ద్రవిడ్‌ జట్టును ఖరారు చేసిన బీసీసీఐ..! | Vikram Rathour, Paras Mhambrey, T Dilip Set To Be Team India Coaching Staff | Sakshi
Sakshi News home page

Team India Coaching Staff: ద్రవిడ్‌ జట్టును ఖరారు చేసిన బీసీసీఐ..!

Published Thu, Nov 11 2021 8:52 PM | Last Updated on Thu, Nov 11 2021 9:55 PM

Vikram Rathour, Paras Mhambrey, T Dilip Set To Be Team India Coaching Staff - Sakshi

Vikram Rathour, Paras Mhambrey, T Dilip Set To Be Team India Support Staff: టీమిండియా కోచింగ్‌ సిబ్బంది నియామకాలు దాదాపుగా ఖరారైనట్టేనని తెలుస్తోంది. ఇటీవలే టీమిండియా హెడ్‌ కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ పేరును అధికారికంగా వెల్లడించిన బీసీసీఐ.. మరి కొద్ది గంటల్లో బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ కోచ్‌ల పేర్లను కూడా ప్రకటించే అవకాశం ఉంది. బ్యాటింగ్‌ కోచ్‌గా విక్రమ్‌ రాథోడ్‌నే కొనసాగించాలని నిర్ణయించిన భారత క్రికెట్‌ బోర్డు.. బౌలింగ్‌ కోచ్‌గా ద్రవిడ్‌ సన్నిహితుడు, టీమిండియా మాజీ బౌలర్‌ పరాస్‌ మాంబ్రేను, ఫీల్డింగ్‌ కోచ్‌గా టి దిలీప్‌ను నియమించనున్నట్లు తెలుస్తోంది.

ఒకవేళ ఈ ముగ్గురు పేర్లు ఖరారైతే.. వీరంతా ద్రవిడ్‌ కోచింగ్‌ టీంలో సహాయక సిబ్బందిగా పని చేస్తారు. ఈ నియామకాలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా, టీమిండియా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్‌ స్థానాలతో పాటు నేష‌న‌ల్ క్రికెట్ అకాడ‌మీ (ఎన్‌సీఏ)లో స్పోర్ట్స్‌ సైన్స్‌, మెడిసిన్ హెడ్ ప‌ద‌వుల‌కు బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. 
చదవండి: T20 WC 2021 PAK VS AUS: పాక్‌ను ఓడించడం అసాధ్యం.. రమీజ్ రజా


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement