adithi
-
Adithi Sehgal: ‘ఎవ్రీబడీ డ్యాన్సెస్ టు టెక్నో’
‘నా జీవితంలో సంగీతం భాగం అయిపోయింది’ అంటుంది అదితి సెహగల్. రాక్ మ్యూజిషియన్ అమిత్ సెహగల్, నటి షెనా గమత్ల కుమార్తె అయిన అదితి ‘డాట్’ పేరుతో కూడా మ్యూజిక్ వరల్డ్‌లో పాపులర్ అయింది. ఆరేళ్ల వయసులో పియానో ప్లే చేయడం నేర్చుకుంది. పన్నెండేళ్ల వయసులో మ్యూజిక్ కంపోజింగ్లోకి వచ్చింది. 'ప్రాక్టిస్ రూమ్స్’ ఆల్బమ్ ఆమెకు ఎంతో పేరు తెచ్చింది. ‘ఎవ్రీబడీ డ్యాన్సెస్ టు టెక్నో’ మ్యూజిక్ వీడియో వైరల్ హిట్ అయింది. గాఢమైన స్నేహబంధానికి అద్దం పట్టే ‘గర్ల్స్ నైట్’ సాంగ్ కూడా అదితికి ఎంతో పేరు తెచ్చింది. ‘ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30’ తాజా జాబితాలో సంగీత విభాగంలో చోటు సాధించిది అదితి. ఆదితి సంగీతకారిణి మాత్రమే కాదు మంచి నటి కూడా. జోయా అక్తర్ ‘ది ఆర్చీస్’ సినిమాలో నటిగా మంచి మార్కులు తెచ్చుకుంది. ఇవి చదవండి: Ambitio: ధైర్యం ఇస్తూ... దారి చూపుతూ -
'యానిమల్' బ్యూటీ సరికొత్త లుక్.. మరింత అందంగా ఆ తెలుగు హీరోయిన్!
సిల్క్ చీరలో కేక పుట్టించేస్తున్న 'యానిమల్' బ్యూటీ తృప్తి 'టైగర్ నాగేశ్వరరావు' బ్యూటీ గాయత్రి మత్తెక్కించే పోజులు బికినీలో రెచ్చిపోయిన 'బిగ్‌బాస్' తెలుగు ఫేమ్ అరియానా క్యూట్ లుక్స్‌తో మెల్ట్ చేసేస్తున్న హీరోయిన్ నభా నటేశ్ ఉప్పొంగే అందాలతో తెలుగు హీరోయిన్ అమైరా దస్తూర్ టైట్ ఫిట్ డ్రస్‌తో కాక రేపుతున్న హీరోయిన్ రుహానీ శర్మ గ్లామర్ గేట్లు తెరిచిన ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ ఇయర్ రౌండప్ గ్లామర్ వీడియో షేర్ చేసిన శ్రియ శరణ్ View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) View this post on Instagram A post shared by Gayatri Bhardwaj (@gayatribhardwaj__) View this post on Instagram A post shared by Ariyana Glory ❤️ (@ariyanaglory) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Amyra Dastur (@amyradastur) View this post on Instagram A post shared by Manushi Chhillar (@manushi_chhillar) View this post on Instagram A post shared by Ruhani Sharma (@ruhanisharma94) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Neha Sshetty (@iamnehashetty) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Nitya Naresh (@nityanaresh) View this post on Instagram A post shared by Kaali (@meerachopra) View this post on Instagram A post shared by Komalee (@komaleeprasad) View this post on Instagram A post shared by Aditi Gautam | Siya gautam | Actor | influencer (@aditigautamofficial) -
వరుణ్ తేజ్ సినిమా కోసం సింగర్‌గా మారిన డైరెక్టర్ శంకర్ కూతురు
Shankar Daughter Turns As Singer : ప్రముఖ దర్శకుడు శంకర్ కుమార్తె అదితి హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. కార్తి సరసన ఆమె నటిస్తున్న సినిమా ప్రస్తుతం సెట్స్‌మీదుంది. అయితే అదితి హీరోయిన్‌గానే కాకుండా సింగర్‌గానూ పరిచయం అవుతుంది. మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న గని చిత్రంలో రోమియో జూలియట్ అనే రొమాంటిక్ సాంగ్‌ను అదితి పాడింది. ఈ పాటను రేపు(మంగళవారం)రిలీజ్ చేయనున్నారు. విజయవాడ కేఎల్ యూనివర్సిటీలో జరిగే ఓ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ పాటను ఆవిష్కరించనున్నారు. MY SINGING DEBUT✨🎙🎼 Waited so long to share this with you all. Another dream come true. @MusicThaman sir Thank you so much for trusting me and giving me this opportunity. Hope you guys like it♥️🧿🤞#ghani #romeojuliet #singingdebut pic.twitter.com/JOboB9VaMM — Aditi Shankar (@AditiShankarofl) February 6, 2022 -
హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్న డైరెక్టర్ శంకర్ కూతురు
Shankar’s Daughter Aditi Debuts As An Heroine: ప్రముఖ దర్శకులు శంకర్ చిన్న కుమార్తె అదితీ శంకర్ హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వనున్నారు. కార్తీ హీరోగా ముత్తయ్య దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘విరుమన్’. 2డీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై హీరో సూర్య, జ్యోతిక నిర్మిస్తున్న ఈ చిత్రంలో అదితీ శంకర్ హీరోయిన్గా నటించనున్నారు. ఈ విషయాన్ని ఆదివారం అధికారికంగా ప్రకటించారు. ‘‘అదితీ శంకర్‌కు స్వాగతం. ప్రతి ఒక్కరి హృదయాలను నువ్వు(అదితీ) గెలుచుకుంటావు’’ అన్నారు సూర్య. ‘‘అదితీని హీరోయిన్గా పరిచయం చేస్తున్న సూర్య, కార్తీ, జ్యోతికలకు ధన్యవాదాలు. ఫుల్ ప్రిపరేషన్‌తో వస్తున్న అదితీని ఆదరిస్తారనే ఆశిస్తున్నాను’’ అన్నారు శంకర్. ‘‘అవకాశం ఇచ్చిన సూర్య, జ్యోతికలకు థ్యాంక్స్. వందశాతం కష్టపడి మీరు గర్వపడేలా చేస్తా’’ పేర్కొన్నారు అదితి. 2022లో ఈ చిత్రం రిలీజ్ కానుంది. A very warm welcome to Aditi Shankar! You are going to win everyone’s heart! God bless!! உன் வரவு நல்வரவு ஆகுக!!@AditiShankarofl #Viruman #விருமன் @Karthi_Offl @dir_muthaiya @thisisysr @rajsekarpandian @2D_ENTPVTLTD @U1Records pic.twitter.com/fUvPzh42sw — Suriya Sivakumar (@Suriya_offl) September 5, 2021 చదవండి : Nagarjuna Bangarraju Movie: మైసూర్లో బంగార్రాజు Trisha: ఆలయంలో చెప్పులు వేసుకున్న త్రిష..భగ్గుమన్న హిందూ సంఘాలు -
కొత్త ప్రేమ
కార్తికేయ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న తొలి చిత్రం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమయ్యింది. సుధీర్, ఆద్యా ఠాగూర్, అదితి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రణయ్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని కార్తికేయ నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు ప్రణయ్ మాట్లాడుతూ– ‘‘న్యూ జనరేషన్ లవ్ అండ్ లైఫ్ స్టోరీ ఇది. కొన్ని రిఫరెన్స్‌లను దృష్టిలో పెట్టుకుని కథ తయారు చేసుకున్నాను. నవంబర్‌లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తాం’’ అన్నారు. హీరో సుధీర్ మాట్లాడుతూ– ‘‘టీవీ సీరియల్స్‌లో బాలనటునిగా నటించాను. హీరోగా ఇది నా తొలి చిత్రం. ఖచ్చితంగా ప్రేక్షకులను అలరించే విధంగా సినిమా ఉంటుంది’’ అన్నారు. ఈ చిత్రానికి ఆర్ట్: విఠల్, కెమెరా: కుషేందర్, రచనా సహకారం: మదన్ మోహన్. -
ఇక గ్యాప్ ఉండదు గురూ
‘గురు’ సినిమా రిలీజై దాదాపు పది నెలలు కావొస్తోంది. వెంకటేశ్ ఇంకా కొత్త సినిమా షూటింగ్ మొదలుపెట్టలేదు. తేజ దర్శకత్వంలో ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేశ్ ప్రొడక్షన్స్ నిర్మించనున్న ఓ సినిమాను ఓకే చేసి, మూహూర్తం కూడా జరిపారు. కానీ... ఆ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు. మరి గురు షూటింగ్‌లోకి ఎంటరయ్యేదెప్పుడు అంటే.. వచ్చే నెలలో. ‘‘ఫిబ్రవరిలో షూటింగ్ మొదలుపెడుతున్నాం. సినిమాకు సంబంధించిన తారాగణం కూడా త్వరలో వెల్లడిస్తాం’’ అని పేర్కొన్నారు దర్శకుడు తేజ. ఈ సినిమాలో వెంకీ సరసన ‘చెలియా’ భామ అదితీరావ్ హైదరీ పేరును ప్రముఖంగా పరిశీలిస్తునట్టు ఫిల్మ్‌నగర్ సమాచారం. ఇదిలా ఉంటే ‘గురు’ సినిమా తర్వాత పది నెలలు గ్యాప్ తీసుకున్న వెంకీ ఇక నుంచి గ్యాప్ వచ్చే ప్రసక్తే లేదంటున్నారు. తేజ సినిమా చేస్తూనే.. రానాతో కలిసి రాజీవ్ గాంధీ హత్య ఆధారంగా ఓ వెబ్ సిరీస్‌లో యాక్ట్ చేయనున్నారు వెంకీ. అలాగే అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ యంగ్ హీరోతో మల్టీస్టారర్ మూవీ కూడా ఒప్పుకున్నారు. వీటితోపాటు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నట్టు ప్రకటించేశారు. సో.. గత ఏడాది వచ్చిన గ్యాప్‌ను మళ్లీ రాకుండా వరుసగా సినిమాలు ఒప్పుకుంటున్నారు వెంకటేశ్. -
చిన్న సినిమాకు సూపర్‌స్టార్ ప్రశంసలు
తమిళ సినిమా: ఎవరినైనా ప్రశంసించాలంటే చాలా పెద్ద మనసు కావాలి. అదే విధంగా రజనీకాంత్ లాంటి సూపర్‌స్టార్ నుంచి అభినందనలు అందుకోవాలంటే వారు ఎంతో ప్రతిభను చాటు కోవాల్సి ఉంటుంది. అలాంటి అభినందనలను నవ దర్శక, కథానాయికలు పొందగలిగారు. వారే అరువి చిత్ర దర్శకుడు అరుణ్‌ప్రభు పురుషోత్తమన్, ఆ చిత్ర కథానాయకి అతిధిబాలన్. పలు భారీ చిత్రాలను నిర్మించిన డ్రీమ్‌వారియర్ ఫిలింస్ అధినేతలు ఎస్ఆర్.ప్రకాశ్, ఎస్ఆర్.ప్రభు నిర్మించిన తాజా చిత్రం అరువి. పలు జాతీయ, అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శించిన అరువి చిత్రం ఇటీవల విడుదలై ప్రేక్షకుల ఆదరణను విశేషంగా పొందుతోంది.ఇక చిత్ర ప్రముఖులు ప్రశంసల జల్లు కురుపిస్తున్నారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ చిత్రం చూసి ఫోన్లోనే చిత్ర దర్శకుడు అరుణ్‌ప్రభు పురుషోత్మమన్ను అభినందించారు.తాజాగా ఇటీవల మరోసారి అరువి సినిమా చూసిన రజనీకాంత్ ఆ చిత్ర దర్శకుడు అరుణ్‌ప్రభు, కథానాయకి అతిధిబాలన్లను ఇంటికి పిలిపించి ప్రశంసలలో ముంచెత్తడంతో పాటు బంగారు గొలుసులను బహూకరించారు. ఈ సందర్భంగా అరువి చిత్ర నిర్మాత ఎస్ఆర్.ప్రభును మీరు ఇంతకు ముందు నిర్మించిన చిత్రాలేమిటని అడిగారు. జాతీయ అవార్డును గెలుచుకున్న జోకర్, మానగరం, ధీరన్ అధికారం ఒండ్రు లాంటి పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించినట్లు నిర్మాత చెప్పడంతో మీ చిత్రాలన్నీ తాను చూశానని, భవిష్యత్తులో కూడా ఇలాంటి మంచి చిత్రాలు నిర్మించాలని అభినందించారు. దర్శకుడిని ఉద్దేశించి బ్రిలియంట్, ఎక్స్లెంట్, ట్రెమండస్ చిత్రం అరువి అని ప్రశంసించారు.ఈ చిత్ర కథను ఎక్కడ నుంచి మొదలెట్టారని అడిగారు. తానీ చిత్రాన్ని తన ఇంట్లో ఒంటరిగా చూశానని, అయినా ప్రేక్షకుల మధ్య చూసినంత అనుభూతి కలిగిందని అన్నారు. ఎంతగా ఏడ్చేశానో, ఇంకెంతగా నవ్వుకున్నానో అని అన్నారు.ఇక హీరోయిన్ అతిధిబాలన్ అద్భుతంగా అభినయించారని అభినందించారు. ఇలాంటి టీమ్ పది కాలాల పాటు పరిశ్రమలో ఉండాలని ఆకాంక్షిస్తూ అభినందించారు.రజనీ అభినందనలకు అరువి చిత్ర దర్శక నిర్మాతలు, కథానాయకి పులకించిపోయారు. -
అదితి హంతకులెవరు?
ఆకాశం ఉరిమిందంటే... చినుకు పడిందంటే కలవరపడాల్సిన పాడు కాలం దాపురించింది. ఇంటినుంచి బయటికెళ్లిన కంటి దీపాలు సురక్షితంగా తిరిగొస్తాయా లేదా అనే బెరుకుతో క్షణమొక యుగంగా గడపాల్సిన దుస్థితి వచ్చిపడింది. తూర్పు తీరాన మణిహారంలా మెరిసిపోయే విశాఖ నగరంలో ఏమీ పట్టని నగర పాలక సంస్థ పుణ్యమా అని వాన నీరూ, డ్రైనేజీ నీరు ఏకమై రోడ్లు చెరువులవుతున్నాయి. అవి వాకిట ముందే దుఃఖదాయినులై ఉప్పొంగుతున్నాయి. మూతల్లేని మాన్హోళ్లూ...పైకప్పుల్లేని కాల్వలు మృత్యువుకు స్థావర ప్రాంతాలవుతున్నాయి. ఎవరూహిస్తారు...చెంగుచెంగున చిందులేస్తూ వెళ్లే చిన్నారి అదితి ఓ చినుకు రాలిన సాయంకాలం రెప్పపాటులో మాయమవుతుందని! ఎవరనుకుంటారు...నిండా ఆరేళ్లులేని అదితి ట్యూషన్‌కని వెళ్లి తిరిగిరాని లోకాలకు మరలిపోతుందని! గత నెల 24న అదితి మాయమైన క్షణంనుంచి ఆ చిట్టితల్లి ఏమైందోనని విశాఖ మొత్తం బెంగటిల్లింది. కన్నవారు, అయినవారు మాత్రమే కాదు...ఆ మహా నగర జనమంతా ఆమె క్షేమంగా, సురక్షితంగా తిరిగి రావాలని తాపత్రయపడ్డారు. అదితి సంగతేమైనా తెలిసిందా అని ఆత్రంగా వాకబు చేశారు. అటు ప్రభుత్వ యంత్రాంగమూ కదిలింది. పది పడవలను రంగంలోకి దించడంతోపాటు మత్స్యకారులను, నావికాదళ సిబ్బందిని, కమ్యూనిటీ గార్డులను, వందలాది మంది పారిశుద్ధ్య సిబ్బందిని ఈ గాలింపులో వినియోగించింది. వందలాదిమంది పౌరుల స్వచ్ఛంద కృషి దీనికి తోడైంది. దాదాపు కోటిన్నర రూపాయలు ఖర్చు చేశామని అధికారులు చెబుతున్నారు. అయినా అదితి దక్కలేదు. విజయనగరం జిల్లాలోని ఓ మారుమూల తీర ప్రాంతంలో ఏడు రోజులయ్యాక గురువారం సాయంత్రం విగతజీవిగా కనబడింది. అదితి మాయమయ్యాక ప్రభుత్వమూ, నగర పాలక సంస్థ అధికారులూ చూపిన ఆందోళన, చేసిన కృషి మెచ్చదగినదే. కానీ ఏదైనా జరిగితే తప్ప కదలని మనస్తత్వం మన పాలనా యంత్రాంగాలను పట్టిపీడిస్తున్నది. వందేళ్లక్రితం హైదరాబాద్ నగరాన్ని మూసీ వరదలు వణికించినప్పుడు ఆ మాదిరి పరిస్థితులు మరెప్పుడూ తలెత్తకూడదన్న లక్ష్యంతో విఖ్యాత ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను రప్పించి సమాలోచనలు సాగించాడు ఆనాటి నిజాం. ఫలితంగా అత్యంత పటిష్టమైన వరద, మురుగునీటి వ్యవస్థలు ఏర్పడ్డాయి. కానీ విస్తరిస్తున్న నగరానికి దీటుగా ఈ వ్యవస్థలను విస్తృతపరచడంలో అనంతర పాలకులు అశ్రద్ధ చూపారు. వర్షం పడినప్పుడల్లా జంట నగరాల వాసులకు దాని పర్యవసానాలు కనబడుతూనే ఉన్నాయి. హైదరాబాద్‌ను హైటెక్ నగరంగా తీర్చిదిద్దిన ఘనత తనదేనని ఏపీ సీఎం చంద్రబాబు తరచు ప్రకటించుకుంటారు గానీ కుంభవృష్టి కురిసినప్పుడు చూడాలి దాని దుస్థితి. వందేళ్లనాడు నిజాం రాజు చేసిన ఆలోచన ఈనాటి పాలకులకు కొరవడటంవల్లనే అదితివంటి పిల్లల జీవితాలు విషాదాంతాలవుతున్నాయి. ఇదే విశాఖ నగరంలో కొన్నేళ్లకిందట సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లోనే ఒక బాలుడు హఠాత్తుగా కాల్వలో కొట్టుకుపోయాడు. దాన్నుంచి గుణపాఠం నేర్వకపోవడంవల్లే మళ్లీ ఒక అదితి బలి కావాల్సివచ్చింది. మన పాలకులు నగరాన్ని సంభావించుకోవడంలోనే మౌలికంగా తప్పటడుగులు వేస్తున్నారు. నగరమంటే ఆకాశాన్నంటే భవన సముదాయాలతో... మిరుమిట్లు గొలిపే కాంతులతో, అత్యంత రద్దీగా ఉండే రోడ్లతో నిండి ఉండాలనుకుంటున్నారు. అక్కడ జనం ఉంటారని, ఇవన్నీ క్రమబద్ధంగా లేకపోతే వారు ఇబ్బందిపడతారని భావించడంలేదు. ముంబై, కోల్‌కతా, బెంగళూరు, ఢిల్లీ...ఏ నగరాన్ని చూసినా సమస్యలతో సతమతమవుతున్నవే. సామాన్యుడికి ప్రాణాంతకమవుతున్నవే. పదేళ్లక్రితం కుంభవృష్టి కురిసి వరదలు ముంచెత్తినప్పుడు ముంబై చిగురుటాకులా వణికిన వైనం ఎవరూ మరిచిపోరు. ఆ వరదలకు దాదాపు వేయిమంది మరణించారు. జనావాసాలన్నీ నీటి మడుగులయ్యాయి. ఈమధ్య సింగపూర్ సర్కారుతో ప్లాన్ గీయించి చంద్రబాబు పట్టుకొచ్చిన అమరావతి నగర బ్లూ ప్రింట్ సైతం సామాన్య పౌరులకు అంగుళమంత చోటిచ్చిన దాఖలా లేదు. ప్రధాన రహదారుల్లో, చిన్న చిన్న వీధుల్లో మట్టి జాడ కనబడకుండా సిమెంటు కుమ్మరించి వేసే రోడ్లవల్ల వానాకాలం వస్తే జనం భయంతో వణుకుతున్నారు. కురిసిన నీరంతా ఎటుపోవాలో అర్థంకాక ఇళ్లను ముంచెత్తుతుంటే నిస్సహాయులుగా మిగులుతున్నారు. అక్కడక్కడ తెరుచుకుని ఉండే మాన్‌హోళ్ల జాడ వరదనీటిలో కానరాక ప్రమాదాల బారిన పడుతున్నారు. లక్షలమంది జనాభాతో ఉండే నగరాల్లో ఏయే కాలాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తగలవో ముందుగానే అంచనా వేసి, వాటిని నివారించడానికి అవసరమైన ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలన్న స్పృహ కొరవడటం మూలంగానే సమస్యలు ఏర్పడుతున్నాయి. ఏ నగరంలోనైనా జరిగే ఉదంతాన్ని టీవీలో చూసి నిట్టూర్చడం, పత్రికల్లో చదివి పేజీలు తిప్పేయడం మాత్రమే అలవాటైన పాలకులూ, అధికారులూ ఉన్నంతకాలం ఈ దుస్థితి మారదు. అలాంటి ఘటన జరగడానికి ఆస్కారమున్న ప్రాంతాలు తమ నగరంలో ఏమున్నాయో ఆరా తీసి, వెనువెంటనే దాన్ని సరిదిద్దాలనుకోకపోతే పదే పదే అవే ఘటనలు అన్నిచోట్లా సంభవిస్తాయి. నిరుడు దేశవ్యాప్తంగా నగరాల్లో మాన్హోళ్లపై మూతల్లేకపోవడం, గోతులుండటంవంటి కారణంగా దాదాపు వేయిమంది మరణించారని నేషనల్ క్రైం రికార్డు బ్యూరో గణాంకాలు చెబుతున్నాయి. కేవలం మూతలేని మాన్‌హోళ్ల వల్ల ఆంధ్రప్రదేశ్‌లో నిరుడు ఆరుగురు ప్రాణాలు కోల్పోతే, తెలంగాణలో 10మంది చనిపోయారు. పాలకులు ఇకనైనా మేల్కొనాలి. ఇప్పుడున్న నగరాలతోపాటు... తాము కలగంటున్న స్మార్ట్ సిటీలను నిరపాయకరంగా తీర్చిదిద్దాలంటే ఏంచేయాలో ఆలోచించాలి. అది మాత్రమే అదితికి నిజమైన నివాళి అవుతుంది. -
అదితీ నువ్వు నియంతవై రావాలి..
విశాఖ: లేత గులాబి రంగు గౌనులో ముద్దుముద్దుగా పలుకుతూ అందర్నీ అలరించిన చిన్నారి అదితి ఇక లేదన్నవార్త ప్రతి ఒక్కరినీ కలచివేసింది. తిరిగి చిరునవ్వులు చిందిస్తూ అందరి ముందుకు తిరిగి వస్తుందా అనే అనుమానం వెంటాడినా... వాస్తవాన్ని జీర్ణించుకోవడానికి ప్రతి గుండె నిరాకరించింది. తమ కంటిపాప క్షేమంగా తిరిగొస్తుందన్న ఆ కుటుంబం ఆశలు ఆవిరైపోయాయి. విశాఖపట్నంలో సెప్టెంబర్ 24న ప్రమాదవశాత్తు డ్రైనేజీలో పడి గల్లంతైన ఆరేళ్ల చిన్నారి అదితి విజయనగరం జిల్లా భోగాపురం మండలం దిబ్బలపాలెం తీరంలో విగతజీవిగా మారిపోయింది. తీరని విషాదాన్ని నింపిన ఈ ఉదంతంపై సోషల్ మీడియాలో పలువురి స్పందన ఇలా ఉంది. నిన్న అయిలాన్...నేడు అదితి తీరం వేరు కావచ్చు...ప్రాంతం వేరు కావచ్చు ఈ కనుపాపలను అలా దూరం చేయాలన్న మనసు నీకెలా వచ్చింది ఓ సముద్రుడా నీవు మింగేసి...అలా నీలో ఉంచుకున్నా... అయిలాన్, అదితీ ఎక్కడో ఒక చోట బతికే ఉంటారన్న ఆశతో మేం బతుకుతాం కానీ ఇలా ఒడ్డున చేర్చి మమ్మల్ని ఎందుకు జీవచ్చవాలుగా మారుస్తావ్ ఇలా బతకడం కంటే మమ్మల్నీ నీవే తీసుకెళ్ళు... కానీ మా శవాలను మాత్రం ఈ పసిపాపల్లా ఒడ్డకు చేర్చకే...ప్లీజ్. అమ్మా అదితి..... క్షమించు నాన్నా ఈ పాడు సమాజాన్ని... నిరుపేద ఎంపీలకు జీతాలు పెంచడంపై ఉన్న శ్రద్ధ ఓపెన్ నాలాలకు కప్పు ఏర్పాటుపై లేదు దీనికి.... నిర్లక్షంతో నీ చిరునవ్వులు చిదిమేసి, నీ వాళ్ళకు సరైన ఆఖరి చూపు... నీ మీద పడి, బాధ తీరా ఏడ్చే అవకాశం లేకుండా చేసిన "మనవాళ్ళ"ను ఉరితీసినా ఆ శిక్ష వాళ్లు చేసిన పాపానికి, చూపిన నిర్లక్షానికి క్షమాభిక్ష లాంటిదే..... ఇక రావద్దమ్మా ఈ స్వార్థ లోకానికి.... నీ వాళ్ళ కోసం రావాలని అనిపిస్తే...... మా కోసం ఈ వ్యవస్థను మార్చే, నియంతవై రా.... -
అదితి మృతదేహానికి పోస్టు మార్టం పూర్తి
విశాఖపట్నం: డ్రైనేజిలో పడి ప్రాణాలు కోల్పోయిన అదితి మృతదేహానికి పోస్టు మార్టం పూర్తయింది. ఆమె మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. డీఎన్ఏ పరీక్ష అవసరం లేదని పోలీసులు తేల్చిచెప్పారు. వాళ్లు కోరితే మాత్రం డీఎన్ఏ పరీక్ష చేస్తామని కేజీహెచ్ ఇంఛార్జ్ ఉదయ్ కుమార్ అంతకుముందు చెప్పారు. ఈ సందర్భంగా ఆరోగ్యశాఖమంత్రి కామినేని శ్రీనివాస్ అదితి పోస్టుమార్టంపై సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో విశాఖపట్నం కేజీహెచ్ ఇంఛార్జ్‌తో మాట్లాడారు. పోస్టుమార్టం త్వరగా పూర్తి చేసి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందించాలని ఆదేశించారు. డ్రైనేజిలో పడిపోయిన అదితి ఎలాగైనా సజీవంగా తిరిగిరావాలని అందరూ కోరుకున్నారు. ఆమె ఆచూకీ కోసం జీవీఎంసీ, పోలీసు, నేవీ సిబ్బంది ఎనిమిది రోజులపాటు అహరహం గాలించారు. కానీ, ప్రమాదవశాత్తు డ్రైనేజీలో పడిపోయిన ప్రాంతం నుంచి 40 కి.మీ. దూరంలో అదితి మృతదేహం కనిపించింది. అల్పపీడనం ప్రభావంతో ఈశాన్యగాలులు బలంగా వీయడం వల్ల పాప శరీరం భోగాపురం తీరం వరకూ నీటిలో కొట్టుకుపోయి ఉంటుందని నిపుణులు చెప్పారు. -
అయ్యో తల్లీ.. అదితీ..
- 8 రోజుల నిరీక్షణ విషాదాంతం - దిబ్బలపాలెం తీరంలో చిన్నారి మృతదేహం గుర్తింపు సాక్షి, విశాఖపట్నం/పూసపాటిరేగ: తమ కంటిపాప క్షేమంగా తిరిగొస్తుందన్న ఆ కుటుంబం ఆశ అడియాస అయ్యింది. ఎనిమిది రోజులుగా నిరీక్షించిన వారికి నిస్పృహే మిగిలింది. చిన్నారి అదితి విగతజీవిగా కనిపించింది. అందరిలోనూ విషాదాన్ని నింపింది. విశాఖపట్నంలో సెప్టెంబర్ 24న ప్రమాదవశాత్తు డ్రైనేజీలో పడి గల్లంతైన ఆరేళ్ల చిన్నారి అదితి విజయనగరం జిల్లా భోగాపురం మండలం దిబ్బలపాలెం తీరంలో విగతజీవిగా కనిపించింది. తీరంలో ఓ చిన్నారి మృతదేహాన్ని స్థానికులు గురువారం సాయంత్రం గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు, అదితి తండ్రి శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. శవం తమ పాపదేనని గుర్తించి తండ్రి బావురుమన్నారు. తమ గారాల బిడ్డ మృతి చెందిందని తెలియడంతో ఆయన కుప్పకూలిపోయారు. ప్రార్థనలు ఫలించలేదు...: డ్రైనేజీలో పడి అదితి గల్లంతు కావడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఆ చిన్నారి సజీవంగా తిరిగిరావాలని అందరూ కోరుకున్నారు. ఆమె ఆచూకీ కోసం జీవీఎంసీ, పోలీసు, నేవీ సిబ్బంది ఎనిమిది రోజుల పాటు అహరహం గాలించారు. కానీ అదితి సజీవంగా లేదన్న చేదు నిజంతో ఆ గాలింపు చర్యలకు ముగింపుపడటం అందర్నీ కలచివేసింది. ప్రమాదవశాత్తు డ్రైనేజీలో పడిపోయిన ప్రాంతం నుంచి 40 కి.మీ. దూరంలో మృతదేహం కనిపించింది. అల్పపీడనం ప్రభావంతో ఈశాన్యగాలులు బలంగా వీయడం వల్ల పాప శరీరం భోగాపురం తీరం వరకూ నీటిలో కొట్టుకుపోయి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. గుర్తుపట్టలేని రీతిలో మృతదేహం... :పాప శరీరం గుర్తుపట్టలేని రీతిలో ఉండటంతో దుస్తులు, చెవిదుద్దుల ఆధారంగా గుర్తించారు. సీఐ విద్యాసాగర్, ఎస్ఐ నాగేశ్వరరావులు ఆ మృతదేహం అదితిదేనని ఆమె తండ్రి శ్రీనివాసరావు గుర్తించినట్లు ప్రకటించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించారు. కానీ అదితి ఇక లేదన్న దుర్వార్త ఆమె కుటుంబ సభ్యులకు తీవ్ర దుఃఖాన్ని మిగిల్చింది. ఆ కుటుంబం విషాదంలో కూరుకుపోయింది. అదితి తాత, నాయనమ్మలు స్పృహ తప్పి పడిపోయారు. దాంతో వారిని గురువారం రాత్రి అంబులెన్స్‌లో కేర్ ఆసుపత్రికి తరలించారు. -
అదితి తల్లి, తాతయ్యలకు స్వల్ప అస్వస్థత
-
అదితి తల్లి, తాతయ్యలకు స్వల్ప అస్వస్థత
విజయనగరం : ఆరేళ్ల అదితి మరణవార్త వినగానే చిన్నారి తల్లి, తాతయ్యలు అస్వస్థతకు గురయ్యారు. విజయనగరం జిల్లా భోగాపురం సన్‌రే బీచ్‌లో లభ్యమైన చిన్నారి మృతదేహాన్ని తమ కూతురు అదితి అని తండ్రి గుర్తించడంతో వారం రోజుల పాటు చేపట్టిన గాలింపు చర్యలకు తెరపడింది. అయితే కూతురి మృతదేహాన్ని గుర్తించిన వెంటనే తండ్రి శ్రీనివాసరావు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. పాప కుటుంబసభ్యులు ఇప్పటికీ ఈ నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అనంతరం అధికారులు అదితి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విశాఖలోని కేజీహెచ్ ఆస్పత్రికి తరలిస్తున్నారు. చిన్నారి అదితి మరణవార్త తెలియగానే.. పాప తల్లి, తాతయ్యలు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే వారిని చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆస్పత్రికి తరలిస్తున్నారు. -
అదితి మృతదేహమే....
-
అదితికి కన్నీటి నివాళి
తడబడిన అడుగును కడలి మింగేసింది. ఆడుతూ పాడుతూ ఆడాల్సిన ఆరేళ్ల పసికూన మురికి కాల్వలో అల్లాడితే తల్లడిల్లిన తల్లిపేగు పొగిలి పొగిలి ఏడ్చింది ఆచూకి దొరకని ఏడు రోజులు ఏడు యుగాలు... చావు కబురును ఒడ్డుకు చేర్చిన అలలు మౌనంగా వెనక్కి వెళ్లిపోయాయి ఇసుకలో నిర్జీవంగా.. గుర్తుపట్టడానికి తల్లి మనసుకి ఆనవాళ్లు కావాలా! తప్పు ఎవరిదైనా అందని తీరాలకు అదితి.. -
అదితి మృతదేహమే....
చిరునవ్వులు చిందిస్తూ ఇంటి నుంచి ట్యూషన్ కు వెళ్లిన ఆరేళ్ల చిన్నారి అదితి....చివరికి తిరిగిరాని లోకాలకు వెళ్లింది. తన బుజ్జాయి ఇంకా బ్రతికే ఉందన్న నమ్మకంతో ఉన్న ఆ తల్లిదండ్రుల ఆశలు అడియాశలే అయ్యాయి. వారు చేసిన పూజలు, ప్రార్థనలు ఫలించలేదు. అధికారుల నిర్లక్ష్యం ఆరేళ్ల వయసులోనే ఓ చిన్నారికి నూరేళ్లు నిండేలా చేశాయి. ట్యూషన్ నుంచి గంతులేస్తూ హుషారుగా బయటకు వచ్చిన అదితి...చివరకు విగతజీవిగా మారింది. సరిగ్గా గత గురువారం విశాఖలో డ్రైనేజీలో కొట్టుకుపోయిన చిన్నారి అదితి ఉదంతం విషాదాన్ని నింపింది. కన్నవారికి కడుపు కోతను మిగిల్చింది. అప్పటి నుంచి అదితి ఆచూకీ కోసం అధికారులు, పోలీసులు గాలింపు చేపట్టారు. అనుమానమొచ్చిన నల్లాలన్నింటినీ జల్లెడ పట్టారు. సముద్రంలోనూ అన్వేషణ సాగించారు. హెలికాఫ్టర్లు, అధునూతన టెక్నాలజీ సహాయంతో...పాపను గుర్తించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చివరకు గురువారం సాయంత్రం విజయనగరం జిల్లా భోగాపురం మండలం దిబ్బలపాలెం సమీపంలోని సన్ రే బీచ్ ఒడ్డుకు అదితి మృతదేహం కొట్టుకు వచ్చింది. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న అదితి తండ్రి శ్రీనివాసరావు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. శరీరంపై గుర్తులు, ఇంటి నుంచి వెళ్లేటప్పుడు అదితి వేసుకున్న పింక్ డ్రస్‌తో పాటు చెవి పోగుల ఆధారంగా ఆ మృతదేహం అదితిగా ఆమె తండ్రి గుర్తించారు. ఏదైతే జరగకూడదని అనుకున్నారో... ఒక్కసారిగా రోదిస్తూ ఆయన అక్కడ కుప్పకూలారు. -
భోగాపురం సన్ రే బీచ్‌లో చిన్నారి మృతదేహం!.
-
భోగాపురం సన్ రే బీచ్‌లో చిన్నారి మృతదేహం!
విజయనగరం : విజయనగరం జిల్లా భోగాపురం మండలం దిబ్బలపాలెం సన్ రే బీచ్‌కి గురువారం సాయంత్రం గుర్తుతెలియని చిన్నారి మృతదేహం కొట్టుకు వచ్చింది. మృతదేహాన్ని గమనించిన స్థానికులు ...పోలీసులకు సమాచారం అందించారు. కాగా ఆ మృతదేహం వారం క్రితం (గత గురువారం) విశాఖలో డ్రెయినేజీ లో పడి గల్లంతైన అదితి మృతదేహంగా కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. దీనిపై స్థానిక పోలీసులు... విశాఖ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులతో పాటు, అదితి తండ్రి కూడా ఘటనా స్థలానికి బయల్దేరారు. కాగా చిన్నారి మృతదేహంపై పింక్ కలర్ డ్రస్ ఉన్నట్లు... వయసు ఆరు నుంచి ఏడేళ్లు ఉండవచ్చని సీఐ వైకుంఠరావు తెలిపారు. మృతదేహం నీళ్లలో నాని ఉండటంతో ఆనవాళ్లు పట్టేందుకు వీలు లేకుండా ఉంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అదితి ఆచూకీ చెబితే రూ.5లక్షలు
విశాఖ : ఆరేళ్ల చిన్నారి అదితి ఆచూకీ తెలిపినవారికి 5 లక్షలు రూపాయిలు బహుమతి ఇస్తామని తండ్రి శ్రీనివాసరావు తెలిపారు. ఆయన బుధవారమిక్కడ మాట్లాడుతూ మృతదేహం ఎక్కడా దొరక్కపోవడం వల్ల తాము ఇంకా అదితి బతికే ఉందనుకుంటున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు. పొలీసుల తరఫు నుంచి ఒక నోడల్ టీంగా ఏర్పడ్డాయని, సముద్రంలో ఇవాళ కూడా మరబోట్ల ద్వారా గాలింపు చేశామని చెప్పారు. ఇప్పటివరకూ 50 కిలోమీటర్ల విస్తీర్ణంలో సముద్రంలో గాలింపు చేశామని, నిర్మానుష్యంగా ఉన్న బీచ్ ప్రాంతాల్లో సోదాలు చేయమని జిల్లా కలెక్టర్‌ను కోరినట్లు శ్రీనివాసరావు తెలిపారు. అదితి ఆచూకీ తెలిస్తే 9701000564 నెంబర్‌కు సమాచారం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తనకు ఎవరి పైనా అనుమానం లేదని, అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని శ్రీనివాసరావు తెలిపారు. ఒకవేళ ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటే సజీవంగా అప్పగించాలని కోరారు. -
అదితి.. ఏమైంది!?
-
'అదితి' కోసం ప్రత్యేక బృందాలు
హైదరాబాద్: ట్యూషన్‌కు వెళ్లొస్తూ ఆరేళ్ల చిన్నారి అదితి ప్రమాదవశాత్తు గెడ్డలో కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై మంత్రి నారాయణ విచారణకు ఆదేశించారు. గల్లంతైన అదితి కోసం ప్రత్యేక బృందాల ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విశాఖ జిల్లా సీతమ్మధారలో నివాసం ఉంటున్న రిటైర్డ్ ఆర్.అండ్ బి ఇంజినీర్ సి.హెచ్.రమణమూర్తి మనుమరాలు అదితి (6) గురువారం సాయంత్రం కురిసిన భారీ వర్షంలో రోడ్డుపై ఉన్న నీటిలో దిగి కారు ఎక్కబోయింది. పక్కనే డ్రెయిన్ కాలువ ఉండటంతో వర్షపు నీటి ఉధృతికి ఆ చిన్నారి అందులో పడి కొట్టుకుపోయింది. జీవీఎంసీ నిర్లక్ష్య వైఖరిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాప తల్లితండ్రులు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగులు. -
పెట్స్ స్పాట్
ఛీ.. కుక్క బతుకు అని తిట్టే వాళ్లు.. ఈ శునకాల రాజసం చూస్తే.. ఆ తిట్టు ఇక తిడితే ఒట్టు. తమ పెట్స్‌ను ముస్తాబు చేయడానికి ప్రత్యేక సెలూన్‌కు తీసుకెళ్తున్నారు పెట్స్ యజమానులు. వారానికో, నెలకో ఓసారి వాటిని కేర్ సెంటర్‌కు తీసుకెళ్లి ఆపాదమస్తకం అందంగా తీర్చిదిద్దుతున్నారు. క్లాస్ సెలూన్లో హెయిర్ కట్ చేస్తారు.. ఫేషియల్.. బాడీ మసాజ్ వంటి సదుపాయాలన్నీ ఉంటాయి. మనుషులకైతే ఓకే.. పెంపుడు కుక్కలకు.. పిల్లులకు.. కుందేళ్లకు.. గునియా పిగ్స్.. బర్డ్స్‌కు కూడా ఇలాంటి సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇంట్లో వాళ్లందరికీ ప్రేమ పంచే పెట్స్‌పై వాటి యజమానులూ అంతే ప్రేమను చూపిస్తున్నారు. కాస్త ఉన్నవాళ్లయితే.. తమ పెంపుడు జంతువులను తమకన్నా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఇలాంటి వారికి వరంగా మారాయి పెట్స్ కేర్ సెంటర్స్. కంప్లీట్ పెట్స్ కేర్ పెట్స్‌కు హెయిర్ సెట్టింగ్, నెయిల్స్ కటింగ్, స్నానం చేయించే సెలూన్స్ సిటీలో చాలానే ఉన్నాయి. పెట్ కేర్ సెంటర్స్‌లో వాటిని అందంగానే కాదు ఆరోగ్యంగా చూసుకునే సదుపాయాలు ఉన్నాయి. శునకాలకు స్పా (బాడీ మసాజ్) చేసే చాయిస్ ఉంటుంది. అంతేనా వాటి మనసుకు ఆహ్లాదపరిచే విధంగా ప్రత్యేకంగా అరోమా థెరపీ కూడా ఇస్తున్నారు పెట్ సెంటర్స్ నిర్వాహకులు. డిఫరెంట్ ఫ్లేవర్ స్ప్రే చేసిన రూమ్‌లో లైట్ మ్యూజిక్ ప్లే చేస్తూ.. వాటికి ఆనందాన్ని కల్పిస్తున్నారు. అరోమా థెరపీ అంటే కుక్కలు తెగ ఆసక్తి కనబరుస్తున్నాయి కూడా. మేకప్ అదరహో ఒత్తుగా జుట్టు ఉండే కుక్కలకు పెట్ కేర్ సెంటర్స్‌లో ప్రత్యేకంగా హెయిర్ రిమూవ్ చేయడంతో పాటు టిక్ రిమూవల్ (పేన్లు తీసివేయడం) కూడా చేస్తున్నారు. పెట్స్ కు పిలకలు కట్టి.. మంచి మంచి బట్టలు చుట్టి.. అదిరేటి లుక్ ఇస్తున్నారు. యాక్సరీస్, చెయిన్స్ ఫినిషింగ్ ఇవ్వడంతో శునకాల్లో రాజసం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. వీటి కోసం ప్రత్యేకంగా రెసిపీస్ కూడా ఉన్నాయి. ఈ రెసిపీస్ ఎలా చేయాలో కూడా యజమానులకు వివరిస్తున్నారు. ఈ పెట్స్ కేర్ కోసం ఉపయోగించే ప్రొడక్ట్స్ ప్రత్యేకంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. పార్టీ అండ్ రిటర్న్ గిఫ్ట్ కుక్కలకు, ఇతర పెట్స్‌కు సరదాగా బర్త్ డే పార్టీలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ పార్టీకి వచ్చిన అతిథులకు (ఇవీ పెట్సే) రిటర్న్ గిఫ్ట్ కూడా ఇస్తున్నారు. ఆ పార్టీలో ఫుల్ మ్యూజిక్‌లో తెగ ఎంజాయ్ చేస్తాయి. ప్రవర్తన, యాక్టివ్నె స్ను బట్టి వాటికి గ్రేడింగ్ (స్పెషల్ ట్రీట్స్, కుక్కీస్, పేస్ట్రీస్) కూడా ఇస్తున్నారు. ఇవి ఆడుకునేందుకు బొమ్మలు కూడా ఉంటాయి. బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ అనారోగ్యంతో వచ్చిన పెట్స్ కేర్ కోసం ఇక్కడ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. పెట్స్‌కు అందించే సేవలను బట్టి రూ.50 నుంచి రూ.5,000 వరకు చార్జ్ చేస్తున్నారు. పిల్లులే డేంజర్ కుక్కలు కాస్త కుదురుగా ఉన్నా.. పిల్లుల విషయంలో జాగ్రత్త తప్పని సరి. అవి ఒక్కచోట ఉండవు. పైగా కోపం ఎక్కువ. స్నానం చేయించేటప్పుడు.. హెయిర్ రిమూవ్ చేస్తున్నప్పుడు గీరడానికి ప్రయత్నిస్తుంటాయి. గ్లవ్స్ వేసుకుని వీటిని జాగ్రత్తగా టాకిల్ చేయాల్సి ఉంటుంది. పిల్లుల కేర్ విషయంలో చార్జెస్ ఎక్కువగా తీసుకుంటాం. - అదితి నెయిల్స్ అండ్ టెయిల్స్ పెట్స్ కేర్ సెంటర్