fielding coach
-
గంభీర్ మార్క్.. భారత ఫీల్డింగ్ కోచ్‌గా నెదర్లాండ్స్ లెజెండ్!?
భారత జట్టు కొత్త హెడ్‌కోచ్‌గా టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ ఎంపికైన సంగతి తెలిసిందే. జూలై 26 నుంచి శ్రీలంక పర్యటనతో అతడు తన కొత్త ప్రయాణం ప్రారంభం కానుంది. కాగా కోచింగ్ స్టాఫ్ ఎంపిక విషయంలో గంభీర్‌కు బీసీసీఐ పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్టు సమాచారం.ఈ క్రమంలో తన సహాయక సిబ్బంది నియామకంపై గంభీర్ కసరత్తులు మొదలెట్టాడు. ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు తనతో కలిసి పనిచేసిన నెదర్లాండ్స్ క్రికెట్ దిగ్గజం ర్యాన్ టెన్ డష్కాటేను తన టీమ్‌లోకి తీసుకునేందుకు గంభీర్ ఆసక్తిగా ఉ న్నట్లు తెలుస్తోంది.అతడికి ఫీల్డింగ్ కోచ్ బాధ్యతలు అప్పగించే అవకాశముందని క్రిక్‌బజ్ తమ కథనంలో పేర్కొంది. తాజాగా టెన్ డష్కాటేను ఉద్దేశించి గంభీర్ చేసిన వ్యాఖ్యలు ఈ వార్తలకు మరింత ఊతమిస్తున్నాయి. ర్యాన్ టెన్ డష్కాటే నిస్వార్థపరుడని, తను జీవితాంతం నమ్మే వ్యక్తి అతడేనని గంభీర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కొనియాడాడు. దీంతో డష్కాటే గంభీర్ కోచింగ్ స్టాప్‌లో భాగం కావడం దాదాపు ఖారారైనట్లు అభిమానులు భావిస్తున్నారు. కాగా టెన్ డష్కాటేకి కోచ్‌గా అపారమైన అనుభవం ఉంది. కరీబియన్ ప్రీమియర్ లీగ్, మేజర్ లీగ్ క్రికెట్, యూఏఈ టీ20 వంటి ప్రాంఛైజీ క్రికెట్ లీగ్‌ల్లో సపోర్ట్ స్టాప్‌లో భాగంగా ఉన్నాడు. నెదర్లాండ్స్ తరపున 33 వన్డేలు, 24 టీ20లు ఆడిన అతడు.. వరుసగా 1541, 533 పరుగులు చేశాడు. అదేవిధంగా బౌలింగ్‌లో 88 వికెట్లు పడగొట్టాడు. 2011 వన్డే వరల్డ్‌కప్ అనంతరం అంతర్జాతీయ క్రికెట్లో టెన్ డష్కాటే మరి కన్పించలేదు. -
టీమిండియా ఫీల్డింగ్ కోచ్‌గా జాంటీ రోడ్స్..?
టీమిండియా తదుపరి ఫీల్డింగ్ కోచ్‌గా జాంటీ రోడ్స్ ఎంపిక కాబోతున్నాడన్న వార్త ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతుంది. టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుండటంతో అతని కోచింగ్ బృందంలోని సభ్యులను కూడా మారుస్తారన్న ప్రచారం జరుగుంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు తదుపరి ఫీల్డింగ్ కోచ్‌గా జాంటీ రోడ్స్ పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం రాహుల్ బృందంలో ఫీల్డింగ్ కోచ్‌గా టి దిలీప్ ఉన్నాడు. ఒకవేళ ద్రవిడ్‌తో పాటు అతని సహాయ బృందం మొత్తం తప్పుకుంటే.. బీసీసీఐ కొత్త కోచింగ్ టీమ్‌ను ఎంపిక చేయాల్సి ఉంటుంది.ఇదిలా ఉంటే, టీమిండియా తదుపరి హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ పేరు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తుంది. ఈ నెల (జూన్) చివరి వారంలో గంభీర్ పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. తన సపోర్టింగ్ స్టాఫ్ ఎంచుకునే విషయంలో గంభీర్ పూర్తి స్వేచ్చను ఇవ్వాలని బీసీసీఐని కోరినట్లు సమాచారం. ఇందులో భాగంగా గంభీరే రోడ్స్ పేరును ప్రతిపాదించినట్లు తెలుస్తుంది. గంభీర్, రోడ్స్ 2022, 2023 ఐపీఎల్ సీజన్లలో లక్నో సూపర్ జెయింట్స్‌కు సేవలందించారు. గంభీర్ మెంటార్, రోడ్స్ ఫీల్డింగ్ కోచ్‌గా లక్నో ఫ్రాంచైజీకి పని చేశారు. కోచ్‌గా తొలిసారి..గంభీర్ భారత ఫుల్‌టైమ్ హెడ్ కోచ్‌గా నియమితుడైతే ఇదే అతనికి హెడ్ కోచ్‌గా మొదటి బాధ్యత అవుతుంది. గంభీర్ గతంలో ఏ జట్టుకు ఫుల్‌టైమ్ హెడ్ కోచ్‌గా పని చేయలేదు. అయితే అతను మూడు సీజన్ల పాటు ఐపీఎల్లో మెంటార్‌గా వ్యవహరించాడు. 2022, 2023లో లక్నోతో.. 2024లో కేకేఆర్‌కు మెంటార్‌గా పని చేశాడు. గత ఐపీఎల్ సీజన్లో కేకేఆర్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టడంతో గంభీర్ పేరు టీమిండియా హెడ్ కోచ్ రేసులో ప్రధానంగా వినిపిస్తుంది. -
ఐపీఎల్‌కు ముందు సన్‌రైజర్స్ కీలక నిర్ణయం.. ఈసారైనా
ఐపీఎల్-2023 సీజన్ ప్రారంభానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు ఫీల్డింగ్ కోచ్‌గా నెదర్లాండ్స్ ప్రధాన కోచ్ ర్యాన్ కుక్‌ను ఎస్ఆర్హెచ్ నియమించింది. గత ఏడాది సీజన్లో దారుణ ప్రదర్శన అనంతరం ఎస్ఆర్హెచ్.. తమ కోచింగ్ స్టాప్‌లో భారీ మార్పులు చేసింది. ఈ క్రమంలోనే గతేడాది సీజన్లోనే బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరించిన విండీస్ దిగ్గజం బ్రియాన్ లారా.. ఈ ఏడాది సీజన్లో హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఇక ర్యాన్ కుక్ విషయానికి వస్తే.. అతడు తొట్ట తొలి సౌతాఫ్రికా టీ20 లీగ్ టైటిల్‌ను సొంతం చేసుకున్న సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌కు అసిస్టెంట్ కోచ్‌గా పనిచేశాడు. ఐపీఎల్ 16వ సీజన్ నేపథ్యంలో నెదర్లాండ్స్ తదుపరి రెండు ద్వైపాక్షిక సిరీస్‌లకు కుక్ దూరం కానున్నారు. అతడు ఒకట్రెండు రోజుల్లో ఎస్ఆర్ హెచ్ జట్టుతో కలిసే అవకాశం ఉంది. అతడు హెడ్‌కోచ్ బ్రియాన్ లారాతో కలిసి పని చేయనన్నాడు. మార్క్రమ్ మ్యాజిక్ చేస్తాడా? గత ఏడాది సీజన్లో దారుణ ప్రదర్శన కనబరిచిన ఎస్ఆర్హెచ్.. పాయింట్ల పట్టికలో 8వ స్ధానంలో నిలిచింది. దీంతో ఐపీఎల్ 16వ సీజన్‌కు ముందు ఎస్ఆర్హెచ్ తమ జట్టులో సమూల మార్పులు చేసింది. ఈ నేపథ్యంలో తమ జట్టు కెప్టెన్‌గా దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ ఐడైన్ మార్క్రమ్ను సన్‌రైజర్స్ నియమించింది. కాగా తొట్ట తొలి సౌతాఫ్రికా టీ20 లీగ్ టైటిల్‌ను సొంతం చేసుకున్న ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌కు కూడా మార్క్రమ్ సారథ్యం వహించాడు. దీంతో ఐపీఎల్లో కూడా మార్క్రమ్ సారథిగా విజయవంతమవుతాడని ఆరెంజ్ ఆర్మీ అభిమానులు భావిస్తున్నారు. ఇక ఈ ఏడాది ఐపీఎల్ మార్చి 31 నుంచి ప్రారంభం కానుంది. ఎస్ఆర్హెచ్ తమ తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ వేదికగా ఏప్రిల్2న రాజస్తాన్ రాయల్స్‌తో తలపడనుంది. చదవండి: IND vs AUS: మూడో వన్డేకు సూర్యకుమార్‌ను తప్పిస్తారా..? క్లారిటీ ఇచ్చిన రోహిత్ శర్మ -
జింబాబ్వే క్రికెట్లో తీవ్ర విషాదం.. దంపతుల హఠాన్మరణం
Sinikiwe Mpofu: జింబాబ్వే మహిళా క్రికెట్ జట్టు అసిస్టెంట్ కోచ్ సినికివె ఎంపోఫు హఠాన్మరణం చెందింది. 37 ఏళ్ల వయసులోనే కన్నుమూసింది. తన నివాసంలో శనివారం కుప్పకూలిన సినికివె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. జింబాబ్వే ఫీల్డింగ్ కోచ్ కూడా మృతి సినికివె భర్త, జింబాబ్వే క్రికెట్ పురుషుల జట్టు ఫీల్డింగ్ కోచ్ షెఫర్డ్ మకునురా మరణించిన రోజుల వ్యవధిలోనే ఆమె కూడా శాశ్వతంగా ఈ లోకాన్ని వీడటం విషాదకరం. షెఫర్డ్ డిసెంబరు 15న చనిపోయాడు. కాగా ఇద్దరు కీలక వ్యక్తులు ఇలా అకస్మాత్తుగా దూరం కావడంతో జింబాబ్వే క్రికెట్ శోకసంద్రంలో మునిగిపోయింది. PC: Zimbabwe Cricket కఠిన శ్రమకోర్చి కెరీర్లో మంచి స్థాయికి చేరుకున్న ఈ సినికివెను చావు తమ నుంచి దూరం చేసిందంటూ జింబాబ్వే మేనేజింగ్ డైరెక్టర్ గివ్మోర్ మకోని విచారం వ్యక్తం చేశారు. జింబాబ్వే మహిళా క్రికెట్లో ఆదర్శనీయమైన వ్యక్తిగా ఎంతో మంది ఆదరాభిమానాలు చూరగొన్న ఆమె ఇలా అర్ధంతరంగా వెళ్లిపోవడం జీర్ణించుకోలేకపోతున్నామని సంతాపం వ్యక్తం చేశారు. PC: Zimbabwe Cricket రోజుల వ్యవధిలో దంపతులు హఠాన్మరణం సినికివె, షెఫర్డ్ దంపతుల హఠాన్మరణం వారి కుటుంబాలతో పాటు తమకు కూడా తీరని లోటు అని భావోద్వేగానికి లోనయ్యారు. వీరి పిల్లలు, తల్లిదండ్రులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. జాతీయ జట్టులో కీలకమైన ఇద్దరు సభ్యులను కోల్పోయామని.. ఇంతటి విషాదం మరెక్కడా ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా సినికివె 2006లో జింబాబ్వే తరఫున క్రికెట్ ఆడిన తొలి మహిళా జట్టులో సభ్యురాలు. ప్లేయర్‌గా కెరీర్ ముగిసిన తర్వాత ఆమె కోచింగ్ స్టాఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించింది. మహిళా జట్టు అసిస్టెంట్ కోచ్ స్థాయికి ఎదిగింది. మౌంటనీర్స్ వుమెన్‌ను ఫిఫ్టీ50 చాలెంజ్‌లో విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించింది. చదవండి: Suryakumar Yadav: సూర్య కెరీర్‌పై గంభీర్ ట్వీట్! నీకు అతడు మాత్రమే కనిపిస్తున్నాడా? ఫ్యాన్స్ ఫైర్ Suryakumar Yadav: సూర్య ఇండియన్ కాబట్టి సరిపోయింది.. అదే పాకిస్తాన్లో ఉంటేనా: పాక్ మాజీ కెప్టెన్ -
కివీస్ టూర్లో టీమిండియాకు కొత్త ఫీల్డింగ్ కోచ్!
టి20 ప్రపంచకప్‌లో సెమీస్ ఓటమి తర్వాత టీమిండియా వెంటనే మరో సిరీస్‌కు రెడీ కానుంది. న్యూజిలాండ్ పర్యటించనున్న టీమిండియా అక్కడ కివీస్‌తో మూడు టి20లు, మూడు వన్డేలు ఆడనుంది. కాగా టి20 సిరీస్‌కు హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ వహించనుండగా.. వన్డే సిరీస్‌కు టీమిండియాను ధావన్ నడిపించనున్నాడు. ఇక కివీస్ పర్యటనకు సీనియర్లు సహా ప్రధాన కోచ్ ద్రవిడ్‌లకు రెస్ట్ ఇవ్వడంతో వీవీఎస్ లక్ష్మణ్ కోచ్ బాధ్యతలు తీసుకోగా.. అతనికి సపోర్ట్ స్టాఫ్‌గా హృషికేష్ కనిత్కర్, సాయిరాజ్ బహుతులేలు బ్యాటింగ్, బౌలింగ్ కోచ్‌లుగా ఎంపికయ్యారు. తాజాగా కివీస్ పర్యటనకు బీసీసీఐ.. మునిష్ బాలీని కొత్త ఫీల్డింగ్ కోచ్‌గా నియమించినట్లు సమాచారం. కాగా కివీస్ పర్యటనలో సపోర్ట్ స్టాప్‌లో ఉన్న ముగ్గురు ఎన్సీఏతో అనుబంధం ఉన్నవారే. వీరి ఎంపికలో ఎన్సీఏ హెడ్.. కివీస్ పర్యటనకు కోచ్‌గా ఉన్న వీవీఎస్ లక్ష్మణ్ పాత్ర ఉందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాగా మునిష్ బాలి ఇంతకముందు టీమిండియా ఐర్లాండ్ పర్యటనలోనూ సపోర్ట్ స్టాప్‌గా ఉన్నాడు. ఆ తర్వాత సౌతాఫ్రికాతో స్వదేశంలో జరిగిన సిరీస్‌లోనూ తన విధులు నిర్వర్తించాడు. తాజాగా పూర్తి స్థాయిలో ఫీల్డింగ్ కోచ్‌గా నియమించినట్లు తెలుస్తోంది. కాగా ఇదే సమయంలో సీనియర్స్ టీమ్ మాత్రం బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లనుంది. ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా బంగ్లాతో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఇక కివీస్ పర్యటనలో నవంబర్ 18న తొలి టీ20 ఆడనున్న టీమిండియా.. 20, 22 తేదీల్లో రెండు, మూడు మ్యాచ్‌లు ఆడనుంది. అనంతరం 25న తొలి వన్డే, 27, 30 తేదీల్లో రెండు, మూడు వన్డేలు ఆడనుంది. న్యూజిలాండ్ పర్యటనకు భారత టి20 జట్టు.. హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్ న్యూజిలాండ్ పర్యటనకు భారత వన్డే జట్టు.. శిఖర్ ధవన్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్, వికెట్‌కీపర్), శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, శార్ధూల్ ఠాకూర్, షాబాజ్ అహ్మద్, యుజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, దీపక్ చాహర్, కుల్దీప్ సేన్, ఉమ్రాన్ మాలిక్ -
ద్రవిడ్ జట్టును ఖరారు చేసిన బీసీసీఐ..!
Vikram Rathour, Paras Mhambrey, T Dilip Set To Be Team India Support Staff: టీమిండియా కోచింగ్ సిబ్బంది నియామకాలు దాదాపుగా ఖరారైనట్టేనని తెలుస్తోంది. ఇటీవలే టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పేరును అధికారికంగా వెల్లడించిన బీసీసీఐ.. మరి కొద్ది గంటల్లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్‌ల పేర్లను కూడా ప్రకటించే అవకాశం ఉంది. బ్యాటింగ్ కోచ్‌గా విక్రమ్ రాథోడ్నే కొనసాగించాలని నిర్ణయించిన భారత క్రికెట్ బోర్డు.. బౌలింగ్ కోచ్‌గా ద్రవిడ్ సన్నిహితుడు, టీమిండియా మాజీ బౌలర్ పరాస్ మాంబ్రేను, ఫీల్డింగ్ కోచ్‌గా టి దిలీప్‌ను నియమించనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ ముగ్గురు పేర్లు ఖరారైతే.. వీరంతా ద్రవిడ్ కోచింగ్ టీంలో సహాయక సిబ్బందిగా పని చేస్తారు. ఈ నియామకాలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా, టీమిండియా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్ స్థానాలతో పాటు నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో స్పోర్ట్స్ సైన్స్, మెడిసిన్ హెడ్ పదవులకు బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. చదవండి: T20 WC 2021 PAK VS AUS: పాక్‌ను ఓడించడం అసాధ్యం.. రమీజ్ రజా -
భారత జట్టు ఫీల్డింగ్ కోచ్ గా అభయ్ శర్మ నియమితమయ్యే అవకాశం
-
టీమిండియా ఫీల్డింగ్ కోచ్ రేసులో అజయ్ రాత్రా
Teamindia fielding coach: భారత క్రికెట్ జట్టు ఫీల్డింగ్ కోచ్ పదవికి టీమిండియా మాజీ వికెట్ కీపర్ అజయ్ రాత్రా దరఖాస్తు చేసుకున్నాడు. హరియాణాకు చెందిన 39 ఏళ్ల రాత్రా 6 టెస్టుల్లో, 12 వన్డేల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ప్రస్తుతం అజయ్ రాత్రా అస్సాం జట్టుకు కోచ్‌గా ఉన్నాడు. అంతేకాకుండా గతంలో అతడు భారత మహిళల జట్టు, ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ కోచింగ్ బృందంలో పనిచేశాడు. ‘అవకాశం ఇస్తే భారత క్రికెట్ జట్టు అభివృద్ధికి నా వంతుగా కృషి చేస్తా’ అని రాత్రా వ్యాఖ్యానించాడు. చదవండి: T20 World Cup 2021: పెను ప్రమాదం తప్పించకున్న పాక్ అంపైర్ .. వీడియో వైరల్ -
టీమిండియా ఫీల్డింగ్ కోచ్ రేసులో అభయ్ శర్మ..
Abhay Sharma set To Apply for India Fielding Coach: భారత యువ జట్లకు ఫీల్డింగ్ కోచ్‌గా పనిచేసిన అభయ్ శర్మ ఇప్పుడు సీనియర్ జట్టుకు సేవలందించేందుకు ఆసక్తి కనబరుస్తున్నాడు. ఫీల్డింగ్ కోచ్ పదవి కోసం త్వరలోనే దరఖాస్తు చేయనున్నాడు. 52 ఏళ్ల అభయ్ శర్మకు ఢిల్లీ తరఫున 89 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉంది. జాతీయ క్రికెట్ అకాడమీలో డైరెక్టర్ ద్రవిడ్ సహాయక సిబ్బందిలో ఫీల్డింగ్ శిక్షకుడిగా వ్యవహరిస్తున్నాడు. భారత్ ‘ఎ’, అండర్–19, భారత సీనియర్ మహిళల జట్లకు ఫీల్డింగ్ కోచ్‌గా పనిచేశాడు. చదవండి: T20 WC 2021 IND Vs PAK: పఠాన్ టీమిండియా ప్లేయింగ్ ఎలెవెన్.. అశ్విన్‌కు నో ప్లేస్ -
భారత మహిళా క్రికెట్ జట్టు ఫీల్డింగ్ కోచ్‌పై వేటు
న్యూఢిల్లీ: భారత మహిళల క్రికెట్ జట్టు ఫీల్డింగ్ కోచ్ అభయ్ శర్మను బీసీసీఐ తప్పించింది. ఆస్ట్రేలియా పర్యటనకు ముందు జట్టు సభ్యులతో పాటు సహాయక సిబ్బంది కూడా బెంగళూరులో ఏర్పాటు చేసిన ప్రత్యేక ‘బయోబబుల్’లోకి మంగళవారంలోగా అడుగు పెట్టాల్సి ఉంది. అయితే అభయ్ ఇంకా జట్టుతో చేరకపోవడంతో ఆయనను తొలగించినట్లు తెలిసింది. ఈ క్రమంలో.. త్వరలోనే ఫీల్డింగ్ కోచ్‌ను ఎంపిక చేస్తామని బోర్డు వర్గాలు వెల్లడించాయి. కాగా, 52 ఏళ్ల అభయ్ శర్మ భారత దేశవాళీ క్రికెట్లో ఢిల్లీ, రైల్వేస్, రాజస్థాన్ జట్ల తరఫున వికెట్ కీపర్‌గా రాణించాడు. ఇటీవలి కాలంలో అతను ఇండియా-ఏ, భారత్ అండర్-19 జట్లకు ఫీల్డింగ్ కోచ్‌గా వ్యవహరించాడు. ఇదే ఏడాది అభయ్ భారత మహిళా క్రికెట్ జట్టుకు ఫీల్డింగ్ కోచ్‌గా ఎంపికయ్యాడు. -
ఫీల్డర్ల ఏకాగ్రతకు పరీక్ష.. వైరలవుతున్న కొత్త ఫీల్డింగ్ డ్రిల్
లండన్: టీమిండియా ఫీల్డింగ్‌ను మరింత మెరుగుపరిచేందుకు, ఫీల్డర్ల ఏకాగ్రతను పరీక్షించడానికి ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ ఓ వినూత్న ప్రయత్నం చేశాడు. ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్‌కు ముందు లార్డ్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న ప్లేయర్స్‌కు ఓ కొత్త ఫీల్డింగ్ డ్రిల్‌ను ఏర్పాటు చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్లో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ బ్యాటింగ్ చేస్తుండగా.. స్టంప్స్ వెనుక రిషబ్ పంత్ కీపింగ్ చేస్తూ కనిపించాడు. అతని ఏకాగ్రతను పరీక్షించడానికి శ్రీధర్ తనకు రెండు వైపులా ఇద్దరు ప్లేయర్స్‌ను ఉంచాడు. How is that for a drill? Fielding coach @coach_rsridhar keeping the boys on their toes. #TeamIndia #ENGvIND @RishabhPant17 • @Wriddhipops • @prasidh43 • @Hanumavihari pic.twitter.com/LjER4lgFV0 — BCCI (@BCCI) August 10, 2021 బౌలర్ బౌలింగ్ చేస్తుండగా.. ఈ ఇద్దరు ప్లేయర్స్ అటు నుంచి ఇటు బంతిని విసురుతూ క్యాచింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. మధ్యలో ఈ బాల్ వల్ల పంత్ తన ఏకాగ్రత కోల్పోకుండా బౌలర్ విసిరిన బంతిని పట్టుకోవాలి. ఈ వినూత్న ఫీల్డింగ్ డ్రిల్ ఎలా ఉంది అంటూ బీసీసీఐ ట్విటర్లో సంబంధిత వీడియోను పోస్ట్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు కొత్త ఫీల్డింగ్ డ్రిల్ ఐడియా అదుర్స్ అంటున్నారు. కాగా, రేపటి నుంచి ప్రారంభం కాబోయే రెండో టెస్ట్ కోసం టీమిండియా లార్డ్స్ మైదానంలో ముమ్మరంగా సాధన చేస్తోంది. ఫీల్డింగ్‌తో పాటు బ్యాటింగ్, బౌలింగ్‌లో ఆటగాళ్లు చమటోడుస్తున్నారు. -
ఈ క్రికెటర్లో పూర్తి అథ్లెట్‌ను చూశాను: టీమిండియా ఫీల్డింగ్ కోచ్
భారత ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ టీమిండియా ఆటగాడు శుబ్‌మన్ గిల్‌పై ప్రశంసలు కురిపించాడు. తాను ఇటువంటి క్రికెటర్‌ను చూడలేదంటూ కితాబిచ్చాడు. కాగా ఐపీఎల్ రాణించడంతో వెలుగులోకి వచ్చిన గిల్ జాతీయ జట్టులోనూ సత్తా చాటి తానేంటో నిరూపించుకున్నాడు. ఈ క్రమంలోనే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ జాబితాలో గిల్ చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. శుభమన్ గిల్ ఒక పూర్తి అథ్లెట్: భారత ఫీల్డింగ్ కోచ్ కేవలం ఏడు టెస్టుల అనుభవంతో శుభమన్ అంతర్జాతీయ క్రికెట్‌కు చాలా కొత్తవాడనే చెపాలి. గత కొన్ని సంవత్సరాలుగా టెస్ట్ ఓపెనర్లకు ఇంగ్లండ్ పిచ్‌లు అంతటి అనుకూలం కాదు. పైగా ఈ మెగా ఈవెంట్లో ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌతీ, నీల్ వాగ్నెర్ లాంటి పేసర్లని ఎదుర్కొనే గిల్ రాణించాల్సి ఉంటుందని శ్రీధర్ తెలిపారు. గిల్ గురించి మాట్లాడుతూ.. '' అతను సన్నగా పొడవైనవాడు, గ్రౌండ్‌లోనే చురుకుగా కదలడం, బ్యాటింగ్ పద్ధతిలోనూ లోపాలు లేవు, అలాగే ఫీల్డింగ్ పరంగానూ ఆకట్టుకుంటున్నాడు. ఇలా నేను చూసిన క్రికెటర్లలో పూర్తి అథ్లెట్ అతనేనని భావిస్తున్నట్లు'' టైమ్స్ ఆఫ్ ఇండియాతో చాట్‌లో అన్నారు. ఈ నెలాఖరులో జరిగే ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో భారత్ న్యూజిలాండ్‌తో తలపడినప్పుడు చాలా మంది కళ్ళు శుబ్‌మన్ గిల్‌పై ఉండనున్నాయి. ఇదిలావుండగా.. డబ్ల్యుటీసీ ఫైనల్, ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టు జూన్ 2న ఇంగ్లండ్ వెళ్లనుంది. విరాట్ కోహ్లి జట్టు అక్కడికి వెళ్లిన తర్వాత 10 రోజుల క్వారంటైన్లో గడపనున్నారు. అందువల్ల, కివీస్‌పై అంతిమ యుద్ధానికి సిద్ధం కావడానికి వారికి ఎక్కువ సమయం లభించదు. చదవండి: దుమ్మురేపాడు.. నెటిజన్లచే చివాట్లు తిన్నాడు -
ఫీల్డింగ్‌లో మెరుగుపడాలి
న్యూఢిల్లీ: విదేశీ జట్లపై నిలకడగా విజయాలు దక్కాలంటే భారత మహిళల క్రికెట్ జట్టు ఫీల్డింగ్ విభాగంలో మరింత మెరుగైన ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉందని టీమిండియా ఫీల్డింగ్ కోచ్ అభయ్ శర్మ అభిప్రాయపడ్డారు. చాలాకాలం భారత అండర్–19 పురుషుల జట్టుకు కోచ్‌గా వ్యవహరించిన అభయ్ శర్మ... గత మార్చిలో స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే, టి20 సిరీస్‌లో భారత మహిళల జట్టుకు తొలిసారి ఫీల్డింగ్ కోచ్‌గా వచ్చారు. చివరి నిమిషంలో దక్షిణాఫ్రికాతో సిరీస్ ఏర్పాటు కావడం... జట్టు సభ్యులతో కలిసి పనిచేసేందుకు తగినంత సమయం కూడా లభించకపోవడంతో ఆయన ఫీల్డింగ్ విభాగంపై పూర్తిస్థాయిలో దృష్టి సారించలేకపోయారు. అయితే వచ్చే నెలలో ఇంగ్లండ్ పర్యటన మాత్రం అభయ్ శర్మ పనితీరు ఎలా ఉందనే విషయం తెలియజేస్తుంది. ఈ పర్యటనలో భారత జట్టు ఒక టెస్టు, మూడు వన్డేలు, మూడు టి20 మ్యాచ్‌లు ఆడనుంది. ‘ఫీల్డింగ్ విషయానికొస్తే చాలా మెరుగుపడాల్సిన అవసరం ఉంది. మహిళల క్రికెట్లో కాలానుగుణంగా ఎన్నో మార్పులు వస్తున్నాయి. ప్రత్యర్థి జట్టును కట్టడి చేయాలంటే, పరుగులు ఎక్కువ ఇవ్వకూడదంటే ఫీల్డర్లు మైదానంలో ఎల్లవేళలా చురుకుగా కదలాల్సి ఉంటుంది. సాంకేతికంగా కూడా కొన్ని అంశాల్లో మనం మెరుగుపడాలి. ముఖ్యంగా త్రోయింగ్‌లో మన అమ్మాయిలు బలహీనంగా ఉన్నారు. కెరీర్ ఆరంభంలోనే మనం సరైన పద్ధతిలో శిక్షణ తీసుకోకపోతే ఆ తర్వాత మనకు ఇబ్బందులు ఎదురవుతాయి’ అని అభయ్ శర్మ విశ్లేషించారు. ‘విదేశీ మహిళా క్రికెటర్లతో పోలిస్తే మనం కొన్ని విభాగాల్లో ఇంకా వెనుకబడి ఉన్నామని అంగీకరించాలి. దక్షిణాఫ్రికా అమ్మాయిలు మైదానంలో చురుకుగా కదులుతారు. శారీరకంగా కూడా విదేశీ మహిళా క్రికెటర్లు పటిష్టంగా ఉంటారు’ అని అభయ్ శర్మ వివరించారు. -
‘స్లెడ్జింగ్ మొదలు పెట్టగానే విషయం తెలిసింది’
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో భారత జట్టు పోరాటపటిమ, అద్భుత ప్రదర్శన ఎప్పటికీ మరిచిపోలేనిది. ముఖ్యంగా సిడ్నీ టెస్టును అశ్విన్, విహారి కలిసి కాపాడుకున్న తీరు అసమానం. ఈ పర్యటనలో తాను ఆడిన తొలి మూడు టెస్టులకు సంబంధించిన పలు ఆసక్తికర అంశాలను భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, జట్టు ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్‌తో కలిసి పంచుకున్నాడు. మైదానంలో అశ్విన్, విహారి పోరాడుతున్న సమయంలో కోచ్‌లుగా తమ పరిస్థితి ఎలా ఉందో శ్రీధర్ గుర్తు చేసుకున్నాడు. ‘పుజారా అవుటయ్యాక ఆందోళన పెరిగిపోయింది. విహారికి కండరాలు పట్టేయడం కూడా రవిశాస్త్రికి ఆగ్రహం తెప్పించింది. ఒక్క సింగిల్ తీస్తేనే ఇలా జరుగుతుందా అని అతను కోప్పడ్డాడు. ఇక అశ్విన్, విహారి డిఫెన్స్ మొదలయ్యాక ప్రతీ బంతికి అతనిలో ఉత్కంఠ కనిపించింది. ఒక్క బంతి ఆడగానే సీట్లోంచి లేవడం, శభాష్ అంటూ మళ్లీ కూర్చోవడం...ఇలా ఇలా 249 బంతుల పాటు సాగింది. మ్యాచ్ ముగిసేవరకు ఈ భావోద్వేగాలు కొనసాగాయి’ అని శ్రీధర్ చెప్పాడు. అశ్విన్ కూడా విహారితో తన భాగస్వామ్యం గురించి చెప్పుకొచ్చాడు. ‘నేను స్పిన్‌ను సమర్థంగా ఆడతాను కాబట్టి లయన్‌ను ఎదుర్కోవాలని, పేసర్లను విహారి ఆడాలనేది ప్లాన్. అయితే ఒక దశలో సింగిల్ కారణంగా లెక్క మారిపోయింది. కమిన్స్ బౌలింగ్‌లో దెబ్బలు తినకుండా ఆడటం అసాధ్యం. అదే నాకు జరిగింది. మధ్యలో శార్దుల్ ఠాకూర్ డ్రెస్సింగ్ రూమ్ నుంచి పరుగెత్తుకొచ్చాడు. ఏదో సందేశం ఉందని మేం భావిస్తే... హెడ్ కోచ్ మీకు ఏవేవో సూచనలు ఇవ్వమని నాకు చెప్పి పంపించాడు. అయితే నేను మాత్రం అవేమీ మీకు చెప్పను. మీరు ఎలా ఆడుతున్నారో అలాగే ఆడండి అని చెప్పి వెళ్లిపోయాడు. ఇది చెప్పడానికి నువ్వు రావాలా అన్నాను. ఆసీస్ పేలవ వ్యూహాలు కూడా మాకు మేలు చేశాయి. నేను వంగడం కష్టమై నిటారుగా నిలబడుతుంటే నాకు బౌన్సర్లు వేశారు. అదే ముందుకొచ్చి ఆడేలా చేస్తే నేను బాగా ఇబ్బంది పడేవాడిని. పైన్ స్లెడ్జింగ్ మొదలు పెట్టగానే మమ్మల్ని అవుట్ చేసే విషయంలో వారు చేతులెత్తేశారని మాకు అర్థమైపోయింది’ అని అశ్విన్ వివరించాడు. అడిలైడ్‌లో ఘోర పరాభవం తర్వాత అదే రోజు అర్ధరాత్రి సమావేశంలోనే మెల్బోర్న్ టెస్టు కోసం వ్యూహరచన చేశామని శ్రీధర్ వెల్లడించాడు. 