Extra dowry
-
వరకట్న .. వేధింపులు తాళలేక..
హైదరాబాద్, ఉప్పల్: వరకట్న వేధింపులు తాళలేక ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. యాదాద్రి జిల్లా, మోత్కూరు మండలం, పాటిమట్ల గ్రామానికి చెందిన భోరెడ్డి రాజశేఖర్ రెడ్డికి గుండాల మండలం, సీతారాంపురం గ్రామానికి చెందిన మలిపెద్ది రవళి(25)తో 2019లో వివాహం జరిగింది. బతుకుదెరువు నిమిత్తం నగరానికి వలస వచ్చిన వారు ఉప్పల్‌లోని చిలుకానగర్‌లో ఉంటూ ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గత కొన్నేళ్లుగా రవళిని అత్తమామలు, ఆడబిడ్డలు అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు. పలు మార్లు పెద్ద మనుషులు జోక్యం చేసుకుని నచ్చజెప్పినా వారి వైఖరి మారలేదు. ఏడాది క్రితం రాజశేఖర్ రెడ్డి భార్యను వదిలేసి స్వగ్రామానికి వెళ్లి పోయాడు. అప్పటి నుంచి రవళి ఒంటరిగా ఉంటోంది. ఈ నేపథ్యంలో మనస్తాపానికి లోనైన ఆమె శనివారం రాత్రి ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం గాంధీ అసుపత్రికి తరలించారు. వరకట్న వేధింపుల కారణంగానే తన కుమార్తె అత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లి రజిత ఉప్పల్ పోలీస్‌స్టేషన్ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గత కొంత కాలంగా పిల్లలిద్దరూ తండ్రి వద్దనే ఉంటున్నట్లు సమాచారం. -
'అమ్మ, నాన్నను కలపండి సారూ..’: శాన్విత
సాక్షి, తాడిపత్రి: అదనపు కట్నం తీసుకురాలేదన్న కక్షతో భార్యను, కన్నబిడ్డను నిర్దాక్షిణ్యంగా ఇంటి నుంచి గెంటేశాడు. అనంతరం తల్లిని, చెల్లిని వెంటబెట్టుకుని ఇంటికి తాళం వేసి ఉడాయించాడు. రాత్రంగా చలిలోనే భర్త ఇంటి ఎదుట బిడ్డతో కలిసి బాధితురాలు నిరీక్షించింది. తాడిపత్రిలో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించి బాధితురాలు శ్రుతి వేదన ఆమె మాటల్లోనే.. ‘మాది రాయదుర్గం. నాన్న బి.భాస్కర్, అమ్మ శకుంతల. 2014లో నాకు తాడిపత్రిలోని సంజీవనగర్ మూడో రోడ్డుకు చెందిన డి.శ్రీకృష్ణ కిషోర్‌తో వివాహం జరిగింది. ఆ సమయంలో రూ.2లక్షల కట్నంతో పాటు 18 తులాల బంగారు నగలను మా తల్లిదండ్రులు ఇచ్చారు. అప్పట్లో ఆయన శ్రీరామ్ చిట్‌ఫండ్ కంపెనీలో ఉద్యోగం చేసేవారు. కొన్ని నెలలు మా జీవితం సాఫీగానే సాగింది. 2015లో ఆయన ఉద్యోగాన్ని వదిలేశారు. అదే ఏడాది డిసెంబర్లో మాకు కుమార్తె శాన్విత జన్మించింది. ఉద్యోగం లేక ఖాళీగా ఇంటి పట్టునే ఉంటున్న నా భర్త, అతని తల్లి లక్ష్మీదేవి, చెల్లెలు అర్చన (2012లో కర్నూలుకు చెందిన వ్యక్తితో వివాహమై భర్తను వదిలి పుట్టింటిలోనే ఉంటోంది) నన్ను తరచూ అదనపు కట్నం కోసం వేధించేవారు. రూ. 5లక్షలు తీసుకుని రావాలంటూ పుట్టింటికి పంపారు. అయితే అంత పెద్ద మొత్తం తామిచ్చుకోలేమని అల్లుడికి మా అమ్మ తెలిపింది. అయితే మీ కూతురిని మీ ఇంట్లోనే పెట్టుకోండి అంటూ పుట్టినింటిలోనే నన్ను వదిలేసి వచ్చేశారు. పెద్దల జోక్యంతో తిరిగి అత్తింటికి చేరుకున్నా.. అప్పటి నుంచి నాపై వేధింపులు ఎక్కువయ్యాయి. చదవండి: (అనంతపురం టీడీపీలో భగ్గుమంటున్న వర్గ విభేదాలు) విడాకులకు దరఖాస్తు.. నాకు తెలియకుండానే మా ఆయన 2018లో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయం తెలిసి ఎందుకు ఇలా చేస్తున్నారని ప్రశ్నించాను. దీంతో శనివారం రాత్రి నా భర్త కృష్ణకిషోర్‌తో పాటు వారి అమ్మ, చెల్లెలు నన్ను, పాపను కొట్టి ఇంట్లోనుంచి బయటకు గెంటేశారు. రాత్రి చలికి తట్టుకోలేకపోయాం. దిక్కుతోచని స్థితిలో 100కు కాల్ చేయడంతో పోలీసులు వచ్చారు. నా భర్తకు నచ్చజేప్పేందుకు సీఐ కృష్ణారెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. అయినా వారు వినలేదు పైగా తన తల్లిని, చెల్లిని వెంటబెట్టుకుని ఇంటికి తాళం వేసి ఎక్కడికో వెళ్లిపోయారు. శనివారం రాత్రంతా ఇలా ఇంటి బయటే ఉండిపోయా. నా భర్తకు నచ్చచెప్పి మా కాపురాన్ని నిలబెట్టండి.’ అమ్మా నాన్నను కలపండి సారూ ‘మా డాడీ మా అమ్మను వదిలేసి పోతానంటున్నాడు. నాకేమో డాడీ, మమ్మీ ఇద్దరూ కావాలి. మా అమ్మ, నాన్నను కలపండి సారూ..’ – శాన్విత చదవండి: (16 ఏళ్లకే నూరేళ్లు నిండిన ఓ ఆడబిడ్డ ఆక్రందన ఇది..!) -
ఆస్ట్రేలియా నుంచి రప్పించి మరీ ఎన్నారై అరెస్టు
సాక్షి, నల్లగొండ : ఓ ఎన్ఆర్ఐ భర్తను పోలీసులు అరెస్టు చేశారు. నల్లగొండ జిల్లా నకిరేకల్‌కు చెందిన బిందుశ్రీకి గత ఏడాది ఆగస్టు 6న ఆస్ట్రేలియాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న హైదరాబాద్‌కు చెందిన మందుగుల సురేశ్‌తో పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. అనంతరం ఆస్ట్రేలియాకు వెళ్లిన సురేశ్ తిరిగి రాలేదు. దీనికితోడు బిందుశ్రీని అత్తింటివారు వేధింపులకు గురిచేశారు. దీంతో ఆమె నల్లగొండ మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. సురేశ్ పాస్‌పోర్టును సీజ్ చేసేలా పాస్‌పోర్టు కార్యాలయానికి, తెలంగాణ సీఎంఓ, జిల్లా పోలీసుల ద్వారా ఇండియన్ ఎంబసీతోపాటు ఆస్ట్రేలియా ఎంబసీకి సీఐ రాజశేఖర్‌గౌడ్ ఈ–మెయిల్ పంపారు. ఎల్ఓసీ లేఖలు పంపడంతో పాటు సురేశ్ ఆస్ట్రేలియాలో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ కంపెనీ వివరాలు సేకరించి సీఈఓకి మెయిల్ చేశారు. ఎంబసీ అధికారులతో, కంపెనీ సీఈఓతో మాట్లాడి సురేశ్‌ను ఉద్యోగం నుంచి తొలగించేలా చేసి, చివరకు ఇండియాకు రప్పించారు. ఉద్యోగం కోల్పోయిన సురేశ్ ఈ నెల 2న ఆస్ట్రేలియా నుంచి ఢిల్లీకి వచ్చాడు. అక్కడ ఇమ్మిగ్రేషన్ అధికారుల సహకారంతో జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసును కొలిక్కి తెచ్చిన సీఐ రాజశేఖర్‌గౌడ్‌ను ఎస్పీ రంగనాథ్ అభినందించారు. -
అనుమానాస్పదంగా పంచాయతీ కార్యదర్శి మృతి
సాక్షి, మల్యాల(చొప్పదండి): పంచాయతీ కార్యదర్శి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మండలంలోని గొర్రెగుండం జూనియర్ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న కోమలత(29) ఆదివారం అర్ధరాత్రి రామన్నపేట గ్రామంలోని అత్తగారింట్లో లాట్రిన్ గదిలో కాలిపోయి మృతి చెందింది. మృతురాలి కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. వెల్గటూర్ మండలం గొడిశెలపేటకు చెందిన కోమలతకు నాలుగేళ్లక్రితం మల్యాల మండలం రామన్నపేటకు చెందిన కొండ గణేశ్‌తో వివాహమైంది. వీరికి మూడేళ్ల కొడుకు హిమాన్షు ఉన్నాడు. వివాహ సమయంలో గణేశ్‌కు రూ.6 లక్షల కట్నం ఇచ్చారు. అయితే మరో రూ.2 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, పంచాయతీ కార్యదర్శి ఉద్యోగంతో వచ్చే వేతనం తన సొంతానికి వినియోగించుకుంటున్నాడు. ఇటీవలే కోమలత సోషియాలజీలో పీహెచ్డీ ఫెలోషిప్‌కు ఎంపిక కాగా, మార్చి నుంచి ఫెలోషిప్ కోసం వచ్చే రూ. 40వేలు కూడా తనకే ఇవ్వాలంటూ, అదనపు కట్నం కావాలంటూ వేధించేవాడు. ఆదివారం అర్ధరాత్రి సైతం తనను వేధిస్తున్నాడని కుటుంబ సభ్యులతో కోమలత మొరపెట్టుకుంది. సోమవారం ఉదయం వస్తామని, గొడవపడొద్దంటూ కుటుంబ సభ్యులు సర్ధిచెప్పారు. అంతలోనే ఇంత ఘోరం జరిగిందని మృతురాలి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. అర్ధరాత్రి సమయంలో తమ కూతురును హత్య చేసి, కాల్చివేశాడంటూ ఆరోపించారు. మృతికి కారణమైనవారు వచ్చే వరకు శవాన్ని తరలించేది లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులతో ఎస్సై నాగరాజు మాట్లాడి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. సంఘటన స్థలాన్ని తహసీల్దార్ శ్రీనివాస్, డీఎస్పీ వెంకటరమణ, సీఐ కిశోర్, ఎంపీడీఓ శైలాజరాణి సందర్శించారు. తమ కూతురు మృతికి భర్త గణేశ్, అత్త శారద, ఆడబిడ్డలు రజని, లావణ్యలే కారణమంటూ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. -
‘నా కూతురిని పొట్టనపెట్టుకున్నారు’
సాక్షి, పెద్దపల్లి : ‘నా కూతురు మానసను అత్తింటివారే హత్యచేసి ఆత్మహత్య చేసుకుందని చిత్రీకరిస్తున్నారని’ఇటీవల అనుమానాస్పదస్థితిలో మృతిచెందిన తిప్పర్తి మానస తల్లి మంజుల మహిళా కమిషన్ సభ్యురాలు కటారి రేవతిరావుతో బుధవారం మొరపెట్టుకుంది. మానస అత్తింటి వారిని చట్టరీత్యా శిక్షించాలని తన కూతురు చావుకు కారణమైన అత్త మామ, ఆడపడుచులను అరెస్టు చేసి న్యాయం చేయాలని వినతిప్రతం సమర్పించింది. పెగడపల్లి గ్రామానికి చెందిన మూల మల్లారెడ్డి మంజుల పెద్దకూతురు మానసను 8ఇంక్లైన్ కాలనీలోని తిప్పర్తి లక్ష్మారెడ్డి పుష్పలత రెండో కుమారుడు సతీష్‌రెడ్డితో 2018వ సంవత్సరం జూలై ఆరో తేదీన వివాహం జరిపించారు. వీరికి ఏడాది వయసున్న బాబు ఉన్నాడు. పెళ్లి సమయంలో కట్నం కింద రూ.6 లక్షల నగదు, 20 తులాల బంగారం ముట్టజెప్పారు. బాబు పుట్టినప్పటి నుంచి అదనంగా మరో రూ.20 లక్షలు అదనపు కట్నం కావాలని అత్తింటి వారు వేధింపులకు గురి చేశారు. ఇటీవల పెగడపల్లి గ్రామంలో పంచాయితీ కూడా జరిగింది. మానసను బాగా చూసుకుంటామని నమ్మించి కాపురానికి తీసుకెళ్లారు. ఈ నెల 10వ తేదీన బాబు పుట్టిన రోజు వేడుకకు 8ఇంక్లైన్కు రమ్మని మానస పుట్టింటి వారికి కబురు చేశారు. పథకం ప్రకారం మానసను ఒక రోజు ముందే ఈనెల 9వ తేదీన 8ఇంక్లైన్ కాలనీలోని క్వార్టరు నంబరు టి2–151లో ఉరివేసి చంపి ఆత్మహత్య చేసుకుందని డ్రామాకు తెరదించారన్నారు. అత్త పుష్పలత, మామ లక్ష్మారెడ్డి, ఆడపడుచు రజితను చట్టరీత్యా శిక్షించి న్యాయం చేయాలని రేవతిరావుకు మానస తల్లి మంజుల మొరపెట్టుకుంది. బాధిత కుటుంబాన్ని రేవతిరావు ఓదార్చారు. న్యాయం చేస్తామని హామీఇచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం కృషి చేస్తుందన్నారు. మహిళలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా తనకు ఫోన్ చేయాలని 99493 31939 నంబర్ ఇచ్చారు. తొలిసారిగా కాల్వశ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామానికి వచ్చిన రేవతిరావును గ్రామస్తులు సన్మానించారు. ఆమె వెంట ఎంపీపీ సంపత్, జెడ్పీటీసీ తిరుపతిరెడ్డి, ఎంపీటీసీ నిర్మల, నాయకులు, గ్రామస్తులు ఉన్నారు. -
భార్యను కాల్ గర్ల్‌గా చిత్రించి..
తిరుపతి క్రైం/సాక్షి,అమరావతి: అదనపు కట్నం కోసం ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను మానసికంగా హింసించాడు. భౌతికంగా వేధింపులకు దిగాడు. తన హింసను భరిస్తూ వస్తున్న భార్యను చివరకు కాల్ గర్ల్‌లా చిత్రించాడు. వెబ్సైట్లలో తాను భార్యతో సన్నిహితంగా ఉన్న వీడియోలను ఉంచి తనలో క్రూరత్వాన్ని బయటపెట్టాడు. వేధింపులను తట్టుకోలేకపోయిన భార్య ఎదురుతిరిగింది. పోలీసులకు సమాచారం అందడంతో నిందితుడిని అరెస్టు చేశారు. తిరుపతిలో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. టీటీడీలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న తిమ్మినాయుడుపాళెంకు చెందిన రేవంత్ నాలుగు నెలల క్రితం నిరోషాను ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లిచేసుకున్నాడు. పెళ్లి సందర్భంగా అమ్మాయి తల్లిదండ్రులు రూ. 10 లక్షల విలువైన బంగారం, రూ. 10 లక్షల నగదు కట్నంగా ఇచ్చారు. అయితే పెళ్లయిన కొద్ది రోజుల తర్వాత నుంచే అదనపు కట్నం తేవాలని భార్యను రేవంత్ వేధించడం మొదలుపెట్టాడు. భౌతికదాడులు చేశాడు. అంతేగాక తన భార్యతో సన్నిహితంగా ఉన్న కొన్ని ఫోటోలను, వీడియోలను వెబ్సైట్లలో ఉంచి ఆమెను కాల్‌గర్ల్‌గా చిత్రీకరించాడు. భర్త వేధింపులను నిరోషా తాళలేక ఎదురుతిరిగింది. ఆమెకు అండగా బంధువులు, స్థానికులు నిలబడ్డారు. రేవంత్ ఇంటికి వారు వచ్చేలోపు సమాచారం అందుకున్న అలిపిరి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నిరోషాకు మద్దుతుగా వచ్చిన వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. బాధితురాలు నిరోషాతో అర్బన్ జిల్లా ఎస్పీ ఆవుల రమేష్‌రెడ్డి ఫోన్లో మాట్లాడారు. ఇప్పటికే దిశా పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశామని చెప్పారు. ఈ కేసు విచారణకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఎస్పీ ఆదేశాల మేరకు నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. మహిళా కమిషన్ సీరియస్ భార్యను కాల్ గర్ల్‌గా చిత్రించిన ఘటనపై మహిళా కమిషన్ సీరియస్ అయింది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీని కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ కోరారు. బాధితురాలితో మాట్లాడి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. -
వివాహేతర సంబంధం.. ఎలుకల మందు తాగిన భార్య
సాక్షి, తొగుట(దుబ్బాక): అదనపు కట్నం వేధింపులు భరించలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని ఎల్లారెడ్డిపేట గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. తొగుట ఎస్ఐ సామ శ్రీనివాస్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన మన్నె భాస్కర్‌కు సిద్దిపేట మండలంలోని రంగధాంపల్లి గ్రామానికి చెందిన మహేశ్వరి (21)తో ఏడాది క్రితం వివాహమైంది. భాస్కర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతడు మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని భార్యను నిత్యం వేధింపులకు గురిచేసేవాడు. తరచూ ఆ మహిళతో సెల్ఫోన్లో మాట్లాడేవాడు. తల్లి అండవ్వతో కలిసి వేధించేవాడు. వారి వేధింపులు భరించలేక ఆదివారం ఇంటిలో ఎలుకల మందు తీసుకొంది. చికిత్స కోసం ఆమెను సిద్దిపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి తండ్రి ఐరేని నర్సయ్య ఫిర్యాదు మేరకు భాస్కర్, అండవ్వపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: (సహోద్యోగిని స్నానం చేస్తుండగా వీడియో తీసి..) -
మార్చి లో పెళ్లి.. ఆగస్టులో ఆత్మహత్య
పటాన్చెరు టౌన్: వరకట్న వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన అమీన్పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పటాన్చెరు పరిధిలోని బండ్లగూడకు చెందిన శివశంకర్, ఆమీన్పూర్ పరిధిలోని ఐలాపూర్‌కు చెందిన స్వాతి (21)తో ఈ ఏడాది మార్చి 13న వివాహం జరిగింది. కాగా వివాహం జరిగినప్పటి నుంచి వరకట్నం కోసం వేధించే వారని మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. ఈ క్రమంలో గురువారం భర్త శివశంకర్ భార్య (మూడు నెలల గర్బిణి)కు అనారోగ్యంగా ఉందని స్వాతి తండ్రికి చెప్పడంతో వచ్చి ఐలాపూర్‌కు తీసుకెళ్లారు. దీంతో శుక్రవారం ఉదయం తల్లిదండ్రులు అదనపు కట్నం ఇవ్వలేరని, మనస్తాపం చెందిన స్వాతి ఇంట్లో ఫ్యాన్‌కి చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీంతో సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాని పోస్టుమార్టం నిమిత్తం పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్వాతి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్త శివశంకర్, అత్త భారతమ్మ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తునట్లు పోలీసులు తెలిపారు. -
అత్తింటి వేధింపులకు వివాహిత బలి
పంజగుట్ట: అత్తింటి వేధింపులు భరించలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన పంజగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు... యూసూఫ్‌గూడకు చెందిన షేక్ నిస్సార్ అహ్మద్ కూతురు షాజియా తర్నూమ్(25)కి, ఎమ్ఎస్ మక్తాకు చెందిన ఆసియా బేగం కుమారుడు మహ్మద్ ఉమర్ (30)కి 2017వ సంవత్సరంలో వివాహం జరిగింది. పెళ్లి జరిగిన కొద్ది రోజుల్లోనే భర్త, అత్త జమీర్ సోదరులు చిన్నచిన్న విషయాలకు దూషించడం, వేధింపులకు గురిచేయడం చేస్తుండే వారని బాధితురాలి తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. అదనపు కట్నం తీసుకురావాలని వేధించేవారన్నారు. ఈ నెల 19వ తేదీన రాత్రి 8:30 గంటలకు ఉమర్ షేక్‌నిస్సార్‌కు ఫోన్‌చేసి మీ కూతురు ఇంట్లో ఉరి వేసుకుందని, వెంటనే కిందకు దింపి సోమాజిగూడ డక్కెన్ ఆస్పత్రికి తరలించామని కాని అప్పటికే ఆమె మృతి చెందిందని చెప్పాడు. దీంతో షేక్ నిస్సార్ తన కూతురు ఆత్మహత్యకు భర్త, అత్త, మరిది, బావల వేధింపులే కారణమంటూ పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
భర్త ఇంటి ఎదుట మొదటి భార్య వంటావార్పూ
హుజూరాబాద్‌రూరల్: కాపురానికి తీసుకెళ్లాలని కోరుతూ మండలంలోని కందుగుల గ్రామంలో ఓ భార్య, భర్త ఇంటి ఎదుట మౌనదీక్షకు దిగింది. గ్రామస్తులు, బాధితురాలి వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వినోద్‌తో కమలాపూర్ గ్రామానికి చెందిన పుల్ల సుధకు ఆరేళ్లక్రితం వివాహం జరిగింది. వీరికి ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. పెళ్లి సమయంలో సుమారు రూ.8 లక్షల కట్నం ఇచ్చారు. ఈక్రమంలోనే కొన్నినెలలుగా వినోద్ అదనపు కట్నం తేవాలని వేధించసాగాడు. కట్నం తేవాలని భార్య సుధను పుట్టింట్లో వదిలివెళ్లగా, పలుమార్లు పంచాయితీ నిర్వహించినా మార్పులేదని తెలిపారు. ఈ క్రమంలోనే ఏడాదిక్రితం హుజూరాబాద్ మండలంలోని తుమ్మనపల్లి గ్రామానికి చెందిన సుమలతను వినోద్ వివాహం చేసుకొని హైదరాబాద్ వెళ్లాడు. కందుగుల గ్రామానికి భర్త వచ్చిన విషయాన్ని తెలుసుకున్న మొదటి భార్య సుధ భర్త ఇంటి ఎదుట మూడురోజుల నుంచి మౌన దీక్ష చేపట్టింది. భర్త ఇంటి ఎదుట వంటావార్పూ చేస్తూ నిరసన వ్యక్తం చేస్తోంది. -
స్రవంతిది హత్యా.. ఆత్మహత్యా..?
చందానగర్: మహిళ ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చందానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ అహ్మద్ పాషా సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. కామారెడ్డికి చెందిన విశ్వనాథ్, పద్మజ కుమారుడు కంకణాల సంతోష్‌కు, శ్రీకాకుళం రాజాంకు చెందిన మోహన్‌రావు, విజయల రెండవ కూతురు స్రవంతి(31)లకు 2017 అక్టోబర్‌లో వివాహం జరిగింది. వారికి రెండు సంవత్సరాల కుమారుడు శషాంక్ ఉన్నాడు.సంతోష్ తల్లితండ్రులు 30 ఏళ్ల క్రితం నగరానికి వచ్చి స్థిరపడ్డారు. వీరు శేరిలింగంపల్లి గోపన్‌పల్లిలోని ముప్పా అపార్ట్మెంట్లోని 305 ప్లాట్‌లో నివాసం ఉంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. లాక్డౌన్లో సంతోష్ తల్లి వచ్చి వీరి వద్దే ఉంటోంది. కాగా స్రవంతి భర్త సంతోష్, అత్త, మామలు తనను వేధిస్తున్నారని 2018 ఆగస్టులో మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అనంతరం ముడు నెలలకు వారి మధ్య రాజీ కుదిరింది. సోమవారం రాత్రి కూడా భర్త సంతోష్, అత్తతో గొడవ జరిగింది. ఈక్రమంలో అనుమానాస్పద స్థితిలో స్రవంతి మంగళవారం తెల్లవారుజామున 3.40 గంటల సమయంలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని వారు ఉంటున్న మూడవ అంతస్తు నుంచి లిఫ్ట్ ద్వారా సెల్లార్లో కిందకు వచ్చి లిఫ్ట్ డోర్ వద్ద పడిపోయింది. అక్కడ విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డు చూసి ఇంట్లో ఉన్న వారికి, పోలీసులకు సమాచారం అందించారు. అదే సమయంలో ఆ ప్రాంతానికి వెళ్లిన పెట్రోలింగ్ పోలీసులు వెళ్లి చూసే సరికి ఆమె ఒంటిపై దుస్తులు కాలిపోయి మృతి చెంది ఉంది. సోమవారం సాయంత్రం బయటికి వెళ్లిందని అప్పుడు వెంట పెట్రోల్ తెచ్చుకొని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. స్రవంతి ఒంటికి నిప్పంటించుకొని మూడు అంతస్తుల నుంచి కిందకు రావడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. భర్త, అత్త వేధింపుల కారణంగానే తన కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని, వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు స్రవంతి బంధువులు ఫిర్యాదు చేశారు. పోలీసులు అపార్ట్మెంట్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. -
నవ వధువు బలవన్మరణం
పెగడపల్లి(ధర్మపురి): వరకట్నం కోసం అత్తారింటి వేధింపులు భరించలేక ఓ వి వాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని బతికపల్లి గ్రామంలో మంగళవారం జరిగింది. కుటుంబ స భ్యులు, పోలీసులు తెలిపిన వివరాలప్ర కారం..గ్రామానికి చెందిన ఐలేని అంజి రెడ్డి–శోభారాణి దంపతుల చిన్న కూతురు దివ్య(22) హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ది వ్యకు అదే గ్రామానికి చెందిన పెయ్యాల రాజిరెడ్డి–అంజలి దంపతుల కుమారుడు ప్రవీన్రెడ్డితో 2020 ఫిబ్రవరి 22న వివాహం జరిపించారు. వివాహ సమయంలో రూ.10 ల క్షల నగదు, 20 తులాల బంగారం, ఎకరం భూమిని కట్నం కింద ముట్టజెప్పారు. ఈనేపథ్యంలో దివ్య హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తుండగా ప్రవీన్‌రెడ్డి స్థానికంగా వ్యవసాయం చేస్తున్నాడు. (ప్రేమజంట ఆత్మహత్య) కొద్ది రోజుల నుంచి అదనపు కట్నం తేవాలని లేదా కట్నం కింద ఇచ్చిన వ్యవసాయ భూమిని విక్రయించి డబ్బులు ఇవ్వాలని అత్త, మామ రాజిరెడ్డి, అంజలిలతో పాటు భర్త వేధిస్తున్నారు. అంతే కాకుండా ప్రవీన్‌రెడ్డి శారీరకంగా, మానసికంగా దివ్యను ఇబ్బందులను గురి చేయడంతో పాటు వాట్సప్ ద్వారా అసభ్యకరమైన మెస్సెజ్‌లు పంపించేవాడు. నాలుగు రోజులు క్రితం హైదరాబాద్ నుంచి తల్లి గారింటికి వచ్చిన దివ్య అత్తింటి పోరును తల్లిదండ్రులతో మొరపెట్టుకుంది. దీంతో మంగళవారం ఉదయం దివ్యను ఆమె తల్లిదండ్రులు అత్తారింటికి తీసుకు వచ్చి వారితో మాట్లాడుతుండగా తిరిగి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఈక్రమంలో మనస్తాపానికి గురైన దివ్య ఉదయం 10 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లి గ్రామ శివారులోని తన తల్లిగారి వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. అదనపు కట్నం వేధింపులు భరించలేక తమ కూతరు ఆత్మహత్య చేసుకుందని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ రాజమనోహర్‌రెడ్డి, ఎస్సై నవతలు ఘటనా స్థలాన్ని సందర్శించి శవ పంచనామ నిర్వహించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
నెల రోజుల క్రితం పెళ్లి.. కొద్ది రోజులకే
తుర్కపల్లి (ఆలేరు) : వరకట్న వేధింపులు తాళలేక ఆత్మహత్యకు యత్నించిన నవవధువు మృతిచెందింది. పోలీసులు తెలిపిన మేరకు.. తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామానికి చెందిన బత్తుల అనూష(22)కు మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడకు చెందిన జనార్దన్‌తో నెల రోజుల క్రితం వివాహం జరిగింది. కొద్ది రోజులకే అదనపు కట్నం తీసుకురావాలని భర్త జనార్దన్, అత్త కృష్ణ కుమారి, మామ భరత్‌కుమార్, ఆడపడుచు వేదవతిలు అనూషను వేధించారు. దీంతో మనస్తాపానికి గురైన అనూష అత్తగారింట్లోనే ఈ నెల 5న గుర్తు తెలియని ద్రావకం తాగి పుట్టింటికి వచ్చింది. (కాళ్ల పారాణి ఆరకముందే... ) కాసేపటికే అనూష కళ్లు తిరిగి పడిపోయింది. గమనించిన కుటుంబ సభ్యులు భువనగిరి ఏరియా ఆస్పత్రి, అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే అనూష ఆరోగ్యం మెరుగు పడడంతో 6వ తేదీన వాసాలమర్రిలోని పుట్టింటికి తీసుకువచ్చారు. అదే రోజు మధ్యాహ్నం అనూషకు ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. వరకట్న వేధింపులతోనే తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లి దుబ్బాల బాలమణి ఆదివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ యాదగిరి తెలిపారు. (కొత్త జంటకు షాక్: వధువుకు కరోనా) -
అత్తను మట్టుబెట్టిన కోడలు..
సాక్షి, చెన్నై: తన కాపురంలో వరకట్న చిచ్చు పెట్టడమే కాదు, భర్తను తనకు దూరం చేయడానికి ప్రయత్నించిన ఓ అత్తను కోడలు సజీవదహనం చేసింది. పాలల్లో నిద్రమాత్రలు వేసి నిద్ర పుచ్చినానంతరం కిరోసిన్ పోసి నిప్పు పెట్టింది. అత్త శరీరం మంటల్లో కాలుతున్నా, ఏమీ ఎరుగనట్టుగా మరో గదిలో నిద్ర నాటకం ఆడి అడ్డంగా ఈ కోడలు బుక్కైంది. పోలీసుల కథనం మేరకు వివరాలు...(కాళ్ల పారాణి ఆరకముందే... ) పుదుకోట్టై జిల్లా వెల్లకోట సమీపంలోని మనియాందపురం గ్రామానికి చెందిన రమేష్‌కు రెండేళ్ల క్రితం ప్రతిభతో వివాహం అయింది. వీరికి తొమ్మిది నెలల ఆడ బిడ్డ ఉంది. రమేష్ పుదుకోట్టైలోని ఓ మందుల తయారీ సంస్థలో ఉద్యోగి. రమేష్‌తో పాటు తండ్రి అరుల్ పుళవన్, తల్లి రాజమ్మాల్ కూడా ఉన్నారు. ఈ కుటుంబానికి సొంతంగా ఇళ్లు, పంట పొలాలు ఉన్నాయి. అయితే, కోడల్ని కూతురుగా చూసుకోవాల్సిన అత్త రాజమ్మాల్ మొదటి నుంచి ఆరళ్లు పెడుతూ వచ్చింది. పెళ్లి సమయంలో కట్న కానుకల్ని బకాయి పెట్టారని, అది తీసుకు రావాలని, పదే పదే కోడల్ని వేధించేది. తన కుమారుడికి ఆడ బిడ్డ పుట్టినానంతరం కోడలిపై వేధింపుల్ని ఈ గయ్యాలి అత్త పెంచింది. అదనపు కట్నం తీసుకురావాలని లేని పక్షంలో తన కుమారుడికి మరో పెళ్లి చేస్తానంటూ బెదిరించడం మొదలెట్టింది. భర్త, అత్తమామలు తనను బాగానే చూసుకుంటున్నా, అత్తరూపంలో తనకు వేధింపులు పెరగడంతో బయటకు చెప్పుకోలేక తనలో తాను కుమిలిపోయేది. తన పుట్టింట్లో ఆదరణ కరువు కావడం, అత్త వేధింపులు పెరగడం వెరసి మానసికంగా కృంగిన ›ప్రతిభ చివరకు ఉన్మాదిగా మారింది. (అక్కాచెల్లెలు అదృశ్యం..) పథకం ప్రకారం.. వంద రోజుల ఉపాధి పథకం కూలీలకు హెడ్‌గా ఉన్న అత్త రాజమ్మాల్ ఇంటికి రాగానే, ప్రతిరోజూ పాలు తాగడం అలవాటు. దీనిని ఆసరగా చేసుకుని ఆమెను మట్టుబెట్టేందుకు ప్రతిభ పథకం వేసుకుంది. వారం రోజులుగా ఒక్కక్కటి చొప్పున నిద్ర మాత్రల్ని మెడికల్ షాపు ద్వారా సేకరించింది. బుధవారం సాయంత్రం మామ అరుల్ పుళవన్ బయటకు వెళ్లడం, భర్త ఇంటికి వచ్చేందుకు మరింత సమయం పట్టే అవకాశాల్ని పరిగణలోకి తీసుకుంది. ఇంటికి వచ్చిన అత్త పాలు తాగింది. అప్పటికే అందులో నిద్ర మాత్రల్ని ప్రతిభ వేసింది. ఆ మత్తులో ఆమె నిద్రకు ఉపశ్రమించింది. తన కాపురంలో చిచ్చు పెట్టే రీతిలో వేధింపులు ఇవ్వడమే కాదు, భర్తను తనకు కాకుండా చేస్తానన్న అత్తను హతమార్చేందుకు ఉన్మాదిగా మారింది. ముందుగా సిద్ధం చేసుకున్న కిరోసిన్‌ను ఆమెపై పోసి నిప్పు పెట్టింది. ఏమీ ఎరుగనట్టుగా మరో గదిలోకి వెళ్లి నిద్ర పోయినట్టు నాటకం రచించింది. అయితే, ఈ ఇంట్లో నుంచి హఠాత్తుగా పొగ, కాలిన వాసన రావడాన్ని గుర్తించిన స్థానికులు పరుగులు తీశారు. తలుపులు తెరిచే ఉండడంతో లోనికి వెళ్లారు. అక్కడ మంటల్లో రాజమ్మాల్ కాలుతుండడంతో ఆర్పే యత్నం చేశారు. తీవ్రంగా గాయపడ్డ ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఇంత జరుగుతున్నా, కోడలు గదికే పరిమితం కావడం, గాడ నిద్ర నుంచి లేచినట్టు బయటకు రావడం స్థానికుల్లో అనుమానం రేకెత్తించింది. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. అయితే, ఆస్పత్రిలో రాజమ్మాల్ మరణించడం, సంఘటన స్థలంలో సాగిన పోలీసులు విచారణతో కోడలి బండారం బయటపడింది. భర్తకు మరో పెళ్లి చేస్తే, తాను, తన బిడ్డ ఒంటరి అవుతామన్న భయంతోనే ఈ కిరాతకానికి ఒడి గట్టాల్సి వచ్చిందని ప్రతిభ కన్నీటి పర్యంతమైంది. ఆమెను అరెస్టు చేసిన పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. అత్త కోడళ్ల మధ్య సాగిన వరకట్న వేధింపులు, ఉన్మాద చర్య కారణంగా ముక్కు పచ్చలారని 9 నెలల చంటి బిడ్డ పాల కోసం అలమటిస్తుండడం కొసమెరుపు. -
ప్రేమ.. పెళ్లి.. వేధింపులు!
మల్కాజిగిరి: ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు.. డబ్బుల కోసం వేధిస్తుండడంతో ఆ ఇల్లాలు ఆత్మహత్య చేసుకుంది. ఎస్ఐ హరీష్ తెలిపిన వివరాల ప్రకారం.. వినాయకనగర్‌కు చెందిన సమీనాభాను (20), నేరేడ్మెట్కు చెందిన సాయిచరణ్ ప్రేమించుకున్నారు. గత ఏడాది నవంబర్‌లో వివాహం చేసుకున్నారు. మూడు నెలలుగా వీరు వసంతపురి కాలనీలో నివాసముంటున్నారు. సమీనాభాను మూడు నెలల గర్భిణి. ఉద్యోగం లేకుండా ఇంటి పట్టునే ఉంటున్న సాయిచరణ్ కొన్ని రోజులుగా డబ్బుల కోసం ఆమెను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడు. (అమ్మా.. ఇక్కడ ఉండలేకపోతున్నా! ) మంగళవారం వీరి ఇంటి పక్కన ఉండే వారు సమీనాభాను సోదరి మెహ్రాభానుకు ఫోన్ చేసి ఆమె సూసైడ్ చేసుకుందని సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి వెళ్లి ఫ్యాన్‌కు ఉరివేసుకున్న సమీనాభానును కిందికి దించి సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి చెందిన వైద్యుడిని పిలిపించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లుగా వైద్యుడు చెప్పారు. సాయిచరణ్ వేధింపుల కారణంగా సమీనాభాను మృతికి కారణమని ఆమె సోదరి బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.(మధుర ఫలం.. చైనా విషం!) (పెళ్లి ఒకరితో.. ప్రేమ మరొకరితో) -
ప్రేమ పెళ్లి.. అమ్మను కొట్టొద్దు నాన్నా..
కడుపు నిండా పాలుతాగి.. హాయిగా అమ్మ ఒడిలో ఆడుకోవాల్సిన చిన్నారి.. డబ్బా పాలు తాగుతున్నాడు.. ఒడిలోకి తీసుకొని పాలు తాగించే చుట్టుపక్కల వారినే అమ్మ అనుకుంటున్నాడు. పాలు తాగుతూ.. మధ్యమధ్యలో బోసినవ్వులు చిందిస్తున్నాడు. పాలు పట్టిస్తుంటే.. వారిని తీక్షణంగా చూస్తున్నాడు.. అందర్లోనూ అమ్మనే చూస్తున్నాడు. జీవితాంతం గుండెల్లో పెట్టుకొని పెంచే కన్నతల్లి మాత్రం లోకం విడిచిపోయిందని 46 రోజుల ఆ చిన్నారికి తెలియదు. జూబ్లీహిల్స్: బంజారాహిల్స్‌లోని ఇందిరానగర్‌లో భార్యనే హత్య చేసి భర్త పరారైన ఘటన కలకలం సృష్టించింది. అనిల్– అనిత భార్యాభర్తలు. కొన్నేళ్లుగా ఇందిరానగర్‌లోనే నివాసం ఉంటున్నారు. వీరికి నలుగురు పిల్లలు. ఇద్దరు మగ పిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు. అక్షిత(7), ఆర్య(3), అంకిత(రెండున్నరేళ్లు), చివరగా బాబు 46 రోజుల పసికందు ఉన్నాడు. భార్యాభర్తల మధ్య శనివారం రాత్రి గొడవ జరగడంతో భర్త అనిల్ భార్య అనితను తీవ్రంగా కొట్టాడు. వద్దు నాన్నా.. అమ్మను కొట్టొదంటూ చిన్నారులు వేడుకున్నారు. అయినా తండ్రి కనికరించలేదు. ఏడ్చి ఏడ్చి చిన్నారులు నిద్రపోయారు. కొంత సమయం తర్వాత మళ్లీ విచక్షణారహితంగా కొట్టడంతో అనిత అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు అక్కడకు చేరుకోవడంతో అనిల్ పరారయ్యాడు. ఉదయం నిద్ర లేచిన చిన్నారులు తల్లి మృతదేహం వద్ద గుక్కపెట్టి ఏడుస్తుండటంతో స్థానికులు వారికి భోజనం అందించారు. 46 రోజుల చిన్నారికి పాలు పట్టారు. తల్లి మృతి చెందడం, తండ్రి పరారవ్వడంతో చిన్నారులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఘటనా స్థలంలో ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు... నలుగురు పిల్లలను కన్నాడు... తనకు మంచి వ్యాపారం కూడా ఉంది. అయినా అదనపు కట్నం కోసం ఓ వ్యక్తి తన భార్యను గొడ్డును బాదినట్టు బాది దారుణంగా హత్య చేసిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... బంజారాహిల్స్ రోడ్ నం. 2లోని ఇందిరానగర్‌లో నివాసం ఉండే రుడావత్ అనిల్(31) సినిమా వారికి సెట్టింగ్‌లకు స్టేజీలు, డెకరేషన్ వస్తువులను అద్దెకు ఇస్తూ జీవనం సాగిస్తుండేవాడు. వికారాబాద్ జిల్లా దౌలతాబాద్ మండలం గోకాసకల్వాడ పక్కనే ఉండే గొడమర్రిగడ్డ›తండా చెందిన అనితను 2009లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. కొద్ది రోజులు వారి కాపురం సజావుగా సాగింది. మరుసటి ఏడాది నుంచి అనితను కట్నం తీసుకురావాల్సిందిగా నిత్యం వేధించేవాడు. అనుమానంతో ఆమెను దారుణంగా కొట్టేవాడు.(పగబట్టిన ప్రేమ; సాఫ్ట్వేర్ యువతికి..! ) పలుమార్లు పెద్ద మనుషుల పంచాయితీల్లో కూడా అనిల్‌ను మందలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. రెండేళ్ల క్రితం అనిత అనిల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో భరోసా కేంద్రంలో కూడా అనిల్‌కు కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా తీరు మార్చుకోని అనిల్ నిత్యం భార్యను వేధించేవాడు. తప్పతాగి వచ్చి నిత్యం కొట్టేవాడు. వీరిద్దరికీ నలుగురు పిల్లలు ఉన్నారు. వీరి చిన్న కుమారుడి వయసు 45 రోజులు. అయితే శనివారం రాత్రి బాగా తాగి వచ్చిన అనిల్ భార్యపై పిడిగుద్దులతో విరుచుకుపడ్డాడు. ఇంట్లో వేడి నీళ్లు పెట్టేందుకు వినియోగించే కరెంటు హీటర్‌తో అనితను తీవ్రంగా కొట్టాడు. చప్పుడు విని లేచిన అనిత పెద్ద కూతురు అక్షిత లేచి నాన్న అమ్మను కొట్టొద్దు అని వేడుకున్నప్పటికీ అనిల్ కనికరించకుండా దాడి చేయడంతో అనిత అక్కడికక్కడే మృతి చెందింది. అనిత మృతి చెందింది అని తెలుసుకున్న అనిల్ అక్కడి నుంచి పరారయ్యాడు. చనిపోయిన అనిత బాలింత కావడంతో జరిగిన ఘటనతో ఇందిరానగర్ బస్తీ ఉలిక్కిపడింది. విషయం తెలుసుకున్న బంజారాహిల్స్ పోలీసులు తెల్లవారుజామున అక్కడికి చేరుకొని ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు. అనిత మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతురాలి సోదరుడు మోహన్ ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కట్నం వేధింపులకు వివాహిత బలి
దొడ్డబళ్లాపురం: వరకట్నం వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన కనకపుర పట్టణంలో చోటుచేసుకుంది. మళవళ్లి తాలూకా బాళెహొన్నిగ గ్రామానికి చెందిన బీఎం పూర్ణిమ(22)కు ఇదే గ్రామానికి చెందిన మునిమాదేవ అనే వ్యక్తితో 2 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. మునిమాదేవ కనకపురలోని ఒక కాలేజీలో గెస్ట్ లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం ఉదయం పూర్ణిమ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇదిలా ఉండగా మునిమాదేవ మొదటినుండి అధిక కట్నం కోసం వేధించేవాడని, ఇటీవలే ఒక లక్ష కావాలని లేదంటే విడాకులు ఇస్తానని బెదిరించడంతో నగదు రూపంలో ఇచ్చామని పూర్ణిమ కుటుంబ సభ్యులు వాపోయారు. ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు మునిమాదేవ,అతడి సహోదరుడిని అదుపులోకి తీసుకున్నారు. -
మటన్ కూరలో ఉప్పు ఎక్కువ వేసిందని..
కర్ణాటక, బాగేపల్లి: మద్యం మత్తులో భార్యను కట్నం కోసం పీడించి, మటన్ కూరలో ఉప్పు ఎక్కువ వేసిందని హింసించి చంపాడో కిరాతక భర్త. ఆదివారం రాత్రి బాగేపల్లి తాలుకాలోని చేళూరు సమీపంలో ఉన్న హోసహుడ్య (ఉప్పకుంటెపల్లి) గ్రామంలో చోటు చేసుకుంది. భర్త చేతిలో హత్యకు గురైన బాధితురాలు బీ.ఎస్. మధుర (25)కాగా, నిందితుడు భర్త బాలచంద్ర. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రెండేళ్ల కిందట బాగేపల్లి తాలూకాలోని మరవపల్లి గ్రామానికి చెందిన బాలచంద్ర, మధురను ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. ఇతడు కారు డ్రైవర్‌గా పనిచేసేవాడు. తరువాత మధుర తల్లిదండ్రులు అతనికి భారీగానే కట్నకానుకలు ముట్టజెప్పారు. కానీ మద్యానికి బానిస అయిన బాలచంద్ర రోజూ తాగి వచ్చి భార్యతో గొడవ పడి మరింత వరకట్నం తేవాలని వేధించేవాడు. (ప్రియురాలి కోసం వెళ్లి హతమయ్యాడు ) గొంతు పిసికి చంపి.. మధుర గతంలో కాన్పునకు పుట్టింటికి వెళ్ళి అక్కడే ఉంటోంది. వారికి 11 నెలల మగబిడ్డ ఉన్నాడు. బాలచంద్ర వారం రోజులకు ఒక సారి భార్య వద్దకు వచ్చి వెళుతుండేవాడు. ఆదివారం వచ్చిన బాలచంద్ర రాత్రి భోజనం తిని మాంసంలో ఉప్పు ఎక్కువైందని గలాటా చేయసాగాడు. మదుర చెల్లి భార్యభర్తల మధ్య గొడవలో ఎందుకని అక్కడి నుంచి వెళ్లిపోయింది. మత్తులో ఉన్న బాలచంద్ర భార్య గొంతుపిసికి చంపి చున్నీతో మెడకు కట్టి కిటికి ఉరి వేసుకున్నట్లు కథ అల్లాడు. అంతకుముందే మధుర అరుపులు విని బయటి నుంచి కుటుంబ సభ్యులతో పాటు చుట్టు పక్కల వారు వచ్చి ఘోరం వెలుగుచూసింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి బాలచంద్రను పట్టుకోవడానికి యత్నించారు. అతన్ని మాకు అప్పగించాలని ప్రజలు పోలీసుల జీపు పైన రాళ్ళతో దాడికి దిగారు. దాంతో వారిని తప్పించుకొని అతన్ని అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. చేళూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.(విల్లుపురంలో దారుణం) -
నా కూతురు మరణానికి వేధింపులే కారణం
గచ్చిబౌలి: కట్టుకున్న భర్త, అత్త వేధింపుల కారణంగానే తన కూతురు పెళ్లైన 76 రోజుల్లోనే ఆత్మహత్య చేసుకుందని ఖమ్మం జిల్లాకు చెందిన అయ్యదేవర వెంకట రమణ కన్నీళ్ల పర్యంతమయ్యారు. వివరాలు.. కొండాపూర్‌లోని సుబ్బ య్య అర్చిడ్స్లో శేష సంతోషిణి బుధవారం ఆత్మహత్య చేసుకున్న సంగతి విధితమే. ఈ నేపథ్యంలో ఆమె తండ్రి తన కూతురు ఆత్మహత్యకు ఆమె భర్త, అత్త మామలే కారణమని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గురువారం గచ్చిబౌలి స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గత ఫిబ్రవరి 15న తన కూతురు శేష సంతోషిణి కుమారిని పాతర్లపాడు, సూర్యపేట జిల్లాకు చెందిన పాండురంగారావుతో వివాహం జరిపించామని తెలిపారు. అదనపు కట్నం కోసం భర్త, అత్త పెట్టిన చిత్రహింసలకు తట్టుకోలేక భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిందని రోదించారు. బుధవారం సాయంత్రం 5 గంటలకు సూసైడ్ నోట్ నా చిన్న కూతురు వాట్సాప్‌కు పంపిందని, ఫోన్ చేసినా అల్లుడు స్పందించలేదన్నారు. రాత్రి 7 గంటలకు తన కూతురు చనిపోయిందన్న సమాచారం వచ్చిందని తెలిపాడు. -
ఖాకీ కట్న దాహం.. ఇల్లాలి ప్రాణం
అనంతపురం ,పామిడి: కానిస్టేబుల్ అదనపు కట్నం దాహం.. అతని ఇల్లాలి ప్రాణాలు బలిగొంది. పామిడి ఎస్ఐ గంగాధర్ తెలిపిన మేరకు వివరాలు ఇలా.. గార్లదిన్నె మండలం మర్తాడు గ్రామానికి చెందిన దాసరి ఓబులేసు కుమార్తె కవితను యాడికి మండలం చందన లక్షుంపల్లి గ్రామానికి చెందిన ఓబులాపురం రాజు కుమారుడు కృష్ణకు నాలుగేళ్ల క్రితం ఇచ్చి పెళ్లి చేశారు. అప్పట్లో రూ.2లక్షలు నగదు, 15 తులాల బంగారు, పామిడిలో రెండు సెంట్ల స్థలం కట్నకానుకల కింద అందజేశారు. పెద్దవడుగూరు పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కృష్ణ.. తన కుటుంబంతో కలిసి పామిడిలోనే కాపురముంటున్నాడు. వీరికి మూడేళ్ల కుమారుడు, 14 నెలల పాప ఉంది. పెళ్లి అయిన ఏడాది తర్వాత నుంచే కృష్ణ అసలు నైజం బయటపడుతూ వచ్చింది. అదనపు కట్నం కోసం భార్యను వేధించేవాడు. ఈ క్రమంలో పలుమార్లు పుట్టింటికి వెళ్లి డబ్బు తీసుకువచ్చి ఇస్తూ వచ్చింది. అయినా అతనిలో మార్పు రాలేదు. భర్తతో పాటు అత్త వెంకటలక్ష్మమ్మ కవితను శారీరకంగా, మానసికంగా వేధించేవారు. కొన్నిరోజులుగా ఈ పరిస్థితి భరించలేని స్థాయికి చేరుకుంది. కుటుంబపెద్దలు పంచాయితీ నిర్వహించిన నచ్చచెప్నినా.. కృష్ణలో మార్పు రాలేదు. దీంతో మనస్థాపం చెందిన కవిత బుధవారం రాత్రి 11.45 గంటలకు ఇంటిల్లిపాది నిద్రిస్తుండగా ఉరివేసుకుంది. గురువారం ఉదయం విషయం తెలుసుకున్న కవిత తల్లిదండ్రులు నల్లమ్మ, ఓబులేసు పామిడి చేరుకుని కూతురి మృతదేహం చూసి బోరున విలపించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితులను అదుపులోకి తీసుకుని, కోర్టుకు హాజరపరచనున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
చికిత్స పొందుతూ 'అతని' భార్య మృతి
మైసూరు: సీడీపిఓ ఉద్యోగి అయిన వెంకటప్ప అనే వ్యక్తి భార్యపై హత్యాయత్నం చేయగా, ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అతని భార్య నాగవేణి(41) సోమవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మైసూరు జిల్లాలోని టీ.నరసిపుర తాలూకాలోని శిశు సంక్షేమ శాఖలో సహాయ అధికారిగా పనిచేస్తున్న వెంకటప్ప 1997వ సంవత్సరంలో నాగవేణికి పెళ్ళి చేసుకున్నాడు. కొంతకాలంగా భార్యను వేధించడంతో పాటు వరకట్నం కోసం తీవ్రంగా కొట్టి హింసిస్తున్నాడు. ఈ నెల 3వ తేదీన తెల్లవారుజామున భార్య నిద్రపోతూ ఉండగా ఆమె మెడకు చీరను బిగించి ఉరి బిగించి చంపబోయాడు. ఆమె కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉంటూ ప్రాణాలు విడిచింది. నాగవేణి ఆస్పత్రిలో చేరిన రోజే బంధువులు వెంకటప్పపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి నాగవేణి నుంచి వాంగ్మూలం తీసుకున్నాడు. మైసూరు నగరంలోని జయపుర పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు -
వరకట్న వేధింపులకు నిండు గర్భిణి బలి
మైసూరు : ప్రపంచ మహిళ దినోత్సవం రోజునే నిండు గర్భిణి వరకట్న వేధింపులకు బలైన ఘటన జిల్లాలోని హుణసూరు పట్టణం సమీపంలోని కల్కుణి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాలు... మైసూరు జిల్లాలోని నంజనగూడు తాలుకాలోని మంచళ్లి గ్రామానికి చెందిన లక్ష్మి (24)ని 10 నెలల క్రితం హుణసూరుకు చెందిన యోగేష్ ఇచ్చి వివాహం జరిపించారు. పెళ్లి సమయంలో కట్న కానుకలు సమర్పించారు. అనంతరం కూడా ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే ఇల్లు ఇచ్చే విషయం ఆలస్యం కావడంతో కుటుంబ సభ్యులు మరింత కట్నం తీసుకురావాలని వేధించడం మొదలుపెట్టారు. దీంతో భర్త, అత్తింటి వేధింపులు తాళలేక లక్ష్మీ ఆదివారం ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. -
ఎన్నారై అల్లుడికి గిల్లుడే!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో నమోదైన వరకట్నం, వేధింపుల కేసుల్లో వాంటెడ్‌గా ఉన్న ‘ఎన్నారై అల్లుళ్ల’కు చెక్ చెప్పడానికి హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) అధికారులు పక్కా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్ (ఎన్బీడబ్ల్యూ) జారీ అయిన వారి పాస్పోర్ట్స్ రద్దు చేయించడానికి సిద్ధమవుతున్నారు. రీజినల్ పాస్‌పోర్ట్ కార్యాలయాలకు (ఆర్పీఓ) లేఖలు రాయడం ద్వారా వాంటెడ్ అల్లుళ్ల మెడలు వంచుతున్నారు. సీసీఎస్ అధికారులు ఇప్పటికే 40 మందిపై ఈ చర్యలు తీసుకుకోగా.. వారంతా హుటాహుటిన వచ్చి కేసు రాజీ చేసుకోవడమో, కోర్టుకు హాజరై ఎన్బీడబ్ల్యూ రీకాల్ చేసుకోవడమో చేశారు. నోటీసులు ‘రంగు’ మారడంతో.. అదనపు కట్నం కోసం వేధింపులకు పాల్పడుతున్న, ఎన్నో విధాలుగా మోసం చేసిన ఎన్నారై అల్లుళ్లకు సంబంధించిన కేసులు పోలీసుల వద్దకు నిత్యం వస్తున్నాయి. ప్రధానంగా సిటీలో ఉన్న మూడు మహిళా ఠాణాలకు బాధితులు క్యూకడుతుంటారు. సీసీఎస్ అధీనంలోని మహిళా పోలీసుస్టేషన్‌కు వచ్చే కేసుల సంఖ్య అధికంగా ఉంటోంది. వివాహం చేసుకుని తీసుకెళ్లట్లేదని, అక్కడకు వెళ్లాక కట్నం కోసం మానసికంగా, శారీరకంగా హింసించాడని, లేని అర్హతలు చెప్పి మోసం చేశాడని బాధితులు ఆరోపిస్తుంటారు. వీటిపై కేసులు నమోదు చేసుకుంటున్న పోలీసులు నిందితులుగా ఉన్న ‘అల్లుళ్లను’ అరెస్టు చేసేందుకు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. ఒకప్పుడు 498 (ఎ) తరహా కేసుల్లో నిందితుడిగా ఉన్న ఎన్నారైలను అరెస్టు చేసేందుకు సీఐడీ ద్వారా ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించేవారు. ఆ సంస్థ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయించి, ఆయా దేశాల్లో ఉన్న పోలీసులు పట్టుకునేలా చేసి ఇక్కడకు తీసుకువచ్చేవారు. భారత్‌లో మాదిరిగా అన్ని దేశాల్లోనూ వరకట్న వేధింపులు అనేది తీవ్రమైన నేరం కాదు. దీంతో కొన్నేళ్ల క్రితం నుంచి ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసుల జారీ ఆపేసింది. వీటి స్థానంలో బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేస్తూ.. కేవలం నిందితులకు సంబంధించిన ఆచూకీ తెలిపేందుకు మాత్రమే పరిమితమైంది. ఈ రకంగా వారి ఆచూకీ తెలిసినా.. ఇక్కడి పోలీసులు వెళ్లి తీసుకురావడం అసాధ్యమైంది. ఇది వాంటెడ్‌గా ఉన్న ఎన్నారై అల్లుళ్లకు బాగా కలిసి వచ్చే అంశంగా మారింది. దిగితేనే పట్టుకోవడానికి అవకాశం.. ఇంటర్‌పోల్ ద్వారా రెడ్, బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేయించడం అంత సులువు కాదు. ఇందులో సుదీర్ఘమైన ప్రక్రియ ఉంటుంది. స్థానిక పోలీసులు నేరుగా ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించలేరు. నోడల్ ఏజెన్సీగా పని చేసే సీఐడీ వంటి వ్యవస్థల ద్వారా వెళ్లాలి. ఇది సుదీర్ఘమైన ప్రక్రియ కావడంతో ఇటీవల కాలంలో పోలీసులు వాంటెడ్‌గా ఉన్న ఎన్ఆర్ఐ అల్లుళ్లపై లుక్ ఔట్ సర్క్యులర్ (ఎల్ఓసీ) జారీ చేస్తున్నారు. దీన్ని దేశంలోని అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలకూ పంపిస్తారు. ఎల్ఓసీ జారీ అయిన వ్యక్తి వ్యక్తిగత, కేసు వివరాలతో పాటు పాస్‌పోర్ట్ నంబర్లను విమానాశ్రయాల్లో ఉండే ఇమ్మిగ్రేషన్ అధికారులు తమ డేటాబేస్‌లో నిక్షిప్తం చేసుకుంటారు. అతడు విమానం దిగిన వెంటనే జరిగే ఇమ్మిగ్రేషన్ తనిఖీల్లో వాంటెడ్ అని వెలుగులోకి రావడంతోనే అదుపులోకి తీసుకుని సంబంధిత పోలీసులకు సమాచారం ఇస్తారు. ఆ పోలీసులు వచ్చి నిందితుడిని తీసుకువెళ్లే వరకు ఎయిర్పోర్ట్ దాటకుండా తమ అధీనంలోనే ఉంచుకుంటారు. అంతర్జాతీయ ప్రయాణాలకు ఇమ్మిగ్రేషన్ తనిఖీలనేది కచ్చితమైన అంశం. ఎల్ఓసీలు జారీ చేస్తే కేవలం ఆ నిందితుడు ఒక్కడికి వస్తేనే పట్టుకోవడానికి ఆస్కారం ఉంది. రద్దు కోరుతూ ఆర్పీఓలకు లేఖలు.. దీంతో ఎన్నారై అల్లుళ్లకు చెక్ చెప్పడానికి అనువైన మార్గాలను సీసీఎస్ పోలీసులు అన్వేషించారు. ఈ నేపథ్యంలోనే వీరు పాస్‌పోర్ట్ చట్టాన్ని సమగ్రంగా అధ్యయనం చేశారు. అందులో ఉన్న కొన్ని సెక్షన్ల ప్రకారం న్యాయస్థానాలకు వాంటెడ్‌గా ఉండి, విదేశాల్లో తలదాచుకున్న వ్యక్తి పాస్‌పోర్ట్‌ను రద్దు చేయించే అధికారం పోలీసులకు ఉంది. దీని ప్రకారం ఆర్పీఓలకు లేఖలు రాయాలంటే అతడిపై న్యాయస్థానం ఎన్బీడబ్ల్యూ జారీ చేయాల్సి ఉంది. దీనికోసం ఆయా కేసుల దర్యాప్తు పూర్తి చేసుకున్న అధికారులు కోర్టులో అభియోగపత్రాలు దాఖలు చేస్తున్నారు. వీటి ఆధారంగా ఎన్బీడబ్ల్యూ జారీ చేయించి, ఆర్పీఓలకు లేఖ రాస్తున్నారు. విదేశీ మంత్రిత్వ శాఖ ద్వారా నిందితుడు ఉన్న దేశంలోని రాయబార కార్యాలయానికి సందేశం ఇస్తున్న ఆర్పీఓ.. పాస్‌పోర్ట్ రద్దుపై అతడికి నోటీసులు జారీ చేస్తోంది. అదే జరిగితే ఉద్యోగం కోల్పోవడంతో పాటు స్వదేశానికి డిపోర్ట్ కావడం, తిరిగి విదేశాలకు వచ్చే అవకాశాలు సన్నగిల్లడం తప్పదనే విషయం తెలిసి ఉండటంతో ‘ఎన్నారై అల్లుళ్లు’ విమానాలు దిగుతున్నారు. భార్యలతో రాజీలు చేసుకోవడమో, కోర్టులకు హాజరై ఎన్బీడబ్ల్యూలు రీకాల్ చేయించుకోవడమో చేస్తున్నారని సీసీఎస్ పోలీసులు చెబుతున్నారు. -
అత్తింటి వేధింపులు.. షవర్‌కు చున్నీతో
హస్తినాపురం: అదనపు కట్నం కోసం భర్త, అత్తామామల వేధంపులు తట్టుకోలేక గృహిణి ఉరివేసుకుని అత్మహత్యకు పాల్పడింది. పోలీసులు, మృతురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలు.. భువనగిరి యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామానికి చెందిన మిర్యాల మమత, మిర్యాల శ్రీనివాస్ దంపతుల కూతురు జ్ఞానేశ్వరి అలియాస్ సామల సౌమ్య (23)కు వనస్థలిపురం హరిహరపురం కాలనీకి చెందిన సామల వెంకయ్య కుమారుడు రాఘవేందర్‌తో 2018లో వివాహమైంది. ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్న రాఘవేందర్‌కు వివాహ సమయంలో 16 తులాల బంగారు ఆభరణాలతో పాటు పెళ్లి చేసి సామగ్రి అందజేశారు. వివాహమైన అనంతరం కొన్ని నెలలు బాగానే వారి సంసార జీవితం సాగింది. ఆ తర్వాత దంపతుల మధ్య తరచూ కలహాలు జరుగుతున్నాయి. అదనపు కట్నం కోసం భర్త, అత్తామామలు వేధిస్తున్నారు. ఈ క్రమంలో మూడు నెలల క్రితం గ్రామంలో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ జరిగింది. వారు రాజీ కుదిర్చి ఆమెను అత్తారింటికి పంపించారు. పదిరోజులుగా మళ్లీ గొడవలు జరుగుతున్నాయి. సౌమ్య ఉద్యోగం చేయడం ఇష్టం లేని భర్త, అత్తామామలు ఒత్తిడి తెచ్చి ఆమెను ఉద్యోగం మాన్పించారు. అదనపు కట్నం కోసం మానసికంగా, శారీరంగా వేధింపులకు గురిచేస్తున్నారంటూ సౌమ్య తన తల్లి మమతకు చెప్పింది. బుధవారం స్నానానికి బాత్రూంలోకి వెళ్లిన సౌమ్య ఎంతకు బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన భర్త రాఘవేందర్ తలుపులు పగులగొట్టి చూడగా.. షవర్‌కు చున్నీతో ఉరివేసుకుని వేలాడుతూ కనిపించింది. దీంతో మనస్తాపం చెందిన రాఘవేందర్ బెడ్రూంలోకి వెళ్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కాలనీవాసులు గది తలుపులు పగులగొట్టి అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తల్లి మమత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకటయ్య తెలిపారు. ప్రవళిక (ఫైల్) వరకట్న వేధింపులకు వివాహిత బలి మల్లాపూర్: వరకట్న వేధింపులు వివాహితను బలి తీసుకున్న ఘటన నాచారం పోలీస్‌సేష్టన్ పరిధిలో చోటుచేసుకుంది. నాచారం సీఐ మహేష్ వివరాల ప్రకారం.. మల్లాపూర్ బ్రహ్మపురి కాలనీకి చెందిన ప్రవళిక (23) న్యూభవానీనగర్‌కు చెందిన పి.సతీష్‌రెడ్డిలు 2017లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొద్ది రోజులు వారి జీవితం సాఫీగా సాగింది. కొద్ది రోజులుగా వరకట్నం తీసుకురావాలంటూ ప్రవళికను భర్త సతీష్‌రెడ్డి, అత్త, ఆడపడుచులు వేధించసాగారు. మంగళవారం అనుమానాస్పద స్థితిలో ఇంట్లో పడి ఉండటంలో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతిచెందింది. దీంతో బుధవారం ప్రవళిక తల్లి రమాదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కూతురు వరకట్నం కోసం అత్తింటివారే హత్య చేశారని ఆమె ఆరోపించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వరకట్న వేధింపులు
కర్నూలు, నందికొట్కూరు: వరకట్న వేధింపులు తాళలేక ఓ మహిళ కుటుంబ సభ్యులతో కలిసి గురువారం పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగింది. బాధితురాలు తెలిపిన వివరాలు.. పోలీసు స్టేషన్‌కు వెళ్లిన బాధిత మహిళ ఫిర్యాదు ఎవరు పట్టించుకోకపోవడంతో శిరీషతో పాటు కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. మండల పరిధిలోని కొణిదేల గ్రామానికి చెందిన గొల్ల లక్ష్మన్న, పార్వతమ్మ కూతురు శిరీషను మండల కేంద్రానికి చెందిన రాముడు, నాగేశ్వరమ్మ కుమారుడు రాజశేఖర్‌కు ఇచ్చి మూడు నెలల క్రితం వివాహం చేశారు. కొంతకాలంగా భర్త రాజశేఖర్‌తోపాటు అత్త నా గేశ్వరమ్మ, మామ రాముడు, ఆడపడుచు ఉమామహేశ్వరి కట్నం కోసం వేధిస్తున్నారు. వేధింపులు తాళలేక వారం క్రితం ఎలుకల మందు తాగి ఆత్మహత్యకు యత్నించగా, కుటుంబ సభ్యులు కర్నూలు ఆస్పత్రిలో చికిత్స చేయించడంతో ప్రాణాపాయం తప్పింది. డిశ్చార్జ్ అయిన వెంటే కుటుంబ సభ్యులతో కలిసి గురువారం పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని భర్త, అత్త, మామ, ఆడపడుచుపై చర్యలు తీసుకోవాలని సీఐ నాగరాజారావుకు శిరీష ఫిర్యాదు చేసింది. అనంతంర అక్కడే ఆందోళనకు దిగింది. న్యాయం చేస్తామని సీఐ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
నవ వధువు ఆత్మహత్య
కర్ణాటక, బొమ్మనహళ్లి: వరకట్నం వేధింపులు భరించలేక పెళ్లయిన ఆరు నెలలకే నవ వధువు ఉరికి వేలాడింది. ఈ ఘటన బెంగళూరు నగరంలోని శుక్రవారం చోటు చేసుకుంది. ఆరు నెలల క్రితం వినూతతో కిరణ్‌కుమార్‌కు వివాహం జరిగింది. బ్యాడరహళ్లిలో దంపతులు నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో అదనపు కట్నం కోసం కిరణ్‌తో పాటు అతని తల్లి నిత్యం వేధించేవారు. ఈ క్రమంలో కిరణ్‌కు కౌన్సెలింగ్ కూడా ఇప్పించారు. అయినా కూడా ఆయనలో మార్పు రాలేదు. దీంతో జీవితంపై విరక్తి చెందిన వినూత శుక్రవారం ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే వినూత తల్లిదండ్రులు మాత్రం ఇది ఆత్మహత్య కాదని, తమ కుమార్తెను హత్య చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని కిరణ్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. -
న్యాయం చేయాలంటూ..
కర్నూలు, డోన్ టౌన్: కట్టుకున్న భర్త నుంచి తనకు, కుమారునికి న్యాయం చేయడమే కాకుండా రక్షణ కల్పించాలంటూ పట్టణ పోలీసు స్టేషన్ ఎదుట లక్ష్మిదేవి అనే మహిళ బుధవారం బైఠాయించి నిరసన వ్యక్తం చేసింది. వివరాలు.. పట్టణంలోని చిగురమానుపేటకు చెందిన లక్ష్మిదేవి రంగన్న కుమార్తె అయిన అక్ష్మిదేవిని ఆనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణానికి చెందిన అనిల్‌కుమార్‌కు ఇచ్చి 12ఏళ్ల క్రితం వివాహం జరిపించారు. వీరికి ఒక కుమారుడున్నాడు. అయితే కొంత కాలంగా అదనపు కట్నం తేవాలంటూ వేధించడమే గాకుండా భార్య వదిలి వెళ్లిపోయాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని వెతికి తీసుకొచ్చారు. ఈ సమయంలో జరిగిన పంచాయితీలో రాజీ చేసుకొని భార్య లక్ష్మిదేవికి రూ.3లక్షలు చెల్లించేలా ఒప్పందం చేశారు. అయితే కుంటుంబంతో ఉండకుండా, ఒప్పందం చేసుకున్న మొత్తం చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్నాడని ఆమె పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది. అయితే పోలీసులు స్పందించకపోవడంతో ఆమె పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించింది. ఈ విషయంపై పట్టణ పోలీసులను వివరణ కోరగా ఆమె భర్త ఎక్కడున్నాడనే సమాచా రం తమ వద్ద లేదని చెప్పారు. గతంలో పెద్ద మనుషుల సమక్షంలో ఒప్పకుందం చేసుకున్నదానికి తమకు సంబంధం లేదన్నారు. -
కట్నం ఇవ్వలేదని ఆగిన పెళ్లి
అన్నానగర్: అన్నానగర్‌లో వరకట్నం ఇవ్వలేదని వరుడి ఇంటి వారు పెళ్లిని ఆపారు. చెన్నై అన్నానగర్‌కు చెందిన సుమతి (30) (పేరు మార్చాం). ఈమెకు చెన్నై సేత్తుపట్టు శ్రీనాథ్‌కి గత ఏడాది నవంబర్ 22న నిశ్చయతార్థం జరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరి 5న వివాహం చేయడానికి పెద్దలు నిర్ణయించుకున్నారు. వధువు తరఫున పెళ్లి ఆహ్వాన పత్రికలు సైతం పంచారు. బుధవారం ఉదయం పెళ్లి జరగనున్న క్రమంలో వధువు తరఫు వారు వరకట్నం ఇవ్వకపోవడంతో పెళ్లిని ఆపేశారు. వధువు ఇంటి వారు అన్నానగర్ మహిళా పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
కోడలిని మంచానికి కట్టి..
భువనేశ్వర్: మంచానికి కట్టి..నిప్పు పెట్టి..వేధించడంతో ఓ ఇంటి కోడలు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న విచారకర సంఘటన వెలుగు చూసింది. కేంద్రాపడా జిల్లా రాజ నగర్ పోలీసు స్టేషన్ బొరొడియా గ్రామంలో ఈ సంఘటన సంభవించింది. వరకట్న వేధింపులే దీనికి కారణంగా భావిస్తున్నారు. 23 ఏళ్ల రస్మిత సాహును అత్తింటి వారు మంచానికి కట్టి కిరసనాయిలు పోసి నిప్పు పెట్టినట్లు ఆరోపణ. మంటల్లో ఆమె శరీరం దాదాపు 60 శాతం కాలింది. ఈ నెల 1వ తేదీన సంభవించిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి. 2018 వ సంవత్సరం జూన్ నెలలో విక్రమ దాస్‌తో రస్మిత సాహుకు వివాహం జరిగింది. వివాహం సందర్భంగా రస్మిత తల్లిదండ్రులు భారీగా కట్న కానుకలు సమర్పించారు. కోడలు తెచ్చిన కట్న కానుకలతో సంతృప్తి చెందని అత్తింటి వారు కోడలిని తరచూవేధించేవారు. అత్తింటి వారి వేధింపులతో రస్మితకు మానసిక, శారీరక శాంతి లేకుండా పోయిందని భావించిన పుట్టింటి వారు గత ఏడాది స్థానిక రాజ్ నగర్ పోలీసుస్టేషన్ ఫిర్యాదు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో వేధింపులు పునరావృతం కావని అత్తింటి వారు పోలీసుల ఎదుట నమ్మబలికి కోడలిని ఇంటికి తీసుకువెళ్లి మరోసారి కోడలిపై వేధింపులకు పాల్పడడంతో ఈ విచారకర సంఘటన జరిగినట్లు రస్మిత తల్లిదండ్రులు వివరించారు. తన కుమార్తె రస్మిత సాహును అత్త, మామ, వివాహిత ఆడ పడుచు మంచానికి కట్టి కిరసనాయిలు పోసి నిప్పు పెట్టినట్లు బాధిత యువతి తండ్రి బ్రహ్మానంద సాహు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఐపీసీ 498 – ఎ, 323, 307, 34, 4 సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేసి ముగ్గురు వ్యక్తులను అనుమానిత నిందితులుగా అరెస్టు చేశారు. -
నవవధువుకు వరకట్న వేధింపులు
కృష్ణాజిల్లా, అజిత్‌సింగ్‌నగర్: పెళ్లైన నాలుగు నెలలకే అత్తింటి వారి నుంచి ఓ వధువుకు అదనపు కట్నం వేధింపులు ఎదురైన సంఘటన నున్న రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నున్న గ్రామానికి చెందిన ఊటుకూరి వెంకాయమ్మ(19)కు అదే గ్రామానికి చెందిన డేవిడ్ అనే ఎలక్ట్రీషియన్‌కు ఇచ్చి నాలుగు నెలల క్రితం వివాహం చేశారు. పెళ్లి సమయంలో కట్నకానుకలు కూడా ఇచ్చారు. అయితే భర్త డేవిడ్ అతని తల్లి, మేనమామలు పుట్టింటి నుంచి ఇంకా అదనపు కట్నం తీసుకురమ్మంటూ వేధింపులకు గురిచేస్తున్నారు. వారి వేధింపులతో విసిగిపోయిన ఆమె నున్న రూరల్ పోలీసులను ఆశ్రయించగా.. బాధితురాలి ఫిర్యాదు మేరకూ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
కట్నం కోసం యువతిపై కత్తులతో దాడి
చిత్తూరు,గంగాధరనెల్లూరు: వరకట్నం కోసం భర్త కుటుంబ సభ్యులు కత్తులతో దాడి చేయడంతో వివాహిత తీవ్రంగా గాయపడింది. ఈ సంఘటన మండలంలోని పెద్దకాల్వ గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. స్థానికుల కథనం మేరకు.. ఐరాల మండలం సంతగేటుకు చెందిన రోజా కు, పెద్దకాల్వకు చెందిన పవన్‌కుమార్‌కు మూడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమారుడు ఉన్నాడు. భర్త పవన్‌కుమార్, మామ జ్ఙానప్రకాష్ (ఏఎస్ఐ), అత్త భానుమతి తరచూ వరకట్న వేధింపులకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో వారు బుధవారం కత్తులతో ఆమెపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని స్థానికులు చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దీనిపై ఎస్ఐ విక్రమ్ వివరణ ఇస్తూ మూడు రోజులుగా భార్య, భర్తలకు కౌన్సెలింగ్ ఇచ్చామన్నారు. విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు. -
నటి రమ్యకు వరకట్న వేధింపులు
యశవంతపుర : అదనపు కట్నం తీసుకురావాలని తనను తన భర్త వేధిస్తున్నాడని తమిళ నటి రమ్య సోమవారం బెంగళూరు కోడిగేహళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు.. 2017లో కొరియోగ్రాఫర్ వరదరాజన్‌తో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో ఇంటి స్థలంతో పాటు బంగారు అభరణాలు, నగదును కట్నంగా ఇచ్చారు. అయితే భర్త వరదరాజన్ డ్యాన్స్ అకాడమీని స్థాపించాలని, దానికి కావాల్సిన డబ్బులు తీసుకురావాలని వేధిస్తున్నట్లు రమ్య పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని తనను హింసిస్తున్నాడని తెలిపింది. -
శ్రుతిమించిన కట్నం వేధింపులు
అనంతపురం సెంట్రల్: అగ్నిమాపక శాఖ కానిస్టేబుల్ అదనపు కట్నం కోసం శాడిస్ట్‌గా మారాడు. వేధింపులు భరించలేకపోయిన భార్య.. పిల్లలతో కలిసి ఆత్మహత్యకు యత్నించింది. అయితే పోలీసులు సకాలంలో స్పందించి వారి ప్రయత్నాన్ని అడ్డుకుని ప్రాణాలతో కాపాడారు. బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. అనంతపురం రూరల్ మండలం చిన్నకుంట గ్రామానికి చెందిన అగ్నిమాపకశాఖ కానిస్టేబుల్ వీరనారాయణకు 2014లో రాప్తాడుకు చెందిన యమున అనే యువతితో వివాహమైంది. కట్నకానుకల కింద రూ. 3 లక్షల నగదు, 16 తులాల బంగారు ఇవ్వడంతో పాటు ఘనంగా వివాహం కూడా జరిపించారు. వీరికి ఇద్దరు కుమారులు సంతానం. అయితే కొన్నేళ్లుగా భార్యను అదనపు కట్నం కోసం వీరనారాయణ వేధిస్తున్నాడు. ఎకరా భూమితో పాటు అదనపు కట్నం తీసుకువస్తేనే కాపురం చేస్తానని రోజూ వేధిస్తుండడంతో భరించలేని ఆమె శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఇద్దరు కుమారులను తీసుకొని ఇంటి నుంచి వెళ్లిపోయింది. ‘నేను ఆత్మహత్య చేసుకుంటున్నా. నా కోసం ఎవరూ వెతకవద్దు’ అని కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పి పెట్టేసింది. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు ఇటుకలపల్లి పోలీసులకు సమాచారం అందించారు. ఫోన్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు విడపనకల్లు ఎస్ఐ గోపీని అప్రమత్తం చేశారు. స్పందించిన ఎస్ఐ గోపీ తన సిబ్బందిని రంగంలోకి దింపారు. జిల్లా సరిహద్దు ప్రాంతమైన కర్ణాటకలోని చీకలగుర్కి ఎర్రితాతస్వామి దేవాలయం వద్ద బాధితురాలు, పిల్లలతో కలిసి ఉండడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సురక్షితంగా రాత్రికిరాత్రే ఇటుకలపల్లి పోలీసుస్టేషన్‌కు తీసుకొచ్చారు. కౌన్సెలింగ్ ఇచ్చినా మారని కానిస్టేబుల్ అగ్నిమాపక శాఖ కానిస్టేబుల్ వీరనారాయణ వేధింపులపై భార్య గతంలోనే అప్పటి ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్‌కు ఫిర్యాదు చేసింది. డీఎస్పీ ఆధ్వర్యంలో కానిస్టేబుల్‌కు కౌన్సెలింగ్ ఇవ్వగా.. ఇక నుంచి భార్య, పిల్లలను బాగా చూసుకుంటానని రాతపూర్వకంగా తెలిపాడు. కానీ అతనిలో మార్పు మాత్రం రాలేదు. ఎకరాభూమి, అదనపు కట్నం తీసుకురావాలని, లేకుంటే ఇంట్లోకి రావద్దంటూ తెగేసి చెప్పాడు. భర్తతో పాటు, ఆడపడుచు ఈశ్వరమ్మ, అత్త, మామలు నారాయణమ్మ, నాగప్ప కూడా వేధింపులకు పాల్పడటంతో భరించలేక బలవన్మరణానికి పాల్పడబోయింది. వేధింపులపై బాధితురాలి ఫిర్యాదు మేరకు ఇటుకలపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. -
వేధింపులు తాళలేక.. నవవధువు ఆత్మహత్య
అంబర్‌పేట: అదనపు కట్నం వేధింపులు తాళలేక ఓ నవవధువు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన అంబర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ మోహన్‌కుమార్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బాపూనగర్‌కు చెందిన షేక్ అబ్దుల్ రసూల్ కుమార్తె మోబిన్ ఖలీదా(32)కు నెల రోజుల క్రితం చాంద్రాయణగుట్ట ఫూల్‌బాగ్‌కు చెందిన ఖైసర్ కుమారుడు మహ్మద్ సాబెర్‌తో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో 12 తులాల బంగారం, 30 తులాల వెండి కట్నంగా ఇచ్చారు. గత కొద్ది రోజులుగా అత్తింటివారు అదనపు కట్నం కోసం ఖలీదాను వేధిçస్తున్నారు. ఇళ్లు కొనివ్వాలంటూ ఆమెపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ఆమె ఈ నెల 27న పుట్టింటికి వచ్చింది. అప్పటినుంచి మనస్తాపపానికిలోనైన ఖలీదా సోమవారం రాత్రి ఇంట్లో ఊరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కట్నం కోసం ఆగిన డీఎస్పీ ఇంట పెళ్లి..
చెన్నై,టీ.నగర్: కట్నంగా రూ.50 లక్షల నగదు, రూ.3.5 కోట్ల విలువైన ఇంటిని రాసివ్వాలంటూ వివాహం నిలిపిన రిటైర్డ్ డీఎస్పీ కుమారుడిపై మహిళా డాక్టర్ పోలీసులకు అన్నానగర్‌లో ఫిర్యాదు చేసింది. వివరాలు.. చెన్నై అన్నానగర్ వెస్ట్ ప్రాంతంలో సుమతి (30) నివసిస్తున్నారు. ఈమె అదే ప్రాంతంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో డాక్టర్‌గా పని చేస్తున్నారు. మరైమలైనగర్‌కు చెందిన రిటైర్డ్ డీఎస్పీ బాలసుబ్రమణియం కుమారుడు బాలమురళీధరన్ (32). ఇతను నుంగంబాక్కంలోని ఇన్‌కంటాక్స్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్‌గా పని చేస్తున్నారు. గత జూన్ 27వ తేదీన ఇరుకుటుంబాల సమ్మతితో సుమతికి బాలమురళీధరన్కు పెద్దల సమక్షంలో వివాహం నిశ్చయించారు. ఆ సమయంలో వరకట్నంగా రూ.50 లక్షలు, రూ.3.5 కోట్ల విలువైన సుమతి కుటుంబీకులకు సొంతమైన ఇంటిని అందచేయనున్నట్లు నిర్ణయించి.. నవంబర్ 29వ తేదీన వివాహం ఏర్పాటుకు సమ్మతించారు. వరకట్నం సొమ్ము రూ.50 లక్షలలో కారు తీసుకోవచ్చునని మాట్లాడారు. దీంతో వివాహ ఏర్పాట్లు వేగంగా సాగాయి. వివాహ ఆహ్వాన పత్రికలు ముద్రించి బంధువులకు అందజేస్తూ వచ్చారు. ఇలా ఉండగా ఒకరోజు పట్టుచీర కొనుగోలు చేయాలని వధువు ఇంటి వారిని వరుడు ఇంటివారు తీసుకెళ్లారు. ఆ సమయంలో పట్టుచీర ధర రూ.లక్షను, వధువు ఇంటి వారే చెల్లించారు. రోజులు సమీపిస్తుండగా వరకట్నంగా మాట్లాడిన రూ.50 లక్షలను ముందుగానే అందజేయాలని, రూ.3.5 కోట్ల విలువైన ఇంటిని రాసివ్వాలని వరుడు ఇంటి వారు డిమాండ్ చేశారు. వేరే గత్యంతరం లేకుండా కారు కొనుగోలుకు రూ. 10 లక్షలను వధువు ఇంటి వారు చెల్లించారు. ఆ సమయంలో వరకట్నం సొమ్మును పూర్తిగా చెల్లించాలని వరుడు ఇంటి వారు కోరారు. దీంతో విరక్తి చెందిన వధువు ఇంటి వారు దీని గురించి తిరుమంగళం మహిళా పోలీసుస్టేషన్లో సెప్టెంబర్ 7వ తేదీన ఫిర్యాదు చేశారు. దీంతో వరుడు ఇంటి వారిని విచారణ కోసం పోలీసులు పిలిపించగా వారు రాలేదు. సుమతి పోలీసుస్టేషన్‌కు వెళ్లి చర్యలు తీసుకోవలసింది గా కోరుతూ వచ్చింది. అలాగే చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలోనూ బాధితులు ఫి ర్యాదు చేశారు. దీనిపై విచారణ జరపాల్సిం దిగా తిరుమంగళం మహిళా పోలీసులకు ఉత్తర్వులు అందాయి. ఇన్స్పెక్టర్ ధనలక్ష్మి కేసు న మోదు చేసి మళ్లీ వరుడి ఇంటివారిని సోమవా రం విచారణకు రమ్మని పిలిచారు. అయినప్పటికీ వారు కాలయాపన చేస్తున్నారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో సంచలనం కలిగించింది. -
వివాహిత ఆత్మహత్య
అనంతపురం, గోరంట్ల: కమ్మలవాండ్లపల్లిలో బి.వాణిశ్రీ (22) అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. కట్నం వేధింపులే ఆత్మహత్యకు కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. మృతురాలి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. వాణిశ్రీ, నాగరాజు దంపతులు. వీరికి ఒక కుమార్తె ఉంది. మద్యానికి బానిసైన నాగరాజు రోజూ తాగొచ్చి భార్యతో గొడవపడేవాడు. అదనపు కట్నం తీసుకురావాలంటూ వేధించేవాడు. సోమవారం రాత్రి కూడా తాగి ఇంటికి వచ్చాడు. అదనపు కట్నం తీసుకురానందున మీ పుట్టింటి వారు ఇక్కడికి వచ్చినా, వారితో నీవు మాట్లాడినా తాను తెగదెంపులు చేసుకుని మరో పెళ్లి చేసుకుంటానంటూ నాగరాజు భార్యను హెచ్చరించాడు. అంతటితో ఆగక అలిగి కుమార్తెను తీసుకుని ఇంటి నుంచి రచ్చబండ వైపు వెళ్లిపోయాడు. మనస్తాపానికి గురైన వాణిశ్రీ ఇంట్లోనే ఇనుపరాడ్‌కు ఉరివేసుకుంది. కాసేపటి తర్వాత ఇంటికి వచ్చిన భర్త, స్థానికులు గమనించి ఉరికి వేలాడుతున్న వాణిశ్రీని కిందకు దించి గోరంట్ల ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యంలోనే ఆమె ప్రాణం విడిచింది. మెట్టినింటి వారిపై ఆగ్రహం తమ కుమార్తె వాణిశ్రీ మృతికి మెట్టినింటి వారి కట్నం వేధింపులే కారణమంటూ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు మృతురాలి తండ్రి వెంకటరామప్ప పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే కేసు నమోదులో ఆలస్యం చేస్తున్నారని నిరసన వ్యక్తం చేస్తూ బంధువులతో కలిసి మృతదేహంతో మంగళవారం ప్రభుత్వాస్పత్రి నుంచి బస్టాండ్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. వేధింపులకు గురి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ధర్మవరం డీఎస్పీ రమాకాంత్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. బాధితులతో చర్చించి న్యాయం చేస్తామని తెలపడంతో వారు శాంతించారు. ఐదుగురిపై కేసు నమోదు ఫిర్యాదును పలుమార్లు మార్చి ఇవ్వడంతో కేసు నమోదు చేయడానికి ఆలస్యమైందని సీఐ జయనాయక్ స్పష్టం చేశారు. వాణిశ్రీ మృతికి ఆమె భర్త నాగరాజుతో పాటు అతని సోదరులు నాగేంద్ర, రవి, శ్రీనివాసులు, ఆడపడుచు రత్నమ్మ కారణమని ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ఐదుగురిపైనా కేసు నమోదు చేశామన్నారు. వీరిని అదుపులోకి తీసుకున్నామన్నారు. -
వరకట్న వేధింపులతో వివాహిత ఆత్మహత్య
మహారాణిపేట(విశాఖ దక్షిణ): వరకట్న వేధింపులకు ఓ వివాహిత బలైపోయింది. గోపాలపట్నం పోలీసు స్టేషన్ పరిధిలోని నందమూరినగర్‌లో జరిగిన ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నందమూరి నగర్లో నారాయణ అపార్టుమెంటులో భర్త సత్తి సురేష్‌తో కలిసి భార్య మహాలక్ష్మి నివాసం ఉంటున్నారు. వీరికి 2009లో వివాహమైంది. వివాహ సమయంలో రూ.25 లక్షల నగదు, 60 కాసుల బంగారం, ఎకరా పొలం కట్నంగా ఇచ్చారు. అయినా ఇంకా అదనపు కట్నం కావాలని భర్త సురేష్ తరచూ వేధిస్తున్నాడు. వేధింపులు భరించలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో స్లాబ్ హుక్కుకు చీరతో మహాలక్ష్మి మంగళవారం ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఆమెకు ఒక బాబు ఉన్నాడు. మృతురాలి తండ్రి కృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గోపాలపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. -
వరకట్న వేధింపులకు వివాహిత బలి
పాతపోస్టాఫీసు (విశాఖ దక్షిణ): అదనపు కట్న వేధింపులు తాళలేక పాతనగరం పరిధి పంజాకూడలిలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. వన్‌టౌన్ పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం... పంజా కూడలిలో నివాసం ఉంటున్న తోట శంకరరావు తన కుమార్తె శ్వేత(31)కు శంకరమఠం రోడ్డులో నివాసముంటున్న పూసర్ల కృష్ణకాంత్‌తో రెండేళ్ల క్రితం పెద్దల సమక్షంలో వివాహం జరిపించారు. వివాహ సమయంలో అల్లుడికి రూ.4లక్షల నగదు, 20 తులాల బంగారం, రూ.1.5 లక్షల విలువ గల ఫర్నీచర్, మరో మూడు తులాల బంగారం శ్వేత తల్లిదండ్రులు ఇచ్చారు. అయినప్పటికీ వివాహం జరిగినప్పటి నుంచి అదనపు కట్నం కోసం శ్వేత భర్త కృష్ణకాంత్‌తోపాటు అతడి తండ్రి సత్యనారాయణ, కుటుంబ సభ్యులు వేధించసాగారు. తమకు అదనంగా రూ.20 లక్షల నగదుతోపాటు వంద గజాల స్థలం ఇవ్వాలని శ్వేతను వేధించారు. అత్తింటి వారి వేధింపులు తాళలేక శ్వేత తల్లిదండ్రుల ఇంటికి చేరుకుంది. ఈ నేపథ్యంలో గత నెల 18న కృష్ణకాంత్ తన భార్య శ్వేతకు విడాకుల నోటీసు పంపాడు. అప్పటి నుంచి మనస్తాపంతో బాధపడుతున్న శ్వేత శనివారం రాత్రి ఇంట్లో చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. శ్వేత తండ్రి శంకరరావు ఫిర్యాదు మేరకు వేధింపుల కేసు నమోదు చేసిన వన్‌టౌన్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. సీఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సిబ్బంది దర్యాప్తు చేస్తున్నారు. -
నవవధువు ఆత్మహత్య
అడ్డగుట్ట: వరకట్న వేధింపులు తాళలేక నవవధువు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన లాలాగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. లాలాగూడ రైల్వే క్వార్టర్స్‌కు చెందిన వెంకటేశ్వర్ లాలాగూడ క్యారేజ్ వర్క్‌షాప్‌లో టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు. ఇతనికి మూడు నెలల క్రితం ఆలేర్లోని కొలన్పాకకు చెందిన మమత(లాస్య)(20)తో వివాహం జరిగింది. కట్న కానుకలు రూ. 3లక్షలు, ఒక ప్లాట్ ఇచ్చి పెళ్లి చేశారు. నెల రోజులపాటు వీరి కాపురం సజావుగా సాగింది. తరువాత భర్త, అత్త, ఆడపడుచులు వరకట్నం విషయంలో మమతను నిత్యం వేధింపులకు గురి చేస్తుండేవారు. వేధింపులు ఎక్కువవ్వడంతో మమత తీవ్ర మనోవేదనకు గురైంది. శనివారం ఉదయం భర్త టిఫిన్ తీసుకురావడానికి బయటకు వెళ్లగా ఇంట్లో ఎవరూలేని సమయంలో మమత సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆలస్యంగా విషయం తెలుసుకున్న కుటుంసభ్యులు గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చందానగర్: వరకట్న వేధింపులు తాళలేక ఓ మహిళ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం చక్కలగూడెం గ్రామానికి చెందిన నర్సింహులు, మల్లమ్మల చిన్న కుమార్తె సంధ్య (24) అదే గ్రామానికి చెందిన వెంకట్‌ను ప్రేమించి 6 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఐదేళ్ల క్రితం నగరానికి వచ్చి చందానగర్‌లోని పాపిరెడ్డి కాలనీలో నివాసముంటున్నారు. వెంకట్ కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొద్ది రోజుల నుంచి వెంకట్ భార్య సంధ్యను కట్నం తీసుకురావాలని లేకపోతే తన పేరు మీద భూమిని రాయించాలని వేధిస్తున్నాడు.దీంతో సంధ్య శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
మెట్టినింట నరకం
కర్ణాటక, దొడ్డబళ్లాపురం: ఇద్దరూ ఆడపిల్లలే పుట్టారని, కొడుకు పుట్టలేదని కాబట్టి, అదనంగా కట్నం తేవాలని మహిళను భర్త, కుటుంబ సభ్యులు మానసికంగా, శారీరకంగా వేధించిన సంఘట న నెలమంగల పట్టణ పరిధిలోని గణేశగుడి వీ ధిలో జరిగింది. రమేశ్ అనే ప్రబుద్ధుడు మాన వత్వం లేకుండా భార్య అంజలి(28)ని కట్నం కోసం తీవ్రంగా హింసించాడు. దీనికి అత్త మంజుళ, మామ చిక్కరంగయ్య, మరదలు తేజస్విని, మరిది హేమంత్లు వంతపాడేవారు. అందరూ కలిసి ఒంటిపై వాతలు పె ట్టి నరకం చూపిస్తున్నారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఐదేళ్ల సంసారంలో ఇద్దరూ ఆడపిల్లలే పుట్టడంతో అధికవరకట్నం తీసుకురావాల ని తనను నిత్యం వేధిస్తున్నారని పేర్కొంది. ఒంటినిండా వాతలతో అంజలి ప్రస్తుతం నెలమంగల ప్రభుత్వాస్పత్రిలో చికిత్సపొందుతోంది. బాధితురాలి ఫిర్యాదుమేరకు పట్టణ పోలీసులు కేసు నమోదుచేసుకున్నారు. -
పెళ్ళై ఏడాది జరగకముందే..
విశాఖపట్నం, అనకాపల్లిటౌన్: వరకట్న వేధింపులకు మరో వివాహిత బలైంది. తుమ్మపాలలోని తన ఇంట్లో సంధ్యారాణి(26) అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. అయితే అత్తింటివారే హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించారని సంధ్యారాణి పుట్టింటివారు ఆరోపిస్తున్నారు. సంధ్యారాణి తండ్రి వై.నాగేశ్వరరావు ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అనకాపల్లి మండలంలోని తుమ్మపాల గ్రామానికి చెందిన వాయిబోయిన శ్యామ్‌కు, యలమంచిలికి చెందిన వై.సంధ్యారాణి(26)కి గత ఏడాది డిసెంబర్ 20న వివాహం జరిగింది. పెళ్లి సమయంలో సంధ్యారాణి తండ్రి నాగేశ్వరరావు రూ.ఎనిమిది లక్షల నగదు, ఒక వాహనం, సారె, తొమ్మిది తులాల బంగారం కట్నంగా ఇచ్చా రు. రూ.8 లక్షల కట్నంలో రూ.3లక్షలు పెళ్లి ఖర్చుల నిమిత్తం శ్యామ్ తల్లిదండ్రులకు ఇచ్చారు. మిగిలిన రూ.5 లక్షలు డిపాజిట్ చేశారు. డిపాజిట్ చేసిన రూ.5 లక్షలు తీసుకురావాలని ఐదునెలల నుంచి భర్త కుటుంబ సభ్యులు సంధ్యారాణిపై వత్తిడి తెచ్చారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. బుధవారం ఉదయం సంధ్యారాణి తన తల్లి వెంకటలక్ష్మికి ఫోన్ చేసి, డిపాజిట్ సొమ్ము కోసం చెప్పగా వచ్చే ఆదివారం పెద్దల సమక్షంలో నిర్ణ యం తీసుకుందామని ఆమె కుమార్తెను సముదాయిం చింది. కానీ అప్పటికే మనస్తాపంతో ఉన్న సంధ్యారాణి మధ్యాహ్నం ఆత్మహత్యకు పాల్పడినట్టుగా శ్యామ్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మృతురాలి తండ్రి నాగేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు డీఎస్పీ శ్రావణి ఆధ్వర్యంలో పోలీ సులు సంధ్యారాణి అత్త సత్యవతి, ఆడపడుచు లక్ష్మితోపాటు సంధ్యారాణి భర్త శ్యామ్‌పై కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. పెళ్ళై ఏడాది జరగకముందే సంధ్యారాణి ఆత్మహత్యకు పాల్పడ డం అందర్నీ కలచివేసింది. సంధ్యారాణి పుట్టిం టివారు అనుమానాలు వ్యక్తం చేయడంతో ఆ దిశగా కూడా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
చంపి బావిలో పడేశారని భర్తపై దాడి..
చిన్నశంకరంపేట(మెదక్): వివాహిత మహిళలను వేదింపులకు గురిచేసి చంపి బావిలో పడేశారని ఆరోపిస్తు చిన్నశంకరంపేట మండలం మల్లుపల్లి గ్రామానికి చెందిన చిట్కూల శ్రీలత బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని మల్లుపల్లి గ్రామానికి చెందిన చిట్కుల లింగం భార్య శ్రీలత(24) సోమవారం బావిలో శవమైతేలింది. ఇంట్లో గొడవపడి ఆదివారం ఇంటి నుంచి వెల్లిన శ్రీలత బావిలో పడి శవమై తేలడంతో, శ్రీలత తల్లి గ్రామమైన కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం భాగీర్థపల్లి గ్రామానికి చెందిన కుటుంబసభ్యులు, బంధువులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కాగా మంగళవారం మధ్యాహ్నహం మల్లుపల్లి గ్రామస్తులు, భాగిర్థిపల్లి గ్రామస్తులు పెద్దల సమక్షంలో విషయంపై పంచాయితీలో మాట్లాడుతుండగా ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి. ఒక్కసారిగా గుంపుగా మల్లుపల్లి సర్పంచ్ లక్ష్మి భర్త శంకరయ్యపై దాడికి దిగారు. విషయం గ్రహించిన పోలీస్‌లు వెళ్లి శంకర్యను వారి భారి నుంచి కాపాడి పోలీస్‌స్టేషన్ కి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో పోలీస్‌స్టేషన్ ఎదుట చేరి శ్రీలతను హత్య చేసీ బావిలో పడేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శంకర్యతో పాటు శ్రీలత అత్త, భర్తలను తమకు అప్పగించాలని పోలీస్‌లతో వాగ్వావాదానికి దిగారు. దీంతో తూప్రాన్ సీఐ స్వామిగౌడ్ భాగిర్థపల్లి గ్రామస్తులను సముదాయించారు. భాగిర్థపల్లి సర్పంచ్, మాజీ సర్పంచ్‌లతో మాట్లాడి గ్రామస్తులను పోలీస్‌స్టేషన్ బయటకు తీసుకువెళ్లాలని లేదా లాఠీ చార్జి చేయాల్సి వస్తుందని హెచ్చరించడంతో వారు గ్రామస్తులను సముదాయించి బయటకు తీసుకువెళ్లారు. భర్త, అత్తపై కేసు నమోదు... శ్రీలత మృతికి కారణమైన భర్త లింగం, అత్త కళవ్వలపై కేసు నమోదు చేసినట్లు చిన్నశంకరంపేట ఎస్ఐ ప్రకాష్‌గౌడ్ తెలిపారు. శ్రీలతను అత్తింటివారే వరకట్నం వేదింపులకు పాల్పడి హత్యచేశారని తల్లి బాలవ్వ పోలీస్‌లకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి శవపంచనామా అనంతరం పోస్ట్‌మార్టం కోసం మెదక్ అస్పత్రికి తరలించినట్లు తెలిపారు. తూప్రాన్ సీఐ స్వామిగౌడ్, డీఎస్పీ కిరణ్‌కుమార్ సంఘటనా స్థలం పరిశీలించారు. -
గర్భవతి అని చూడకుండా కడుపుపై తన్నాడు
మల్కాజిగిరి: ప్రేమించి పెళ్లి చేసుకుని అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మల్కాజిగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం ఇన్స్పెక్టర్ మన్మోహన్ వివరాలు వెల్లడించారు. వరంగల్‌కు చెందిన కృష్ణవేణి అలియాస్ షబానా(26)కు ఆరేళ్ల క్రితం హన్మకొండకు చెందిన రఫిక్‌తో పరిచయం ఏర్పడింది. ఇరువురు ప్రేమించుకున్నారు. మతం మారితేనే తమ కుటుంబసభ్యులు పెళ్లికి అంగీకరిస్తారని రఫిక్ చెప్పడంతో కృష్ణవేణి మతం మార్చుకుంది. 2013 ఆగస్టులో వారు వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కృష్ణవేణి అలియాస్ షబానాకు ఐదు సార్లు అబార్షన్ కావడంతో వేధింపులు ప్రారంభమయ్యాయి. రఫిక్‌తో పాటు అతని తల్లితండ్రులు, కుటుంబసభ్యులు తరచూ వేధిస్తుండడంతో హైదరాబాద్‌కు వచ్చిన ఆమె తల్లితో కలిసి మల్లికార్జుననగర్‌లో ఉంటోంది. ప్రస్తుతం గర్భిణి అయిన షబానాను రఫిక్ పట్టించుకోకపోవడమేగాక అదనపు కట్నం తేవాలని వేధిస్తున్నాడు. దీంతో గత జులైలో మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అతడిని పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా వేధింపులు మానుకోకపోవడంతో బాధితురాలు మంగళవారం రఫిక్ అతని కుటుంబసభ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాలితో తన్నాడు:కృష్ణవేణి అలియాస్ షబానా ప్రేమించిన వ్యక్తి కోసం మతాన్ని మార్చుకున్నాను. వేధింపులు తీవ్రం కావడంతో గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశాను. ఆ తర్వాత నుంచి వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. గర్బవతి అని చూడకుండా కడుపుపై తన్నాడు. తనకు పరిచయమున్న పోలీస్ అధికారితో బెదిరిస్తున్నాడు. అతని కుటుంబసభ్యులు సైతం వేరే పెళ్లి చేస్తామని బెదిరిస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. -
అదనపు కట్నం.. మహిళ బలవన్మరణం
అల్వాల్: అదనపు కట్నం కోసం భర్త వేధింపులు తాళలేక ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్ఐ. వరప్రసాద్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కూకట్‌పల్లికి చెందిన కిషన్‌రావు కుమార్తె ప్రత్యుష (33)కు అల్వాల్ న్యూ రెడ్డి ఎన్‌క్లెవ్‌కు చెందిన శశికాంత్‌రావు అలియాస్ రాముతో 2013లో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో రూ. 20 లక్షల నగదు, కిలో బంగారం కట్న కానుకలుగా ఇచ్చారు. వీరికి ఓ కుమార్తె. రెండేళ్ల క్రితం శశికాంత్ అదనపు కట్నం కోసం వేధించడంతో కిషన్‌రావు స్థలాన్ని అమ్మి రూ.50 లక్షలు ముట్టజెప్పాడు. అయితే మళ్లీ కొద్ది రోజులుగా ఇటీవల మళ్లీ వేధిస్తుండడంతో మనస్తాపానికిలోనైన ప్రత్యూష బుధవారం ఉదయం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య
రాంగోపాల్‌పేట్: వరకట్న వేధింపులు తాళలేక ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు, బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పార్శీగుట్టకు చెందిన శ్రావణ్‌కుమార్, జ్యోతి దంపతుల కుమార్తె హేమలత (23)కు ఆదయ్యనగర్‌కు చెందిన విజయలక్ష్మి, నర్సింగ్‌రావు దంపతుల కుమారుడు కిరణ్‌తో మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లి సమయంలో రూ.4.5 లక్షల కట్నం, బంగారు నగలు ఇచ్చారు. వీరికి ఓ కుమార్తె. కిరణ్, హేమలత ఆదయ్యనగర్‌లో నివసిస్తుండగా తల్లిదండ్రులు వేరుగా ఉంటున్నారు. అయితే గత కొద్ది రోజులుగా అత్త, మామ, భర్త, ఆడపడుచు అదనపు కట్నం తేవాలని ఆమెను వేధిస్తున్నారు. వారి వేధింపులు తాళలేక హేమలత గత జనవరిలో షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలియడంతో కిరణ్ కేసు వాపసు తీసుకోకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో కేసు వెనక్కి తీసుకుంది. ఆ తర్వాత కూడా కిరణ్ అతడి కుటుంబ సభ్యులు తరచూ వేధింపులకు గురిచేస్తున్నారు. కొద్ది రోజులుగా బైక్ కొనుక్కునేందుకు డబ్బు తీసుకు రావాలని ఒత్తిడి చేస్తుండటంతో సోమవారం ఉదయం ఆమె సోదరుడికి ఫోన్ చేసి విషయం చెప్పింది. తన భర్తకు మరో పెళ్లి చేస్తామని అత్త, మామ, ఆడపడుచు బెదిరిస్తున్నారని, పెద్ద మనుషులను పిలిపించి పంచాయితీ పెట్టించాలని కోరింది. అయితే మధ్యాహ్నం 12 గంటలకు ఆమె ఇంట్లో సీలింగ్ ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు హేమలత కుటుంబ సభ్యులకు సమాచారం అందడంతో ఆమె కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో ఆదయ్యనగర్ చేరుకున్నారు. అత్తింటివారే ఆమెను హత్య చేశారని ఆరోపిస్తూ మృతదేహాన్ని తరలించకుండా అడ్డుకున్నారు. హేమలత ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదన్నారు. పెళ్లికి ముందు ఉద్యోగం చేస్తున్నాడని రూ.25వేల జీతం వస్తుందని చెప్పి తమను మోసం చేశారని, అతను ఉద్యోగం లేకుండా ఆవారాగా తిరుగుతున్నాడని ఆరోపించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారికి నచ్చచెప్పి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య
భాగ్యనగర్ కాలనీ: వరకట్న వేధింపులు తాళ లేక ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కూకట్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కూకట్పల్లి సంగీత్‌నగర్‌లో ఉంతటున్న నరేష్, జ్యోతి (20) ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. గత కొంత కాలంగా కట్నం లేవాలని నరేష్ జ్యోతిని వేధిస్తున్నాడు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు జోక్యం చేసుకుని పెద్దమనుషులతో పంచాయితీ చేయడంతో సమస్య సద్దుమణిగింది. గత కొద్ది రోజులుగా పుట్టింటికి వెళ్లి రూ. లక్ష తీసుకురావాలని జ్యోతిని వేధిస్తున్నాడు. దీంతో మనస్తాపానికిలోనైన జ్యోతి శనివారం రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి సోదరుడు జవహర్లాల్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతో వృద్ధుడు.. మేడిపల్లి: ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కాచివాణి సింగారం గ్రామ పరిధిలోని సుప్రబాత్ టౌన్షిప్లో ఉంటున్న చింత మల్లేశ్(65) సింగరేణిలో పనిచేసి రిటైర్ అయ్యాడు. ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న అతను భార్యతో కలిసి 15 రోజులుగా కుమారుడు వంశీ ఇంట్లో ఉంటున్నాడు. శనివారం రాత్రి కుటుంబ సభ్యులు నిద్రిస్తుండగా గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. ఆదివారం ఉదయం దీనిని గుర్తించిన కుటుంబసభ్యులు అతడిని కిందకు దించి చూడగా అప్పటికే మృతి చెంది ఉన్నాడు. పోలీసులు మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
సంసారానికి పనికిరాకున్నా.. ఘరానా మొగుడు
సాక్షి, పాకాల : నపుంసకత్వాన్ని కప్పిపుచ్చి ఒక యువతిని వివాహం చేసుకుని ఆమె జీవితాన్ని నాశనం చేయడమే కాకుండా అదనపు వరకట్నం కోసం చిత్రహింసలకు గురి చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కోటి ఆశలతో అత్తారింట అడుగు పెట్టిన ఆమె కలలన్నీ కల్లలయ్యాయి. సంసార జీవితానికి పనికిరాడనే విషయంపై భర్తనపు నిలదీయడంతో చిత్రహింసలు పెట్టడం ప్రారంభించారు. దీంతో బాధితురాలు మరో యువతి బలి కారాదనే ఉద్దేశంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. చిత్తూరు జిల్లా పాకాల మండలంలోని దామలచెరువు పంచాయతీ మొరవపల్లెకు చెందిన వ్యవసాయ నేపథ్యం కలిగిన ఉషారాణి, రాజేంద్రనాయుడు(లేట్) దంపతుల కుమార్తె బి.దీపిక ఎంబీఏ చదివింది. చిత్తూరు రామ్‌నగర్ కాలనీలో నివాసం ఉం టున్న సుజాత, గోవిందస్వామినాయుడుల కుమారుడు ఎం.జి.శ్యాంప్రసాద్ (సాఫ్ట్వేర్ ఉద్యోగి)తో 2017 ఆగస్టు 13న తిరుమలలో పెద్దల సమక్షంలో ఘనంగా వివాహం చేశారు. వరకట్నంగా రూ.2 లక్షలు, అదనంగా మరో లక్షతోపాటు, శ్యాంప్రసాద్‌కు 25 గ్రాముల బంగారు నగలు ఇచ్చారు. శ్యాంప్రసాద్, దీపిక ఇద్దరూ బెంగళూరులోనే ఉద్యోగం చేస్తుండడంతో అక్కడే కాపురం పెట్టారు. బండారం బట్టబయలు అయితే, శ్యాంప్రసాద్ సంసార జీవితానికి పనికిరాడని రోజుల వ్యవధిలోనే దీపిక తెలుసుకుంది. అతని వద్ద కొన్ని రకాల మాత్రల ప్రిస్కిప్షన్ లభించడంతో ఆమె అనుమానించింది. ఆ మాత్రలు పుంసత్వం కోసం వాడతారని, అతను గుట్టుగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టు తెలుసుకుంది. ఇదే విషయమై భర్తతోపాటు అత్తమామలను నిలదీసింది. తమ కుమారుడు సంసార జీవితానికి పనికిరాడని వారు వెల్లడించారు. ఈ విషయం చెప్పి పరువు తీయొద్దని ప్రాధేయపడటంతో బాధను దిగమింగింది. తన జీవితాన్ని నాశనం చేశారంటూ దీపిక అసలు విషయాన్ని తన తల్లికి చెప్పుకుంది. దిగ్భ్రాంతికి గురైన ఆమె తమ బంధువులతో వియ్యంకులను ఈ విషయంగా ప్రశ్నించడంతో వారు దీపికపై కక్ష కట్టారు. అదనపు కట్నం మరో లక్ష రూపాయలు తేవాలంటూ అత్తమామలు వేధించసాగారు. భర్త ఇష్టానుసారంగా కొట్టడం ప్రారంభించాడు. మరో పెళ్లి చేసుకుంటానని, దిక్కున్న చోట చెప్పుకో అంటూ దాష్టీకం ప్రదర్శించేవాడు. వారి బాధలు పడలేక దీపిక పాకాల పోలీసులకు ఫిర్యాదు చేసింది. వరకట్న రూపంలో ఇచ్చిన లాంఛనాలతో పాటు వివాహానంతరం జీతం తాలూకు సొమ్మును ఇప్పటివరకు దాదాపు 3లక్షల రూపాయలు భర్తకు ఇచ్చానని, వాటన్నింటికీ ఇప్పించాలని, తనను వేధిస్తున్న భర్త, అత్తమామలు, మరదులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరింది. నిందితులను అరెస్ట్ చేశామని, వారిపై చార్జిషీటు దాఖలు చేయనున్నట్టు ఎస్ఐ చెప్పారు. -
కట్నం వేధింపులకు వివాహిత బలి
కర్ణాటక , కృష్ణరాజపురం : అదనపు కట్నం వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సోమవారం హగ్గనహళ్లి క్రాస్‌లో చోటు చేసుకుంది. నాగమంగల ప్రాంతానికి చెందిన శ్వేతకు పదేళ్ల క్రితం బెంగళూరు నగరానికి చెందిన సంతోష్ అనే వ్యక్తితో వివాహమైంది. కొద్ది కాలం సవ్యంగానే ఉన్న సంతోష్ కుటుంబ సభ్యులు కొద్ది కాలంగా అదనపు కట్నం కోసం శ్వేతను వేధించసాగారు. భర్త సంతోష్‌తో పాటు అత్తమామల వేధింపులు కూడా రోజురోజుకు తీవ్రతరం కావడంతో వేధింపులు తాళలేక సోమవారం ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. రాజగోపాల్ నగర పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
పిల్లలను దూరం చేశారు
టెక్కలి: అదనపు కట్నం కోసం భర్తతోపాటు అత్తింటివారు కొన్నేళ్లుగా చిత్రహింసలకు గురి చేశారు. చివరకు పిల్లల్ని నా నుంచి దూరం చేశారు. న్యాయం కోసం అధికారుల చుట్టూ తిరిగినా సరైన న్యాయం అందలేదు. పిల్లల్ని పంపించేంత వరకూ పోరాటం చేస్తానంటూ కోటబొమ్మాళి మండలం చిన్నసాన గ్రామానికి చెందిన వివాహిత డొంకాన నిరోష తన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో మంగళవారం టెక్కలి సీఐ కార్యాలయం ఎదుట మౌన పోరాటానికి దిగింది. అంతకు ముందు సీఐ శ్రీనివాస్‌ను కలిసి తనకు న్యాయం చేయాలని కోరింది. పిల్లలిద్దరూ తండ్రి వద్ద ఉన్నారు. చట్టపరంగా పిల్లల్ని అందజేస్తామని సీఐతో తండ్రి తెలిపాడు. దీంతో ఆమె సీఐ కార్యాలయం ఎదుట బైఠాయించి మౌన పోరాటానికి దిగింది. బాధితురాలు నిరోష విలేకర్లతో మాట్లాడుతూ...కోటబొమ్మాళి మండలం చిన్నసాన గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు డొంకాన మోహన్‌రావుతో 2016లో తనకు వివాహం జరిగిందన్నారు. సంతబొమ్మాళి మండలం నగిరిపెంట గ్రామానికి చెందిన తన తల్లిదండ్రులు రూ.6లక్షల నగదు, 9 తులాల బంగారం, రూ.50వేల ఆడపడుచుల కట్నం, రూ.70 వేల విలువైన ద్విచక్రవాహనం కట్నంగా ఇచ్చారని తెలిపింది. పెళ్లైన రెండు నెలల తర్వాత నుంచి అదనపు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టారని వాపోయింది. తన భర్త అన్న కృష్ణారావు పలుమార్లు తీవ్రంగా కొట్టారని ఆవేదన చెందింది. అత్తమామలు వజ్రం, రామారావు, బావ కృష్ణారావు, తోటి కోడలు దమయంతి ప్రోద్బలంతో తన భర్త తీవ్రంగా వేధించేవాడని తెలిపింది. తనకు న్యాయం చేయాలని పలుమార్లు స్థానికంగా ఉన్న పోలీసులతో పాటు జిల్లా స్థాయి పోలీసుల చుట్టూ తిరిగానని, అయినా న్యాయం జరగలేదని వాపోయింది. ఇద్దరు పిల్లల్ని తన నుంచి దూరం చేశారని, తక్షణమే పిల్లల్ని తనకు అప్పగించి న్యాయం చేయాలని వేడుకుంది. ఆమెకు కుల నిర్మూలన పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు బి.ప్రభాకరరావు మద్దతు పలికారు. -
వరకట్నం తీసుకురావాలని దాడి
భామిని: వరకట్న వేధింపులు చేస్తూ భార్యను ఇంట్లో నుంచి ఈడ్చికొచ్చి భర్త దాడి చేయడంతో తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన సోమవారం మండలంలోని సొలికిరి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కొత్తకోట భానుమతికి వెంకటరమణకు 23 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమారుడు సాయి (22) ఉన్నాడు. ఈ నేపథ్యంలో పుట్టింటి నుంచి వరకట్నం పేరున భూములు రాయించుకు తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఇంటి నుంచి వెళ్లగొట్టాడు. ఈమెతోపాటు అడ్డుకున్న కుమారుడికి గాయాలయ్యాయి. వీరిని కొత్తూరు ఆసుపత్రికి తరలించారు. భార్యను వదిలించుకోవాలనే వరకట్నం పేరున వేధిస్తున్నట్లు బత్తిలి ఎస్సై అజార్‌అహ్మద్‌కు గ్రామస్తులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మెట్టినింటి ముందు భార్య మౌనదీక్ష..
అనంతపురం, ఉరవకొండ: అడిగినంత కట్న కానుకలు.. అంగరంగ వైభవంగా పెళ్లి.. ఏడాది తర్వాత భార్యపై భర్తకు అనుమానం.. ప్రతి చిన్న విషయాన్నీ బూతద్దంలో చూపుతూ వేధింపులు.. రెండేళ్లుగా అదనపు కట్నం కోసం ఒత్తిళ్లు.. భర్తను కలవనీయని అత్తమామలు.. పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకపోవడంతో ఆ ఇల్లాలు మెట్టినింటి ఎదుట మౌనదీక్షకు కూర్చుంది. న్యాయం జరగకపోతే ఈ ఇంటి వద్దే ఆత్మహత్య చేసుకుంటానని కన్నీరుమున్నీరవుతూ ప్రకటించింది. ఉరవకొండ మండలం వెలిగొండ గ్రామంలో మంగళవారం ఈ ఘటన జరిగింది. బాధితురాలు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. తాడిపత్రికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి జి.నాగరంగయ్య, కాంతమ్మ దంపతుల పెద్ద కుమార్తె ఝాన్సీరాణికి ఉరవకొండ మండలం వెలిగొండ గ్రామానికి చెందిన మొక్కిన శ్రీరాములు, సువర్ణమ్మ దంపతుల కుమారుడు మొక్కిన నరేష్‌కు 2015 మార్చి 8న వివాహమైంది. కట్న కానుకలకింద నరేష్‌కు రూ.10 లక్షల నగదుతో పాటు 40 తులాల బంగారం ఇచ్చారు. దీంతో పాటు రూ.5లక్షలు ఖర్చు పెట్టి అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించారు. నరేష్ ముంబైలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుడంతో అక్కడే కాపురం పెట్టారు. అనుమానంతో చిత్రహింసలు ఏడాది పాటు సంసారం సాఫీగా సాగిపోయింది. ఆ తర్వాత నుంచి భర్త ప్రతి చిన్న విషయానికీ అనుమానంతో ఝాన్సీరాణిని ఇబ్బంది పెట్టేవాడు. దీనికి తోడు నరేష్ తన తల్లిందండ్రుల మాట విని అదనపు కట్నం కోసం వేధించసాగాడు. మీ పుట్టింటికి వెళ్లి రూ.20లక్షలు తీసుకురా (అదనపు కట్నం) అంటూ ముంబైలో నిత్యం వేధింపులకు గురిచేశాడు. వేధింపులు తట్టుకోలేక ఝాన్సీరాణి తన తల్లిదండ్రులకు విషయం చెప్పింది. దీంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు తమ కుమార్తెను అల్లుడు ఏమైనా చేస్తాడేమోనన్న భయంతో 2017జూన్‌లో తాడిపత్రికి తీసుకొచ్చారు. దీనిపై ఎన్నోసార్లు నరేష్‌తో, వారి తల్లిదండ్రులతో మాట్లాడించడానికి ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఝాన్సీరాణి న్యాయం కోసం ఎస్పీ అశోక్‌కుమార్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో ఉరవకొండ స్టేషన్లో కుడా ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదు. నరేష్ తండ్రి శ్రీరాములుకు కొంతమంది అధికార పార్టీ నాయకుల అండదండలు ఉండటంతో వారిపై పోలీసులు చర్యలు తీసుకోలేక పోతున్నారన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. భర్త ఇంటి ముందే ఆత్మహత్య చేసుకుంటా: తనకు తనభర్తతో కలిసి జీవించేలా చేయకపోతే, వారి ఇంటి ముందే ఆత్మహత్య చేసుకుంటానని ఝాన్సీరాణి స్పష్టం చేసింది. భర్త ఇంటి ముందే మౌనదీక్ష కొనసాగిస్తోంది. -
భర్త, అత్తమామల వేదింపులు..శ్రీలత ఆత్మహత్య
-
అత్తారింటి ఎదుట కోడలి శవంతో ధర్నా
రామంతాపూర్: భర్త, అత్తమామల అదనపు కట్నం వేదింపులు భరించలేక జువ్వాడి శ్రీలత (32) ముంబాయిలోని తన మేనమామ వెంగళ్రావు ఇంట్లో సోమవారం ఆత్మహత్య చేసుకుంది. మంగళవారం రాత్రి రామంతాపూర్‌లోని అత్తాగారింటికి శ్రీలత మృతదేహాన్ని బంధువులు తీసుకొచ్చారు.విషయం తెలుసుకున్న శ్రీలత అత్తమామలు జువ్వాడి రాజేశ్వర్‌రావు, ఆశాలతలు ఇంటికి తాళం వేసి పరారయ్యారు. దీంతో బంధువులు వారి ఇంటి ఎదుట శ్రీలత మృతదేహాన్ని ఉంచి ఆందోళన కు దిగారు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... 2011లో జువ్వాడి వంశీరావుతో శ్రీలతకు వివాహం జరిగింది. వీరికి ఒక పాప. ఆడపిల్ల పుట్టిందని అత్తామామలు, భర్త వేధింపులు ఎక్కువవయ్యారు. ఈ క్రమంలోనే కూతురిని పెడుతున్న వేధింపులు భరించలేక శ్రీలత తల్లిదండ్రులు పీసర శ్రీనివాస్‌రావు, చంద్రకళ మనోవేదనతో మృతి చెందారని బందువులు తెలిపారు. -
వరకట్న వేధింపుల కేసులో ప్రభుత్వ వైద్యుడి అరెస్ట్
తూర్పుగోదావరి ,అమలాపురం టౌన్: అమలాపురం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్న సూరిశెట్టి విద్యాసాగర్‌పై వరకట్నం, హత్యాయత్నం కేసులు నమోదు అయ్యాయి. ఆయన భార్య సూరిశెట్టి మణిక ఇచ్చిన ఫిర్యాదుపై పట్టణ సీఐ కోలా రజనీకుమార్ దర్యాప్తు చేశారు. దీంతో డాక్టర్ విద్యాసాగర్‌ను సీఐ రజనీకుమార్ ఆ రెండు సెక్షన్ల కింద బుధవారం అరెస్ట్ చేసి మేజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరిచారు. ఇదే కేసులు నిందితులుగా ఉన్న డాక్టర్ విద్యాసాగర్ తల్లిదండ్రులు ఉన్నారు. వారిని అరెస్ట్ చేయాల్సి ఉంది. డాక్టర్‌కు కోర్టు 14 రోజల రిమాండ్ విధించడంతో డాక్టర్‌ను సబ్ జైలుకు తరలించారు. ఈ కేసు సంబంధించిన వివరాలను సీఐ రజనీకుమార్ వివరించారు. ప్రస్తుతం అమలాపురంలో ప్రభుత్వ వైద్యుడిగా పనిచేస్నున్న విద్యాసాగర్ పట్టణంలోని ఎస్ఎస్ నాయుడు లే అవుట్‌లోని సాయిరామ్ ఫ్లాజాలో నివసిస్తున్నారు. బాధితురాలైన డాక్టర్ భార్య అయిన మణిక ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం... వీరికి 2014 మే 24న విశాఖలోని దసపల్లా హోటల్లో పెళ్లి జరిగింది. ఆ సమయంలో తన తల్లిదండ్రులు రూ.పది లక్షల నగదుతో పాటు విశాఖ మహానగరంలో పలు చోట్ల మూడు ఇళ్ల ప్లాట్లు, కొంత భూమి కట్నంగా ఇచ్చారని భార్య మణిక ఫిర్యాదులో పేర్కొంది. డాక్టర్ విద్యాసాగర్ కట్నంగా ఇచ్చిన ఆస్తులన్నీ కాబోయే తన భార్య పేరున రాసి ఇస్తేనే వివాహం చేసుకుంటానని మెలిక పెట్టడంతోపాటు ఒత్తిడి కూడా తేవడంతో మణిక తల్లిదండ్రులు వరకట్నంగా ఇచ్చిన ఆస్తులన్నీ రాసి ఇచ్చారు. వారి వివాహమైన తర్వాత వారి కాపురం ఏడాది పాటు సజావుగా సాగింది. తర్వాత తన భర్త చెడు అలవాట్లు, మద్యానికి బానిసై అదనపు కట్నం కోసం వేధించారని పేర్కొంది. తన పేరున ఉన్న కట్నంగా ఇచ్చిన ఆస్తులను తన పేరున రాయాలని భర్తే కాకుండా ఆయన తల్లిదండ్రులు కూడా తనను నిత్యం వేధించారని ఆ ఫిర్యాదులో వివరించింది. చివరకు తన పేరున ఉన్న ఆస్తులను పెద్దల తగువులో తన పేరున, భర్త పేరున రాసేందుకు నిర్ణయించారు. ఇంతలో గత మార్చి నెలలో తన భర్త విద్యాసాగర్‌కు అమలాపురం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఉద్యోగం రావడంతో పట్టణంలో కాపురం పెట్టామని, నెల రోజులు తనను బాగానే చూసుకున్నారని మణిక పేర్కొంది. పది రోజుల క్రితం తమకు ఉన్న ఓ ప్లాట్‌ను అమ్మేద్దామని.., తనపై ఒత్తిడి తేవడం మొదలు పెట్టారని, అంతే కాకుండా అప్పటికే ఆయన ఒత్తిడితో అమ్మేసిన రెండు ప్లాట్ల సొమ్ముతో వేరే చోట కొత్త ప్లాట్ కొన్నానని తనను నమ్మించారే తప్ప దానిని తనకెప్పుడు చూపించలేదని ఫిర్యాదులో తెలిపింది. ఇదిలా ఉండగా గత నెల 28న పట్టణంలోని వారి వసతి ఇంట్లో ప్లాట్ అమ్మే విషయంలో భార్యభర్తలకు వాగ్వివాదం జరిగిందని పోలీసులు పేర్కొన్నారు. ఆ ఘటనలో డాక్టర్ విద్యాసాగర్ భార్య మణికి పీక నొక్కేసి తలను నేలనేసి కొట్టి చంపే ప్రయత్నం చేశాడన్న అభియోగంపై డాక్టర్‌పై అదనపు కట్నం కోసం వేధింపులు, హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్టు సీఐ రజనీకుమార్ తెలిపారు. -
వరకట్న వేధింపులకు నవవధువు బలి
విశాఖపట్నం, పాయకరావుపేట: వరకట్న వేధింపులకు ఓ నవ వధువు బలైంది. పెళ్లై రెండు నెలలు కూడా గడవక ముందే తనువు చాలించింది. భర్త వేధింపులు తాళలేక ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తన కుమార్తె ఆత్మహత్యకు అల్లుడే వేధింపులే కారణమని మృతురాలి తండ్రి లక్ష్మయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు.పాయకరావు పేటలో మంగళవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణా రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లా చినగూడూరు మండలం మన్నె గూడెం గ్రామానికి చెందిన మూలంపల్లి ఉమ(25)కు, అదే రాష్ట్రానికి చెందిన ఖమ్మం జిల్లా కుసుమంచి మండలం పెరక సింగారం గ్రామానికి చెందిన వాసంశెట్టి వేణుగోపాల్‌తో ఈఏడాది ఫిబ్రవరి 20న వివాహం జరిగింది. వివాహ సమయంలో వరుడు కుటుంబానికి కట్నం కింద రూ.5 లక్షల నగదు, రూ.2 లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఇచ్చారు. మరో రూ.3 లక్షలు తర్వాత ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. వరుడు వేణుగోపాల్ నక్కపల్లి సమీపంలో ఉన్న హెటెరోకంపెనీలో పనిచేస్తున్నాడు. పాయకరావుపేటలో ఇల్లు అద్దెకు తీసుకుని నూతన దంపతులు కాపురముంటున్నారు. రెండు రోజుల క్రితమే ఇల్లు మారారు. పెళ్లయినప్పటినుంచి అదనపు కట్నం కోసం భార్యను వేధించడం మొదలు పెట్టాడు.భార్యతో తరచూ గొడవ పడుతుండేవాడని మృతురాలి తండ్రి తెలిపాడు. ఇతని వేధింపులు తాళలేక ఉమ మంగళవారం అర్ధరాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలిసిన మృతురాలి తల్లిదండ్రులు బుధవారం పాయకరావుపేట చేరుకుని భోరున విలపించారు. అడిగినంత ముట్టజెప్పినా సరే తన కూతురును అల్లుడే పొట్టన పెట్టుకున్నాడంటూ ఆరోపించారు. తెలంగాణా ప్రభుత్వం ఇచ్చే కల్యాణ లక్ష్మి పథకం కోసం సంతకం చేయడానికి కూడా డబ్బులు డిమాండ్ చేశాడని, ఈవిషయంలోకూడా గొడవ పడేవాడని విలపించాడు. తన మృతికి అల్లుడే కారణం అంటూ పాయకరావుపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
రాజేశ్వరి భర్త, అత్తపై కేసు నమోదు
సాక్షి, విశాఖపట్నం : అదనపు కట్నం కోసం ఆరు నెలల గర్భిణి అయిన గిరిజాల రాజేశ్వరి(23)పై అమానుషంగా దాడి చేసిన ఆమె భర్త దామోదర్, అత్త లలితలపై ఏయిర్పోర్ట్ జోన్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వివిధ సెక్షన్లకింద కేసు నమోదు చేసి వారిని కస్టడీలోకి తీసుకున్నారు. అనాద అయిన రాజేశ్వరిని ప్రేమించి పెళ్లి చేసుకున్న దామోదర్.. కొద్దిరోజులకే ఆమెను హింసించడం మొదలు పెట్టాడు. అదనపు కట్నం తేవాలంటూ తల్లి లలితతో చిత్రహింసలలకు గురిచేశారు. వారు పెట్టే హింసను తట్టుకోలేక రాజేశ్వరి బయటకు వచ్చి ఒంటరిగా ఉంటోంది. చదవండి : అభాగ్యురాలిపై కట్న పిశాచి పంజా కలర్స్ సంస్థలో పనిచేస్తూ బతుకుతున్న రాజేశ్వరి వద్దకు మంగళవారం మధ్యాహ్నం వచ్చిన దామోదర్ ఆస్పత్రికి తీసుకెళ్తానని ఇంటి నుంచి బటయకు తీసుకొచ్చి కారులో ఎక్కించాడు. అప్పటికే కారులో ఉన్న తల్లి లలితతోపాటు దామోదర్ విపరీతంగా కారులోనే కొట్టుకుంటూ పురుషోత్తపురం వరకూ తీసుకెళ్లారు. అక్కడ కారు నుంచి తప్పించుకున్న రాజేశ్వరి పెందుర్తి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని భర్త, అత్తలపై ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఆమె కేజీహెచ్ ప్రసూతి విభాగంలో చేరి చికిత్స పొందుతుంది. అన్ని పరీక్షలు పూర్తయితే తప్ప ఏ విషయం చెప్పలేమని వైద్యులు తెలిపారు. -
నిండు గర్భిణీని కాళ్లతో తన్నిన భర్త
-
అభాగ్యురాలిపై కట్న పిశాచి పంజా
పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణ): తల్లిదండ్రులు ఎవరో.. అయిన వారెవరో తెలియని మూడేళ్ల ప్రాయంలో దొరికిన చిన్నారిని, ఆమె అన్నను పోలీసులు ప్రేమ సమాజంలో చేర్పించారు. సమాజం అండతో చదువుకుని సొంత కాళ్లపై బతుకుతున్న క్రమంలో... ఆదర్శ వివాహం చేసుకున్న ఓ యువకుడు ఆ యువతికి ప్రస్తుతం నరకం చూపిస్తున్నాడు. అదనపు కట్నం తీసుకురావాలని అనాథ యువతిపై తల్లితో కలిసి దాడి చేస్తున్నాడు. ప్రస్తుతం ఆరు నెలల గర్భిణి అని కూడా చూడకుండా ఆ తల్లీకొడుకు దాష్టీకానికి పాల్పడడంతో సదరు యువతి పోలీసులను ఆశ్రయించింది. ప్రస్తుతం కేజీహెచ్‌లో చికిత్స పొందుతోంది. వివరాల్లోకి వెళ్తే... ప్రేమగా చూసుకోవాల్సిన భర్త, అత్త అదనపు కట్నం కోసం ఆరు నెలల గర్భిణిపై అమానుషంగా దాడి చేశారు. ప్రస్తుతం బాధితురాలు గిరిజాల రాజేశ్వరి (23) కేజీహెచ్ ప్రసూతి విభాగంలో చికిత్స పొందుతోంది. బాధితురాలు రాజేశ్వరి, ఆమె అన్న చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం... తల్లిదండ్రులు ఎవరో, ఎక్కడి వారో తెలియని రాజేశ్వరిని, ఆమె అన్న చంద్రశేఖర్‌ను పోలీసులు డాబాగార్డెన్స్ ప్రేమ సమాజంలో కొద్ది సంవత్సరాల కిందట అడ్మిట్ చేర్పించారు. అప్పటికి రాజేశ్వరికి మూడేళ్లు, చంద్రశేఖర్‌కు ఆరేళ్లు. ప్రేమ సమాజం అందించిన సాయంతో రాజేశ్వరి ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం వరకూ చదువుకొంది. అయితే యుక్త వయసు వచ్చిన వారు ప్రేమ సమాజంలో ఉండే అవకాశం లేనందున బ్యూటీషియన్ కోర్సు నేర్చుకుని ఎన్ఏడీ కొత్తరోడ్డులో సొంతంగా బ్యూటీపార్లర్‌ను పెట్టుకుంది. ముందే పెళ్లి చేసుకుని మోసగించి... వివాహం జరిగిన తర్వాత కొంత కాలం రాజేశ్వరిని బాగా చూసుకున్న అత్త, భర్త అదనపు కట్నం కోసం నరకం చూపించడం మొదలు పెట్టారు. ఇదే క్రమంలో ఆమె నడుపుతున్న బ్యూటీ పార్లర్, ఐదు తులాల బంగారు గొలుసును అమ్మించి దామోదర్ కారు కొనుక్కున్నాడు. అయితే దామోదర్‌కు స్వాతి అనే యువతితో ముండే వివాహం జరిగినట్లు ఆలస్యంగా తెలిసింది. ఒక రోజు రాజేశ్వరికి స్వాతి ఫోన్‌చేసి ఎలా అయినా చంపించేస్తానని హెచ్చరించింది. దీంతో రాజేశ్వరి భర్తను నిలదీయగా తనకు ఇదివరకే వివాహం జరిగిందని ఒప్పుకోవడంతోపాటు మరింతగా హింసించడం మొదలు పెట్టాడు. వివాహమైన రెండేళ్లలో మూడు అబార్షన్లు చేయించాడు. ప్రస్తుతం ఆరు నెలల గర్భవతి అయిన రాజేశ్వరిని అత్త, భర్త పెడుతున్న హింసలకు తట్టుకోలేక అత్తవారిల్లు వదిలి ఎన్ఏడీ కూడలిలో ఒంటిరిగా ఉంటోంది. కలర్స్ సంస్థలో పనిచేస్తూ బతుకుతున్న రాజేశ్వరి వద్దకు మంగళవారం మధ్యాహ్నం వచ్చిన దామోదర్ ఆస్పత్రికి తీసుకెళ్తానని ఇంటి నుంచి బటయకు తీసుకొచ్చి కారులో ఎక్కించాడు. అప్పటికే కారులో ఉన్న తల్లి లలితతోపాటు దామోదర్ విపరీతంగా కారులోనే కొట్టుకుంటూ పురుషోత్తపురం వరకూ తీసుకెళ్లారు. అక్కడ కారు నుంచి తప్పించుకున్న రాజేశ్వరి పెందుర్తి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని భర్త, అత్తలపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజేశ్వరి పరిస్థితిని గమనించి కేజీహెచ్‌కు వెళ్లాలని సూచించడంతో ఆస్పత్రిలోని ప్రసూతి విభాగంలో చేరి చికిత్స పొందుతుంది. అన్ని పరీక్షలు పూర్తయితే తప్ప ఏ విషయం చెప్పలేమని వైద్యులు తెలిపారు. కట్నం వద్దంటూనే వేధింపులు రాజేశ్వరి, ఆమె అన్న చంద్రశేఖర్ ప్రేమ సమాజంలో ఆశ్రయం పొందుతున్న సమయంలో అక్కడి వృద్ధాశ్రమంలో ఉన్న తన అమ్మమ్మను చూసేందుకు పురుషోత్తపురం ప్రాంతానికి చెందిన దామోదర్, అతడి తల్లి లలిత తరచూ వచ్చిపోతుండేవారు. ఆ క్రమంలో రాజేశ్వరితో పరిచయం పెంచుకున్నారు. ప్రేమ సమాజం నుంచి వెలుపలికి వచ్చి బ్యూటీ పార్లర్ తెరిచిన తరువాత తల్లీ కొడుకు రాజేశ్వరిని, ఆమె అన్న చంద్రశేఖర్‌ను కలుసుకున్నారు. రాజేశ్వరిని తన కొడుకు దామోదర్‌కు చేసుకుంటానని చెప్పారు. తమ పరిస్థితి మొదటి నుంచి చూస్తున్నారు కనుక కట్నకానుకలు ఇచ్చుకోలేమని చెప్పిన చంద్రశేఖర్‌తో అటువంటివి అక్కరలేదని చెప్పి, వివాహానికి ముహూర్తం పెట్టుకున్నారు. పెళ్లి ఇంకా వారం రోజులు ఉందనగా తమ వద్ద డబ్బులు లేవని, ఎలా అయినా డబ్బులు సర్దుబాటు చేయాలని దామోదర్ తల్లి లలిత చెప్పడంతో రాజేశ్వరి, చంద్రశేఖర్ రూ.1.20లక్షలు ఇచ్చారు. -
కట్టుకున్నోడే కడతేర్చాడు
చిన్నకోడూరు(సిద్దిపేట): జీవితాంతం కలిసి ఉంటాడనుకున్న భర్తే కాలయముడయ్యాడు. కట్నం కోసం కట్టుకున్న భార్య గొంతు నులిమి హత్య చేశాడు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లాలోని చిన్నకోడూరు మండల పరిధిలోని విఠలాపూర్‌లో బుధవారం కలకలం రేపింది. పోలీసులు, గ్రామస్తుల తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గంగసాని శ్రీనివాస్‌రెడ్డికి మంగమ్మతో 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు. కాగా శ్రీనివాస్‌రెడ్డి ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. ఈ నేపథ్యంలో మంగమ్మను కట్నం కోసం అత్తింటి వారు వేధింపులకు గురి చేయడంతో మనస్థాపం చెందిన మంగమ్మ 10 ఏళ్ల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఆ తర్వాత శ్రీనివాస్‌రెడ్డి కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్‌లో కూలీ పనులు చేసుకుంటూ అక్కడే ఉన్నాడు. ఈ క్రమంలో రాయచూర్‌కు చెందిన ఇందిర అనే మహిళతో పరిచయం ఏర్పడి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. తిరిగి శ్రీనివాస్ రెడ్డి స్వగ్రామమైన విఠలాపూర్‌కు వచ్చి ఇక్కడ కూలీ పనులు చేసుకుంటూ నివసిస్తున్నాడు. వీరికి లోకేష్(06) కుమారుడు ఉన్నాడు. కొద్ది నెలలుగా మరిది, అత్త, ఆడపడుచులు ఇందిరను కట్నం కోసం వేధింపులకు గురి చేశారు. ఈ విషయాన్ని ఇందిర తన సోదరుడికి సమాచారం అందించింది. అయినప్పటికీ వారి వేధింపులు అలాగే కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం రాత్రి భార్య, భర్తల మధ్య గొడవ జరిగింది. బుధవారం తెల్లవారు జామున శ్రీనివాస్‌రెడ్డి భార్య ఇందిరను గొంతు నులిమి హత్య చేశాడు. కాగా తానే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డట్లు చిత్రీకరించాడు. విషయం తెలుసుకున్న సిద్దిపేట అడిషనల్ డీసీపీ నర్సింహారెడ్డి, రూరల్ సీఐ వెంకట్రామయ్య, ఎస్ఐ అశోక్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట ఆస్పత్రికి తరలించే క్రమంలో మృతురాలి బంధువులు శ్రీనివాస్‌రెడ్డి, అత్త భూదవ్వ, ఆడపడుచు రేణుక, మరది కనకారెడ్డిలే హత్య చేశారని ఆరోపించారు. వారిని శిక్షించే వరకు ఇక్కడ నుంచి మృతదేహాన్ని తరలించొద్దని బీష్మించారు. దీంతో మృతురాలి భర్త శ్రీనివాస్‌రెడ్డి, అత్త భూదవ్వలను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. మృతురాలి సోదరుడు గట్టు వీరేశ్‌రెడ్డి ఫిర్యాదు మేరకు భర్త, అత్తింటి వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ అశోక్ తెలిపారు. ముందస్తుగా గ్రామంలో ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసు బలగాలను మోహరించారు. -
అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు
పంజగుట్ట: అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పని చేస్తున్న ఓ వ్యక్తి తన హోదాను అడ్డంపెట్టుకుని తనను పుట్టింటికి పంపి, కుమారుడికి మరో వివాహం చేసేందుకు యత్నిస్తున్నాడని భార్గవి అనే మహిళ ఆరోపించింది. శుక్రవారం ఆమె తన తండ్రి కోటేశ్వరరావుతో కలిసి సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో వివరాలు వెల్లడించింది. ఎల్బీ నగర్‌కు చెందిన ఎమ్.కోటేశ్వర రావు, నాగమణి దంపతుల కుమార్తె భార్గవికి, అంబర్‌పేటకు చెందిన అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎలిగి శంకర్, లక్ష్మి దంపతుల కుమారుడు శ్రీకాంత్‌కు 2017 జులై 28న వివాహం జరిగింది. పెళ్లి సమయంలో రూ.16 లక్షల నగదు, 30 తులాల బంగారం, 2 కిలోల వెండి, ఖర్చుల నిమిత్తం రూ. 5 లక్షలు ఇచ్చి ఘనంగా వివాహం జరిపించారు. అయితే ఆ తర్వాత కొన్నాళ్లకే అదనపు కట్నం తేవాలని లేని పక్షంలో కొడుకుతో కాపురం చేయించమని, అత్త, మామలు లక్ష్మి, శంకర్ వేధించినట్లు తెలిపింది. తన భర్తతో మాట్లాడాలన్నా మామ అనుమతి తీసుకోవాల్సి వచ్చేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై నిలదీస్తే భయబ్రాంతులకు గురి చేసేవారని ఆరోపించింది. అత్త, మామలు, ఆడపడుచులు, మరిది ప్రతి రోజు శారీరకంగా, మనసికంగా తనను హింసించే వారని, మరిది తన పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడని తెలిపారు. కుటుంబసభ్యులు బయటికి వెళితే తనను ఇంట్లో బంధించి బయటినుండి తాళం వేసుకుని వెళ్లేవారని తెలిపింది. 2018 నవంబర్ 1న హెల్త్‌కార్డు పేరుతో రూ.100 ఖాళీ బాండ్ పేపర్‌పై బలవంతంగా సంతకం చేయించుకున్నారని, దీనిపై భర్తను నిలదీస్తే నిన్ను వదిలించుకోవడానికి పరస్పర విడాకుల కోసం దరఖాస్తు చేసేందుకు సంతకాలు తీసుకున్నట్లు చెప్పాడని తెలిపింది. ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలు తన వద్ద ఉన్నట్లు పేర్కొంది. వారి వేధింపులు తాళలేక తల్లిందండ్రులకు చెప్పడంతో వారు మాట్లాడేందుకు ప్రయత్నించగా తన మామ శంకర్ హోదాను అడ్డం పెట్టుకుని తన చేతిలో కోర్టులు, పోలీస్‌శాఖ ఉన్నాయని, కుల సంఘాల మద్దతు ఉందని నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరని బెదిరించినట్లు తెలిపింది. పెద్దల సలహా మేరకు తాను పుట్టింటికి వెళ్లగా తన భర్త శ్రీకాంత్‌కు మరో వివాహం చేసేందుకు వివాహ వేదిక వెబ్సైట్లో బయోడేటా పెట్టినట్లు తెలిపింది. దీనిపై తాను సరూర్‌నగర్ మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారని తెలిపింది. అయితే శంకర్ కేసు దర్యాప్తు జరగకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించింది. తన మామ నుంచి తనకు, కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని, పోలీసులు రక్షణ కల్పించాలని కోరింది. ఇప్పటికైనా తన భర్తను తన వద్దకు పంపాలని వేడుకుంది. -
మహిళ ఆత్మహత్య
దుండిగల్: వరకట్న వేధింపులు తాళలేక ఓ మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్సై శేఖర్‌రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లా, యలమంచలి మండలం, మేడపాడు గ్రామానికి చెందిన పద్మదీపిక(35)కు నాలుగేళ్ల క్రితం రవికిరణ్‌తో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో కొంత నగదు, బంగారాన్ని కట్నకానుకలుగా అందజేశారు. వీరికి ఇద్దరు సంతానం. రెండేళ్ల క్రితం రవికిరణ్ కుటుంబంతో సహా నగరానికి వలస వచ్చి ఓ ప్రైవేట్ పరిశ్రమలో పని చేస్తున్నాడు. గత కొద్ది రోజులుగా అతను అదనపు కట్నం తేవాలని భార్యను నిత్యం శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడు. వేధింపులు తీవ్రం కావడంతో మనస్థాపానికి గురైన దీపిక ఆదివారం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీనిని గుర్తించిన కుటుంబ సభ్యులు ఆమెను కిందకు దింపి మియాపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. భర్త రవికిరణ్, అత్తమామలు తులసి లక్ష్మి, ఈశ్వర్రావు వేధింపుల కారణంగా తన సోదరి ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి సోదరుడు శివగణేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వరకట్న భూతానికి వివాహిత బలి
అనంతపురం, దొడ్డబళ్లాపురం : అనంతపురం జిల్లా పేరూరుకు చెందిన ఆంజనేయులు, ఆదెమ్మ దంపతుల కుమార్తె శాంత (26) వరకట్న వేధింపులకు బలైంది. వివరాలిలా ఉన్నాయి. ఎనిమిదేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన మల్లికార్జున్‌తో శాంతకు వివాహం జరిగింది. ఆనాటి నుంచి మల్లికార్జున్ శాంతను అదననపు కట్నం కోసం వేధించేవాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. కొన్నాళ్లక్రితం మల్లికార్జున్ భార్యతో కలిసి కర్ణాటకలోని దొడ్డబళ్లాపురం వలస వచ్చి శ్రీనగర్‌లో నివసించేవాడు. ఇక్కడ కూడా కట్నం కోసం గొడవపడేవాడని, ఈ క్రమంలో శాంతను కొట్టి హత్య చేసి ఇంట్లో ఉరివేసుకున్నట్టు చిత్రీకరించాడని, ఒంటిమీద గాయాలున్నాయని మృతురాలి తల్లి ఆదెమ్మ ఆరోపించింది. దొడ్డ పట్టణ పోలీసులు మల్లికార్జున్‌ను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. -
అదనపు కట్నం కోసం..
కర్ణాటక, చింతామణి : అదనపు కట్నం తీసుకురాలేదని భార్యను చితకబాదిన ఘటన తాలుకాలోని కత్తిరగుప్ప గ్రామంలో సోమవారం చోటుచేసుకొంది. వివరాలు... చింతామణి తాలూకా కత్తిరగుప్ప గ్రామానికి చెందని ఇమ్రాన్ ఖాన్‌తో అదే తాలూకా జంగమకోటకు చెందిన షబీరాతో ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు సంతానం. ఇమ్రాన్ ఖాన్ కుటుంబ పోషణ పట్టించుకోకుండా భార్య నగలు తాకట్టు పెట్టి జల్సా చేసేవాడని సమాచారం. ఈ క్రమంలో పుట్టింటి వారు పలుమార్లు సహాయం చేశారు. రెండు రోజుల క్రిందట షబీరాను డబ్బులు తీసురావాలని పుట్టింటికి పంపాడు. అయితే ఆమె డబ్బులు ఏమీ తీసుకురాకపోవడంతో ఆగ్రహించి భార్యను చితకబాదాడు. అతని తల్లిదండ్రులు సైతం అతనికి సహకరించారు. ఆమె స్పృహ తప్పిపోవడంతో ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అదనపు కట్నం కోసం వేధింపులు
అనంతపురం సిటీ: అదనపు కట్నం మెట్టినింటి వారి వేధింపులు తాళలేని ఓ మహిళ న్యాయం కోసం ఆందోళనకు దిగింది. భర్త ఇంటి ఎదుట చంటిబిడ్దతో బైఠాయించింది. ఈ ఘటన బుధవారం నగరంలోని శ్రీనగర్‌కాలనీలో చోటు చేసుకుంది. బాధితుల కథనం మేరకు... నగరంలో శ్రీనగర్‌కాలనీకి చెందిన శ్రీనివాసులుకు గుంతకల్లుకు చెందిన యామినితో 2016లో వివాహమైంది. అప్పట్లో కట్నం కింద రూ.15 లక్షల నగదు, 23 తులాల బంగారు నగలు, రెండు సెంట్ల స్థలం ఇచ్చారు. పెళ్లి అయినప్పటి నుంచి అదనపుకట్నం కోసం భర్త, అత్తమామాల నుంచి వేధింపులు ప్రారంభమాయ్యియి. భర్త తనను మానసికంగా, శారీరకంగా హింసించడంతో పాటు జేఎన్టీయూ అనుబంధ ఓటీఆర్‌ఐలో ఉద్యోగానికి రాజీనామా చేయించాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయంపై గతంలో గుంతకల్లు వన్‌టౌన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశామని తెలిపింది. అయితే పోలీసుస్టేషన్‌కు రావాలని చెప్పినా బేఖాతరు చేస్తున్నట్లు ఆరోపించింది. దీంతో తాను న్యాయం కోసం ధర్నాకు దిగినట్లు వివరించింది. దాదాపు రెండు గంటల పాటు చంటిబిడ్డతో భర్త ఇంటి ఎదుట ఆందోళన కొనసాగించింది. విషయం తెలుసుకున్న నాల్గవ పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాధితురాలికి సర్దిచెప్పారు. న్యాయం చేస్తామని, స్టేషన్‌కువచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు. దీంతో నాల్గవ పట్టణ పోలీసుస్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈమెకు మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆశాబీ, పద్మావతి, చేతివృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లింగమయ్య తదితరులు మద్దతు పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అదనపు కట్నం కోసం వేధిస్తున్న భర్త, అత్తమామలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
అదనపు కట్నం వేధింపులు తాళలేక..
హస్తినాపురం : అదనపు కట్నం వేధింపులు తాళలేక ఓ యువతి అపార్టుమెంటు నాలుగో అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. యాఖత్‌పుర ప్రాంతానికి చెందిన భువనగిరి రఘునాథ్‌కు సైదాబాద్ ఎస్బీహెచ్ కాలనీకి చెందిన వరాల సబిత, పృధ్వీరాజ్ దంపతుల కుమార్తె నివేదిత(29)తో గత జూలైలో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో 40 తులాల బంగారం , 2కిలోల వెండి, కొంత నగదును కట్నకానుకలుగా ఇచ్చారు. రఘునాథ్ మాదాపూర్‌లోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తుండగా, నివేదిత కూకట్‌పల్లిలోని ప్రైవేట్ స్కూల్ టీచర్ పనిచేస్తోంది. వీరు వనస్థలిపురం సుష్మసాయినగర్ కాలనీలోని అపార్టుమెంటులో ఉంటున్నారు. గత కొద్దినెలలుగా అదనపు కట్నం కోసం రఘునాథ్ తరుచూ భార్యను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడు. సమస్యను తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు నచ్చజెప్పి పంపారు. శనివారం సాయంత్రం భార్య, భర్తల మధ్య గొడవ జరిగింది. ఈ విషయం తెలియడంతో నివేదిత తల్లి దండ్రులు కుమార్తె ఇంటికి వచ్చి ఆదివారం తెల్లవారు జాము వరకు అక్కడే ఉండి కుమార్తె, అల్లుడికి నచ్చజెప్పి వెళ్లిపోయారు. ఆ తర్వాత కొద్దిసేపటికే నివేదిత అపార్టు మెంటు నాలుగో అంతస్తు పైకి వెళ్లి కిందకు దూకింది. తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి తండ్రి పృధ్వీరాజ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
నోటిలో శనగ మాత్ర వేసి.. చీరతో గొంతు బిగించి..
కర్నూలు, సంజామల: వ్యసనాలకు బానిసైన భర్త కట్నం కోసం కట్టుకున్న భార్యనే కడతేర్చాడు. ఈ ఘటన మండలంలోని ముదిగేడు గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సోముల హర్షవర్ధన్‌రెడ్డి అలియాస్ సోముల కుళ్లాయిరెడ్డికి వైఎస్ఆర్ జిల్లా కమలాపురం మండలం నలింగాయపల్లి గ్రామానికి చెందిన సుబ్బిరెడ్డి కుమార్తె సువర్ణతో 2014 జూన్ నెల 22వ తేదీన వివాహమైంది. పెళ్లి సమయంలో రూ.9 లక్షలు కట్నకానుకలు ఇచ్చారు. వీరికి కూతురు హర్షిత(4), కుమారుడు అన్విత్‌రెడ్డి(2)ఉన్నారు. అయితే పెళ్ళయిన ఏడాది నుంచే అదనపు కట్నం కోసం భార్యను వేధించ సాగాడు. తనకు రూ.30 లక్షలు కట్నం ఇచ్చేవారని తరచూ వేధించేవాడు. ఈ విషయాన్ని సువర్ణ తల్లిదండ్రులకు చెప్పగా ఒకసారి రూ.6 లక్షలు, మరోసారి రూ. 3 లక్షలు అదనపు కట్నం ఇచ్చారు. అయినా సంతృప్తి చెందని హర్షవర్ధన్ రెడ్డి మళ్లీ అదనపు కట్నం కావాలని భార్యను వేధించసాగాడు. సంక్రాంతి పండుగకు ఇస్తామని అత్తమామలు సర్దిచెప్పారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి భార్యతో గొడవపడ్డాడు. ఉదయం కూడా టిఫిన్ సరిగా చేయలేదని గొడవపెట్టుకున్నాడు. అయితే ముందే చంపాలని నిశ్చయించుకున్న భర్త భార్యను గట్టిగా అదిమిపట్టుకొని శనగల మాత్ర నోట్లో వేశాడు. బలవంతంగా శనగమాత్ర మింగించి నీరు తాగించాడు. అనంతరం చీరను గొంతుకు బిగించి చంపే ప్రయత్నం చేశాడు. భార్యను చంపేందుకు ఒడిగట్టిన భర్త ఆమె చావు బతుకుల్లో కొట్టుమిట్టాడడం చూసి దొంగలు బంగారం కోసం తన భార్యను చంపే ప్రయత్నం చేశారని నమ్మించే ప్రయత్నం చేశాడు. కోవెలకుంట్లలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సకు వెళ్ళగా పరిస్థితి విషమించిందని చెప్పడంతో అక్కడ నుంచి నంద్యాలకు తరలించే ప్రయత్నంలో మార్గమధ్యలో సువర్ణ మృతి చెందింది. విషయం తెలుసుకున్న కోవెలకుంట్ల సీఐ శ్రీనివాసరెడ్డి ముదిగేడు గ్రామానికి చేరుకొని విచారించాడు. భర్త తీరు పట్ల అనుమానం రావడంతో తనదైన శైలిలో విచారణ చేయడంతో భార్యను చంపేందుకు నోటిలో శనగమాత్రను మింగించి గొంతుకు చీరతో బిగించానని ఒప్పుకున్నాడు. మృతురాలి తండ్రి సుబ్బిరెడ్డి ఫిర్యాదు మేరకు భర్త, అత్తమామలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ అబ్దుల్ ఘనీ తెలిపారు. -
అదనపు కట్నం కోసం వేధింపులు
తూర్పుగోదావరి , అమలాపురం టౌన్: భర్త, అత్తమామలు తనను అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని ముమ్మిడివరం మండలం అనాతవరానికి చెందిన ప్రస్తుతం అమలాపురం హెచ్‌బీ కాలనీలో నివాసముంటున్న వాసంశెట్టి శ్రీలక్ష్మి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు ఆమె భర్త, అత్త మామలపై కేసు నమోదు చేసినట్టు పట్టణ సీఐ సీహెచ్ శ్రీరామ కోటేశ్వరరావు తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. శ్రీలక్ష్మి తండ్రి ముంబైలో టీవీ మెకానిక్‌గా పనిచేస్తూ రెండు నెలలకోసారి సొంతూరు ముమ్మిడివరం మండలం అనాతవరం వస్తూ ఉంటారు. శ్రీలక్ష్మిని 2004 మే 28న అమలాపురం రూరల్ మండలం బండార్లంక గ్రామానికి చెందిన వాసంశెట్టి రాంబాబుకు ఇచ్చి వివాహం చేశారు. వారి పెళ్లి అయ్యే సమయంలో భర్త రాంబాబు ముంబైలోనే నివాసముంటున్నాడు. పెళ్లి సమయంలో తన భర్తకు కట్నం కింద రూ.ఐదు లక్షలు ఇచ్చామని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ముంబైలో తన భర్త మేము అద్దెకు ఉంటున్న ఇంట్లోనే వదిలేసి తాను మాత్రం కోనసీమకు వచ్చేశాడని తెలిపింది. తనను భర్త, అత్త మామలు తరచూ అదనపు కట్నం కోసం వేధిస్తున్న దృష్ట్యా వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదు చేసింది. ఇటీవల తన తల్లిదండ్రులు బండార్లంకలోని తమ అత్త వారి ఇంటి వద్ద ఉంచి వెళ్లారని, అప్పటి నుంచి తనను మరీ వేధిస్తున్నారని తెలిపింది. అత్త మామలపై కూడా చర్యలు తీసుకోవాలని శ్రీలక్ష్మి ఫిర్యాదులో పేర్కొంది. -
వేధింపుల కేసులో ఎన్ఆర్ఐ రిమాండ్
బంజారాహిల్స్: అదనపు కట్నం కోసం వేధిస్తున్న ఓ ఎన్ఆర్ఐపై బంజారాహిల్స్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసి అతని తల్లిదండ్రులతో పాటు రెండో వివాహం చేసుకున్న యువతిని రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళితే .. కృష్ణాజిల్లా, నూజివీడు మండలం, సీతారాంపురం గ్రామానికి చెందిన కన్నెగంటి వంశీకృష్ణ ఆస్ట్రేలియాలో ఉంటున్నాడు. గుంటూరు జిల్లాకు చెందిన సిరిచందన అనే యువతితో 2015లో అతడికి వివాహం జరిగింది. ఆస్ట్రేలియాకు భార్యను తీసుకువెళ్లిన వంశీకృష్ణ ఆమెను శారీరకంగా, మానసికంగా వేధించడమే కాకుండా అదనపు కట్నం తేవాలంటూ ఒత్తిడి చేయసాగాడు. ఆమెను బలవంతంగా ఇండియాకు పంపించాడు. కుటుంబసభ్యులు, పెద్దమనుషులు నచ్చజెప్పినా అతడిలో మార్పు రాలేదు. అంతేగాకుండా ఇటీవల ఎవరికీ తెలియకుండా రెండో వివాహం చేసుకున్నాడు. దీంతో బాధితురాలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వంశీకృష్ణతో పాటు అతడి తల్లిదండ్రులు రామారావు, సీతామహాలక్ష్మిలపై చీటింగ్ కేసు నమోదు చేశారు. వీరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కాసేపట్లో పెళ్లి.. వరుడు పరార్
అనంతపురం, కదిరి: మరికొద్ది గంటల్లో పెళ్లి జరగాల్సి ఉంది. వధువు తల్లిదండ్రులు కట్నం రూపంలో ఇస్తున్న బంగారం స్వచ్ఛమైనది కాదంటూ వరుడు పరారయ్యాడు. గురువారం కదిరి పట్టణంలో చోటుచోసుకున్న ఈ సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. తనకల్లు మండలం బాలసముద్రం పంచాయతీ టీ సదుంకు చెందిన మహబూబ్‌బాషా ఒక్కగానొక్క కుమారుడు మహమ్మద్ రఫికి కదిరి మున్సిపల్ పరిధిలోని నిజాంవలి కాలనీకి చెందిన అమ్మాయితో వివాహం నిశ్చయమైంది. గురువారం ఉదయం 11.30 గంటలకు కదిరిలోని టైటానిక్ ఫంక్షన్ హాల్లో నిఖా(వివాహం) జరగాల్సి ఉంది. పెళ్లి హడావుడిలో ఎవరికి వారు నిమగ్నమై ఉన్నారు. ముహూర్తం సమయానికి పెళ్లి వరుడు కన్పించడం లేదని చెప్పడంతో వధువు తల్లిదండ్రులతో పాటు వారి బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ముందురోజు రాత్రే (బుధవారం) తనకు కట్నం రూపంలో ఇస్తున్న 10 తులాలు స్వచ్ఛమైన బంగారం (కేడీఎం) కాదంటూ తమతో గొడవకు దిగారని, పెద్ద మనుషులు సర్దిచెప్పడంతో సమస్య సద్దుమణిగిందని వధువు తరపు బంధువులు పేర్కొన్నారు. పెళ్లి ఏర్పాట్లతో పాటు పెళ్లి భోజనాల కోసం సుమారు రూ.లక్ష దాకా ఖర్చు అయిందని, బంగార ం కోసమే రూ.3లక్షలు దాకా ఖర్చు చేశామని, తీరా పెళ్లి సమయానికి వరుడు పరారై తమను అవమానం పాలు చేశారని వధువు తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. బీడీ బంక్ పెట్టుకొని జీవనం సాగిస్తున్నాడని, పెళ్లి కొడుకు మంచోడని కొందరు చెప్పడంతో ఈ సంబంధం కుదుర్చుకున్నామని, పెళ్లి కొడుకు ఇంత మోసగాడని ఇప్పుడే తెలుస్తోందని పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు పట్టణ సీఐ గోరంట్ల మాధవ్ ఎదుట పోలీస్ స్టేషన్లో వాపోయారు. కట్నం ఇంకా రూ.50 వేలు ఎక్కువ ఇస్తామని వేరే వాళ్లు చెప్పడంతో పెళ్లి కొడుకు పరారై ఆ సంబంధం చేసుకోవడానికి సిద్ధమైనట్లు తమకు తెలిసిందని వారు ఆరోపించారు. పెళ్లి కుమార్తెకు మద్దతుగా నిజాంవలి కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్ చేరుకొని బాధిత యువతికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
అదనపు కట్నం కోసం ఖాకీ వేధింపులు
సాక్షి,కర్ణాటక, బళ్లారి: అదనపు కట్నం కోసం కట్టుకున్న భార్యను గర్భవతి అని తెలిసినా కూడా చిత్రహింసలకు గురి చేస్తూ వేధిస్తున్న ఓ కానిస్టేబుల్‌పై భార్య మహిళా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. వరకట్నం విషయంలో పోలీసులు కూడా అతీతులు కాదని బళ్లారి జిల్లా పోలీసు కానిస్టేబుల్ నిరూపించారు. ఈసందర్భంగా బళ్లారి నగరానికి చెందిన నసీమా బేగం(25) అనే మహిళ తన భర్త కానిస్టేబుల్ మహబూబ్ బాషాపై మహిళా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పాటు సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో కూడా ఫిర్యాదు చేసింది. ఆమె మహిళా పోలీసు స్టేషన్లో తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బళ్లారి నగరంలోని కౌల్‌బజార్‌కు చెందిన నసీమా బేగంను తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన రూ.3 లక్షల నగదుతో పాటు మరో 10 తులాలు బంగారం లాంఛనాలుగా ఇచ్చి జిల్లాలోని మరియమ్మనహళ్లికి చెందిన మహబూబ్ బాషాతో ఏడాదిన్నర క్రితం ముస్లిం సంప్రదాయం ప్రకారం అన్ని విధాలుగా ఘనంగా వివాహం జరిపించారు. పెళ్లైన తర్వాత రెండు నెలలు సజావుగా వారి వైవాహిక జీవితం సాగిన అనంతరం కట్నం కోసం భర్త వేధింపులు మొదలు పెట్టారు. ప్రస్తుతం నసీమా బేగం ఆరు నెలల గర్భవతి కూడా అయినప్పటికీ పెళ్లి సందర్భంలో మాట్లాడిన మరో రెండు లక్షలు నగదు ఇవ్వాలని సంవత్సరం నుంచి వేధింపులతో పాటు ఆమెను చిత్రహింసలకు గురి చేసేవారు. కూతురుని కట్నం కోసం వేధిస్తున్నారని తెలిసి మనోవేదనతో తన తండ్రి ఇటీవల మృతి చెందినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. కట్నం కోసం వేధించడంతో పాటు కొట్టడం, మానసికంగా చిత్రహింసలు చేయడం అలవాటు చేసుకున్న మహబూబ్ బాషా తీరు మారదని నిర్ధారించుకున్న ఆమె చివరకు పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం జిల్లాలోని హొసపేటె నగరంలోని తుంగభద్ర డ్యాం పోలీసు స్టేషన్లో పని చేస్తున్న మహబూబ్ బాషాపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. ఈసందర్భంగా మహిళా పోలీసు స్టేషన్ సబ్ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ నసీమా బేగం తన భర్తపై అదనపు కట్నం ఇవ్వాలని వేధిస్తున్నారని ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
అనుమానం పెనుభూతమై..
విజయవాడ / ఉయ్యూరు : వివాహిత అనుమానాస్పద మృతిలో కొత్తకోణం వెలుగు చూసింది. అనుమానం పెనుభూతంగా మారి తాళి కట్టిన భర్తే ఉరి తాడు బిగించి కాలయముడయ్యాడు. హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించి తప్పుకునేందుకు చూడగా చివరకు పోలీసులు జరిపిన విచారణలో వాస్తవాలు వెలుగు చూడటంతో కటకటాలపాలయ్యాడు. ఉయ్యూరు సీఐ కాశీవిశ్వనాథం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని ఏజీకే నగర్లో ఆరేపల్లి రామలక్ష్మి (35) ఈ నెల 11న మృతి చెందింది. రేకుల షెడ్డులో ఉరి వేసుకుని వేలాడుతూ ఉండటంతో పోలీసులు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భర్త శివనాగమల్లేశ్వరరావు తన భార్య ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించాడు. లోపల గడియపెట్టి ఉండటంతో తొలుత అందరూ ఆత్మహత్యగానే భావించారు. మృతురాలి కుటుంబ సభ్యులు ఆత్మహత్య కాదు హత్యే అంటూ చెప్పడంతో పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టడంతో వాస్తవాలు వెలుగు చూశాయి. పెళ్లయిన ఏడాది నుంచే.. రామలక్ష్మితో 11 ఏళ్ల క్రితం శివనాగమల్లేశ్వరరావుకు వివాహమైంది. ఇరువురూ ఉయ్యూరుకు చెందిన వారే. పెళ్లి అయిన ఏడాది దాటినప్పటి నుంచి అదనపు కట్నం కోసం వేధించి చిత్రహింసలు పెడుతున్నాడు. భర్త వేధింపులు తాళలేక 2013లో పోలీస్ స్టేషన్లో రామలక్ష్మి కేసు పెట్టడం, పెద్దలు నచ్చచెప్పి లోక్ అదాలత్‌లో రాజీ చేయడం జరిగాయి. తన ఇద్దరు పిల్లల కోసం రామలక్ష్మి బాధలు పడుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. భార్య ఎవరితో మాట్లాడినా అనుమానిస్తూ రామలక్ష్మిని వేధించేవాడు. ఈ క్రమంలోనే తరచూ భార్యాభర్తల మధ్య వివాదం తలెత్తుతోంది. 15 రోజుల క్రితం అఘాయిత్యం.. కాగా, భర్త వేధింపులు తాళలేక 15 రోజుల క్రితం రామలక్ష్మి పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గుర్తించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించి ప్రాణాపాయం నుంచి బయటపడేసి నచ్చజెప్పి కాపురానికి పంపారు. ఈ నెల 11వ తేదీన ఇంటికి వచ్చిన రామలక్ష్మితో మళ్లీ గొడవపడ్డాడు. ఈ క్రమంలో ఆమెను మంచంపై నుంచి పడేసి చేతులు రెండూ కరెంటు వైర్లతో కట్టేసి దిండుతో మొహంపై నొక్కి ఊపిరాడకుండా చేసి ఆపై మెడను వైరుతో బిగించి చంపేశాడు. హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు మెడకు చీరను కట్టి రేకుల షెడ్డుకు వేలాడతీసి లోపలి పక్కన గడియపెట్టి తలుపు గుమ్మానికి, తడికకు మధ్య ఉన్న ఖాళీని ఆసరాగా చేసుకుని బయటకు వచ్చి సైకిల్‌పై ఏమీ తెలియనట్లు ఉడాయించాడు. పాఠశాల నుంచి ఇంటికి మధ్యాహ్న సమయంలో భోజనానికి వచ్చిన కుమార్తె తడికలో ఉన్న రంధ్రంలో నుంచి చూసి కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు తలుపులు పగలగొట్టి చూడగా వేలాడుతూ కనిపించింది. పోలీసుల కేసు విచారణలో భాగంగా నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తే అసలు విషయం బయటపడింది. అనుమానాస్పద మృతిని హత్య కేసుగా మార్పు చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు ఎస్ఐ సత్యశ్రీనివాస్ తెలిపారు. -
ఉరివేసుకుని మహిళ ఆత్మహత్య
కీసర: వరకట్న వేధింపులు భరించలేక ఓ మహిళ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కీసర పోలీస్‌స్టేషన్ పరిధిలోని నాగారం సత్యనారాయణ కాలనీలో శుక్రవారం చోటుచేసుకుంది. కీసర సీఐ ప్రకాష్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. యాదాద్రి జిల్లా, రాజంపేట మండలం, పాముకుంటకు చెందిన రజిత(23)కు అదే మండలం, గంధమల ఇందిరానగర్‌కు చెందిన రాగాల మహేష్‌తో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. బతుకుదెరువు నిమిత్తం వారు రెండేళ్ల క్రితం నాగారం వలస వచ్చారు. మహేష్ మేస్త్రీగా పని చేస్తున్నాడు. గతంలో పలుమారు భార్యభర్తల మధ్య అదనపు కట్నం విషయమై గొడవలు జరిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే గురువారం దంపతులిద్దరు పనికి వెళ్లగా మధ్యాహ్నం రజిత కడుపునొప్పిగా ఉందని ఇంటికి తిరిగివచ్చింది. సాయంత్రం ఇంటికి వచ్చిన మహేష్ రజిత ఉరివేసుకుని ఉండటాన్ని గుర్తించి కీసర పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. కాగా తమ కుమార్తెను గత కొంత కాలంగా భర్త, అత్త, ఆడపడుచులు అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని వారి వేధింపులు తాళలేకే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని రజిత తల్లిదండ్రులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. -
కట్నపాము
పెదవేగి మండలానికి చెందిన సునీత(పేరుమార్చాం)కు తొమ్మిదేళ్లక్రితం పెళ్లయింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెళ్లయినప్పటి నుంచి భర్త అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడు. రెండేళ్ల క్రితం వేధింపులు తారాస్థాయికి చేరడంతో భార్యాభర్తలు విడిపోయారు. బాధితురాలు సోమవరప్పాడు చల్లపల్లి చారిటబుల్ ట్రస్టు సభ్యులను ఆశ్రయించింది. వారు బాధితురాలి భర్త, అతని కుటుంబ సభ్యులకు పలుమార్లు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇప్పుడు సునీత భర్త, బిడ్డలతో ఆనందంగా జీవిస్తోంది. పశ్చిమగోదావరి, దెందులూరు: వరకట్నం.. సమాజాన్ని పట్టిపీడిస్తున్న దురాచారం. ఇది నానాటికీ పెరుగుతోంది. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దూసుకుపోతున్నా.. కట్నం లేనిదే పెళ్లి జరగని దుస్థితిలో ఇంకా యువతులు ఉన్నారు. జిల్లాలో వరకట్న వేధింపులకు ఎందరో అబలలు బలైపోతున్నారు. ఈ కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. నియంత్రణకు చట్టాలున్నా.. సరిగా అమలు కావడం లేదు.. ఫలితంగామానవ సంబంధాలు పూర్తిగా ఆర్థిక సంబంధాలుగామారుతున్నాయి. మార్పు ఎక్కడ రావాలి! పిల్లల పెళ్లిళ్ల విషయంలో తల్లిదండ్రుల్లో మార్పు రానిదే వరకట్న దురాచారం అంతం కాదని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆడపిల్లల తల్లిదండ్రులు కూతరు సుఖంగా ఉండాలంటే అల్లుడు లేదా అతని కుటుంబానికి ఎంతో కొంత ముట్టజెప్పాలనే ఆలోచనలో ఉన్నారు. అల్లుడు డాక్టరో, ఇంజినీరో అయితే పిల్ల సుఖపడుతుందని ఆశపడి అప్పులు చేసి కూడా కట్నాలు సమర్పించి పెళ్లిళ్లు చేస్తున్నారు. మగపిల్లల తల్లిదండ్రులూ కట్నం తీసుకోవడం సామాజిక గౌరవంగా భావిస్తున్నారు. ఎంత కట్నం వస్తే అంత గొప్ప అన్నట్టు వ్యవహరిస్తున్నారు. కట్నం అడగకపోతే అబ్బాయిలో ఏం లోపం ఉందో అనే అనుమానాలు వస్తున్నాయని మగపిల్లల తల్లిదండ్రులు భావిస్తున్నారు. అత్యాశాపరుల వల్లే సమస్య! పిల్లలకు పెళ్లి సమయంలో లాంఛనాలు ఇవ్వడం ఆనవాయితీ. ఏదో స్తోమత కొద్ది ఇరువర్గాల అంగీకారంతో పెళ్లి జరిగితే ఇబ్బందేం లేదు. కానీ ఇదే ఆసరాగా తీసుకుని కొందరు అత్యాశకు పోతున్నారు. ఆడపిల్లల తల్లిదండ్రుల స్తోమతతో పనిలేకుండా కట్నాలు డిమాండ్ చేస్తున్నారు. కొందరు పెళ్లి సమయంలో ఇచ్చిన కట్నం కాకుండా పెళ్లయిన తర్వాత కూడా వధువును వేధిస్తున్నారు. దీనివల్ల ఎందరో వివాహితలు బలైపోతున్నారు. పెళ్లయి ఏళ్లు గడిచినా కట్నం కోసం వేధించే ప్రబుద్ధులున్నారు. పెళ్లయిన తర్వాత భర్త, అత్త, ఆడపడుచులు పెట్టే చిత్రహింసలు తట్టుకోలేక ఎందరో మహిళలు పోలీస్టేషన్ బాట పడుతున్నారు. అయినా మన చట్టాలు ఏమీ చేయలేకపోతున్నాయి. వారికి జరుగుతున్న న్యాయం అంతంతే..! ఎన్నో కాపురాలు కట్నం దాహానికి కూలిపోతున్నాయి. ఎందరో మహిళలు బలవన్మరణానికి పాల్పడుతున్న ఘటనలూ ఉన్నాయి. కౌన్సెలింగ్‌తో పరిష్కారం అదనపు కట్నం కేసుల్లో ఆత్మహత్యలు పరిష్కారం కాదు. భార్యాభర్తలు ఇద్దరినీ కౌన్సెలింగ్ చేస్తున్నాం. వివాదాలు పరిష్కరించి రాజీ చేసి అన్యోన్యంగా జీవించడానికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా గ్రామాల్లో కౌన్సెలింగ్ సెంటర్లు ఏర్పాటయ్యాయి. ప్రతి నెలా ఏలూరు ప్రభుత్వ వైద్యశాలలో సఖీ వన్‌స్టాప్ సెంటర్లో భార్యాభర్తలకు కౌన్సెలింగ్ ఇస్తున్నాం.– కె.శైలజ, జిల్లా సీనియర్ సివిల్ జడ్జి చట్టాల అమలుకు కృషి వరకట్నం కోసం మహిళలను వేధించే భర్తలు, కుటుంబ సభ్యులపై చట్టరీత్యా చర్యలు తప్పవు. ఫిర్యాదు అనంతరం విచారణ చేసి కేసులు నమోదు చేస్తున్నాం. కొన్ని ఫిర్యాదుల్లో స్టేషన్ పరిధిలో భార్యాభర్తలకు కౌన్సెలింగ్ ఇచ్చి మా వంతు పరిష్కార చర్యలు చేపడుతున్నాం.ఎం.రవిప్రకాష్, జిల్లా ఎస్పీ ఆలోచనా విధానం మారాలి కుమారుడిని పెళ్లిచేసుకుని ఇంటికి వచ్చిన కోడలిని తోటి మహిళగా గౌరవించి ఆదరించాలి. తమ సొంత బిడ్డలా చూసుకోవాలి. భర్త చిన్న చిన్న సమస్యలు పెద్దవి చేయకుండా ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలి. ఈ విధానం అవలంబిస్తే కుటుంబ కలహాలు ఉండవు.శ్యామలాదేవి, ఫిజికల్ డైరెక్టర్ , పెరవలి ఉన్నత పాఠశాల మార్పు రావాలి పెళ్లి అనగానే మెట్టినింటి వారికి గుర్తుకు వచ్చేది కట్నం. ఈ విధానంపై సమాజంలోని ప్రతి ఒక్కరి ఆలోచన మారాలి. మేధావులు, స్వచ్ఛంద సంస్థలు, ఉపాధ్యాయులు వరకట్న దురాచారం నిర్మూలనకు కృషి చేయాలి. విస్తృతంగా ప్రచారం చేయాలి. అవగాహన సదస్సులు నిర్వహించాలి. వరకట్నం తీసుకుంటే పడే శిక్షలపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలి.– సీహెచ్ గిరిజాదేవి, చైర్పర్సన్, చల్లపల్లి ట్రస్ట్ -
కాసుల కోసం కిరాతకం
నెల్లూరు, సూళ్లూరుపేట: అత్తింటి ఆరళ్లకు అబల బలైంది. పొలం విక్రయించి నగదు తీసుకురాలేదని భార్యను ఆమె భర్త తన తల్లితో కలిసి హత్యచేసి ఆత్యహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లు పోలీసులు గుర్తించారు. సూళ్లూరుపేట మండలంలోని కుదిరి పంచాయతీ కుదిరి తిప్పకండ్రిగ గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. తడ మండలం పెరియవెట్టి పంచాయతీ కావలిమిట్ట గ్రామానికి చెందిన బత్తిన లత (25)కు కుదిరి తిప్పకండ్రిగ గ్రామానికి చెందిన బత్తిన సురేంద్రకు పది సంవత్సరాల క్రితం వివాహమైంది. సురేంద్ర వ్యవసాయం చేస్తుంటాడు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. పెళ్లయిన నాటి నుంచి భర్త వేధిస్తున్నా లత తట్టుకుని కాపురం చేస్తూ వచ్చింది. 2016లో వేధింపులు తీవ్రం కావడంతో కేసు పెట్టి కొంతకాలం దూరంగా ఉంది. తర్వాత పెద్ద మనుషులు రాజీ చేశారు. కోర్టులో కేసును కూడా రాజీ చేసి భార్యాభర్తలను కలిపి కాపురానికి పంపారు. మళ్లీ వేధింపులు మొదలు కావడంతో ఇద్దరి మధ్య తరచూ వివాదాలు జరిగేవి. ఎప్పటికప్పుడు సర్దుబాటు చేసుకుంటూ వచ్చారు. కాగా లతకు కావలిమిట్టలో పుట్టింటి వారు కొంత ఇంటి స్థలాన్ని ఇచ్చారు. దానిని విక్రయించి నగదు తీసుకురావాలని భర్త చెప్పడంతో రెండు మూడురోజులుగా వివాదం జరుగుతూ వచ్చింది. గురువారం రాత్రి వివాదం తీవ్రరూపం దాల్చింది. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున భర్త సురేంద్ర తన తల్లి పార్వతమ్మతో కలిసి లతపై దాడిచేసి గొంతు నులిమి చంపివేశారని సీఐ కిషోర్‌బాబు తెలియజేశారు. అనంతరం ఇద్దరూ కలిసి ఇంటి ఆవరణలో ఉన్న వేపచెట్టుకు మృతదేహాన్ని చీరతో ఉరిచేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు. లత ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లి నాగవేణికి సమాచారం అందించారు. ఆమె వెంటనే ఘటనా స్థలాన్ని చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఐ కిషోర్‌బాబు, ఎస్సై కె.ఇంద్రసేనారెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి శరీరంపై ఉన్న గాయాలు, తలకు వెనుకభాగాన ఉన్న బలమైన గాయాలను బట్టి హత్య చేసి ఉరివేసి ఉంటారని గుర్తించారు. ఈ ఘటన జరిగిన అనంతరం లత అత్త, భర్త పరారీలో ఉండటంతో వారే హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సీఐ కిషోర్‌బాబు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వరకట్నం వేధింపులకు మహిళ బలి
అన్నానగర్: కాశిమేడులో వరకట్నం వేధింపులు తాళలేక వివాహిత మంగళవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చెన్నై కాశిమేడు పనైమరతొట్టికి చెందిన జగన్నాథన్ కుమార్తె జయశ్రీ (26). ఈమెకు జీవరత్తినం నగర్ ఎ.బ్లాక్‌కు చెందిన బాలకృష్ణన్ కుమారుడు శరవణన్ (35)తో 2016లో వివాహం జరిగింది. శరవణన్ ఓ నగల దుకాణంలో పని చేస్తున్నాడు. వివాహం సమయంలో ఏడు సవర్ల నగలు వరకట్నంగా ఇచ్చారు. వివాహం జరిగిన నాటి నుంచి అదనపు వరకట్నం తేవాలని శరవణన్ కుటుంబీకులు జయశ్రీపై ఒత్తిడి చేస్తూ వచ్చారు. ఈ స్థితిలో జయశ్రీకి మగబిడ్డ మృతి చెందిన స్థితిలో పుట్టింది. అనంతరం జయశ్రీ మనస్తాపం చెంది పుట్టింటికి చేరుకుంది. తల్లిదండ్రులు ఆమెను సమాధానపరచి అదే ప్రాంతంలో వేరే కాపురం పెట్టించారు. ఆ సమయంలో పుట్టింటికి వచ్చిన జయశ్రీ తన చావుకి భర్త, అత్త, మామనే కారణం అని ఓ ఉత్తరం రాసి ఇచ్చి వెళ్లింది. ఈ క్రమంలో జయశ్రీ గత 13 రోజుల కిందట మగబిడ్డను ప్రసవించింది. బిడ్డ పుట్టినప్పటి నుంచి అదనపు వరకట్నం తేవాలని భర్త, అత్త, మామ తనను హింసిస్తున్నట్లుగా సోమవారం తన తండ్రి వద్ద తెలిపింది. దీంతో అతను కుమార్తె ఇంటికి వెళ్లి తనతో ఇంటికి రమ్మని పిలిచాడు. అందుకు జయశ్రీ కొన్ని సమస్యలున్నాయి వాటిని ముగించుకుని వస్తానని చెప్పి తండ్రిని పంపించింది. ఈ స్థితిలో మంగళవారం జయశ్రీ ఇంట్లో ఫ్యాన్‌కి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీనిపై సమాచారం అందుకున్న కాశిమేడు పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి జయశ్రీ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తరువాత పోలీసుస్టేషన్‌కు వెళ్లిన జయశ్రీ తండ్రి తన కుమార్తె చావుకు ఆమె భర్త, అత్త, మామలే కారణమని, వారు అదనపు కట్నం కోసం తన కుమార్తెను వేధించి, హత్య చేసి ఆత్మహత్య చేసుకున్నట్టుగా నాటకం ఆడుతున్నారని పేర్కొన్నాడు. వారిపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. -
అత్తింటి వేధింపులకు వివాహిత బలి
పశ్చిమగోదావరి, ద్వారకాతిరుమల: అత్తింటి వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన తిమ్మాపు రం పంచాయితీ లక్ష్మీపురం కాలనీలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాడేపల్లిగూడెం మండలం కొండ్రుప్రోలు గ్రామానికి చెందిన దుర్గ (29)కు, ద్వారకాతిరుమలకు చెందిన తొంటపాక సత్యనారాయణతో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వీరికి సం తానం లేదు. దుర్గ తీసుకొచ్చిన కట్నం సొమ్ములను భర్త, అతని కుటుంబ సభ్యులు వాడుకుని దుర్గను బయటకు గెంటేశారు. ఈక్రమంలో జరి గిన గొడవల నేపథ్యంలో సత్యనారాయణ భార్య దుర్గతో కలిసి లక్ష్మీపురం కాలనీలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. అయినా భర్త, అతని కు టుంబ సభ్యుల నుంచి ఆమెకు వేధింపులు తప్పలేదు. దీంతో జీవితంపై విరక్తి చెందిన దుర్గ ఇంట్లో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్త సత్యనారాయణ సమాచారం మేరకు భీమడోలు సీఐ బీఎన్ నాయక్, ద్వారకాతిరుమల ఎస్సై ఐ.వీర్రాజు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. భర్త వేధింపులు తాళలేకపోతున్నానని మృతురాలు దుర్గ రాసుకున్న డైరీని వారు స్వాధీనం చేసుకున్నారు. భర్త, అతని కుటుంబసభ్యులు పది మందిపై ఫిర్యాదు చేశారు. పోలీసులు దుర్గ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వీర్రాజు చెప్పారు. ఈ ఘటనపై జిల్లా రజక సంఘ అధ్యక్షుడు చిలకలపల్లి కట్లయ్య ఆరా తీశారు. సంఘటనా స్థలానికి వచ్చి సీఐ నాగేశ్వర్‌నాయక్, ఎస్సై వీర్రాజు, మృతురాలి కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. -
అదనపు కట్నం కోసం వేధింపులు
తూర్పుగోదావరి, అమలాపురం టౌన్: అదనపు కట్నం కోసం భర్త వేధింపులు తాళలేక ఓ వివాహిత అమలాపురం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వేధింపుల్లో భాగంగా భార్య చేత భర్త తన మూత్రం, వీర్యం తాగించాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొందని పట్టణ సీఐ సీహెచ్ శ్రీరామ కోటేశ్వరరావు తెలిపారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి∙ఆమె భర్త రాజమహేంద్రవరానికి చెందిన కోటిపల్లి దేవి రమణకుమార్, మామ సుబ్బారావులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచినట్టు సీఐ చెప్పారు. ఈ కేసుకు సంబంధించిన సీఐ వెల్లడించిన వివరాలిలా.. అమలాపురం సూర్య బలిజవీధికి చెందిన సౌజన్యకు, రాజమహేంద్రవరానికి చెందిన కోటిపల్లి దేవీ రమణకుమార్‌కు 2014లో వివాహమైంది. ఆ సమయంలో రూ.ఆరు లక్షలు కట్నంగా ఇచ్చారు. మరో రూ.ఐదు లక్షలు అదనపు కట్నం తీసుకురావాలని తనను వేధిస్తున్నారని సౌజన్య ఫిర్యాదు చేసింది. తనను ఎంత దారుణంగా భర్త వేధిస్తున్నాడో ఆమె తన ఫిర్యాదులో వివరించిందని సీఐ చెప్పారు. కేసు దర్యాప్తులో భాగంగా విచారణ చేసినప్పుడు దారుణమైన వేధింపులకు దిగినట్టు తేలిందని సీఐ వివరించారు. అంతేకాకుండా సౌజన్య మేనత్త పేరున ఆస్తిని తన పేరున రాయించాలని కూడా వేధిస్తూ చంపుతానని బెదిరించారని ఫిర్యాదులో పేర్కొంది. ఈ కేసులో భర్త దేవి రమణకుమార్, మామ సుబ్బారావులను గురువారం రాత్రి అరెస్ట్ చేశామన్నారు. కేసులో అత్త ధనలక్ష్మిని అరెస్ట్ చేయాల్సి ఉండగా, ఆమె పరారీలో ఉందని సీఐ శ్రీరామ కోటేశ్వరరావు తెలిపారు. మరో వివాహిత పోలీసుల వద్దకు.. భర్త, అత్తమామలు, ఆడపడుచు, ఆమె భర్త తనను అదనపు కట్నం కోసం వేధిస్తున్నారంటూ అమలాపురం పట్టణం నల్లవంతెన ప్రాంతానికి చెందిన కొల్లాటి రాజేశ్వరి పట్టణ పోలీసుకు ఫిర్యాదు చేసింది. అమలాపురానికి చెందిన తనకు, ముమ్మిడివరానికి చెందిన కొల్లాటి రాజేష్‌తో 2007అక్టోబర్ 28న పెద్దల సమక్షంలో వివాహమైందని, భర్త హైదరాబాద్‌లో ఉద్యోగం వల్ల అక్కడే కాపురం ఉంటున్నామని, తమతో పాటు మామ బాబూరావు, అత్త అమరావతి కూడా ఉంటున్నారని తెలిపింది. తమ ఇంటికి సమీపంలోనే ఆడపడుచు దేవి, ఆమె భర్త పున్నారావు కుటుంబం ఉంటోందని, పెళ్లి సమయంలో రూ.ఆరు లక్షల నగదు, 20 కాపుల బంగారు నగలు కట్నంగా ఇవ్వగా, అదనపు కట్నం తీసుకురావాలని తనను వేధిస్తున్నారని సీఐ రామకోటేశ్వరరావుకు ఫిర్యాదు చేసింది. మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. -
వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య
లంగర్‌హౌస్: అదనపు కట్నం కోసం భర్త వేధింపులు తాళలేక ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్సై రవీందర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. వికారాబాద్ మండలం, కిష్టాపురం గ్రామానికి చెందిన రాములు, లక్ష్మమ్మ దంపతుల కుమార్తె లావణ్య(19). వారి ఇంటి పక్కనే ఉంటున్న రాములు కుమారుడు మహేష్ గత కొన్నేళ్లుగా ప్రేమించుకున్నారు. తొలుత వీరి వివాహానికి పెద్దలు అంగీకరించకపోవడంతో వారిపై ఒత్తిడి చేయడంతో ఆగస్టు 21న వారికి పెళ్లి జరిపించారు. ఆ తర్వాత నగరానికి మకాం మార్చిన వీరులంగర్హౌస్ పరిధిలోని రాజీవ్‌గాంధి నగర్లో నివాసం ఉంటున్నారు. మహేష్ ఫుడ్ డెలివరి బాయ్‌గా పనిచేసేవాడు. పెళ్లయిన కొద్ది రోజుల నుంచే భార్య లావణ్యను కట్నం తేవాలని వేధించడమేగాక కొద్ది రోజుల క్రితం ఇంట్లోనుంచి వెళ్లగొట్టాడు. గ్రామంలో పెద్దలు పంచాయితీ చేసి ఇద్దరికి నచ్చజెప్పి పంపారు.అయినా మహేష్ వేధింపులు మానుకోకపోవడంతో మనస్థాపానికిలోనైన లావణ్య మంగళవారం తెల్లవారుజామున నింట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఉదయం దీనిని గుర్తించిన చూసిన మహేష్ కుటుంబసభ్యులకు సమాచారం అందించాడు. లావణ్యతల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తుచేపట్టారు. -
భార్య అశ్లీల వీడియోలు తీసి..
అన్నానగర్: భార్య అశ్లీల వీడియోలు తీసి అదనపు కట్నం తేకపోతే సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరింపులకు పాల్పడిన భర్త, అత్తమామాలతో సహా నలుగురిపై మహిళా పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. చెన్నై కీల్పాక్కానికి చెందిన ముబారక్ అహ్మద్. ఇతని సోదరుడు సంగమ్‌షేక్ దౌత్ ఉగాండా దేశంలో వ్యాపారం చేస్తూ అక్కడే కుటుంబంతో నివశిస్తున్నాడు. ఇతని కుమార్తె సంగమ్‌హస్మీ. ఈమెకు మదురై అళగప్పన్ నగర్. బందర్ వీధికి చెందిన అల్లావుద్దీన్ఆసిక్తో గత జనవరిలో వివాహం జరిగింది. వివాహ సమయంలో 140 సవర్ల నగలు, కారు వరకట్నంగా ఇచ్చారు. అనంతరం అల్లావుద్దీన్ఆసిక్ వ్యాపారం ప్రారంభించడానికి సంగమ్‌షేక్‌దౌత్ ఉగాండా నుంచి రూ.25 లక్షలు బ్యాంకుకు ట్రాన్స్ఫర్ చేశాడు. సంగమ్‌హస్మి ధరించిన నగలను కూడా భర్త ఇంటి వారు తీసుకున్నట్లు తెలుస్తుంది. దీంతో సరిపెట్టుకోకుండా అదనపు కట్నం తేవాలని అల్లావుద్దీన్ఆసిక్ భార్యను హింసించేవాడు. అంతేగాకుండా భార్యను అశ్లీలంగా వీడియో తీసి అదనపు కట్నం తేకపోతే వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరించాడు. దీంతో సంగమ్‌హస్మి ఉగాండాకు తల్లిదండ్రుల వద్దకు వెళ్లి వారితో వాపోయింది. ఈ వ్యవహారంపై చెన్నైలో ఉన్న సంగమ్‌షేక్‌దౌత్ తమ్ముడు ముబారక్అహ్మద్ మదురై మహిళా పోలీసు స్టేషన్లో గురువారం ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు అల్లావుద్దీన్ ఆసిక్ (28), ఇతని తండ్రి అల్లావుద్దీన్ (62), తల్లి జిన్నత్ (50), అన్న జలావత్ (37). ఈ నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. -
న్యాయం కోసం భర్త ఇంటి ఎదుట దీక్ష
కర్నూలు, ఆదోని టౌన్: అనుమానం పేరుతో భర్త ఇంటినుంచి గెంటేశాడు. చేయని తప్పుకు శిక్ష ఎందుకు అనుభవించాలని, న్యాయం చేయాలని కోరుతూ భర్త ఇంటి ఎదుట ఓ వివాహిత దీక్ష చేపట్టింది. ఈ ఘటన బుధవారం ఆదోని పట్టణం శివశంకర్‌నగర్‌లో చోటుచేసుకుంది. బాధితురాలు రూప, ఆమె తండ్రి రాంభూపాల్, టూ టౌన్ సీఐ భాస్కర్ తెలిపిన వివరాల మేరకు..గోనెగండ్ల మండలం చిన్నమర్రివీడు గ్రామానికి చెందిన రూపతో 2011లో ఆదోని పట్టణం శివశంకనర్ నగర్‌కు చెందిన కేశవ్‌కు వివాహమైంది. పెళ్లయిన నెలరోజుల తరువాత భార్యపై అనుమానం పెంచుకొని కేశవ్ వేధిస్తూ వచ్చాడు. అదనంగా కట్నం తీసుకురావాలని వేధింపులకు గురిచేసి ఇంటి నుంచి గెంటేశాడని రూప ఆరోపించారు. కోర్టులో కేసు వేయడంతో..2016లో తనకు నెలకు రూ.5వేలు చొప్పున భరణం చెల్లించాలని తీర్పు ఇచ్చిందన్నారు. ఇన్నాళ్లు పుట్టింట్లోనే ఉంటూ తలదాచుకుంటున్నానని, భర్త లేకపోతే తనకు జీవితమే లేదని ఆమె విలపించారు. టూటౌన్ పోలీసుల విజ్ఞప్తి మేరకు ఆమె దీక్ష విరమించి స్టేషన్‌కు వచ్చారు. తాను గర్భవతి అయినప్పటికీ బలవంతంగా టాబ్లెట్లు మింగించి భర్త అబార్షన్ చేయించాడని రూప పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. రెండో పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తనకు తెలిసిందన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నామని సీఐ భాస్కర్ తెలిపారు.