madhan
-
రాజశేఖర్ మేనల్లుడు హీరోగా ‘కంచుకోట’
ప్రతాని రామకృష్ణ గౌడ్ ముఖ్య పాత్రలో నటిస్తూ నిర్మిస్తోన్న చిత్రం ‘కంచుకోట’. ‘రహస్యం’ అనేది ట్యాగ్‌లైన్. హీరో రాజశేఖర్ మేనల్లుడు మదన్ ఈ చిత్రం ద్వారా కథానాయకునిగా పరిచయమవుతున్నారు. ఆశ, దివ్య హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎమ్.ఏ చౌదరి, వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. నేడు (బుధవారం) ప్రతాని రామకృష్ణ గౌడ్ బర్త్ డే సందర్భంగా ‘కంచుకోట’ టైటిల్ లాంచ్ చేశారు. రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ– ‘‘ఇదొక హిస్టారికల్ సినిమా. ఇందులో నేను గురూజీ పాత్ర చేశాను. మంగ్లీ పాడిన ఒక పాట చిత్రీకరణ మినహా షూటింగ్ పూర్తయింది. జూన్‌లో సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు. తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ వైస్ చైర్మన్ ఎత్తరి గురురాజ్, తెలుగు ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ మోహన్ వడ్లపట్ల, ‘టీఎఫ్‌సీసీ’ దర్శకుల సంఘం అధ్యక్షుడు వి. సముద్ర పాల్గొన్నారు. -
మదన్ కోసం ఐదు పోలీస్ బృందాలు
తమిళసినిమా: వేందర్ మూవీస్ మదన్‌ను పట్టుకోవడానికి ఐదు ప్రత్యేక పోలీస్ బృందాలు తీవ్రంగా గాలిస్తున్నారు.ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు సీట్లు ఇప్పిస్తానని వారి తల్లిదండ్రుల నుంచి కోట్లాది రూపాలు వసూలు చేసి ఆ మొత్తాన్ని సంస్థ నిర్వాహకులకు అప్పగించానని ఒక లేఖలో పేర్కొని పరారైన మదన్ రెండున్నర నెలలుగా చెన్నై పోలీసులను నీళ్లు తాగిస్తున్నారు.ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి.మదన్ ఇద్దరు భార్యలు,తల్లి ఆయన ఆచూకీ కనిపెట్టి తమకు అప్పగించాల్సిందిగా చెన్నై హైకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్లను విచారణకు స్వీకరించిన హైకోర్టు మదన్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచాల్సిందిగా పోలీసులను ఆదేశించింది.దీంతో నేరపరిశోధనా విభాగం పోలీస్ అధికారులు మదన్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.మదన్ ఎక్కడికి పారిపోయారన్నది కచ్చితంగా తెలియకపోయినా సందేహంతో కాశీ, నేపాల్ అంటూ ఉత్తరాది ప్రాంతాలతో పాటు దక్షిణాదిలోని కేరళ,తమిళనాడులోని తిరుపూర్, ఇతర ప్రాంతాలలో ఐదు ప్రత్యేక పోలీస్ బృందాలు తీవ్రంగా గాలిస్తున్నారు.అయితే ఇప్పటికీ మదన్ జాడ తెలియలేదు. మరో పక్క హైకోర్టు పదే పదే ఆదేశాలు జారీ చేస్తూ పోలీసులపై ఒత్తిడి తీసుకొస్తోంది.రెండున్నర నెలల క్రితం అదృశ్యం అయిన మదన్ నాటి నుంచి నేటి వరకూ సెల్‌ఫోన్‌ను వాడటం లేదట. దీంతో ఆయన ఆచూకీ కనుగొనడం పెద్ద సమస్యగా మారిందని పోలీసులు వాపోతున్నారు.మదన్ స్నేహితులపై నిఘా పెట్టినట్లు త్వరలోనే ఆయన్ని పట్టుకుంటామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పారివేందర్కు బెయిల్ మదన్ మోసం కేసులో అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం అధినేత పారి వేందర్కు గురువారం సాయంత్రం నిబంధనలతో కూడిన బెయిలును చెన్నై మెజిస్ట్రేట్ కోర్టు మంజూరు చేసింది. 75 కోట్ల రూపాయలను,10 లక్షలతో పాటు ఇద్దరు వ్యక్తులను పూచీకత్తును, చెన్నై,సైదాపేట 11వ న్యాయస్థానంలో జమ చేసి బెయిల్ పొందాల్సిందిగా కోర్టు ఆదేశించింది. -
హీరోగా రాజశేఖర్ మేనల్లుడు
తమిళసినిమా: నటుడు రాజశేఖర్ చెల్లెలి కొడుకు మదన్ హీరోగా పరిచయం అవుతున్నారు. అంతే కాదు ఈయనే కథ,కథనం,దర్శకత్వం బాధ్యతలను భుజాలపై వేసుకుని తెరకెక్కిస్తున్న చిత్రం పేరు 88. జేకే మూవీమేకర్స్ పతాకంపై ఏ.జయకుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రంతో మదన్ సరసన ఉపాస్నారాయ్ నాయకిగా నటిస్తున్నారు. ఇతర పాత్రల్లో జయప్రకాశ్, డేనియల్ బాలాజీ,మీరాక్రి ష్ణన్,పవర్‌స్టార్,శ్యామ్,అప్పుకుట్టి,చాప్లిన్బాలు,సిజర్‌మనోహర్, చరణ్‌రాజ్, బాయ్స్ రాజన్ తదితరులు నటిస్తున్నారు. దయారత్నం సంగీత దర్శకత్వం, వెట్ట్రి ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రానికి శక్తిశరవణన్ పోరాట దృశ్యాలను కంపోజ్ చేస్తున్నారు. కాగా చిత్ర వివరాలను దర్శక-హీరో మదన్ తెలుపుతూ ఈ నాగరిక యుగంలో దినదినాభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి విపరీతాలకు దారి తీస్తోందన్నారు. ఇది మన సంస్కృతి, సంప్రదాయాలకు తూట్లు పొడుస్తోందని ఆవేదన వ్యక్తం చేసారు. ఇలాంటి అంశాలను ఆవిష్కరించే చిత్రమే 88 అని తెలిపారు. కొన్ని అంశాలను రహస్యంగా ఉంచుకోకపోవడం వల్ల జరిగే తీవ్రమైన అనర్థాలను చెప్పే చిత్రం ఇదన్నారు. చిత్ర షూటింగ్‌ను చెన్నై,కుంభకోణం,కేరళ ప్రాంతాలలో నిర్వహించినట్లు మదన్ పేర్కొన్నారు. -
ఫైనల్లో శ్రీధర్, మదన్
జింఖానా, న్యూస్‌లైన్: ఐటీఎఫ్ సీనియర్ టెన్నిస్ టోర్నీ 65+ విభాగంలో శ్రీధర్, మదన్ ఫైనల్స్‌లోకి దూసుకెళ్ళారు. శాప్ టెన్నిస్ కాంప్లెక్స్‌లో గురువారం జరిగిన సెమీఫైనల్లో శ్రీధర్ 6-1, 6-3తో టాప్ సీడ్ అరవింద్‌పై నెగ్గగా... మదన్ 6-2, 6-2తో సూర్యనారాయణరాజుపై విజయం సాధించాడు. 45+ డబుల్స్ విభాగం సెమీఫైనల్లో టాప్ సీడ్ అలోక్-పవన్ జోడి 6-1, 6-2తో అర్జున్-మీర్జా జోడిపై, సతీష్ చంద్ర-వెంకట రామరాజు జోడి 7-6, 6-5తో మేఘనాథ్-విశ్వనాథ్ జోడిపై గెలిచి ఫైనల్స్‌కు అర్హత సాధించాయి. 35+ డబుల్స్ సెమీఫైనల్స్‌లో అలోక్-దిలీప్ జోడి 6-1,6-4తో విక్రమ్-శ్రీనాథ్‌ను, మహేష్-వాహిద్ జోడి 7-6, 6-4తో వినాయక్-సతీర్థ్ జోడిని ఓడించి ఫైనల్స్‌కు చేరుకున్నాయి. మిగతా ఫలితాలు 35+ సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్స్: సతీర్థ్ 6-0, 6-5తో విజయ్‌పై, అర్జున్ 6-3, 5-7, 6-0తో మహేష్‌పై, దిలీప్ 6-3, 6-2తో విక్రమ్‌పై నెగ్గారు. 45+ సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్స్: పవన్ 6-0, 6-0తో అరోర యశ్‌పాల్‌పై, సతీష్ చంద్ర 7-6, 6-0తో సింగ్ పన్వార్‌పై, రుద్రరాజు 6-1, 6-2తో ధీరజ్‌పై, మేఘనాథ్ 7-5, 7-5తో కుమార్‌పై గెలిచారు. 55+ సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్స్: అజిత్ 6-2, 6-4తో రత్నాకర రావును, సురేష్ 6-4,6-4తో రామన్‌ను, జానకిరామ్ 6-4, 6-1తో ప్రమోద్ కుమార్‌ను ఓడించారు.