36కు ఆలౌట్ అయిన తర్వాత బ్యాటింగ్‌ను పటిష్టం చేయడంపై దృష్టి పెట్టకుండా అదనపు బౌలర్‌ను తీసుకోవాలనే ఆలోచన బాగా పని చేసిందని, జడేజా అద్భుతంగా ఆడాడని అతను కితాబునిచ్చాడు. పైగా ఆసీస్ బౌలర్లు ఒకే లైన్లో బంతులు వేస్తున్న విషయంపై చర్చించి ఎడమ చేతివాటం ఆటగాడు ఉంటే బాగుంటుందని భావించి పంత్‌ను తుది జట్టులోకి తీసుకున్నట్లు చెప్పాడు. జూలైలోనే వ్యూహరచన ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఆఫ్‌సైడ్ వైపు ఆడే అవకాశాలు బాగా తగ్గిస్తే తాము పైచేయి సాధించవచ్చనే ప్రణాళికను సిరీస్‌కు చాలా రోజుల ముందుగా వేసినట్లు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ వెల్లడించాడు. సిరీస్‌లో లెగ్ సైడ్ ఆడబోయి కీలక ఆటగాళ్లు స్మిత్, లబ్‌షేన్ వికెట్లు కోల్పోవడంతో భారత్‌కు పట్టు చిక్కింది. ‘స్మిత్, లబ్‌షేన్ ఎక్కువగా కట్, పుల్ షాట్లతో పాటు ఆఫ్ సైడ్ పరుగులు సాధించే బ్యాట్స్‌మెన్. అయితే న్యూజిలాండ్ పేసర్ వాగ్నర్ కొద్ది రోజుల ముందు లెగ్ సైడ్ బౌలింగ్ చేసి స్మిత్‌ను బాగా ఇబ్బంది పెట్టాడు. ఇది చూసి పన్నిన వ్యూహం అద్భుతంగా పని చేసింది’ అని అరుణ్ వివరించారు. ఆస్ట్రేలియా పర్యటనలో లభించిన ఆణిముత్యం సిరాజ్ అని హెడ్ కోచ్ రవిశాస్త్రి ప్రశంసలు కురిపించారు. వ్యక్తిగత బాధను దిగమింగి అతను జట్టు కోసం చేసిన ప్రదర్శనను ఎంత ప్రశంసించినా తక్కువేనని అభిప్రాయపడ్డాడు. మరోవైపు ఒక రోజు ఆలస్యంగా శుక్రవారం అశ్విన్, వాషింగ్టన్ సుందర్ స్వస్థలం చెన్నై చేరుకొని రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆరు రోజులు క్వారంటైన్‌కు వెళ్లిపోయారు. -
ఐపీఎల్ ఆరంభానికి ముందే వచ్చేసిన కరోనా
జైపూర్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)–2020 కోసం బీసీసీఐనుంచి ఫ్రాంచైజీల వరకు అంతా సిద్ధమైపోతున్నారు... యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో చకచకా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఆగస్టు 20 నుంచి ఒక్కో జట్టు యూఏఈ వెళ్లేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్న సమయంలో నిర్వాహకులను ఇబ్బంది పెట్టే వార్త ఇది. రాజస్తాన్ రాయల్స్ జట్టుకు ఫీల్డింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న దిశాంత్ యాజ్ఞిక్‌కు కరోనా వచ్చినట్లు తేలింది. కోవిడ్–19 పరీక్షలో తనకు పాజిటివ్‌గా వచ్చినట్లు అతను ప్రకటించాడు. యూఏఈ బయల్దేరడానికి ముందు జట్టు సభ్యులందరినీ ఒకే చోట చేర్చే క్రమంలో తాము పరీక్షలు నిర్వహించామని, ఇందులో యాజ్ఞిక్ పాజిటివ్‌గా తేలినట్లు రాయల్స్ యాజమాన్యం వెల్లడించింది. అయితే గత పది రోజుల్లో అతనికి దగ్గరగా జట్టులోని ఏ ఆటగాడు వెళ్లలేదని కూడా ఫ్రాంచైజీ స్పష్టం చేసింది. నెగెటివ్‌గా తేలితే... ఐపీఎల్ ఆరంభానికి నెలకు పైగా సమయముంది కాబట్టి దిశాంత్ యాజ్ఞిక్‌కు కరోనా రావడం ప్రస్తుతానికి జట్టుపై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. అయితే టీమ్ ప్రణాళికలు కచ్చితంగా దెబ్బ తింటాయి. క్వారంటీన్‌తో పాటు సన్నాహకాల కోసమే ఐపీఎల్ జట్లు దాదాపు నెల రోజులు ముందుగా యూఏఈ వెళుతున్నాయి. ఇలాంటి స్థితిలో ఫీల్డింగ్ కోచ్ ఆలస్యంగా జట్టుతో చేరితే అది కొంత ఇబ్బంది పెట్టవచ్చు. ఇప్పుడు దిశాంత్ 14 రోజుల పాటు చికిత్స తీసుకుంటూ క్వారంటైన్లో గడపాల్సి ఉంది. ఆ తర్వాత అతను భారత్‌లోనే రెండు సార్లు కోవిడ్–19 పరీక్షలకు హాజరు కావాలి. ఆ రెండు నెగెటివ్‌గా వస్తేనే యూఏఈ విమానమెక్కుతాడు. అక్కడికి చేరాక నిబంధనల ప్రకారం ఆరు రోజులు క్వారంటీన్లో ఉండి మరో మూడు సార్లు కరోనా పరీక్షలు చేయించుకోవాలి. అప్పటి వరకు ఆ జట్టు ఫీల్డింగ్ కోచ్ సేవలు కోల్పోయినట్లే. ప్రతికూల పరిస్థితుల మధ్య ఐపీఎల్‌కు సన్నద్ధమైన బీసీసీఐ, ఫ్రాంచైజీలకు తాజా పరిణామం ఒక హెచ్చరికలాంటిదే. ఇక్కడినుంచి బయల్దేరడానికి ముందునుంచి లీగ్ ముగిసే వరకు వారు ఎన్నెన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందో ఈ ఉదంతం చూపించింది. రాజస్తాన్ రాయల్స్ తరఫునే 2011–2014 మధ్య ఐపీఎల్ ఆడిన దిశాంత్ యాజ్ఞిక్ దేశవాళీ క్రికెట్లో రాజస్తాన్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఇటీవలే అతను రాబోయే సీజన్ కోసం పాండిచ్చేరి జట్టుకు కూడా ఫీల్డింగ్ కోచ్‌గా ఎంపికయ్యాడు. -
ఇదేం పద్ధతి?
న్యూఢిల్లీ: ఐపీఎల్ మ్యాచ్‌లలో కొన్ని జట్లు అనుసరిస్తున్న ఫీల్డింగ్ వ్యూహాలను మాజీ క్రికెటర్, ఢిల్లీ క్యాపిటల్స్ అసిస్టెంట్ కోచ్ మొహమ్మద్ కైఫ్ తప్పు పట్టాడు. తుది జట్టులో ఉన్న ఆటగాళ్లలో మందకొడిగా ఫీల్డింగ్ చేసేవారు ఎవరైనా ఉంటే వారి స్థానాల్లో కావాలని చురుకైన ఫీల్డర్లను తీసుకొస్తున్నారని... తగిన కారణం లేకుండా సబ్స్టిట్యూట్లను వాడుకోవడం సరైంది కాదని కైఫ్ వ్యాఖ్యానించాడు. దీనిపై అంపైర్లు దృష్టి పెట్టాలని, లేదంటే తామే వారికి ఫిర్యాదు చేస్తామని అతను అన్నాడు. ‘కోల్‌కతాతో మ్యాచ్‌లో రసెల్ స్థానంలో రింకూ సింగ్ వచ్చాడు. చావ్లా వేగంగా తన నాలుగు ఓవర్లను పూర్తి చేసుకొని బయటకు వెళ్లిపోతే మళ్లీ రింకూ సింగ్ బరిలోకి దిగాడు. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా సర్ఫరాజ్ గాయం గురించి నాకు స్పష్టత లేదు కానీ అతని స్థానంలో వచ్చిన కరుణ్ నాయర్ అద్భుతమైన క్యాచ్ అందుకొని మ్యాచ్ స్వరూపాన్ని మార్చాడు. నెమ్మదిగా కదిలే ఆటగాళ్ల స్థానంలో చురుకైన ఫీల్డర్లను తెచ్చి ఆయా జట్లు తెలివిగా వ్యవహరించాయని భావిస్తున్నాయి. అయితే నా దృష్టిలో అది తప్పు. దీనిని ఇకపై అంపైర్ల దృష్టికి తీసుకెళతాం’ అని కైఫ్ చెప్పాడు. మరో వైపు ఫీల్డింగ్ చేస్తున్న జట్లు వ్యూహాలు రూపొందించడంలో చాలా సమయాన్ని వృథా చేస్తున్నాయని, నిజానికి అంత అవసరం లేదని అతను అన్నాడు. -
ఫీల్డింగ్ కోచ్ గా హాడిన్
సిడ్నీ:ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాడిన్ ను ఆ జట్టు ఫీల్డింగ్ కోచ్ గా ఎంపికచేశారు. గతంలో ఆసీస్ జట్టుకు వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ గా సేవలందించిన హాడిన్ కు ఫీల్డింగ్ కోచ్ గా బాధ్యతలు అప్పచెబుతూ క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) నిర్ణయం తీసుకుంది. ఆసీస్ మాజీ బ్యాట్స్‌మన్ గ్రెగ్ బ్లెవెట్ స్థానంలో హాడిన్ ను ఫీల్డింగ్ కోచ్ గా నియమించారు. 2019 వరకూ హాడిన్ ఫీల్డింగ్ కోచ్ గా కొనసాగనున్నారు. ఈ ఏడాది న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన ఆస్ట్రేలియా-ఎ జట్టుకు హాడిన్ కోచ్ గా పనిచేశారు. మరొకవైపు పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్(పీపీఎల్) లో ఇస్లామాబాద్ ప్రాంఛైజీకి కోచ్ గా హాడిన్ సేవలందించారు. ఆసీస్ తరపున 66 టెస్టులకు ప్రాతినిథ్య వహించిన హాడిన్ 262 క్యాచ్ లు అందుకున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్ లో 126 వన్డేలు, 34 అంతర్జాతీయ ట్వంటీ 20 మ్యాచ్ లను హాడిన్ ఆడాడు. 2015లో తన అంతర్జాతీయ క్రికెట్ కు హాడిన్ గుడ్ బై చెప్పాడు. -
భారత క్రికెట్ కోచ్‌ను కలిసిన అఖిల్
బెంగుళూరు: భారత క్రికెట్ జట్టు ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్‌ను నటుడు అక్కినేని అఖిల్ కలిశాడు. బెంగుళూరులో జరిగిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అఖిల్.. అనుకోకుండా భారత జట్టు ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్‌ను కలిసినట్లు ట్విట్టర్లో పేర్కొన్నాడు. అఖిల్ తనను కలిసిన విషయాన్ని శ్రీధర్ కూడా అభిమానులతో పంచుకున్నారు. ఈ సమయంలో అఖిల్, శ్రీధర్‌లు కలిసిదిగిన ఫోటో ఇన్‌స్టాగ్రాంలో షేర్ అవుతోంది. ఆస్ట్రేలియాతో భారత్ టెస్టు మ్యాచ్‌లు ఆడుతున్న నేపధ్యంలో భవిష్యత్తులో జరగబోయే మ్యాచ్‌లలో విజయాలు సాధించాలని ట్విట్టర్ వేదికగా ఆకాంక్షించాడు అఖిల్. It was pleasant surprise to catch up with @akkineniakhil & @rcratul indeed a surprise to meet such well behaved up boys in today's world!! A post shared by R Sridhar (@coach_rsridhar) on Mar 5, 2017 at 7:01am PST