, ఎంతమంది కూలీలు పనులు చేస్తున్నారనే విషయాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కూలీలకు వేతనాలు పంపిణీ చేయాలని, మస్తర్లను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. 220 మంది ఫీల్డ్ అసిస్టెంట్లకు షోకాజ్ నోటీసులు జిల్లాలో 1010 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఉండగా 220 మందికి షోకాజ్ నోటీసులు ఇచ్చామన్నారు. వీరంతా లక్షా యలు చేరుకోకపోవడం, సోషల్ ఆడిట్లో రికవరీల జాబితాలో ఉండడంతో వీరిని తొలగించాల్సిందిగా ఆదేశాలు అందాయన్నారు. వారు ఇచ్చే వివరణలను పరిశీలించి తొలగిస్తామన్నారు. ఈ ఏడాది జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 29 వేల కుటుంబాల వారికి వందరోజులు పని కల్పించామన్నారు. ఈ విషయంలో రాష్ట్రంలో విశాఖ జిల్లా ప్రథమ స్థానంలో ఉందన్నారు. మరో 60 వేల కుటుం బాల వారు 75 రోజులు పని పూర్తి చేసుకున్నారన్నారు. జిల్లాలో 20 టేకు నర్సరీలు రైతులకు మొక్కలు పంపిణీ చేసేందుకు జిల్లాలో 20 టేకు నర్సరీలు ఏర్పాటు చేశామన్నారు. వీటిలో రెండువేల బెడ్లను తయారు చేసి 15 లక్షల టేకు దుంపలను పెంచుతున్నామన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు 10లక్షల టేకు మొక్కలు పంపిణీ చేశామన్నారు. ఇంకా ఐదు లక్షల మొక్కలు అవసరం కాగా అటవీశాఖ వద్ద నాలుగు లక్షలు, విశాఖలో ఒక లక్ష టేకు మొక్కలను కొనుగోలు చేస్తున్నట్టు వివరించారు. ప్రస్తుతం నీరు నిల్వ ఉండే పనులకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. చెక్‌డ్యాంలు, చెరువుల్లో సాగునీటి మదుములకు ఉపాధి హామీలో మరమ్మతులు చేస్తామని తెలిపారు. ఇప్పటికే ఇలాంటివి 520 వరకు పనులు గుర్తించామన్నారు. అక్టోబర్ వరకు ఈ పనులు చేపడతామన్నారు. ఇక నుంచి ప్రతి పనికి సంబంధించిన ఫొటో, నిధుల వ్యయం వివరాలను గూగుల్ మ్యాప్‌లో అప్లోడ్ చేస్తున్నామని, ఎవరైనా ఈ పనులను ఆన్లైన్లో చూసుకోవచ్చన్నారు. అదనపు పీడీ ఆనందరావు, ఏపీడీ శ్రీనివాస్‌కుమార్, ఏపీవో చిన్నారావు, బూరుగుపాలెం సర్పంచ్ రుత్తల సత్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు. రూ. 200కోట్లతో నీటి నిల్వ పనులు నర్సీపట్నం రూరల్ : రూ. 200 కోట్లతో నీటి నిల్వ పను లు చేపట్టనున్నట్టు ఉపాధి హామీ పథకం ప్రాజెక్టు డెరైక్టర్ శ్రీరాములనాయుడు పేర్కొన్నారు. స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో క్లస్టర్ అధికారులు, సిబ్బంది, వన సేవకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది అటవీ ప్రాంతం దిగువన కందకాల ఏర్పాటు, నీటి నిల్వకుంటల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నట్టు చెప్పారు. 1995 తరువాత నిర్మాణం చేసిన చెక్‌డ్యాంలు, నీటి నిల్వ కుంటల పరిస్థితిని అంచనా వేయిస్తున్నట్టు చెప్పారు. వీటికి పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపడుతున్నట్టు వివరించారు. ఈ ఏడాది 3,800 ఎకరాల్లో ఉద్యాన పంటలను అభివృద్ధి చేసినట్టు చెప్పారు. ఏపీడీలు ఆనందరావు, శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
‘ఉపాధి’లో రూ.1.63కోట్లు ఉఫ్!
జగ్గయ్యపేట మండలంలో అక్రమాల గుర్తింపు రూ.98లక్షల రికవరీకి ఆదేశం సామాజిక తనిఖీ ప్రజావేదిక సభలో ఉద్రిక్తత చిల్లకల్లు (జగ్గయ్యపేట) : జగ్గయ్యపేట మండలంలో 2013, జూన్ నుంచి 2014 మే వరకు నిర్వహించిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో రూ.1.63కోట్ల మేరకు అక్రమాలు జరిగాయి. ఈ మొత్తంలో రూ.98లక్షలు రికవరీ చేయాలని, రూ.40లక్షలపై విచారించాలని ఆదేశించినట్లు పీడీ తెలిపారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం జగ్గయ్యపేట మండల ఉపాధి హామీ పథకంపై సామాజిక తనిఖీ ప్రజావేదిక జరిగింది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సభకు 17 గ్రామాలకు చెందిన కూలీలు, ప్రజలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. పంచాయతీల వారీగా ఉపాధి హామీ పథకం జిల్లా ప్రాజెక్టు డెరైక్టర్ అనిల్‌కుమార్ సామాజిక తనిఖీ బృందం గ్రామాల్లో గుర్తించిన నివేదికలను చదివి వివరించారు. మండలంలో 2013, జూన్ నుంచి 2014, మే వరకు రూ.7కోట్ల మేర మట్టి, రోడ్లు, కంపచెట్లు తొలగింపు వంటి పనులను చేపట్టినట్లు తెలిపారు. ఈ పనుల వివరాలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు వారం రోజులపాటు గ్రామాల్లో సామాజిక తనిఖీ బృందం సభ్యులు పర్యటించి పనుల వివరాలను గుర్తించారని చెప్పారు. బినామీ పేర్లతో మస్తర్లు, మట్టి తోలకాలు, ట్రాక్టర్లకు చెల్లించే రశీదు నంబర్లు, ద్విచక్రవాహనాల నంబర్లు, మృతిచెందిన వారికి వేతనాలు చెల్లించడం వంటివి గుర్తించినట్లు వివరించారు. మొత్తం పనులు రూ.7కోట్లతో నిర్వహించగా, రూ.1.63 కోట్ల మేరకు అవినీతిని గుర్తించినట్లు తెలిపారు. బాధ్యుల నుంచి రూ.98లక్షల రికవరీకి ఆదేశించినట్లు పీడీ తెలిపారు. మరో రూ.40లక్షల విలువైన పనులపై విచారణకు ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్‌కు మద్దతుగా గ్రామస్తుల ఆందోళన షేర్‌మహ్మద్‌పేట ఫీల్డ్ అసిస్టెంట్ సక్రమంగానే పనిచేస్తున్నాడని, అతనిపై కొందరు రాజకీయ నాయకులు వ్యక్తిగత ద్వేషంతో అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారని కూలీలు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. సభలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ సైతం సమాధానం చెప్పాలని నిలదీశారు. మల్కాపురానికి చెందిన కొందరు నాయకులు కూడా ఫీల్డ్ అసిస్టెంట్ సక్రమంగా పనిచేయడం లేదంటూ ఫిర్యాదు చేయగా, కూలీలు ఖండించారు. పనులు సక్రమంగా చేశామని, ఫీల్డ్ అసిస్టెంట్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ అధికారులకు లిఖితపూర్వంగా వినతిపత్రం అందించారు. పోచంపల్లిలో మృతిచెందిన వారికి వేతనాలు ఇవ్వడంతోపాటు మట్టి రోడ్డుకు రూ.2.47 లక్షలను అదనంగా చెల్లించినట్లు గుర్తించారు. తనిఖీ బృందం నివేదికల ఆధారంగా ఫీల్డ్ అసిస్టెంట్లపై చర్యలు తగదని, వారి అభిప్రాయాలు కూడా తెలుసుకోవాలని పలువురు కోరారు. ఆరోపణలు, పత్యారోపణలో ఒకదశలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా విజిలెన్స్ అధికారి సురేష్‌బాబు, ఏపీడీ కవిత, స్టేట్ టీం మానిటర్ కె.సత్యనారాయణ, ఎంపీపీ తాళ్లూరి పార్వతి, జెడ్పీటీసీ సభ్యురాలు ఎ.రాణి, ఎస్ఆర్పీలు ఎన్‌వీవీఎస్‌ఎన్ రెడ్డి, ఎ.నాగేశ్వరరావు, డి.ప్రభాకర్, 22మంది డీఆర్పీలు, 47మంది వీఎస్పీలు పాల్గొన్నారు. -
సారూ..మా సమస్యలు పరిష్కరించండి
ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి వారం కలెక్టరేట్లో నిర్వహించే గ్రీవెన్స్‌డేకు సోమవారం వివిధ ప్రాంతాల నుంచి బాధితులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భూ సమస్యలు, ఇళ్ల స్థలాలు, పింఛన్లు, ఉపాధి తదితర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏజేసీ వెంకట్రావు, డ్వామా పీడీ సునందరాణిలకు వినతిపత్రాలు సమర్పించారు. - రాంనగర్ జీవనోపాధి కల్పించాలి నాకు పుట్టుకుతోనే చెవుడుతో పాటు మూగ కూడా ఉంది. నేను పీజీ పూర్తి చేశా. చెవిటివాడిని అనే కారణంతో నన్ను ఎవరూ ఉద్యోగంలోకి తీసుకోలేదు. ఎలాంటి ఉపాధిలేక జీవనోపాధి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నా. మా తల్లిదండ్రులకు నన్ను పోషించే స్థోమత లేక అవస్థలు పడుతున్నారు. నాకు ఏదైనా ఉపాధి మార్గం చూపించాలి. - ఎస్కే నాగుల్ మీరా, రామన్నగూడెం, ఆత్మకూర్ (ఎస్) మండలం తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్నాడు.. ఆదుకోవాలి నా భర్త రాజు టీఆర్ఎస్ నేరేడుచర్ల మండల కార్యదర్శిగా కొంతకాలం పనిచేశాడు. ఉద్యమకారులను సమైక్యాంధ్రలో అణచివేస్తూ లాఠీచార్జిలను చూసి తెలంగాణ రాదేమోనని 2010లో ఆత్మహత్య చేసుకున్నాడు. వెంటనే హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించినా ఫలితం దక్కలేదు. నాకు ఇద్దరు పిల్లలు. వీరు 7వ తరగతి, 4వ తరగతి చదువుతున్నారు. కూలీ, నాలీ పనిచేస్తే వచ్చే డబ్బు సరిపోక ఇబ్బందులు పడుతున్నాం. దయచేసి అమరవీరుల కుటుంబాలకు రావాల్సిన సంక్షేమ పథకాలు అందించి మా కుటుంబాన్ని ఆదుకోవాలి. - రేగళ్ల ఉమ, నేరేడుచర్ల ఉపాధిహామీ కూలీలకు న్యాయం చేయాలి మా గ్రామంలో ఉపాధిహామీ పథకంలో పని చేసే కూలీలకు న్యాయం చేయాలి. ప్రభుత్వం ఒక్కో కూలీకి రోజుకు 149 రూపాయలు మం జూరు చేస్తుండగా స్థానిక ఫీల్డ్ అసిస్టెంట్ కేవలం 70 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. తక్కువ కూలి విషయంపై ఫీల్డ్ అసిస్టెంట్‌ను నిలదీస్తే ఆయన కుటుంబ సభ్యులు మాపై దౌర్జన్యం చేస్తున్నారు. మరుగుదొడ్లు నిర్మించుకున్న మాకు ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్‌పై చర్యలు తీసుకోవాలి. - మురళి, కె.శ్రీకాంత్, కేశరాజుపల్లి -
‘ఉపాధి’కి విఘాతం!
సాక్షి, రాజమండ్రి :ఉపాధి హామీ పథకానికి రాష్ర్ట ప్రభుత్వ నిర్ణయాలు విఘాతం కలిగించేలా ఉన్నాయి. తమను విధుల్లోంచి తొలగించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఫీల్డు అసిస్టెంట్లు సమ్మెకు దిగే యోచనలో ఉండడంతో ‘ఉపాధి’ పనులు మందగిస్తాయనికూలీలు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో సుమారు 7.10 లక్షల జాబ్ కార్డులు ఉన్నాయి. ఏటా సుమారు ఐదు లక్షల వరకూ పనిదినాలు కల్పిస్తున్నారు. వ్యవసాయేతర పనుల కాలంలో కూలీలకు ఉపాధి పనులు కడుపు నింపుతున్నాయి. ఈ ఏడాది వ్యవసాయ పనులు ఊపందుకోకపోవడంతో ఇంకా వ్యవసాయ కూలీలు ఉపాధి పనులపైనే ఆధారపడుతున్నారు. ఈ తరుణంలో ఉపాధి పనులకు ఎటువంటి ఆటంకాలు ఉండకూడదని కూలీలు ఆశిస్తున్నారు. కానీ ఫీల్డు అసిస్టెంట్ల తొలగింపు నిర్ణయం పనులకు విఘాతం కలిగించే ఆందోళన బాటలో ఎఫ్ఏలుజిల్లాలో సుమారు 1050 మంది ఫీల్డు అసిస్టెంట్లు ఉన్నారు. వీరికి మంగళం పాడేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో అసిస్టెంట్లు ఆందోళన బాట పట్టారు. తమ సంఘం రాష్ట్ర నేతల ఆధ్వర్యంలో పలుమార్లు సంబంధిత మంత్రులను కలిసి తొలగింపు నిర్ణయం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కానీ ప్రభుత్వం తన నిర్ణయానికే కట్టుబడి ఉండడంతో అసిస్టెంట్లు ఆందోళన ఉధృతం చేసేందుకు నిర్ణయించారు. ఈ నెలాఖరు నుంచి సమ్మెకు దిగి పనులు స్తంభింపచేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ మేరకు రాష్ట్ర నేతలతో సమాలోచనలు జరుపుతున్నారు. చిరుద్యోగులపై ప్రతాపం ఉపాధి హామీ పథకంలో ఫీల్డు అసిస్టెంట్ల పాత్ర చాలా కీలకమైనది. పనుల అంచనాల నుంచి నిర్వహణ వరకూ అధికారులు వీరి సహకారం లేనిదే ముందుకు సాగలేరు. కానీ వీరికి ఇచ్చే వేతనాలు మాత్రం కనీసంగా ఉన్నాయి. గతంలో రూ.3,500 చెల్లించేవారు. వేతనాలు పెంచాలని డిమాండ్ చేయడంతో రూ.5,000కు పెంచినా పనుల కల్పనపై టార్గెట్లు విధించి దానితో లింకు పెట్టారు. ఎనిమిదేళ్లుగా గ్రామాల్లో ఇదే వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న వీరు వేరే వృత్తికి మళ్లలేక చాలీచాలని జీతాలతో కుటుంబాలను పోషించుకుంటున్నారు. కొత్త ప్రభుత్వం వస్తుంది.. తమ ఉద్యోగాలకు భద్రత ఇస్తుందని ఆశించిన తరుణంలో అసలుకే ఎసరు పెట్టడంతో ఫీల్డు అసిస్టెంట్లు గగ్గోలు పెడుతున్నారు. రాజకీయ కోణం 2006లో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జిల్లాలో ఫీల్డు అసిస్టెంట్ల నియామకం జరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కొత్త ప్రభుత్వం తమపై కక్ష సాధింపునకు దిగుతోందని ఎఫ్‌ఏలు ఆరోపిస్తున్నారు. ఉన్నవారిని తొలగించి టీడీపీ నేతలు తమకు అనుకూలమైన వారిని నియమించుకునేందుకే ఈ తొలగింపు డ్రామాలని రాజకీయ పరిశీలకులు కూడా ఆరోపిస్తున్నారు. -
ఉపాధి ఉఫ్!
ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులకు సర్కారు ఎసరు మలి విడతలో మేస్త్రీల తొలగింపు రోడ్డున పడనున్న కుటుంబాలు విజయవాడ సిటీ : ‘జాబు కావాలంటే బాబు రావాలి’ నినాదాన్ని అందిపుచ్చుకున్న టీడీపీ నేతలు ఎన్నికల్లో బాగానే ఓట్లు దండుకున్నారు. కొత్త కొలువుల సంగతి అటుంచితే.. ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక అమలుచేస్తోంది. గ్రామస్థాయిలో చిరుద్యోగులుగా జీవనం సాగిస్తున్న వేలాదిమంది ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లను రెండు, మూడు రోజుల్లో తొలగించనున్నారు. అందరినీ ఒకేసారి తీసేస్తే ప్రజల్లో అలజడి వస్తుందనే భయంతో సర్కారు వారిపై రకరకాల అభియోగాలు మోపి దశలవారీగా తొలగించాలంటూ జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కొత్త విధానం ద్వారా ‘ఉపాధి హామీ’ని అమలుచేసి 2005 నుంచి పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు, సీనియర్ మేస్త్రీలను తొలగించనున్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉపాధి హామీ పథకంలో రెండు, మూడు గ్రామాలకు కనీసం ఒక ఫీల్డ్ అసిస్టెంటు, ఒక మేస్త్రీ చొప్పున పనిచేస్తున్నారు. పెద్ద గ్రామాల్లో ఇద్దరు ఫీల్డ్ అసిస్టెంట్లు, ఇద్దరు మేస్త్రీలు పనిచేస్తున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్‌కు నెలకు రూ. ఆరు వేలు, సీనియర్ మేస్త్రీలకు రూ. మూడు వేలు ఇస్తారు. వేతనంతోపాటు వారికి కూలీల పనిదినాలు టార్గెట్‌గా ఇస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు ఉపాధి కల్పించడంతోపాటు చెరువులు, కాలువలకు మరమ్మతులు చేయిస్తున్నారు. జిల్లాలో 530 మంది తొలగింపు .. జిల్లావ్యాప్తంగా 852 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు. వీరిలో దాదాపు 530 మందిని రెండు, మూడు రోజుల్లో తొలగించనున్నారు. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు కూడా సిద్ధమైనట్లు సమాచారం. సోషల్ ఆడిట్లో అవకతవకలకు పాల్పడినవారిని, పనితీరు బాగోలేదంటూ మరికొందరిని, 75 శాతం పనులు పూర్తిచేయించడంలో విఫలమైనట్లు ఇంకొందరిపై అభియోగాలు మోపుతూ తొలగింపు ఉత్తర్వులు జారీ చేస్తారు. తొలి దశలో ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించి ఆ తర్వాత సీనియర్ మేస్త్రీలను కూడా తొలగించనున్నట్లు తెలిసింది. ఈ సమాచారం తెలియడంతో ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న వారి కుటుంబాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. -
ఏపీలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లపై వేటు
10 వేల మందిని తొలగిస్తూ ఉత్తర్వులు సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న పది వేల మందికి పైగా ఫీల్డ్ అసిస్టెంట్లను ప్రభుత్వం తొలగించింది. బుధవారం సాయంత్రం అన్ని జిల్లాల డ్వామా ప్రాజెక్టు డెరైక్టర్లకు 2614/16.7. 2014 నంబర్‌తో ప్రభుత్వం ఈ మేరకు సర్క్యులర్ జారీ చేసింది. జిల్లాల్లో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లందరినీ గురువారం నుంచే విధుల నుంచి తొలగించాలని ఆదేశించింది. ఎన్నికల ప్రచారంలో జాబు కావాలంటే బాబు రావాలని తెలుగుదేశం పార్టీ ప్రచారం చేసింది. అధికారంలోకి వస్తూనే ఇంటికో ఉద్యోగం ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నెలన్నర రోజులకే పదివేల మందికి పైగా ఫీల్డ్ అసిస్టెంట్లను ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. -
ఆదర్శ రైతులుగా తెలుగు తమ్ముళ్లు
సాక్షి, నెల్లూరు: ఆదినుంచి అక్కసుతో ఉన్న చంద్రబాబు సర్కార్ అనుకున్నదే చేసింది. ఆదర్శరైతులను తొలగించాలని నిర్ణయించింది. ఈమేరకు గురువారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో తీర్మానించింది. అయితే ఆదర్శ రైతుల వ్యవస్థను పూర్తిగా రద్దు చేశారనుకుంటే పొరపాటే. ఉన్నవారిని తొలగించి వారి స్థానంలో టీడీపీ కార్యకర్తలను ఆదర్శ రైతులుగా నియమించనున్నారు. ఇందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. క్యాబినెట్ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో 29 వేల మంది ఆదర్శరైతులు పనిచేస్తుండగా జిల్లాలో 1224 మంది ఉన్నారు. 2006 నుంచి వీరు కొనసాగుతున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ ప్రభుత్వం నియమించిందన్న అక్కసుతో ఉన్న చంద్రబాబు ఆదర్శరైతులపై అవకాశం వచ్చినప్పుడల్లా అక్కసు వెళ్లగక్కుతూనే ఉన్నాడు. అధికారంలోకి వచ్చిన వెంటనే అటు ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లతో పాటు ఇటు ఆదర్శరైతులను తొలగిస్తున్నట్లు ప్రకటించాడు. ఎన్నికల ముందు ఇంటికో ఉద్యోగం హామీతో ఓట్లేయించుకున్న బాబు, అధికారంలోకి వచ్చాక విరుద్ధంగా వ్యవహరిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నిర్ణయాల అమలు విషయంలో మొదట కొంత వెనక్కి తగ్గినట్లు కనిపించిన బాబు సర్కార్ ఫీల్డ్ అసిస్టెంట్లతో పాటు ఆదర్శరైతుల వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పింది. అయితే పట్టుమని పదిరోజులు గడవక ముందే ప్రస్తుతమున్న ఆదర్శరైతులను తొలగించాలని నిర్ణయించింది. ఇదే విషయాన్ని చంద్రబాబు విలేకరుల సమావేశంలో స్వయంగా చెప్పారు. అయితే తొలి నుంచి ఆదర్శరైతుల వ్యవస్థను తప్పుపడుతూ ఆదర్శాలు వల్లిస్తూ వస్తున్న బాబు ఇప్పుడు అసలు రంగును బయట పెట్టుకున్నాడు. చంద్రబాబు నిర్ణయంపై ఆదర్శరైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
అటు కళకళఇటు విలవిల
మన్యంలో ఆశాజనకంగా వాన మైదానంలో చినుకు కరువు 24 మండలాల్లో అతి తక్కువ వర్షపాతం కొన్ని మండలాల్లో సాధారణం కన్నా తక్కువ జిల్లాలో తొలకరి పరిస్థితి విచిత్రంగా ఉంది. ఏజెన్సీలో అడపాదడపా వర్షాలతో ఆదివాసీ రైతులు వరినాట్లుకు సిద్ధమవుతుంటే...మైదానంలో చుక్కతడి కనిపించకుండాపోతోంది. మన్యంలో వరినారుపోతలు జోరుగా సాగుతుంటే కొన్ని ప్రాంతాల్లో ఎండిన భూములు దర్శన మిస్తున్నాయి. ఈ నెలలో విశాఖ నగరంతో పాటు పాడేరు మండలంలోనే అధిక వర్షపాతం నమోదయింది. 24 మండలాల్లో అతి తక్కువ, కొన్ని మండలాల్లో తక్కువతో నిరాశపరిచింది. పాడేరు/నర్సీపట్నంరూరల్ : తొలకరికి మేలుమలుపుగా ఉండాల్సిన ఈ రోజుల్లో జిల్లాలో భిన్న పరిస్థితులు నెలకొన్నాయి. రోజూ వర్షంతో ఏజెన్సీ తడిసి ముద్దవుతుంటే,మైదానంలో ప్రతికూల పరిస్థితులు నెలకొంటున్నాయి. మైదానంలో వానలు లేక రైతులు అల్లాడుతుంటే మన్యంలో మాత్రం భారీ వర్షం పడుతోంది. ఏజెన్సీలోని 11 మండలాల్లో మే నెలలో సరాసరి 1,318 మిల్లీమీటర్లు, జూన్ నెలలో 2,339 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గిరిజన రైతుల్లో ఆనందం నెలకొంది. ఎక్కడికక్కడ వ్యవసాయ భూముల్లో వర్షపునీరు చేరింది. లోతట్టు భూములు చెరువులను తలపిస్తున్నాయి. ఖరీఫ్‌కు ఈ వర్షాలు ఎంతో మేలు చేస్తాయని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. కాగా మే నెలాఖరు నుంచే రుతుపవనాలు అనుకూలిస్తాయని ఆశించిన మైదానంలోని రైతులకు నిరాశే ఎదురయింది. ఖరీఫ్పనులను దుక్కులతోనే సరిపెట్టుకునే దుస్థితి. జూన్‌లో సాధారణ వర్షపాతం 128.8 మిల్లీమీటర్లు. 54.4 మాత్రమే నమోదయింది. విశాఖ నగరంతో పాటు ఏజెన్సీ మండలాల్లోనే అధిక వర్షం పడింది. 24 మండలాల్లో అతి తక్కువ వర్షపాతం నమోదైంది. కొన్ని మండలాల్లో సాధారణం కన్నా తక్కువ కురిసింది. మరో నాలుగు మండలాల్లో సాధారణ వర్షపాతం రికార్డయింది. ఏజెన్సీలో మాత్రం రోజూ ముమ్మరిస్తోంది. జిల్లాలో ఎక్కువ మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై ఇప్పటికే వ్యవసాయశాఖ కమిషనర్ జిల్లా యంత్రాంగంతో సమీక్షించారు. వర్షాభావ పరిస్థితిని గమనించాలంటూ సూచించారు. ఇదే కాకుండా గ్రామ స్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. మరో పది రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. -
కడుపు కొట్టకండి బాబూ..
కదిరి టౌన్/పెనుకొండ/ కళ్యాణదుర్గం రూరల్/అనంతపురం క్రైం : ‘‘ఇంటికో ఉద్యోగమిస్తామని ఎన్నికలకు ముందు హామీల మీద హామీలిచ్చారు.. తీరా అధికారంలోకి వచ్చాక ఆదర్శ రైతులు, ఫీల్డ్ అసిస్టెంట్లు.. ఇలా ఒక్కొక్కరిని తొలగించుకుంటూ పోతున్నారు. ఇదెక్కడి న్యాయం’ అంటూ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు ప్రశ్నించారు. తమను తొలగించాలని మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సోమవారం కదిరి, పెనుకొండ, కళ్యాణదుర్గం, అనంతపురంలో ఫీల్డ్ అసిస్టెంట్లు ఆందోళన బాట పట్టారు. కదిరిలో సీఐటీయూ ఆధ్వర్యంలో ఆర్అండ్బీ అతిథి గృహం నుంచి ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లి ధర్నా చేశారు. పెనుకొండలో.. డివిజన్ పరిధిలోని ఫీల్డ్ అసిస్టెంట్లు భారీ ర్యాలీ నిర్వహించారు. సీఐటీయూ నాయకులతో కలిసి బస్టాండ్ నుంచి దర్గా సర్కిల్, అంబేద్కర్ నగర్ మీదుగా ఆర్డీఓ కార్యాలయం వద్దకు చేరుకుని బైఠాయించారు. కళ్యాణదుర్గంలో ఎంపీడీఓ కార్యాలయం నుంచి టీ సర్కిల్ వరకు ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా ‘బాబు వస్తే జాబు అన్నారు.. బాబు వచ్చె.. జాబు పోయె అన్నట్లుంది పరిస్థితి.. సీఎం డౌన్ డౌన్’ అంటూ నినాదాలు చేశారు. ఆయా ప్రాంతాల్లో నాయకులు మాట్లాడుతూ రాజకీయ దురుద్దేశంతో ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగిస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. ప్రాణత్యాగానికైనా సిద్ధమని, ఉద్యోగాల్ని మాత్రం వదులుకునేది లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు నిర్ణయంతో జిల్లాలో 850 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, 200 మంది మేట్లు ఉద్యోగాలు కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం ఉద్యోగ భద్రత కల్పించాలని, సీనియర్ మేట్లను ఫీల్డ్ అసిస్టెంట్లుగా చేయాలన్నారు. నెలసరి వేతనం రూ.13 వేలకు పెంచి బకాయిలు చెల్లించాలన్నారు. ఇప్పటికే తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలన్నారు. ఏడాది కాంట్రాక్ట్ ఒప్పందాన్ని రద్దు చేయాలని, వికలాంగులైనఫీల్డ్ అసిస్టెంట్లకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కూలీల వేతన బకాయిలు చెల్లించాలని, కూలి రూ.250కు పెంచడంతో పాటు క్యూబిక్ మీటర్ రేటు పెంచాలన్నారు. అర్హులైన ఫీల్డ్ అసిస్టెంట్లకు సీఓ, టీఏ, ఏపీఓ, ఈసీ పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. కదిరిలో ఆర్డీఓ రాజశేఖర్, పెనుకొండలో ఆర్డీఓ కార్యాలయ సిబ్బందికి, కళ్యాణదుర్గంలో ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరికి వినతిపత్రాలు అందజేశారు. అనంతపురంలో యూనియన్ గౌరవాధ్యక్షుడు వెంకటేష్, అధ్యక్షుడు నరసింహులు ఆర్డీఓ హుసేన్‌సాహెబ్‌ను కలిసి పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. మంత్రి వర్గం సమావేశంలో ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించాలని ఓ శాఖ మంత్రి చేస్తున్న ప్రకటనలు వేలాది కుంటుంబాలకు తీరని ఆవేదనను మిగిల్చుతోంద ని వారన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లు అవినీతి పరులని, కోట్లకు పడగలెత్తారని మంత్రి మీడియా ముందు లేని పోని ప్రకటనలిస్తున్న తీరు అందరినీ కలచి వేస్తోందన్నారు. ఆందోళన కార్యక్రమాల్లో ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, జిల్లా సహాయ కార్యదర్శి సరస్వతి, సీఐటీయూ కదిరి డివిజన్ కార్యదర్శి జీఎల్ నరసింహులు, కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు లక్ష్మినారాయణ, పెనుకొండ డివిజన్ అధ్యక్షుడు బాబుల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బాలునాయక్, సీఐటీయూ కళ్యాణదుర్గం డివిజన్ కార్యదర్శి రంగనాథ్, రెవెన్యూ డివిజన్ అధ్యక్షుడు మురళి, మండలాధ్యక్షులు సర్వోత్తమకుమార్, పెద్ద సంఖ్యలో ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. -
గోకర్ణపల్లి.. ఖాళీ!
పొందూరు, న్యూస్‌లైన్: ఒకవైపు నారాయణపురం కుడికాలువ.. మరోవైపు మడ్డువలస కాలువ ఉన్నా పొందూరు మం డలం గోకర్ణపల్లి పంచాయతీకి నిత్యక్షామమే. ప్రకృతి వైపరీత్యాలతోపాటు మానవ తప్పిదాల కారణంగా పంటలు చేతి కందడం లేదు. పోనీ ఉపాధి హామీ పనులైన చేసుకొని ఉన్న ఊరిలో కలో గంజో తాగి బతుకుదామంటే మూడేళ్లుగా ఆ పనులు జరగడం లేదు. ఫలితంగా కుటుంబ పోషణకు ఊరు విడిచి దూరం వెళ్లక తప్పడం లేదని ఆ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముంచేస్తున్న రెల్లుగెడ్డ గ్రామానికి ముందు నారాయణపురం కుడి కాలువ.. వెనుకవైపు మడ్డువలస కాలువ ఉన్నాయి. అందువల్ల గ్రామ పంటపొలాలకు నీటి సమస్య లేదు. కానీ సమస్య ఏమిటంటే.. వర్షాకాలంలో మడ్డువలస నీరు వచ్చి నారాయణపురం కుడికాలువలో కలుస్తుంది. ఆ నీరంతా పక్కనే ఉన్న రెల్లుగెడ్డలో కలుస్తుంది. దీంతో ఒక్కసారిగా నీటి ఉద్ధృతి పెరిగి పంట పొలాలు ముంపునకు గురవుతున్నాయి. వేసిన పంటలు నాశనమవుతున్నాయి. నారాయణపురం కాలువ, రెల్లుగెడ్డ కలిసే చోట నిర్మించిన ఉపరితల చప్టా సామర్థ్యం తక్కువగా ఉండటంతో నీటి ఉద్ధృతిని అడ్డుకోలేకపోతోంది. ఫలితంగా నీరంతా పంట పొలాల్లోకి చొచ్చుకు వస్తోంది. మరోవైపు నానాపాట్లు పడి సాగు చేసే పంట చేతికొచ్చే సమయంలో ప్రతి ఏటా తుపానులు, వరదలు ముంచెత్తుతున్నాయి. ఇలా పంట నష్టపోతున్న చిన్న రైతులు ఉపాధి హామీ పనులపై ఆశలు పెట్టుకున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ లేరని..! అయితే మూడేళ్లుగా గ్రామంలో ఉపాధి పనులే జరగడం లేదు. దీనికి కారణమేమిటని ఆరా తీస్తే ఫీల్డ్ అసిస్టెంట్ లేకపోవడమే కారణమని తెలిసింది. గతంలో ఇక్కడ పని చేసిన ఫీల్డ్ అసిస్టెంట్ వేతనదారుల హాజరు ఎక్కువగా చూపడం, ప్రభుత్వం సరఫరా చేసిన గునపాలను వేతనదారులకు అందజేయకపోవడం వంటి అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో అతన్ని మూడేళ్ల క్రితం సస్పెండ్ చేశారు. ఆ తర్వాత ఏవో కారణాలతో వేరే ఫీల్డ్ అసిస్టెంట్‌ను నియమించలేదు. పర్యవేక్షించేవారు లేకపోవడంతో గ్రామానికి ఉపాధి పనులు కూడా మంజూరు చేయడం నిలిపివేశారు. ఫలితంగా పంట నష్టపోయిన చిన్న రైతులు, వ్యవసాయ కూలీలు వేసవిలో ఉపాధి పనులకు దూరమయ్యారు. పంటలు లేక.. ఉపాధి పనులకు నోచుకోక కుటుంబ పోషణ భారంగా పరిణమించడంతో వలసబాట పట్టారు. ఈ విధంగా ఇప్పటికే సుమారు 300 మంది విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, ఏలూరు, హైదరాబాద్, చెన్నై వంటి నగరాల్లో కూలి పనులకు వెళ్లిపోయారు. ప్రస్తుతం గ్రామంలో చాలా ఇళ్లు తాళాలతో వెక్కిరిస్తున్నాయి. పంటలు లేక గురుగుబెల్లి లక్షునాయుడు, రాజులు, రాము, లక్ష్మీనారాయణ, సన్యాసి, కంచరాన ధర్మేంద్ర, అర్జునరావు తదితరుల పొలాలు బీడువారాయి. గ్రామానికి ఈ దుస్థితి తప్పించాలంటే మడ్డువలస కాలువ, నారాయణ కుడి కాలువల గట్లు పటిష్టం చేయడంతో పాటు చప్టాల సామర్థ్యం పెంచాలని.. తక్షణమే ఫీల్డ్ అసిస్టెంట్‌ను నియమించి ఉపాధి హామీ పనులు చేపట్టాలని గ్రామ సర్పంచ్ సీపాన శ్రీరంగ నాయకులు, ఎంపీటీసీ సభ్యుడు సీపాన చక్రధరనాయుడు, పలువురు రైతులు కోరుతున్నారు. అప్పుడే గ్రామం మళ్లీ కళకళలాడుతుందంటున్నారు. లేని పక్షంలో ముందు ముందు గ్రామం మొత్తం ఖాళీ అయ్యే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. -
‘ఉపాధి’కీ తప్పని కాక
సాక్షి, రాజమండ్రి : అటు మండుతున్న ఎండలు, ఇటు కొత్త సర్కారు యోచన.. ఈ నేపథ్యంలో జిల్లాలో ఉపాధి హామీ పథకం పనులు కుంటుపడ్డాయి. గత వారంతో పోలిస్తే ఈ వారం పని దినాలు భారీగా తగ్గాయి. ఈ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లను ప్రభుత్వం తొలగిస్తుందన్న వార్తలతో వారిలో నెలకొన్న అభద్రత కూడా పనులు మందకొడిగా సాగడానికి కారణమయ్యాయి. ముఖ్యంగా ఉగ్రరూపంలో కొనసాగుతున్న వాతావరణమే ఈ పథకం పనులు తగ్గడానికి కారణమని అధికారులు అంటున్నారు. జూన్ ఒకటి నుంచి ఏడవ తేదీతో ముగిసిన మొదటి వారంలో జిల్లాలోని 58 మండలాల్లో 1.90 లక్షల మంది ఉపాధి పనులకు హాజరయ్యారు. అంతకు ముందు మే 25 నుంచి 31 తో ముగిసిన వారంలో 1.81 లక్షల మంది పనులకు హాజరయ్యారు. కానీ జూన్ ఎనిమిది నుంచి 14తో ముగిసిన రెండో వారంలో కేవలం 75,766 మందికి మాత్రమే పనులు కల్పించినట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. జూన్ మొదటి వారంతో పోలిస్తే లక్ష మందికి పైగానే కూలీలకు ఉపాధి పనులకు దూరంగా ఉన్నారు. పలు మండలాల్లో తగ్గిన హాజరు జిల్లాలోని పలు మండలాల్లో ఉపాధి కూలీల హాజరు గణనీయంగా తగ్గిపోయింది. ఈనెల మొదటి వారం కపిలేశ్వరపురం మండలంలో 3,800 మంది ఉపాధి పనులకు హాజరవగా రెండో వారంలో కేవలం 81 మంది మాత్రమే హాజరయ్యారు. శంఖవరం మండలంలో మొదటి వారంలో 1,250 మంది ఉపాధి పనులు చేయగా రెండో వారంలో 15 మంది మాత్రమే హాజరయ్యారు. ఏజెన్సీ ప్రాంతమైన రాజవొమ్మంగిలో జూన్ తొలి వారంలో సుమారు 6,500 మంది పనులకు హాజరు కాగా రెండో వారంలో 1,008 మంది మాత్రమే పనులు చేశారని లెక్కలు చెబుతున్నాయి. కొత్తపేట మండలంలో తొలి వారంలో 6,150 మంది పనులకు హాజరు కాగా రెండో వారంలో పనులకు హాజరైన వారి సంఖ్య 1,650 మాత్రమే. జిల్లాలో ఉపాధి పనులు జరుగుతున్న మొత్తం 1,012 గ్రామ పంచాయతీల్లో 515 పంచాయతీల్లో రూపాయి కూడా చెల్లింపులు జరగలేదు. మొత్తం 2,450 జనావాసాలకు 1,725 జనావాసాల్లో పనులు జరగలేదు. ఈ నెల ఆరంభం నుంచి ఎండలు తీవ్రంగానే ఉన్నాయి. మే నెలలో సైతం కాయని ఎండలు జూన్ రెండో వారంలో కాశాయి. ఈ వారంలో గరిష్టంగా 43 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో పనులకు హాజరయ్యేందుకు కూలీలు భయపడ్డారని అధికారులంటున్నారు. మరో వంక తెలుగుదేశం ప్రభుత్వం ఈ నెల ఎనిమిదిన విశాఖలో నిర్వహించిన తొలి కేబినెట్ సమావేశంలో ఉపాధి ఫీల్డు అసిస్టెంట్లను తొలగించాలని భావించినట్టు వార్తలు వచ్చాయి. దాంతో ఫీల్డు అసిస్టెంట్లలో నిస్పృహ, కలవరం నెలకొని, ఆ ప్రభావం కొంతమేరకు పనులపై పడింది. -
ఖర్చు తగ్గింపా.. కక్ష సాధింపా!
ఎల్.ఎన్.పేట:దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ ఉపాధి హామీ పథకం వ్యవసాయ పనులు లేని సమయాల్లో లక్షలాది గ్రామీణ ప్రాంత రైతులు, కూలీలకు ఉపాధి కల్పిస్తోంది. ఈ పనుల పర్యవేక్షణకు క్షేత్ర సహాయకుల(ఫీల్డ్ అసిస్టెంట్లు)ను నియమించారు. 2007 జూన్ 12న విధుల్లో చేరిన వీరి భవిష్యత్తు ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. ఈ పథకం కింద అధిక శాతం నిధులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ నిధులు మాత్రమే మంజూరు చేయాల్సి ఉంటుంది. ఇటీవల అధికారం చేపట్టిన టీడీపీ ప్రభుత్వం ఖర్చు తగ్గింపు పేరుతో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించే ఆలోచనను తెరపైకి తెచ్చింది. ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు పలుమారు ఇటువంటి ప్రకటనలు చేయడంతో ఫీల్డ్ అసిస్టెంట్లు ఆందోళనకు గురవుతున్నారు. 8 ఏళ్లుగా సేవలు ఉపాధి హామీ పథకం ప్రారంభమైనప్పటి నుంచి .. గత ఎనిమిదేళ్లుగా ఫీల్డ్ అసిస్టెంట్లు పని చేస్తున్నారు. సగటున ఒక్కో పంచాయతీకి ఒక ఫీల్డ్ అసిస్టెంట్‌ను అప్పట్లో నియమించారు. ఆ లెక్కన ప్రస్తుతం జిల్లాలో 1103 మంది పని చేస్తున్నారు. ప్రారంభంలో రూ.1200 వేతనం పొందిన వీరికి ప్రస్తుతం రూ.5,440 లభిస్తోంది. ఇది కాకుండా వేతనదారులతో ఎక్కువ పని దినాలు చేయిస్తే ప్రోత్సాహకాలు ఇస్తారు. నెలకు 2వేల పని దినాలు చేయించిన వారికి రూ.250, 5వేల పని దినాలు చేయించిన వారికి రూ.500 అదనంగా ఇస్తున్నారు. ఈ అరకొర జీతాలతోనే నిత్యం ఎండ లో ఉంటూ వేతనదారులతో పనులు చేయిస్తూ పథ కం లక్ష్యాలు సాధించేందుకు ఫీల్డ్ అసిస్టెంట్లు కృషి చేస్తున్నారు. ఇచ్చేది తక్కువ జీతమే అయినా.. ప్రస్తుతం రెగ్యులర్ కాకపోయినా భవిష్యత్తులోనైనా తమను పర్మినెంట్ చేస్తారన్న కొండంత ఆశతో ఉన్న వీరికి కొత్త ప్రభుత్వ ఆలోచనలు మింగుడు పడటంలేదు. కక్ష సాధింపునకేనా? వాస్తవానికి ఎన్నికలకు ముందు ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చిం ది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్లేటు ఫిరాయించింది. ఎన్నికల్లో కొందరు ఫీల్డ్ అసిస్టెంట్లు టీడీపీకి వ్యతిరేకంగా పనిచేశారని భావించడమే దీనికి కారణమని తెలిసింది. అయితే ఎవరో కొందరు వ్యతిరేకంగా పని చేసినంత మాత్రాన అందరినీ తొలగించడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. ఉన్న పళంగా తమను తొలగిస్తే తమ కుటుంబాలు రోడ్డున పడతాయని, అందువల్ల ఆలోచనను విరమించుకోవాలని ఫీల్డ్ అసిస్టెంట్లు కోరుతున్నారు. -
బాబు మార్కు కోతలు
‘ఏరు దాటే వరకు ఓడ మల్లన్న.. ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న’ అన్న చందంగా తయారైంది రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి తీరు. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆల్‌ఫ్రీ అంటూ అబద్ధాలతో ప్రచారం హోరెత్తించి అధికారం చేపట్టిన ఆయన ఇప్పుడు తన విశ్వరూపం చూపిస్తున్నాడు. ఓట్ల కోసం కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని ప్రకటించడంతో పాటు ఇంటికో ఉద్యోగం ఇస్తామని మభ్యపెట్టిన చంద్రబాబు తీరా అధికారంలోకి వచ్చాక ఉన్న ఉద్యోగాలకే ఎసరు పెడుతున్నారు. ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లతో పాటు ఆదర్శ రైతులను తొలగించాలని వైజాగ్‌లో గురువారం జరిగిన తొలి కేబినెట్ సమావేశంలోనే నిర్ణయించడం బాబు మారలేదనే విషయాన్ని తెలియజేస్తోంది. సాక్షి, నెల్లూరు : దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రవేశపెట్టిన ఆదర్శరైతు వ్యవస్థను రద్దు చేసేందుకు చంద్రబాబు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లను కూడా తొలగించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా ఆదర్శ రైతులు, ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించే ప్రక్రియకు అధికారులు శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. పాలనలో పారదర్శకత పాటిస్తానని చెబుతున్న చంద్రబాబు..పథకంలో ఉన్న లోపాలను సరిదిద్దడానికి బదులుగా ఆ వ్యవస్థనే రద్దు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. తెలుగు తమ్ముళ్లకు అవకాశం కల్పించే ఉద్దేశంతోనే ఈ రెండు వ్యవస్థలను రద్దుచేసి వాటి స్థానంలో కొత్త విధానాలను అమలులోకి తేవాలని యోచనలో ఉన్నట్లు సమాచారం. గతంలో ఏ ప్రభుత్వమూ చేయని విధంగా ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అన్నదాతకు సలహాల కోసం.. రైతులకు సాగుకు సంబంధించిన సూచనలు అందజేసేందుకు మండలంలోవున్న ఒకే ఒక్క అధికారి సరిపోరనే ఉద్దేశంతో 2007 మార్చిలో వైఎస్ రాజశేఖరరెడ్డి ఆదర్శరైతు వ్యవస్థను ప్రవేశపెట్టారు. క్షేత్రస్థాయిలో రైతులకు సలహాలు అందజేసేందుకు జిల్లాలో 1,414 మంది ఆదర్శ రైతుల్ని నియమించారు. వీరికి నెలకు వెయ్యి రూపాయల గౌరవ వేతనం ప్రకటించారు. రైతులకు తగు సలహాలు ఇచ్చి అధిక దిగుబడులు సాధించడం వీరి నియామక ప్రధాన ఉద్దేశం. ప్రస్తుతం జిల్లాలో 1,224మంది ఆదర్శ రైతులు కొనసాగుతున్నారు. వీరందరిని ఇంటికి పంపేం దుకు టీడీపీ ప్రభుత్వం సమాయత్తమైంది. ఫీల్డ్ అసిస్టెంట్ వ్యవస్థ కూడా రద్దే: ఉపాధి హామీ పథకం అమలుకు సంబంధించి ప్రతి ఒక్క పంచాయతీకి ఒక ఫీల్డ్ అసిస్టెంట్‌ను నియమించారు. వీరు గ్రామీణప్రాంతాల్లో ఉపాధి హామీ పనుల్ని పర్యవేక్షిస్తుంటారు. వీరిలో కూడా అధిక సంఖ్యలో గత ప్రభుత్వ మనుషులు ఉన్నారనే ఉద్దేశంతో రద్దు చేసేందుకు కేబినెట్ నిర్ణయించింది. వీరి స్థానంలో తెలుగు తమ్ముళ్లను నియమించుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో 921 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు. వారిలో ఇప్పటికే పలువురిని తొలగించగా 500 మందికి పైగా కొనసాగుతున్నారు. కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్న వారిని రెగ్యులర్ చేస్తామని చంద్రబాబు హామీ ఇవ్వడంతో వీరంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వీరు కూడా అతి కొద్దిరోజుల్లోనే తమ ఉద్యోగాలు కోల్పోయి వీధుల్లో పడే పరిస్థితి నెలకొంది. మరోవైపు వివిధ ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న వారి కొనసాగింపుపైనా నీలినీడలు అలుముకున్నాయి. ఓవైపు పింఛన్ మొత్తాన్ని పెంచుతున్నామని ప్రకటించిన ప్రభుత్వం ఇంకోవైపు వివిధ రకాల సాకులతో పింఛన్ లబ్ధిదారులను తగ్గించే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. ఎన్నికల ముందు ఒకలా, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకోలా వ్యవహరిస్తున్న చంద్రబాబు తీరుపై జిల్లా ప్రజలు మండిపడుతున్నారు. -
‘ఉపాధి’లో అక్రమాలు
నవాబుపేట, న్యూస్‌లైన్: మండలంలో 2013 మార్చి నుంచి 2014 మార్చి వరకు పలు గ్రామాల్లో చేపట్టిన (పూడికతీత, రాతి కట్టలు తదితర పనులు) ఉపాధి హామీ పనుల్లో అవకతవకలు జరిగినట్లు వెల్లడైంది. రూ.3.5 కోట్ల పనులు, పింఛన్లపై వారం రోజులుగా సామాజిక తనిఖీ నిర్వహించారు. తనిఖీలో వెల్లడైన అంశాలపై బుధవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో మండల స్థాయి సమావేశం (ప్రజా వేదిక) నిర్వహించారు. ఈ సందర్బంగా తనిఖీ బృందాలు గ్రామాల్లో నిర్వహించిన రికార్డులను సమావేశంలో చదివి వినింపించారు. మండలంలోని అక్నాపూర్ ఫీల్డ్ అసిస్టెంట్, సీఎస్పీలను తొలగించాలని గ్రామస్తులు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. మండలంలోని అన్ని గ్రామాల్లో సీఎస్పీలు డబ్బులు వచ్చినప్పటికీ సకాలంలో ఇవ్వడం లేదని కూలీలు సామాజిక తనిఖీ బృందానికి ఫిర్యాదు చేశారు. చాలా గ్రామాల్లో మస్టర్, పే ఆర్డర్, ఎంబీలలో ఏపీవో, టీఏల సంతకాలు లేవని తనిఖీ బృందం సభ దృష్టికి తీసుకువచ్చింది. యావాపూర్ ఫీల్డ్ అసిస్టెంటును తొలగించాని గ్రామస్తులు డిమాండ్ చేశారు. మాదిరెడ్డిపల్లిలో రూ.1400, అక్నాపూర్‌లో రూ.500, లింగంపల్లిలో రూ.700, కేశపల్లిలో రూ. 500, ఆర్కతలలో రూ.1150, ఇలా అన్ని గ్రామాల్లో మొత్తం రూ.9,775 అవినీతి జరిగినట్లు గుర్తించారు. అవినీతికి బాధ్యులైన ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్ల వద్ద రికవరీ చేయాలని ఉపాధి హామీ జిల్లా ఫైనాన్స్ మేనేజర్ ప్రభాకర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. అక్రమాలు జరిగిన గ్రామాల్లో ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. కూలీల డబ్బులు కాజేసిన పూలపల్లి సీఎస్పీ సబిత, మమ్మదాన్‌పల్లి సీఎస్పీ పల్లవిలను విధుల నుంచి తొలగించారు. ఉపాధి హామీలో అక్రమాలకు బాధ్యులైనవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదని జిల్లా విజిలెన్స్ అధికారి గుప్తా హెచ్చరించారు. కార్యక్రమంలో ఏపీవో లక్ష్మీదేవి, ఉష, ఆయా గ్రామాల సర్పంచులు, తనిఖీ బృందం సభ్యులు, కూలీలు పాల్గొన్నారు.