విద్యుదాఘాతంతో రైతు మృతి
సిరికొండ : సిరికొండ మండలం చీమన్‌పల్లి గ్రామంలో రైతు సింగిరెడ్డి ఎల్లయ్య(50) విద్యుదాఘాతంతో మృతి చెందాడు. ఎల్లయ్య శుక్రవారం సాయంత్రం పొలం వద్దకు వెళ్లాడు. విద్యుత్ తీగలను సరి చేస్తుండగా షాక్‌కు గురై అక్కడికక్కడే మరణించాడు. రాత్రి వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పొలం వద్దకు వెళ్ళి శవాన్ని గుర్తించారు.