భారత క్రికెట్ కోచ్‌ను కలిసిన అఖిల్
భారత క్రికెట్ కోచ్‌ను కలిసిన అఖిల్
Published Wed, Mar 8 2017 12:02 PM | Last Updated on Tue, Sep 5 2017 5:33 AM
బెంగుళూరు: భారత క్రికెట్ జట్టు ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్‌ను నటుడు అక్కినేని అఖిల్ కలిశాడు. బెంగుళూరులో జరిగిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అఖిల్.. అనుకోకుండా భారత జట్టు ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్‌ను కలిసినట్లు ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. అఖిల్ తనను కలిసిన విషయాన్ని శ్రీధర్ కూడా అభిమానులతో పంచుకున్నారు.
ఈ సమయంలో అఖిల్, శ్రీధర్‌లు కలిసిదిగిన ఫోటో ఇన్‌స్టాగ్రాంలో షేర్ అవుతోంది. ఆస్ట్రేలియాతో భారత్ టెస్టు మ్యాచ్‌లు ఆడుతున్న నేపధ్యంలో భవిష్యత్తులో జరగబోయే మ్యాచ్‌లలో విజయాలు సాధించాలని ట్విట్టర్ వేదికగా ఆకాంక్షించాడు అఖిల్.
Advertisement
Advertisement