సింగరేణి ద్వారా ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను తెలంగాణ ప్రజలకు అంకితం చేస్తామని ఆ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ ఎన్. శ్రీధర్ తెలిపారు.
జైపూర్(ఆదిలాబాద్ జిల్లా): సింగరేణి ద్వారా ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను తెలంగాణ ప్రజలకు అంకితం చేస్తామని ఆ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ ఎన్. శ్రీధర్ తెలిపారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా జైపూర్ మండలంలో నూతనంగా నిర్మించనున్న 1200 మెగావాట్ల పవర్‌ఫ్లాంట్‌కు సంబంధించిన రెండో బాయిలర్ లైట్‌ఆప్ పనులకు ఆయన శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ పవర్ ఫ్లాంట్‌ను మార్చి-2016 కల్లా పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. ఫ్లాంట్‌లో తయారైన విద్యుత్‌ను తెలంగాణ ప్రజలకు అంకితం చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఫ్లాంట్‌లోని పలు నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు.