శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులకు ఆలౌటైంది. 221/3 వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆతిథ్య జట్టు.. ఓవర్‌నైట్ స్కోర్‌కు మరో 104 పరుగులు జోడించి మిగతా ఏడు వికెట్లు కోల్పోయింది. తొలి రోజే సెంచరీ చేసిన ఓలీ పోప్ 154 పరుగులు చేసి ఔట్ కాగా.. మరో ఓవర్‌నైట్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ 19 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఇంగ్లండ్ తమ చివరి ఆరు వికెట్లు కేవలం 64 పరుగుల వ్యవధిలో కోల్పోయింది.
ఓవర్‌నైట్ స్కోర్‌కు 40 పరుగులు జోడించాక బ్రూక్ ఐదో వికెట్‌గా వెనుదిరగగా.. ఓలీ పోప్ ఎనిమిదో వికెట్‌గా పెవిలియన్‌కు చేరాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో బెన్ డకెట్ 86, డాన్ లారెన్స్ 5, జో రూట్ 13, జేమీ స్మిత్ 16, క్రిస్ వోక్స్ 2, గస్ అట్కిన్సన్ 5, ఓల్లీ స్టోన్ 15 (నాటౌట్), జోష్ హల్ 2, షోయబ్ బషీర్ ఒక్క పరుగు చేశారు.
శ్రీలంక బౌలర్లలో మిలన్ రత్నాయకే 3 వికెట్లు పడగొట్టగా.. విశ్వ ఫెర్నాండో, లహీరు కుమార, ధనంజయ డిసిల్వ తలో 2, అశిత ఫెర్నాండో ఓ వికెట్ దక్కించుకున్నారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక రెండో రోజు లంచ్ విరామం సమయానికి వికెట్ నష్టపోకుండా ఒక్క పరుగు చేసింది. పథుమ్ నిస్సంక (1), దిముత్ కరుణరత్నే క్రీజ్‌లో ఉన్నారు.
కాగా, మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం శ్రీలంక జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు నెగ్గిన ఇంగ్లండ్ 2-0 ఆధిక్యంలో కొనసాగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment