ఫైనల్లో శ్రీధర్, మదన్ | sridhar,madhan entered finals | Sakshi
Sakshi News home page

ఫైనల్లో శ్రీధర్, మదన్

Published Fri, Dec 27 2013 12:35 AM | Last Updated on Sat, Sep 2 2017 1:59 AM

sridhar,madhan entered finals

జింఖానా, న్యూస్‌లైన్: ఐటీఎఫ్ సీనియర్ టెన్నిస్ టోర్నీ 65+ విభాగంలో శ్రీధర్, మదన్ ఫైనల్స్‌లోకి దూసుకెళ్ళారు. శాప్ టెన్నిస్ కాంప్లెక్స్‌లో గురువారం జరిగిన సెమీఫైనల్లో శ్రీధర్ 6-1, 6-3తో టాప్ సీడ్ అరవింద్‌పై నెగ్గగా... మదన్ 6-2, 6-2తో సూర్యనారాయణరాజుపై విజయం సాధించాడు.
 
  45+ డబుల్స్ విభాగం సెమీఫైనల్లో టాప్ సీడ్ అలోక్-పవన్ జోడి 6-1, 6-2తో అర్జున్-మీర్జా జోడిపై, సతీష్ చంద్ర-వెంకట రామరాజు జోడి 7-6, 6-5తో మేఘనాథ్-విశ్వనాథ్ జోడిపై గెలిచి ఫైనల్స్‌కు అర్హత సాధించాయి. 35+ డబుల్స్ సెమీఫైనల్స్‌లో అలోక్-దిలీప్ జోడి 6-1,6-4తో విక్రమ్-శ్రీనాథ్‌ను, మహేష్-వాహిద్ జోడి 7-6, 6-4తో వినాయక్-సతీర్థ్ జోడిని ఓడించి ఫైనల్స్‌కు చేరుకున్నాయి.
 
 మిగతా ఫలితాలు
 35+ సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్స్: సతీర్థ్ 6-0, 6-5తో విజయ్‌పై, అర్జున్ 6-3, 5-7, 6-0తో మహేష్‌పై, దిలీప్ 6-3, 6-2తో విక్రమ్‌పై నెగ్గారు.
 45+ సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్స్: పవన్ 6-0, 6-0తో అరోర యశ్‌పాల్‌పై, సతీష్ చంద్ర 7-6, 6-0తో సింగ్ పన్వార్‌పై, రుద్రరాజు 6-1, 6-2తో ధీరజ్‌పై, మేఘనాథ్ 7-5, 7-5తో కుమార్‌పై గెలిచారు.
 
 55+ సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్స్: అజిత్ 6-2, 6-4తో రత్నాకర రావును, సురేష్ 6-4,6-4తో రామన్‌ను, జానకిరామ్ 6-4, 6-1తో ప్రమోద్ కుమార్‌ను ఓడించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement