విధుల నుంచి సస్పెండ్ అయిన ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ లు కర్నూలు కలెక్టరేట్ ముందు మంగళవారం ధర్నాకు దిగారు.
విధుల నుంచి సస్పెండ్ అయిన ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ లు కర్నూలు కలెక్టరేట్ ముందు మంగళవారం ధర్నాకు దిగారు. కూలీలకు నిబంధనల మేరకు ఉపాధి కల్పించడంలో విఫలమయ్యారంటూ 60 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల నుంచి తొలగిస్తూ గత నెల 23న డ్వామా పీడీ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే విధుల నుంచి సస్పెండ్ అయిన 60 ఫీల్డ్ అసిస్టెంట్ లు ధర్నాలో పాల్గొన్నారు. తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.