gymkhana ground
-
Ranji Trophy 2024-25: హైదరాబాద్ జట్టుకు చేదు అనుభవం
సాక్షి, హైదరాబాద్: రంజీ ట్రోఫీ 2024-25 సీజన్‌ను హైదరాబాద్ జట్టు పరాజయంతో ప్రారంభించింది. బ్యాటర్ల వైఫల్యం కారణంగా కొత్త ఎడిషన్ ఆరంభ మ్యాచ్‌లోనే చేదు అనుభవం ఎదుర్కొంది.కాగా హైదారాబాద్ గ్రూప్ ‘బి’ ఎలైట్ డివిజన్ తొలి రౌండ్ లీగ్ మ్యాచ్‌లో భాగంగా హైదరాబాద్ తొలుత.. మాజీ చాంపియన్ గుజరాత్‌తో తలపడింది. సికింద్రాబాద్‌లోని జింఖానా మైదానంలో సోమవారం ముగిసిన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ 126 పరుగుల తేడాతో ఓడిపోయింది. 170 పరుగులకేచివరిరోజు ఆటలో భాగంగా.. 297 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు 59.1 ఓవర్లలో 170 పరుగులకే కుప్పకూలింది.ఓపెనర్ అభిరత్ రెడ్డి (59 బంతుల్లో 51; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకంతో ఆకట్టుకోగా... ఇతర బ్యాటర్లు క్రీజులో నిలదొక్కులేకపోయారు. గుజరాత్ బౌలర్లలో ప్రియజీత్సింగ్ జడేజా, రింకేశ్ వాఘేలా 3 వికెట్ల చొప్పున తీయగా... సిద్ధార్థ్ దేశాయ్, అర్జన్ నాగ్వాస్వలా 2 వికెట్ల చొప్పున పడగొట్టారు.ఇక ఈ విజయంతో గుజరాత్‌కు 6 పాయింట్లు లభించాయి. గుజరాత్ బ్యాటర్ మనన్ హింగ్రాజియాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఈనెల 18 నుంచి డెహ్రాడూన్‌లో జరిగే తదుపరి మ్యాచ్‌లో ఉత్తరాఖండ్‌తో హైదరాబాద్ తలపడుతుంది.స్కోరు వివరాలు వేదిక: జింఖానా గ్రౌండ్, హైదరాబాద్టాస్: గుజరాత్.. తొలుత బ్యాటింగ్గుజరాత్ తొలి ఇన్నింగ్స్: 343హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్: 248గుజరాత్ రెండో ఇన్నింగ్స్: 201హైదరాబాద్ రెండో ఇన్నింగ్స్: 170ఫలితం: హైదరాబాద్‌పై 126 పరుగుల తేడాతో గుజరాత్ విజయంతన్మయ్ అగర్వాల్ (బి) అర్జన్ నాగ్వాస్వాలా 1; అభిరత్ రెడ్డి (సి) సిద్ధార్థ్ దేశాయ్ (బి) రింకేశ్ వాఘేలా 51; రాహుల్ సింగ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అర్జన్ నాగ్వాస్వాలా 0; రోహిత్ రాయుడు (బి) రింకేశ్ వాఘేలా 26; హిమతేజ (సి) రిషి పటేల్ (బి) ప్రియజీత్ సింగ్ 29; రాహుల్ రాధేశ్ (సి) ఉర్విల్ పటేల్ (బి) ప్రియజీత్ సింగ్ 17; తనయ్ త్యాగరాజన్ (సి) ఉరి్వల్ పటేల్ (బి) ప్రియజీత్ సింగ్ 1; సీవీ మిలింద్ (సి) ప్రియాంక్ పాంచాల్ (బి) సిద్ధార్థ్ దేశాయ్ 28; అనికేత్ రెడ్డి (సి) రిషి పటేల్ (బి) సిద్ధార్థ్ దేశాయ్ 2; రక్షణ్ రెడ్డి (సి) ప్రియాంక్ పాంచాల్ (బి) రింకేశ్ వాఘేలా 7; నిశాంత్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (59.1 ఓవర్లలో ఆలౌట్) 170. వికెట్ల పతనం: 1–12, 2–12, 3–76, 4–83, 5–127, 6–130, 7–133, 8–145, 9–170, 10–170. బౌలింగ్: సిద్ధార్థ్ దేశాయ్ 16.1–3–47–2, అర్జన్ నాగ్వాస్వాలా 12–4–28–2, చింతన్ గజా 9–3–16–0, ప్రియజీత్ సింగ్ జడేజా 10–1–23–3, రింకేశ్ వాఘేలా 12–2–52–3. చదవండి: W T20 WC: కథ మళ్లీ మొదటికి... -
India vs England test: 18 నుంచి టికెట్ల విక్రయం
సాక్షి, హైదరాబాద్: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఈనెల 25 నుంచి 29 వరకు ఉప్పల్ స్టేడియంలో జరిగే తొలి టెస్టు మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లను ఈనెల 18 నుంచి ఆన్లైన్లో విక్రయిస్తారు. పేటీఎం ఇన్సైడర్ యాప్‌లో, www.insider.in వెబ్సైట్లో రాత్రి 7 గంటల నుంచి టికెట్లు లభిస్తాయని హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్ రావు ఆదివారం ప్రకటించారు. మిగిలిన టికెట్లను ఈనెల 22 నుంచి ఆఫ్‌లైన్‌లో సికింద్రాబాద్ జింఖానా మైదానంలో విక్రయిస్తామని ఆయన వివరించారు. టికెట్ల ధరలను ఒక్కో రోజుకు రూ. 200, రూ. 499, రూ. 750, రూ. 1250, రూ. 3000 (కార్పొరేట్ బాక్స్ నార్త్), రూ. 4000 (కార్పొరేట్ బాక్స్ సౌత్)గా నిర్ణయించారు. ఐదు రోజుల సీజన్ టికెట్ల ధరలను రూ. 600, రూ. 1500, రూ. 2250, రూ. 3750, రూ. 12000 (కార్పొరేట్ బాక్స్ నార్త్), రూ. 16000 (కార్పొరేట్ బాక్స్ సౌత్)లుగా నిర్ణయించారు. ఆన్లైన్లో టికెట్లు కొనుగోలు చేసిన వారు ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డును చూపించి 22వ తేదీ నుంచి జింఖానా మైదానంలో టికెట్లను రీడీమ్ చేసుకోవాలి. -
మ్యాచ్ టికెట్ల విక్రయంలో అవకతవకలు జరిగాయి : కొండా విశ్వేశ్వర్ రెడ్డి
-
నిన్న జరిగినా ఘటనకు మేం బాధ్యులం కాదు
-
Ind Vs Aus: అవన్నీ అవాస్తవాలు.. ఒక్కొక్కరు నాలుగు టికెట్లు కొంటే: అజారుద్దీన్
India Vs Australia 3rd T20 Tickets- Mohammad Azharuddin Comments: భారత్- ఆస్ట్రేలియా మధ్య ఉప్పల్‌లో మూడో టీ20 నేపథ్యంలో టికెట్ల అమ్మకాలపై వస్తున్న ఆరోపణలపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ స్పందించారు. టికెట్ల అమ్మకాల విషయంలో కొంతమంది కావాలనే వదంతులు వ్యాప్తి చేస్తున్నారన్న ఆయన.. అవేమీ నిజం కావన్నారు. పేటీఎం ద్వారా ఆన్లైన్లో టికెట్ల అమ్మకాలు జరిగాయని... పేటీఎం తన పనిని చక్కగా నెరవేర్చిందని పేర్కొన్నారు. ఓ వ్యక్తి నాలుగు టికెట్లు కొంటే.. టికెట్ల అమ్మకం, జింఖానా గ్రౌండ్లో జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో అజారుద్దీన్ శుక్రవారం మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఆన్లైన్లో పారదర్శకంగా టికెట్ల అమ్మకం జరిపినపుడు ఇలాంటి అక్రమాలు జరిగాయని ఎలా అంటున్నారో అర్థం కావడం లేదు. ఒకవేళ ఓ వ్యక్తి ఆన్లైన్లో నాలుగు టికెట్లు కొన్నారనుకోండి. వారికి ఆఫ్‌లైన్‌లో టికెట్లు జారీ చేసేటపుడు ఆధార్ కార్డు వంటి ఐడీలను పరిశీలిస్తాం. అంతేగానీ ఆ నాలుగు టికెట్లను వారు ఏం చేస్తున్నారో మాకేం తెలుస్తుంది. ఒకవేళ ఎవరైనా బ్లాక్‌లో అమ్మకాలు జరిపారని తెలిస్తే కఠినమైన చర్యలు ఉంటాయి’’ అని పేర్కొన్నారు. ఆన్లైన్, ఆఫ్‌లైన్ టికెట్ల వివరాలివే! కాంప్లిమెంటరీ కిందే ఎక్కువ టికెట్లు ఇచ్చామన్న అజారుద్దీన్.. టికెట్ల అమ్మకాలకు సంబంధించిన లెక్కలను మీడియాకు వివరించారు. ‘‘సెప్టెంబరు 15 ఆన్లైన్లో పేటీఎం ద్వారా 11,450 టికెట్లు, పేటీఎం కార్పొరేట్ బుకింగ్ 4000, మిగతా ఆన్లైన్ సేల్స్ 2100, ఆఫ్‌లైన్ సేల్స్ సెప్టెంబరు 22న 3000, మిగతా 6 వేల టికెట్లు(ఇంటర్నల్ స్టేక్ హోల్డర్స్, స్పాన్సర్స్, కార్పొరేట్స్) అమ్మినట్లు తెలిపారు. చికిత్స చేయిస్తాం జింఖానాలో తొక్కిసలాట దురదృష్టకరమని.. గాయపడిన వారికి తమ వంతు సాయం చేస్తామని చెప్పుకొచ్చారు. అయితే, ఈ ఘటనకు హెచ్‌సీఏ మాత్రం కారణం కాదని అజారుద్దీన్ వ్యాఖ్యానించారు. ఇందులో తమ తప్పేమీ లేదని.. తమ పొరపాటు లేదన్నారు. టికెట్ల అమ్మకాల్లో మా ప్రమేయం లేదు ఇక హెచ్‌సీఏ కార్యదర్శి విజయానంద్ మాట్లాడుతూ.. టికెట్ల అమ్మకాల్లో తమ ప్రమేయం లేదన్నారు. ఆ పనిని పేటీఎంకు అప్పగించామని.. తాము మ్యాచ్‌కు సంబంధించిన ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. హెచ్‌సీఏలో విభేదాలు ఉన్న మాట వాస్తవమేనని.. అయితే, ప్రతీ వ్యవస్థలోనూ ఇలాంటివి సహజమేనన్నారు. ఏదేమైనా మ్యాచ్ నిర్వహణను విజయవంతం చేయడమే తమ బాధ్యత అని స్పష్టం చేశారు. తొక్కిసలాటపై స్పందిస్తూ.. గాయపడిన వారికి చికిత్స అందించే ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. చదవండి: Dewald Bravis: 'బేబీ ఏబీ' విధ్వంసం.. మరొక్క బంతి మిగిలి ఉంటేనా! -
ఆన్లైన్ బుకింగ్ చేసినవాళ్లకే జింఖానాలోకి ఎంట్రీ
సాక్షి, హైదరాబాద్: ఆసీస్-భారత్ జట్ల మధ్య ఉప్పల్ స్టేడియంలో జరగబోయే టీ20 మ్యాచ్ టికెట్ల విక్రయం రసాభాసాగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పేటీఎంలో టికెట్లు బుక్ చేసుకున్న వాళ్లకు సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్లో టికెట్లు ఇవ్వాలని హెస్‌సీఏ నిర్ణయించింది. శుక్రవారం ఉదయం 11 గంటల తర్వాత టికెట్లు ఇవ్వనున్నారు. అలాగే.. ఆఫ్‌లైన్ టికెట్ల కోసమంటూ గ్రౌండ్ వైపు ఎవరూ రావొద్దని పోలీసులు కోరుతున్నారు. గురువారం నాటి తొక్కిసలాట, లాఠీఛార్జీ ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. పేటీఎంలో టికెట్లు బుక్ చేసుకున్న వాళ్లు.. జింఖానా వద్ద ఏర్పాటు చేసిన క్యూ లైన్ కో నిల్చోవాలని సూచిస్తున్నారు పోలీసులు. అలాగే ఆన్లైన్ బుకింగ్ ఉన్నవాళ్లకు మాత్రమే జింఖానాలోకి ఎంట్రీ ఉంటుందని స్పష్టం చేశారు. ఇతర వ్యక్తులు గ్రౌండ్లోకి ప్రవేశించాలని ప్రయత్నిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరిస్తున్నారు. ఇక హెచ్‌సీఏ తీరుతో క్రికెట్ చూడటం అభిమానులకు అందని ద్రాక్షేనా అనే ప్రశ్న మొదలైంది. అంతర్జాతీయ మ్యాచ్ నిర్వహణలో హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ ఘోర వైఫల్యం చెందారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టికెట్ల విక్రయాల్లో పారదర్శకత లోపించిందని, లోగుట్టుగా నడిచిన మ్యాచ్ టికెట్ విక్రయాల తీరుపైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వీటికి తోడు కాంప్లిమెంటరీ పాసుల కోసం బడాబాబులు, వీఐపీలు కక్కుర్తి పడుతున్నట్లు తేలింది. అసలు ఆఫ్ లైన్ టికెట్లు సైతం ఎన్ని విక్రయించారో అజార్ క్లారిటీ ఇవ్వకపోవడంపైనా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇతర రాష్ట్రాల్లో మ్యాచ్‌ల నిర్వహణ సాఫీగా సాగుతున్న వేళ.. టికెట్ విక్రయాల కోసం హెచ్‌సీఏ సతమతం కావడంపై చర్చ నడుస్తోంది. ఒకరకంగా జింఖానా తొక్కిసలాట ఘటనతో నగర ఈమేజ్ దెబ్బతిందనే మాట సైతం వినిపిస్తోంది. హెచ్‌సీఏ అధ్యక్షుడు అజార్ ఒంటెద్దు పోకడతోనే ఈ స్థితి కి కారణమంటున్నారు కొందరు. ఇదీ చదవండి: జింఖానా ‘తొక్కిసలాట’.. మహిళను కాపాడేందుకు ఆ లేడీ కానిస్టేబుల్ ఏం చేసిందంటే? -
జింఖానా ‘తొక్కిసలాట’.. మహిళను కాపాడేందుకు ఆ లేడీ కానిస్టేబుల్ ఏం చేసిందంటే?
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్ వద్ద ఉదయం ఆసీస్-భారత్ మ్యాచ్ టిక్కెట్ల కోసం జరిగిన తొక్కిసలాట ఘటనలో ఓ లేడీ కానిస్టేబుల్ చాకచక్యంగా వ్యవహరించింది. ప్రాణాపాయంలో ఉన్న మహిళకు వెంటనే సీపీఆర్ చేసి ఆ ప్రాణాన్ని నిలబెట్టింది. టిక్కెట్ల కోసం ఒక్కసారిగా అభిమానులు తోసుకుని రావడంతో అందులో 45 ఏళ్ల మహిళ పూర్తిగా స్పృహ తప్పి పడిపోయారు. చదవండి: హెచ్‌సీఏపై సమీక్ష.. కఠినచర్యలు తప్పవ్..! మంత్రి షాకింగ్ కామెంట్స్ దీంతో బేగంపేట మహిళా పీఎస్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ నవీన తక్షణమే స్పందించి ఆ మహిళను బయటకులాగారు. అప్పటికే ఆమె స్పృహ కోల్పోయి ఊపిరి అందని పరిస్థితిలో ఉండటంతో ఆ కానిస్టేబుల్ సీపీఆర్ చేశారు. మహిళను కాపాడిన కానిస్టేబుల్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా కానిస్టేబుల్ నవీన సాక్షితో మాట్లాడుతూ, సాటి మహిళను కాపాడాలని ఆలోచించానని తెలిపారు. -
భారత్- ఆసీస్ ఉప్పల్ మ్యాచ్.. టికెట్లు అయిపోయాయి : హెచ్‌సీఏ ప్రకటన
India Vs Australia 2022 3rd T20 Uppal Stadium- Tickets- HCA: భారత్- ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ ప్రత్యక్షంగా వీక్షిద్దామనుకున్న చాలా మంది అభిమానులకు నిరాశే ఎదురైంది. ఉప్పల్ స్టేడియం చుట్టూ.. జింఖానా గ్రౌండ్ చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. దీంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తీరుపై ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. రూ. 1200 టికెట్‌ను బ్లాక్‌లో 20 వేలకు అమ్ముకున్నారని ఆరోపిస్తున్నారు. ఇంత కష్టపడి ప్రాణాలకు మీదకు తెచ్చుకుని మరీ క్యూలో నిల్చుని ఉంటే ఆఖరికి టికెట్ల అయిపోయాయని ప్రకటించారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆది నుంచి గందరగోళమే! సెప్టెంబరు 25న ఉప్పల్ వేదికగా టీమిండియా- ఆస్ట్రేలియా మూడో టీ20 జరుగనుంది. ఇందుకు సంబంధించి టికెట్లు ఈ నెల 15 నుంచి పేటీఎం ఇన్సైడర్ యాప్‌ను అందుబాటులో ఉంచినట్లు స్వయంగా హెచ్‌సీఏ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ చెప్పినప్పటికీ కేవలం అరగంటలోనే అన్ని టికెట్లు విక్రయించినట్లు, యాప్‌లో అవి అందుబాటులో లేకపోవడంతో ఫ్యాన్స్ మండిపడ్డారు. ఈ పరిణామాల నేపథ్యంలో సికింద్రాబాద్‌లోని జింఖానా గ్రౌండ్లో ఆఫ్‌లైన్‌లో టికెట్లను విక్రయించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. దీంతో గురువారం పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ ఘటనలో కొంతమంది గాయపడ్డారు. టికెట్ల కోసం క్యూలో నిల్చున్న మహిళలు, యువతులు ఇబ్బంది పడ్డారు. ఇంత కష్టపడ్డా చాలా మందికి టికెట్లు దొరకలేదు. టికెట్లు అయిపోయాయని ప్రకటించిన హెచ్‌సీఏ.. జింఖానా గ్రౌండ్స్‌లో టికెట్ల అమ్మకాన్ని నిలిపివేసింది. క్యూలైన్లో ఉన్నవాళ్లను వెళ్లిపోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. దీంతో చాలా మంది నిరాశగా వెనుదిరిగారు. మరోవైపు... జింఖానా గ్రౌండ్ వద్ద తొక్కిసలాటపై తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనపై హెచ్‌సీఏను వివరణ కోరింది. క్రీడా మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంబంధిత అధికారులతో సమావేశమై సమీక్ష చేపట్టారు. కాగా మిగతా టికెట్లు ఆన్లైన్లో విక్రయించేందుకు హెచ్‌సీఏ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. చదవండి: Ind Vs Aus 3rd T20: మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయండి! అప్పుడే వాళ్లకు తెలిసివస్తుంది! Ind Vs Aus: కోహ్లి, పాండ్యా మాత్రమే! మిగతా వాళ్లంతా ఆ విషయంపై దృష్టి సారించకపోతే! -
మహిళకు CPR చేసిన కానిస్టేబుల్ పై ప్రశంసలు
-
హెచ్ సిఎ తీరుపై మండిపడుతున్న ఫ్యాన్స్
-
Ind Vs Aus: మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయండి.. అప్పుడే వాళ్లకు బుద్ధి వస్తుంది!
India Vs Australia 2022 3rd T20 Uppal Stadium Tickets- HCA: భారత్- ఆస్ట్రేలియా మధ్య మూడో టీ20 టిక్కెట్ల అమ్మకం నేపథ్యంలో జింఖానా గ్రౌండ్లో జరిగిన తొక్కిసలాటపై స్పోర్ట్స్ అనలిస్ట్ మలపాక వెంకట్ స్పందించారు. ఇది చాలా దురదృష్టకర ఘటన అన్నారు. సాక్షి టీవీతో ఆయన మాట్లాడుతూ... ‘‘మూడేళ్ల తర్వాత మ్యాచ్ చూసే అవకాశం వచ్చింది. కానీ ఇటు ప్రేక్షకులు గానీ.. అటు హెచ్‌సీఏ గానీ.. ఏదైనా దుర్ఘటన జరిగితే బీసీసీఐ మళ్లీ పదేళ్ల దాకా ఇక్కడ మ్యాచ్ నిర్వహించదు అన్న విషయం గురించి ఆలోచించలేకపోయారు’’ అని వాపోయారు. అది తొందరపాటు చర్యే! ఇక టిక్కెట్ల అమ్మకం విషయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వైఖరి గురించి చెబుతూ.. ‘‘హెచ్‌సీఏ ఎలక్షన్ సమయంలో ఓటింగ్‌కు కేవలం 222 మంది వచ్చినపుడే.. వారం ముందు నుంచీ రెక్కీ చేసేవాళ్లం. క్యూలో ఎలా నిలబడాలి? అన్న అంశం గురించి జాగ్రత్తలు తీసుకునేవాళ్లం. ఎన్నికల ప్రక్రియ సాఫీగా జరిగేలా చూసుకునేవాళ్లం. నిజానికి మ్యాచ్ ఉందంటే.. జనాలు పెద్ద సంఖ్యలో వస్తారని ఊహించలేదనడం తొందరపాటు చర్యే అవుతుంది. మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయండి! తప్పకుండా పెద్ద ఎత్తున ఫ్యాన్స్ వస్తారని తెలుసు. అయినా ఇలా జరగడం దురదృష్టకరం’’ అని మలపాక వెంకట్ పేర్కొన్నారు. మ్యాచ్‌ను మొత్తంగా బాయ్‌కాట్ చేస్తే అప్పుడే పరిస్థితి తీవ్రత ఏమిటో నిర్వాహకులకు అర్థమవుతుందన్నారు. వానను కూడా లెక్కచేయక చాలా మంది క్యూలో నిల్చుని ఉన్నారన్న ఆయన.. ముందస్తు ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఈ దుస్థితి వచ్చిందని మండిపడ్డారు. మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాలని ఫ్యాన్స్‌కు పిలుపునిచ్చారు. స్టేడియంలో ప్రేక్షకులు లేకుండా మ్యాచ్ జరిగితే అప్పుడు నిర్వాహకులకు తెలిసివస్తుందన్నారు. ఇక టిక్కెట్ల విషయంలో స్కామ్ జరిగిందా అన్న ప్రశ్నకు బదులిస్తూ.. తనకు తెలిసినంత వరకు అలాంటిదేమీ లేదన్నారు మలపాక వెంకట్. అంతర్జాతీయ మ్యాచ్ కాబట్టి ఒకవేళ జరగరాని ఘటన జరిగితే హైదరాబాద్ పరువు పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తొక్కిసలాట తర్వాత స్పందించే బదులు.. రాష్ట్ర ప్రభుత్వం, క్రీడా మంత్రి ఏర్పాట్ల గురించి ముందే ఆలోచించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. కాగా సెప్టెంబరు 25న భారత్- ఆసీస్ మధ్య ఉప్పల్ స్టేడియంలో మూడో టీ20 జరుగనుంది. ఇక ఉప్పల్ స్టేడియం కెపాసిటీ 55వేలుకాగా, ప్రస్తుతం అందుబాటులో కేవలం 3వేల టికెట్లను మాత్రమే హెచ్‌సీఏ అందుబాటులో ఉంచింది. వీటి కోసం పెద్ద ఎత్తున జింఖానా గ్రౌండ్‌కు వెళ్లిన అభిమానులు ఇబ్బందులు పడుతున్నారు. చదవండి: Ind A vs NZ A 1st ODI: అదరగొట్టిన శార్దూల్, కుల్దీప్ సేన్.. 167 పరుగులకే కివీస్ ఆలౌట్ -
జింఖానా ఘటనపై ప్రభుత్వం సీరియస్
-
జింఖానా గ్రౌండ్ తొక్కిసలాటలో ఎవరూ చనిపోలేదు: అడిషనల్ సీపీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్(HCA) ఘోర వైఫల్యంతో పోలీసులు సీరియస్‌గా ఉన్నారు. ఆసీస్-భారత్ జట్ల మధ్య ఉప్పల్‌లో జరగబోయే మ్యాచ్ కోసం సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్ వద్ద ఈ ఉదయం టికెట్ల అమ్మకాలు చేపట్టింది హెచ్‌సీఏ. అయితే.. ఒక్కసారిగా అభిమానులు తోసుకుని రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తరుణంలో.. అభిమానులతో పాటు పోలీసులు గాయపడ్డారు. వాళ్లను నియంత్రించేందుకు పోలీసుల లాఠీఛార్జి చేయాల్సి వచ్చింది. ఇక తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందిందని ప్రచారం ఊపందుకుంది. అయితే తొక్కిసలాటలో ఎవరూ చనిపోలేదని.. గాయపడిన మహిళ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని అడిషనల్ సీపీ చౌహాన్ క్లారిటీ ఇచ్చారు. హెసీసీఏ సరైన వసతులు కల్పించకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని నార్త్ జోన్ అడిషనల్ సీపీ చౌహాన్ తెలిపారు. సరైన కౌంటర్లు కూడా ఏర్పాటు చేయలేదని, కౌంటర్లు పెంచుకోవాలని సూచించినట్లు ఆయన తెలిపారు. పరిస్థితి ప్రస్తుతం అదుపులోనే ఉందని, వదంతులు నమ్మొద్దని ఆయన మీడియా ద్వారా ప్రజలకు తెలియజేశారు. హెచ్‌సీఏకు నోటీసులు జారీ చేసే అవకాశాలున్నాయని అన్నారు. ఉద్రిక్త పరిస్థితుల నడుమ.. కాసేపు కౌంటర్లు మూసేశారు. ప్రస్తుతం గ్రౌండ్లో లైన్లలో ఉన్నవాళ్లకు టికెట్ల విక్రయం కొనసాగించేందుకు యత్నాలు సాగుతున్నట్లు తెలుస్తోంది. టీ20 మ్యాచ్ టికెట్ల కోసం అభిమానులు గురువారం ఉదయం ఎగబడ్డారు. వేలాది మందిగా ఎగబడిపోవడం.. గేట్లు తెరవడంతో ఒక్కసారిగా దూసుకెళ్లారు అభిమానులు. ఈ క్రమంలో తొక్కిసలాట చోటు చేసుకోగా అభిమానులతో పాటు పోలీసులకు గాయాలయ్యాయి. పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసుల లాఠీఛార్జ్‌కు దిగారు. ఈ క్రమంలో గాయపడిన కొందరిని ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. మరోవైపు ఈ పరిస్థితికి హెచ్‌సీఏ ఘోర వైఫల్యమే కారణమన్న విమర్శ వినిపిస్తోంది. ఉప్పల్ స్టేడియం కెపాసిటీ 55వేలుకాగా, ప్రస్తుతం అందుబాటులో కేవలం 3వేల టికెట్లు మాత్రమే ఉంచింది. ఈ మూడు వేల టికెట్ల కోసమే వేలాదిగా అభిమానులు ఎగబడిపోవడంతో ఈ పరిస్థితి చోటుచేసుకుందని తెలుస్తోంది. టికెట్ల అమ్మకంలో మొదటి నుంచి హెచ్‌సీఏ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మూడు రోజుల నుంచి క్రికెట్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నా హెచ్‌సీఏ నుంచి స్పందన కరువైంది. అయితే.. మొదట పేటీఎం ద్వారా టికెట్ల విక్రయమని మాట మార్చిన హెచ్‌సీఏ.. తర్వాత ఆఫ్‌లైన్‌లో టికెట్ల విక్రయమంటూ ప్రచారం చేసింది. హెచ్‌సీఏ సభ్యుల మధ్య వివాదాలతో టికెట్ల విక్రయాల్లో గందరగోళం నెలకొందనే ఆరోపణ వెల్లువెత్తుతోంది. తొక్కిసలాట నేపథ్యంలో.. హెచ్‌సీఏ తీరుపై పోలీసులు సీరియస్‌గా ఉన్నారు. -
జింఖానా గ్రౌండ్ తొక్కిసలాటలో మహిళ మృతి
-
HCA ఘోర వైఫల్యం
-
టిక్కెట్ల కోసం తొక్కిసలాట
-
సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్ వద్ద క్రికెట్ ఫ్యాన్స్ క్యూ
-
క్రికెట్ అభిమానులకు హెచ్సిఏ శుభవార్త
-
IND Vs AUS: జింఖానాలో ఇవాళ టికెట్ల విక్రయం
సాక్షి, హైదరాబాద్: భారత్, ఆస్ట్రేలియా మధ్య ఈ నెల 25న ఉప్పల్ స్టేడియంలో జరిగే చివరి టి20 మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లను హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ‘ఆఫ్‌లైన్’లో అమ్మకానికి ఉంచింది. ఈ నెల 15న స్వల్ప సంఖ్యలో టికెట్లను ‘పేటీఎం ఇన్సైడర్’ యాప్ ద్వారా ఆన్లైన్లో హెచ్‌సీఏ అందుబాటులోకి తీసుకురాగా, కొద్ది సేపటిలోనే అవి పూర్తిగా అమ్ముడుపోయాయి. దాంతో పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ నిరాశ చెందారు. ఈ నేపథ్యంలో అభిమానుల విజ్ఞప్తిని దృష్టిలో ఉంచుకుంటూ ‘పేటీఎం ఇన్సైడర్’తో చర్చలు జరిపిన హెచ్‌సీఏ టికెట్లను నేరుగా కౌంటర్లో అమ్మాలని నిర్ణయించింది. నేడు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సికింద్రాబాద్‌లోని జింఖానా మైదానంలో టికెట్ కౌంటర్ ఉంటుంది. ఒక వ్యక్తికి గరిష్టంగా రెండు టికెట్లు మాత్రమే ఇస్తారు. టికెట్లు కొనుగోలు చేసేందుకు వచ్చే అభిమానులు ఆధార్ కార్డు తీసుకురావాలి. అయితే టికెట్ల మొత్తం సంఖ్యతో పాటు ఆన్లైన్, ఆఫ్లైన్లలో వేర్వేరుగా ఎన్ని టికెట్లు అందుబాటులో ఉంటాయనే విషయంలో మాత్రం హెచ్‌సీఏ ఎలాంటి స్పష్టతనివ్వలేదు. బ్లాక్‌లో అమ్మితే చర్యలు: క్రీడా మంత్రి భారత్, ఆస్ట్రేలియా టి20 మ్యాచ్ టికెట్ల అమ్మకాలకు సంబంధించి చోటు చేసుకుంటున్న గందరగోళంపై తెలంగాణ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. ‘క్రీడల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇస్తేనే హెచ్‌సీఏ స్టేడియం కట్టుకుంది. ఇది తెలంగాణ ప్రజల కోట్ల విలువైన ఆస్తి. అలాంటప్పుడు రాష్ట్రాన్ని అప్రతిష్టపాలు చేస్తే ఊరుకునేది లేదు. అభిమానుల ఉత్సాహాన్ని దెబ్బ తీయవద్దు. బ్లాక్‌లో టికెట్లు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే హెచ్‌సీఏను హెచ్చరించాం. దీనిపై అవసరమైతే విచారణ కూడా జరిపిస్తాం. అదే విధంగా బయటి వ్యక్తులు కూడా ఎవరైనా తనకు టికెట్లు కావాలంటూ బెదిరించినా చర్య తీసుకుంటాం’ అని ఆయన స్పష్టం చేశారు. గుజరాత్లో జరిగే జాతీయ క్రీడల్లో పాల్గొనే తెలంగాణ రాష్ట్ర బృందానికి క్రీడా మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ బుధవారం కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ‘శాట్స్’ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర రెడ్డితో పాటు ఒలింపిక్ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ నెల 29 నుంచి అక్టోబర్ 12 వరకు జరిగే జాతీయ క్రీడల్లో తెలంగాణ నుంచి 230 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
క్రికెట్ అభిమానులతో కిక్కిరిసిన జింఖానా గ్రౌండ్ పరిసరాలు
-
హైదరాబాద్‌కు తొలి విజయం
సాక్షి, హైదరాబాద్: కల్నల్ సీకే నాయుడు అండర్–23 క్రికెట్ టోర్నమెంట్లో హైదరాబాద్ గెలుపు రుచి చూసింది. స్థానిక జింఖానా మైదానంలో రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 41 పరుగుల తేడాతో ఘనవిజయాన్ని సాధించింది. టోర్నీలో భాగంగా ఎలైట్ గ్రూప్ ‘ఎ’లో ఆరు మ్యాచ్‌లాడిన హైదరాబాద్ 4 మ్యాచ్‌ల్లో ఓటమి పాలై మరో మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. ఈ మ్యాచ్ విజయంతో పాయింట్ల పట్టికలో హైదరాబాద్ (7 పాయింట్లు) ఆరో స్థానానికి చేరింది. 179 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించేందుకు ఓవర్‌నైట్ స్కోరు 35/3తో ఆటకు చివరిరోజైన శుక్రవారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన రాజస్తాన్ 36 ఓవర్లలో 137 పరుగులకు ఆలౌటైంది. ఏబీ కూక్నా (45 బంతుల్లో 35; 4 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్. హైదరాబాద్ బౌలర్లలో కృష్ణ చరిత్ 3 వికెట్లు పడగొట్టగా... రక్షణ్, ప్రణీత్ రాజ్, అజయ్‌దేవ్ గౌడ్ చెరో 2 వికెట్లు దక్కించుకున్నారు. రతన్ తేజ ఒక వికెట్ తీశాడు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో హైదరాబాద్ 241 పరుగులు చేయగా... రాజస్తాన్ 237కు ఆలౌటైంది. హైదరాబాద్ రెండో ఇన్నింగ్స్‌లో 174 పరుగులు చేసింది. ఒంగోల్ వేదికగా ఫిబ్రవరి 6 నుంచి జరిగే తమ తదుపరి లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టుతో హైదరాబాద్ ఆడుతుంది. -
సూత్రప్రాయంగా నిర్ణయించాం
- జింఖానా, బైసన్‌పోలో బదలాయింపుపై కేంద్రం - వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్ : ఆర్మీ అధీనంలో ఉన్న సికింద్రాబాద్‌లోని జింఖానా, బైసన్ పోలో మైదానాలను తెలంగాణ ప్రభుత్వానికి బదలాయించేందుకు సూత్రప్రాయంగా నిర్ణయించామని కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఉమ్మడి హైకోర్టుకు నివేదించింది. అయితే ఈ బదలాయింపు ప్రక్రియ పూర్తి కావడానికి ముందు అనేక విధివిధానాలను పూర్తిచేయాల్సి ఉందని వివరించింది. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు... ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 10కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ జె.ఉమాదేవితో కూడిన ధర్మా సనం ఉత్తర్వులు జారీ చేసింది. సచివాలయం తదితరాల నిర్మాణం కోసం జింఖానా, బైసన్ పోలో గ్రౌండ్లను తెలంగాణకు కేటాయించ కుండా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ మాజీ డీజీపీ ఎం.వి.భాస్కరరావు, మరికొందరు వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై మంగళవారం ధర్మాసనం విచారణ జరిపింది. స్వచ్ఛమైన గాలి పీల్చుకోలేకపోతున్నారు... ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ... ఈ మైదానాల బదలాయింపుపై కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, ఆ తరువాతనే ముందుకెళతామని రాష్ట్ర ప్రభుత్వా నికి రక్షణ మంత్రిత్వశాఖ తెలిపిందన్నారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది సరసాని సత్యంరెడ్డి, సునీల్ భాస్కరరావు వాదనలు విని పిస్తూ... స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడం ప్రజల హక్కని, అయితే ఖాళీ స్థలాలు లేకపోవడం వల్ల ఆ హక్కుకు విఘాతం కలుగుతోందన్నారు. ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం ఒక్కొక్కరికీ ఆరు చదరపు మీటర్ల ఖాళీ స్థలం ఉండాలని, అయితే నగరంలో ఒక్క చదరపు మీటరు కూడా లేదన్నారు. ప్రజా ప్రయోజనాలకు ఉద్దేశించిన మైదానాల్లో రోడ్డు సహా ఎటువంటి నిర్మాణాలూ చేపట్టడానికి వీల్లేదని వివరించారు. మరో సీనియర్ న్యాయ వాది పి.గంగయ్యనాయుడు స్పందిస్తూ... ఈ గ్రౌండ్లలో సచివాలయం తదితర నిర్మాణాలకు మాజీ పోలీసు అధికారుల సంఘం మద్దతు తెలుపుతోందని, అందువల్ల ఆ సంఘాన్ని ఇందులో ఇంప్లీడ్ చేసుకోవాలని ధర్మాసనాన్ని కోరారు. ఇరుపక్షాల వాదనలు వినకుండా ఇంప్లీడ్‌పై నిర్ణయం తీసుకోలేమని ధర్మాసనం చెప్పింది. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ఈ గ్రౌండ్లలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. తాము నిర్మాణాలు చేపట్టబోమని ఏజీ చెప్పడంతో ధర్మాసనం దానిని పరిగణనలోకి తీసుకుంటూ విచారణను వాయిదా వేసింది. -
జింఖానా సందడి సందడిగా
సాక్షి, హైదరాబాద్: చాలా కాలం తర్వాత జింఖానా మైదానంలో కళ కనిపించింది. అంతర్జాతీయ మ్యాచ్‌లే కాకుండా రంజీ ట్రోఫీ మ్యాచ్‌లు కూడా చాలా వరకు ఉప్పల్ స్టేడియానికే పరిమితం అవుతుండటంతో జింఖానాలో ప్రధాన మ్యాచ్‌లు కూడా ఏవీ జరగడం లేదు. సరిగ్గా రెండేళ్ల క్రితం ఇక్కడ రంజీ మ్యాచ్ జరిగాక ఎక్కువ సార్లు అండర్-19, అండర్-23 స్థాయి పోటీలకే ఈ గ్రౌండ్ పరిమితమైంది. ఇప్పుడు చాలా రోజుల తర్వాత పెద్ద సంఖ్యలో క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్‌ను చూసేందుకు వచ్చారు. స్టార్ ఆటగాళ్లు లేకపోయినా కొన్ని తెలిసిన పేర్లు ఉన్న అంతర్జాతీయ జట్టు మ్యాచ్ ఆడుతుండటమే అందుకు కారణం. ఎన్ని ఏళ్లు గడిచినా మారని తరహాలో పాత రోజుల్లాగే జనమంతా బౌండరీ బయట ఇనుప ఫెన్సింగ్ వెనక నిలబడి ఆటపై తమ ఆసక్తిని ప్రదర్శించారు. బంగ్లాదేశ్ బ్యాటింగ్ సమయంలో ప్రేక్షకుల నుంచి తమీమ్, ముష్ఫికర్ పేర్లు ఎక్కువగా వినిపించాయి. భారత జట్టు సభ్యులైన హార్దిక్ పాండ్యా, జయంత్ బౌలింగ్, పంత్ కీపింగ్ చేస్తున్న సమయంలో కూడా వారు బాగా ప్రోత్సహించారు. భారత జట్టు బ్యాటింగ్ సమయంలో తొలి వికెట్ పడిన తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన ఆటగాడి పేరు స్కోరుబోర్డుపై పొరపాటున హార్దిక్ పాండ్యాగా పడింది. దాంతో పాండ్యా సిక్సర్, సిక్సర్ అంటూ వారంతా పెద్దగా అరిచారు. అయితే బ్యాటింగ్‌కు వచ్చింది శ్రేయస్ అని గుర్తించేందుకు కాస్త సమయం పట్టింది. మరోవైపు సివిల్ సప్లయిస్ విభాగం కమిషనర్ సీవీ ఆనంద్... తమ కుమారుడు మిలింద్ బౌలింగ్‌ను ఆసాంతం చూస్తూ ఆట ముగిసే దాకా గ్రౌండ్‌లోనే ఉన్నారు. -
'లోకేష్‌పై సీబీఐతో విచారణ చేయించే దమ్ముందా'
- చంద్రబాబు నాయుడికి లక్ష్మి పార్వతి సవాల్ విజయవాడ: అగ్రిగోల్డ్ ఆస్తుల కొనుగోలు చేసిన వారిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా ఉన్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత లక్ష్మిపార్వతి ఆరోపించారు. విజయవాడలో జరిగిన అగ్రిగోల్డ్ బాధితుల ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తుల కొనుగోలులో బడాబాబుల పాత్ర ఉందని.. అందుకే విచారణ ముందకు సాగటం లేదని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి దమ్ముంటే.. అగ్రిగోల్డ్ కేసును సీబీఐ చేత విచారణ చేయించాలని సవాల్ చేశారు. ఇప్పటికైనా బుద్ధితెచ్చుకుని అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మి బాధితులకు ఇచ్చేయాలని సూచించారు. -
అగ్రిగోల్డ్ బాధితుల భారీ ర్యాలీ
అగ్రిగోల్డ్ బాధితులు విజయవాడలో ఆందోళన చేపట్టారు. ఉదయం నుంచే.. తుమ్మల పల్లి కళాక్షేత్రానికి భారీగా చేరుకున్న బాధితులు.. అక్కడి నుంచి జింఖానా మైదానం వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అగ్రిగోల్డ్ బాధితులకు అన్ని రాజకీయ పక్షాలు తమ సంఘీభావం ప్రకటించాయి. ర్యాలీ అనంతరం జింఖానా గ్రౌండ్ లో బహిరంగ సభ జరగనుంది. అగ్రిగోల్డ్ సంస్థల నుంచి డబ్బులు ఇప్పించాలని బాధితులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం పై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారపార్టీ నేతలే బినామీలుగా మారి అగ్రిగోల్డ్ ఆస్తులను కొనుగోలు చేస్తున్నారంటూ బాధితులు ఆరోపించారు. సీఐడీ విచారణ పేరుతో బాధితులను మభ్యపెడుతున్నారని అన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే.. బకాయిలపై బాండ్లను విడుదల చేయాలని కోరారు. అగ్రిగోల్డ్ అంశంపై ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. కాగా.. అగ్రిగోల్డ్ బాధితుల ర్యాలీ సందర్భంగా విజయవాడలో పోలీసులు భారీఎత్తున బందోబస్తు ఏర్పాటుచేశారు. తుమ్మల పల్లి కళాక్షేత్రం నుంచి జింఖానా గ్రౌండ్స్ వరకూ భారీగా పోలీసులను మోహరించారు. -
అమరులకు నివాళులు
26/11 ఘటన అమరులకు సినీనటులు, విద్యార్థులు ఆదివారం నివాళులర్పించారు. అఖిల భారత ఉగ్రవాద వ్యతిరేక సమాఖ్య (ఏఐఏటీఎఫ్) ఆధ్వర్యంలో ఆదివారం పార్శీ జింఖానా గ్రౌండ్లో ‘జరా యాద్ కరో ఖుర్బానీ’ అనే కార్యక్రమాన్ని సమాఖ్య అధ్యక్షుడు ఎం.ఎస్.బిట్టా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ఘటన జరిగి ఆరేళ్లు పూర్తి కావస్తున్న నేపథ్యంలో బాలీవుడ్ నటులు అక్షయ్‌కుమార్, వివేక్ ఒబేరాయ్‌తో పాటు వేలాది మంది విద్యార్థులు పోలీస్ జింఖానా సమీపంలో ఉన్న 26/11 స్మారక స్థలం వద్దకు చేరుకుని అప్పటి ఘటనలో ముష్కరుల దాడిని తిప్పికొట్టే క్రమంలో అశువులు బాసిన అమరజవానులకు నివాళులర్పించారు. అలాగే ‘స్వచ్ఛ్ భారత్ అభియాన్’ ప్రతిన బూనారు. -
6న జయశంకర్ స్మారక హాకీ టోర్నీ
ఎల్బీ స్టేడియం: దివంగత ప్రొఫెసర్ కె. జయశంకర్ స్మారక ఓపెన్ హాకీ టోర్నమెంట్ జింఖానా మైదానంలో ఈనెల 6వ తేదీన నిర్వహించనున్నారు. యంగ్‌టర్క్స్ హాకీ క్లబ్ ఆధ్వర్యంలో జయశంకర్ జయంతి సందర్భంగా నిర్వహించే ఈ టోర్నీలో పాఠశాలలు, జూనియర్ కాలేజి డిపార్ట్మెంట్ జట్లు పాల్గొననున్నాయి. ఆసక్తి గల వారు ఆర్గనైజింగ్ సెక్రటరీ అశోక్ ముదిరాజ్‌ను 97003-07544 ఫోన్ నంబర్లో సంప్రదించవచ్చు. రేపు ఓపెన్ చెస్ టోర్నీ హైదరాబాద్ జిల్లా చెస్ టోర్నమెంట్ కమ్ సెలక్షన్ ట్రయల్స్ ఆదివారం (3న) నిర్వహించనున్నారు. హైదరాబాద్ జిల్లా చెస్ అసోసియేషన్ సౌజన్యంతో సూపర్ కిడ్స్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో అండర్-7 బాలబాలికల చెస్ టోర్నీ రాంనగర్‌లోని అకాడమీలో జరగనుంది. జిల్లా మహిళల చెస్ టోర్నీ కూడా అదే రోజు నిర్వహిస్తారు. వివరాలకు టోర్నీ డెరైక్టర్ కె. దయానంద్ (96526-17524)ను సంప్రదించవచ్చు. 11నుంచి ఓల్డ్ సిటీ క్రీడలు హైదరాబాద్ ఓల్డ్ సిటీ ఇంటర్ స్కూల్ క్రీడలు ఈనెల 11 నుంచి 19 వరకు కులీ కుతుబ్‌షా స్టేడియంలో జరగనున్నాయి. ఓల్డ్ సిటీ స్కూల్ గేమ్స్ అసోసియేషన్ (ఓసీఎస్జీఏ) ఆధ్వర్యంలో జరిగే ఈ ఈవెంట్లో క్రికెట్, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, కబడ్డీల్లో పోటీలను నిర్వహిస్తారు. ఆసక్తి గల వారు తమ ఎంట్రీలను ఈనెల 9లోగా పంపించాలి. వివరాలకు ఓసీఎస్జీఏ ప్రధాన కార్యదర్శి ఎం.డి. ఫజిలత్ అహ్మద్(97000-08253)ను సంప్రదించవచ్చు. -
భారత జట్టు కెప్టెన్‌గా రమాదేవి
ప్రపంచ టెన్నికాయిట్ చాంపియన్‌షిప్‌కు జట్ల ఎంపిక జింఖానా, న్యూస్‌లైన్: ప్రపంచ టెన్నికాయిట్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత్ మహిళల జట్టుకు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రమాదేవి సార థ్యం వ హించనుంది. పురుషుల జట్టుకు గోవిందరాజన్ (పాండిచ్చేరి) నాయకత్వం వహించనున్నాడు. ఈ పోటీలు దక్షిణాఫ్రికాలోని సెదిబెంగ్లో ఈ నెల 29 నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ సందర్భంగా బుధవారం భారత టెన్నికాయిట్ సమాఖ్య అధ్యక్షుడు రామమూర్తి, కార్యనిర్వహక అధ్యక్షుడు సితాని జట్లకు కిట్లను అందజేశారు. మేనేజర్లుగా జువెల్ వాస్రా, లక్ష్మీకాంత్, కోచ్‌గా విశ్వనాథం బాధ్యతలు నిర్వర్తించనున్నారు. పురుషుల జట్టు: గోవిందరాజన్ (పాండిచ్చేరి), మరియప్పన్ (కర్ణాటక), సంతోష్ కుమార్ (కేరళ), అన్ను ప్రకాశ్ (కేరళ), సోర్నవేల్ (కర్ణాటక), రాకేష్ (ఆంధ్రప్రదేశ్), జేసుదాస్ (తమిళనాడు). మహిళల జట్టు: రమాదేవి (ఆంధ్రప్రదేశ్), చందన (కేరళ), అమృత (కేరళ), రేణుక (మహారాష్ట్ర), రేవతి (ఆంధ్రప్రదేశ్), కాయత్రి (తమిళనాడు). -
ఏపీ హాకీ కెప్టెన్‌గా వైష్ణవి
జింఖానా, న్యూస్‌లైన్: జాతీయ సీనియర్ మహిళల హాకీ చాంపియన్ షిప్లో ఆంధ్రప్రదేశ్ తరఫున పాల్గొనే జట్టును ఆంధ్రప్రదేశ్ హకీ సంఘం ఎంపిక చేసింది. ఈ జట్టు కెప్టెన్‌గా వైష్ణవి వ్యవహరించనుంది. ఈ నెల 13 నుంచి 20వ తేదీ వరకు ఈ పోటీలు భోపాల్‌లో జరగనున్నాయి. ఏపీ జట్టు 13వ తేదీన తొలి మ్యాచ్‌లో త్రిపురతో తలపడనుంది. తర్వాత 14న తమిళనాడుతో, 15న మిజోరాంతో పోటీపడనుంది. ఈ జట్టు కోచ్‌లుగా ఖాదర్ బాషా, హుస్సేన్‌లు వ్యవహరిస్తారు. జట్టు: వైష్ణవి (కెప్టెన్, హైదరాబాద్), చిన్ని (కడప), కీర్తన (కడప), సమీర (కడప), అమూల్య (ప్రకాశం), భార్గవి (రంగారెడ్డి), సంధ్య (నిజామాబాద్), దేవిక (గుంటూరు), మస్తాన్ బీ (గుంటూరు), శేషు కుమారి (తూర్పు గోదావరి), శ్రీబాల (తూర్పు గోదావరి), నజియా బేగం (హైదరాబాద్), అచ్యుతాంబ (కృష్ణ), లహరి రెడ్డి (కృష్ణ), గౌరి (తూర్పు గోదావరి), ప్రియాంక (రంగారెడ్డి), హిమబిందు (రంగారెడ్డి), గంగా భారతి (కడప). -
జీవీఎస్‌వీ రావు జోడికి స్వర్ణం
జాతీయ వెటరన్ టీటీ జింఖానా, న్యూస్‌లైన్: జాతీయ వెటరన్ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్ మిక్స్డ్ డబుల్స్ 65+ ఈవెంట్లో జీవీఎస్వీరావు (ఏపీ)-శోభా నాయుడు (మహారాష్ట్ర) జోడి స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. ఈ పోటీలు ఇటీవల హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలలో జరిగాయి. పురుషుల 65+ టీమ్ ఈవెంట్లో జీవీఎస్‌వీ రావు, దేవేంద్రనాథ్, ఎస్పీ జగన్నాథ్, పాండు, నాగరాజ్‌లతో కూడిన ఏపీ జట్టు కాంస్య పతకాన్ని దక్కించుకుంది. పురుషుల డబుల్స్ 65+ ఈవెంట్లో దేవేంద్రనాథ్ (ఏపీ)-రామకృష్ణ (తమిళనాడు) ద్వయం రజత పతకం గెలుచుకోగా... జీవీఎస్‌వీ రావు- ఎస్పీ జగన్నాథ్ జోడి కాంస్య పతకం సాధించింది. మహిళల 65+ సింగిల్స్ ఈవెంట్లో లక్ష్మీ కృష్ణన్ రెండో స్థానంలో నిలవగా... అపర్ణ మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. పురుషుల సింగిల్స్ 75+ ఈవెంట్లో ప్రసాద రావు కాంస్యం సాధించగా... డబుల్స్ 70+ ఈవెంట్లో అయూబ్-రామమూర్తి జంట మూడో స్థానంలో నిలిచింది. -
లయోలా డబుల్ ధమాకా
జింఖానా, న్యూస్‌లైన్: బీఎఫ్ఐ-ఐఎంజీ రిలయన్స్ ఇంటర్ కాలేజి బాస్కెట్‌బాల్ లీగ్‌లో పురుషుల, మహిళల విభాగాల్లో లయోలా జట్లు విజేతగా నిలిచాయి. సికింద్రాబాద్ వైఎంసీఏలో జరిగిన ఈ పోటీల్లో పురుషుల విభాగం ఫైనల్లో లయోలా అకాడమీ 47-21తో భవాన్స్ డిగ్రీ కాలేజి జట్టుపై గెలుపొందింది. ఆట ప్రారంభం నుంచి లయోలా అకాడమీ ఆటగాళ్లు దూకుడుగా ఆడారు. ఒక దశలో లయోలా 23-6తో ముందంజలో ఉంది. అయితే భవాన్స్ ఆటగాళ్లు ప్రత్యర్థిని ఎదుర్కునేందుకు ఎంతగానో ప్రయత్నించారు. అయినప్పటికీ మ్యాచ్ మొదటి అర్ధ భాగం ముగిసే సమయానికి లయోలా 37-10తో ఆధిక్యంలో నిలిచింది. రెండో అర్ధ భాగంలో భవాన్స్ ప్రతిఘటించేందుకు ప్రయత్నించినప్పటికీ చివరకు అది విఫలమైంది. లయోలా క్రీడాకారులు గణేశ్ (19), ఉదయ్ (11), జోస్ (11) చక్కని ఆట తీరును ప్రదర్శించి జట్టుకు విజయాన్ని అందించారు. భవాన్స్ జట్టులో హేమంత్ (7), రోహ న్ (5), అనిల్ (4) రాణించారు. మహిళల విభాగం ఫైనల్లో లయోలా అకాడమీ 46-37తో ప్రభుత్వ వ్యాయామ విద్య కళాశాల (జీసీపీఈ)పై విజయం సాధించింది. హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు నువ్వానేనా అన్నట్లు తలపడ్డాయి. మ్యాచ్ ప్రథమార్ధం ముగిసే సమయానికి 24-21తో లయోలా ముందంజలో ఉంది. రెండో అర్ధ భాగంలో లయోలా క్రీడాకారిణులు అలవోకగా దూసుకె ళ్లారు. అనంతరం తేరుకున్న జీసీపీఈ క్రీడాకారిణిలు చెమటోడ్చినప్పటికీ ఫలితం దక్కలేదు. లయోలా క్రీడాకారిణులు అక్షిత (15), మౌనిక (10), స్నేహ (7), రమా (8) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. తర్వాత మూడు, నాలుగు స్థానాల కోసం జరిగిన పోటీలో మహిళల విభాగంలో సెయింట్ మార్టిన్స్ 39-34తో సీవీఎస్ఆర్ జట్టుపై గెలుపొందింది. పురుషుల విభాగంలో ఏవీ కాలేజి 59-40తో సెయింట్ మార్టిన్స్‌పై నెగ్గింది. టోర్నీలో బెస్ట్ మెన్ ప్లేయర్ అవార్డును భవాన్స్ ఆటగాడు రోహన్ సొంతం చేసుకోగా... బెస్ట్ ఉమెన్ ప్లేయర్ అవార్డును లయోలా క్రీడాకారిణి రమా మిశ్రా దక్కించుకుంది. బెస్ట్ ప్రామిసింగ్ ప్లేయర్ టైటిల్‌ను భవ్య (జీసీపీఈ) గెలుచుకుంది. లయోలా అకాడమీ ప్రిన్సిపాల్ ఫాదర్ కాసిమిర్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ఏపీ బాస్కెట్‌బాల్ సంఘం జనరల్ సెక్రటరీ సంపత్ కుమార్ తదితరులు హాజరయ్యారు. -
చెలరేగిన మమత
జింఖానా, న్యూస్‌లైన్: బ్యాట్స్‌వుమన్ మమత (73) అర్ధ సెంచరీ సహాయంతో హైదరాబాద్ జట్టు 13 పరుగుల తేడాతో ఒడిశా జట్టుపై గెలుపొందింది. అఖిల భారత సీనియర్ మహిళల టి20 ఎలైట్ ‘ఎ’ గ్రూప్ ‘ఎ’లో భాగంగా గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా హైదరాబాద్ 7 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. సింధుజా రెడ్డి (27) రాణించింది. స్వాగతిక రెండు వికెట్లు తీసుకుంది. అనంతరం బరిలోకి దిగిన ఒడిశా నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 114 పరుగులు మాత్రమే చేయగలిగింది. స్వాగతిక (32), మెహతా (22), మొహంతి (19), కాదంబిని (27) చక్కటి ఆట తీరును కనబరిచారు. ఈ విజయంతో హైదరాబాద్ 4 పాయింట్లను సొంతం చేసుకుంది. మహారాష్ట్రపై రైల్వేస్ విజయం మరో మ్యాచ్‌లో రైల్వేస్ జట్టు 4 వికెట్ల తేడాతో మహారాష్ట్ర జట్టుపై గెలుపొందింది. ఏఓసీ సెంటర్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బరిలోకి దిగిన మహారాష్ట్ర 9 వికెట్ల నష్టానికి 60 పరుగులు చేసింది. ఎస్పీ జాదవ్ 18 పరుగులు చేసింది. రైల్వేస్ బౌలర్ కేడీ పాటిల్ మూడు వికెట్లు పడగొట్టింది. తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన రైల్వేస్ 6 వికెట్లు కోల్పోయి 61 పరుగులు చేసి నెగ్గింది. మహారాష్ట్ర బౌలర్ శ్వేత మానె 2 వికెట్లు తీసుకుంది. రైల్వేస్ 4 పాయింట్లను తన ఖాతాలో వేసుకుంది. -
రెండో రౌండ్లో యశ్ అగర్వాల్
జింఖానా, న్యూస్‌లైన్: ఆస్టర్ మైండ్స్ ఏపీ స్టేట్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నీ అండర్-14 బాలుర విభాగంలో యశ్ అగర్వాల్ రెండో రౌండ్లోకి చేరుకున్నాడు. తారీఖ్ స్పోర్ట్స్ అకాడమీ నిర్వహిస్తున్న ఈ టోర్నీలో ఆదివారం జరిగిన మొదటి రౌండ్లో యశ్ అగర్వాల్ 6-0తో సుజిత్ చంద్రారెడ్డిపై గెలుపొందాడు. మరో మ్యాచ్‌లో అఖిల్ కుమార్ రెడ్డి 6-0తో వేదాంత్‌పై నెగ్గగా, సలీల్ దాండ్రియాల్ 6-0తో శరద్ చంద్రపై గెలిచాడు. మోనిష్ 6-1తో సామ్యూల్ జోష్య విశ్వాస్‌పై, జియా హంజా పాషా 6-1తో పద్మేష్ పట్వారిపై గెలిచారు. సాయి పృథ్విక్ 6-2తో శశాంక్‌ను, సుహిత్ రెడ్డి 6-5తో అభినవ్‌ను, శశిప్రీతమ్ 6-2తో అనురాగ్‌ను ఓడించారు. చనుష్ బాబు 6-1తో స్పర్శ్ మిట్టల్‌పై, హర్షవర్ధన్ 6-2తో నిశ్చయ్‌పై, తనిష్క్ 6-2తో సాయిశేఖర్పై గెలిచారు. ఇతర ఫలితాలు: అండర్-12 బాలుర రెండో రౌండ్: కుషాల్ 6-1తో అక్షద్పై, సేవంత్ 6-4తో తరుణ్‌పై, ఆర్యన్ 6-4తో మిహిర్‌పై, శ్రీకార్తీక్ 6-3తో ప్రణీత్‌పై, ఆకాశ్ 6-3తో విదుర్‌పై, యశ్ అగర్వాల్ 6-2తో రహిత్ బాబుపై, మనార్ 6-1తో అరుణ్‌పై, సాయి కార్తీక్ 6-2తో విశ్వక్పై, అక్షిత్ 6-0తో రాజేశ్వర్ రెడ్డిపై, ముకుంద్ రెడ్డి 6-4తో అర్చిత్‌పై, ఆయుష్ పవన్ 6-0తో హర్షవర్ధన్‌పై, శశిధర్ 6-0తో ధీరజ్ కమార్‌పై, యశ్వంత్ 6-3తో పులకిత్‌పై, రుషికేశ్ 6-1తో జైకృష్ణపై గెలుపొందారు. అండర్-10 బాలికల తొలి రౌండ్: తనుషిత రెడ్డి 6-3తో దియా రెడ్డిని, చాహన 6-4తో భువి శేఖర్ని, అదితి 6-1తో ప్రాంజలని, అభయ 6-0తో శ్రీవిధిని ఓడించారు. -
నేటి నుంచి మహిళల టి20 క్రికెట్ టోర్నీ
జింఖానా, న్యూస్‌లైన్: నగరంలో నేటి నుంచి సీనియర్ మహిళల టి20 ఎలైట్ గ్రూప్-ఎ క్రికెట్ టోర్నీ ప్రారంభం కానుంది. హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) నిర్వహిస్తున్న ఈ టోర్నీ.... జింఖానా, ఏఓసీ సెంటర్ మైదానాల్లో జరుగుతుంది. ఐదు రోజుల పాటు జరిగే ఈ టోర్నీలో హైదరాబాద్, ఒరిస్సా, మహారాష్ట్ర, హర్యానా, రైల్వేస్ జట్లు పాల్గొంటున్నాయి. తొలి రోజు మ్యాచ్‌లో హైద రాబాద్... హర్యానాతో జింఖానా మైదానంలో అమీతుమీ తేల్చుకోనుంది. అనంతరం 4వ తేదీన రైల్వేస్‌తో, 5వ తేదీన మహారాష్ట్రతో, 6వ తేదీన ఒరిస్సాతో పోటీపడనుంది. -
రెండో రౌండ్లో అనికేత్, రాహుల్
జింఖానా, న్యూస్‌లైన్: ఏఐటీఏ టాలెంట్ సిరీస్ టెన్నిస్ టోర్నీ అండర్-14 బాలుర విభాగంలో వెంకట్ అనికే త్ రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. సూర్యోదయ టెన్నిస్ అకాడమీ నిర్వహిస్తున్న ఈ టోర్నీ మొదటి రౌండ్లో అనికేత్ 8-0తో కొసరాజు హ ర్షిత్పై గెలుపొందాడు. ఇతర మ్యాచ్‌ల్లో రాహుల్ 8-0తో నిషాద్పై నెగ్గగా... దుర్గా హిమకేశ్ 8-0తో ఆకాశ్‌పై గెలిచాడు. అచిత్ బార్గత్ 8-0తో ఫణీంద్రపై గెలవగా... సాయి ప్రతీక్ 8-0తో సాయి సింహారెడ్డిని ఓడించాడు. ఇతర ఫలితాలు అండర్-16 బాలుర విభాగం: ప్రణవ్ రెడ్డి 8-2తో రిషిల్ గుప్తాపై; రిత్విక్ 8-1తో సచిత్పై; గౌతమ్ ఆకాశ్ 8-4తో సాయి సిద్ధార్థ్‌పై; ఆదిత్య 8-3తో రుచిత్ గౌడ్‌పై; నితిన్ 8-7, 7-3తో కార్తీక్ రెడ్డిపై; గౌరవ్ రెడ్డి 8-3తో తరుణ్‌పై; సుచిత్ 8-1తో రేవంత్ రెడ్డిపై; అక్షిత్ రెడ్డి 8-3తో సంప్రీత్ రెడ్డిపై; వినయ్ 8-4తో అభినవ్‌పై; సాయిహర్ష 8-0తో అర్జున్ రెడ్డిపై విజయం సాధించారు. అండర్-14 బాలికల విభాగం: లాస్య పట్నాయక్ 8-0తో లిఖితా మాన్సినిపై; శ్రేయ 8-1తో అవంతికా రెడ్డిపై; తనూజ చౌహాన్ 8-2తో దుర్గా శ్రీవేదపై; చరితా వాసి రెడ్డి 8-6తో ఫియోనా రేనాల్డ్పై; లిపికా 8-3తో సంస్కృతిపై నెగ్గారు. -
దూసుకెళ్తున్న లయోలా జట్లు
జింఖానా, న్యూస్‌లైన్: ఐఎంజీ- రిలయన్స్ బాస్కెట్‌బాల్ కాలేజి లీగ్‌లో లయోలా అకాడమీకి చెందిన పురుషుల, మహిళల జట్లు విజయాలు నమోదు చేశాయి. సికింద్రాబాద్ క్లబ్లో జరుగుతున్న ఈ టోర్నీలో ఆదివారం పురుషుల విభాగంలో లయోలా అకాడమీ జట్టు 48-18తో మల్లారెడ్డి కాలేజి జట్టుపై గెలుపొందింది. మ్యాచ్ తొలి అర్ధ భాగం ముగిసే సమయానికి 30-16తో లయోలా అకాడమీ ఆధిక్యంలో ఉంది. రెండో అర్ధ భాగంలో మల్లారెడ్డి జట్టు ఆటగాళ్లు శ్రీకర్ (7 పాయింట్లు), సురభ్ (6) చెమటోడ్చినప్పటికీ విజయం చేకూరలేదు. లయోలా అకాడమీ ఆటగాళ్లు నవీన్ (15), ఉదయ్ (10) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. మరో వైపు మహిళల విభాగంలో లయోలా అకాడమీ 64-40తో కస్తూర్బా కాలేజి జట్టుపై గెలిచింది. ఆట ప్రారంభం నుంచి లయోలా అకాడమీ క్రీడాకారిణులు రమా మిశ్రా (25), మౌనిక (10), అక్షిత (10) దూకుడుగా ఆడారు. ప్రత్యర్థికి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా చాలా నేర్పుగా ఆటను కొనసాగించారు. మ్యాచ్ ప్రథమార్ధం ముగిసే సమయానికి లయోలా అకాడమీ 35-13తో ఆధిక్యంలో ఉంది. అనంతరం విజృంభించిన కస్తూర్బా క్రీడాకారిణులు శ్వేత (16), కోమల్ (14), వరలక్ష్మి (10) రెండో అర్ధ భాగంలో చక్కని పోరాటపటిమ కనబరిచినా చివరకు విజయం మాత్రం దక్కలేదు. ఇతర ఫలితాలు సీవీఎస్ఆర్: 39 (ప్రత్యూష 21, శ్వేత 12); గోకరాజు: 27 (మృణాళిని 19, సింధూష 6). నారాయణమ్మ: 2 (అలేఖ్య 12, లక్ష్మి 6); సెయింట్ మార్టిన్స్: 32 (ఐశ్వర్య 8). పురుషుల విభాగం: సీవీఎస్ఆర్: 53 (మహేష్ 16, కృష్ణ 15, వివేక్ 9); బిట్స్‌పిలాని: 41 (ఇషాన్ 17, స్వార్ణిమ్ 10). ఏవీ కాలేజి: 44 (సాయి 14, బాలాజి 11, కిరణ్ 11); అవంతి డిగ్రీ కాలేజి: 38 (జశ్వంత్ 26, అక్రమ్ 10). ముఫకంజా: 62 (నవాజ్ 25, సాదుద్దీన్ 18, షరీఫుద్దీన్ 15); నిజాం డిగ్రీ కాలేజి: 39 (రోహిత్ 19, నందు 10). -
వైష్ణవి ఓటమి
జింఖానా, న్యూస్‌లైన్: ఆలిండి యా ఓపెన్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వైష్ణవి పెద్ది రెడ్డి పరాజయం పాలైంది. సికింద్రాబాద్ క్లబ్లో జరుగుతున్న ఈ టోర్నీలో శుక్రవారం జరిగిన మహిళల సెమీఫైనల్లో వైష్ణవి 3-5తో టాప్ సీడ్ వానియా దంగ్వాల్ (ఢిల్లీ) చేతిలో ఓటమి పాలైంది. ఇతర మ్యాచ్‌ల్లో రియా భాటియా (ఢిల్లీ) 7-5, 6-4తో అమృత ముఖర్జీ (పశ్చిమ బెంగాల్)పై గెలిచింది. పురుషుల విభాగంలో లక్షిత్ సూద్ (ఉత్తరప్రదేశ్) 6-3, 4-6, 6-0తో విజయ్ కన్నన్ (తమిళనాడు)పై, వినోద్ శ్రీధర్ (తమిళనాడు) 6-2, 6-3తో అంకిత్ సచ్‌దేవా (ఢిల్లీ)పై నెగ్గి ఫైనల్స్‌కు చేరుకున్నారు. డబుల్స్ విభాగం సెమీఫైనల్లో కునాల్ ఆనంద్-సాగర్ మంజన జోడి 6-4, 6-4తో సాగర్ అహూజ-షాబాజ్ ఖాన్‌పై, విజయ్ కన్నన్- ఫరీజ్ మహ్మద్ జోడి 6-3, 0-6, 10-2తో అర్పిత్ శర్మ-లక్షిత్ సూద్ జోడిపై గెలిచారు. మహిళల డబుల్స్ విభాగం సెమీఫైనల్లో అమృత ముఖర్జీ-లిఖిత శెట్టి జంట 6-3, 6-1తో నిత్యా రాజ బాబు-స్నేహ పడమట జంటను, అరంటా ఆండ్రెడా-అనుష్క భార్గవ జంట 6-4, 7-5తో రియా భాటియా-వానియా దంగ్వాల్ జంటను ఓడించి ఫైనల్స్‌లో అడుగు పెట్టాయి. -
సాయి, శామ్సన్ శ్రమ వృథా
జింఖానా, న్యూస్‌లైన్: ఏవీ కాలేజి జట్టు ఆటగాళ్లు సాయి (16), శామ్సన్ (9) చివరి వరకు కష్టపడినప్పటికీ జట్టుకు విజయం చేకూరలేదు. ఐఎంజీ రిలయన్స్ కాలేజ్ బాస్కెట్‌బాల్ లీగ్ పురుషుల విభాగంలో బిట్స్ పిలాని జట్టు 44-43తో ఏవీ కాలేజి జట్టుపై గెలుపొందింది. మరో మ్యాచ్‌లో లయోలా అకాడమీ జట్టు 58-31తో ముఫకంజా కాలేజి జట్టుపై గెలుపొందింది. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు మహిళల విభాగం: గవర్నమెంట్ కాలేజి: 35 (ప్రీతి 20, భవ్య 8); సెయింట్ ఫ్రాన్సిస్ డిగ్రీ కాలేజి: 23 (సిమ్రాన్ 6, శ్రేయ 6, ఝాన్సి 5). నారాయణమ్మ కాలేజి: 29 (లక్ష్మి 10, అలేఖ్య 8); బిట్స్ పిలాని: 18 (అపూర్వ 7, సిమ్రాన్ -
ప్రాంజల శుభారంభం
జింఖానా, న్యూస్‌లైన్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) జూనియర్స్ గ్రేడ్-2 టెన్నిస్ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల రెండో రౌండ్లోకి ప్రవేశించింది. న్యూఢిల్లీలో జరుగుతున్న ఈ పోటీల్లో సోమవారం జరిగిన మొదటి రౌండ్లో ప్రాంజల 6-4, 6-0తో కొమోల ఉమరోవ (ఉజ్బెకిస్థాన్)పై గెలుపొందింది. తొలి సెట్లో ప్రాంజలకు కొంత పోటీ ఎదురైనప్పటికీ గెలుపు సాధించగా... రెండో సెట్లో అలవోకగా దూసుకువెళ్లింది. ప్రతిఘటించేందుకు ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఏకపక్ష విజయం సాధించింది. బుధవారం రెండో రౌండ్లో ప్రాంజల బెల్జియంకు చెందిన నైనాతో తలపడనుంది. -
తేజోధర్కు 5 వికెట్లు
జింఖానా, న్యూస్‌లైన్: భారత్ సీసీ జట్టు బౌలర్ తేజోధర్ (5/24) చక్కటి బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశాడు. దీంతో ఎ-డివిజన్ వన్డే లీగ్‌లో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో భరత్ సీసీ 71 పరుగుల తేడాతో ఇంటర్నేషనల్ జట్టుపై నెగ్గింది. తొలుత భరత్ సీసీ 193 పరుగులకు ఆలౌటైంది. తేజోధర్ 41, గణేశ్ 35, వికాస్ రావు 31 పరుగులు చేశారు. ఇంటర్నేషనల్ జట్టు బౌలర్ బాలకృష్ణ 4 వికెట్లు చేజిక్కించుకున్నాడు. తర్వాత ఇంటర్నేషనల్ జట్టు 122 పరుగులకే చేతులెత్తేసింది. అమిత్ (35) మినహా మిగిలిన వారు రాణించలేకపోయారు. భరత్ సీసీ బౌలర్ యశ్వంత్ 3 వికెట్లు తీసుకున్నాడు. మరో మ్యాచ్‌లో ఎంపీ యంగ్‌మెన్ బ్యాట్స్‌మన్ శ్రీకాంత్ (103 నాటౌట్) సెంచరీతో అజేయంగా నిలవడంతో ఆ జట్టు 30 పరుగుల తేడాతో ఎంపీ స్పోర్టింగ్ జట్టుపై నెగ్గింది. తొలుత ఎంపీ యంగ్‌మెన్ 6 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. నితిన్ 39 పరుగులు చేశాడు. తర్వాత ఎంపీ స్పోర్టింగ్ 230 పరుగులు చేసి ఆలౌటైంది. చైతన్య (55), వినీత్ (56 నాటౌట్) అర్ధ సెంచరీతో చెలరేగాడు. ఎంపీ యంగ్‌మెన్ బౌలర్ అమృత్ 4 వికెట్లు పడగొట్టాడు. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు అగర్వాల్ సీనియర్స్: 184 (ఫారుఖ్ 43, అజీమ్ 5/44); అపెక్స్ ఎలెవన్: 122 (బిపిన్ 4/12, షాకీర్ 3/25). స్పోర్టివ్ సీసీ: 212 (రోషన్ శ్యామ్యూల్ 54, గణేశ్ 35, తరుణ్ 31; విద్యాసాగర్ 5/72, యోగేష్ మెహతా 4/54); ఆజాద్ సీసీ: 214/7 (సాయి చరణ్ 62 నాటౌట్, హుజేఫా 67; మురళీ మోహన్ 5/28). సదరన్ స్టార్: 85 (నాగరాజు 3/20, నగేంద్ర కుమార్ 4/6); ఇన్కమ్ టాక్స్: 86/2 (సాయి లక్ష్మణ్ 39 నాటౌట్). హెచ్‌పీఎస్: 257/5 (విఘ్నేశ్ 35, రాజా 111 నాటౌట్, యాదవ్ 63); లాల్ బహదూర్: 253 (పరమేశ్వర్ రెడ్డి 42, పవన్ కుమార్ 60; ధీరజ్ 3/32, గౌస్ బాబా 3/48). చీర్‌ఫుల్ చమ్స్: 153 (రాజశేఖర్ 41, సందీప్ 31; ప్రేమ్ 5/38, సాయి కార్తీక్ 3/5); ఎస్ఎన్ గ్రూప్: 154/8 (ఫిరోజ్ 3/45, మధు 3/35). యునెటైడ్ సీసీ: 187 (శ్రవణ్ 70; భార్గవ్ 4/50); గగన్‌మహల్: 89 (శ్రవణ్ 5/42, విక్రమ్ 4/30). సఫిల్‌గూడ: 82 (ఆదిత్య 5/11); సెయింట్ ఆండ్రూస్: 87 (బౌమిక్ 44 నాటౌట్). ఏపీ హైకోర్ట్: 161/4 (అనిల్ 71, అభిషేక్ 70; సూర్య కుమార్ 4/41); కెనరా బ్యాంక్: 79 (కుమార్ 35 నాటౌట్; చంద్రశేఖర్ 5/20). -
హర్షిత్ శుభారంభం
జింఖానా, న్యూస్‌లైన్: ఆలిండియా ర్యాంకింగ్ టాలెంట్ సిరీస్ టె న్నిస్ టోర్నీలో అండర్-12 బాలుర సింగిల్స్ విభాగంలో కొసరాజు హర్షిత్ శుభారంభం చేశాడు. సూర్యోదయ టెన్నిస్ అకాడ మీలో శనివారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో హర్షిత్ 8-0తో ఆర్యంత్ రెడ్డిపై నెగ్గాడు. కౌశిక్ కుమార్ రెడ్డి 8-0తో అక్షిత్‌పై గెలిచాడు. సోహన్ 8-6తో హితేష్‌పై, అనికేత్ 8-4తో వరుణ్ కుమార్‌పై, రాహుల్ 8-1తో తరుణ్‌పై, సాయితేజ 8-2తో అర్చిత్‌పై నెగ్గారు. మిగతా ఫలితాలు: యశ్వంత్ 8-4తో ప్రతీ క్‌పై, సృజన్ 8-1తో అఖిలేష్‌పై, ప్రీతమ్ 8-2తో శౌర్యపై, బృహత్ 8-3తో విదుర్‌పై, శశిధర్ 8-2తో హర్షవర్ధన్‌పై, ఇక్బాల్ 8-0తో ఆది రోహన్‌పై, ప్రణవ్ 8-1తో రుషికేశ్పై, జయంత్ 8-5తో కార్తీక్‌పై, దీపక్ 8-5తో శివాన్వేష్పై, ఆకాశ్ 8-3తో వంశీకృష్ణపై నెగ్గారు. బాలికల అండర్-12 మొదటి రౌండ్: ప్రవళిక 8-0తో రితికా రెడ్డిపై, వేద వర్షిత 8-7, 7-4తో అదితిపై, సుమన 8-3తో మేఘనపై, సాహిష్న సాయి 8-3తో తనుషితా రెడ్డిపై, నిధి 8-1తో సౌమ్య జైన్‌పై గెలిచారు. -
సెమీస్‌లో ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజి
జింఖానా, న్యూస్‌లైన్: ఎస్ఆర్ చాంపియన్స్ ట్రోఫీలో ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ఫైనల్లో ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజి 4 వికెట్ల తేడాతో ఎస్‌వీఎస్‌ఐటీ (వరంగల్) జట్టుపై గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్‌వీఎస్‌ఐటీ 14.5 ఓవర్లలో 76 పరుగులు చేసింది. రాజ్‌కుమార్ (49) మెరుగ్గా ఆడాడు. ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజి బౌలర్లు అరవింద్, సైదులు చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. అనంతరం బరిలోకి దిగిన ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజి 16.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 80 పరుగులు చేసి నెగ్గింది. కిరణ్ 29 పరుగులు చేశాడు. ఎస్‌వీఎస్‌ఐటీ బౌలర్ సాంకీత్ రెండు వికెట్లు చేజిక్కించుకున్నాడు. రాజ్ కుమార్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. మరో మ్యాచ్‌లో వీజేఐటీ ఇంజనీరింగ్ కాలేజి జట్టు 20 పరుగుల తేడాతో ఎంఎల్ఆర్ఐటీ ఇంజనీరింగ్ కాలేజి జట్టుపై నెగ్గి సెమీస్‌కు అర్హత సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన వీజేఐటీ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. శివదీప్ (82) అర్ధ సెంచరీతో రాణించాడు. ఎంఎల్ఆర్ఐటీ బౌలర్లు అఖిల్, ప్రసాద్ తలా రెండు వికెట్లు తీసుకున్నారు. తర్వాత బరిలోకి దిగిన ఎంఎల్ఆర్ఐటీ 20 ఓవర్లలో 9 వికెట్లకు 158 పరుగులు మాత్రమే చేయగలిగింది. వినోద్ (30) మినహా మిగిలిన వారు రాణించలేకపోయారు. వీజేఐటీ బౌలర్లు లక్ష్మణ్, వికాస్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. వీజేఐటీ బ్యాట్స్‌మన్ శివదీప్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. -
తనిష్క్ డబుల్ ధమాకా
జింఖానా, న్యూస్‌లైన్: అఖిల భారత బీఎస్ఎన్ఎల్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ ఆటగాడు తనిష్క్ డబుల్ ధమాకా సాధించాడు. పురుషుల సింగిల్స్, డబుల్స్ టైటిల్స్‌ను గెలుచుకున్నాడు. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర రెడ్డి స్టేడియంలో జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో తనిష్క్ 21-18, 21-13తో సర్వజిత్ బౌమిక్ (పశ్చిమ బెంగాల్)పై నెగ్గగా, డబుల్స్‌లో తనిష్క్-అనిల్ కుమార్ జోడి 21-19, 21-13తో అభిజిత్-హతిబార్వ (అస్సాం) జోడిని కంగుతినిపించింది. మహిళల సింగిల్స్ ఫైనల్లో మనాలి (అస్సాం) 21-10, 21-10తో సుమిత్ర పుజారి (అస్సాం)పై నెగ్గి టైటిల్ సొంతం చేసుకుంది. మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో అభిజిత్-మనాలి (అస్సాం) జంట 21-14, 21-9తో తనిష్క్-ఉష (ఆంధ్రప్రదేశ్) జంటపై గెలుపొందింది. వెటరన్ సింగిల్స్ ఫైనల్లో దినేష్ (మధ్యప్రదేశ్) 17-21, 23-21, 26-24తో శ్రీనివాసరావు (ఆంధ్రప్రదేశ్)పై, వెటరన్ డబుల్స్ ఫైనల్లో శ్రీనివాసరావు-ప్రదీప్ కుమార్ ద్వయం 21-18, 19-21, 21-18తో న జీముద్దీన్-ఆంటో (కేరళ) ద్వయంపై గెలిచింది. -
నారాయణకు స్వర్ణం
జింఖానా, న్యూస్‌లైన్: అఖిల భారత బీఎస్ఎన్ఎల్ వెయిట్‌లిఫ్టింగ్, పవర్‌లిఫ్టింగ్ బెస్ట్ ఫిజిక్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్‌కు చెందిన ఎస్వీ నారాయణ స్వర్ణ పతకాన్ని సాధించాడు. మధ్యప్రదేశ్ సర్కిల్ స్పోర్ట్స్, కల్చరల్ బోర్డు ఆధ్వర్యంలో ఈ పోటీలు భోపాల్‌లో జరిగాయి. 85 కేజీల విభాగంలో నారాయణ విజేతగా నిలిచాడు. మధ్యప్రదేశ్ బీఎస్ఎన్ఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ ఎన్కే యాదవ్ చేతుల మీదుగా నారాయణ బంగారు పతకం, ప్రశంసా పత్రాన్ని అందుకున్నాడు. గౌలీగూడాలోని బీఎస్ఎన్ఎల్ సెంట్రల్ కార్యాలయంలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న అతను ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో 13 పతకాలను సాధించినట్లు తెలిపాడు. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధిస్తానని ధీమా వ్యక్తం చేశాడు. -
రన్నరప్ ఆంధ్రప్రదేశ్
జింఖానా, న్యూస్‌లైన్: జాతీయ స్థాయి స్కూల్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ జట్టు రన్నరప్‌గా నిలిచింది. బాలుర అండర్-17 విభాగంలో పవన్ కుమార్, హరికృష్ణ, జగదీశ్కృష్ణ, ఆదిత్యలతో కూడిన ఆంధ్రప్రదేశ్ జట్టు 0-3తో ఢిల్లీ చేతిలో పరాజయం చవిచూసింది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో శుక్రవారం జరిగిన ఫైనల్ పోటీల తొలి మ్యాచ్‌లో పవన్ కుమార్ గట్టి పోటీ ఇచ్చినప్పటికీ... చివరకు 2-3తో శివెన్ చేతిలో కంగుతిన్నాడు. అనంతరం హరికృష్ణ 0-3తో అజయ్ చేతిలో, జగదీశ్ కృష్ణ 0-3తో కేశవ్ చేతిలో ఓటమి చవిచూశారు. పరాజయం ఖాయమవడంతో ఆదిత్య బరిలోకి దిగలేదు. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో ఆంధ్రప్రదేశ్ జట్టు 3-2తో తమిళనాడుపై విజయం సాధించింది. -
ఆంధ్ర విద్యాలయ కాలేజిపై సెయింట్ మార్టిన్స్ గెలుపు
జింఖానా, న్యూస్‌లైన్: బాస్కెట్‌బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఎఫ్ఐ) ఐఎంజీ రిలయన్స్ బాస్కెట్‌బాల్ లీగ్ పురుషుల విభాగంలో సెయింట్ మార్టిన్స్ ఇంజినీరింగ్ కాలేజి జట్టు గెలుపొందింది. వైఎంసీఏలో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో సెయింట్ మార్టిన్స్ జట్టు 55-51తో ఏవీ కాలేజి జట్టుపై విజయం సాధించింది. సెయింట్ మార్టిన్స్ జట్టు ఆటగాళ్లు సంతోష్ (20), విశాల్ (16), రవి (13) చాకచక్యంగా వ్యవహరించి జట్టుకు విజయాన్ని చేకూర్చారు. ఏవీ కాలేజి జట్టులో శామ్సన్ (18), సాయి (17), కిరణ్ (10) చక్కటి ఆటతీరు కనబరిచారు. మరో మ్యాచ్‌లో ముఫకంజా కాలేజ్ ఆఫ్ ఇంజినీ రింగ్ అండ్ టెక్నాలజి జట్టు 39-25తో మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజి జట్టుపై నెగ్గింది. -
అబ్దుల్ అజీమ్ 8/8
జింఖానా, న్యూస్‌లైన్: అపెక్స్ సీసీ జట్టు బౌలర్ అబ్దుల్ అజీమ్ (8/8) తన బౌలింగ్‌తో రుషిరాజ్ జట్టు బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపించాడు. దీంతో ఆ జట్టు 106 పరుగుల తేడాతో రుషిరాజ్ జట్టుపై విజయం సాధించింది. ఎ-డివిజన్ వన్డే లీగ్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన అపెక్స్ సీసీ 7 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. సయ్యద్ జావిద్ అలీ (67), సయ్యద్ పాషా అలీ (60) అర్ధ సెంచరీలతో రాణించారు. రుషిరాజ్ బౌలర్ మహ్మద్ అలీమ్ 3 వికెట్లు తీసుకున్నాడు. తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన రుషిరాజ్... అజీమ్ ధాటికి 104 పరుగులకే కుప్పకూలింది. మల్లికార్జున్ (45) మినహా మిగిలినవారు రాణించలేకపోయారు. మరో మ్యాచ్‌లో గ్రీన్‌ల్యాండ్స్ జట్టు బ్యాట్స్‌మన్ సుందర్ (106 నాటౌట్) సెంచరీతో అజేయంగా నిలవడంతో ఆ జట్టు 5 వికెట్ల తేడాతో యంగ్ సిటిజన్ జట్టుపై గెలుపు దక్కించుకుంది. మొదట బరిలోకి దిగిన యంగ్ సిటిజన్ 7 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. వికాస్ (103) సెంచరీతో చెలరేగగా... రతన్ (54 నాటౌట్) అర్ధ సెంచరీతో అజేయంగా నిలిచాడు. గ్రీన్‌ల్యాండ్స్ బౌలర్ శ్రీచరణ్ 4 వికెట్లు తీసుకున్నాడు. అనంతరం బరిలోకి దిగిన గ్రీన్‌ల్యాండ్స్ 5 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది. యంగ్ సిటిజన్ బౌలర్ కరణ్ 5 వికె ట్లు పడగొట్టాడు. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు సత్యం సీసీ: 189/8 (నరేష్ 35; శ్రీనివాస్ 4/45); కాంకార్డ్: 132 (శ్రీనివాస్ 45, అక్బర్ 43; విశ్వనాథ్ 5/16). అభినవ్ కోల్ట్స్: 179 (అషీర్ 37; సతీష్ 4/46); ఎంపీ బ్లూస్: 183/5 (శ్రీనివాస్ 40, సతీష్ 40 నాటౌట్). పీఎన్ యంగ్‌స్టర్స్: 146/7 (సులేమాన్ 4/33); మహావీర్: 147/7 (రాజ్‌కిరణ్ 34, విజేందర్ 52). విక్టర్: 136 (శ్రవణ్ 3/40); రోహిత్ ఎలెవన్: 139/5 (సాయిరామ్ 35, రణ్‌జీత్ 51 నాటౌట్; భాను కుమార్ 5/40). ఎంపీ యంగ్మెన్స్: 130 (విజయ్ 3/15); పీకేసీసీ: 93 (నితిన్ 4/40, ఉదయ్ 3/15). సెయింట్ మేరీస్: 70 (తరుణ్ 3/40); యూత్ సీసీ: 71/1 (అరుణ్ 39). కల్నల్ అక్రిలిక్: 85 (బషీర్ 6/44); షాలిమార్: 89/5 (అల్తాఫ్ 3/10). -
29 నుంచి బాస్కెట్‌బాల్ లీగ్
జింఖానా, న్యూస్‌లైన్: ఆంధ్రప్రదేశ్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ ఈ నెల 29 నుంచి బీఎఫ్ఐ ఐఎంజీ రిలయన్స్ కాలేజ్ బాస్కెట్‌బాల్ లీగ్ నిర్వహించనుంది. ఈ టోర్నీలో పురుషుల, మహిళల విభాగాల్లో మొత్తం 20 జట్లు పాల్గొననున్నాయి. ఈ జట్లను నాలుగు గ్రూపులుగా విభజించి 96 మ్యాచ్‌లను నిర్వహిస్తారు. విజేతగా నిలిచిన వారికి ఏప్రిల్‌లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. పురుషుల గ్రూప్ ‘ఎ’ జట్లు: లయోలా అకాడమీ, భవాన్స్ డిగ్రీ కాలేజి, మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజి, ముఫకంజా కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజి, నిజాం కాలేజి. గ్రూప్ ‘బి’ జట్లు: ఏవీ కాలేజి, సెయింట్ మార్టిన్స్ ఇంజినీరింగ్ కాలేజి, అవంతి డి గ్రీ కాలేజి, బిట్స్ పిలాని హైదరాబాద్, సీవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కాలేజి. మహిళల గ్రూప్ ‘ఎ’ జట్లు: లయోలా అకాడమీ, సెయింట్ ఆన్స్ డిగ్రీ కాలేజి, కస్తూర్బా డిగ్రీ కాలేజి, సీవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కాలేజి, గోకరాజు నూకరాజు ఇంజినీరింగ్ కాలేజి. గ్రూప్ ‘బి’ జట్లు: నారాయణమ్మ ఇంజినీరింగ్ కాలేజి, సెయింట్ ఫ్రాన్సిస్ డిగ్రీ కాలేజి, సెయింట్ మార్టిన్స్ ఇంజినీరింగ్ కాలేజి, బిట్స్ పిలాని హైదరాబాద్, ప్రభుత్వ వ్యాయామ విద్యా కళాశాల. -
షాదాబ్‌కు 5 వికెట్లు
జింఖానా, న్యూస్‌లైన్: హైదరాబాద్ పేట్రియాట్స్ జట్టు బౌలర్ షాదాబ్ (5/36) ప్రత్యర్థి జట్టును కట్టడి చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. హెచ్‌సీఏ కిషన్ ప్రసాద్ వన్డే నాకౌట్ టోర్నీలో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ పేట్రియాట్స్ జట్టు 14 పరుగుల తేడాతో హైదరాబాద్ వాండరర్స్ జట్టుపై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పేట్రియాట్స్ 9 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. అజిత్ సింగ్ (75) అర్ధ సెంచరీతో రాణించగా... అక్రమ్ అలీ 35, షాబాద్ 30 పరుగులు చేశారు. హైదరాబాద్ వాండరర్స్ బౌలర్లు అజయ్, త్రిషంక్ చెరో మూడు వికెట్లు తీసుకున్నారు. అనంతరం బరిలోకి దిగిన హైదరాబాద్ వాండరర్స్ 7 వికెట్ల నష్టానికి 207 పరుగులు మాత్రమే చేయగలిగింది. సయ్యద్ అస్కారి (51) అర్ధ సెంచరీతో చెలరేగగా... అజయ్ 35 పరుగులు చేశాడు. మరో మ్యాచ్‌లో బౌలర్ రాహుల్ (4/10) శ్రమించినప్పటికీ చీర్‌ఫుల్ చమ్స్కు విజయం చేకూరలేదు. హెచ్‌జీసీ జట్టు రెండు వికెట్ల తేడాతో చీర్‌ఫుల్ చమ్స్ జట్టుపై గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చే సిన చీర్‌ఫుల్ చమ్స్ 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. వినీత్ (49), రవితేజ (34) మెరుగ్గా ఆడారు. తర్వాత బరిలోకి దిగిన హెచ్‌జీసీ 8 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసి గెలిచింది. ఉమా మహేశ్వర్ (51) అర్ధ సెంచరీతో రాణించాడు. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు డెక్కన్ వాండరర్స్: 121 (యాది రెడ్డి 3/23); విజయానంద్: 94. శాంతి ఎలెవన్: 98 (ప్రసాద్ 50; రోహిత్ 3/3);రోహిత్ ఎలెవన్: 99/1(రంజీత్ 62). రెడ్ హిల్స్: 161 (మీసుమ్ అబు 51; తాహ 4/38); ఇన్కమ్ టాక్స్: 164/6 (శివచరణ్ 62, మహ్మద్ 3/21). -
శంషుద్దీన్‌కు హెచ్‌సీఏ అభినందన
జింఖానా, న్యూస్‌లైన్: దేశవాళీ టోర్నీలకు సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నుంచి ఉత్తమ అంపైర్ పురస్కారం అందుకోనున్న చెట్టితోడి శంషుద్దీన్‌కు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అభినందనలు తెలిపింది. జనవరి 11న ముంబైలో జరిగే కార్యక్రమంలో ఆయన ఈ అవార్డును అందుకోనున్నారు. 1970 మార్చి 22న జన్మించిన శంషుద్దీన్ 2012 నుంచి అంతర్జాతీయ మ్యాచ్‌లకు కూడా అంపైర్‌గా వ్యవహరిస్తున్నారు. 2012తో బీసీసీఐ శంషుద్దీన్‌ను ఐసీసీ అంతర్జాతీయ అంపైర్ల ప్యానెల్‌కు నామినేట్ చేసింది. కెరీర్లో ఇప్పటివరకు ఆయన మూడు టి20, ఒక వన్డే అంతర్జాతీయ మ్యాచ్‌లలో అంపైర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. -
హైదరాబాద్ జట్టు ఇదే...
జింఖానా, న్యూస్‌లైన్: హైదరాబాద్ తరఫున సౌత్ జోన్ టోర్నమెంట్లో పాల్గొనే అండర్-14 క్రికెట్ జట్టు వివరాలను హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) వెల్లడించింది. జట్టు కెప్టెన్‌గా సమిత్ రెడ్డి వ్యవహరించనున్నాడు. ఈ టోర్నీ వచ్చే నెల 6 నుంచి గోవాలో జరగనుంది. జట్టు కోచ్‌గా చేతన్ ఆనంద్ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. జట్టుకు ఎంపికైన ఆటగాళ్ళు శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు జింఖానా మైదానంలో హాజరు కావాలని హెచ్‌సీఏ కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు. జట్టు: సూర్య తేజ, ప్రత్యూష్, వరుణ్ గౌడ్, రేవంత్, నిహాంత్ రెడ్డి, ప్రగ్యున్ దూబే, సాయి ప్రజ్ఞయ్ రెడ్డి, అజయ్‌దేవ్ గౌడ్, ఆశిష్ శ్రీవాస్తవ్, అలంక్రిత్ అగర్వాల్, అంకిత్ రెడ్డి, కమల్ కుమార్, రిషబ్, సాయిపూర్ణా రావు, మన్నాస్. -
ఫైనల్లో శ్రీధర్, మదన్
జింఖానా, న్యూస్‌లైన్: ఐటీఎఫ్ సీనియర్ టెన్నిస్ టోర్నీ 65+ విభాగంలో శ్రీధర్, మదన్ ఫైనల్స్‌లోకి దూసుకెళ్ళారు. శాప్ టెన్నిస్ కాంప్లెక్స్‌లో గురువారం జరిగిన సెమీఫైనల్లో శ్రీధర్ 6-1, 6-3తో టాప్ సీడ్ అరవింద్‌పై నెగ్గగా... మదన్ 6-2, 6-2తో సూర్యనారాయణరాజుపై విజయం సాధించాడు. 45+ డబుల్స్ విభాగం సెమీఫైనల్లో టాప్ సీడ్ అలోక్-పవన్ జోడి 6-1, 6-2తో అర్జున్-మీర్జా జోడిపై, సతీష్ చంద్ర-వెంకట రామరాజు జోడి 7-6, 6-5తో మేఘనాథ్-విశ్వనాథ్ జోడిపై గెలిచి ఫైనల్స్‌కు అర్హత సాధించాయి. 35+ డబుల్స్ సెమీఫైనల్స్‌లో అలోక్-దిలీప్ జోడి 6-1,6-4తో విక్రమ్-శ్రీనాథ్‌ను, మహేష్-వాహిద్ జోడి 7-6, 6-4తో వినాయక్-సతీర్థ్ జోడిని ఓడించి ఫైనల్స్‌కు చేరుకున్నాయి. మిగతా ఫలితాలు 35+ సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్స్: సతీర్థ్ 6-0, 6-5తో విజయ్‌పై, అర్జున్ 6-3, 5-7, 6-0తో మహేష్‌పై, దిలీప్ 6-3, 6-2తో విక్రమ్‌పై నెగ్గారు. 45+ సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్స్: పవన్ 6-0, 6-0తో అరోర యశ్‌పాల్‌పై, సతీష్ చంద్ర 7-6, 6-0తో సింగ్ పన్వార్‌పై, రుద్రరాజు 6-1, 6-2తో ధీరజ్‌పై, మేఘనాథ్ 7-5, 7-5తో కుమార్‌పై గెలిచారు. 55+ సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్స్: అజిత్ 6-2, 6-4తో రత్నాకర రావును, సురేష్ 6-4,6-4తో రామన్‌ను, జానకిరామ్ 6-4, 6-1తో ప్రమోద్ కుమార్‌ను ఓడించారు. -
మెరిసిన సంతోష్
జింఖానా, న్యూస్‌లైన్: ఎలెవన్ మాస్టర్ జట్టు బ్యాట్స్‌మన్ సంతోష్ (121) సెంచరీతో చెలరేగడంతో ఆ జట్టు 82 పరుగుల తేడాతో మాంచెస్టర్ జట్టుపై విజయం సాధించింది. హెచ్‌సీఏ కిషన్ ప్రసాద్ వన్డే నాకౌట్ టోర్నీలో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఎలెవన్ మాస్టర్ 3 వికెట్లు కోల్పోయి 265 పరుగులు చేసింది. హరీష్ (72 నాటౌట్) అర్ధ సెంచరీతో అజేయంగా నిలవగా... నరేష్ 37 పరుగులు చేశాడు. అనంతరం లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన మాంచెస్టర్ 4 వికెట్ల నష్టానికి 183 పరుగులు మాత్రమే చేయగలిగింది. చరణ్ (66) అర్ధ సెంచరీతో రాణించగా... నదీమ్ 31 పరుగులు చేశాడు. మరో మ్యాచ్‌లో విజయ్ భరత్ జట్టు బౌలర్ నరసింహ (5/35) ప్రత్యర్థి జట్టుకు ముచ్చెమటలు పట్టించాడు. దీంతో ఆ జట్టు 4 వికెట్ల తేడాతో ఫ్యూచర్ స్టార్ జట్టుపై గెలుపొందింది. తొలుత బరిలోకి దిగిన ఫ్యూచర్ స్టార్ 132 పరుగులకే కుప్పకూలింది. కృష్ణ (37) మినహా మిగిలిన వారు రాణించలేకపోయారు. తర్వాత బ్యాటింగ్ చేసిన విజయ్ భారత్ 6 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసి నెగ్గింది. రాజ్ (37) ఫర్వాలేదనిపించాడు. ఫ్యూచ ర్ స్టార్ బౌలర్ కృష్ణ 3 వికెట్లు తీసుకున్నాడు. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు డెక్కన్ కోల్ట్స్: 158 ( ప్రతీక్ 108 ); ఎస్ఎన్ గ్రూప్: 102 ( సంతోష్ 3/12, కిషన్ 3/24). సఫిల్‌గూడ: 161 ( నిరూప్ 4/20); గ్రీన్ టర్ఫ్: 164/7 (ఉదయ్ కిరణ్ రెడ్డి 64, చార్లెస్ 4/40). ఐఐసీటీ: 132 (శ్రీనివాస్ 33; రామకృష్ణ 4/28, సోహన్ 3/12); కన్సల్ట్: 137/2 (వికాస్ రావు 70). హైదరాబాద్ పేట్రియాట్స్: 224 (మోసిన్ 45, అకీల్ అహ్మద్ 56, ఇమ్రోజ్ 39); ఓఎంసీ: 171 (శ్రీకాంత్ 31, హేమంత్ 31, వంశీ 42; అక్షయ్ 4/17, షాదాబ్ 4/8). ఎ-డివిజన్ రెండు రోజుల లీగ్ కొసరాజు: 137 (రిత్విక్ 54; ఫాహీమ్ 3/18); ఎస్ఏ అంబర్పేట్: 141/4 (రాకేష్ 58; అజయ్ పట్వారి 3/68). ఎ-ఇన్స్టిట్యూషన్ వన్డే లీగ్ ఐఏఎఫ్: 214 (శంకరీయ 110); ఎంసీహెచ్: 135 (అజీమ్ 50, జితేందర్ 30; దీపక్ 5/21). -
చైతన్య శతకం
జింఖానా, న్యూస్‌లైన్: కూచ్ బెహర్ అండర్-19 క్రికెట్ ట్రోఫీలో భాగంగా హైదరాబాద్, ఛత్తీస్‌గఢ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. జింఖానా మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో నాలుగో రోజు తన రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన హైదరాబాద్ 66 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. చైతన్య రెడ్డి (162 బంతుల్లో 111 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీతో కదం తొక్కగా... అనిరుధ్ (60) అర్ధ సెంచరీతో రాణించాడు. తన్మయ్ అగర్వాల్ (33), కేఎస్కే చైతన్య (34 నాటౌట్) ఫర్వాలేదనిపించారు. ఛత్తీస్‌గఢ్ బౌలర్ ఇర్ఫాన్ 3 వికెట్లు తీసుకున్నాడు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 138/5తో బరిలోకి దిగిన ఛత్తీస్‌గఢ్ 96.4 ఓవర్లలో 190 పరుగులు చేసి ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలుపుకుని ఛత్తీస్‌గఢ్ 164 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. దీంతో ఛత్తీస్‌గఢ్‌కు 3 పాయింట్లు దక్కగా... హైదరాబాద్ ఒక పాయింట్‌తో సరిపెట్టుకుంది. -
రంజిత్ అజేయ సెంచరీ
జింఖానా, న్యూస్‌లైన్: రోహిత్ ఎలెవన్ బ్యాట్స్‌మన్ రంజిత్ (110 నాటౌట్) సెంచరీతో అజేయంగా నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు. హెచ్‌సీఏ కిషన్ ప్రసాద్ వన్డే నాకౌట్ టోర్నీలో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో రోహిత్ ఎలెవన్ జట్టు నాలుగు వికెట్ల తేడాతో ఎంఎల్ జయసింహ జట్టుపై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఎంఎల్ జయసింహ 191 పరుగులకు ఆలౌటైంది. నీరజ్ (57) అర్ధ సెంచరీతో రాణించగా... రాఘవేంద్ర (40) మెరుగ్గా ఆడాడు. రోహిత్ ఎలెవన్ బౌలర్ ప్రతాప్, రోహిత్ చెరో మూడు వికెట్లు తీసుకున్నారు. అనంతరం బరిలోకి దిగిన రోహిత్ ఎలెవన్ 6 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. ఎంఎల్ జయసింహ బౌలర్ రాకేష్ 4 వికెట్లు చేజిక్కించుకున్నాడు. మరో మ్యాచ్‌లో బౌలర్ అశోక్ (6/46) విజృంభించడంతో భారతీయ సీసీ జట్టు రెండు పరుగుల తేడాతో సఫిల్‌గూడ జట్టుపై గెలుపొందింది. మొదట భారతీయ సీసీ 3 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. సోమశేఖర్ (95 నాటౌట్), రాఘవేంద్ర (62) అర్ధ సెంచరీలతో చెలరేగారు. తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన సఫిల్‌గూడ 180 పరుగులకు కుప్పకూలింది. నాగరాజ్ గౌడ్ 33 పరుగులు చేశాడు. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు విక్టరీ: 297/7 (అశిష్ 71, రజనీకాంత్ 68, ప్రకాష్ 42, మల్లికార్జున్ 36); నోబుల్: 142/8 (అనుదీప్ 54; రజనీకాంత్ 3/23). సాగర్ ఎలెవన్: 133 ( హిమాన్షు 41, రోహన్ బాబు 5/10); గౌలిపురా: 136/7 (శ్రీహరి 3/44). వాకర్‌టౌన్: 173/9 (రమేష్ 34; సూర్య 3/41); కల్నల్ అక్రిలిక్: 174/6 (నావీద్ 54; న ర్సింహ 3/27). నటరాజ్: 169 (మధు గౌడ్ 46, మణికుమార్ 31; మిత్ర 4/36); అక్షిత్ సీసీ: 141 (చరణ్ 32; మణికుమార్ 6/40). హెచ్‌జీసీ: 206/5 (సాయికుమార్ 56, ప్రసాద్ 62, చరణ్ 31); యూత్ సీసీ: 102 (జైషీల్ 30; శ్రవణ్ నాయుడు 3/19). వీఎస్టీ: 105 (అరవింద్ 3/23); ఏబీ కాలనీ: 102/2 (అరవింద్ 43, సతీష్ 41 నాటౌట్). టైమ్స్: 68 (ఆదిల్బిన్ మూసా 5/8); ఎంసీహెచ్: 69/3. అద్భుతం సాధ్యమా! మొత్తం 9 జట్లు ఉన్న గ్రూప్ ‘సి’లో హైదరాబాద్ 18 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. 7 మ్యాచుల్లో జట్టు ఒకటి గెలిచి, 6 డ్రా చేసుకుంది. పట్టికలో అగ్రస్థానంలో ఉన్న మహారాష్ట్ర (29) ఇప్పటికే క్వార్టర్స్ చేరింది. పాయింట్ల పరంగా ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ (25), హిమాచల్ ప్రదేశ్ (24)లతో హైదరాబాద్ పోటీ పడాల్సి ఉంది. చివరి మ్యాచ్‌లో జట్టు కేరళతో సొంతగడ్డపై తలపడాల్సి ఉంది. ఆ మ్యాచ్‌లో బోనస్ పాయింట్ గెలిస్తే (!) మొత్తం 25 పాయింట్లకు చేరుకుంటుంది. అదే సమయంలో కాశ్మీర్, త్రిపురతో జరిగే ఆఖరి మ్యాచ్‌లో ఖచ్చితంగా ఓడిపోవాలి. డ్రా ద్వారా ఒక్క పాయింట్ దక్కించుకున్నా హైదరాబాద్ అవకాశం పోయినట్లే. ఇదీ జరిగి రెండు జట్లూ సమమైతే ‘రన్ కోషెంట్’ (ఒక్కో వికెట్‌కు చేసిన, ఇచ్చిన పరుగుల ఆధారంగా)ను బట్టి ముందుకు వెళ్లేది ఎవరో నిర్ణయిస్తారు. హైదరాబాద్ క్వార్టర్ ఫైనల్‌తో పాటు పై గ్రూప్‌కు చేరాలన్నా ఇక అద్భుతం జరగాల్సిందే! -
అదరగొట్టిన జతిన్, సత్యనారాయణ
జింఖానా, న్యూస్‌లైన్: జతిన్ (5/28), సత్యనారాయణ (5/44) బౌలింగ్‌లో చెలరేగడంతో ఇండియన్ ఎయిర్‌లైన్స్ జట్టు 53 పరుగుల తేడాతో హైదరాబాద్ ఇండస్ట్రీస్ జట్టుపై గెలిచింది. ఎ-ఇనిస్టిట్యూషన్ వన్డే లీగ్‌లో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో... మొదట బరిలోకి దిగిన ఇండియన్ ఎయిర్‌లైన్ 133 పరుగులు చేసింది. దీపక్ 34 పరుగులు చేశాడు. హైదరాబాద్ ఇండస్ట్రీస్ బౌలర్ నికోలస్ 6 వికెట్లు తీశాడు. తర్వాత బరిలోకి దిగిన హైదరాబాద్ ఇండస్ట్రీస్ 80 పరుగులకే ఆలౌటైంది. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు కమర్షియల్ ట్యాక్స్: 174/8 (హరినాథ్ 47, మహ్మద్ 50; అస్ఫరుల్ 3/23); సీసీఎంబీ: 176/3 (సంతోష్ 36, నాగభూషణ్ 35). ఏపీఎస్ఆర్టీసీ: 168 (ప్రసాద్ 63; ఎస్ రెడ్డి 3/59); ఐఐసీటీ: 169/7 (శ్రీనివాస్ 44, అరుణ్ 78 నాటౌట్). ఎన్ఎఫ్సీ: 118 (నరసింహా రావు 36; సాగర్ 3/28, సురేష్ 3/48); పోస్టల్: 122/1 (సిద్ధార్థ్ 31 నాటౌట్, విజయ్ 70). వీసీటీ: 113/8 ( మధువన్ 40); మిధాని: 115/5 (అనిల్ 43). -
కమల్‌కు ఏడు వికెట్లు
జింఖానా, న్యూస్‌లైన్: మయూర సీసీ బౌలర్ కమల్ కుమార్ (7/35) ప్రత్యర్థి జట్టుకు ముచ్చెమటలు పట్టించాడు. దీంతో ఆ జట్టు 7 వికెట్ల తేడాతో హెచ్‌జీసీ జట్టుపై విజయం సాధించింది. ఎ-డివిజన్ వన్డే లీగ్‌లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హెచ్‌జీసీ 93 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బరిలోకి దిగిన మయూర సీసీ 3 వికెట్లు కోల్పోయి 97 పరుగులు చేసి నెగ్గింది. కమల్ కుమార్ (31 నాటౌట్), సంజయ్ సింగ్ (30 నాటౌట్) మెరుగ్గా ఆడారు. మరో మ్యాచ్‌లో విజయ్ సీసీ బౌలర్ దీపాంకర్ 7 వికెట్లు పడగొట్టడంతో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో మహావీర్ సీసీ జట్టుపై గెలుపొందింది. మొదట బరిలోకి దిగిన మహావీర్ సీసీ 140 పరుగులకు ఆలౌటైంది. సుధాకర్ 30 పరుగులు చేశాడు. తర్వాత విజయ్ సీసీ 4 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసి గెలిచింది. నాగరాజ్ (39), శివ (36 నాటౌట్) ఫర్వాలేదనిపించారు. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు రోషనార: 216 (రాహుల్ 36, వేణు 41; నిరూప్ 6/60); గ్రీన్ టర్ఫ్: 181/7 (ఫరాన్ 37, సుధీర్ 38; నయన్ 4/50). అపెక్స్ సీసీ: 216/9 (అన్వర్ అలీ 41, అబ్దుల్ అజీమ్ 41; యూసఫ్ 5/58, జగదీశ్ 3/35); ఆడమ్స్ ఎలెవన్: 94 (హషమ్ అలీ 7/39). రోహిత్ ఎలెవన్: 218/9 ( సాయి రామ్ 35, రంజిత్ 55; ప్రఫుల్ కుమార్ 4/72); ఎస్ రేమాండ్స్: 174 (సుధీర్ 43; రంజిత్ 4/22). ఏబీ కాలనీ: 126 (అరవింద్ 47, సతీష్ 36, ప్రతీక్ 4/24); వీపీవీఎం: 130/6 (విజయ్ 47, షాకీర్ 45, సతీష్ 3/21). సెయింట్ ప్యాట్రిక్స్: 102 (కృష్ణ సాయి 5/23); సీకే బ్లూస్: 104/3 (వరుణ్ 39, విష్ణు నాయక్ 36; అభిలాష్ 3/35). స్పోర్టివ్: 170 (రాము 40; విక్రమ్ 3/45, అంబాదాస్ 4/36); తారకరామ: 172/5 (శివ కుమార్ 70). స్టార్లెట్స్: 112 (శివ కోటి రెడ్డి 3/30, సావర్ బోరంచ 3/21); టైమ్ సీసీ: 115/2 (సావన్ బోరంచ 40 నాటౌట్, శివ కోటి రెడ్డి 40 నాటౌట్). -
వాలీబాల్ టోర్నీ విజేత ఇన్ఫోసిస్
జింఖానా, న్యూస్‌లైన్: ఏస్ కనెక్ట్ వాలీబాల్ టోర్నీ ఫైనల్స్‌లో ఇన్ఫోసిస్ జట్టు విజేతగా నిలిచింది. ఐఎంటీ హైదరాబాద్ నిర్వహించిన ఈ టోర్నీలో ఇన్ఫోసిస్, ఒరాకిల్, మైక్రోసాఫ్ట్, క్వాల్కమ్, అమెజాన్ డాట్ కామ్ కంపెనీలు పాల్గొన్నాయి. శనివారం జరిగిన ఫైనల్స్‌లో ఇన్ఫోసిస్ 25-22, 25-21తో ఆతిథ్య ఐఎంటీ జట్టుపై గెలుపు దక్కించుకుంది. తుది పోరులో ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. అయితే చివరి నిమిషంలో ఇన్ఫోసిస్ జట్టు ఆటగాళ్లు చాకచక్యంగా వ్యవహరించి జట్టుకు విజయాన్ని అందించారు. -
చాంప్స్ ఓక్రిడ్జ్, చిరెక్
జింఖానా, న్యూస్‌లైన్: భారత బాస్కెట్‌బాల్ సమాఖ్య (బీఎఫ్ఐ) ఐఎంజీ రిలయన్స్ స్కూల్ బాస్కెట్‌బాల్ లీగ్‌లో బాలుర విభాగంలో ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్... బాలికల విభాగంలో చిరెక్ పబ్లిక్ స్కూల్ చాంపియన్స్‌గా నిలిచాయి. వైఎంసీఏలో జరిగిన బాలుర ఫైనల్స్‌లో ఓక్రిడ్జ్ 54-25తో గీతాంజలి స్కూల్‌పై విజయం సాధించింది. మ్యాచ్ తొలి అర్ధ భాగం ముగిసే సమయానికి ఓక్రిడ్జ్ 28-14తో ముందంజలో నిలిచింది. ముందు నుంచి దూకుడుగా ఆడుతున్న కార్తీక్ (17), సునీత్ (13), విభు (8) తర్వాత కూడా అదే రీతిలో చెలరేగడంతో ఆ జట్టుకు గెలుపు దక్కింది. గీతాంజలి స్కూల్ జట్టులో సహర్ష్ (11), ఒమర్ (10) రాణించారు. బాలికల విభాగం ఫైనల్స్‌లో చిరెక్ పబ్లిక్ స్కూల్ 44-19తో సెయింట్ పాయిస్ హైస్కూల్‌పై నెగ్గి టైటిల్ కైవసం చేసుకుంది. మొదటి అర్ధ భాగం ముగిసే సమయానికి చిరెక్ 28-8తో ఆధిక్యంలో ఉంది. దృష్టి (16), సబ్రీన్ (8), సంహిత (6) అలవోకగా దూసుకెళ్ళి జట్టుకు విజయాన్ని అందించారు. సెయింట్ పాయిస్ క్రీడాకారిణిలు మౌనిక (9), తేజస్విని (8) చక్కని ఆటతీరు కనబరిచారు. బాలుర విభాగంలో మూడు, నాలుగు స్థానాల కోసం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ 50-36తో చిరెక్ పబ్లిక్ స్కూల్‌పై నెగ్గగా.. బాలికల విభాగంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ 39-30తో ఫ్యూచర్ కిడ్స్ జట్టును ఓడించింది. బాలుర విభాగంలో కార్తీక్ (ఓక్రిడ్జ్), బాలికల విభాగంలో దృష్టి (చిరెక్) ‘ఉత్తమ క్రీడాకారులు’గా ఎంపికయ్యారు. బీఎఫ్ఐ సాంకేతిక కమిటీ చైర్మన్ జీఎం సంపత్ కుమార్ ముఖ్యఅతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలు అందజేశారు. విజేత జట్లకు రూ. 50 వేల చొప్పున నగదు పురస్కారం దక్కింది. రన్నరప్ జట్లకు రూ. 30 వేల చొప్పున... మూడో స్థానం పొందిన జట్లకు రూ. 20 వేల చొప్పున ఇచ్చారు. -
బిష్ణుదాస్ శతకం
జింఖానా, న్యూస్‌లైన్: సదరన్ స్టార్స్ బ్యాట్స్‌మన్ బిష్ణుదాస్ (106) సెంచరీతో కదం తొక్కాడు. దీంతో ఆ జట్టు 68 పరుగుల తేడాతో విద్యుత్ సౌధ జట్టుపై విజయం సాధించింది. హెచ్‌సీఏ కిషన్ ప్రసాద్ వన్డే నాకౌట్ టోర్నీలో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బరిలోకి దిగిన సదరన్ స్టార్స్ 4 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. విజయ్ (90) అర్ధ సెంచరీతో రాణించాడు. విద్యుత్ సౌధ బౌలర్ జగన్నాథ్ 3 వికెట్లు తీసుకున్నాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన విద్యుత్ సౌధ 150 పరుగులకే కుప్పకూలింది. వాసు (52) అర్ధ సెంచరీతో చెలరేగగా... మహ్మద్ అలీ 32 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. సదరన్ స్టార్స్ బౌలర్ సాయి చరణ్ 4 వికెట్లు పడగొట్టాడు. మరో మ్యాచ్‌లో హెచ్‌యూసీసీ జట్టు 5 వికెట్ల తేడాతో స్పోర్టివ్ సీసీ జట్టుపై గెలుపొందింది. మొదట బరిలోకి దిగిన స్పోర్టివ్ సీసీ 8 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. తరుణ్ (45) మెరుగ్గా ఆడాడు. హెచ్‌యూసీసీ బౌలర్ రమేష్ 3 వికెట్లు తీసుకున్నాడు. తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన హెచ్‌యూసీసీ 5 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది. ఖలీముద్దీన్ (31), సయ్యద్ అస్లామ్ (32 నాటౌట్) ఫర్వాలేదనిపించారు. -
విజేత తులసి హైస్కూల్
జింఖానా, న్యూస్‌లైన్: కల్నల్ సీకే నాయుడు ట్రోఫీలో భాగంగా జరిగిన మ్యాచ్‌లో తులసి హైస్కూల్ జట్టు విజేతగా నిలిచింది. అండర్-14 విభాగంలో జరిగిన ఫైనల్స్‌లో తులసి జట్టు 34 పరుగుల తేడాతో భవాన్స్ జట్టుపై విజయం సాధించింది. మొదట బరిలోకి దిగిన తులసి 5 వికెట్ల నష్టానికి 77 పరుగులు చేయగా... అనంతరం భవాన్స్ 8 వికెట్లు కోల్పోయి 64 పరుగులు మాత్రమే చేయగలిగింది. స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్ 15 రోజుల పాటు నిర్వహించిన ఈ టోర్నీ అండర్-11, 13, 14 విభాగాల్లో జరిగింది. అండర్-11 విభాగంలో భవాన్స్ జట్టు టైటిల్ కైవసం చేసుకోగా... అదే జట్టు బ్యాట్స్‌మన్ అశ్మిత్ యంగ్ సీకే నాయుడు-2013 అవార్డును గెలుచుకున్నాడు. విజేతలకు బ్రిగే డియర్ అనుపమ్ శర్మ ముఖ్య అతిథిగా విచ్చేసి బహుమతులు అందజేశారు. -
రాజు అదుర్స్
జింఖానా, న్యూస్‌లైన్: ఎన్ఎఫ్సీ బౌలర్ ఎంవీఎన్ రాజు 5 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి జట్టును కట్టడి చేశాడు. దీంతో ఎ-ఇన్స్టిట్యూషన్ వన్డే లీగ్‌లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో ఎన్ఎఫ్సీ జట్టు 105 పరుగుల తేడాతో ఐఐసీటీ జట్టుపై గెలుపొందింది. మొదట ఎన్ఎఫ్సీ జట్టు 8 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. రాజు (64), నర్సిహారావు (55) అర్ధ సెంచరీలతో రాణించగా... ఏఎన్ నాయుడు 32 పరుగులు చేశాడు. ఐఐసీటీ బౌలర్లు అమర్ 3, చందు 4 వికెట్లు తీసుకున్నారు. తర్వాత బరిలోకి దిగిన ఐఐసీటీ 129 పరుగులకే చేతులెత్తేసింది. సందీప్ (48), అరుణ్ (35) ఫర్వాలేదనిపించారు. ఎన్ఎఫ్సీ బౌలర్లు వాహిద్ 3 వికెట్ల తీశాడు. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు ఏపీ హైకోర్ట్: 86 (డేనియల్ 5/20); బీహెచ్ఈఎల్: 87/2 (రాజిద్ 35 నాటౌట్). ఐఏఎఫ్: 138 (రెహమాన్ 31, మంగారావు 4/31); ఏపీఎస్ఈబీ: 116 (మెహతా 5/15). -
బాస్కెట్‌బాల్ విజేత అపోలో
జింఖానా, న్యూస్‌లైన్: మెడికల్ కళాశాలల క్రీడోత్సవాల్లో భాగంగా జరిగిన బాస్కెట్‌బాల్ ఫైనల్స్‌లో ఆతిథ్య అపోలో విజయం సాధించింది. జూబ్లీహిల్స్‌లోని అపోలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ అండ్ రీసెర్చ్ (ఏఐఎంఎస్‌ఆర్)లో జరిగిన బాలికల విభాగం ఫైనల్స్‌లో అపోలో జట్టు 27-8తో కామినేని జట్టుపై విజయం సాధించింది. బాలుర ఫుట్‌బాల్ ఫైనల్స్‌లో డెక్కన్ 3-1తో అపోలోపై నెగ్గి టైటిల్ కైవసం చేసుకుంది. వాలీబాల్ ఫైనల్స్‌లో కామినేని జట్టు 2-0తో అపోలోపై గెలుపు కైవసం చేసుకుంది. క్రికెట్ మ్యాచ్ ఫైనల్స్‌లో భాస్కర జట్టు 3 పరుగుల తేడాతో గాంధీ మెడికల్ కళాశాల జట్టుపై నెగ్గింది. తొలుత బరిలోకి దిగిన భాస్కర 148 పరుగులు చేయగా... అనంతరం గాంధీ కళాశాల 145 పరుగులు మాత్రమే చేయగలిగింది. -
తేజకు ఐదు వికెట్లు
జింఖానా, న్యూస్‌లైన్ : వాకర్ టౌన్ బౌలర్ తేజ (5/15) తన బౌలింగ్‌తో ప్రత్యర్థి జట్టును బెంబేలెత్తించాడు. దీంతో ఆ జట్టు 9 వికెట్ల తేడాతో సత్య సీసీ జట్టుపై విజయం సాధించింది. హెచ్‌సీఏ కిషన్ ప్రసాద్ వన్డే నాకౌట్ టోర్నీలో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన సత్య సీసీ 75 పరుగులకే కుప్పకూలింది. అన ంతరం బరిలోకి దిగిన వాకర్ టౌన్ వికెట్ కోల్పోయి 80 పరుగులు చేసి గెలిచింది. పాండు (45) మెరుగ్గా ఆడాడు. మరో మ్యాచ్‌లో విజయానంద్ జట్టు 119 పరుగుల తేడాతో సన్‌షైన్ జట్టుపై గెలుపొందింది. మొదట బరిలోకి దిగిన విజయానంద్ 6 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. నాయక్ (70) అర్ధ సెంచరీతో రాణించగా... తిలక్ (44), అభిషేక్ (37), విక్రాంత్ (30) ఫర్వాలేదనిపించారు. సన్‌షైన్ బౌలర్ కళ్యాణ్ సాత్విక్ 4 వికెట్లు పడగొట్టాడు. తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన సన్‌షైన్ 103 పరుగులకే చేతులెత్తేసింది. విజయానంద్ బౌలర్ నరేష్ 3 వికెట్లు తీశాడు. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు అగర్వాల్ ఎస్ఆర్: 174 (ఫరూఖ్ 45, అబ్దుల్లా 30; మునాఫ్ సుబానీ 3/32); కల్నల్ అక్రిలిక్: 175/5 (మొసిన్ ఆరిఫ్ 51, మహ్మద్ ఆసిఫ్ 30). లాల్ బహదూర్: 272/7 (గఫార్ ఖాన్ 50, జైచందర్ 65, సుషీల్ 56 నాటౌట్, పవన్ 33); ఇన్కమ్ ట్యాక్స్: 273 (మారుతీ ప్రసాద్ 40, హిమాన్షు 67, రాజశేఖర్ 73). కాంకార్డ్: 131; రోహిత్ ఎలెవన్: 135/7.