Teja
-
సినీ ప్రేక్షకులకు థియేటర్లకు రప్పించేది అదే: డైరెక్టర్ తేజ
సన్నీ అఖిల్, అజయ్ ఘోష్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిస్తోన్న చిత్రం "పోలీస్ వారి హెచ్చరిక ". దర్శకుడు బాబ్జీ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తూలికా తనిష్క్ క్రియేషన్స్ పతాకంపై బెల్లి జనార్థన్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టైటిల్ లోగోను టాలీవుడ్ డైరెక్టర్ తేజ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా దర్శకుడు తేజ మాట్లాడుతూ.. "ఏ సినిమాకైన ప్రేక్షకులను ఆకర్షించేది. వారిని థియేటర్ల వద్దకు రప్పించేలా చేసేది టైటిల్ మాత్రమే. ఈ పోలీస్ వారి హెచ్చరిక అనే టైటిల్ కూడా అలాంటిదే. ఈ టైటిల్ దర్శక నిర్మాతలకు మంచి విజయాన్ని అందిస్తుంది" అని అన్నారు. దర్శకుడు తేజ గారి చేతుల మీదుగా మా సినిమా పోస్టర్ ఆవిష్కరించడం మాకు చాలా సంతోషంగా ఉందని నిర్మాత బెల్లి జనార్థన్ పేర్కొన్నారు. ఈ సినిమా షూటింగ్ రెండు తెలుగు రాష్ట్రాల్లోని అద్భుతమైన లొకేషన్స్‌లో పూర్తి చేశామని తెలిపారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని.. రిలీజ్ తేదీని త్వరలోనే ప్రకటిస్తామన్నారు. కాగా.. ఈ చిత్రంలో రవి కాలే , గిడ్డేశ్ , శుభలేఖ సుధాకర్ , షియాజీ షిండే , హిమజ , జయవాహినీ , శంకరాభరణం తులసి , ఖుషి మేఘన , రుచిత , గోవింద , హనుమ, బాబురాం కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
Funday Story: బాలిశెట్టి అహం..!
బాలిశెట్టి.. కిరాణా కొట్టు వ్యాపారి. నిత్యావసర సరుకులు బియ్యం, బెల్లం, పప్పు, ఉప్పు, చింతపండు వంటివి అమ్మేవాడు. వ్యాపారం బాగా సాగటంతో చేతికింద పనివాడిని పెట్టుకోవాలని అనుకున్నాడు. పక్క గ్రామంలో ఉండే నర్సయ్య పనికి కుదిరాడు. బాలిశెట్టికి తన కింద పనిచేసేవారంటే చులకన ఎక్కువ. తన ముందు వాళ్లు దేనికీ సరితూగరనీ, ఎందుకూ పనికిరారనే అహంతో ఉండేవాడు. నర్సయ్యది కష్టపడి పనిచేసే స్వభావం. దుకాణం తెరిచినప్పటి నుండి మూసేవరకు బాలిశెట్టి చెప్పే రకరకాల పనులన్నిటినీ కాదనకుండా చేసేవాడు. దుకాణంలో దుమ్ము దులపడం, సరుకులు పొట్లాలు, మూటలు కట్టడం చేసేవాడు. అతనికి ఏమాత్రం విరామం దొరికినా.. పప్పులు, బియ్యంలో ఉండే రాళ్లు ఏరమని పురమాయించేవాడు బాలిశెట్టి. ఎంతపని చేసినా తృప్తి ఉండేది కాదు. పని వేళలు ముగిసి నర్సయ్య ఇంటికి వెళ్లబోతుంటే ఉల్లిగడ్డల బస్తాను కరణం గారింట్లోనో, బియ్యం బస్తాను మునసబు గారింట్లోనో వేసి పొమ్మనేవాడు. ఇంటికి ఆలస్యం అవుతుంది, మరునాడు వేస్తానంటే కించపరుస్తూ, వెక్కిరిస్తూ మాట్లాడేవాడు. బాలిశెట్టి కూతురు పెళ్ళీడు కొచ్చింది. చదువుకున్న పిల్ల కావటంతో మంచి సంబంధం కుదిరింది. నర్సయ్యను దుకాణం పనులతోపాటు, పెళ్ళి పనులకూ తిప్పుకోవటం మొదలుపెట్టాడు. దాంతో ఏ అర్ధరాత్రో ఇంటికి చేరేవాడు నర్సయ్య. ఇంట్లోవాళ్ళు బాలిశెట్టి దగ్గర పని మానేయమని ఒత్తిడి చేశారు. పెళ్ళికి మూడురోజుల ముందు బాలిశెట్టి ఇంట్లో దొంగలు పడి ఉన్న నగలు, నగదు దోచుకుపోయారు. కూతురు పెళ్లి ఆగిపోతుందని బాలిశెట్టి భయపడి నర్సయ్యకు చెప్పుకుని భోరున ఏడ్చాడు. ‘అయ్యా! మీరేం కంగారు పడకండి. మీకు అభ్యంతరం లేకపోతే పెళ్లి ఖర్చులు నేను సర్దుతాను’ అన్నాడు నర్సయ్య. ఆమాటకు బాలిశెట్టి ఆశ్చర్యపోయాడు. నర్సయ్యకు తన ఊరిలో పదిహేను ఎకరాల మాగాణి, ఇరవై ఎకరాల మామిడితోట, సొంత ఇల్లు ఉంది. ఇప్పుడు కొడుకు వ్యవసాయం పనులు చూసుకుంటున్నాడు. అతనికి ఇంట్లో కూర్చోని విశ్రాంతి తీసుకోవటం ఇష్టంలేకనే బాలిశెట్టి వద్ద పనిలో చేరాడని తెలిసింది. తన కూతురు పెళ్లికి నగదు సహాయం చేశాడు నర్సయ్య. ఆనాటి నుండి ఇతరులను తక్కువ అంచనా వేయటం, చులకనగా చూడటం మానేశాడు బాలిశెట్టి. — తేజశ్రీ -
నేను సాధించగలను అనే పట్టుదల ఉన్న వారికి ఏ ఫీల్డ్ అయినా ఒకటే
ఫీల్డ్ మారడం అనేది మంచి నీళ్లు తాగినంత సులభం కాదు.కాస్త అటూ ఇటూ అయితే మూడు చెరువుల నీళ్లు తాగాల్సి ఉంటుంది.‘నేను సాధించగలను’ అనే పట్టుదల ఉన్న వారికి మాత్రం ఏ ఫీల్డ్ అయినా ఒకటే. అలాంటి ప్రతిభావంతులలో తేజ ఒకరు. ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్‌గా పనిచేసిన తేజ ఐటీ రంగంలోకి అడుగుపెట్టి టెక్ లీడర్‌గా మంచి పేరు సంపాదించింది. కర్ణాటకలోని బెల్గాంలో పెరిగిన తేజ మనకమె డాక్టర్ అయిన తండ్రి నుంచి విజ్ఞానప్రపంచానికి సంబంధించిన ఎన్నో విషయాలు తెలుసుకునేది. డిఐవై (డూ ఇట్ యువర్ సెల్ఫ్) పాజెక్ట్స్ చేసేది. కర్ణాటక యూనివర్శిటీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కోర్సు చేసింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తొలిసారిగా నాన్–మెడికల్ ఏరియాలలో మహిళల కోసం ద్వారాలు తెరుస్తున్న సమయం అది. తన సీనియర్స్ ఎయిర్ ఫోర్స్‌లో చేరిపోయారు. వారిని యూనిఫామ్‌లో చూడడం తేజాకు ఎగ్టయిటింగ్గా అనిపించింది. వారి స్ఫూర్తితోనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లోకి వచ్చింది. బెంగళూరులోని ఎయిర్ ఫోర్స్ టెక్నికల్ కాలేజీలోప్రాథమిక శిక్షణ తరువాత మౌంట్ అబూలో పాస్టింగ్ ఇచ్చారు. మౌంట్ అబూ స్టేషన్‌లోని ఉద్యోగులలో ఇద్దరు మాత్రమే మహిళలు. అందులో తాను ఒకరు. మహిళల కోసం ప్రత్యేక వాష్ రూమ్స్ ఉండేవి కావు. ఇలాంటి సమస్యలు ఎన్ని ఉన్నా ఎప్పుడూ నిరాశపడేది కాదు తేజ,మౌంట్ అబూ తరువాత నాసిక్, బెంగళూరులలో కూడా పనిచేసింది. మన దేశాన్ని ఐటీ బూమ్ తాకిన సమయం అది.ఐటీ ఫీల్డ్‌లో ఉన్న సోదరుడు తేజాతో ఆ రంగానికి సంబంధించి ఎన్నో విషయాలు పంచుకునేవాడు. దీంతో ఐటీ రంగంపై తనకు ఆసక్తి పెరిగింది. అలా ఎయిర్ ఫోర్స్‌ను వదిలి ఐటీ రంగంలోకి అడుగు పెట్టింది. టీసీఎస్(టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్)లో డెవలపర్‌గా చేరింది. ఫ్రెషర్‌గా ఐటీ రంగంలో కెరీర్ మొదలు పెట్టిన తేజ అక్కడ ఎన్నో విషయాలు నేర్చుకుంది. ఆ తరువాత టెక్నాలజీస్‌లో పనిచేసింది. 2005లో డెల్ టెక్నాలజీలో మేనేజర్‌గా చేరింది. ఒక్కోమెట్టు ఎక్కుతూ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ (ఐటీ) స్థాయికి చేరింది. జెండర్ స్టీరియో టైప్స్‌ను బ్రేక్ చేస్తూ డెల్ ఐటీ–ఇండియాలో కీలక స్థానంలో చేరిన తొలి మహిళగా గుర్తింపు ΄పోందింది.డెల్ ఫౌండేషన్‌లో సేల్స్ అండ్ మార్కెటింగ్, సప్లై చైన్, డేటా సైన్స్... మొదలైన విభాగాల్లో పట్టు సాధించింది. సీఎస్ఆర్ యాక్టివిటీస్‌పై బాగా ఆసక్తి చూపేది. ‘టెక్నాలజీ సహాయంతో ఎన్నో మంచిపనులు చేయవచ్చు’ అంటున్న తేజ రకరకాల స్వచ్ఛంద సంస్థలతో కలిసి ఎన్నో మంచి కార్యక్రమాలు చేసింది. కోవిడ్ మహమ్మారి సమయంలో బుద్ద ఫౌండేషన్‌తో కలిసి వలస కార్మికులకు పునరావాసం కల్పించింది.‘ప్రతి మహిళకు ఒక రోల్‌మోడల్, మెంటర్ ఉండాలి. అప్పుడే ఎన్నో విజయాలు సాధించగలరు’ అంటున్న తేజ డెల్లో ‘మెంటర్ సర్కిల్ కాన్సెప్ట్’ను అమలు చేసింది. ప్రతి సర్కిల్లో కొందరు మహిళలు ఉంటారు. వారికో మెంటర్ ఉంటారు. ఈ సర్కిల్లో తమ సమస్యలను చర్చించుకోవచ్చు, సలహాలు తీసుకోవచ్చు. ఒకరికొకరు సహాయంగా నిలవచ్చు. ‘ఇంజినీరింగ్ కాలేజీలో క్లాసులో నలుగురు అమ్మాయిలు మాత్రమే ఉండేవాళ్లం. ఇప్పటి పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మా కుటుంబంలో నేను ఫస్ట్ ఉమెన్ ఇంజనీర్ని. ఇప్పుడు ఎంతోమంది ఉన్నారు. ఒక ముక్కలో చెపాలంటే సమాజంలో చాలా మార్పు వచ్చింది. ఇది ఆహ్వానించదగిన మార్పు. నేను నేర్చుకున్న విషయాల ద్వారా ఇతరులకు ఏ రకంగా సహాయం చేయగలను అని ఎప్పటికప్పుడు ఆలోచిస్తుంటాను. టైమ్ మేనేజ్మెంట్కు సంబంధించి ఎన్నో సమావేశాలు నిర్వహించాను’ అంటుంది తేజ. -
గ్యాంగ్‌స్టర్ రాక్షస రాజా
రానా హీరోగా తేజ దర్శకత్వంలో వచ్చిన ‘నేనే రాజు నేనే మంత్రి’ (2017) సూపర్ హిట్ అయిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ కాంబినేషన్లో రెండో చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. రానా పుట్టినరోజు (డిసెంబర్ 14) సందర్భంగా ఈ చిత్రం టైటిల్‌ని ‘రాక్షస రాజా’గా ప్రకటించి, రానా ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ‘‘ఇప్పటివరకూ చూడని క్రైమ్ వరల్డ్‌ని ఆవిష్కరిస్తూ ఇంటెన్స్ ఎమోషన్స్, ఫ్యామిలీ డ్రామాల సమ్మేళనంతో ఈ చిత్రం ఉంటుంది. గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రూపొందించనున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఓ అద్భుతమైన అనుభూతికి గురి చేస్తుంది. గ్రిప్పింగ్ కథనం, వండర్ఫుల్ విజువల్స్‌తో ‘రాక్షస రాజా’ తెలుగు పరిశ్రమలో కొత్త బెంచ్ మార్క్‌ను సెట్ చేయడానికి రెడీ అవుతోంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
‘రాక్షస రాజు’గా వస్తున్న రానా.. లుక్ అదిరింది
టాలీవుడ్ మల్టీ టాలెంటెడ్ నటుల్లో రానా దగ్గుబాటి ఒకరు. ఒకవైపు నటుడిగా వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూనే..మరోవైపు నిర్మాతగానూ రాణిస్తున్నాడు. అయితే ఈ టాలెంటెడ్ హీరో ఖాతాలో మాత్రం ఇటీవల ఒక్క హిట్ కూడా పడలేదు. బాహుబలి తర్వాత పలు సినిమాల్లో నటించినా.. ఆ స్థాయి గుర్తింపు, విజయం మాత్రం రాలేదు. అందుకే ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో తనకు ‘నేనే రాజు నేనే మంత్రి’ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడు తేజతో జత కట్టాడు. నేడు(డిసెంబర్ 14)రానా పుట్టిన రోజు. ఈ సందర్భంగా రానా-తేజ కాంబోలో తెరకెక్కుతున్న కొత్త సినిమా పోస్టర్ని రిలీజ్ చేశారు. ఈ సినిమాకు‘రాక్షస రాజా’అనే టైటిల్‌ని ఖరారు చేశారు. పోస్టర్లో రానా గన్ పట్టుకుని వైల్డ్ లుక్ లో కనిపిస్తున్నారు.గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా రాక్షసరాజా మూవీ తెరకెక్కబోతున్నట్లు సమాచారం. ఇందులో రానా పాత్ర నెగెటివ్ షేడ్స్‌తో ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు చేయని కొత్త పాత్రలో అతడు కనిపించబోతున్నట్లు చెబుతున్నారు. పాన్ ఇండియన్ మూవీగా రాక్షసరాజాను రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రాక్షసరాజా సినిమాలో హీరోయిన్‌తో పాటు ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎవరన్నది త్వరలోనే ప్రకటించబోతున్నారు. -
కోడిబాయె లచ్చమ్మది
దినేష్ తేజ్, హెబ్బా పటేల్ జంటగా నటించిన చిత్రం ‘అలా నిన్ను చేరి’. కొమ్మాల పాటి శ్రీధర్ సమర్పణలో మారేష్ శివన్ దర్శకత్వంలో కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సినిమాలోని మాస్ సాంగ్ ‘కోడిబాయె లచ్చమ్మది..’ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విడుదల చేసి, మాట్లాడుతూ – ‘‘యంగ్ టాలెంట్ తీసే చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తుంటారు. ఈ చిత్రాన్ని కూడా ఆదరించాలి. సినిమా పెద్ద హిట్టవ్వాలి’’ అన్నారు. సుభాష్ ఆనంద్ స్వరపరచిన ‘కోడిబాయె..’ పాటను మంగ్లీ పాడగా, భాను నృత్యరీతులు సమకూర్చారు. ‘‘ఈ పాటలో దినేష్ తేజ్, హెబ్బా పటేల్‌ల మాస్ స్టెప్స్ ఆకట్టుకునే విధంగా ఉంటాయి. తెలంగాణ నుంచి మరో జానపదం చార్ట్ బస్టర్‌గా నిలవనుంది. సినిమాలోని అన్ని పాటలనూ చంద్రబోస్ గారు రాశారు ’’ అని యూనిట్ పేర్కొంది. -
తలకిందులుగా వేలాడదీసి..కింద మంట పెట్టి...
మందమర్రి రూరల్: మంచిర్యాల జిల్లా మందమర్రిలో దారుణం చోటు చేసుకుంది. మేకలు దొంగతనం చేశారని ఇద్దరు యువకులను కట్టేసి చిత్రహింసలు పెట్టారు. తలకిందులుగా వేలాడదీసి, కింద మంటపెట్టి నరకం చూపించారు. అవమానం భరించలేక ఓ యువకుడు కనిపించకుండా పోయాడు. అతని చిన్నమ్మ శనివారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఆలస్యంగా విషయం వెలుగులోకి వచ్చింది. మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని యాపల్ ఏరియా సమీపంలోని అబ్రహం నగర్‌కు చెందిన చాకలి రాములుకు కొన్ని మేకలు ఉన్నాయి. ఆ మేకలను కాసేందుకు తేజ అనే యువకుడిని కూలీగా పెట్టుకున్నాడు. అయితే మేకల షెడ్డు వద్ద ఉన్న ఓ పైపు, ఒక మేక ఇటీవల చోరీ అయ్యాయి. అదే ఏరియాకు చెందిన కిరణ్ ఈ పని చేసి ఉంటాడన్న అనుమానంతో రాములు పిలిచి ప్రశ్నించాడు. దీంతో తడబడిన కిరణ్ పైపు దాచిన చోటు చూపించాడు. తర్వాత చోరీ అయిన మేక గురించి కూడా ఆరా తీయగా స్థానికులు మేకను కూడా కిరణే ఎత్తుకెళ్లి అమ్ముకున్నాడని ఆరోపించారు. దీంతో ఆగ్రహించిన రాములు నిందితుడిని తాళ్లతో కట్టేసి తలకిందులుగా వేలాడదీసి చిత్రహింసలు పెట్టాడు. అంతటితో ఆగకుండా కింద మంట పెట్టాడు. చిత్రహింస భరించలేక కిరణ్, తనకు మేకల కాపరి తేజ సహకరించాడని చెప్పాడు. దీంతో అతడిని కూడా తీసుకువచ్చి షెడ్డులో కట్టేసి రాములు, అతని కుటుంబ సభ్యులు చిత్రహింసలు పెట్టారు. తర్వాత పెద్దమనుషుల వద్ద పంచాయితీ పెట్టగా మేకకు రూ.6 వేలు ఇవ్వాలని తీర్మానం చేశారు. ఇందుకు నిందితులు అంగీకరించారు. కిరణ్ చిన్నమ్మ ఫిర్యాదుతో.. ఘటన అనంతరం అవమాన భారంతో కిరణ్ కనిపించకుండాపోయాడు. దీంతో రాములు, అతని కొడుకు శ్రీనివాస్, భార్య స్వరూప, అతని వద్ద పనిచేసే నరేశ్ రెండు రోజుల క్రితం తన అక్క కొడుకు కిరణ్‌ను తీవ్రంగా హింసించారని కిరణ్ చిన్నమ్మ నిట్టూరి సరిత శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ అవమానం భరించలేక తన అక్క కొడుకు కిరణ్ కనిపించకుండా పోయాడని తెలిపింది. కిరణ్ దళితుడు కావడంతో నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై చంద్రకుమార్ పేర్కొన్నారు. ఘటన స్థలాన్ని బెల్లంపల్లి ఏసీపీ పంతాటి సదయ్య శనివారం పరిశీలించారు. -
ఆ ఒక్క తప్పు వల్లే నా లైఫ్ ఇలా ఉంది
-
ఫుట్ బాల్ నేపథ్యంలో ‘డ్యూడ్’
యంగ్ హీరో తేజ్ నటిస్తున్న ద్విభాషా చిత్రం ‘డ్యూడ్’. తెలుగు - కన్నడ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పనరోమిక్ స్టూడియోస్ పతాకంపై తేజ్ స్వయంగా నిర్మిస్తుండడమే కాకుండా... స్వయంగా కథను అందించి, దర్శకత్వం వహిస్తుండడం విశేషం. తేజ్ ఇంతకుముందు ‘రామాచారి’ అనే హిట్ చిత్రంలో నటించారు. తను తాజాగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘గాడ్’ ప్రి - ప్రొడక్షన్ లో ఉంది. ఇప్పటివరకు కొన్ని వేల ప్రేమ కథా చిత్రాలు వచ్చాయి. కానీ పూర్తి ఫుట్ బాల్ నేపథ్యంలో ఇప్పటివరకు ఏ తెలుగు, కన్నడ భాషల్లో సినిమా రాలేదు. అందువల్లే... కర్ణాటకలోని ‘కిక్ స్టార్ట్’ అనే సుప్రసిద్ధ ఫుట్ బాల్ క్లబ్... ‘డ్యూడ్’ చిత్రానికి పూర్తి సహాయసహకారాలు అందిస్తోంది. అక్టోబర్ లో సెట్స్ కు వెళ్లనున్న ఈ చిత్రానికి కన్నడ - మలయాళ భాషల్లో సుపరిచితుడైన ఇమిల్ మొహమ్మద్ సంగీతం సమకూర్చుతుండగా... నాని కెరీర్ కి తిరుగులేని పునాది వేసిన "అలా మొదలైంది" చిత్రానికి ఛాయాగ్రహణం అందించిన ప్రేమ్ కెమెరా బాధ్యతలు నిర్వహించనున్నారు. -
Ahimsa Movie Review: ‘అహింస’ మూవీ రివ్యూ
టైటిల్: అహింస నటీనటులు: అభిరామ్ దగ్గుబాటి, గీతికా తివారి, సదా, కల్పలత, కమల్ కామరాజు, దేవి ప్రసాద్ తదితరులు నిర్మాత : పి.కిరణ్ దర్శకత్వం : తేజ సంగీతం: ఆర్పీ పట్నాయక్ సినిమాటోగ్రఫీ: సమీర్ రెడ్డి ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు విడుదల తేది : జూన్ 2, 2023 తెలుగు చిత్ర పరిశ్రమలో దగ్గుబాటి ఫ్యామిలీకి ప్రత్యేక స్థానం ఉంది. రామా నాయుడు మొదలు రానా వరకు ఆ ఫ్యామిలీకి చెందిన ప్రతి ఒక్కరు తమదైన టాలెంట్‌తో ఇండస్ట్రీలో స్పెషల్ ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్నారు. అలాంటి ఫ్యామిలీ నుంచి ఓ మరో హీరో ఎంట్రీ ఇవ్వబోతున్నారంటే.. ఆ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడడం సహజం. అందుకే ‘అహింస’పై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. సురేశ్ బాబు తనయుడు, రానా తమ్ముడు అభిరామ్ నటించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి అభిరామ్ డెబ్యూ మూవీ ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. రఘు(అభిరామ్) ఓ పేద రైతు. తల్లిదండ్రులు చిన్నప్పుడు చనిపోవడంతో మేన మామ, అత్త(దేవీ ప్రసాద్, కల్పలత)దగ్గర పెరుగుతాడు. రఘు మరదలు అహల్య(గీతికా తివారి)కి బావ అంటే చాలా ఇష్టం. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటారు. ఓ రోజు అహల్య పొలం దగ్గరు ఉన్న రఘుకి టిఫిన్ బాక్స్ ఇచ్చి వెళ్తుంటే.. సిటీకి చెందిన ఇద్దరు కుర్రాళ్లు ఆమెపై హత్యాచారానికి పాల్పడుతారు. అనంతరం దారుణంగా కొట్టి అడవిలో పడేసి వెళ్తారు. తన మరదలికి జరిగిన అన్యాయంపై న్యాయ పోరాటం చేస్తాడు రఘు. అతని ఓ మహిళా లాయర్ లక్ష్మీ(సదా)తోడుగా నిలుస్తుంది. నిందితులిద్దరూ బడా వ్యాపారవేత్త ధనలక్ష్మి దుష్యంతరావు(రజత్ బేడీ) కొడుకులు కావడంతో ధర్మ పోరాటంలో రఘు ఓడిపోతారు. అంతేకాదు తనకు సహాయం చేసిన లాయర్ లక్ష్మీ, ఆమె భర్తను ధనలక్ష్మీ దుష్కంతరావు దారుణంగా చంపేస్తాడు. అహింసా మార్గంలో వెళ్తే తనకు న్యాయం జరగది భావించిన రఘు.. హింసని ఎంచుకుంటాడు. తన మరదలిపై హత్యాచారానికి పాల్పడిన దుండగులను చంపేయాలని డిసైడ్ అవుతాడు. దాని కోసం రఘు ఏం చేశాడు? వారిని ఎలా చంపాడు? అడవుల్లో గంజాయి సాగు చేసే లుంబ్డి గ్యాంగ్.. రఘును చంపాలని ఎందుకు ప్రయత్నించింది? దుష్కంతరావు కనబడకుండా పోవడానికి కారణం ఏంటి? అనేది తెలియాలంటే థియేటర్లో అహింస మూవీ చూడాల్సిందే. ఎలా ఉందంటే.. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్స్‌లో తేజ ఒకరు. ఒకప్పుడు ఆయన సినిమాలు ఇండస్ట్రీలో రికార్డులు సృష్టించాయి. ఎంతో మంది హీరోలను తెలుగు తెరకు పరిచయం చేశాడు. చిత్రం, నువ్వు నేను, జయం లాంటి బ్లాక్ బస్టర్స్ అందించాడు. ఇక తేజ పని అయిపోందిలే అనుకుంటున్న సమయంలో రానాతో ‘నేనే రాజు నేను మంత్రి’ సినిమా తీసి మళ్లీ పుంజుకున్నాడు. ఆ తర్వాత ‘సీత’లాంటి డిజాస్టర్ మూవీని ఇచ్చినా.. ఈ సారి బ్లాక్ బస్టర్ పక్కా ఇస్తాడులే అని అభిమానులు ఎంతో నమ్మకంగా ఉన్నారు. కానీ తేజ వారి నమ్మకాన్ని కాపాడుకోలేకపోయాడనిపిస్తుంది. పాత కథ, రొటీన్ స్క్రీన్‌ప్లేతో ‘అహింస’ను తెరకెక్కించాడు. చాలా సన్నివేశాలు తేజ తెరకెక్కించిన ‘జయం’, ‘నువ్వు నేను’ ‘ధైర్యం’ చిత్రాలను గుర్తుకు తెస్తాయి. ఇక లాజిక్కుల గురించి మాట్లాడుకోకపోవడం మంచిదేమో. కానిస్టేబుల్ పతంగి ఎగిరేసి అడవిలో ఉన్న హీరోకి సమాచారం అందించడం, కోర్టులోకి హీరో ప్రవేశించిన తీరు, సాక్ష్యాల కోసం హీరో చేసే ప్రయత్నాలు.. ఇలా ఏ ఒక్కటి రియలిస్టిక్‌గా ఉండదు. పైగా కథ మొత్తాని లాగినట్లుగా అనిపిస్తుంది. సెకండాఫ్‌లో వచ్చే ఐటమ్ సాంగ్ అయితే మరీ దారుణం. ఇంట్లో శవాలను పెట్టుకొని ఐటమ్ పాట పాడించడం ఏంటో ఎవరీ అర్థం కాదు. అలాగే ఓ కానిస్టేబుల్ ఎందుకు వారికి సపోర్ట్‌గా నిలిచాడో అదీ తెలియదు. ఫస్టాఫ్ ఎండింగ్ సమయంలోనే క్లైమాక్స్ అర్థమైపోతుంది. సెకండాఫ్‌లో కథ మరీ సాగదీసినట్లుగా అనిపిస్తుంది. ఒకనొక దశలో సినిమా ఇంకా అయిపోవట్లేదే అనే ఫీలింగ్ కలుగుతుంది. మొత్తంగా అహింస పేరుతో తేజ ప్రేక్షకులను హింసించారనే చెప్పాలి. ఎవరెలా చేశారంటే.. అభిరామ్‌కు ఇది తొలి సినిమా. ఉన్నంతలో రఘు తన పాత్రకు న్యాయం చేసేందుకు ట్రై చేశాడు. తేజ కూడా అభిరామ్‌పై పెద్దగా భారం వేయకుండా సన్నివేశాలను రాసుకున్నాడు. కానీ కొన్ని చోట్ల అభిరామ్ అనుభవలేమి కొట్టొచ్చినట్లు కనిపించింది. ఇక అహల్యగా గీతికా తివారి తనదైన నటనతో మెప్పించింది. తెరపై చాలా అందంగా కనిపించింది. పోలీస్ ఆఫీసర్‌గా కమల్ కామరాజు, లాయర్‌గా సదా తన పాత్రలకు న్యాయం చేశారు. విలన్‌గా నటించిన రజత్ బేడి, ఛటర్జీ పాత్ర పోషించిన వ్యక్తితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ఆర్పీ పట్నాయక్ సంగీతం పర్వాలేదు. ‘ఉందిలే’ పాట మినహా మిగతావేవి అంతగా ఆకట్టుకోలేవు. సమీర్ రెడ్డి సినిమాటోగ్రపీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు చాలా పని చెప్పాల్సింది. ముఖ్యంగా సెకండాఫ్‌లో చాలా సన్నివేశాలను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
మీరు కూడా RGV లాగా మారిపోయారా ..!
-
వెంకటేష్,అభిరాం,నాగచైతన్యతో అసలు సినిమా చేయను ....
-
హీరోయిన్ గా తెలుగు అమ్మాయిలను ఎందుకు తీసుకోను అంటే..!
-
థియేటర్ లో పాప్ కార్న్ రేట్ల పై తేజ సంచలన కామెంట్స్
-
తేజ్ కామెడీ పంచెస్ చూస్తే నాన్ స్టాప్ గ నవ్వుతూనే ఉంటారు
-
రానాతో నెక్ట్స్ మూవీని అనౌన్స్ చేసిన డైరెక్టర్ తేజ
డైరెక్టర్ తేజ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ అహింస. ఈ సినిమాతో దగ్గుబాటి అభిరామ్‌ను హీరోగా పరిచయం చేస్తున్నారు. ఈ మూవీ అనంతరం తన నెక్ట్స్ మూవీ రానాతో చేస్తానని తేజ ప్రకటించారు. అహింస ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడిన ఆయన ఈ మేరకు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 'రానాతో నేను చేయబోయే సినిమా పేరు రాక్షస రాజు. ఈ సినిమాతో 45మంది కొత్త ఆర్టిస్టులను పరిచయం చేయాలని అనుకుంటున్నాను. ఆసక్తి ఉన్న వాళ్లు ఇన్స్టాగ్రామ్ ద్వారా నన్ను సంప్రదించవచ్చు. రామానాయుడు స్వస్థలమైన చీరాల నుంచి కనీసం 10మంది ఆర్టిస్టులు కావాలి. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది' అంటూ తేజ వెల్లడించారు. గతంలో రానా-తేజ కాంబినేషన్లో వచ్చిన నేనే రాజు నేనే మంత్రి మూవీ సూపర్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. దీంతో రాక్షస రాజు మూవీపై మరింత ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంలో ప్రముఖ మలయాళ హీరో కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం. -
అమ్మా, నాన్న చనిపోతే.. వారే అంతా పంచుకున్నారు: తేజ
దగ్గుబాటి అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం 'అహింస'. ఈ సినిమాలో గీతికా తివారి హీరోయిన్గా నటిస్తోంది. విభిన్న కథనాలతో సినిమాలను తెరకెక్కించే తేజ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా జూన్ 2న విడుదల థియేటర్లలో కానుంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు తేజ. (ఇది చదవండి: ఉదయ్‌కిరణ్ డెత్ మిస్టరీ.. ఏమీ తెలియనట్లు నటిస్తున్నారు: తేజ) తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన బాల్యంలో ఎదురైన ఇబ్బందులను పంచుకున్నారు. తన చిన్నప్పుడు ఫుట్ పాత్ మీద పడుకున్న రోజుల గురించి తెలిపారు. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయానని.. ఆ తర్వాతే ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు చూశానని చెప్పుకొచ్చారు. తేజ మాట్లాడుతూ.. 'మేము చెన్నైలో ఉండేవాళ్లం. నాకు ఒక అక్క, ఒక చెల్లి. నా బాల్యంలో మాకు ఆస్తులు బాగానే ఉండేవి. నాకు ఊహ తెలిసే సరికి అమ్మ చనిపోయారు. ఆ బెంగతో నాన్న కొంతకాలానికే కన్నుమూశారు. ఆ పరిస్థితుల్లో మా భవిష్యత్తు తలకిందులైంది. మా బంధువులే మమ్మల్ని పంచుకున్నారు. అక్క ఒక చోట. నేనూ, చెల్లి మరో చోట ఉండాల్సి వచ్చింది. మమ్మల్ని చూసుకున్నందుకు వాళ్లు కూడా కొన్ని ఆస్తులు తీసుకున్నారు. అంతే కాకుండా ఓరోజు నన్ను ఆరు బయట పడుకోమన్నారు. నేను ఆ రోజు రాత్రే పారిపోయా. ఫుట్‌పాత్‌పై పడుకున్నా. ఈ రోజు నేను ఈ స్థాయికి వచ్చానంటే కేవలం సినిమా వల్లే.' అంటూ తను పడిన బాధలను వివరించారు. (ఇది చదవండి: మీ కోసమే వచ్చా.. సల్లు భాయ్‌కి ప్రపోజ్ చేసిన అమ్మాయి!) మహేశ్ బాబు హీరోగా నటించిన నిజం అనుకున్నంతగా ఆడకపోవడంతో సినిమాపై ఏకాగ్రత కోల్పోయానని అన్నారు. ఆ తర్వాత మా అబ్బాయికి ఆరోగ్యం బాగాలేక పోవడంతో సుమారు నాలుగేళ్లపాటు సినిమాకు దూరంగా ఉన్నానని తెలిపారు. నేనే రాజు నేనే మంత్రి మూవీతో తిరిగి హిట్ అందుకున్నా అని తేజ వెల్లడించారు. -
రానా తమ్ముడు హీరోగా 'అహింస'.. ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్
ప్రముఖ నిర్మాత సురేష్‌బాబు తనయుడు, రానా సోదరుడు అభిరామ్ అహింస చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. తేజ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రేమకథా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అభిరామ్‌కు జోడీగా గీతికా తివారీ హీరోయిన్గా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేస్తోంది. ఇక ఇప్పటికే రిలీజ్ డేట్ పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం జూన్2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో భారీగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ప్లాన్ చేస్తున్నారు. ఈనెల 27న ఆంధ్రప్రదేశ్ చీరాలలోని ఎన్ఆర్పీఎం హైస్కూల్ గ్రౌండ్లో ఈ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఓ పోస్టర్‌ను వదిలారు. ఇక ఈ ఈవెంట్‌కు పలువురు టాలీవుడ్ పెద్దలు రానున్నట్లు సమాచారం. -
దగ్గుబాటి మల్టీస్టార్ లో నాగచైతన్య ...
-
ఉదయ్‌కిరణ్ డెత్ మిస్టరీ.. ఏమీ తెలియనట్లు నటిస్తున్నారు: తేజ
దగ్గుబాటి అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం అహింస. గీతికా తివారి హీరోయిన్. తేజ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా జూన్ 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ కార్యక్రమాలతో బిజీ అయి తేజ వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ క్రమంలో ఎక్కడికి వెళ్లినా అతడికి దివంగత నటుడు ఉదయ్ కిరణ్ గురించే ప్రశ్న ఎదురవుతుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఉదయ్ కిరణ్ పేరు చెప్పగానే పాపం అనేశాడు తేజ. దీంతో ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి హీరో డెత్ మిస్టరీ రివీల్ చేస్తానన్నారు కదా సర్.. అని అడిగాడు. దీనికి తేజ స్పందిస్తూ.. 'చాలామందికి ఉదయ్ కిరణ్ మరణం వెనుక అసలు కారణం తెలుసు. కానీ ఎందుకు నాతోనే దాన్ని చెప్పించాలని చూస్తున్నారు. అందరూ ఏమీ తెలియనట్లు అమాయకంగా మీరే చెప్పండని ఎందుకు నటిస్తున్నారో అర్థం కావట్లేదు' అని బదులిచ్చాడు. తన కుటుంబం గురించి మాట్లాడుతూ.. 'మా అబ్బాయి డైరెక్షన్ కోర్స్ పూర్తి చేశాడు. తనను త్వరలో హీరోగా పరిచయం చేస్తాను. అమ్మాయి తన చదువు పూర్తి చేసుకుని ఇండియాకు తిరిగొచ్చేసింది. ఆమెకు నేను పెళ్లి చేయను. నచ్చినవాడిని చూసుకుని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోమని చెప్పాను. ఆ తర్వాత దగ్గరివాళ్లను పిలిచి భోజనాలు పెడదామన్నాను. ఒకవేళ పెళ్లి తర్వాత నచ్చకపోతే విడాకులిచ్చేయ్.. నా ఇద్దరు పిల్లలకు అదే చెప్తా.. జీవితంలో సంతోషంగా ఉండటం కోసం ఏది చేయాలనిపిస్తే అది చేయండి.. అంతే తప్ప పక్కవాళ్ల కోసం ఆలోచించవద్దని చెప్తాను' అని చెప్పుకొచ్చాడు. చదవండి: చులకన చేసే నోరు ఉంటే చురకలు వేసే నోరు కూడా ఉంటుంది -
హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న డైరెక్టర్ తేజ కుమారుడు
ప్రేమకథా చిత్రాలు తెరకెక్కించడంతో తనదైన మార్క్ చూపించిన దర్శకుల్లో డైరెక్టర్ తేజ ఒకరు. తెలుగులో జయం, నిజం, ఔనన్నా కాదన్నా, లక్ష్మీ కల్యాణం, నేనే రాజు నేనే మంత్రి వంటి పలు హిట్ చిత్రాలు తెరకెక్కించిన ఆయన రీసెంట్గా అహింస అనే సినిమాను రూపొందించారు. దగ్గుబాటి రానా తమ్ముడు అభిరామ్‌ను ఈ సినిమాతో హీరోగా పరిచయం చేస్తున్నారు. గతంలోనూ అనేకమంది నటీనటులను డైరెక్టర్ తేజ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన తేజ తన కొడుకు ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మా అబ్బాయిని హీరోగా పరిచయం చేయాలనుకుంటున్నా. తనకు ఇంట్రెస్ట్ ఉండటంతో విదేశాల్లో అందుకు సంబంధించిన కోర్సులు చేసి వచ్చాడు. చూడటానికి హ్యాండ్సమ్గానే ఉంటాడు. కానీ హీరోగా చేయడానికి అదొక్కటే సరిపోదు కదా.. ఇక మా అబ్బాయిని నేను డైరెక్ట్ చేయాలా లేక ఇంకెవరికైనా అప్పగించాలా అన్నది చూడాల్సి ఉంది అంటూ తేజ పేర్కొన్నారు. -
నాకు జరిగిన అవమానాలను గుర్తు పెట్టుకుంటా: డైరెక్టర్ తేజ
హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు తెరకెక్కించే డైరెక్టర్లలో తేజ ఒకరు. కొత్త నటీనటులతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంటారు. ‘సీత’ తర్వాత ఆయన దర్శకత్వం వహించిన సినిమా అహింస. చిత్రం సినిమాతో జర్నీ ప్రారంభించిన ఆయన.. ప్రస్తుతం అభిరామ్ దగ్గుబాటి హీరోగా తెరకెక్కించిన ప్రేమకథా చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన తన కెరీర్లో ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. (ఇది చదవండి: ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు దూరంగా జూ.ఎన్టీఆర్!) తెలుగులో జయం, నిజం, ఔనన్నా కాదన్నా, లక్ష్మీ కల్యాణం, నేనే రాజు నేనే మంత్రి లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఎలాంటి హంగులకు పోకుండా కంటెంట్‌కు అనుగుణంగా చిత్రాలను తెరకెక్కిస్తే తప్పకుండా అది ప్రేక్షకులకు రీచ్ అయ్యే అవకాశం ఉందని అన్నారు. తప్పుల నుంచే తాను ఎన్నో విషయాలను నేర్చుకున్నానని.. వాటిని ఎప్పటికీ మర్చిపోనని తేజ అన్నారు. డైరెక్టర్ తేజ మాట్లాడుతూ.. 'నేను నా ఇంటి సైట్‌ను బ్యాంక్‌లో పెట్టా. మధ్యలో నాలుగేళ్లు సినిమాలు చేయలేదు. బ్యాంక్ వాళ్లు వచ్చి ఈ ఆస్తి జప్తులో ఉందని గేటుకు రాశారు. ఆ తర్వాత అప్పు కట్టేశా. కానీ జీవితంలో మళ్లీ లోన్ తీసుకోకూడదని గుర్తు పెట్టుకోవడం కోసం వాళ్లు రాసిన నోటీసు తొలగించకుండా అలాగే ఉంచా. కానీ నా జీవితంలో చేసిన తప్పులు, అవమానాలను గుర్తు పెట్టుకుంటా. మళ్లీ వాటిని చేయకూడదని నిర్ణయించుకుంటా. నేను చేసిన సినిమాలు ఫెయిల్ అయ్యాయి. సినిమా తీసినప్పుడే హిట్టా, ఫ్లాపా అనేది ముందే తెలుస్తుంది. అందుకే నేను ఏ సినిమాపై ఎలాంటి ఆశలు పెట్టుకోను. సినిమా విషయంలో బడ్జెట్ ఉందని ఎలా పడితే అలా చేయకూడదు. కథకు తగిన బడ్జెట్లోనే తీయాలి. అంతే కానీ ఉంది కదా అని కథను మించి బడ్జెట్ ఖర్చు పెడితే అంతే ' అని అన్నారు. (ఇది చదవండి: లక్షన్నరలో హీరోయిన్ వివాహం.. పెళ్లి చీర రూ.3 వేలు మాత్రమేనట!) -
రానా తమ్ముడు నటించిన 'అహింస' ట్రైలర్ చూశారా?
ఓ యువకుడిని క్రిమినల్ కేసులో పోలీసులు అరెస్ట్ చేస్తారు. అతన్ని విడిపించడానికి ఓ క్రిమినల్ లాయర్ కేసును టేకప్ చేస్తుంది. గురువారం హీరో రామ్‌చరణ్ విడుదల చేసిన ‘అహింస’ ట్రైలర్లో కనిపించిన సన్నివేశాలు ఇవి. మరోవైపు అదే ట్రైలర్లో ఆ యువకుడు, ఓ యువతి ప్రేమలో ఉన్న సీన్లు కనబడతాయి. దివంగత ప్రముఖ నిర్మాత డి. రామానాయుడు మనవడు, నిర్మాత సురేష్‌బాబు తనయుడు అభిరామ్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘అహింస’. గీతిక హీరోయిన్గా లాయర్ పాత్రలో సదా నటించిన ఈ చిత్రానికి తేజ దర్శకుడు. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీకి పి. కిరణ్ నిర్మాత. త్వరలో రిలీజ్ కానున్న ఈ చిత్రానికి సంగీతం: ఆర్పీ పట్నాయక్, కెమెరా: సమీర్ రెడ్డి. -
నేరుగా ఓటీటీలోకి వస్తున్న ‘జగమేమాయ’.. రిలీజ్ ఎప్పుడంటే?
చైతన్య, తేజ, ధన్య బాలకృష్ణన్ కీలక పాత్రల్లో సునీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'జగమేమాయ'. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం రిలీజ్‌కు రెడీ అయింది. నేరుగా ఓటీటీలోనే ఈ మూవీ విడుదల కానుంది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వేదికగా డిసెంబరు 15వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. తాజాగా చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తే.. 'నేను కాలేజీలో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని లవ్ చేశాను.' అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. ఈ సమాజంలో మనుషుల వ్యక్తిత్వం ఎలా ఉంటుంది? డబ్బు కోసం ఎలాంటి పనులు చేస్తారు? వంటి అంశాలను ‘జగమేమాయ సినిమాలో చాలా విలక్షణంగా ఆవిష్కరించినట్లు అర్థమవుతోంది. ముగ్గురు వ్యక్తుల మధ్య ఉన్న రిలేషన్‌పై డబ్బు ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్నది సినిమాలో చూపించే ప్రయత్నం చేశారు. -
యాక్షన్ ఎంటర్టైనర్గా రానా సోదరుడి ‘అహింస’
నిర్మాత సురేశ్‌బాబు తనయుడు, హీరో రానా సోదరుడు అభిరామ్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘అహింస’. తేజ దర్శకత్వంలో పి. కిరణ్ నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. త్వరలోనే ఈ సినిమాని విడుదల చేస్తున్నట్లు తెలుపుతూ, కొత్త పోస్టర్లను విడుదల చేసింది చిత్రయూనిట్. ‘‘యూత్‌ఫుల్ లవ్, యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘అహింస’. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. ఆర్పీ పట్నాయక్ సంగీతం అందించిన ‘నీతోనే నీతోనే..’, ‘కమ్మగుంటదే..’ పాటలు చార్ట్ బస్టర్స్‌గా నిలిచాయి. త్వరలోనే సినిమాని థియేటర్లలో విడుదల చేస్తాం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి కెమెరా: సమీర్ రెడ్డి.