Batting coach
-
టీమిండియా బ్యాటింగ్ కోచ్‌గా సితాన్షు కొటక్
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు కోచింగ్ బృందంలో మరో వ్యక్తి కొత్తగా చేరాడు. సౌరాష్ట్ర మాజీ కెప్టెన్ సితాన్షు కొటక్ టీమిండియా బ్యాటింగ్ కోచ్‌గా ఎంపికయ్యాడు. బుధవారం నుంచి ఇంగ్లండ్‌తో జరిగే టి20 సిరీస్ నుంచి అతను బాధ్యతలు చేపడతాడు. 52 ఏళ్ల సితాన్షు 2019 నుంచి జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో బ్యాటింగ్ కోచ్‌గా పని చేస్తున్నాడు. భారత ‘ఎ’ జట్టు పర్యటనల్లో పలు మార్లు కోచ్‌గా పని చేసిన సితాన్షు... సీనియర్ టీమ్‌కు వీవీఎస్ లక్ష్మణ్ కోచ్‌గా వెళ్లిన సిరీస్‌లలో అతనికి అసిస్టెంట్‌గా కూడా వ్యవహరించాడు. సితాన్షు లెవల్–3 క్వాలిఫైడ్ కోచ్ కూడా. తాజా ఎంపికతో భారత టీమ్‌లో అసిస్టెంట్ కోచ్‌ల సంఖ్య ఐదుకు చేరింది. గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తుండగా ...మోర్నీ మోర్కెల్ (బౌలింగ్), టి.దిలీప్ (ఫీల్డింగ్)లతో పాటు అభిషేక్క్ నాయర్, టెన్ డస్కటేలకు కూడా ఇప్పటికే అసిస్టెంట్ కోచ్ హోదా ఉంది. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టు ఓటమికి బ్యాటింగ్ వైఫల్యమే కారణమని బీసీసీఐ తాజా సమీక్షా సమావేశంలో చర్చ జరిగింది. దాంతో మన బ్యాటర్లను సాంకేతికంగా మరింత మెరుగుపర్చే క్రమంలో భాగంగానే కొత్త బ్యాటింగ్ కోచ్‌గా ఎంపిక చేసినట్లు సమాచారం. దశాబ్ద కాలానికి పైగా సాగిన దేశవాళీ కెరీర్లో సౌరాష్ట్ర టీమ్‌కు ప్రాతినిధ్యం వహించిన సితాన్షు 130 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో 41.76 సగటుతో 8061 పరుగులు చేశాడు. ఇందులో 15 సెంచరీలు, 55 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 89 లిస్ట్ ‘ఎ’ మ్యాచ్‌లు కూడా ఆడిన సితాన్షు 42.23 సగటుతో 3083 పరుగులు సాధించాడు. -
టీమిండియా బ్యాటింగ్ కోచ్‌గా కేపీ..?
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో బ్యాటర్ల ఘోర వైఫల్యం నేపథ్యంలో భారత జట్టు బ్యాటింగ్ కోచ్ కోసం అన్వేషిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి క్రిక్‌బజ్‌లో ఓ నివేదిక వచ్చింది. ఇందులో బీసీసీఐ భారత బ్యాటింగ్ విభాగంలో సహాయక సిబ్బందిని బలోపేతం చేయాలని చూస్తున్నట్లు పేర్కొని ఉంది. ఈ అంశాన్ని ఓ యూజర్ ఎక్స్‌లో పోస్ట్ చేయగా.. ఇంగ్లండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ స్పందించాడు. భారత శిబిరంలో చేరడానికి తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.🚨 BATTING COACH FOR INDIA. 🚨- The BCCI exploring possibilities to add a batting coach to India's coaching staff. (Cricbuzz). pic.twitter.com/mIRTwPDxOX— Mufaddal Vohra (@mufaddal_vohra) January 15, 202544 ఏళ్ల కెవిన్ పీటర్సన్‌కు అద్భుతమైన బ్యాటర్‌గా పేరుంది. సౌతాఫ్రికాలో పుట్టిన కెవిన్.. 2004-2014 మధ్యలో మూడు ఫార్మాట్లలో ఇంగ్లండ్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఇంగ్లండ్ తరఫున 104 టెస్ట్‌లు ఆడిన కేపీ.. 23 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీల సాయంతో 47.3 సగటున 8181 పరుగులు చేశాడు.తన కెరీర్లో 136 వన్డేలు ఆడిన కేపీ 9 సెంచరీలు, 25 హాఫ్ సెంచరీల సాయంతో 40.7 సగటున 4440 పరుగులు చేశాడు. టీ20ల్లోనూ మంచి రికార్డు కలిగిన కేపీ.. 37 మ్యాచ్‌ల్లో 141.5 స్ట్రయిక్‌రేట్‌తో 1176 పరుగులు చేశాడు. ఆఫ్ స్పిన్ బౌలర్ కూడా అయిన కేపీ మూడు ఫార్మాట్లలో కలిపి 18 వికెట్లు తీశాడు.2009 నుంచి 2016 వరకు ఐపీఎల్ ఆడిన కేపీ వివిధ ఫ్రాంచైజీల తరఫున 36 మ్యాచ్‌లు ఆడి 134.7 స్ట్రయిక్‌రేట్‌తో 1001 పరుగులు చేశాడు. ఇందులో సెంచరీ, 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కేపీ తన ఐపీఎల్ కెరీర్లో ఏడు వికెట్లు కూడా తీశాడు.రిటైర్మెంట్ అనంతరం కేపీ వివిధ క్రికెట్ లీగ్‌ల్లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. ఇంగ్లండ్ ఆస్ట్రేలియాలో యాషెస్ సిరీస్ (2010-11) సొంతం చేసుకున్న బృందంలో కేపీ కీలక సభ్యుడిగా ఉన్నాడు. 2012-13 భారత పర్యటనలోనూ కేపీ ఇరగదీశాడు. దూకుడు స్వభావం కలిగిన కేపీ తన కెరీర్లో ఎన్నో వివాదాల్లో తల దూర్చాడు. వివాదాలు ఎలా ఉన్నా కేపీ అన్నింటికీ బ్యాట్‌తో సమాధానం చెప్పేవాడు.కాగా, ప్రస్తుతం భారత కోచింగ్ బృందంలో ఐదుగురు సభ్యులు ఉన్నారు. గౌతమ్ గంభీర్ టీమిండియాకు ప్రధాన కోచ్‌గా వ్యవహరిస్తుండగా.. మోర్నీ మోర్కెల్ బౌలింగ్ కోచ్‌గా, టి దిలీప్ ఫీల్డింగ్ కోచ్‌గా సేవలందిస్తున్నారు. ర్యాన్ టెన్ డస్కటే, అభిషేక్ నాయర్ అసిస్టెంట్ కోచ్‌లుగా వ్యవహరిస్తున్నారు. భారత జట్టుకు ప్రత్యేకించి బ్యాటింగ్ కోచ్ లేడు. ఈ స్థానం కోసం ఎవరైనా అనుభవజ్ఞుడిని ఎంచుకుంటే టీమిండియాకు మేలు చేకూరే అవకాశం ఉంది.ఇదిలా ఉంటే, ఇటీవల ముగిసిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని భారత్ 1-3 తేడాతో కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్ మాత్రమే గెలిచిన భారత్ ఆతర్వాత దారుణంగా విఫలమై మూడు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. ప్రస్తుతం భారత్ ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లు, ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ప్రిపేర్ అవుతుంది. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ ఈ నెల 22 నుంచి ప్రారంభమవుతుంది.భారత్, ఇంగ్లండ్ మధ్య టీ20 సిరీస్ షెడ్యూల్..జనవరి 22- తొలి టీ20(కోల్‌కతా)జనవరి 25- రెండో టీ20(చెన్నై)జనవరి 28- మూడో టీ20(రాజ్‌కోట్)జనవరి 31- నాలుగో టీ20(పుణే)ఫిబ్రవరి 2- ఐదో టీ20(ముంబై, వాంఖడే)భారత్, ఇంగ్లండ్ మధ్య వన్డే సిరీస్ షెడ్యూల్..ఫిబ్రవరి 6- తొలి వన్డే(నాగ్‌పూర్)ఫిబ్రవరి 9- రెండో వన్డే(కటక్)ఫిబ్రవరి 12- మూడో వన్డే(అహ్మదాబాద్)ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ షెడ్యూల్..ఫిబ్రవరి 20- బంగ్లాదేశ్ (దుబాయ్)ఫిబ్రవరి 23- పాకిస్తాన్ (దుబాయ్)మార్చి 2- న్యూజిలాండ్ (దుబాయ్) -
న్యూజిలాండ్ కోచ్‌గా భారత మాజీ ఓపెనర్.. ఎవరంటే?
ఆఫ్గానిస్తాన్-న్యూజిలాండ్ మధ్య చారిత్రత్మక టెస్టు మ్యాచ్‌కు భారత్ ఆతిథ్యమివ్వనున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 9 నుంచి గ్రేటర్ నోయిడా వేదికగా ఈ ఏకైక టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు ఇప్పటికే నోయిడాకు చేరుకుని తమ ప్రాక్టీస్‌ను కూడా మొదలెట్టేశాయి.అయితే ఈ మ్యాచ్‌కు ముందు న్యూజిలాండ్ క్రికెట్ కీలక నిర్ణయం తీసుకుంది. అఫ్గాన్ టెస్టుతో పాటు భారత్‌తో టెస్టు సిరీస్‌లకు తమ జట్టు బౌలింగ్ కోచ్‌గా శ్రీలంక మాజీ స్పిన్నర్ రంగనా హెరాత్‌ను న్యూజిలాండ్ క్రికెట్ నియమించింది. అదేవిధంగా అఫ్గాన్‌తో ఏకైక టెస్టుకు భారత మాజీ ఓపెనర్ విక్రమ్ రాథోర్‌ను తమ బ్యాటింగ్ కోచ్‌గా కివీస్ క్రికెట్ బోర్డు ఎంపిక చేసింది. ఈ విషయాన్ని కివీస్ హెడ్ కోచ్ గ్యారీ స్టెడ్ ధ్రువీకరించాడు. హెరత్, విక్రమ్ తమ టెస్ట్ గ్రూప్‌లోకి రావడం చాలా సంతోషంగా ఉందని స్టెడ్ తెలిపాడు. కాగా టీ20 వరల్డ్‌కప్-2024 గెలుచుకున్న భారత జట్టు బ్యాటింగ్ కోచ్‌గా రాథోర్ పనిచేసిన సంగతి తెలిసిందే. భారత్ హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం ముగియడంతో రాథోర్ కాంట్రాక్ట్‌ను కూడా బీసీసీఐ పునరుద్దరించలేదు. మరోవైపు హెరత్ గతంలో చాలా జట్లకు బౌలింగ్ కన్సెల్టెంట్‌గా పనిచేశాడు. -
ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్.. శ్రీలంక బ్యాటింగ్ కోచ్‌గా ఇంగ్లండ్ మాజీ ప్లేయర్
ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం శ్రీలంక జట్టు ప్రత్యేకంగా బ్యాటింగ్ కోచ్‌ను నియమించుకుంది. ప్రత్యర్ధి జట్టుకు చెందిన మాజీ ఆటగాడిని శ్రీలంక జట్టు బ్యాటింగ్ కోచ్‌గా ఎంపిక చేసుకుంది. ఇంగ్లండ్ మాజీ బ్యాటర్ ఇయాన్ బెల్ లంకతో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు శ్రీలంక బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరిస్తాడు. ఈ విషయాన్ని లంక బోర్డు ఇవాళ (ఆగస్ట్ 13) ప్రకటించింది.42 ఏళ్ల ఇయాన్ బెల్ 2004-15 మధ్యలో ఇంగ్లండ్ తరఫున 118 టెస్ట్‌లు, 161 వన్డేలు, 8 టీ20లు ఆడాడు. టెస్ట్‌ల్లో 22 సెంచరీలు, 46 హాఫ్ సెంచరీల సాయంతో 7727 పరుగులు.. వన్డేల్లో 4 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీల సాయంతో 5416 పరుగులు.. టీ20ల్లో ఓ హాఫ్ సెంచరీ సాయంతో 188 పరుగులు చేశాడు.బెల్‌ను బ్యాటింగ్ కోచ్‌గా నియమించుకోవడం వెనుక శ్రీలంక క్రికెట్ బోర్డుది పెద్ద వ్యూహరచనే ఉంది. బెల్కు ఇంగ్లండ్ జట్టుతో సుదీర్ఘ అనుబంధం ఉంది కాబటి, ఆ జట్టు లోటుపాట్లు తెలిసే అవకాశం ఉంది. అలాగే బ్యాటింగ్ కోచ్‌గా కూడా బెల్కు మంచి ట్రాక్ రికార్డే ఉంది. ఈ అంశాలన్నీ ఇంగ్లండ్ పర్యటనలో శ్రీలంకకు కలిసొచ్చే అవకాశం ఉంది.ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ కోసం శ్రీలంక జట్టు..ధనంజయ డిసిల్వ (కెప్టెన్), దిముత్ కరుణరత్నే, నిషన్ మధుష్క, పథుమ్ నిస్సంక, కుసాల్ మెండిస్ (వైస్ కెప్టెన్), ఏంజెలో మాథ్యూస్, దినేశ్ చండీమల్, కమిందు మెండిస్, సమరవిక్రమ, అశిత ఫెర్నాండో, విశ్వ ఫెర్నాండో, కసున్ రజిత, లహీరు కుమార, నిసాల తారక, ప్రభాత్ జయసూర్య, రమేశ్ మెండిస్, జెఫ్రీ వాండర్సే, మిలన్ రత్నాయకేఇంగ్లండ్ జట్టు..హ్యారీ బ్రూక్, డేనియల్ లారెన్స్, బెన్ డకెట్, జో రూట్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), క్రిస్ వోక్స్, జోర్డన్ కాక్స్, ఓలీ పోప్, జేమీ స్మిత్ (వికెట్‌కీపర్), గస్ అట్కిన్సన్, షోయబ్ బషీర్, మాథ్యూ పాట్స్, ఓలీ స్టోన్, మార్క్ వుడ్షెడ్యూల్..ఆగస్ట్ 21-25: తొలి టెస్ట్ (మాంచెస్టర్)ఆగస్ట్ 29-సెప్టెంబర్: రెండో టెస్ట్ (లార్డ్స్)సెప్టెంబర్ 6-10: మూడో టెస్ట్ (కెన్నింగ్స్టన్ ఓవల్) -
కోచ్‌గా దినేశ్ కార్తీక్
టీమిండియా వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ దినేశ్ కార్తీక్ ఐపీఎల్లో కీలక బాధ్యతలు చేపట్టనున్నాడు. డీకే.. తన తాజా మాజీ జట్టైన ఆర్సీబీకి బ్యాటింగ్ కోచ్ కమ్ మెంటార్‌గా ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని ఆర్సీబీ ట్విటర్ వేదికగా అధికారికంగా ప్రకటించింది. వచ్చే సీజన్ (2025) నుంచి డీకే కొత్త విధుల్లో చేరతాడని ఆర్సీబీ పేర్కొంది. "సరికొత్త అవతారంలో మరోసారి మాలో భాగమవుతున్న దినేష్ కార్తీక్‌కు స్వాగతం"అని ఆర్సీబీ ట్వీట్లో రాసుకొచ్చింది.39 ఏళ్ల డీకే.. ఈ ఏడాదే ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో (2008, 2009, 2010, 2014) ఐపీఎల్ ప్రస్తానాన్ని ప్రారంభించిన కార్తీక్.. గత మూడు సీజన్లలో ఆర్సీబీకి (2024, 2023, 2022) ప్రాతినిథ్యం వహించాడు. ఈ మధ్యలో కార్తీక్.. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ (2011), ముంబై ఇండియన్స్ (2012, 2013), ఆర్సీబీ (2015), గుజరాత్ లయన్స్ (2016, 2017), కేకేఆర్ (2018, 2019, 2020, 2021) ఫ్రాంచైజీలకు ఆడాడు.ఐపీఎల్ ఆరంభ ఎడిషన్ (2008) నుంచి ఆడిన అతి కొద్ది మంది క్రికెటర్లలో (ఏడుగురు) కార్తీక్ ఒకడు. ధోని, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, శిఖర్ ధవన్, సాహా, మనీశ్ పాండే, దినేశ్ కార్తీక్ మాత్రమే ఇనాగురల్ ఎడిషన్ నుంచి ఐపీఎల్ ఆడారు. ఇప్పటివరకు జరిగిన 16 ఎడిషన్లలో పాల్గొన్న కార్తీక్ కేవలం రెండే రెండు మ్యాచ్‌లు మిస్ అయ్యాడు. ఐపీఎల్లో కార్తీక్‌కు ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. డీకే.. ఐపీఎల్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాడు. డీకే, రోహిత్ శర్మ ఐపీఎల్లో 257 మ్యాచ్‌లు ఆడారు. ఐపీఎల్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన రికార్డు ధోని (264) పేరిట ఉంది. డీకే తన ఐపీఎల్ కెరీర్లో 135.36 స్ట్రయిక్‌రేట్‌తో 4842 పరుగులు చేశాడు. ఇందులో 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కార్తీక్ ఖాతాలో 145 క్యాచ్‌లు, 37 స్టంపింగ్‌లు ఉన్నాయి.Dinesh Karthik talking about RCB and he continues to be with this family. ❤️- RCB 🤝 DK...!!!! pic.twitter.com/TiHTs3yjaA— Tanuj Singh (@ImTanujSingh) July 1, 2024కార్తీక్ కెరీర్‌ను 2022 ఐపీఎల్ ఎడిషన్ మలుపు తప్పింది. ఆ సీజన్లో పేట్రేగిపోయిన కార్తీక్ మ్యాచ్ ఫినిషర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సీజన్ ప్రదర్శన కారణంగా అతనికి టీమిండియా నుంచి పిలుపు వచ్చింది. 2024 సీజన్లోనూ కార్తీక్ చెలరేగి ఆడాడు. ఈ సీజన్లో అతను 187.35 స్ట్రయిక్‌రేట్‌తో 326 పరుగులు చేశాడు. -
కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించనున్న సౌతాఫ్రికా బ్యాటింగ్ లెజెండ్
సౌతాఫ్రికా మాజీ క్రికెటర్, బ్యాటింగ్ లెజెండ్ హషీమ్ ఆమ్లా కొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. ఈ దిగ్గజ ఓపెనర్ జొహనెస్‌బర్గ్ బేస్డ్ ఫ్రాంచైజీ గౌటెంగ్ లయన్స్‌కు బ్యాటింగ్ కోచ్‌గా నియమితుడయ్యాడు. మూడేళ్ల పాటు ఆమ్లా ఈ పదవిలో కొనసాగనున్నాడు. సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ జేపీ డుమినీ స్థానంలో ఆమ్లా గౌటెంగ్ లయన్స్ బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్ ఆరంభ ఎడిషన్‌లో ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్ బ్యాటింగ్ కన్సల్టెంట్ పనిచేసిన ఆమ్లా.. ఈ ఏడాదే ప్లేయర్‌గా చివరిసారిగా మైదానంలో కనిపించాడు. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన లెజెండ్స్ లీగ్ క్రికెట్లో అతను వరల్డ్ జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. దిగ్గజ బ్యాటర్‌గా ఖ్యాతి గడించిన 40 ఏళ్ల ఆమ్లా 2004-19 మధ్యలో సౌతాఫ్రికా జాతీయ జట్టుకు ఆడాడు. టెస్ట్, వన్డే ఫార్మాట్లలో 50కు దగ్గరగా సగటు కలిగిన ఆమ్లా.. తన 13 ఏళ్ల కెరీర్లో ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. వన్డేల్లో ఫాస్టెస్ట్ 2000, 3000, 4000, 6000, 7000 పరుగుల రికార్డులు ఇప్పటికీ ఆమ్లా ఖాతాలోనే ఉన్నాయి. కెరీర్లో 124 టెస్ట్‌లు ఆడిన ఆమ్లా.. 28 సెంచరీలు, 41 హాఫ్ సెంచరీల సాయంతో 46.6 సగటున 9282 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్లో అతని అత్యుత్తమ స్కోర్ 311 నాటౌట్‌గా ఉంది. అలాగే 181 వన్డేలు ఆడిన ఆమ్లా... 27 సెంచరీలు, 39 హాఫ్‌సెంచరీల సాయంతో 49.5 సగటున 8113 పరుగులు చేశాడు. 2009-18 మధ్యలో 44 టీ20 ఆడిన ఆమ్లా.. 8 అర్ధశతకాల సాయంతో 1277 పరుగలు చేశాడు. ఐపీఎల్‌లోనూ సత్తా చాటిన ఆమ్లా 2016, 2017 సీజన్లలో 16 మ్యాచ్‌లు ఆడి 2 శతకాలు, 3 అర్ధశతకాల సాయంతో 141.8 స్ట్రయిక్‌రేట్‌తో 577 పరుగులు చేశాడు. -
ఆ ఒక్కటి జరిగితే యశస్వి జైస్వాల్ కెరీర్ నెక్స్ట్ లెవెల్ కే..!
-
ప్లేఆఫ్ ముంగిట ధోని ఫిట్‌నెస్‌పై హస్సీ కీలక వ్యాఖ్యలు
ఐపీఎల్ 16వ సీజన్లో సీఎస్కే రెండో జట్టుగా ప్లేఆఫ్‌కు అర్హత సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌పై 77 పరుగుల విజయంతో 17 పాయింట్లు ఖాతాలో వేసుకున్న సీఎస్కే గుజరాత్ టైటాన్స్‌తో క్వాలిఫయర్-1 ఆడనుంది. కేకేఆర్‌తో మ్యాచ్‌ను లక్నో సూపర్ జెయింట్స్ విజయం దిశగా పయనిస్తున్నప్పటికి అనుకున్న ఓవర్లలో పూర్తి చేయకపోవడంతో రన్‌రేట్ సీఎస్కే కంటే తక్కువ ఉంది. దీంతో సీఎస్కే రెండో స్థానంలో నిలచి సొంత ప్రేక్షకుల మధ్య క్వాలిఫయర్-1 ఆడనుంది. ఇదిలా ఉంటే ధోని ఫిట్‌నెస్‌పై సీఎస్కే బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ సీజన్ ఆరంభం నుంచి ధోని మోకాలి సమస్యతో బాధపడుతున్నాడని.. అందుకే పరుగులు తీసేందుకు ఇష్టపడడం లేదని తెలిపాడు. సీఎస్కే, ఢిల్లీ క్యాపిటల్స్ మిడ్ ఇన్నింగ్స్ బ్రేక్ సమయంలో మైక్ హస్సీ కామెంటేటర్‌తో మాట్లాడాడు. ధోని మోకాలి సమస్య వంద శాతం సమసిపోలేదు. ఇంకా ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. అందుకే ఎక్కువగా పరుగు పెట్టేందుకు ఇష్టపడడం లేదు. బ్యాటింగ్‌కు కూడా ఆఖరి 2-3 ఓవర్లలో రావడానికి కారణం కూడా అదే. నొప్పిని భరిస్తూనే తన పనిని పూర్తి చేస్తున్నాడని అర్థమవుతుంది. ఇంత బాధపెట్టుకొని కూడా అతను తన టార్గెట్‌ను మిస్ అవకుండా బంతిని బాదడమే లక్ష్యంగా పెట్టుకొని సక్సెస్ అవుతున్నాడు అని చెప్పాడు. కాగా ధోని విషయంలో హస్సీ చేసిన వ్యాఖ్యలు నిజమే. ధోని కూడా మ్యాచ్‌ల్లో చాలాసార్లు తన మోకాలికి బ్యాండేజీ లేదా ఐస్‌క్యాప్ పెట్టుకోవడం కనిపించింది. అంతేకాదు ధోనికి ఈ సీజన్ చివరిదని రూమర్లు కూడా వచ్చాయి. కానీ రూమర్లను స్వయంగా కొట్టిపారేసిన ధోని 2024 ఐపీఎల్ కూడా ఆడొచ్చని పరోక్షంగా సంకేతాలు ఇచ్చాడు. ఇక హస్సీ వ్యాఖ్యలు సీఎస్కే అభిమానులను ఆందోళనలో పడేసింది. ఒకవేళ ప్లేఆఫ్ సమయానికి ధోనికి మోకాలి సమస్య ఎక్కువై మ్యాచ్‌కు దూరమైతే సీఎస్కే పరిస్థితి ఏంటని తెగ బాధపడుతున్నారు. ''దయచేసి అలాంటి వ్యాఖ్యలు చేయొద్దని.. ప్లేఆఫ్స్‌కు చేరుకున్న సమయంలో ధోని ఫిట్‌నెస్‌పై ఆందోళన కలిగించేలా మాట్లాడడం సరికాదని'' అభిమానులు పేర్కొన్నారు. చదవండి: జడేజాపై సీరియస్ అయిన ధోని! -
వరల్డ్ కప్‌కు ముందు జింబాబ్వేకు భారీ షాక్
ఈనెల (అక్టోబర్ 16) నుంచి ప్రారంభంకానున్న టీ20 వరల్డ్‌కప్‌కు ముందు క్వాలిఫయర్ జట్టు జింబాబ్వేకు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు బ్యాటింగ్ కోచ్, దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ లాన్స్ క్లూసెనర్ మెగా టోర్నీకి ముందు జట్టుతో బంధాన్ని తెంచుకుంటున్నట్లు శుక్రవారం (అక్టోబర్ 7) ప్రకటించాడు. ఈ విషయాన్ని జింబాబ్వే క్రికెట్ బోర్డు సైతం దృవీకరించింది. క్లూసెనర్ రాజీనామా తక్షణమే అమల్లోకి వస్తుందని క్రికెట్ జింబాబ్వే పేర్కొంది. అంతర్జాతీయ స్థాయిలో క్లూసెనర్‌కు పలు దేశాల క్రికెట్ బోర్డులతో ఒప్పందాలు ఉన్న నేపథ్యంలో జింబాబ్వేకు పూర్తి స్థాయి సేవలు అందించేందుకు అందుబాటులో ఉండలేకపోతున్నాడని, అందుకే ఈ మేరకు కఠినమైన నిర్ణయం తీసుకున్నాడని క్లూసెనర్ ప్రతినిధి తెలిపాడు. కాగా, క్లూసెనర్ ఈ ఏడాది మార్చిలో జింబాబ్వే బ్యాటింగ్ కోచ్‌గా రెండోసారి బాధ్యతలు చేపట్టాడు. అంతకుముందు అతను 2016-2018 మధ్యకాలంలో కూడా జింబాబ్వే బ్యాటింగ్ కోచ్‌గా సేవలందించాడు. క్లూసెనర్ హయాంలో జింబాబ్వే పూర్వపు స్థాయిలో విజయాలు సాధించి ఆకట్టుకుంది. జింబాబ్వే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించడంలో క్లూసెనర్ కీలకపాత్ర పోషించాడు. ఫ్లవర్ సోదరులు, అలిస్టర్ క్యాంప్‌బెల్ లాంటి స్టార్ ప్లేయర్ల రిటైర్మెంట్ తర్వాత చతికిలబడిన జింబాబ్వేకు క్లూసెనర్ తన బ్యాటింగ్ మెళకువలతో పునరుజ్జీవం పోశాడు. ఇటీవలి కాలంలో సికిందర్ రాజా, క్రెయిగ్ ఐర్విన్, సీన్ విలియమ్స్ లాంటి ప్లేయర్లు రాటుదేలడమే ఇందుకు నిదర్శనం. ఇదిలా ఉంటే, జింబాబ్వే జట్టు క్వాలిఫయర్స్‌లో మరో ఏడు జట్లతో కలిసి పోటీపడనుంది. క్వాలిఫయర్స్ గ్రూప్-ఏలో శ్రీలంక, నెదర్లాండ్స్, నమీబియా, యూఏఈ జట్లు పోటీపడనుండగా.. గ్రూప్-బిలో వెస్టిండీస్, స్కాట్లాండ్, ఐర్లాండ్ జట్లతో జింబాబ్వే అమీతుమీ తేల్చుకోనుంది. క్వాలిఫయర్ దశ మ్యాచ్‌లు అక్టోబర్ 16 నుంచి అక్టోబర్ 21 వరకు జరుగనుండగా.. సూపర్-12 మ్యాచ్‌లు అక్టోబర్ 22 నుంచి ప్రారంభమవుతాయి.అక్టోబర్ 23న భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య హైఓల్టేజీ మ్యాచ్ జరుగనుంది. -
మాజీలు సైమన్ కటిచ్, హషీమ్ ఆమ్లాలకు కీలక పదవులు
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ సైమన్ కటిచ్‌ను కీలక పదవి వరించింది. సౌతాఫ్రికా టి20 లీగ్‌లో భాగంగా ముంబై కేప్‌టౌన్‌ను.. ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ముంబై కేప్‌టౌన్‌కు కొత్త కోచ్‌లను ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఆసీస్ మాజీ ఆటగాడు సైమన్ కటిచ్ ముంబై కేప్‌టౌన్ ప్రధాన కోచ్‌గా ఎంపికయ్యాడు. ఇక దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ హషీమ్ ఆమ్లాను తమ బ్యాటింగ్ కోచ్‌గా నియమించింది. ఇక ఫీల్డింగ్ కోచ్‌గా జేమ్స్ పామెంట్‌ను.. అలాగే జట్టు జనరల్ మేనేజర్‌గా రాబిన్ పీటర్సన్‌ను ఎంపిక చేస్తూ ముంబై కేప్‌టౌన్ ఫ్రాంచైజీ నిర్ణయం తీసుకుంది. కాగా ముంబై ఇండియన్స్ యాజమాన్యం సైమన్ కటిచ్‌కు ట్విటర్ వేదికగా వెల్కమ్ చెప్పింది. ''సైమన్ కటిచ్ ముంబై కేప్‌టౌన్ కోచ్‌గా ఎంపికవ్వడం మాకు ఎంతో ఉత్సాహానిస్తుంది. ముంబై కేప్‌టౌన్ హెడ్‌కోచ్‌గా మీకు మా ఫ్యామిలీలోకి స్వాగతం'' అంటూ పేర్కొంది. ఇక సైమన్ కటిచ్ స్పందింస్తూ.. ''ముంబై కేప్‌టౌన్‌కు ప్రధాన కోచ్‌గా ఎంపికవ్వడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. నాపై నమ్మకముంచి ఒక కొత్త జట్టుకు కోచ్‌గా పనిచేయాలని బాధ్యత అప్పగించారు. జట్టులో ఆటగాళ్ల నైపుణ్యతను, సమతుల్యతను పెంచేలా పనిచేస్తాను. లోకల్ ఆటగాళ్ల నైపుణ్యతను బయటికి తీయడమే లక్ష్యంగా పెట్టుకున్నా. ముంబై ఇండియన్స్ యాజమాన్యానికి నా ప్రత్యేక ధన్యవాదాలు'' అంటూ తెలిపాడు. ఇక జనవరిలో జరగనున్న ఆరంభ ఎడిషన్‌కు అంతా సిద్ధమవుతుంది. ఎంఐ కేప్‌టౌన్ వెల్లడించిన ఫస్ట్ గ్రూప్‌లో దక్షిణాఫ్రికా ఆటగాళ్లు కగిసో రబడ, డెవాల్డ్ బ్రెవిస్(అన్క్యాప్డ్)తో పాటు ఫారిన్ ప్లేయర్లు రషీద్ ఖాన్(అఫ్గనిస్తాన్), సామ్ కరన్(ఇంగ్లండ్), లియామ్ లివింగ్‌స్టోన్(ఇంగ్లండ్) ఉన్నారు. కాగా ఈ టీ20 లీగ్ వేలానికి ముందే నిబంధనల ప్రకారం ఐదుగురు ఆటగాళ్లతో ఎంఐ కేప్‌టౌన్ ఒప్పందం చేసుకుంది. WELCOME, COACH KATICH! 🙌 We are eXXcited to announce that Simon Katich has joined the #OneFamily and will be the Head Coach of MI Cape Town! 💙 Read more here: https://t.co/36VSv8n7F0 #OneFamily #MICapeTown #SA20 @SA20_League pic.twitter.com/BFBigOjVvv — MI Cape Town (@MICapeTown) September 15, 2022 చదవండి: లియాండర్ పేస్ గురువు కన్నుమూత ప్రారంభానికి ముందే టి20 ప్రపంచకప్ 2022 కొత్త చరిత్ర -
సన్‌రైజర్స్ బ్యాటింగ్ కోచ్‌గా బ్రియాన్ లారా...
న్యూఢిల్లీ: ఈ సీజన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మన ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) అభిమానుల్ని తీవ్రంగా నిరాశపరిచింది. నిజం చెప్పాలంటే లీగ్‌లోనే చెత్త ప్రదర్శన సన్‌రైజర్స్‌ది. అందుకే అట్టడుగున నిలిచింది. ఈ నేపథ్యంలో ఫ్రాంచైజీ యాజమాన్యం మేలుకుంది. ఎక్కడ లోపాలున్నాయో గుర్తించింది. వ్యూహ వైఫల్యాలను లెక్కించింది. ఎక్కడ తగ్గామో... ఎందుకు ఓడామో తూర్పారబట్టి జట్టు సహాయ బృందాన్ని ప్రక్షాళన చేసింది. ఇప్పుడు... దిగ్గజాలతో సన్‌రైజర్స్‌ను పరిపుష్టిగా మార్చింది. వెస్టిండీస్ బ్యాటింగ్ దిగ్గజం బ్రియాన్ లారాను వ్యూహాత్మక సలహాదారుగా నియమిస్తూ అతనికి బ్యాటింగ్ కోచ్ బాధ్యతలు కూడా అప్పగించింది. దక్షిణాఫ్రికా పేస్ బౌలింగ్ దిగ్గజం డేల్ స్టెయిన్‌ను ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా నియమించింది. 52 ఏళ్ల లారా వెస్టిండీస్ తరఫున 1990 నుంచి 2007 వరకు ఆడి 131 టెస్టుల్లో 11,953 పరుగులు... 299 వన్డేల్లో 10,405 పరుగులు సాధించాడు. 38 ఏళ్ల స్టెయిన్ గత ఆగస్టులో అన్ని రకాల క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, డెక్కన్ చార్జర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ లయన్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించిన స్టెయిన్ మొత్తం 95 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి 97 వికెట్లు తీశాడు. ఇక దక్షిణాఫ్రికా తరఫున మూడు ఫార్మాట్లలో (టెస్టు, వన్డే, టి20) కలిపి 265 మ్యాచ్‌లు ఆడిన స్టెయిన్ 699 వికెట్లు పడగొట్టాడు. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ టామ్ మూడీ సహాయ బృందాన్ని నడిపించనున్నారు. ఈ సీజన్లో జట్టు క్రికెట్ డైరెక్టర్ పాత్రకే పరిమితమైన మూడీని ఎస్ఆర్హెచ్ మళ్లీ హెడ్ కోచ్‌గా నియమించింది. ఈ సీజన్లో హెడ్ కోచ్‌గా వ్యవహరించిన ట్రెవర్ బేలిస్ జట్టును అధఃపాతాళానికి తీసుకెళ్లడం ఫ్రాంచైజీ యాజమాన్యానికి ఏమాత్రం రుచించలేదు. అందుకే హైదరాబాద్‌ను మేటి ఫ్రాంచైజీగా తీర్చిదిద్దిన మూడీని సహాయ సిబ్బంది పూర్తిస్థాయి సేనానిగా నియమించింది. 2013 నుంచి 2019 వరకు మూడీ కోచింగ్‌లోని ఎస్ఆర్హెచ్ చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబరిచింది. 2016లో విజేతగా నిలిచిన సన్‌రైజర్స్, ఐదుసార్లు ప్లేఆఫ్ దాకా పోరాడింది. మరో ఆస్ట్రేలియన్ క్రికెటర్ సైమన్ కటిచ్ సహాయ కోచ్‌గా వ్యవహరిస్తాడు. ఇతను ఈ సీజన్లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్‌కు హెడ్ కోచ్‌గా పనిచేశాడు. భారత మాజీ బ్యాటర్ హేమంగ్ బదానిని ఫీల్డింగ్ కోచ్‌గా ఎంపిక చేశారు. శ్రీలంక మేటి ముత్తయ్య మురళీధరన్‌ను స్పిన్ బౌలింగ్ కోచ్‌గా కొనసాగించనుంది. మెగా వేలానికి ముందు రిటెయిన్ జాబితాలో కెప్టెన్ కేన్ విలియమ్సన్, అన్క్యాప్డ్ ఉమ్రాన్ మలిక్, అబ్దుల్ సమద్‌లను అట్టిపెట్టుకున్న ఎస్ఆర్హెచ్ డాషింగ్ ఓపెనర్ వార్నర్ సహా అందరినీ విడుదల చేసింది. -
ద్రవిడ్ జట్టును ఖరారు చేసిన బీసీసీఐ..!
