ఆరేళ్ల అదితి మరణవార్త వినగానే చిన్నారి తల్లి, తాతయ్యలు అస్వస్థతకు గురయ్యారు. విజయనగరం జిల్లా భోగాపురం సన్రే బీచ్లో లభ్యమైన చిన్నారి మృతదేహాన్ని తమ కూతురు అదితి అని తండ్రి గుర్తించడంతో వారం రోజుల పాటు చేపట్టిన గాలింపు చర్యలకు తెరపడింది. అయితే కూతురి మృతదేహాన్ని గుర్తించిన వెంటనే తండ్రి శ్రీనివాసరావు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. పాప కుటుంబసభ్యులు ఇప్పటికీ ఈ నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.