
‘గురు’ సినిమా రిలీజై దాదాపు పది నెలలు కావొస్తోంది. వెంకటేశ్ ఇంకా కొత్త సినిమా షూటింగ్ మొదలుపెట్టలేదు. తేజ దర్శకత్వంలో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేశ్ ప్రొడక్షన్స్ నిర్మించనున్న ఓ సినిమాను ఓకే చేసి, మూహూర్తం కూడా జరిపారు. కానీ... ఆ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు. మరి గురు షూటింగ్‌లోకి ఎంటరయ్యేదెప్పుడు అంటే.. వచ్చే నెలలో. ‘‘ఫిబ్రవరిలో షూటింగ్ మొదలుపెడుతున్నాం. సినిమాకు సంబంధించిన తారాగణం కూడా త్వరలో వెల్లడిస్తాం’’ అని పేర్కొన్నారు దర్శకుడు తేజ.
ఈ సినిమాలో వెంకీ సరసన ‘చెలియా’ భామ అదితీరావ్ హైదరీ పేరును ప్రముఖంగా పరిశీలిస్తునట్టు ఫిల్మ్‌నగర్ సమాచారం. ఇదిలా ఉంటే ‘గురు’ సినిమా తర్వాత పది నెలలు గ్యాప్ తీసుకున్న వెంకీ ఇక నుంచి గ్యాప్ వచ్చే ప్రసక్తే లేదంటున్నారు. తేజ సినిమా చేస్తూనే.. రానాతో కలిసి రాజీవ్ గాంధీ హత్య ఆధారంగా ఓ వెబ్ సిరీస్‌లో యాక్ట్ చేయనున్నారు వెంకీ. అలాగే అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ యంగ్ హీరోతో మల్టీస్టారర్ మూవీ కూడా ఒప్పుకున్నారు. వీటితోపాటు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నట్టు ప్రకటించేశారు. సో.. గత ఏడాది వచ్చిన గ్యాప్‌ను మళ్లీ రాకుండా వరుసగా సినిమాలు ఒప్పుకుంటున్నారు వెంకటేశ్.
Comments
Please login to add a commentAdd a comment