Vikram Rathour, Paras Mhambrey, T Dilip Set To Be Team India Support Staff: టీమిండియా కోచింగ్ సిబ్బంది నియామకాలు దాదాపుగా ఖరారైనట్టేనని తెలుస్తోంది. ఇటీవలే టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పేరును అధికారికంగా వెల్లడించిన బీసీసీఐ.. మరి కొద్ది గంటల్లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్‌ల పేర్లను కూడా ప్రకటించే అవకాశం ఉంది. బ్యాటింగ్ కోచ్‌గా విక్రమ్ రాథోడ్నే కొనసాగించాలని నిర్ణయించిన భారత క్రికెట్ బోర్డు.. బౌలింగ్ కోచ్‌గా ద్రవిడ్ సన్నిహితుడు, టీమిండియా మాజీ బౌలర్ పరాస్ మాంబ్రేను, ఫీల్డింగ్ కోచ్‌గా టి దిలీప్‌ను నియమించనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ ముగ్గురు పేర్లు ఖరారైతే.. వీరంతా ద్రవిడ్ కోచింగ్ టీంలో సహాయక సిబ్బందిగా పని చేస్తారు. ఈ నియామకాలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా, టీమిండియా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్ స్థానాలతో పాటు నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో స్పోర్ట్స్ సైన్స్, మెడిసిన్ హెడ్ పదవులకు బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. చదవండి: T20 WC 2021 PAK VS AUS: పాక్‌ను ఓడించడం అసాధ్యం.. రమీజ్ రజా -
ఆ పదవి కోసం మళ్లీ దరఖాస్తు చేసుకున్న టీమిండియా మాజీ ఓపెనర్
న్యూఢిల్లీ: టీమిండియా బ్యాటింగ్ కోచ్ పదవి కోసం భారత మాజీ ఓపెనర్ విక్రమ్ రాథోడ్ మరోసారి దరఖాస్తు చేసుకున్నాడు. ఈ పదవికి దరఖాస్తు చేసుకునేందుకు నవంబర్ 3 చివరి తేదీ కావడంతో హుటాహుటిన తన దరఖాస్తును బీసీసీఐకి సమర్పించాడు. బ్యాటింగ్ కోచ్‌గా అతని ఎంపిక లాంఛనమే అయినప్పటికీ.. ఫార్మాలిటీ కోసం ఈ ప్రక్రియను పూర్తి చేశాడు. రాథోడ్ 2019 దక్షిణాఫ్రికా సిరీస్(భారత్‌లో జరిగినది) ద్వారా టీమిండియా బ్యాటింగ్ కోచ్‌గా అరంగేట్రం చేశాడు. సంజయ్ బాంగర్ నుంచి అతను పగ్గాలు చేపట్టాడు. రాథోడ్ పదవీకాలం టీ20 ప్రపంచకప్‌తో ముగుస్తుంది. ఇదిలా ఉంటే, విక్రమ్ రాథోడ్‌తో పాటు టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం రాహుల్ ద్రవిడ్.. బౌలింగ్ కోచ్ పదవికి పరాస్ మాంబ్రే.. ఫీల్డింగ్ కోచ్ పదవి కోసం అజయ్ రాత్రాలు దరఖాస్తు చేసుకున్నారు. ఈ కోచింగ్ టీం ఎంపిక దాదాపుగా ఖరారైనట్లేనని బీసీసీఐ వర్గాల సమాచారం. కాగా, టీమిండియా హెడ్ కోచ్ సహా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్ స్థానాలతో పాటు నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో స్పోర్ట్స్ సైన్స్, మెడిసిన్ హెడ్ పదవులకు బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించిన సంగతి తెలసిందే. చదవండి: టీ20ల్లో చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ కెప్టెన్.. -
అఫ్గనిస్తాన్ కోచ్‌గా అవిష్క గుణవర్ధనే
కాబుల్: తాలిబాన్ల సమస్యతో అట్టుడుకుతున్న తమ దేశంలో అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు కొత్త నిర్ణయం తీసుకుంది. తమ జాతీయ జట్టు కోచ్‌గా శ్రీలంక మాజీ ఆటగాడు అవిష్క గుణవర్ధనేను నియమించింది. గుణవర్ధనే శ్రీలంక జట్టు తరఫున 6 టెస్టులు, 61 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. టి10 టోర్నీ సందర్భంగా అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న గుణవర్ధనేను ఐసీసీ గత మే నెలలోనే నిర్దోషిగా ప్రకటించింది. -
చెప్పకుండానే నిర్ణయాలు.. రాజీనామా చేసిన యూనిస్‌ఖాన్
ఇస్లామాబాద్: పాకిస్థాన్ క్రికెట్ బోర్డులో ముసలం మొదలైనట్లు కనబడుతోంది. జట్టు ఎంపిక విషయంలో తనను సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపిస్తూ జట్టు ప్రధాన బ్యాటింగ్ కోచ్ పదవికి దిగ్గజ ఆటగాడు యూనిస్ ఖాన్ రాజీనామా చేశాడు. అయితే, కోచ్ పదవి నుంచి తప్పుకోవడానికి గల కారణాలను అధికారికంగా వెల్లడించేందుకు ఆయన అయిష్టత వ్యక్తం చేశాడు. పాక్ జట్టు త్వరలో ఇంగ్లండ్, వెస్టిండీస్‌లలో పర్యటించనున్న నేపథ్యంలో యూనిస్ ఖాన్ కోచ్ పదవికి రాజీనామా చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కాగా, బ్యాటింగ్ కోచ్ లేకుండానే పాక్ జట్టు ఇంగ్లండ్, విండీస్ టూర్లకు వెళ్లనున్నట్లు ఆ దేశ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. మరోవైపు యూనిస్ లాంటి దిగ్గజ ఆటగాడి సేవలను కోల్పోవడం పాక్‌కు పెద్ద లోటేనని పీసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వాసిమ్ ఖాన్ వెల్లడించారు. కాగా, యూనిస్ ఖాన్ పాక్ తరఫున 118 టెస్ట్‌లు, 265 వన్డేలు, 25 టీ20 మ్యాచ్‌లు ఆడి 41 సెంచరీలు, 81 అర్ధసెంచరీల సాయంతో దాదాపు 18000 పరుగులను సాధించాడు. యూనిస్ ఖాన్ ఖాతాలో ఓ ట్రిపుల్ హండ్రెడ్ కూడా ఉంది. ఇదిలా ఉంటే, పాక్ జట్టు.. ఈ నెల 25వ తేదీ నుంచి ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. జూలై 20 వరకు సాగే ఈ పర్యటనలో పాక్, ఇంగ్లండ్‌తో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. అనంతరం పాక్ అక్కడి నంచే నేరుగా వెస్టిండీస్ పర్యటనకు బయల్దేరుతుంది. జూలై 21 నుంచి ఆగస్టు 24 వరకు సాగే ఈ పర్యటనలో పాక్ 5 టీ20లు, రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. చదవండి: WTC ఫైనల్: విరాట్ కోహ్లి డ్యాన్స్ అదిరిందిగా! -
భారత మహిళల బ్యాటింగ్ కోచ్‌గా శివ్ సుందర్ దాస్..
న్యూఢిల్లీ: భారత మహిళల క్రికెట్ జట్టు బ్యాటింగ్ కోచ్‌గా టీమిండియా మాజీ టెస్టు ఆటగాడు శివ్ సుందర్ దాస్ ఎంపికయ్యాడు. త్వరలో జరిగే ఇంగ్లండ్ పర్యటన కోసం దాస్‌ను బీసీసీఐ నియమించింది. గత కొన్నేళ్లుగా జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో రాహుల్ ద్రవిడ్‌తో కలిసి కోచ్‌గా పని చేస్తున్న అతను.. 2020లో పట్నాలో జరిగిన నాలుగు దేశాల టోర్నీలో భారత మహిళల ‘ఎ’ జట్టుకు కోచ్‌గా వ్యవహరించాడు. ఈ అనుభవంతో అతనికి జాతీయ జట్టుకు సేవలందించే అవకాశం దక్కింది. కాగా, ఒడిశాకు చెందిన శివ్ సుందర్ దాస్ 2000–2002 మధ్య కాలంలో భారత్ తరఫున ఓపెనర్‌గా 23 టెస్టులు ఆడి 34.89 సగటుతో 2 సెంచరీలు సహా 1326 పరుగులు చేశాడు. అతను 4 వన్డేల్లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఇదిలా ఉంటే.. మహిళల జట్టుకు ఫీల్డింగ్ కోచ్‌గా అభయ్ శర్మను ఎంపిక చేసిన బోర్డు...బరోడాకు చెందిన రాజ్‌కువర్‌దేవి గైక్వాడ్‌ను మేనేజర్‌గా నియమించింది. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా భారత్ ఒక టెస్టు, 3 వన్డేలు, 3 టి20ల్లో ఆడనుంది. చదవండి: టీమిండియా బంగ్లా పర్యటన ఖరారు -
యూనిస్ నా పీకపై కత్తి పెట్టాడు: ఫ్లవర్
న్యూఢిల్లీ: పాక్ మాజీ కెప్టెన్ యూనిస్ ఖాన్‌కు సలహా ఇవ్వబోతే తన పీకపై కత్తి పెట్టాడని ఆ జట్టు మాజీ బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్ ఆరోపించాడు. ‘పాక్ జట్టు తరఫున ఆసీస్ పర్యటనలో ఉండగా ఓ సంఘటన నన్ను బాగా కలవరపెట్టింది. బ్రిస్బేన్ టెస్టు సందర్భంగా నేను యూనిస్‌కు బ్యాటింగ్‌లో సలహా ఇస్తుంటే... అది అతనికి నచ్చలేదేమో ఏకంగా నా పీకపై కత్తి పెట్టేశాడు. మా పక్కనే ఉన్న మికీ ఆర్థర్ కలగజేసుకొని సముదాయించారు. ఈ సంఘటనతో నేను ఒక్కసారిగా ఖిన్నుడినయ్యా. కానీ కోచ్‌గా ఇదంతా నా ప్రయాణంలో భాగమే అనుకొని సరిపెట్టుకున్నాను’ అని అన్నాడు. జింబాబ్వేకు చెందిన ఫ్లవర్‌కు 2016లో కంగారూ టూర్లో ఈ అనుభవం ఎదురైంది. ఇతను 2015 నుంచి 2019 వరకు పాక్ బ్యాటింగ్ కోచ్‌గా పనిచేశాడు. దీనిపై 42 ఏళ్ల మాజీ కెప్టెన్ యూనిస్ స్పందించలేదు. -
బ్యాటింగ్ కోచ్ అవసరం లేదు!
మెల్బోర్న్: కరోనా వైరస్ దెబ్బ క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)పై బాగానే పడింది. ఆర్థిక నష్టాలను పూడ్చుకునే ప్రయత్నంలో బోర్డు తాజాగా 40 మందిపై వేటు వేసింది. ఈ జాబితాలో బ్యాటింగ్ కోచ్ గ్రేమ్ హిక్ కూడా ఉన్నాడు. ఇంగ్లండ్ తరఫున 65 టెస్టులు, 120 వన్డేలు ఆడిన హిక్ 2016నుంచి ఆసీస్ జట్టు బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే సీఈఓ కెవిన్ రాబర్ట్స్‌ను సాగనంపిన సీఏ తాజాగా హిక్ సేవలు అవసరం లేదని తేల్చి చెప్పింది. ఈ సారి అధిక వేతన భత్యాలు పొందుతున్న వారిపైనే సీఏ గురిపెట్టింది. ఈ తొలగింపులతో ఏకంగా రూ. 210 కోట్లు (4 కోట్ల ఆసీస్ డాలర్లు) భారం తగ్గుతుందని సీఏ భావిస్తోంది. తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సీఏ పొదుపు చర్యల్లో భాగంగానే సిబ్బందిని తగ్గించుకుంటున్నట్లు తెలిపింది. పైగా ఈ ఏడాది టి20 ప్రపంచకప్‌కు కూడా ఆతిథ్యమివ్వడం లేదని ప్రకటించిన మరుసటి రోజే ఇక అనవసరమనుకున్న సిబ్బందిని తొలగించింది. అలాగే అండర్–19 మినహా జూనియర్ స్థాయి, ద్వితీయ శ్రేణి క్రికెట్ టోర్నీలను షెడ్యూల్ నుంచి తప్పించింది. మరో వైపు తాత్కాలిక సీఈఓగా బాధ్యతలు చేపడుతున్న నిక్ హాక్లీపై ఐసీసీ మాజీ సీఈ మాల్కమ్ స్పీడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘కష్టకాలంలో హాక్లీ బాధ్యతలు చేపడుతున్నాడు. సరిగ్గా చెప్పాలంటే తొలి మ్యాచ్ ఆడుతున్న బౌలర్ తన తొలి ఓవర్‌ను కోహ్లిని వేస్తున్నట్లుగా అతని పరిస్థితి కనిపిస్తోంది’ అని మాల్కమ్ అన్నాడు. -
‘గుర్తుపెట్టుకోండి.. అతడే మ్యాచ్ డిసైడర్’
చెన్నై: ‘చివరి 15 ఇన్నింగ్స్‌ల్లో ఒక అర్దసెంచరీ.. ఎనిమిది మ్యాచ్‌ల్లో సింగిల్ డిజిట్ స్కోర్’ ఇది టీమిండియా యువ సంచలనం రిషభ్ పంత్ బ్యాటింగ్ పరిస్థితి. తాజాగా వెస్టిండీస్‌తో జరిగిన మూడు టీ20ల్లో వరుసగా 18, 33 నాటౌట్, 0 పరుగులతో తీవ్రంగా నిరాశపరిచాడు. దీంతో పంత్‌పై అటు క్రికెట్ అభిమానులతో పాటు, క్రీడా పండితులు దుమ్మెత్తిపోస్తున్నారు. అంతేకాకుండా పంత్‌ను తప్పించి కేరళ క్రికెటర్ సంజూ శాంసన్‌ను తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ తరుణంలో రిషభ్ పంత్‌పై టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘గత కొద్ది నెలలుగా అతడి బ్యాటింగ్, వికెట్ కీపింగ్ తీరును టీమ్ మేనేజ్మెంట్ నిశితంగా పరిశీలిస్తోంది. అతడిలో అపారమైన ప్రతిభ దాగుంది. అతడు టీమిండియాలో లేక ఏ జట్టులో ఉన్నా ఎక్స్ ఫ్యాక్టర్ పాత్ర పోషిస్తాడనే నమ్మకం మా అందరిలో ఉంది. అందుకే అతడు ఫామ్‌లో లేక తంటాలు పడుతుంటే మేము(టీమ్ మేనేజ్మెంట్) అండగా నిలవాలని అనుకున్నాం. తన వైఫల్యంపై పంత్ కూడా నిరాశతోనే ఉన్నాడు. అందుకే నెట్స్‌లో కఠోర సాధన చేస్తున్నాడు. ఒక్కసారి అతడు ఫామ్ అందుకుంటే టీమిండియా మ్యాచ్ విన్నర్ లేక డిసైడర్ పంత్ అవడం ఖాయం. ఇక టీమిండియా మిడిలార్డర్ సమస్య పూర్తిగా తీరిందని చెప్పలేను. టీ20 ప్రపంచకప్‌కు ఎక్కువ సమయం లేనందున ప్రయోగాలకు వెళ్లకుండా ఉండటమే బెటర్. అయితే శ్రేయస్ అయ్యర్, శివమ్ దూబేలతో మిడిలార్డర్ బలంగా ఉందనే విశ్వాసం ఉంది’అంటూ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ పేర్కొన్నాడు. ఇక విండీస్‌పై టీ20 సిరీస్ నెగ్గిన టీమిండియా ఆదే ఉత్సాహంలో మూడు వన్డేల సిరీస్‌కు సమయాత్తమవుతోంది. ఆదివారం చెన్నై వేదికగా ఇరు జట్ల మధ్య తొలి వన్డే జరగనుంది. చదవండి: బాలీవుడ్ భామతో రిషభ్ డేటింగ్! ధోని పేరు జపించడం మానేయండి -
సంజయ్ బంగర్‌పై వేటు
ముంబై: భారత క్రికెట్ జట్టు ప్రధాన సహాయక సిబ్బందిలో ఇద్దరు కొనసాగనుండగా... మరొకరిపై వేటు పడింది. తన బ్యాటింగ్ లోపాలను సరిదిద్దడంలో కీలక పాత్ర పోషించాడని స్వయంగా విరాట్ కోహ్లి పలు సందర్భాల్లో ప్రశంసలు కురిపించినా సరే... బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్‌కు మాత్రం పొడిగింపు లభించలేదు. మెరుగైన రికార్డే ఉన్నా, వరల్డ్ కప్ సెమీస్‌లో ధోనిని ఏడో స్థానంలో పంపడానికి కారణమయ్యాడంటూ విమర్శలపాలు కావడమే బంగర్ తన పదవిని కోల్పోయేలా చేసినట్లు సమాచారం. బంగర్ స్థానంలో మరో మాజీ ఆటగాడు విక్రమ్ రాథోడ్ బ్యాటింగ్ కోచ్‌గా ఎంపికయ్యాడు. రాథోడ్ భారత్ తరఫున 6 టెస్టులు, 7 వన్డేలు ఆడాడు. మూడేళ్ల క్రితం వరకు భారత సెలక్టర్‌గా కూడా పని చేసిన అతనికి పంజాబ్ రంజీ టీమ్, ఐపీఎల్లో కింగ్స్ ఎలెవన్ జట్లకు కోచ్‌గా పని చేసిన అనుభవం ఉంది. బ్యాటింగ్ శిక్షణలో కొత్తదనం తీసుకురావడం కోసమే ఈ మార్పు చేసినట్లు సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ వెల్లడించారు. రోడ్స్‌కు దక్కని అవకాశం... : కోచ్ రవిశాస్త్రి అండదండలతో పాటు కొన్నేళ్లుగా భారత పేస్ బౌలింగ్ పదునెక్కడంలో ప్రధాన పాత్ర పోషించిన భరత్ అరుణ్‌నే బౌలింగ్ కోచ్‌గా కొనసాగించనున్నారు. మరో వైపు జాంటీ రోడ్స్ స్థాయి వ్యక్తి పోటీపడినా... హైదరాబాదీ ఆర్.శ్రీధర్‌నే ఫీల్డింగ్ కోచ్‌గా సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. టీమ్ అడ్మినిస్ట్రే్టటివ్ మేనేజర్‌గా కూడా హైదరాబాద్‌కే చెందిన గిరీశ్ డోంగ్రే ఎంపికయ్యారు. ఒక్కో పదవికి ప్రాధాన్యతా క్రమంలో మూడు పేర్లను కమిటీ ప్రతిపాదించింది. దీనిపై బీసీసీఐ అధికారిక ముద్ర వేస్తుంది. -
ప్రధాన కోచ్‌గా బంగర్
జింబాబ్వే పర్యటనకు ఎంపిక ఫీల్డింగ్ కోచ్‌గా అభయ్ శర్మ ముంబై: భారత జట్టు బ్యాటింగ్ కోచ్‌గా ఉన్న సంజయ్ బంగర్‌కు రాబోయే సిరీస్ కోసం ప్రమోషన్ లభించింది. జింబాబ్వేలో పర్యటించే టీమిండియాకు ఆయన ప్రధాన కోచ్‌గా వ్యవహరిస్తారు. భారత్‌కు కొత్త కోచ్‌ను ఎంపిక చేసేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉండటంతో తాత్కాలికంగా ఈ సిరీస్ వరకు బంగర్‌కు బీసీసీఐ బాధ్యతలు అప్పజెప్పినట్లు తెలుస్తోంది. జట్టు ఫీల్డింగ్ కోచ్‌గా ఇప్పటి వరకు పని చేసిన ఆర్.శ్రీధర్‌ను బోర్డు తప్పించింది. అతని స్థానంలో ఢిల్లీకి చెందిన అభయ్ శర్మను ఫీల్డింగ్ కోచ్‌గా ఎంపిక చేసింది. రైల్వేస్‌కు, ఆ తర్వాత హిమాచల్ ప్రదేశ్‌కు కోచ్‌గా వ్యవహరించిన అభయ్... భారత అండర్-19, భారత ‘ఎ’ జట్లకు ఇటీవలి వరకు ఫీల్డింగ్ కోచ్‌గా పని చేశారు. జింబాబ్వే పర్యటనకు భారత జట్టు మేనేజర్‌గా కోకా రమేశ్ (ఆంధ్ర)ను ఎంపిక చేశారు. టూర్లో ధోని సారథ్యంలోని భారత జట్టు 3 వన్డేలు, 3 టి20 మ్యాచ్‌లు ఆడుతుంది.