ఆందోళన చేస్తున్న శిరీష, తల్లిదండ్రులు
కర్నూలు, నందికొట్కూరు: వరకట్న వేధింపులు తాళలేక ఓ మహిళ కుటుంబ సభ్యులతో కలిసి గురువారం పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగింది. బాధితురాలు తెలిపిన వివరాలు.. పోలీసు స్టేషన్‌కు వెళ్లిన బాధిత మహిళ ఫిర్యాదు ఎవరు పట్టించుకోకపోవడంతో శిరీషతో పాటు కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. మండల పరిధిలోని కొణిదేల గ్రామానికి చెందిన గొల్ల లక్ష్మన్న, పార్వతమ్మ కూతురు శిరీషను మండల కేంద్రానికి చెందిన రాముడు, నాగేశ్వరమ్మ కుమారుడు రాజశేఖర్‌కు ఇచ్చి మూడు నెలల క్రితం వివాహం చేశారు. కొంతకాలంగా భర్త రాజశేఖర్‌తోపాటు అత్త నా గేశ్వరమ్మ, మామ రాముడు, ఆడపడుచు ఉమామహేశ్వరి కట్నం కోసం వేధిస్తున్నారు.
వేధింపులు తాళలేక వారం క్రితం ఎలుకల మందు తాగి ఆత్మహత్యకు యత్నించగా, కుటుంబ సభ్యులు కర్నూలు ఆస్పత్రిలో చికిత్స చేయించడంతో ప్రాణాపాయం తప్పింది. డిశ్చార్జ్ అయిన వెంటే కుటుంబ సభ్యులతో కలిసి గురువారం పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని భర్త, అత్త, మామ, ఆడపడుచుపై చర్యలు తీసుకోవాలని సీఐ నాగరాజారావుకు శిరీష ఫిర్యాదు చేసింది. అనంతంర అక్కడే ఆందోళనకు దిగింది. న్యాయం చేస్తామని సీఐ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
Comments
Please login to add a commentAdd a comment