తేజకు ఐదు వికెట్లు | Teja took five wickets | Sakshi

తేజకు ఐదు వికెట్లు

Dec 19 2013 12:41 AM | Updated on Sep 2 2017 1:45 AM

వాకర్ టౌన్ బౌలర్ తేజ (5/15) తన బౌలింగ్‌తో ప్రత్యర్థి జట్టును బెంబేలెత్తించాడు. దీంతో ఆ జట్టు 9 వికెట్ల తేడాతో సత్య సీసీ జట్టుపై విజయం సాధించింది.

 జింఖానా, న్యూస్‌లైన్ : వాకర్ టౌన్ బౌలర్ తేజ (5/15) తన బౌలింగ్‌తో ప్రత్యర్థి జట్టును బెంబేలెత్తించాడు. దీంతో ఆ జట్టు 9 వికెట్ల తేడాతో సత్య సీసీ జట్టుపై విజయం సాధించింది. హెచ్‌సీఏ కిషన్ ప్రసాద్ వన్డే నాకౌట్ టోర్నీలో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన సత్య సీసీ 75 పరుగులకే కుప్పకూలింది. అన ంతరం బరిలోకి దిగిన వాకర్ టౌన్ వికెట్ కోల్పోయి 80 పరుగులు చేసి గెలిచింది. పాండు (45) మెరుగ్గా ఆడాడు. మరో మ్యాచ్‌లో విజయానంద్ జట్టు 119 పరుగుల తేడాతో సన్‌షైన్ జట్టుపై గెలుపొందింది. మొదట బరిలోకి దిగిన విజయానంద్ 6 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. నాయక్ (70) అర్ధ సెంచరీతో రాణించగా... తిలక్ (44), అభిషేక్ (37), విక్రాంత్ (30) ఫర్వాలేదనిపించారు. సన్‌షైన్ బౌలర్ కళ్యాణ్ సాత్విక్ 4 వికెట్లు పడగొట్టాడు. తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన సన్‌షైన్ 103 పరుగులకే చేతులెత్తేసింది. విజయానంద్ బౌలర్ నరేష్ 3 వికెట్లు తీశాడు.
 
 ఇతర మ్యాచ్‌ల స్కోర్లు
 అగర్వాల్ ఎస్‌ఆర్: 174 (ఫరూఖ్ 45, అబ్దుల్లా 30; మునాఫ్ సుబానీ 3/32); కల్నల్ అక్రిలిక్: 175/5 (మొసిన్ ఆరిఫ్ 51, మహ్మద్ ఆసిఫ్ 30).
 
 లాల్ బహదూర్: 272/7 (గఫార్ ఖాన్ 50, జైచందర్ 65, సుషీల్ 56 నాటౌట్, పవన్ 33); ఇన్‌కమ్ ట్యాక్స్: 273 (మారుతీ ప్రసాద్ 40, హిమాన్షు 67, రాజశేఖర్ 73).
 కాంకార్డ్: 131; రోహిత్ ఎలెవన్: 135/7.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement