ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం శ్రీలంక జట్టు ప్రత్యేకంగా బ్యాటింగ్ కోచ్‌ను నియమించుకుంది. ప్రత్యర్ధి జట్టుకు చెందిన మాజీ ఆటగాడిని శ్రీలంక జట్టు బ్యాటింగ్ కోచ్‌గా ఎంపిక చేసుకుంది. ఇంగ్లండ్ మాజీ బ్యాటర్ ఇయాన్ బెల్ లంకతో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు శ్రీలంక బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరిస్తాడు. ఈ విషయాన్ని లంక బోర్డు ఇవాళ (ఆగస్ట్ 13) ప్రకటించింది.
42 ఏళ్ల ఇయాన్ బెల్ 2004-15 మధ్యలో ఇంగ్లండ్ తరఫున 118 టెస్ట్‌లు, 161 వన్డేలు, 8 టీ20లు ఆడాడు. టెస్ట్‌ల్లో 22 సెంచరీలు, 46 హాఫ్ సెంచరీల సాయంతో 7727 పరుగులు.. వన్డేల్లో 4 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీల సాయంతో 5416 పరుగులు.. టీ20ల్లో ఓ హాఫ్ సెంచరీ సాయంతో 188 పరుగులు చేశాడు.
బెల్‌ను బ్యాటింగ్ కోచ్‌గా నియమించుకోవడం వెనుక శ్రీలంక క్రికెట్ బోర్డుది పెద్ద వ్యూహరచనే ఉంది. బెల్‌కు ఇంగ్లండ్ జట్టుతో సుదీర్ఘ అనుబంధం ఉంది కాబటి, ఆ జట్టు లోటుపాట్లు తెలిసే అవకాశం ఉంది. అలాగే బ్యాటింగ్ కోచ్‌గా కూడా బెల్‌కు మంచి ట్రాక్ రికార్డే ఉంది. ఈ అంశాలన్నీ ఇంగ్లండ్ పర్యటనలో శ్రీలంకకు కలిసొచ్చే అవకాశం ఉంది.
ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ కోసం శ్రీలంక జట్టు..
ధనంజయ డిసిల్వ (కెప్టెన్), దిముత్ కరుణరత్నే, నిషన్ మధుష్క, పథుమ్ నిస్సంక, కుసాల్ మెండిస్ (వైస్ కెప్టెన్), ఏంజెలో మాథ్యూస్, దినేశ్ చండీమల్, కమిందు మెండిస్, సమరవిక్రమ, అశిత ఫెర్నాండో, విశ్వ ఫెర్నాండో, కసున్ రజిత, లహీరు కుమార, నిసాల తారక, ప్రభాత్ జయసూర్య, రమేశ్ మెండిస్, జెఫ్రీ వాండర్సే, మిలన్ రత్నాయకే
ఇంగ్లండ్ జట్టు..
హ్యారీ బ్రూక్, డేనియల్ లారెన్స్, బెన్ డకెట్, జో రూట్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), క్రిస్ వోక్స్, జోర్డన్ కాక్స్, ఓలీ పోప్, జేమీ స్మిత్ (వికెట్‌కీపర్), గస్ అట్కిన్సన్, షోయబ్ బషీర్, మాథ్యూ పాట్స్, ఓలీ స్టోన్, మార్క్ వుడ్
షెడ్యూల్..
ఆగస్ట్ 21-25: తొలి టెస్ట్ (మాంచెస్టర్)
ఆగస్ట్ 29-సెప్టెంబర్: రెండో టెస్ట్ (లార్డ్స్)
సెప్టెంబర్ 6-10: మూడో టెస్ట్ (కెన్నింగ్‌స్టన్ ఓవల్)
Comments
Please login to add a commentAdd a comment