sridhar
-
ఐఏఎస్ అధికారి చెరుకూరి శ్రీధర్ వాంగ్మూలం రీరికార్డింగ్!
సాక్షి, అమరావతి : చంద్రబాబుపై అవినీతి కేసులను నీరుగార్చడమే ఏకైక కర్తవ్యంగా భావిస్తున్న సీఐడీ అందుకు చర్యలు వేగవంతం చేసింది. 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజధానిలో అసైన్డ్ భూముల దోపిడీ, ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్మెంట్ అక్ర మాలను ఆధారాలతో సహా వెల్లడించిన అప్పటి సీఆర్డీయే కమిషనర్ చెరుకూరి శ్రీధర్‌పై ఒత్తిడి తెచ్చి, గతంలో ఆయనిచ్చిన వాంగ్మూలాన్ని మా ర్పించి, కొత్తగా వాంగ్మూలం ఇప్పించడంలో విజ యవంతమైంది. చంద్రబాబు ప్రభుత్వ అక్ర మాలను వెల్లడిస్తూ ఆయన గుంటూరులోని న్యాయస్థానంలో ఇంతకుముందు 164 సీఆర్పీసీ వాంగ్మూలం ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా, టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రస్తుతం వైఎస్సార్ జిల్లా కలెక్టర్‌గా ఉన్న ఆయనతో గతంలో ఇచ్చిన వాంగ్మూలానికి పూర్తి విరుద్ధంగా వాంగ్మూలం ఇవ్వాలని సీఐడీ ద్వారా బెదిరింపులకు పాల్పడింది. ఇందుకు ఆయన అంగీకరించలేదు. రెండుసా ర్లు ఆయనతో 164 సీఆర్సీపీ వాంగ్మూలాన్ని రీరి కార్డింగ్ చేసేందుకు సీఐడీ యత్నించి విఫలమైంది. ఓ సారి న్యాయాధికారి సెలవులో ఉండటంతో వాయిదా పడింది. మరోసారి న్యాయస్థానం ప్రాంగణం వరకూ వచ్చిన శ్రీధర్ బయటే చాలాసేపు తన వాహనంలో ఉండిపోయారు. న్యాయస్థానం లోపలికి వెళ్లలేదు. ఓసారి ఇచ్చిన వాంగ్మూలానికి విరుద్ధంగా మరోసారి వాంగ్మూలం ఇవ్వడం నేరంగా పరిగణిస్తారని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను పలువురు న్యాయవాదులు ఆయన దృష్టికి తీసుకువెళ్లడంతో వాంగ్మూలం ఇవ్వకుండానే వెనుదిరిగారు. మూడో ప్రయత్నంలో బుధవారం సీఐడీ అధికారులు ఆయన్ని గుంటూరులోని న్యాయస్థానానికి తీసుకువచ్చారు. సీఐడీ అధికారులు, మఫ్టీలో ఉన్న పోలీసు అధికారుల పహారా మధ్య దాదాపు రెండు గంటలపాటు ఆయన న్యాయస్థానంలోనే ఉన్నారు. ఆ సమయంలో ఇతరులు ఎవరూ ఆయన్ని కలిసేందుకు కూడా సీఐడీ అధికారులు అనుమతించలేదు.సీఆర్పీసీ 164 కింద శ్రీధర్ తన వాంగ్మూలాన్ని రీరికార్డింగ్ చేసినట్టు సమాచారం. అనంతరం ఆయన ఎవరితోనూ మాట్లాడకుండా తన వాహనంలో వెళ్లిపోయారు. వాంగ్మూలం రీరికార్డింగ్‌పై అధికారికంగా సీఐడీ, ఇతర అధికారులుగానీ స్పందించలేదు. -
పోర్టులో స్టెల్లా నౌక డెమరేజ్ ‘పంచాయితీ’
సాక్షి ప్రతినిధి, కాకినాడ: పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా అంటూ కాకినాడ పోర్టులో నిలిపివేసిన స్టెల్లా ఎల్ పనామా నౌక ‘డెమరేజ్’ చార్జీలు ఎగుమతిదారులకు గుదిబండగా మారాయి. ముందస్తు ఒప్పందం ప్రకారం నిర్దేశించిన తేదీలోపు ఓడలో సరుకు లోడింగ్ పూర్తి చేసి ఎగుమతికి క్లియరెన్స్ ఇవ్వాలి. అలాకాకుంటే నౌక పోర్టులో ఎన్ని రోజులు నిలిచిపోతే అన్ని రోజులకు షిప్ యాజమాన్యం డెమరేజ్ చార్జీలు వసూలు చేస్తుంది. నవంబర్ 28న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నౌకలో పీడీఎస్ బియ్యం తనిఖీకి వచ్చి సినిమాటిక్‌గా ‘సీజ్ ద షిప్’ అంటూ అధికారులను ఆదేశించారు. అయితే, ఇంటర్నేషనల్ మెరైన్ చట్టం ప్రకారం షిప్‌ను సీజ్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేదు. షిప్‌ను సీజ్ చేయడానికి అవకాశం లేదని, బియ్యం ఉన్న కంటైనర్‌ను మాత్రమే సీజ్ చేయగలమని విశాఖ కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ ప్రిన్సిపల్ కమిషనర్ ఎన్.శ్రీధర్ ఇటీవల స్పష్టంగా చెప్పారు.సాగని అన్లోడ్ ప్రక్రియస్టెల్లా నౌకలో అధికారులు గుర్తించిన 1,320 మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యం అన్లోడ్ (కిందకు దింపే) ప్రక్రియ సాగడంలేదు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ప్రతిబంధకమైందని చెబుతున్నారు. దీంతో నౌక పోర్టులోనే నిలిచిపోయింది. ఇలా నిలిచిపోయిన ప్రతి రోజుకు డెమరేజ్ చార్జీలను షిప్ యాజమాన్యానికి చెల్లించాలి. ఈ నౌక సామర్థ్యం 52 వేల మెట్రిక్ టన్నులు. నౌకలో 28 ఎగుమతి కంపెనీలకు చెందిన 38 వేల మెట్రిక్ టన్నుల బియ్యం ఉంది. ఇదంతా నవంబర్ 28కి ముందే లోడింగ్ జరిగింది. మరో 14 వేల మెట్రిక్ టన్నులు లోడింగ్ చేయాల్సిన తరుణంలో నిలిపివేశారు. పవన్ హంగామా చేసిన రోజు నుంచి ఇప్పటి వరకు నౌక పోర్టులో నిలిచిపోయి 38 రోజులు దాటింది. ముందుగా నిర్దేశించిన నౌక క్లియరెన్స్ తేదీ దాటిన ప్రతి రోజుకు యాజమాన్యం డెమరేజ్ వసూలు చేస్తుంది. దీనిని డెమరేజ్ ఎవరు చెల్లించాలనే దానిపైనా పోర్టులో ఎగుమతిదారుల మధ్య పంచాయితీ నడుస్తోంది. డెమరేజ్ రోజుకు ఎంత చెల్లించాలనే దానిపైనా స్పష్టత లేదు. ముందస్తు ఒప్పందం ప్రకారం నవంబర్ 29 నుంచి డెమరేజ్ లెక్కవేయాలి. కానీ అప్పటికే తుపాను కారణంగా పోర్టులో మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ కావడం, డిసెంబర్ 4 వరకు వాతావరణం అనుకూలంగా లేకపోవడం కారణాలు చూపుతూ అప్పటివరకు డెమరేజ్ వేయడానికి వీల్లేదని ఎగుమతిదారులు గట్టిగా పట్టుబడుతున్నారు. దీంతో డిసెంబర్ 5 నుంచి డెమరేజ్ వేయడానికి స్టెల్లా యాజమాన్యం నిర్ణయించిందని సమాచారం. నౌకకు రోజుకు అయ్యే అన్ని ఖర్చులు కలిపి 22,000 యూఎస్ డాలర్లు.. అంటే రూ.18.73 లక్షలు చెల్లించాలని లెక్కకట్టారు. ఒక్కసారి డెమరేజ్ తేదీని నిర్థారిస్తే తుపానులు, వాయుగుండాలు వచ్చినా చెల్లించాల్సిందే. ఈ లెక్కన డిసెంబర్ 5 నుంచి ఇంతవరకు డెమరేజ్ రూపంలో రూ.7.11 కోట్లు చెల్లించాలి. నౌక నిలిచిపోవడానికి కారణమైన పీడీఎస్ బియ్యం మొత్తం బాలాజీ ఎక్స్‌పోర్టర్స్ కంపెనీదే కావడం వల్ల ఆ సంస్తే డెమరేజ్ మొత్తం చెల్లించాలని మిగతా వారి వాదన. కాకినాడ పోర్టులో ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా మినహాయింపు ఇవ్వాలని ఎగుమతిదారులు కోరినా షిప్పర్ అంగీకరించలేదు. పవన్ చేసిన హడావుడి వల్ల తాము నష్టపోతున్నామని ఎగుమతిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
పీడీఎస్ బియ్యం ఉన్నా షిప్‌ను సీజ్ చెయ్యలేం
సాక్షి, విశాఖపట్నం: సరకు రవాణా చేసే కార్గో షిప్లో అక్రమంగా తరలించిన పీడీఎస్ బియ్యం ఉంటే.. షిప్ మొత్తం సీజ్ చెయ్యలేమనీ, బియ్యం ఉన్న కంటైనర్‌ని మాత్రమే సీజ్ చెయ్యగలమని విశాఖపట్నం కస్టమ్స్ అండ్ సెంట్రల్ ట్యాక్స్ ప్రిన్సిపల్ కమిషనర్ ఎన్.శ్రీధర్ స్పష్టం చేశారు. అదేవిధంగా.. పీడీఎస్ బియ్యం రవాణా చేసిన వారిపైనే చర్యలు తీసుకోగలం తప్ప.. షిప్‌పై చర్యలు తీసుకోలేమని చెప్పారు. విశాఖలోని కస్టమ్స్ కార్యాలయంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కాకినాడ పోర్టులో ఇటీవల పీడీఎస్ బియ్యం ఎగుమతి అవుతోందని, కస్టమ్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తోందంటూ కథనాలు వచ్చిన నేపథ్యంలో స్టేక్ హోల్డర్లతో సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. సివిల్ సప్లైస్ ఎన్వోసీ తప్పనిసరిపోర్టులోకి వచ్చిన ఏ సరుకైనా నేరుగా షిప్‌లోకి లోడ్ చేసే ప్రసక్తే లేదని చెప్పారు. ప్రతి సరుకుకు సంబంధించిన పత్రాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే షిప్‌లోకి ఎక్కించేందుకు కస్టమ్స్ అనుమతిస్తుందని స్పష్టం చేశారు. బియ్యం విషయంలోనూ పక్కాగా పరిశీలన ఉంటుందన్నారు. కస్టమ్స్ విభాగం ఎలాంటి అనధికార బియ్యం ఎగుమతి, దిగుమతుల్ని ప్రోత్సహించదని స్పష్టం చేశారు. ఎన్ని చెక్‌పోస్టులు దాటి వచ్చినా, అన్ని డాక్యుమెంట్స్ వచ్చిన తర్వాతే కస్టమ్స్ నుంచి లోడింగ్‌కు అనుమతి ఉంటుందని తెలిపారు. ఏ బియ్యమైనా సరే.. పీడీఎస్ బియ్యం కాదు అని పౌర సరఫరాల శాఖ ఇచ్చే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్వోసీ) చెకింగ్ డాక్యుమెంట్స్‌లో తప్పనిసరిగా ఉండాలని, అప్పుడే లోడింగ్‌కు అనుమతిస్తామని తెలిపారు. బియ్యం డాక్యుమెంట్స్ సరిగా లేకపోతే వాటిని నిలిపేస్తామని చెప్పారు. ఒకవేళ అనుమానం వచ్చి అవి పీడీఎస్ బియ్యమా కాదా అనేది తెలుసుకోవాలంటే పరీక్షకు పంపాలని, దాని ఫలితాలు 15 రోజులకు వస్తాయని తెలిపారు. అప్పుడే దానిపై చర్యలు తీసుకోగలమని అన్నారు. స్టేక్ హోల్డర్లతో అవగాహన సదస్సుఇటీవల కాకినాడ పోర్టులో పీడీఎస్ బియ్యం ఎగుమతి జరుగుతున్నాయన్న వార్తల నేపథ్యంలో విశాఖపట్నం జోన్ కస్టమ్స్, సెంట్రల్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్ సంజయ్ రెడ్డి, ప్రిన్సిపల్ కమిషనర్ ఎన్.శ్రీధర్ ఆధ్వర్యంలో కస్టమ్స్ కార్యాలయంలో శుక్రవారం ఏపీలోని వివిధ పోర్టుల స్టేక్ హోల్డర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రైస్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్, కోకనాడ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, కస్టమ్స్ బ్రోకర్స్ అసోసియేషన్, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ ఎంకరేజ్ పోర్ట్, స్టివడోర్స్ అసోసియేషన్, పౌర సరఫరాల శాఖ అధికారులు హాజరయ్యారు. పోర్టుల ద్వారా ఎలాంటి అక్రమ ఎగుమతి, దిగుమతులకు తావివ్వకుండా కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నామని, ఇకపై మరింత పకడ్బందీగా చర్యలు తీసుకుంటామని సంజయ్‌రెడ్డి తెలిపారు. ఈ విషయంలో స్టేక్‌హోల్డర్స్ సహకారాన్ని అందించాలని కోరారు. అక్రమ ఎగుమతులను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు కస్టమ్స్ శాఖ పూర్తిగా సహకరిస్తుందని చెప్పారు. బియ్యం ఎగుమతి విధి విధానాలు, నిబంధనలను ఎన్.శ్రీధర్ వివరించారు. బియ్యం ఎగుమతుల పత్రాలను పరిశీలనలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నౌక మొత్తం సీజ్ చెయ్యడం కుదరదుషిప్లో పొరపాటున పీడీఎస్ బియ్యం ఉన్నా.. నౌకని మొత్తం సీజ్ చెయ్యలేమని తెలిపారు. ఒక రవాణా నౌకలో ఎన్నో కంటైనర్లు ఉంటాయని, వాటిలో ఇతర కంపెనీలు, వ్యాపారులకు సంబంధించిన విభిన్న రకాల ఉత్పత్తులు కూడా ఉంటాయని తెలిపారు.అందువల్ల ఏవైనా అక్రమ రవాణా జరుగుతున్నట్లు గుర్తిస్తే.. సంబంధిత కంటైనర్‌ని మాత్రమే సీజ్ చెయ్యగలమని, షిప్ మొత్తాన్ని కాదని స్పష్టంచేశారు. చర్యలు కూడా అక్రమ రవాణాదారులపైనే ఉంటాయని, షిప్‌పై చర్యలు తీసుకోలేమని స్పష్టం చేశారు. -
KSR Live Show: షాడో సీఎం.. చక్రం తిప్పుతున్న లోకేష్
-
ఫుట్‌బాల్‌కూ ప్రాధాన్యత
యలమంచిలి(అనకాపల్లి రూరల్) : క్రికెట్‌తో పాటు రాష్ట్రంలో ఫుట్‌బాల్ క్రీడకూ సమాన ప్రాధాన్యత కల్పిస్తున్నామని ఏపీ ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ తెలిపారు. అనకాపల్లి జిల్లా యలమంచిలిలోని రాజీవ్ క్రీడా మైదానంలో ఆదివారం యలమంచిలి–విశాఖపట్నం జట్ల మధ్య జరిగిన ఫుట్‌బాల్ ఎగ్జిబిషన్ మ్యాచ్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కోటగిరి శ్రీధర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభావంతులైన ఫుట్‌బాల్ క్రీడాకారులను గుర్తించి, వారికి మంచి తర్ఫీదు ఇవ్వడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. ప్రపంచంలో అత్యంత ఆదరణ కలిగిన ఫుట్‌బాల్‌కు మన దేశంలో ఆదరణ తక్కువగా ఉందని, దీనిని పెంచడానికి ఏపీ ఫుట్‌బాల్ అసోసియేషన్ స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళుతోందని తెలిపారు. భవిష్యత్‌లో రాష్ట్రం నుంచి ప్రపంచస్థాయి క్రీడాకారులను తయారుచేసేందుకు కృషి చేయనున్నట్టు చెప్పారు. ఆసక్తి ఉన్న గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులకు తమవంతు సహాయ, సహకారాలు అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు. అంతకుముందు స్థానిక రాజీవ్ క్రీడా మైదానంలో యలమంచిలి, విశాఖ జట్ల క్రీడాకారులను పరిచయం చేసుకున్న శ్రీధర్ రెండు జట్ల మధ్య నిర్వహించిన ఎగ్జిబిషన్ మ్యాచ్‌ను తిలకించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఫుట్‌బాల్ అసోసియేషన్ హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ ఆర్ రాజే‹Ù, కోనసీమ ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు నీలాద్రి, ఎన్ఐఎస్ చీఫ్ కోచ్ ఎం.శేషుమోహన్, ఉత్తరాంధ్ర కో ఆర్డినేటర్ ఎస్జీ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
సోలార్‌పవర్‌తో ‘హైడ్రోజన్’
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/గోదావరిఖని: ఇప్పటికే సోలార్ విద్యుత్ రంగంలోకి అడుగిడిన ‘సింగరేణి’ మరో భారీ పర్యావరణహిత కార్యక్ర మానికి శ్రీకారం చుడు తోంది. సంస్థ నిర్వహణలో ఉన్న హైడ్రోజన్ ప్లాంట్‌ను గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్‌గా మార్చేందుకు సిద్ధమైంది. దీనిపై పరిశీలించి నివేదిక ఇవ్వాలని సింగరేణి సంస్థ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్(సీఎండీ) ఎన్.శ్రీధర్ సంస్థకు చెందిన విద్యుత్ విభాగానికి ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్‌లోని సింగరేణి భవన్లో తాజాగా జరిగిన ఈ సమావేశంలో దీనిపై చర్చించారు. హైడ్రోజన్ అవసరం థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో వాడే జనరేటర్లలోని వేడిని తగ్గించేందుకు శీతలీకరణ ధాతువుగా హైడ్రోజన్‌ను వినియోగిస్తున్నారు. ఇందుకు ప్లాంట్ ఆవరణలోనే ఒక హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేస్తారు. మంచిర్యాల జిల్లాలోని జైపూర్ వద్ద 1,200 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం ఉంది. ఈ ప్లాంట్‌లో ఉన్న హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రం ఏటా దాదాపు 10 వేల క్యూబిక్ మీటర్ల హైడ్రోజన్ వాయువును ఉత్పత్తి చేస్తోంది. గ్రీన్ హైడ్రోజన్ సాధారణంగా థర్మల్ విద్యుత్ వినియోగించి ఎలక్ట్రాలసిస్ రసాయనిక పద్ధతిలో హైడ్రోజన్ వాయువు ఉత్పత్తి చేస్తారు. అయితే థర్మల్ విద్యుత్‌కు బదులు సోలార్ విద్యుత్ వినియోగించి హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలని నిర్ణయించారు. ఇలా ఉత్పత్తి చేసే హైడ్రోజన్‌ను ‘గ్రీన్ హైడ్రోజన్’గా పేర్కొంటారు. సింగరేణి పవర్ ప్లాంట్‌లో హైడ్రోజన్ ఉత్పత్తి కోసం 100 కిలోవాట్ థర్మల్ విద్యుత్‌ను వినియోగిస్తుండగా, రాబోయే రోజుల్లో థర్మల్ బదులుగా సోలార్ విద్యుత్ ఉపయోగిస్తారు. జైపూర్‌లోనే... జైపూర్‌లోని సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్ర ప్రాంగణంలోనే ప్రస్తుతం 10 మెగావాట్ల సోలార్ విద్యుత్ కేంద్రం, ఐదు మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లు ఉన్నాయి. అక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్ నేరుగా హైడ్రోజన్ ప్లాంట్‌కు అనుసంధానం చేస్తారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రామగుండం రీజియన్‌లోనే మరో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఏర్పాటుకు సాధ్యాసా«ధ్యాలను పరిశీలించాలని చైర్మన్ సూచించారు. సోలార్ పవర్ ద్వారా హైడ్రోజన్ ఉత్పత్తి మొదలైతే దేశంలోనే గ్రీన్ హైడ్రోజన్ వినియోగిస్తున్న తొలి థర్మల్ విద్యుత్ కేంద్రంగా సింగరేణి నిలుస్తుంది. జియోపై దృష్టి వేడినీటి ఊట ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసే దిశగా సింగరేణి ప్రయోగాత్మకంగా జియో థర్మల్ ప్రాజెక్ట్ చేపట్టింది. అందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు వద్ద మూడేళ్ల నుంచి పరిశోధనలు జరుగుతున్నాయి. దీంతో పాటు సింగరేణి థర్మల్ పవర్ స్టేషన్లోనే మిథనాల్ ప్రాజెక్ట్‌పై పరిశోధనలు కొనసాగుతున్నాయి. త్వరలోనే ఈ రెండు ప్రాజెక్టులు కూడా పూర్తి చేయాలని సీఎండీ శ్రీధర్ ఆదేశించారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరునెలల్లో సింగరేణిలోని సోలార్ ప్లాంట్ల ద్వారా 170 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేశామని, తద్వారా ట్రాన్సోకు చెల్లించే విద్యుత్ బిల్లులో రూ.108 కోట్లు ఆదా చేసుకోగలి గామన్నారు. ఈ సమీక్ష సమావేశంలో డైరెక్టర్ డి.సత్యనారా యణరావు, సీటీసీ సంజయ్‌కుమార్ సూర్, చీఫ్ ఓఅండ్ఎం జే.ఎన్.సింగ్, సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం జనరల్ మేనేజర్ చినబసివి రెడ్డి, జనరల్ మేనేజర్(సోలార్) జానకీరాం, చీఫ్ ఆఫ్ పవర్ ఎన్వీకేవీ.రాజు, జీఎం సూర్య నారాయణ, ఏజీఎంలు కేఎస్ఎన్.ప్రసాద్, సుధాకర్ పాల్గొన్నారు -
బాధతో పార్టీని వీడుతున్నా..
సాక్షి, మేడ్చల్ జిల్లా:/అల్వాల్: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ సోమవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు రాజీనామా పత్రాన్ని ఫ్యాక్స్ ద్వారా పంపినట్లు తెలిపారు. అల్వాల్‌లోని ఆయన నివాసం వద్ద సోమవారం మీడియాతో మాట్లాడారు. 30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాననీ, మల్కాజిగిరిలో పార్టీ కోసం పని చేస్తూ ప్రత్యర్థిగా ఉన్న మైనంపల్లి హన్మంతరావుతో విభేదించిన సందర్భంగా పలు కేసులు నమోదు అయ్యాయన్నారు. బీఆర్ఎస్లో తన కొడుకుకు టికెట్ రాకపోవడంతో మైనంపల్లి కాంగ్రెస్‌లో చేరారని ఈ క్రమంలో తనకు మల్కాజిగిరిలో పార్టీ టికెట్ ఇవ్వలేమన్న సంకేతాలు రావడం బాధించాయన్నారు. బీసీలకు అన్ని పార్టీలకన్నా అధిక సీట్లు ఇస్తామని ప్రకటించిన నాయకులు తన మాదిరిగా వెనుకబడిన తరగతి నుండి వచ్చిన వ్యక్తికి టికెట్ ఇవ్వకపోవడం చూస్తుంటే బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే సందేశం ఏమిటని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డికి దెబ్బే.. శ్రీధర్ రాజీనామాతో టీపీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్‌రెడ్డికి గట్టి షాక్ తగిలినట్లయింది. రేవంత్ ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం మేడ్చల్ జిల్లా పరిధిలో ఉండటం గమనార్హం. సొంత నియోజకవర్గానికి చెందిన జిల్లా పార్టీ అధ్యక్షుడ్ని కాపాడుకోలేని రేవంత్ రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఏవిధంగా అధికారంలోకి తీసుకు రాగలరన్న ప్రశ్నలు స్థానికంగా పార్టీ శ్రేణుల నుంచి తలెత్తుతున్నాయి. కాగా శ్రీధర్ బీఆర్ఎస్లో చేరుతారన్న ప్రచారం జరుగుతోంది. -
సింగరేణిలో బదిలీ వర్కర్ల క్రమబద్ధీకరణ
గోదావరిఖని/సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: సింగరేణి సంస్థలో బదిలీ వర్కర్లుగా పనిచేస్తున్న 2,266 మంది కార్మికులను జనరల్ మజ్దూర్లుగా క్రమబద్ధికరిస్తూ యాజమాన్యం ఆదేశాలు జారీచేసింది. ఏడాదిలో భూగర్భగనుల్లో 190 మస్టర్లు, ఉపరితలంలో 240 మస్టర్లు పనిచేసిన బదిలీ వర్కర్లను జనరల్ మజ్దూర్లుగా రెగ్యులరైజ్ చేశారు. ఈ మేరకు సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ ఆదేశాల మేరకు డైరెక్టర్ ఎన్.బలరాం శనివారం ఉత్తర్వులు జారీచేశారు. 2023 సెపె్టంబర్ 1వ తేదీ నుంచి ఇవి అమలులోకి వస్తాయని పేర్కొన్నారు. తొలిసారి 2017 అక్టోబర్‌లో ఒకేసారి 2,718 మంది బదిలీ వర్కర్లను జనరల్ మజ్దూర్లుగా క్రమబద్ధీకరించినట్లు ఆయన తెలిపారు. 2022 డిసెంబర్ 31వ తేదీకి ముందు సంస్థలో బదిలీ వర్కర్లుగా చేరినవారిలో కనీసం 190/240 మస్టర్ల అర్హత కలిగిన వారిని ఇప్పుడు జనరల్ మజ్దూర్లుగా రెగ్యులరైజ్ చేసినట్లు వెల్లడించారు. 2017 నుంచి ఇప్పటివరకు 13,981 మందిని రెగ్యులరైజ్ చేసినట్లు వివరించారు. ఏరియాల వారీగా ఇలా.. జనరల్ మజ్దూర్లుగా క్రమబద్ధికరణ అయినవారిలో ఏరియాల వారీగా పరిశీలిస్తే.. శ్రీరాంపూర్‌లో 677 మంది, ఆర్జీ–1లో 522, ఆర్జీ–2లో 51, ఆర్జీ–3, అడ్రియాలలో 323, భూపాలపల్లిలో 274, మందమర్రిలో 261, మణుగూరులో 79, బెల్లంపల్లిలో 32, ఇల్లెందు, కార్పొరేట్లో 38, కొత్త్తగూడెంలో 9 మందిని రెగ్యులరైజ్ చేశారు. సీఎం కేసీఆర్ హామీ మేరకు గతంలో బదిలీ వర్కర్లుగా ఉద్యోగంలో చేరిన కార్మికులకు జనరల్ మజ్దూర్లుగా గుర్తింపు రావడానికి కనీస మస్టర్లు ఉన్నప్పటికీ ఏళ్ల తరబడి నిరీక్షించాల్సి వచ్చేది. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీల మేరకు 2017 నుంచి ఎప్పటికప్పుడు బదిలీ వర్కర్లను జనరల్ మజ్దూర్లుగా క్రమబద్ధీకరిస్తున్నారు. పనిచేసే వారికి గుర్తింపు సింగరేణిలో బాగా పనిచేసే వారికి ఎప్పుడూ మంచి గుర్తింపు ఉంటుంది. గతంలో జనరల్ మజ్దూర్లుగా ఎంపికైన అనేక మంది మరింత శ్రద్ధగా పనిచేస్తూ కంపెనీ నిర్వహించిన ఇంటర్నల్ పరీక్షల్లో పాల్గొని పదోన్నతులు సాధించారు. ప్రతి ఒక్కరూ విధుల పట్ల అంకితభావంతో పనిచేస్తూ సంస్థ ఉన్నతితో పాటు మంచి లాభాలు, ఇన్సెంటివ్‌లు అందుకోవాలి. – ఎన్ బలరామ్, డైరెక్టర్ -
కొత్త ప్రపంచంలోకి వెళ్తారు
అశ్విన్ బాబు, నందితా శ్వేత జంటగా అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో గంగపట్నం శ్రీధర్ నిర్మించిన యాక్షన్ థ్రిల్లర్ ‘హిడింబ’. ఈ సినిమా నేడు (గురువారం) విడుదలవుతోంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో అశ్విన్‌బాబు మాట్లాడుతూ– ‘‘హిడింబ’ మంచి సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ ఫిల్మ్. ఈ సినిమా కాన్సెప్ట్ ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లి, సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ఇందులో నా లుక్ డిఫరెంట్‌గా ఉంటుంది. నెక్ట్స్ మెడికల్ మాఫియా నేపథ్యంలో ఓ సినిమా, ఓ స్పోర్ట్స్ ఫిల్మ్ చేయబోతున్నాను’’ అని అన్నారు. -
సింగరేణి వార్షిక లాభాలు రూ.2,222 కోట్లు
గోదావరిఖని: సింగరేణి ఆల్‌టైం రికార్డ్ సిరులు కురిపించింది. సంస్థ చరిత్రలోనే ఈ ఏడాది అత్యధిక లాభాలు ఆర్జించింది. కోల్ ఇండియాసహా మహారత్న కంపెనీలన్నింటి కన్నా లాభాల వృద్ధిలో అగ్ర స్థానంలో నిలిచింది. సింగరేణి సంస్థ చరిత్రలోనే అత్యధికంగా ఈ ఆర్థిక సంవత్సరం రూ.33,065 కోట్ల టర్నోవర్‌తో రూ.2,222 కోట్ల నికర లాభాలు సాధించినట్లు సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ శుక్రవారం వెల్లడించారు. బొగ్గు, విద్యుత్ అమ్మకాల ద్వారా మొత్తం రూ.3,074 కోట్ల స్థూల లాభాలను ఆర్జించగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర పన్నుల చెల్లింపుల అనంతరం రూ.2,222 కోట్ల నికర లాభాలు సాధించినట్లు ప్రకటించారు. సింగరేణి చరిత్రలోనే ఇది ఆల్‌టైం రికార్డు అని పేర్కొన్నారు. గతేడాది రూ.1,227 కోట్ల లాభాలు రాగా, ఈసారి 81 శాతం అధికంగా వచ్చాయని తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం టర్నోవర్ రూ.26,585 కోట్లుకాగా, ఈ ఏడాది రూ.33,065 కోట్లు సాధించామని, గతం కన్నా 24 శాతం అధికమని పేర్కొన్నారు. బొగ్గు అమ్మకాల ద్వారా రూ.28,650 కోట్లు, విద్యుత్ అమ్మకాల ద్వారా రూ.4,415 కోట్లు గడించినట్లు చెప్పారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత అత్యద్భుత వృద్ధి సింగరేణి సంస్థ తన 134 ఏళ్ల చరిత్రలో తెలంగాణ ఆవిర్భా వం తర్వాత అత్యద్భుత ప్రగతి సాధించిందని శ్రీధర్ తెలిపారు. బొగ్గు ఉత్పత్తిలో 33 శాతం, రవాణాలో 39, అమ్మకాల్లో 177 శాతం లాభాలతో 430 శాతం వృద్ధి సాధించిందన్నారు. థర్మల్ విద్యుత్ ఉత్పాదన ద్వారా గణనీయమైన టర్నోవర్, లాభాలు సాధించిందన్నారు. కార్మికులు ఉద్యోగులు అంకితభావంతో పని చేసి కంపెనీని దేశంలోనే అగ్రస్థానంలో నిలి పారని కొని యాడారు. లాభాల ద్వారా సింగరేణి మరిన్ని కొత్త ప్రాజెక్టులు, కార్మికులకు లాభాల్లో వాటా, మరిన్ని సంక్షేమ కార్య క్రమాలు చేపడతామని తెలిపారు. ఈ ఏడాది నిర్దేశిత లక్ష్యాలు సాధిస్తే రూ.4 వేల కోట్ల లాభాలు సాధించే అవకాశం ఉందన్నారు. -
తెలంగాణ విద్యుత్ సంస్థలకు కొత్త బాస్‌లు?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ సంస్థల సీఎండీలు, డైరెక్టర్ల మార్పు, కొత్తవారి నియామకంపై ఊహా గానాలు ఊపందుకున్నాయి. కొత్త సీఎండీలు, డైరెక్టర్ల నియామకంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందని, ఇందుకు సంబంధించిన కసరత్తును ప్రారంభించిందని చెబుతున్నారు. సింగరేణి సంస్థ సీఎండీగా ఎనిమిదేళ్లుగా కొనసాగుతున్న ఎన్.శ్రీధర్.. ట్రాన్స్‌కో, జెన్కో సంస్థల సీఎండీ రేసులో ముందు వరుసలో ఉన్నట్టు సమాచారం. అయితే ఆయన ఇప్పటికే ఆయన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్ఎండీసీ సీఎండీగా ఎంపికైనా, ఇంకా నియామక ఉత్తర్వులు జారీ కాలేదు. శ్రీధర్ కాకుంటే, సీఎంకు అత్యంత విశ్వసనీయంగా ఉండే సీనియర్ ఐఏఎస్ అధికారుల్లో ఒకరిని ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీగా నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. తనకు విముక్తి కల్పించాలంటున్న ప్రభాకర్‌రావు.. తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో) సీఎండీగా, విద్యుత్ సరఫరా సంస్థ(ట్రాన్స్‌కో)ల ఇన్చార్జి సీఎండీగా డి.ప్రభాకర్‌రావు గత నెలతో 9 ఏళ్లు, 2019 జనవరి 10 నాటికి విద్యుత్ సంస్థల్లో 50 ఏళ్ల సుదీర్ఘ సర్వీసు పూర్తి చేసుకుని రికార్డు సృష్టించారు. ఆయన అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్‌గా 1969 జనవరి 10న ఎలక్ట్రిసిటీ బోర్డులో చేరారు. విద్యుత్ రంగానికి సంబంధించిన విధానాల రూపకల్పన, నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించారు. తెలంగాణ స్టేట్ పవర్ కోఆర్డినేషన్ కమిటీ (టీఎస్పీసీసీ) చైర్మన్ హోదాలో ఆయన డిస్కంల నిర్వహణను సైతం పర్యవేక్షించారు. ఆయనకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (స్పెషల్ సీఎస్) హోదాను కట్టబెట్టి ప్రభుత్వం పెద్దపీట వేసింది. ప్రస్తుతం 76 ఏళ్ల వయస్సులో ప్రభాకర్‌రావు వయోభారం, అనా రోగ్య సమస్యలతో ఇబ్బందులు పడు తున్నారు. తనను బాధ్యతల నుంచి తప్పిస్తే విశ్రాంతి తీసు కుంటానని గతంలో ఆయన విజ్ఞప్తి చేయగా సీఎం కేసీఆర్ తిరస్కరించారు. ఈ నేపథ్యంలోనే గత నెల రోజులుగా ఆయన బహిరంగ సభల్లో తనకు బాధ్యతల నుంచి విముక్తి కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. సమీప భవిష్యత్తులో తాను బాధ్యతల నుంచి తప్పు కున్నా మరో విధంగా భావించవద్దని విద్యుత్ ఉద్యోగులకు ఆయన తాజా గా విజ్ఞప్తి చేశారు. తన విజ్ఞప్తులపై ప్రభుత్వం నుంచి సాను కూల సంకేతాలు అందిన నేపథ్యంలోనే ఆయనీ ప్రకటనలు చేశారని విద్యుత్ శాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 80 ఏళ్లకు చేరువలో ఉత్తర డిస్కం సీఎండీ.. ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎన్పీ డీసీఎల్) సీఎండీగా ఎ.గోపాల్ రావు ఆరున్నరేళ్లు పూర్తి చేసుకున్నారు. ఆయన 2003లో చీఫ్ ఇంజనీర్‌గా రిటైరయ్యారు. ప్రస్తు తం ఆయన వయస్సు 78 ఏళ్లకు పైనే. వరంగల్ కేంద్రంగా పనిచేస్తున్న ఆయన వృద్ధాప్య సమ స్యల వల్ల తరుచుగా హైదరాబాద్‌కు రావాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విద్యుత్ శాఖ వర్గాలు చెబుతు న్నాయి. ఆయన స్థానంలో కొత్త అధికారిని నియమించే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని అంటున్నాయి. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) సీఎండీగా జి.రఘుమా రెడ్డి సైతం ఈ నెలలో 9 ఏళ్లను పూర్తి చేసుకోనున్నారు. ప్రస్తుతం ఆయన వయస్సు కూడా 71 ఏళ్లకు పైనే. ఒక వేళ ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీగా నాన్ ఐఏఎస్ అధికారిని నియమించాలని ప్రభుత్వం భావిస్తే ఈయన పేరును సైతం పరిశీలించే అవకాశం ఉంది. డైరెక్టర్లు కూడా దీర్ఘకాలంగా.. టీఎస్ఎస్పీడీసీఎల్లో 8 మంది, టీఎస్ఎన్పీ డీసీఎల్‌లో ఆరుగురు, ట్రాన్స్‌కోలో జేఎండీ, మరో నలుగురు డైరెక్టర్లు, జెన్కోలో ఆరుగురు డైరెక్టర్లు ఉన్నారు. వీరిలో చాలామంది 9 ఏళ్లకు పైగా ఆయా పదవుల్లో కొనసాగు తున్నారు. వీరిలో చాలామంది 70 ఏళ్లకు పైబడిన వారే. కొన్ని విద్యుత్ సంస్థల్లో డైరెక్టర్ల సంఖ్య మంజూరైన పోస్టు ల సంఖ్య కంటే పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో కొందరు డైరెక్టర్లను సాగనంపి వారి స్థానంలో కొత్తవారిని నియమించే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. -
ఏపీలో స్టార్టప్‌లకు భారీ ప్రోత్సాహం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో స్టార్టప్‌లకు భారీ ప్రోత్సాహానికి కీలక అడుగులు పడుతున్నాయి. రాష్ట్రంలోని స్టార్టప్‌లన్నింటికీ ఒకే చోట అన్ని పరిష్కారాలు లభించేలా ఏపీ స్టార్టప్ డాట్ ఇన్ పేరుతో ప్రత్యేకంగా ఒక పోర్టల్ ఏర్పాటు చేయడమే కాకుండా వాటికి అవసరమైన నిధులను సమకూర్చేవిధంగా ఇన్నొవేషన్ ఫండ్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. దేశంలోనే టాప్ ఫండింగ్ కంపెనీల్లో ఒకటైన సక్సీడ్ ఇండోవేషన్ ఫండ్ రాష్ట్రంలోని స్టార్టప్‌లకు ఆర్థిక సాయం చేయడానికి ముందుకొచ్చింది. ఇందులో భాగంగా తొలి దశలో ఏడు స్టార్టప్‌లతో ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయని, మరో రెండు దశల తర్వాత ఎంపికైన సంస్థలకు ఫండింగ్ మొదలవుతుందని ఐటీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఐటాప్) చైర్మన్ శ్రీధర్ కోసరాజు ‘సాక్షి’కి తెలిపారు. ఏపీ స్టార్టప్స్, డీప్‌టెక్ ఇండియాలు సక్సీడ్ ఇండోవేషన్ ఫండ్ భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. గుజరాత్ రాష్ట్రంలో సుమారు రూ.1,000 కోట్లతో ఇన్నోవేషన్ ఫండ్ ఏర్పాటు చేసిన విధంగానే రాష్ట్రంలో కూడా ఏర్పాటు చేయనున్నామని, దీనికి కేంద్ర ఐటీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖరన్ స్ఫూర్తినిచ్చినట్లు తెలిపారు. గుజరాత్ తరహాలోనే ప్రారంభంలో రూ.100 కోట్లతో స్టార్టప్ ఫండ్ స్టార్ట్ చేస్తే దానికి కేంద్రం నుంచి కూడా అంతేమొత్తం అందించేలా తోడ్పాటును అందిస్తానని చెప్పారన్నారు. దీంతో ఏపీ స్టార్టప్ పేరుతో ఏర్పాటు చేస్తున్న ఈ ఫండింగ్ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడానికి సక్సీడ్ ఇండోవేషన్ ఫండ్ ముందుకు వచ్చిందన్నారు. ఆ సంస్థ భాగస్వాములు రమేష్ లోగనాథం, విక్రాంత్ వర్షిణి విశాఖలోని 40 మందికిపైగా హైనెట్వర్త్ ఇన్వెస్టర్లు, స్టార్టప్‌లతో చర్చలు జరిపినట్లు తెలిపారు. ఎంపికైన స్టార్టప్‌కు రూ.50 లక్షల నుంచి రూ. 8 కోట్ల వరకు సక్సీడ్ సమకూరుస్తుందన్నారు. ప్రారంభంలో రూ.200 కోట్లతో నిధి ఏర్పాటు చేసి, అనంతరం రూ.1,000 కోట్లకు చేర్చి స్టార్టప్ హబ్‌గా ఏపీని తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. -
వాకపల్లి అత్యాచార కేసు కొట్టివేత
సాక్షి, పాడేరు(అల్లూరి సీతారామరాజు జిల్లా)/ విశాఖ లీగల్: వాకపల్లి గిరిజన మహిళలపై అత్యాచారం కేసులో గురువారం తీర్పు వెలువడింది. విచారణ అధికారుల వైఫల్యం కారణంగా ఈ కేసును కొట్టివేస్తున్నట్లు విశాఖలోని ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు జడ్జి ఎల్.శ్రీధర్ ప్రకటించారు. బాధితులకు నష్టపరిహారం ఇచ్చేందుకు విశాఖ జిల్లా న్యా య సేవా ప్రాధికార సంస్థ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. విచారణాధికారి శివానందరెడ్డి సరిగ్గా విచారణ చేయనందున శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తి సిఫార్సు చేశారు. వివరాలు.. 2007 ఆగస్టు 20వ తేదీన అప్పటి విశాఖ జిల్లాలోని వాకపల్లిలో 11 మంది గిరిజన మహిళలు తమపై ప్రత్యేక పోలీస్ దళం(గ్రేహౌండ్స్) సిబ్బంది సామూహిక అత్యాచారానికి పాల్ప డ్డారని ఫిర్యాదు చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ సంఘాలు ఉద్యమించాయి. అప్పటి ప్రభుత్వం 21 మంది పోలీసులపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసింది. బి.ఆనందరావును విచారణాధికారిగా నియమించగా కొంతకాలానికి ఆయన మరణించారు. ఆ తర్వాత శివానందరెడ్డి విచారణాధికారిగా వ్యవహరించారు. మొ త్తం 13 మందిని నిందితులుగా గుర్తించారు. ప్రాసిక్యూషన్ 38 మంది సాక్షులను విచారించింది. సుదీర్ఘ విచారణ తర్వాత కేసును కొట్టివేస్తూ కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. కాగా, 11 మంది మహిళల్లో ఇద్దరు అనారో గ్య సమస్యలతో మరణించారు. అప్పటి ప్రభుత్వం నష్ట పరిహారం మంజూరు చేయగా.. బాధితులు నిరాకరించారు. -
Andhra Pradesh: పారిశ్రామిక అభివృద్ధిలో నూతన విప్లవం
సాక్షి, విశాఖపట్నం : రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిలో నూతన విప్లవానికి తెరతీస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రకటించింది. 2023–27 సంవత్సరాలకు రూపొందించిన ఈ పాలసీని పారిశ్రామికవేత్తల సమక్షంలో ఆవిష్కరించడం విశేషం. పాత పాలసీ గడువు ముగియకముందే కొత్త పాలసీని ప్రకటించడం కూడా ఇదే తొలిసారి. సోమవారం విశాఖలో పారిశ్రామికవేత్తలతో కూడిన సమావేశంలో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి గుడివాడ అమర్నాధ్ నూతన పారిశ్రామిక విధానాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి దోహదం చేసేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా నిర్మాణాత్మక ఇండస్ట్రియల్ పాలసీని ప్రభుత్వం రూపొందించింది. నూతన విధానం పారిశ్రామికాభివృద్ధిలో విప్లవాన్ని సృష్టిస్తుందని పారిశ్రామికవేత్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ నెల 31తో పాత విధానం ముగియనుండటంతో ఏప్రిల్ 1 నుంచి నూతన పారిశ్రామిక విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనుంది. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ సలహాదారు శ్రీధర్, ఆ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల వలవన్, జేడీ రామలింగరాజు, డైరెక్టర్ డా.జి. సృజన, ఏపీఐడీసీ చైర్పర్సన్ బండి పుణ్యశీల, సీఐఐ ఏపీ చాప్టర్ వైస్ చైర్మన్ డా.మురళీకృష్ణ, రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. నంబర్ వన్ ఇండస్ట్రియల్ రాష్ట్రంగా ఏపీ :మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రపంచ పెట్టుబడుల గమ్యస్థానంగా, నంబర్ వన్ ఇండస్ట్రియల్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ముందడుగు వేస్తోంది. సాధారణంగా ప్రభుత్వాలు పాలసీ కాల పరిమితి పూర్తయినప్పటికీ కూడా కొత్త పాలసీని తేవడానికి కొంత సమయం తీసుకుంటాయి. దీనివలన పారిశ్రామికవేత్తలు ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇకపై ఈ పరిస్థితి ఉండకూడదని, పాత పాలసీ ముగియకముందే కొత్తది అమలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. నూతన విధానం ద్వారా రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి, ఉపాధి కల్పనపై తనకున్న నిబద్ధతను సీఎం జగన్ చాటుకున్నారు. కొత్త పాలసీ రాష్ట్ర ఆర్థిక ప్రగతికి దోహదం చేస్తుంది. గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసిన రంగాలకు పెద్దపీట వేశాం. పారిశ్రామిక రంగంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మహిళలకు అధిక ప్రాధాన్యమిస్తున్నాం. ఫుడ్ ప్రాసెసింగ్, వైద్య పరికరాల తయారీ, గ్రీన్ హైడ్రోజన్, పునరుత్పాదక ఇంధనవనరుల రంగాల్లో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు రానున్నాయి. డిఫెన్స్, ఏరోస్పేస్ రంగాల్లో రూ.15 వేల కోట్ల జాయింట్ వెంచర్ ప్రారంభిస్తున్నాం. రాష్ట్రంలోని 974 కిలోమీటర్ల సముద్రతీర ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటూ పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణంతో పాటు, వీటిని ఆనుకుని సుమారు 48 వేల ఎకరాలలో పోర్టు ఆధారిత పరిశ్రమలను ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. జల రవాణాను కూడా ప్రోత్సహిస్తున్నాం. పీపీపీ కింద ఇండస్ట్రియల్ పార్కులతో పాటు ప్రైవేట్ ఎంఎస్ఎంఈ పార్కుల్ని ఏర్పాటు చేస్తున్నాం. వాక్ టు వర్క్ కాన్సెప్ట్‌ని అన్ని పరిశ్రమలకు తీసుకొస్తాం. ఇన్నోవేషన్ రంగాన్ని ప్రోత్సహించేందుకు విశాఖలో ఐ స్పేస్ పేరుతో ఐకానిక్ టవర్ నిర్మించనున్నాం. నూతన పారిశ్రామిక విధానాన్ని సద్వినియోగం చేసుకుని పారిశ్రామికవేత్తలు రాష్ట్ర ఆర్థిక ప్రగతికి తోడ్పడాలి. దుబాయ్ తరహాలో ఇండస్ట్రియల్ పార్క్ : స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల వలవన్ ప్రపంచం నలుమూలల నుంచి పెట్టుబడుల్ని ఆకర్షించడంతో పాటు అన్ని వర్గాల పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించే అత్యుత్తమ పారిశ్రామిక విధానమిది. పరిశ్రమల్ని ఏపీలోనే ఎందుకు ఏర్పాటు చేయాలి, ఇక్కడి ప్రత్యేకతలు, వనరులు మొదలైన అంశాలన్నీ తెలిసేలా నూతన విధానాన్ని రూపొందించాం. కొత్త పాలసీ ద్వారా వైజాగ్‌లో ఇంక్యుబేషన్ సెంటర్ ఆధ్వర్యంలో ఆవిష్కరణల్ని, స్టార్టప్‌లకు చేయూతనందిస్తాం. ఎంఎస్ఎంఈ సెక్టార్లో ఆర్ అండ్ డీ సెంటర్స్‌ని ప్రోత్సహిస్తాం. పాలసీ అద్భుతంగా ఉంది:సీఐఐ ఏపీ చాప్టర్ వైస్ చైర్మన్ డా.మురళీకృష్ణ ప్రస్తుత పాలసీకంటే అద్భుతంగా కొత్త విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. ఒక పారిశ్రామికవేత్త ఏం కోరుకుంటారో వాటన్నింటినీ ఇందులో పొందుపరిచారు. లాజిస్టిక్స్ రంగానికి ప్రాధాన్యమివ్వడం అద్భుతం : శ్రవణ్ షిప్పింగ్ ఎండీ సాంబశివరావు 2023–27 పారిశ్రామిక విధానంలో అనేక నూతన అవకాశాలు, వనరులు, ప్రోత్సాహకాలు అందించారు. ఇది పారిశ్రామిక రంగానికి కొత్త ఊపిరి పోసినట్లే. దీర్ఘకాలంగా డిమాండ్ చేస్తన్న లాజిస్టిక్స్, వేర్ హౌసింగ్‌కు పరిశ్రమ హోదా ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నాం. ఎంఎస్ఎంఈలకు పెద్ద పీట : ఏపీ చాంబర్స్ ప్రెసిడెంట్ పైడా కృష్ణప్రసాద్ నూతన విధానం అత్యధిక మందికి ఉపాధి కల్పించే ఎంఎస్ఎంఈ రంగాన్ని ప్రోత్సహించేలా రూపొందించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రత్యేక రాయితీలు ఇవ్వడంతోపాటు ఎస్జీఎస్టీ 100 శాతం రీయింబర్స్మెంట్ మంచి సంకేతం. పరిశ్రమలకు కావాల్సింది మౌలిక వసతులే:ఫ్యాప్సీ అధ్యక్షుడు కరుణేంద్ర పరిశ్రమలు ఆర్థిక రాయితీలకంటే మౌలిక వసతుల కల్పనకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి. దీనికి అనుగుణంగా నూతన పాలసీలో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పారిశ్రామిక మౌలిక వసతులు, సులభతర వాణిజ్యంకు పెద్ద పీట వేయడాన్ని స్వాగతిస్తున్నాం. పరిశ్రమలకు ఊతమిచ్చే పాలసీ :సీఐఐ ఏపీ చాప్టర్ చైర్మన్ ఎం.లక్ష్మీ ప్రసాద్ రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి ఊతమిచ్చే విధంగా నూతన పారిశ్రామిక విధానం ఉంది. భారీ పరిశ్రమల నుంచి ఎంఎస్ఎంఈల వరకు పెట్టుబడులను ఆకర్షించే విధంగా పలు ప్రోత్సాహకాలను ప్రకటించారు. పరిశ్రమలకు చెందిన 96 అనుమతులు ఒకే చోట లభించేలా వైఎస్సార్ ఏపీ వన్ యాప్‌ను తేవడం హర్షణీయం. పోర్టు ఆధారిత వ్యాపారాభివృద్ధి, ప్రపంస్థాయి మౌలిక వసతులు, రెడీ టు బిల్డ్ ఫ్యాక్టరీల నిర్మాణం, ప్రైవేటు రంగంలో పారిశ్రామిక పార్కుల అభివృద్ధి, స్టార్టప్‌ల కోసం ఐ–స్పేస్ పేరుతో టవర్ నిర్మాణం వృద్ధికి దోహదం చేస్తాయి. నూతన విధానంలో ప్రధానాంశాలు.. ♦ ప్లగ్ అండ్ ప్లే విధానానికి అనుగుణంగా పాలసీ ♦ వనరుల ఆధారంగా అత్యాధునిక మౌలిక సదుపాయాల కల్పన ♦ వ్యాపారాన్ని సులభతరం చేయడం, పెద్ద ఎత్తున ఉపాధి కల్పన లక్ష్యం ♦ పరిశోధనలకు చేయూత, అంకుర పరిశ్రమలకు ప్రోత్సాహం ♦ తయారీ, అనుబంధ రంగాలు సహా అన్ని రకాలపరిశ్రమల పెట్టుబడిదారులకు పలు రాయితీలు ♦ ఎర్లీబర్డ్ పరిశ్రమలకు ప్రత్యేక రాయితీలు ♦ ఎలాంటి ఆంక్షలు లేని పెట్టుబడుల వాతావరణం ♦ లో కాస్ట్, లో రిస్క్ బిజినెస్ ♦ పీపీపీ విధానంలో ఇండస్ట్రియల్ పార్కుల అభివృద్ధి ♦ ప్రైవేట్ ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు ♦ అంతర్జాతీయ కనెక్టివిటీ, తయారీ రంగంలో ఎకో సిస్టమ్ ♦ దుబాయ్ తరహాలో బెస్ట్ ఇండస్ట్రియల్ పార్క్ అభివృద్ధి ♦ పర్యావరణ పరిరక్షణ, అన్ని జిల్లాల్లోనూ పారిశ్రామిక వికేంద్రీకరణ ♦ తొలిసారిగా ఆపరేషనల్ గైడ్‌లైన్స్‌లో భూ కేటాయింపులు, రద్దు మొదలైనవి -
పోలవరం ముంపు జాబితాలోకి మరో 36 గ్రామాలు
వేలేరుపాడు (ఏలూరు జిల్లా): పోలవరం ప్రాజెక్ట్ ముంపు కాంటూర్ లెవల్స్‌తో సంబంధం లేకుండా గత ఏడాది వచ్చిన గోదావరి వరదలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం మరో 36 గ్రామాలను మొదటి దశ ముంపు జాబితాలోకి చేరుస్తోంది. ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల పరిధిలో మొత్తం 20,946 మంది నిర్వాసితులు ఉండగా.. కొత్త జాబితా ప్రకారం ఏలూరు జిల్లాలోని వేలేరుపాడు, కుక్కునూరు, అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలోని చింతూరు, వీఆర్ పురం, కూనవరం మండలాల్లోని 36 గ్రామాలకు సంబంధించిన మరో 13,937 మంది నిర్వాసితులను చేర్చనున్నారు. దీంతో మొత్తం నిర్వాసితుల సంఖ్య 34,883కు పెరుగుతోంది. త్వరలో ఆయా గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించనున్నారు. కొత్తగా చేరిన గ్రామాలివీ కొత్త జాబితాలో వేలేరుపాడు మండలంలోని పేరంటపల్లి, తూర్పుమెట్ట, టేకూరు, కాకినూరు, కాచారం, ఎర్రమెట్ట, ఎడవల్లి, టేకుపల్లి గ్రామాల్లో 901 మంది నిర్వాసితులను జాబితాలో చేరనున్నాయి. కుక్కునూరు మండలంలోని కౌడిన్యముక్తి, చీరవల్లి మాధవరం, బెస్తగూడెం, ఆంబోతులగూడెం, చెరువుకొమ్ముగూడెం, రావిగూడెం, ఎల్లప్పగూడెం, ఎర్రబోరు, గుడంబోరు, ముత్యాలంపాడు గ్రామాల్లో 2,123 మంది కొత్త నిర్వాసితులు చేరతారు. చింతూరు మండలంలోని చింతూరు, రామవరంపాడు, ప్రతిపాక, గుండుగూడెం, వడ్డిగూడెం, వీఆర్‌పురం మండలంలోని వీఆర్‌పురం, ధర్మతాళ్లగూడెం, రాజ్పేటకాలనీ, ఎ.వెంకన్నగూడెం, చింతరేగుపల్లి, కూనవరం మండలంలోని టేకుబాక, కూనవరం, టేకులబోరు, కొడ్రాజుపేట, పెద్దార్కూరు, పండురాజుపల్లి, శబరికొత్తగూడెం తదితర గ్రామాలను కొత్త జాబితాలో చేరుస్తున్నారు. కాంటూర్ లెవల్స్‌తో సంబంధం లేదు కొత్త జాబితాలో చేర్చే గ్రామాలకు, పోలవరం ప్రాజెక్ట్ కాంటూర్ లెవల్స్‌కు సంబంధం లేదు. ఏటా వచ్చే వరదలకు వల్ల నిర్వాసితులు పడే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆయా జిల్లాల కలెక్టర్లు ఇచ్చిన నివేదికల ఆధారంగా రెండు జిల్లాల్లో 36 గ్రామాలను ముంపు జాబితాలో చేర్చే ప్రక్రియ ప్రారంభించాం. మొదటి ప్రాధాన్యతగా ఆర్ అండ్ ఆర్ పరిహారం అందిస్తాం. – చెరుకూరి శ్రీధర్, ఆర్ అండ్ ఆర్ కమిషనర్ -
రాజస్తాన్‌లోనూ ఏపీ తరహా రైతు సేవలు
సాక్షి, అమరావతి: ఏపీలో రైతులకు అందిస్తున్న సేవలు అద్భుతమని.. తమ రాష్ట్రంలో కూడా వాటి అమలుకు కృషి చేస్తామని రాజస్తాన్ వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు చెప్పారు. గతేడాది జూలైలో ఏపీలో పర్యటించిన రాజస్తాన్ వ్యవసాయ శాఖ మంత్రి లాల్‌చంద్ కటారియా ఆర్బీకే ద్వారా అందిస్తోన్న సేవలపై ప్రశంసలు కురిపించారు. ఈ తరహా సేవలను తమ రాష్ట్రంలో కూడా అమలు చేసేందుకు.. త్వరలోనే ఉన్నతాధికారుల బృందాన్ని పంపిస్తానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో మంత్రి ఆదేశాల మేరకు ఆ రాష్ట్ర సీడ్ మార్కెటింగ్ చీఫ్ మేనేజర్ కేసీ మీనా నేతృత్వంలో వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు అజయ్‌కుమార్ పచోరి, రాకేశ్ కుమార్ అతల్, దన్వీర్ వర్మ, తారాచంద్ బోచా లియా ఏపీకి వచ్చారు. బుధవారం గన్నవరంలోని ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్, ఆర్బీకే చానల్‌ను సందర్శించి.. వాటి పనితీరును అ«ధ్యయనం చేశారు. రాజస్తాన్‌లోని కాల్ సెంటర్‌ను కూడా ఏపీలో మాదిరిగా బలోపేతం చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఆర్బీకే చానల్ నిర్వహణ, రైతు భరోసా మ్యాగజైన్, ఈ క్రాప్ నమోదు చాలా వినూత్నంగా ఉన్నాయని పేర్కొన్నారు. మరో 2 రోజుల పాటు ఆర్బీకే, ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్, ఇతర సేవలను అధ్యయనం చేసి.. తమ రాష్ట్రంలో కూడా ఈ తరహా సేవల అమలు కోసం నివేదిక అందజేస్తామన్నారు. పర్యటనలో ఆర్బీకేల జాయింట్ డైరెక్టర్ వల్లూరి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
HYD: సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను ఉప్పరపల్లి కోర్టులో పోలీసులు హాజరుపర్చారు. ట్రాన్సిట్ వారెంట్ అనుమతి కోరుతూ ఢిల్లీ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. కాగా, ఎస్కార్ట్ కంపెనీ మాజీ వైస్ ప్రెసిడెంట్ అనిల్ నందా ఫిర్యాదుతో సంధ్యా శ్రీధర్‌పై కేసు నమోదైంది. ఢిల్లీ, లూథియానాలో ఉన్న భూములను ఫోర్జరీ సంతకాలతో శ్రీధర్ అమ్మినట్లు సమాచారం. సుమారు రూ. 200 కోట్ల రూపాయల విలువైన భూములను ఫోర్జరీ డాక్యుమెట్లతో మోసాలకు పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు. రూ.180 కోట్లు చెల్లించినట్లు తన దగ్గర డాక్యుమెంట్లు ఉన్నాయని, అమితాబచ్చన్ బంధువులను మోసం చేయలేదన్న శ్రీధర్.. న్యాయ పోరాటం చేస్తానన్నారు. చదవండి: అమ్మకానికి హెచ్ఎండీఏ భూములు.. ప్లాట్ల ఆన్లైన్ వేలం ఎప్పుడంటే? -
ఈడీ విచారణకు హాజరైన PSR గ్రానైట్స్ అధినేత పాలకుర్తి శ్రీధర్
-
Book Review: అనువాదం ఒక సవాలు
‘భిన్న నేపథ్యాలు, కులాలు, మతాలు, ఇతివృత్తాలు, కథ నాలు, మాండలీకాలు ఉన్న 26 కథలను ఆంగ్లంలోకి అనువాదం చేయడమెట్లా? వాటిలోని విభిన్నతను, ప్రత్యేకతను అనువాదంలోకి తీసుకురావడమెట్లా?... ఇవీ అల్లాడి ఉమ, ఎం. శ్రీధర్‌లకు ఈ పుస్తకం అనువాదం సమయంలో వచ్చిన కొన్ని ప్రశ్నలు. ఇంగ్లిష్ అనువాదంలో వెలువడ్డ తెలుగు కథల సంక లనం ‘తెలుగు: ద బెస్ట్ షార్ట్ స్టోరీస్ అఫ్ అవర్ టైమ్స్’కు ఓల్గా సంపాదకులు. హార్పర్ పెరెన్నియల్ వాళ్ళు ప్రచురించారు. ‘గత ముప్పై ఏళ్ళల్లో వచ్చిన ముఖ్యమయిన కథల్లోంచి ఎంపిక చేసుకున్న ఈ 26 కథలు భారతీయ పాఠకులకు తెలుగు సాహిత్యం పట్ల ఆసక్తి కలిగిస్తే నా యత్నం, ప్రచురణకర్తల ఉద్దేశం, అనువాదకుల ప్రయత్నం నెరవేరినట్లే’ అంటారు ఓల్గా. ఈ పుస్తకంలోని రచనలనూ, రచయితలనూ తెలుగు పాఠకులకు పరిచయం చేయా ల్సిన అవసరం లేదు. ఈ కథలన్నీ మనల్ని కదిలించినవే, ఆలోచింప జేసినవే. తెలుగు కథకు సరిగ్గా నూటా ఇరవై ఏళ్ళు. వేలాది కథలు, వందలాది కథల సంపుటాలు ఈ శతాబ్ద కాలంలో వెలువడ్డాయి. ముఖ్యంగా 1990 నుండి వైవిధ్యమైన భావజాలాలు, అస్తిత్వాలు తెలుగు పాఠకులను కదిలించాయి. ఆ భిన్నత్వం అనుభవం నుండి, ప్రతిఘటన నుండి, ఉద్యమాల నుండి వచ్చింది. ఏ గొంతులు, మనుషులు, జీవితాలు, భాషలు సాహిత్యానికి వెలుపల ఉంచబడ్డాయో సరిగ్గా అవే, సాహిత్యం అంటే ఇదీ– కథ అంటే ఇదీ అంటూ ముందు కొచ్చాయి. అలాంటప్పుడు అన్ని కథల్లోంచి ఇరవై ఆరు కథలు ఎంపిక చేయాలంటే ఓల్గా తన ఉపోద్ఘాతంలో చెప్పినట్లు, కష్టమయిన పనే. ఈ సంకలనంలో సతీష్ చందర్ ‘డాగ్ ఫాదర్’, ఎండ్లూరి మానస ‘బొట్టు భోజనాలు’, పెద్దింటి అశోక్ కుమార్ ‘జుమ్మే కి రాత్’, కరుణ ‘నీళ్లు చేపలు’, పి. సత్యవతి ‘ఇట్లు స్వర్ణ’, కోట్ల వనజాత ‘ఇత్తు’, ఎం.ఎస్.కె. కృష్ణజ్యోతి ‘సముద్రపు పిల్లోడు’, వి. ప్రతిమ ‘మనిషి విత్తనం’, వి. చంద్రశేఖరరావు ‘ద్రోహ వృక్షం’, వాడ్రేవు వీరలక్ష్మీదేవి ‘బినామీ’, సన్నపురెడ్డి వెంక ట్రామిరెడ్డి ‘సేద్దెగాడు’, ఎం.ఎం.వినోదిని ‘ఒక విలన్ ఆత్మ హత్య’, కె.ఎన్. మల్లీశ్వరి ‘రెండంచుల కత్తి’, మల్లిపురం జగదీశ్ ‘ఇప్ప మొగ్గలు’, కేతు విశ్వనాథరెడ్డి ‘అమ్మవారి నవ్వు’, కొలకలూరి ఇనాక్ ‘కొలిమి’, మహమ్మద్ ఖదీర్ బాబు ‘గెట్ పబ్లిష్డ్’, జూపాక సుభద్ర ‘ఎంపీటీసీ రేణుకెల్లు’, అక్కినేని కుటుంబరావు ‘పనివాడితనం’, కె.వరలక్ష్మి ‘మంత్రసాని’, అట్టాడ అప్పల్నాయుడు ‘బతికి చెడ్డ దేశం’, షాజహానా ‘సిల్సిలా’, జి.ఆర్.మహర్షి ‘పురాగానం’, బి.ఎస్.రాములు ‘మెరుగు’, ఓల్గా ‘సారీ జాఫర్’, కుప్పిలి పద్మ ‘వే టు మెట్రో’ కథలు ఉన్నాయి. పలు భాషలు, పలు రాతలు, పలు రచయి తలు, పలు సందర్భాలు, పలు కాలాలు, కానీ ఒక అనువాదం! అందుకే అనువాదాన్ని పలు అంచుల కత్తి అనడం అతిశయోక్తి కాదేమో. తాము లేవనెత్తిన చర్చకు సమాధానమే అన్నట్లుగా, రచనల, రచయితల విభిన్నతను అనువాదాల్లోకి తీసుకు రావడానికి అల్లాడి ఉమ, ఎం. శ్రీధర్ తెలుగు పదాలను, ఉర్దూ మాటలను యథాతథంగా ఆంగ్లంలోకి తీసుకొచ్చారు. ‘నా తమిళ జీవితాన్ని, అనుభవాన్ని ప్రతిఫలించే ఆంగ్లం కావాలి’ అని మీనా కందసామి అన్న మాటలు గుర్తొస్తాయిక్కడ. అనువాదం అనువాదంలాగా ఉండాలా, అసలులాగే ఉండాలా, పదకోశం ఇవ్వాలా లేదా పాఠకులే కొంత ప్రయత్నించి అర్థం చేసుకోవాలా అన్న చర్చలు ఎప్పటికీ జరుగుతూనే ఉంటాయి. అయితే మూల కథలోని పదాలను అనువాదంలో అలాగే ఉంచేయడం ఎప్పుడూ ఒకలాగే పని చేయకపోవచ్చు. రచనల్లోని విభిన్నతే వాటిలోని నిగూఢ అర్థాలకు కూడా వర్తిస్తుంది కదా. (చదవండి: కాలానికి ముందు పయనించిన కవి) – కె. సునీతారాణి -
కథ: ‘నేను’... సుందర్‌ని చంపేశానన్నమాట! ఇంతకీ ఏం జరిగింది?
ఉన్నట్టుండి మెలకువ వచ్చింది నాకు. టైమ్ చూద్దును కదా అర్ధరాత్రి ఒకటిన్నర. ఇది కాస్త అసహజమైన విషయమే. ఒకసారి పడుకున్నానూ అంటే మళ్లీ తెల్లారేవరకూ వొకపట్టాన లేచే రకం కాదు నేను. నా నిద్రని డిస్టర్బ్ చేయగలిగే శబ్దాలు కూడా ఏమీ బయట్నించీ లోపలికి రాలేదని బల్లగుద్ది చెప్పగలను. ఇలా మధ్యరాత్రిలో నిద్ర లేవడమన్నది ఊహ తెలిశాక ఎప్పుడూ జరగలేదు. ఒంటరిగా పడుకోవడం అలవాటు లేక మెలకువొచ్చిందని అనుకోడానికి కూడా లేదు. నాకంటూ అసలెవరున్నారని. ఆ ఫ్లాట్‌లో వుండేది నేనొక్కణ్నేగా. మరి నన్ను నిద్ర లేపింది ఏమైవుండొచ్చు? ఉన్నట్టుండి సడెన్‌గా వెలిగింది నాకు, ఆ గదిలో నేను వొంటరిగా లేను. ఇంకెవరో కూడా వున్నారు. నా పడకగదిలో కనీసం బెడ్‌లైట్ కూడా వేసి లేదు. కిటికీల్లోంచీ బయటి వెలుతురేమీ లోపలికి రావట్లేదు. ఎంత చీకటిగా వుందంటే, అసలు కళ్లు తెరవడానికీ మూయడానికీ తేడా ఏం తెలీడం లేదు. అయినా సరే అర్థమైపోయింది నాకు, ఆ రూములో ఎవరో వున్నారని. నేను భయపళ్లేదు. నాకు ఎలాంటి హానీ తలపెట్టే వుద్దేశం ఆ వ్యక్తికి లేదని నాకు తెలిసిపోతోంది. ఎలా తెలుస్తోందీ అని అడగొద్దు. చిమ్మచీకటిలో కూడా యింకొక మనిషి అక్కడున్నట్టు నాకెలా తెలిసిందో, యిదీ అలాగే. ఆఫీసుల్లో పెట్టినట్టు నా బెడ్రూమ్ బయట కూడా ఒక లాగ్ రిజిస్టర్ పెట్టాలి. ఇంట్లో నేనొక్కణ్నే వుండి, నిద్రలో మునిగిపోయి వున్నప్పుడు నా గదిలోకి రావాలనుకున్నవాళ్లు ‘పర్పస్ ఆఫ్ విజిట్’ ఏంటో అందులో రాసిన తర్వాత మాత్రమే లోపలికి రావాలి. నా ఆలోచనకి నాకే నవ్వొచ్చింది. ఆ వొచ్చిన మనిషికి నాకేదో చెప్పాలన్న వుద్దేశం లేదు. నన్నేదైనా అడిగే ఆలోచనా లేదు. కాస్త యెడంగా నిలబడి నేనేం చేస్తున్నానో పరిశీలించడమే అతను (ఆమె?) చేయదల్చుకున్న పని అని అనిపించింది నాకు. అసలైనా అంత చీకట్లో, అందునా నిద్రపోతున్న నన్ను గమనించడం ద్వారా నా గురించి ఏం తెలిసే అవకాశం వుంది? ఆ వచ్చిన మనిషి చనిపోయిన మా నాన్న గానీ, అమ్మ గానీ అయ్యుండే చాన్సుందా? వాళ్లు వదిలెళ్లిన పాత పెంకుటిల్లు బాగోగులు నేను చూస్కోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేయడానికి వచ్చారా? అయ్యుండకపోవచ్చు. మరి? నాలుగేళ్ల క్రితం చనిపోయిన నా బెస్టు ఫ్రెండు ఆత్మ అయ్యుండొచ్చా? ‘నాగ్గానీ ఏమైనా అయితే, మా ఫ్యామిలీ మేటర్స్ అన్నీ దగ్గరుండి నువ్వే చూసుకోవాల్రా’ అని చేతిలో చెయ్యేయించుకొని, మాట తీసుకొని మరీ కన్ను మూశాడు. నేను వాళ్లింటి ఛాయలకి పోయి ఎన్నాళ్లయ్యింది? తనకి నేనిచ్చిన ప్రామిస్‌ని గుర్తు చేయాలనుకుంటున్నాడా? ఆత్మలకి అన్నీ తెలిసిపోయే ప్రొవిజన్ వుంటే వాడికి (వాడి ఆత్మకి) నా మీద భ్రమలు తొలగిపోయి వుండాలి. మొత్తమ్మీద యీ కొత్తమనిషి ప్రెజెన్సు, దాని వెనక వుండగల కారణాలు యివన్నీ ఆలోచిస్తుంటే నాకు మిగతా విషయాలేవీ గుర్తుకు రావట్లేదు. లెక్క ప్రకారం, యిలా అనుకోకుండా మెలకువ వచ్చిన ఎవరైనా ఏం చేయాలీ? ఆ ముందురోజు జరిగిన లేదా తర్వాతిరోజు జరగాల్సిన ముఖ్యమైన పనేదో చప్పున మైండులోకి వచ్చి, దాని గురించే కదా ఆలోచించాలి! నాకు సంబంధించినంత వరకూ ముఖ్యమైన విషయం అంటే లావణ్య తప్ప మరింకేదీ కాదు. పిచ్చెక్కించే అందం, అసాధారణమైన తెలివితేటలు, అద్భుతమైన సెన్స్ ఆఫ్ హ్యూమర్. అలాంటి అమ్మాయి పార్టనర్‌గా దొరకడాన్ని మించిన అదృష్టం ఏ మగాడికైనా వేరే వుంటుందా? లక్కీగా పెళ్లి అనే సిస్టమ్‌లో యిరుక్కుపోవడానికి లావణ్య కూడా సిద్ధంగా లేదు. ‘లైఫ్ అంతా వొక్కడితోనే అనే ఆలోచనే సఫొకేటింగా వుంటుంది’ అని పైకే అనేస్తుంది. ఎవరైనా వింటే ఏం అనుకుంటారో అనే భయం కూడా లేదు ఆ పిల్లకి. ‘సీరియస్ కమిట్మెంట్లు అవసరం లేని క్యాజువల్ రిలేషన్ షిప్ ఎవరితో అయినా ఓకే’ అన్నట్లుగా ఉంటుంది. లావణ్య అలా ఉండడంత మొదట్లో నాకు పెద్దగా నచ్చలేదు. ఆమె నమ్మే ఫిలాసఫీలో నాకు లాభించగల కోణం ఏంటీ అన్నది నాకు తర్వాత్తర్వాత తెలిసొచ్చింది. ఒకవేళ ఆమె కూడా అందరిలాగానే పెళ్లి ద్వారా వచ్చే సెక్యూరిటీ కావాలనుకుంటే ఏమైవుండేది? అసలు నన్ను దగ్గరకి రానిచ్చేదేనా? మిగతావాళ్ల సంగతేమో గానీ, నాతో ఫిజికల్‌గా ఎఫైర్ పెట్టుకోడానికి లావణ్యకి ఎలాంటి అభ్యంతరమూ లేదు. అలాగని దానికి లివిన్ రిలేషన్ అని పేరు పెట్టడం కూడా ఆమెకి యిష్టం వుండదు. ఏదీ ఒక అరేంజ్మెంట్ లాగా, కాంట్రాక్ట్ లాగా వుండకూడదనేది తన ఫిలాసఫీ. సమాజం ఎప్పుడైనా మార్పుని వ్యతిరేకిస్తుంది. కొన్నాళ్లకి చచ్చినట్టు రాజీపడుతుంది. ఏ మార్పుతో అయితే అయిష్టంగా రాజీపడిందో దాని తాలూకూ ఫలితాన్ని యిన్ఫ్లూయెన్స్ చేయాలని కొన్నాళ్లకి దానిలో ఆరాటం మొదలవుతుంది. అప్పుడు ఆ మార్పుకి విలువ లేకుండా పోతుంది. మళ్లీ కొత్త మార్పు కోసం కొత్తగా ప్రయత్నం మొదలవుతుంది. ఇవన్నీ లావణ్య చెప్పిన మాటలే. తన ఐడియాలజీతో నాకొచ్చిన పేచీ ఏమీ లేదనే అనిపించింది నాకు. ∙∙ ‘దబ్’ అన్న సౌండుకి మళ్లీ మెలకువొచ్చింది నాకు. కిటికీలో నుండీ విసరబడిన న్యూస్ పేపర్ చప్పుడన్నమాట. పేపర్ బాయ్ మీద భలే కోపం వచ్చింది. అయితే, ఆ కోపం ఎంతోసేపు ఆగలేదు. మూడో అంతస్తులో వున్న కిటికీలోంచీ కచ్చితంగా నా రూములో కొచ్చి పడేలాగా గురిచూసి విసిరే వాడి టాలెంట్ గుర్తొచ్చి ముచ్చటేసింది. అవునూ, మూడు రోజుల్నుండీ నేను పేపర్ చదవనే లేదా? రబ్బర్‌బ్యాండ్ కూడా తీయకుండా పేపర్లు కిటికీ పక్కనే పడున్నాయేంటి? సరే నా సంగతి వదిలేద్దాం. మరి నా రూముకి కొత్తగా వచ్చిన గెస్టు సంగతేంటి? అతను (ఆమె?) కి పేపర్ చదవాలనీ, బయటి ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనీ లేదా? ఎవరో నా పక్కన వున్నారని తెలిసి కూడా నాకు మళ్లీ నిద్ర ఎలా పట్టింది? తెల్లారింది కాబట్టీ, వెలుతుర్లో ఆ మనిషి ఎవరన్నదీ స్పష్టంగానే కనబడొచ్చు. కానీ, నాకెందుకో అలా తెలుసుకోబుద్ధి కాలేదు. అవతలి మనిషి వల్ల నాకెలాంటి యిబ్బందీ లేనప్పుడు ఆరాలు తీయడం పద్ధతి కాదని అనిపించింది నాకు. అలా చేయడం ఎదుటివాళ్ల ప్రైవసీకి భంగం కలిగించడం కాదూ?! తాళం వేసున్న గదిలో, ఊహించని విధంగా వొక అగంతకుడు ప్రత్యక్షం అవ్వడం, అప్పుడే నిద్రలేచి మత్తుగా ఆవులిస్తున్న హీరోపై హత్యా ప్రయత్నం చేయడం, ఆ ప్లాన్ ముందే పసిగట్టిన హీరో లాఘవంగా అవతలికి గెంతడం, కత్తితో పొడవబోయిన క్రిమినల్ తూలి ముందుకి పడిపోవడం, వాడి చేతిలో వున్న ఆయుధం జారిపోవడం.. సినిమాల్లో చూసిన యిలాంటి సీన్లన్నీ గుర్తుకొచ్చాయి నాకు కాసేపు. నిజానికి నా బుర్ర చేస్తున్న తప్పు క్షమార్హం కాదు. ఎందుకంటే అసలు నా చుట్టూ వున్న వాతావరణం ప్రాస్పెక్టివ్ క్రైౖ మ్ సీన్లా లేనే లేదు. ముందుగా జరిగిన వొప్పందం ప్రకారం యిద్దరు మనుషులు స్నేహపూర్వకంగా ఒక వెన్యూని షేర్ చేసుకుంటున్నట్టుంది. అయినా, వర్రీ కావాల్సిన సీరియస్ యిష్యూస్ వదిలేసి, యింత అల్పమైన విషయం గురించి ఎందుకు ఆలోచిస్తున్నాను నేను? పట్టించుకోవాలే గానీ ఎన్ని సమస్యలు లేవు నాకు! లావణ్య విషయంలో నాకు పోటీ వస్తున్న కొలీగ్ సుందర్ విషయంలో ఏం చేయాలో ఆలోచించాలి ముందు. సుందర్..! ఈ కాలంలో పుట్టాల్సినోడు కాదు. లేదా, వయసు పెరక్కుండా అడాలసెన్స్లోనే ఆగిపోయినట్టున్నాడు. లావణ్య మనసు మార్చగలననీ, ఆమెకి పెళ్లి మీద నమ్మకం కుదిరేలా చేస్తాననీ వాదిస్తాడు. ‘జీవితాంతం యితని చేయి వదలకూడదు అనిపిచేంత నమ్మకం కలిగించే మగాడు తారసపడకపోవడం వల్లే లావణ్య అలా మాట్లాడుతోందీ’ అంటాడు. ‘ఎన్ని రోజులు ఎదురుచూసైనా సరే, ఎంత కష్టపడాల్సివచ్చినా సరే.. లావణ్యని పెళ్లి చేసుకోవడమే నా జీవితాశయం’ అంటాడు. ఒకప్పుడు తను కూడా సుందర్ లాగానే వుండేవాడు. అచ్చం అలానే ఆలోచించేవాడు, ‘విధి యిద్దరు మనుషుల్ని దగ్గరగా తీసుకురావడం, వాళ్లిద్దరూ కలిసి జీవితం పంచుకోలేకపోవడం, ఆ వెలితి వాళ్లని జీవితాంతం వేధించడం’. కాలేజీ రోజుల్లో యిలాంటి కథలు ఎంత కిక్కెక్కించాయో.. తనకి కూడా! చాలామంది గ్రాడ్యువల్‌గా ఆ ట్రాన్స్ నుండి బయటకి వచ్చేస్తారు. సుందర్ మాత్రం బయట ప్రపంచం ఎలావుందో చూడడానికి రెడీగా లేడు. అతని ప్రవర్తన చైల్డిష్‌గా వుందని చెప్పడానికి ప్రయత్నిస్తే అర్థం చేసుకోవడం లేదు సరి కదా, కోపం తెచ్చుకొని అసహనంతో రగిలిపోతున్నాడు. ∙∙ ‘కావాలంటే నువ్వూ లావణ్యని ప్రేమించు. తనని పెళ్లి చేసుకోవాలని నాకు మాదిరిగానే కలలు కను. నాకేం అభ్యంతరం లేదు. మనిద్దరిలో ఎవరు కరెక్ట్ అనుకుంటే లావణ్య వాళ్లనే ప్రేమిస్తుంది. అసలు లావణ్య వరకూ ఎందుకు?! నాకన్నా నువ్వే తనని ఎక్కువ సంతోషంగా ఉంచగలవు అని నమ్మకం కుదిరితే నేనే హ్యాపీగా మీ యిద్దరి లైఫ్‌లో నుండీ వెళ్లిపోతాను. కానీ, అసలు ప్రేమా పెళ్లీ అనే ప్రస్తావన లేకుండా, వొక అమ్మాయితో శారీరక సంబంధం పెట్టుకుంటే చాలు అనుకోవడం తప్పు’ అన్నాడు సుందర్. ‘చెప్పేది వినవే. ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకోవొద్దు, తనతో సంబంధం పెట్టుకుంటే చాలు’ అని జనరలైజ్ చేయడం లేదు నేను. ఇక్కడ డిస్కషన్ కేవలం లావణ్య గురించే. ఆ అమ్మాయికి కావాల్సిందేదో తనకి యివ్వడమే కదా ఆమెని ప్రేమించేవాడు చేయాల్సిన పని?’ లాజిక్ తీశాన్నేను. ‘అసలిలా ఎలా మాట్లాడగలుగుతున్నావ్? ఆ అమ్మాయికి లైఫ్ అంటే ఏంటో యింకా క్లియర్‌గా తెలీదు. ఏదో సరదాకి అలా మాట్లాడుతుందంతే. తన అమాయకత్వాన్నీ, వల్నరబిలిటీనీ క్యాష్ చేసుకోవడంలో తప్పు లేదని అంటున్నావ్ నువ్వు, అంతేగా?’, నన్ను విలన్ లాగా చూస్తూ అడిగాడు సుందర్. ‘లైఫ్ అంటే ఏంటో యింకా క్లియర్‌గా తెలియని అమ్మాయిని ప్రేమించి, ఆమెని పెళ్లి చేసుకోవడం కూడా తప్పేగా మరి? కొన్నాళ్లయ్యాక ఆమె తన యిష్టాయిష్టాలేంటో తెలుసుకొని, అసలు పెళ్లెందుకు చేసుకున్నాన్రా దేవుడా అని వుసూరుమంటుందేమో?’ అన్నాను నేను. చెప్పొద్దూ, నన్ను చూసుకుంటే నాకే చాలా గర్వంగా అనిపించింది. ఈ దెబ్బకి సుందర్గాడి మాట పడిపోతుంది. ‘భవిష్యత్తులో లావణ్య పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు అని అనుకుంటే, అది లైఫ్ గురించి మొత్తం తెలుసుకున్నట్టు అవుతుందా? పెళ్లి చేసుకోవడం కంటే, దొరికినోడితో దొరికినట్టు ఉండడం బెటర్ అనే ఆలోచన తప్పు అని తెలుసుకోవడం కదా అల్టిమేట్ రియలైజేషన్ అంటే?!’ వీడంత తేలిగ్గా రాజీ పడే రకం కాదు. ‘సుందర్, నువ్వేం అనుకోనంటే నిన్నొక ప్రశ్న అడుగుతాను’ టెంపో మార్చి, సాఫ్ట్‌గా అన్నాను. ‘ఏంటి? అడుగు’ అనుమానంగా బదులిచ్చాడు. ‘పెళ్లి గురించి లావణ్య ఫిలాసఫీ మీద నీకు రెస్పెక్ట్ లేదు. ఆ అమ్మాయికి తన లైఫ్ గురించి తాను డెసిషన్ తీసుకునేంత మెచూరిటీ వుందనే నమ్మకం లేదు. మరి, ఏం చూసి తనని ప్రేమించావు? ఎందుకు తనని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావు?’ నా నుండి ఈ ప్రశ్నని సుందర్ ఏమాత్రం వూహించలేదని తన ఎక్స్ప్రెషన్ చూస్తే అర్థమైపోతుంది. ఏమాటకామాటే చెప్పుకోవాలి. సుందర్‌లో కాస్త నిజాయితీ లేకపోలేదు. అతని స్థానంలో ఎవరైనా వుంటే, నా ప్రశ్నకి అడ్డదిడ్డంగా ఏదో వొక సమాధానం చెప్పివుండేవాళ్లు. కానీ సుందర్ మాత్రం మౌనాన్నే ఆశ్రయించాడు. నిజానికి సుందర్‌ని కన్విన్స్ చేయాల్సిన అవసరం నాకు లేదు. లావణ్యతో నేను సంబంధం పెట్టుకోడానికి అతని పర్మిషన్ తో పనేముంది? కానీ, ఎందుకోగానీ నేను చేసే పని రేషనల్గానే వుందని సుందర్‌ని నమ్మించాలని అనిపిస్తోంది. బహుశా, నేనూ వొకప్పుడు అతనిలాగానే ఆలోచించేవాడిని అని నాకు పదేపదే గుర్తుకు రావడం వల్ల అనుకుంటాను. వాదించడం ఆపేసి సుందర్ డిఫెన్సులో పడిపోవడం నాకు కాస్త వుత్సాహానిచ్చింది. సుందర్.. విషయం యిక్కడిదాకా వచ్చింది కాబట్టీ, నాకు ఏమనిపిస్తుందో చెపుతా విను. నీకూ నాకూ లావణ్య నుండీ కావాల్సింది వొక్కటే. మనిద్దరి అప్రోచ్ మాత్రమే వేరు. పెళ్లి అన్నమాట ఎత్తకుండా లావణ్యతో నేను ఎక్కడ తేలతానో, పెళ్లీ పెళ్లీ అని కలవరిస్తూ నువ్వు కూడా అక్కడే తేలతావ్. పచ్చిగా చెప్పాలంటే, లావణ్యతో ‘రిలేషన్షిప్’ కోసం నువ్వు పెళ్లి అనే పదాన్ని అడ్డం పెట్టుకుంటున్నావ్, అంతే!’ మరీ యింత హార్ష్‌గా చెప్పకుండా వుండాల్సిందేమో. కానీ, యిక ముసుగులో గుద్దులాట అనవసరం. ఈసారి కూడా సుందర్ ఏమీ మాట్లాడలేదు. లేచి నిలబడి గదిలో అటూయిటూ పచార్లు చేయడం మొదలెట్టాడు. ఆల్రెడీ లైన్ క్రాస్ చేసేశాను. ఇక కొత్తగా జరగ్గలిగే డ్యామేజ్ అంటూ ఏం లేదు. సిగరెట్ పెట్టె, లైటర్ చేతిలోకి తీసుకొని, అప్పటిదాకా జరిగిన చర్చని కంక్లూడ్ చేస్తూ చెప్పాన్నేను.. ‘నా మాట విని నువ్వూ నా స్కూల్లోకొచ్చెయ్. ఇలా తర్జనభర్జన పడుతూ పోతే, చివరికి నువ్వూ నేనూ తప్ప అందరూ వాడతారు దాన్ని’ లావణ్య గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాం మేము. కానీ ఆమెని వుద్దేశించి ‘దానిని’, ‘అది’ లాంటి పదాలు నేను వాడడం అదే మొదటిసారి. కుండబద్దలు కొట్టేసి, నా పాయింట్‌ని ఎస్టాబ్లిష్ చేశాను కాబట్టి, మాటలకి మరీ ఎక్కువ డెకరేషన్ అవసరం లేదు అని నా యిన్‌స్టింక్ట్ చెపుతోందన్నమాట. హాల్లోంచీ బాల్కనీలోకి వెళ్లే తలుపు బోల్ట్ తీస్తూ నేను పై మాటలు అంటున్న సమయానికి సుందర్ వేరేౖ వెపు తిరిగి వున్నాడు. అతని ఫేస్ నాకు కనబడుతూ వుండివుంటే కనీసం చివరి రెండు వాక్యాలైనా మాట్లాడకుండా నిగ్రహించుకొని వుండేవాణ్నేమో. సుందర్ ఆవేశంగా నా మీదకి రావడం అర్థమయ్యి చప్పున వెనక్కి తిరగబోయాను నేను. అప్పటికే అతను నా కాలర్ పట్టుకుని విసురుగా వెనక్కిలాగి, నా తలని పక్కనే వున్న గోడకేసి కొట్టాడు. అతని పట్టు నుండి విడిపించుకోడానికి నా శక్తికొద్దీ ప్రయత్నించాను. చూడ్డానికి అర్భకుడిలా వున్నాడనే కానీ గట్టిపిండమే. ∙∙ నా గదిలో ఎవరో వున్నారని నేను గ్రహించడం దగ్గర కదా ఈ కథ మొదలైంది. నేను పడుకోడానికి ముందు ఏం జరిగిందీ అన్నది గుర్తు చేసుకున్నాక నాకు యిప్పుడు కొంత క్లారిటీ వచ్చినట్లే అనిపిస్తుంది. సుందర్‌ని నేను చంపేశానన్నమాట. నాకు నిద్రాభంగం అవడానికి కారణమైంది సుందర్ శవం కానీ లేదా అతని ఆత్మ కానీ అయ్యుండాలి. సెకండ్ ప్రాబబిలిటీ ప్రకారం, సుందర్ నన్ను చంపేసి వుంటే, ఆ గదిలో వున్న యిద్దరూ నేనే అవ్వడానికి కూడా అవకాశం వుంది. సుందర్‌కీ నాకూ మధ్య జరిగిన పెనుగులాటలో ఎవరు గెలిచారు అన్నదానిమీద ఆధారపడి వుంటుంది నిజం ఏంటన్నది. అన్నట్టు మీకు యింకో ఆసక్తికరమైన విషయం చెప్పాలి. సుందర్ నన్ను చంపడానికి ప్రయత్నించడం, అంత కంగారులోనూ, నన్నేమీ ఆశ్చర్యానికి గురి చేయలేదు. నన్ను ఆశ్చర్యపోయేలా చేసిందేంటంటే, సుందర్ మొహంలో కోపం కాకుండా భయం కనిపించడం. తన గురించి తాను తెలుసుకోవడంలో మనిషికి వుండే భయం. ప్రాణాలు వదలడానికి ముందు ఏబర్డీన్ లోయల్లో మాక్బెత్ని వేధించిన భయం. నిజం బారి నుండి పారిపోలేని నిస్సహాయత దెయ్యంగా మారి వెంటాడుతున్నప్పుడు కలిగే భయం. ఫైనల్‌గా సుందర్‌ని నేను కన్విన్స్ చేశానా? ఒకవేళ నా ప్రవర్తనని సమర్థించుకోడానికి నేను సుందర్ మొహంలో భయాన్ని కాకుండా ఆశ్చర్యాన్నే చూసినట్టు నటిస్తున్నానా? ఈ చివరి ఆలోచన రాగానే నా వొళ్లు వొక్కసారిగా జలదరించింది. తల పక్కకి తిప్పి, నా గదిలో వున్నదెవరో చూడాలంటే నాకిప్పుడు భయంగా వుంది. -
ఎకరం కూడా ఎండకూడదు.. ఇంధన శాఖకు ఆదేశాలు
సాక్షి, అమరావతి: వ్యవసాయ విద్యుత్ సరఫరాపై ప్రత్యేకంగా పర్యవేక్షించి రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని, రాష్ట్రంలో ఒక్క ఎకరం పంట పొలం కూడా ఎండకూడదని రాష్ట్ర ప్రభుత్వం ఇంధన శాఖను ఆదేశించింది. ఈ నేపథ్యంలో వ్యవసాయ అవసరాలకు విద్యుత్ సరఫరాపై ఇంధన శాఖ అప్రమత్తమైంది. వేసవి, విద్యార్థులకు పరీక్షలను దృష్టిలో పెట్టుకొని గృహ విద్యుత్‌కూ డిస్కమ్‌లు ప్రాధాన్యమిస్తున్నాయి. రోజూ 50 ఎంయూల కొరత రాష్ట్రంలో 2018–19లో మొత్తం విద్యుత్ డిమాండ్ 63,605 మిలియన్ యూనిట్లు ఉండగా 2021–22 నాటికి 68,905 మిలియన్ యూనిట్లకు పెరిగింది. అంటే 8.3 శాతం పెరిగింది. గృహ వినియోగం 32 శాతం, పారిశ్రామిక వినియోగం 6 శాతం, వ్యవసాయ వినియోగం 16 శాతం చొప్పున పెరిగింది. గృహ విద్యుత్ డిమాండ్ 2018–19లో 14,681 ఎంయూలు ఉండగా 2021–22లో 19,355 మిలియన్ యూనిట్లకు చేరింది. పారిశ్రామిక రంగంలో డిమాండ్ 17,781 మిలియన్ యూనిట్ల నుంచి 18,844 మిలియన్ యూనిట్లకు చేరింది. వ్యవసాయ రంగంలో వాడకం 10,832 మిలియన్ యూనిట్ల నుంచి 12,720 మిలియన్ యూనిట్లకు చేరుకుంది. వివిధ రంగాల్లో పెరిగిన విద్యుత్ డిమాండ్ కారణంగా రోజూ 50 మిలియన్ యూనిట్ల మేర కొరత ఎదుర్కొంటున్నట్లు ఇంధన శాఖ అధికారులు చెబుతున్నారు. దీన్ని అధిగమించేందుకు బహిరంగ మార్కెట్లో నిత్యం 30 మిలియన్ యూనిట్ల మేర కొనుగోలు చేస్తుండగా మరో 20 ఎంయూల కొరత నెలకొంది. ఈ నెలలో విద్యుత్ డిమాండ్ 6,720 మిలియన్ యూనిట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. కొరతకు రెండు ప్రధాన కారణాలు.. కోవిడ్ ప్రభావం తగ్గిన నేపథ్యంలో వివిధ రంగాలలో ఆర్థిక కార్యకలాపాలు వేగం పుంజుకున్నాయి. రాష్ట్రంలో ఒక్కసారిగా విద్యుత్ డిమాండ్ పెరగడానికి ఇది ఒక కారణం. రష్యా – యుక్రెయిన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా బొగ్గు ధరలు భారీగా పెరిగాయి. అదే సమయంలో దేశంలో బొగ్గు కొరత కారణంగా కొద్ది నెలలుగా అసాధారణంగా పెరిగాయి. ఇది మరో ప్రధాన కారణం. గతంలో టన్ను బొగ్గు రూ.6 వేల నుంచి రూ.8 వేలు ఉండగా ఇప్పుడు రూ.17 వేల నుంచి రూ.40 వేలకు చేరింది. దీంతో గుజరాత్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లోనూ బొగ్గు కొరత నెలకొంది. విద్యుత్ డిమాండ్‌ను అందుకునేందుకు వివిధ రాష్ట్రాలు పవర్ ఎక్సే్ఛంజీల నుంచి విద్యుత్ కొనుగోలుపై ఆధారపడుతున్నాయి. ఫలితంగా డిమాండ్, సరఫరా మధ్య అంతరం పెరిగి బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలు ధర భారీగా పెరిగింది. ప్రస్తుతం యూనిట్ ధర పీక్ అవర్స్‌లో రూ.12 వరకూ ఉంది. నెలాఖరుకు సాధారణ పరిస్థితి.. ‘‘రాష్ట్రంలో రాబోయే రోజుల్లో పెరిగే విద్యుత్ డిమాండ్‌ను అందుకునేలా దీర్ఘకాలిక ప్రాతిపదికన బొగ్గు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారు. విద్యుత్ కొరత కారణంగా పారిశ్రామిక వినియోగంపై కొంతమేర ఆంక్షలు విధించక తప్పని పరిస్థితి ఎదురైంది. అలా ఆదా చేసిన విద్యుత్‌ను వ్యవసాయ, గృహ అవసరాల కోసం సరఫరా చేస్తున్నాం. ఈ నెలాఖరు నాటికి విద్యుత్ కొరత సమస్య చాలా వరకు తీరుతుందని భావిస్తున్నాం. వినియోగదారులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్‌ను అందించడంలో రాజీ లేదు’’ – బి.శ్రీధర్, ఇంధన శాఖ కార్యదర్శి -
విద్యుత్‌పై ఉత్త కబుర్లే.. ఆ ‘బాబు’ గొప్పేమీ లేదు
సాక్షి,అమరావతి: గతంలో టీడీపీ అధికారంలోకి వచ్చేసరికే రాష్ట్రంలో విద్యుదుత్పత్తి కేంద్రాలున్నాయని, గత సర్కారు హయాంలోనే మొదలయ్యాయనడంలో ఏమాత్రం వాస్తవం లేదని ఇంధన శాఖ కార్యదర్శి బి.శ్రీధర్ స్పష్టం చేశారు. ఏపీ ట్రాన్స్‌కో జేఎండీ ఐ.పృథ్వీతేజ్తో కలసి ఆదివారం విజయవాడలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గుదిబండల్లా పీపీఏలు.. బకాయిలు ఆర్టీపీపీలో 600 మెగావాట్లు, కృష్ణపట్నంలో 1600 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులు 2009లోనే మొదలయ్యాయని ఇంధనశాఖ కార్యదర్శి వెల్లడించారు. 2014 నాటికి దేశ వ్యాప్తంగా మిగులు విద్యుత్ ఉన్నప్పటికీ అధిక ధరలకు 8,000 మెగావాట్ల పీపీఏలు కుదుర్చుకోవడంతో పాతికేళ్ల పాటు ఏటా రూ.3 వేల కోట్లు భారం డిస్కంలపై పడుతోందన్నారు. గత సర్కారు హయాంలో రూ.30 వేల కోట్ల రుణాలు తీసుకుని 2018–19 నాటికి రూ.62 వేల కోట్లకు చేర్చారని, ఏటా రూ.8 వేల కోట్లు చొప్పున ఇవ్వాల్సిన సబ్సిడీలను ఇవ్వకుండా రూ.2 వేల కోట్లే ఇవ్వడం వల్ల బకాయిలు పెరిగిపోయాయని చెప్పారు. గత ప్రభుత్వం ట్రూ అప్ చార్జీలను (విద్యుత్ కొనుగోలు ఖర్చులు) ఏపీఈఆర్సీకి సమర్పించకుండా, తప్పుడు నివేదికలు సమర్పించడంతో ఆర్థిక భారం పడిందన్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీలు, బకాయిలకే రెండున్నరేళ్లలో రూ.36 వేల కోట్లు ఇచ్చిందన్నారు. నెలలోపే కృష్ణపట్నం యూనిట్ రాష్ట్ర ప్రభుత్వం పోలవరంలో 960 మెగావాట్ల హైడల్ విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టును సిద్ధం చేస్తోందని, 2024 నుంచి దశలవారీగా ఆ విద్యుత్ అందుబాటులోకి వస్తుందని ఇంధన శాఖ కార్యదర్శి వివరించారు. సీలేరులో 1350 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు చేపట్టామని, మూడు నెలల్లో టెండర్లు ఖరారు చేస్తామని తెలిపారు. వీటీపీఎస్, కృష్ణపట్నంలో 800 మెగావాట్ల చొప్పున రెండు యూనిట్లను త్వరగా ప్రారంభించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారని వెల్లడించారు. కృష్ణపట్నం యూనిట్ నెలలోపే ప్రారంభిస్తామన్నారు. నెడ్ కాప్ ద్వారా 6600 మెగావాట్ల సామర్థ్యంతో ఏడు పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామని, డీపీఆర్ సిద్ధమవుతోందని తెలిపారు. సాగుకు సౌర విద్యుత్తుతో భరోసా వ్యవసాయ రంగంలో అమలు చేస్తున్న విధానాలతో ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ఇటీవల ఎన్టీపీసీ చైర్మన్‌తో సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి తెలియచేశారని ఇంధనశాఖ కార్యదర్శి చెప్పారు. రాబోయే 30 ఏళ్ల పాటు రైతులకు అందిస్తున్న ఉచిత విద్యుత్‌కు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. వ్యవసాయానికి సెకీ ద్వారా తక్కువ ధరకే 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ను రాష్ట్ర ప్రభుత్వం యూనిట్ రూ.2.49కే సేకరిస్తోందని, తద్వారా 2024లో వ్యవసాయ మిగులు విద్యుత్‌ను గృహ, పారిశ్రామిక అవసరాలకు అందిస్తామన్నారు. ప్రస్తుతం సగటున విద్యుత్తు కొనుగోలు వ్యయం యూనిట్ రూ.5.10 చొప్పున ఉందన్నారు. ఈ లెక్కన సంవత్సరానికి దాదాపు రూ.3,750 కోట్లు ఆదా అవుతుందని తెలిపారు. వ్యవసాయ రంగానికి గత సర్కారు హయాంలో విడుదల చేసిన మొత్తం రాయితీలు రూ.13,255 కోట్లు కాగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రెండున్నరేళ్లలో విడుదల చేసిన సబ్సిడీలు రూ.21,497 కోట్లు అని శ్రీధర్ వెల్లడించారు. బొగ్గు సంక్షోభంతో.. దేశంలో విపత్కర పరిస్థితులు, వ్యవసాయ రంగం డిమాండ్, బొగ్గు సంక్షోభం విద్యుత్ కోతలకు ప్రధాన కారణాలని శ్రీధర్ తెలిపారు. 2014–15 మధ్య కాలంలో 6 శాతంగా ఉన్న విద్యుత్ గ్రోత్ (సంవత్సరానికి సంవత్సరానికి మధ్య గ్రోత్) 2020–21లో 14 శాతానికి పెరిగిందని తెలిపారు. 2014–19లో కెపాసిటీ ఎడిషన్ జరగడం వల్ల డిస్కంలపై, వినియోగదారులపై భారం పడిందని, విద్యుత్ కొరతకు ఇది కూడా ఓ కారణమన్నారు. మే నెలలో మొదలై జూన్, జూలై వరకు మాత్రమే విండ్ పవర్ తక్కువ సమయం అందుబాటులో ఉంటుందన్నారు. తాత్కాలిక సమస్యలే.. ప్రస్తుతం నెలకొన్న విద్యుత్ సమస్యలు తాత్కాలికమేనని, త్వరలోనే సమస్యకు పరిష్కారం లభిస్తుంది ఇంధన శాఖ కార్యదర్శి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం శనివారం రోజు తక్షణమే తీసుకున్న చర్యల వల్ల గృహావసరాలు, వ్యవసాయానికి ఆదివారం రోజు విద్యుత్ కోతలను తగ్గించగలిగామని చెప్పారు. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడమే ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. గత నెల నుంచి విద్యుత్ వినియోగం గరిష్ట స్థాయికి చేరిందని, వ్యవసాయ విద్యుత్ వినియోగం ఈ నెలాఖరుకు తగ్గే అవకాశం ఉందన్నారు. సాగు విద్యుత్ వినియోగం తగ్గాక పరిశ్రమలకు యథావిథిగా విద్యుత్ సరఫరా ఉంటుందన్నారు. పరిశ్రమల నుంచి ఇప్పటికే వినతులు అందుతున్నాయని, త్వరలో సమావేశం నిర్వహించి సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఎలాంటి బకాయిలు లేవు.. గత అక్టోబర్ నుంచి బొగ్గు సంక్షోభం నెలకొన్నా కోల్ కంపెనీలకు ఎటువంటి బకాయిలు లేవని, సింగరేణి నుంచి నిరంతరాయంగా సరఫరా జరుగుతోందని ఇంధనశాఖ కార్యదర్శి చెప్పారు. శనివారం రోజు కోల్ కంపెనీలకు రూ.150 కోట్లు చెల్లించామన్నారు. కోల్ ఇండియా నిరంతరాయంగా బొగ్గు సరఫరా చేస్తోందని, రైల్వేలు కూడా క్రమం తప్పకుండా ర్యాక్‌లు సమకూరుస్తున్నాయని చెప్పారు. విశాఖలోని హిందూజా పవర్‌కు బొగ్గు సరఫరా చేయాలని కేంద్రాన్ని కోరామని, అక్కడ విద్యుత్ ఉత్పత్తి జరిగితే పీపీఏ ప్రకారం మనకు 1000 మెగావాట్లు అందుతుందని తెలిపారు. విద్యుత్ సమస్యలపై కేంద్రం ఈ నెల 12వ తేదీన నిర్వహిస్తున్న సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. బాబు దూరదృష్టితోనే దేశమంతా మెరుగైందా? రాష్ట్ర విభజన సమయంలో ఏపీలో విద్యుత్ కొరత నెలకొనగా టీడీపీ ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్లే సమస్య తగ్గిందని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారని, అయితే, ఇంధన కొరత తగ్గడం అనేది దేశవ్యాప్తంగా ఏర్పడ్డ పరిస్థితుల వల్లే కానీ గత ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల కాదన్నారు. 2014 జూన్ 3న 16 రాష్ట్రాల్లో విద్యుత్ కొరత ఉండగా 2016 జూన్ 3 నాటికి నాలుగు రాష్ట్రాల్లో మాత్రమే విద్యుత్ కొరత ఉందన్నారు. అన్ని రాష్ట్రాలకు సంబంధించి పరిస్థితి గణనీయంగా మెరుగుపడిందన్నారు. అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు తన దూరదృష్టితో కూడిన నాయకత్వం వల్లే దేశం మొత్తం విద్యుత్ పరిస్థితి మెరుగుపడిందని చెప్పగలరా? అని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోకి వచ్చేటప్పటికి 90 శాతం కంటే ఎక్కువ అభివృద్ధి దశలో ఉన్న కృష్ణపట్నం థర్మల్ పవర్ ప్లాంట్.. ప్రభుత్వం ఏర్పడిన తేదీ నుంచి ఏడాది లోపు కార్యకలాపాలను ప్రారంభించిందన్నారు. గత ప్రభుత్వాల ప్రయత్నాల వల్లే అది సాధ్యమైంది కానీ టీడీపీ సర్కారు గొప్పతనమేమీ కాదన్నారు. డిస్కమ్‌లపై తీవ్ర ఒత్తిడి టీడీపీ పాలనలో డిస్కంలపై తీవ్ర ఒత్తిడి ఉండేదని, చంద్రబాబు తనను తాను దార్శనికుడిగా అభివర్ణించుకునే అవకాశం లేదన్నారు. వాస్తవానికి విభజన తర్వాత మొదటి సంవత్సరానికి 54,225 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్‌ను ఏపీఈఆర్సీ ఆమోదించిందని, 54,867 మిలియన్ యూనిట్ల లభ్యతను అంచనా వేయడం విద్యుత్ కొరత లేదని సూచిస్తుందన్నారు.ఆ సమయంలో దేశంలో స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 2,43,028 మెగావాట్లు ఉంటే, గరిష్ట డిమాండ్ 1,35,918 మెగావాట్లేనన్నారు. అలాంటప్పుడు దీర్ఘకాలిక ప్రాతిపదికన భారీ పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని అధిక ఖర్చులతో తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. అయినా టీడీపీ ప్రభుత్వం హడావుడిగా 8 వేల మెగావాట్ల పీపీఏలను అధిక ధర (యూనిట్ రూ. 4.84 చొప్పున)లకు కుదుర్చుకుందని గుర్తుచేశారు. రెట్టింపు అప్పులు.. భారీ బకాయిలు టీడీపీ హయాంలో విద్యుత్ రంగం అప్పులు రూ.29,703 కోట్ల నుంచి రూ.58,596 కోట్లకు చేరాయన్నారు. విద్యుదుత్పత్తిదారులకు డిస్కంల బకాయిలు రూ.2,893.23 కోట్ల నుంచి రూ.21,540.96 కోట్లకు పెరిగాయని తెలిపారు. ఐదేళ్లలో రాష్ట్ర పంపిణీ, వినియోగాల నికర విలువ రూ.4,315.72 కోట్ల ప్రతికూల విలువ నుంచి రూ.19,926.27 కోట్ల ప్రతికూల విలువకు క్షీణించిందన్నారు. కనీసం నెట్‌వర్త్ సానుకూలంగా ఉంటే చంద్రబాబు దూరదృష్టి గల వ్యక్తి అనే వాదనను కొంతవరకు సమర్థించవచ్చని, కానీ ఆయన హయాంలో నెట్‌వర్త్ గణనీయంగా క్షీణించిందన్నారు. -
అక్టోబర్ నుంచే దేశంలో బొగ్గు కొరత: ఇంధనశాఖ కార్యదర్శి శ్రీధర్
సాక్షి, విజయవాడ: గత ఏడాది అక్టోబర్ నుంచి దేశంలో బొగ్గు కొరత ఉందని ఇంధనశాఖ కార్యదర్శి శ్రీధర్ అన్నారు. ఈ మేరకు విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'ఎక్కడా బొగ్గు సరఫరాకు డబ్బు కొరత లేదు. సమయానికి చెల్లింపులు చేస్తున్నాం. కోల్ ఇండియా వాళ్లకు రూ.150 కోట్లు నిన్న చెల్లించాం. హిందూజకు బొగ్గు సరఫరా చేయాలని కేంద్రానికి లేఖ రాశాం. విద్యుత్ వినియోగం 14 శాతానికి పెరిగింది. దీనికి తోడు బొగ్గు కొరత ఏర్పడింది. సెకితో 2024 వరకు ప్రభుత్వం 7 వేల మెగావాట్ల కోసం ఒప్పందం ఉంది. ఇది రాష్ట్రంలోని 19 లక్షల బోర్లకు ఉపయోగిస్తున్నాము. 2014-15 వరకు డిస్కంలు తెచ్చిన రుణాలు రూ.30 వేల కోట్లు ఉన్నాయి. 2018-19కి ఇవి రూ.62 వేల కోట్లకు పెరిగాయి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి గత ప్రభుత్వంలో చేసిన అప్పులు పెరిగాయి. 2019 నుంచి ఈ ప్రభుత్వం వచ్చాక డిస్కమ్‌లకు 36 వేల కోట్ల రూపాయలు చెల్లింపులు చేశారు. బొగ్గు, వినియోగం పెరగడం వల్ల విద్యుత్తు కొరత ఏర్పడింది. నెలాఖరుకి సమస్య పరిష్కారం అవుతుంది' అని ఇంధనశాఖ కార్యదర్శి శ్రీధర్ అన్నారు. చదవండి: (మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణపై బొత్స కీలక వ్యాఖ్యలు) -
అదుపులోకి విద్యుత్ కొరత
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుత్ కొరత క్రమంగా అదుపులోకి వస్తోందని, ఈ నెలాఖరుకల్లా అంతా సర్దుకుంటుందని ఇంధన శాఖ కార్యదర్శి బి. శ్రీధర్ అన్నారు. గృహావసరాలకు నిరంతరం విద్యుత్ సరఫరా చేయడం తమ ప్రాధాన్యత అని ఆయన స్పష్టంచేశారు. ఆస్పత్రులకు కరెంట్ కష్టాలు లేకుండా చూడాలని డిస్కమ్‌లకు ఆదేశాలిచ్చామని, పరిస్థితులను అర్ధంచేసుకుని వినియోగదారులు సహకరించాలని కోరారు. బొగ్గు కొరతతో దేశవ్యాప్తంగా విద్యుత్ సమస్య ఏర్పడిందని.. అలాగే, బొగ్గు ధర కూడా విపరీతంగా పెరిగిందన్నారు. ఇక ఈ నెలాఖరుకల్లా కరెంట్ కోతల నుంచి ఉపశమనం కలుగుతుందని శ్రీధర్ ఆశాభావం వ్యక్తంచేశారు. విజయవాడ ఆర్ అండ్ బీ భవనంలో శనివారం ఆయన మీడియాకు రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితిని వివరించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. విద్యుత్ కొరతకు ఇవే కారణాలు.. దేశవ్యాప్తంగా గతేడాది అక్టోబర్ నుంచి ఏర్పడ్డ బొగ్గు కొరత.. పోస్ట్ కోవిడ్ తర్వాత రాష్ట్రంలో భారీగా పెరిగిన విద్యుత్ వినియోగం.. దేశీయంగా బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోళ్లకు పెరిగిన డిమాండ్ వంటి మూడు ప్రధాన కారణాలవల్ల విద్యుత్ కొరత ఏర్పడింది. దేశీయంగా ఉత్పత్తి అయ్యే బొగ్గు వినియోగం కూడా పెరిగి లభ్యత తగ్గింది. గతంలో రూ.6 వేలకు దొరికిన బొగ్గు ధర ఇప్పుడు రూ.17 వేల నుంచి రూ.40 వేల వరకూ వెళ్లింది. బొగ్గు సరఫరా గురించి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధానితో మాట్లాడటం, రైల్వే, కోల్, ఎనర్జీ మంత్రిత్వ శాఖలకు లేఖలు రాయడం, ఎంపీలు కూడా వారిని వెళ్లి కలవడంతో బొగ్గు నిల్వలు లేనప్పటికీ మన రాష్ట్రానికి రోజుకి కావాల్సినంత బొగ్గు వస్తోంది. అన్ని రంగాల్లో పెరిగిన వినియోగం 2020 మార్చి–ఏప్రిల్‌లో కోవిడ్ లాక్డౌన్ కారణంగా కేవలం 160 మిలియన్ యూనిట్ల గృహ వినియోగం మాత్రమే ఉండేది. 2021 మార్చి–ఏప్రిల్‌లో 200 నుంచి 210 మిలియన్ యూనిట్లుగా నమోదైంది. 2022 మార్చి–ఏప్రిల్‌లో కోవిడ్ పరిస్థితి నుంచి బయటపడటం.. అన్ని రంగాల్లోనూ కార్యకలాపాలు పెరగడం.. ఈ ఏడాది మార్చి నుంచే మొదలైన ఎండలవల్ల గృహావసరాల వినియోగం కూడా ఎక్కువగా ఉండడంతో రోజుకి సగటున 235 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం అవుతోంది. 20–25 ఎంయూల విద్యుత్ లోటు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో జరిగినంత వినియోగం ఇప్పుడు ఒక్క మన రాష్ట్రంలో జరుగుతోంది. 2014–15లో రాష్ట్రంలో సగటు విద్యుత్ వినియోగం 130 మిలియన్ యూనిట్లు ఉండేది. ఇప్పుడది 190 మిలియన్ యూనిట్లకు చేరింది. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు కలిపి మొత్తం 500 మిలియన్ యూనిట్లు అవసరం. అలాగే, రాష్ట్రంలో సగటున రోజుకి 235 మిలియన్ యూనిట్ల అవసరం ఉండగా, పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్న ఏపీ జెన్కో ద్వారా 80 నుంచి 85 ఎంయూ, ఎన్టీపీసీ ద్వారా 45 ఎంయూ, ఐపీపీఎస్ 10 ఎంయూ, సోలార్ 25 ఎంయూ, విండ్ 10 ఎంయూ, ద్వారా అన్నీ కలిపి మొత్తం 175 ఎంయూ వరకూ విద్యుత్ అందుబాటులో ఉంటోంది. ఇంకా 55 మిలియన్ యూనిట్లు లోటు ఉంటోంది. 30 మిలియన్ యూనిట్ల వరకు కొనుగోలు చేస్తున్నాం. మార్చిలో 1,551 మిలియన్ యూనిట్లను యూనిట్‌కి రూ.8.11 చొప్పున రూ.1,058 కోట్లతో విద్యుత్ కొనుగోలు చేశాం. ఇంకా 20–25 ఎంయూ వరకూ లోటు ఉంది. దక్షిణాదిలో కొరత ఎక్కువ పవర్ ఎక్సే్ఛంజ్‌లో విద్యుత్ దొరకని కారణంగా ఇటీవల వ్యవసాయానికి, గృహాలకు కోత విధించాల్సి వచ్చింది. వ్యవసాయానికి పగటిపూట ఏడు గంటల నిరంతర విద్యుత్ ఇవ్వాలని ఆదేశాలిచ్చాం. గృహ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నందున పరిశ్రమలకు లోడ్ రిలీఫ్ ఇవ్వాలని నిర్ణయించాం. లేదంటే గ్రిడ్‌కు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. విద్యుత్ కొరత తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాల్లోనూ ఉంది. దక్షిణాది రాష్ట్రాలకు ఇంకా ఎక్కువగా ఉంది. గుజరాత్లో పవర్ హాలిడే ఇచ్చారు. ఇక నిరంతరం నడిచే పరిశ్రమలు 50 శాతం మాత్రమే విద్యుత్ వాడాలనే నిబంధనతోపాటు పరిశ్రమలకు పవర్ హాలిడే వల్ల 10 మిలియన్ యూనిట్ల వరకూ ఆదా అవుతోంది. ఈ మొత్తాన్ని గృహావసరాలకే కేటాయిస్తున్నాం. దీంతో శనివారం కేవలం 4 మిలియన్ యూనిట్లే కోరత ఏర్పడింది. సాగుకు వాడే విద్యుత్ వినియోగం ఈనెల 15 తరువాత తగ్గే అవకాశం ఉంది. అది వస్తే పరిశ్రమలకు యథావిథిగా విద్యుత్ సరఫరా ఉంటుంది. -
AP: విద్యుత్ కోతలు తాత్కాలికమే.. ఇతర రాష్ట్రాలది ఇదే పరిస్థితి
సాక్షి, విజయవాడ: మార్చి నెల నుంచి ఎండలు పెరగడంతోనే రాష్ట్రంలో విద్యుత్ వినియోగం పెరిగిందని ఇంధన శాఖ కార్యదర్శి శ్రీధర్ అన్నారు. ఈ మేరకు విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. '2020 మార్చ్ నెలలో 160 మిలియన్ యూనిట్ల కాగా గత ఏడాది 210 మిలియన్ యూనిట్లు ఉంది. ఈ ఏడాది ఇపుడు 240 మిలియన్ యూనిట్లకి చేరుకుంది. ఇంత డిమాండ్ ఉమ్మడి రాష్డ్రంలో ఉండేది. జెన్ కో ద్వారా పూర్తి ఉత్పత్తి జరుగుతోంది. జెన్ కో ద్వారా సగం ఉత్పత్తి మాత్రమే జరుగుతోందని కొన్ని మీడియాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. డిమాండ్‌కి ఉత్పత్తికి దాదాపు 55 మిలియన్ యూనిట్లు తేడా ఉంది. ఏపీలోనే కాదు తెలంగాణా, గుజరాత్ తదితర రాష్ట్రాలు ఇదే సమస్యని ఎదుర్కొంటున్నాయి. మార్చ్ నెలలో రాష్ట్ర అవసరాల కోసం 1551 మిలియన్ యూనిట్లని కొనుగోలు చేశాం. ఇందుకోసం దాదాపు రూ.1250 కోట్లని ఖర్చు చేశాం. బొగ్గు కొరత కారణంగా ఈ సమస్య ఏర్పడింది. విద్యుత్ కొనడానికి సిద్దంగా ఉన్నా దొరకటం లేదు. తప్పని పరిస్ధితులలో పరిశ్రమలకి 15 రోజులపాటు ఆంక్షలు విధించాము. వారంలో ఒకరోజు పరిశ్రమలకి పవర్ హాలిడే ప్రకటించాయి. నెలాఖరునాటికి సాదారణ పరిస్ధితులు వస్తాయని భావిస్తున్నాం. వ్యవసాయ విద్యుత్ వినియోగం నెలాఖరు నుంచి పూర్తిగా తగ్గుతుంది. తెలంగాణా, తమిళనాడు రాష్డ్రాల అధికారులతో మాట్లాడాం అక్కడా ఇదే పరిస్ధితి. చదవండి: (కేబినెట్ పునర్ వ్యవస్థీకరణపై సజ్జల కీలక వ్యాఖ్యలు) 2014-15లో సరాసరిన 130 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉంటే ప్రస్తుతం సరాసరిన రోజుకి 190 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉంది. రోజుకి 30 మిలియన్ యూనిట్లు కొనుగోలు చేస్తున్నాం. తప్పని పరిస్ధితుల్లోనే రోజుకి గ్రామీణ ప్రాంతాలలో గంట.. పట్టణ ప్రాంతాలలో అరగంట మాత్రమే కోతలు ప్రకటించాం. ఆసుపత్రులకి పూర్తిస్ధాయి సరఫరా కొనసాగించాలని ఆదేశించాం. వ్యవసాయానికి నిరంతరాయంగా ఏడు గంటల విద్యుత్ ఇవ్వాలని ఆదేశించాం. పూర్తి సామర్ద్యంతో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఈ విద్యుత్ కోతలు తాత్కాలికం మాత్రమే. ప్రజలు అర్ధం చేసుకుని సహకరించాలని కోరుతున్నాం. నెలాఖరు నుంచి మళ్లీ విద్యుత్ డిమాండ్ తగ్గి సాధారణ పరిస్ధితులకి వస్తుంది అని ఇంధనశాఖ కార్యదర్శి శ్రీధర్ తెలిపారు.