తల్లిదండ్రులు ఎవరో.. అయిన వారెవరో తెలియని మూడేళ్ల ప్రాయంలో దొరికిన చిన్నారిని, ఆమె అన్నను పోలీసులు ప్రేమ సమాజంలో చేర్పించారు. సమాజం అండతో చదువుకుని సొంత కాళ్లపై బతుకుతున్న క్రమంలో... ఆదర్శ వివాహం చేసుకున్న ఓ యువకుడు ఆ యువతికి ప్రస్తుతం నరకం చూపిస్తున్నాడు. అదనపు కట్నం తీసుకురావాలని అనాథ యువతిపై తల్లితో కలిసి దాడి చేస్తున్నాడు.