సినీ ప్రేక్షకులకు థియేటర్లకు రప్పించేది అదే: డైరెక్టర్ తేజ | Tollywood Director Teja Released Police Vari Hecharika Movie Title Poster | Sakshi
Sakshi News home page

Police Vari Hecharika Poster: సినీ ప్రియులను థియేటర్లకు రప్పించేది అది మాత్రమే: తేజ

Published Tue, Jun 18 2024 9:41 PM | Last Updated on Wed, Jun 19 2024 12:20 PM

Tollywood Director Teja Released Movie Title Poster

సన్నీ అఖిల్, అజయ్ ఘోష్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిస్తోన్న చిత్రం "పోలీస్ వారి హెచ్చరిక ". దర్శకుడు బాబ్జీ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తూలికా తనిష్క్ క్రియేషన్స్ పతాకంపై బెల్లి జనార్థన్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టైటిల్ లోగోను టాలీవుడ్ డైరెక్టర్  తేజ  ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా  దర్శకుడు తేజ మాట్లాడుతూ..  "ఏ సినిమాకైన  ప్రేక్షకులను ఆకర్షించేది. వారిని థియేటర్ల వద్దకు రప్పించేలా చేసేది టైటిల్ మాత్రమే. ఈ  పోలీస్ వారి హెచ్చరిక అనే టైటిల్ కూడా  అలాంటిదే. ఈ టైటిల్ దర్శక నిర్మాతలకు మంచి విజయాన్ని అందిస్తుంది"  అని అన్నారు. 

దర్శకుడు తేజ గారి చేతుల మీదుగా మా సినిమా పోస్టర్‌ ఆవిష్కరించడం మాకు చాలా సంతోషంగా ఉందని  నిర్మాత  బెల్లి జనార్థన్ పేర్కొన్నారు. ఈ సినిమా  షూటింగ్  రెండు తెలుగు రాష్ట్రాల్లోని అద్భుతమైన లొకేషన్స్‌లో పూర్తి చేశామని తెలిపారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని.. రిలీజ్ తేదీని త్వరలోనే ప్రకటిస్తామన్నారు. కాగా.. ఈ చిత్రంలో రవి కాలే , గిడ్డేశ్ , శుభలేఖ సుధాకర్ , షియాజీ షిండే , హిమజ , జయవాహినీ , శంకరాభరణం తులసి , ఖుషి మేఘన , రుచిత , గోవింద , హనుమ, బాబురాం కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement