Ollie Pope
-
PAK VS ENG 1st Test: జమాల్ 'కమాల్' క్యాచ్
మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా ముల్తాన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో పాక్ ఆటగాడు ఆమెర్ జమాల్ కళ్లు చెదిరే క్యాచ్ పట్టుకున్నాడు. నసీం షా బౌలింగ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ ఓలీ పోప్ ఆడిన పుల్ షాట్‌ను జమాల్ 'కమాల్' క్యాచ్‌గా మలిచాడు. మిడ్ వికెట్ దిశగా ఫీల్డింగ్ చేస్తున్న జమాల్ ఒంటి చేత్తో సూపర్ మ్యాన్‌లా క్యాచ్ అందుకున్నాడు. జమాల్ కమాల్ విన్యాసాన్ని చూసి ఓలీ పోప్‌కు ఫ్యూజులు ఔటయ్యాయి. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతోంది.UNBELIEVABLE CATCH 😲Aamir Jamal pucks it out of thin air to send back the England captain 👌#PAKvENG | #TestAtHome pic.twitter.com/MY3vsto4St— Pakistan Cricket (@TheRealPCB) October 8, 2024మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ భారీ స్కోర్ చేసింది. అబ్దుల్లా షఫీక్ (102), షాన్ మసూద్ (151), అఘా సల్మాన్ (104 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కడంతో ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 556 పరుగులకు ఆలౌటైంది. సౌద్ షకీల్ (82) సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకోగా.. సైమ్ అయూబ్ 4, బాబర్ ఆజమ్ 30, నసీం షా 33, మొమహ్మద్ రిజ్వాన్ 0, ఆమెర్ జమాల్ 7, షాహీన్ అఫ్రిది 26, అబ్రార్ అహ్మద్ 3 పరుగులు చేసి ఔటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ మూడు వికెట్లు పడగొట్టగా.. గస్ అట్కిన్సన్, బ్రైడన్ కార్స్ చెరో రెండు.. క్రిస్ వోక్స్, షోయబ్ బషీర్, జో రూట్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ ఆదిలోనే కెప్టెన్ ఓలీ పోప్ వికెట్‌ను కోల్పోయింది. పోప్ ఖాతా తెరవకుండానే నసీం షా బౌలింగ్‌లో ఆమెర్ జమాల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ స్కోర్ 96/1గా ఉంది. జాక్ క్రాలే (64), జో రూట్ (32) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్ పాక్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 460 పరుగులు వెనుకపడి ఉంది. చదవండి: హాంగ్‌కాంగ్ సిక్సర్స్ టోర్నీలో పాల్గొననున్న టీమిండియా -
ఇంగ్లండ్ కెప్టెన్ చెత్త రికార్డు.. పదికి పది వేస్ట్ చేశాడు..!
బెన్ స్టోక్స్ గైర్హాజరీలో ఇంగ్లండ్ టెస్ట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ఓలీ పోప్ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. శ్రీలంకతో జరుగుతున్ను మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో పోప్ ఇప్పటివరకు 10 రివ్యూలు తీసుకోగా.. పదికి పది విఫలమయ్యాయి. ఒక్కటంటే ఒక్క రివ్యూలోనూ పోప్ సక్సెస్ కాలేదు. టెస్ట్‌ల్లో ఇలా చాలా అరుదుగా జరుగుతుంది. రివ్యూల విషయంలో పోప్ కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లంకతో సిరీస్‌లో వ్యక్తిగతంగా, కెప్టెన్‌గా సక్సెస్ అయినప్పటికీ రివ్యూల విషయంలో పోప్ దారుణంగా విఫలమయ్యాడని ఇంగ్లిష్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. కాగా, శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను ఇంగ్లండ్ మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది.ఇదిలా ఉంటే, కెన్నింగ్స్టన్ ఓవల్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్‌లో శ్రీలంక జట్టు గెలుపు దిశగా సాగుతుంది. ఆ జట్టు మరో 99 పరుగులు చేస్తే మ్యాచ్‌ను గెలవడంతో పాటు సిరీస్‌లో క్లీన్‌స్వీప్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకుంటుంది. నాలుగో రోజు ఆట ప్రారంభించిన శ్రీలంక సెకెండ్ ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులు చేసింది. ఓలీ పోప్ భారీ శతకంతో (154) కదంతొక్కాడు. బెన్ డకెట్ (86) సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. అనంతరం శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌటైంది. నిస్సంక (64), ధనంజయ డిసిల్వ (69),కమిందు మెండిస్ (64) అర్ద సెంచరీలతో రాణించారు.ఆతర్వాత లంక బౌలర్లు చెలరేగిపోవడంతో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 156 పరుగులకే కుప్పకూలింది. లహీరు కుమార 4, విశ్వ ఫెర్నాండో 3, అశిత ఫెర్నాండో 2, మిలన్ రత్నాయకే ఓ వికెట్ పడగొట్టారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ జేమీ స్మిత్ (67) ఒక్కడే అర్ద సెంచరీ చేశాడు. 219 పరుగుల లక్ష్య ఛేదనలో శ్రీలంక గెలుపు దిశగా సాగుతుంది. నిస్సంక (67), ఏంజెలో మాథ్యూస్ (6) క్రీజ్‌లో ఉన్నారు. -
పోప్ భారీ శతకం.. 325 పరుగులకు ఆలౌటైన ఇంగ్లండ్
శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులకు ఆలౌటైంది. 221/3 వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆతిథ్య జట్టు.. ఓవర్‌నైట్ స్కోర్‌కు మరో 104 పరుగులు జోడించి మిగతా ఏడు వికెట్లు కోల్పోయింది. తొలి రోజే సెంచరీ చేసిన ఓలీ పోప్ 154 పరుగులు చేసి ఔట్ కాగా.. మరో ఓవర్‌నైట్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ 19 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఇంగ్లండ్ తమ చివరి ఆరు వికెట్లు కేవలం 64 పరుగుల వ్యవధిలో కోల్పోయింది. ఓవర్‌నైట్ స్కోర్‌కు 40 పరుగులు జోడించాక బ్రూక్ ఐదో వికెట్‌గా వెనుదిరగగా.. ఓలీ పోప్ ఎనిమిదో వికెట్‌గా పెవిలియన్‌కు చేరాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో బెన్ డకెట్ 86, డాన్ లారెన్స్ 5, జో రూట్ 13, జేమీ స్మిత్ 16, క్రిస్ వోక్స్ 2, గస్ అట్కిన్సన్ 5, ఓల్లీ స్టోన్ 15 (నాటౌట్), జోష్ హల్ 2, షోయబ్ బషీర్ ఒక్క పరుగు చేశారు. శ్రీలంక బౌలర్లలో మిలన్ రత్నాయకే 3 వికెట్లు పడగొట్టగా.. విశ్వ ఫెర్నాండో, లహీరు కుమార, ధనంజయ డిసిల్వ తలో 2, అశిత ఫెర్నాండో ఓ వికెట్ దక్కించుకున్నారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక రెండో రోజు లంచ్ విరామం సమయానికి వికెట్ నష్టపోకుండా ఒక్క పరుగు చేసింది. పథుమ్ నిస్సంక (1), దిముత్ కరుణరత్నే క్రీజ్‌లో ఉన్నారు. కాగా, మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం శ్రీలంక జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు నెగ్గిన ఇంగ్లండ్ 2-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. -
చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ కెప్టెన్.. 147 ఏళ్ల క్రికెట్ హిస్టరీలోనే
ఇంగ్లండ్ తాత్కాలిక టెస్టు సారథి ఓలీ పోప్ తన ఫామ్‌ను తిరిగి అందుకున్నాడు. లండన్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టులో పోప్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. వర్షం అంతరాయం కలిగించిన తొలి రోజు ఆటలో శ్రీలంక బౌలర్లను పోప్ సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు. జో రూట్(13) విఫలమైనప్పటకి పోప్ మాత్రం దంచి కొట్టాడు. 103 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌లతో 103 పరుగులు చేసి ఆజేయంగా ఉన్నాడు. అతడితో పాటు క్రీజులో హ్యారీ బ్రూక్(8) ఉన్నాడు. తొలి రోజు ఆటముగిసే సమయానికి ఇంగ్లండ్ 3 వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది. కాగా పోప్‌కు ఇది 7వ టెస్టు సెంచరీ.సరికొత్త చరిత్ర..ఇక ఈ మ్యాచ్‌లో సెంచరీతో మెరిసిన పోప్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. తొలి 7 సెంచరీలను ఏడు వేర్వేరు జట్లపై చేసిన తొలి క్రికెటర్‌గా పోప్ రికార్డులకెక్కాడు. పోప్ తన టెస్ట్ కెరీర్లో ఇప్పటివరకు సాధించిన ప్రతి సెంచరీ ఆరు వేర్వేరు మైదానాల్లో వచ్చినివే కావడం విశేషం. 2020లో దక్షిణాఫ్రికాపై తొలి టెస్టు సెంచరీ చేసిన పోప్.. ఆ తర్వాత వరుసగా న్యూజిలాండ్, పాకిస్తాన్, ఐర్లాండ్, భారత్, వెస్టిండీస్, శ్రీలంకపై శతకాలు నమోదు చేశాడు. ఇప్పటివరకు ఈ ఘనత ఎవరికీ సాధ్యం కాలేదు. -
ఒలీ పోప్ అజేయ శతకం.. భారీ స్కోర్ దిశగా ఇంగ్లండ్
లండన్: సొంతగడ్డపై సంపూర్ణ ఆధిపత్యం కనబరుస్తున్న ఇంగ్లండ్ జట్టు... శ్రీలంకతో మూడో టెస్టులోనూ అదే జోరు కొనసాగిస్తోంది. ఇప్పటికే తొలి రెండు మ్యాచ్‌లు నెగ్గి సిరీస్ కైవసం చేసుకున్న ఇంగ్లండ్... శుక్రవారం వర్షం అంతరాయం మధ్య ప్రారంభమైన మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 44.1 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది.తాత్కాలిక కెప్టెన్ ఒలీ పోప్ (103 బంతుల్లో 103 బ్యాటింగ్; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయ సెంచరీతో చెలరేగగా... ఓపెనర్ బెన్ డకెట్ (79 బంతుల్లో 86; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) చక్కటి ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు.వీరిద్దరూ వన్డే తరహా ఆటతీరుతో చెలరేగడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. వర్షం కారణంగా మ్యాచ్‌కు పలుమార్లు అంతరాయం ఏర్పడగా... ఆఖర్లో వెలుతురు లేమితో ఆటను నిర్ణీత సమయం కంటే ముందే నిలిపివేశారు. గత మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌లో సెంచరీలు చేసిన మాజీ కెప్టెన్ జో రూట్ (13) తో పాటు డాన్ లారెన్స్ (5) విఫలమయ్యారు. లంక బౌలర్లలో లహిరు కుమార 2 వికెట్లు పడగొట్టాడు. పోప్‌తో పాటు హ్యారీ బ్రూక్ (8 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు.చదవండి: Fab Four: ‘అతడే నంబర్ వన్.. కోహ్లికి ఆఖరి స్థానం’ -
Eng vs SL: మూడేళ్ల తర్వాత.. తుదిజట్టులో తొలిసారి
శ్రీలంకతో రెండో టెస్టుకు ఇంగ్లండ్ బోర్డు తమ తుదిజట్టును ప్రకటించింది. తొలి మ్యాచ్‌లో ఆడిన జట్టులో ఒక మార్పుతో లార్డ్స్‌లో బరిలోకి దిగనున్నట్లు తెలిపింది. పేసర్ మార్క్‌వుడ్ స్థానాన్ని ఓలీ స్టోన్‌తో భర్తీ చేసినట్లు వెల్లడించింది. కాగా 2021లో చివరగా ఇంగ్లండ్ తరఫున టెస్టు ఆడిన ఓలీ స్టోన్.. మూడేళ్ల తర్వాత పునరాగమనం చేయనుండటం విశేషం.లంకతో తొలి టెస్టులో మార్క్‌వుడ్ గాయపడిన విషయం తెలిసిందే. మూడో రోజు ఆటలో భాగంగా కండరాల నొప్పితో విలవిల్లాడిన ఈ ఫాస్ట్‌బౌలర్ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ క్రమంలో 20 ఏళ్ల పేసర్ జోష్ హల్‌ను అతడి స్థానంలో జట్టుకు ఎంపిక చేసిన ఇంగ్లండ్ బోర్డు.. హల్‌ను బెంచ్‌కే పరిమితం చేసింది. ఓలీ స్టోన్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో స్థానం కల్పించింది.కాగా రైటార్మ్ పేసర్ అయిన 30 ఏళ్ల ఓలీ స్టోన్.. 2018లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు ఇంగ్లండ్ తరఫున 3 టెస్టుల్లో 10, ఎనిమిది వన్డేల్లో 8 వికెట్లు తీశాడు. ఒకే ఒక్క టీ20 ఆడినా వికెట్ మాత్రం తీయలేకపోయాడు. ఇదిలా ఉంటే.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25లో భాగంగా సొంతగడ్డపై శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల సిరీస్ ఆడుతోంది.ఈ క్రమంలో మాంచెస్టర్‌లోని ఎమిరేట్స్ ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానంలో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. పర్యాటక లంక నుంచి గట్టి పోటీ ఎదురుకాగా.. ఇంగ్లండ్ వెటరన్ బ్యాటర్ జో రూట్(128 బంతుల్లో 62) పట్టుదలగా నిలబడి జట్టును విజయతీరాలకు చేర్చాడు.ఇరు జట్ల మధ్య లండన్‌లో లార్డ్స్ మైదానంలో ఆగష్టు 29- సెప్టెంబరు 2 వరకు రెండో టెస్టుకు షెడ్యూల్ ఖరారైంది. ఇదిలా ఉంటే.. ఈ సిరీస్‌కు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్ దూరం కాగా.. అతడి స్థానంలో ఓలీ పోప్ సారథ్య బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే. అతడికి డిప్యూటీగా యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌ను ఎంపిక చేసింది ఇంగ్లండ్ బోర్డు.శ్రీలంకతో లండన్ వేదికగా రెండో టెస్టు ఇంగ్లండ్ తుదిజట్టులారెన్స్, బెన్ డకెట్, ఓలీ పోప్ (కెప్టెన్), జో రూట్, హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, మాథ్యూ పాట్స్, ఓలీ స్టోన్, షోయబ్ బషీర్. -
ఇంగ్లండ్‌తో టెస్టు.. ఎట్టకేలకు లంక పేసర్ అరంగేట్రం!
ఇంగ్లండ్‌తో తొలి టెస్టుకు శ్రీలంక క్రికెట్ బోర్డు తమ తుదిజట్టును ప్రకటించింది. పేసర్ మిలన్ రత్నాయకేకు ఎట్టకేలకు అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టే అవకాశం కల్పించింది. మిలన్ ఆగమనం మినహా.. ఈ ఏడాది ఆరంభంలో బంగ్లాదేశ్‌తో తలపడ్డ జట్టుతోనే ఇంగ్లండ్‌తో టెస్టులోనూ బరిలోకి దిగనున్నట్లు తెలిపింది.కాగా టెస్టు సిరీస్ ఆడేందుకు శ్రీలంక ఇంగ్లండ్‌లో పర్యటిస్తోంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25లో భాగంగా ఆతిథ్య జట్టుతో మూడు మ్యాచ్‌లు ఆడనుంది. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య ఆగష్టు 21న మొదటి టెస్టు ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇంగ్లండ్ తమ తుదిజట్టును ప్రకటించగా.. మంగళవారం శ్రీలంక సైతం తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను వెల్లడించింది.ధనంజయ డి సిల్వ సారథ్యంలోని ఈ జట్టులో వెటరన్ బ్యాటర్ దిముత్ కరుణరత్నె.. యువ క్రికెటర్ నిషాన్ మదుష్కతో కలిపి లంక ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు. ఇక మిడిలార్డర్లో కుశాల్ మెండిస్, ఏంజెలో మాథ్యూస్, దినేశ్ చండిమాల్ ఆడనుండగా.. కెప్టెన్ ధనంజయ ఆరో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు.అతడి తర్వాతి స్థానంలో స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కమిందు మెండిస్ రానున్నాడు. ఇక బౌలింగ్ విభాగంలో పేసర్లు అసితా ఫెర్నాండో, విశ్వ ఫెర్నాండోతో పాటు కొత్తగా రత్నాయకే కూడా చోటు దక్కించుకున్నాడు. ఇప్పటికి రెండు సార్లు జాతీయ జట్టు సెలక్టర్ల నుంచి పిలుపు అందుకున్నా తుదిజట్టులో మాత్రం అతడికి స్థానం దక్కలేదు. అయితే, ఇంగ్లండ్‌తో సిరీస్ సందర్భంగా ఆ లోటు తీరనుంది.కాగా 28 ఏళ్ల మిలన్ రత్నాయకే ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 39 మ్యాచ్‌లు ఆడి 79 వికెట్లు తీశాడు. ఇందులో మూడు నాలుగు వికెట్ల హాల్స్, ఒక ఐదు వికెట్ల హాల్ ఉంది. ఇక 45 లిస్ట్-ఏ మ్యాచ్‌లు ఆడిన మిలన్ రత్నాయకే 47 వికెట్లు పడగొట్టాడు. 22 టీ20లలో 24 వికెట్లు తీశాడు.ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో ఒకే ఒక్క స్పెషలిస్టు స్పిన్నర్ ప్రభాత్ జయసూర్యకు మాత్రమే చోటు దక్కింది. ఇక పాతుమ్ నిసాంక, సదీర సమరవిక్రమ, రమేశ్ మెండిస్, నిసాల తారక, లాహిరు కుమార, కసున్ రజిత, జెఫ్రే వాండర్సె బెంచ్‌కే పరిమితం కానున్నారు. కాగా 2016లో చివరగా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన శ్రీలంక 0-2తో ఓటమిని చవిచూసింది. గత మూడు సందర్భాల్లోనూ ఇంగ్లండ్ చేతిలో ఓటమి(ఎనిమిది టెస్టుల్లో ఏడు పరాజయం, ఒకటి డ్రా) పాలైంది.ఇంగ్లండ్ వర్సెస్ శ్రీలంక తొలి టెస్టు:తుదిజట్లుఇంగ్లండ్డాన్ లారెన్స్, బెన్ డకెట్, ఓలీ పోప్ (కెప్టెన్), జో రూట్, హ్యారీ బ్రూక్ (వైస్ కెప్టెన్), జామీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, గుస్ అట్కిన్సన్, మాథ్యూ పాట్స్, మార్క్ వుడ్, షోయబ్ బషీర్.శ్రీలంకదిముత్ కరుణరత్నే, నిషాన్ మదుష్క, కుసల్ మెండిస్, ఏంజెలో మాథ్యూస్, దినేశ్ చండిమాల్, ధనంజయ డిసిల్వా (కెప్టెన్), కమిందు మెండిస్, ప్రభాత్ జయసూర్య, అసిత ఫెర్నాండో, విశ్వ ఫెర్నాండో, మిలన్ రత్నాయకే. -
Eng vs SL: ఇంగ్లండ్ వైస్ కెప్టెన్‌గా హ్యారీ బ్రూక్
శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు ఇంగ్లండ్ సిద్ధమైంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25లో భాగంగా సొంతగడ్డపై లంకతో మూడు మ్యాచ్‌లు ఆడనుంది. మాంచెస్టర్ వేదికగా ఇరు జట్ల మధ్య బుధవారం తొలి టెస్టు ఆరంభం కానుంది.ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తమ తుదిజట్టును సోమవారం ప్రకటించింది. వైస్ కెప్టెన్‌గా యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌కు అవకాశం ఇచ్చింది. కాగా బెన్ స్టోక్స్ గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో అతడి స్థానంలో ఓలీ పోప్ సారథిగా వ్యవహరించనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అతడికి డిప్యూటీగా బ్రూక్‌ను ఎంపిక చేసింది.ఈ జట్టులో నలుగురు పేసర్లు మార్క్ వుడ్, గుస్ అట్కిన్సన్, క్రిస్ వోక్స్, మాథ్యూ పాట్స్లకు చోటిచ్చింది. కాగా గతేడాది జూన్‌లో ఇంగ్లండ్‌కు చివరగా ఆడిన పాట్స్ ఈ మ్యాచ్‌తో పునరాగమనం చేయనున్నాడు. ఇక ఈ జట్టులో స్పిన్నర్ షోయబ్ బషీర్‌కు కూడా స్థానం దక్కింది. ఇక డాన్లారెన్స్, బెన్ డకెట్ ఓపెనర్లుగా దిగనుండగా.. మిడిలార్డర్లో ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, వికెట్ కీపర్ జామీ స్మిత్ ఆడనున్నారు.మూడు టెస్టులు.. షెడ్యూల్ ఇదేఆగష్టు 21- 25 వరకు మాంచెస్టర్‌లో తొలి టెస్టు, ఆగష్టు 29- సెప్టెంబరు 2 వరకు లండన్(లార్డ్స్)లో రెండో టెస్టు, సెప్టెంబరు 6- సెప్టెంబరు 10 వరకు లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్‌లో మూడో టెస్టు నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. భారత కాలమానం ప్రకారం ఇంగ్లండ్- శ్రీలంక టెస్టులు మధ్యాహ్నం మూడున్నర గంటలకు ఆరంభం కానున్నాయి.శ్రీలంకతో తొలి టెస్టుకు ఇంగ్లండ్ తుదిజట్టుడాన్ లారెన్స్, బెన్ డకెట్, ఓలీ పోప్ (కెప్టెన్), జో రూట్, హ్యారీ బ్రూక్ (వైస్ కెప్టెన్), జామీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, గుస్ అట్కిన్సన్, మాథ్యూ పాట్స్, మార్క్ వుడ్, షోయబ్ బషీర్. -
ఊహించిందే జరిగింది.. ఇంగ్లండ్ కెప్టెన్‌గా స్టార్ క్రికెటర్
శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్, స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ గాయం కారణంగా దూరమయ్యాడు. ది హండ్రడ్ లీగ్‌లో నార్తర్న్ సూపర్‌చార్జర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న స్టోక్స్.. మాంచెస్టర్ ఒరిజినల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడ్డాడు. పేసర్ ఆలీ రాబిన్సన్ బౌలింగ్ లో స్కూప్ షాట్ ఆడే ప్రయత్నంలో స్టోక్స్ తొడ కండరాలు పట్టేశాయి. ఈ క్రమంలో పరిగెత్తలేక గ్రౌండ్ లోనే పడిపోయి వైద్య సహాయాన్ని కోరాడు. దీంతో ఫిజియోలు వెంటనే పరిగెత్తుకొచ్చి అతనికి చికిత్స అందించారు.అనంతరం అస్పత్రికి తీసుకువెళ్లి స్కాన్ చేయగా అతడి గాయం తీవ్రమైనదిగా తేలింది. ఈ క్రమంలోనే శ్రీలంకతో టెస్టు సిరీస్‌తో పాటు ఈ వేసవిలో మిగిలిన మ్యాచ్‌లన్నింటికి ఈ దిగ్గజ ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ దూరమయ్యాడు.ఇంగ్లండ్ కెప్టెన్ ఓలీ పోప్..ఇక శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు ఇంగ్లండ్ తాత్కాలిక కెప్టెన్‌గా మిడిలార్డర్ స్టార్ బ్యాటర్ ఓలీ పోప్ ఎంపికయ్యాడు. స్టోక్సీ డిప్యూటీగా ఉన్న పోప్‌కు మరోసారి కెప్టెన్సీ చేసే అవకాశం లభించింది. అయితే పోప్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు.. ఇంకా స్టోక్స్ స్ధానాన్ని మాత్రం భర్తీ చేయలేదు. ఇక ఇంగ్లండ్-శ్రీలంక మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆగస్టు 21 నుంచి ప్రారంభం కానుంది. స్టోక్స్ తిరిగి మళ్లీ పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్‌కు అందుబాటులో వచ్చే అవకాశముంది.శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు ఇంగ్లండ్ జట్టు..ఓలీ పోప్ (కెప్టెన్), గస్ అట్కిన్సన్, షోయబ్ బషీర్, హ్యారీ బ్రూక్, జోర్డన్ కాక్స్, బెన్ డకెట్, డాన్ లారెన్స్, మాథ్యూ పాట్స్, జో రూట్, జేమీ స్మిత్ (వికెట్‌కీపర్), ఓలీ స్టోన్, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్ -
ENG VS WI: టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలిసారి ఇలా..!
ట్రెంట్‌బ్రిడ్జ్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 241 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ రెండు ఇన్నింగ్స్‌ల్లో 400కు పైగా స్కోర్ చేసింది. 147 ఏళ్ల ఇంగ్లీష్ క్రికెట్ చరిత్రలో ఇలా జరగడం తొలిసారి. ఇదే మ్యాచ్‌లో విండీస్ సైతం తొలి ఇన్నింగ్స్‌లో 400కు పైగా స్కోర్ చేసింది.టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలిసారి..ఓ టెస్ట్ మ్యాచ్‌లో ఒకటి, రెండు, మూడు ఇన్నింగ్స్‌ల్లో 400కు పైగా స్కోర్లు నమోదు కావడం ఇదే మొదటిసారి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులు, సెకెండ్ ఇన్నింగ్స్‌లో 425 పరుగులు చేయగా.. వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 457, సెకెండ్ ఇన్నింగ్స్‌లో 143 పరుగులు చేసింది.మ్యాచ్ విషయానికొస్తే.. 385 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వెస్టిండీస్.. యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ ఐదేయడంతో (5/41) 143 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో 400కు పైగా స్కోర్ చేయడంతో పాటు 41 పరుగుల కీలకమైన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సాధించిన విండీస్.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో చేతులెత్తేసింది. బషీర్‌తో పాటు క్రిస్ వోక్స్ (2/28), అట్కిన్సన్ (2/49), మార్క్ వుడ్ (1/17) విండీస్ పతనాన్ని శాశించారు. విండీస్ ఇన్నింగ్స్‌లో క్రెయిగ్ బ్రాత్‌వైట్ (47), జేసన్ హోల్డర్ (37), మికైల్ లూయిస్ (17), జాషువ డసిల్వ (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు.ఈ మ్యాచ్‌లో గెలుపుతో ఇంగ్లండ్.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ (121), సెకెండ్ ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ (51) చేసిన ఓలీ పోప్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో కవెమ్ హాడ్జ్ (120) సెంచరీతో ఆకట్టుకోగా.. ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో హ్యారీ బ్రూక్ (109), జో రూట్ (122) సెంచరీలతో సత్తా చాటారు. -
ఓలీ పోప్ సూపర్ సెంచరీ.. 416 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్
నాటింగ్హమ్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ అదరగొట్టింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 88.3 ఓవర్లలో 416 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బ్యాటర్లలో మిడిలార్డర్ బ్యాటర్ ఓలీ పోప్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు.121 బంతుల్లో 15 ఫోర్లు, 1 సిక్స్‌తో 121 పరుగులు చేశాడు. అతడితో పాటు బెన్ డకెట్ (71; 14 ఫోర్లు), స్టోక్స్ (69; 8 ఫోర్లు) రాణించారు. విండీస్ బౌలర్లలో అల్జారీ జోషఫ్ మూడు వికెట్లు పడగొట్టగా.. సింక్లైర్, సీల్స్, హోడ్జ్ తలా రెండు వికెట్లు సాధించారు. కాగా ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ అరుదైన ఫీట్ నమోదు చేసింది. ఇంగ్లండ్ 4.2 ఓవర్లలో 50 పరుగులు చేసి టెస్టుల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ చేసిన జట్టుగా తమ పేరిటే ఉన్న రికార్డును బద్దలు కొట్టింది. 1994లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో ఇంగ్లండ్ 4.3 ఓవర్లలో 50 పరుగులు సాధించింది. -
ఐసీసీ అవార్డు రేసులో పేస్ బౌలింగ్ సంచలనం
2024 జనవరి మాసం ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు నామినీస్ వివరాలను ఐసీసీ ప్రకటించింది. గత నెలలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్ల పేర్లను ఐసీసీ వెల్లడించింది. పురుషుల క్రికెట్‌కు సంబంధించి ఆస్ట్రేలియా బౌలర్ జోష్ హాజిల్‌వుడ్, ఇంగ్లండ్ బ్యాటర్ ఓలీ పోప్, విండీస్ సంచలన బౌలర్ షమార్ జోసఫ్ రేసులో ఉండగా.. మహిళల క్రికెట్లో అమీ హంటర్(ఐర్లాండ్), బెత్ మూనీ(ఆస్ట్రేలియా), అలీసా హేలీ(ఆస్ట్రేలియా) నామినేషన్ దక్కించుకున్నారు. ఓటింగ్ పద్దతిన విజేతను నిర్ణయిస్తారు. ఈ ప్రదర్శనల కారణంగానే నామినేషన్ దక్కింది.. షమార్ జోసఫ్: జనవరి నెలలో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్ ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన విండీస్ యువ పేసర్ షమార్, తన తొలి పర్యటనలోనే సంచలన ప్రదర్శనలు నమోదు చేసి అవార్డు రేసులో నిలిచాడు. ఈ పర్యటనలో ఆసీస్ బ్యాటర్లను గడగడలాడించిన షమార్ రెండు మ్యాచ్‌ల్లో 13 వికెట్లు తీశాడు. ఇందులో రెండు ఐదు వికెట్ల ప్రదర్శనలు ఉన్నాయి. గబ్బా టెస్ట్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో షమార్ విశ్వరూపం (7-68) ప్రదర్శించడంతో పర్యాటక విండీస్ 30 ఏళ్ల తర్వాత ఆసీస్ గడ్డపై టెస్ట్ విజయాన్ని నమోదు చేసింది. జోష్ హాజిల్‌వుడ్: జనవరి నెలలో విండీస్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో హాజిల్‌వుడ్ సైతం విజృంభించాడు. ఈ సిరీస్‌లో అతను రెండు మ్యాచ్‌ల్లో 14 వికెట్లు తీసి లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. ఇందులో ఓ ఐదు వికెట్ల ప్రదర్శన ఉంది. ఈ ప్రదర్శనలతో పాటు హాజిల్‌వుడ్ జనవరిలో మొత్తం 19 వికెట్లు పడగొట్టాడు. ఓలీ పోప్: ఈ ఇంగ్లీష్ బ్యాటర్ జనవరిలో ఆడిన మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ కారణంగా ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. గత నెలలో టీమిండియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో (హైదరాబాద్ టెస్ట్) పోప్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 196 పరుగులు చేసి ఇంగ్లండ్ గెలుపులో ప్రధానపాత్ర పోషించాడు. -
0.45 సెకన్లలో మెరుపు వేగంతో రోహిత్.. రెప్పపాటులో క్యాచ్!
Ind vs Eng 2nd Test Vizag Day 4: ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన క్యాచ్‌తో మెరిశాడు. వైజాగ్ వేదికగా నాలుగో రోజు ఆటలో.. ఇంగ్లండ్ కీలక బ్యాటర్ ఒలీ పోప్‌ను అవుట్ చేయడంలో తన వంతు పాత్ర పోషించాడు. కాగా 67/1 ఓవర్‌నైట్ స్కోరుతో సోమవారం నాటి ఆట మొదలుపెట్టిన ఇంగ్లండ్... తొలుత రెహాన్ అహ్మద్ రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్ అహ్మద్ 23 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. అప్పటికి ఇంగ్లండ్ స్కోరు 99/2. ఈ క్రమంలో అహ్మద్ స్థానంలో క్రీజులోకి వచ్చిన ఒలీ పోప్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. 21 బంతుల్లోనే 23 పరుగులు సాధించి ప్రమాదకరంగా మారుతున్న పోప్.. రవిచంద్రన్ అశ్విన్ కి దొరికిపోయాడు. 28.2వ ఓవర్లో టీమిండియా స్పిన్నర్ వేసిన బంతిని తప్పుగా అంచనా వేసిన పోప్.. బ్యాక్ కట్ షాట్ ఆడేందుకు ప్రయత్నించగా.. ఎడ్జ్ తీసుకున్న బంతిని.. స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మ మెరుపు వేగంతో అందుకున్నాడు. దీంతో ఇంగ్లండ్ ఓవరాల్‌గా మూడో వికెట్ కోల్పోగా.. భారత శిబిరంలో ఉత్సాహం నెలకొంది. కాగా 0.45 సెకన్ల వ్యవధిలోనే రోహిత్ శర్మ మెరుపు వేగంతో అందుకున్న షార్ప్ క్యాచ్‌కు సంబంధించిన వీడియో.. నెట్టింట వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే.. ఒలీ పోప్ అవుటైన మరుసటి రెండో ఓవర్లో అశ్విన్ మరోసారి అద్భుత బంతితో జో రూట్(16)ను పెవిలియన్‌కు పంపాడు. ఈ క్రమంలో 34 ఓవర్లలో ఇంగ్లండ్ 4 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఈ క్రమంలో టీమిండియా విజయానికి ఆరు వికెట్లదూరంలో నిలవగా.. ఇంగ్లండ్ గెలవాలంటే 234 పరుగులు కావాలి. చదవండి: SA vs NZ: అరంగేట్ర మ్యాచ్‌లోనే ఏకంగా కెప్టెన్.. అంతేకాకుండా 6 వికెట్లతో Sharp Reflexes edition, ft. captain Rohit Sharma! 👌 👌 Follow the match ▶️ https://t.co/X85JZGt0EV#TeamIndia | #INDvENG | @ImRo45 | @IDFCFIRSTBank pic.twitter.com/mPa0lUXC4C — BCCI (@BCCI) February 5, 2024 Number 45 taking the reflex catch of 0.45sec. Rohit you beauty!#INDvENG #IndvsEng #RohitSharma pic.twitter.com/hAmUp5TesH — Rohit. (@RoSixSharma) February 5, 2024 -
వారెవ్వా బుమ్రా.. క్రికెట్ చరిత్రలోనే సూపర్ బాల్!
వరల్డ్‌క్రికెట్‌లో తానే యార్కర్ల కింగ్ అని టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా మరోసారి నిరూపించుకున్నాడు. వైజాగ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ బ్యాటర్ ఓలీ పోప్‌ను అద్బుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. బుమ్రా వేసిన ఓ డెలివరీకి పోప్ వద్ద సమాధానమే లేకుండా పోయింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 28 ఓవర్లో బుమ్రా ఐదో బంతిని అద్బుతమైన ఇన్‌స్వింగర్ యార్కర్‌గా సంధించాడు. పోప్ తన బ్యాట్‌తో బంతిని అడ్డుకునే లోపే స్టంప్స్‌ను గిరాటేసింది. దీంతో పోప్ ఒక్కసారిగా బిత్తరపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ బాల్ అని కామెంట్లు చేస్తున్నారు. Jasprit Bumrah deadly Yorker to Ollie Pope. Crazy 🤯#INDvENG #INDvsENGpic.twitter.com/KjVRQ7KbBQ — Abdullah Neaz (@Neaz__Abdullah) February 3, 2024 Classic @Jaspritbumrah93 yorker. An exhibition!pic.twitter.com/Lmu92Ga8UU — CricTracker (@Cricketracker) February 3, 2024 -
ఎంత పనిచేశావు భరత్.. ఈజీ స్టంపౌట్ మిస్! రోహిత్ శర్మ రియాక్షన్ వైరల్
విశాఖపట్నం వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య రెండో టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 396 పరుగులు చేయగా.. అనంతరం ఇంగ్లండ్ కూడా దీటుగా బదులిస్తోంది. 25 ఓవర్లకు ఇంగ్లండ్ 3 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. క్రీజులో ఓలీ పోప్(21), బెయిర్ స్టో(0) పరుగులతో ఉన్నారు. అయితే ఇంగ్లండ్ స్టారర్ బ్యాటర్ ఓలీ పోప్ తన ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియా వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ స్టంపౌట్ ఛాన్స్‌ను మిస్ చేశాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 11 ఓవర్ వేసిన కుల్దీప్ యాదవ్ రెండో బంతికి డకెట్‌ను ఔట్ చేశాడు. అనంతరం పోప్ క్రీజులోకి వచ్చాడు. అయితే తన ఎదుర్కొన్న తొలి బంతినే అద్బుతమైన డెలవరీగా కుల్దీప్ సంధించాడు. ఆ బంతిని అంచనా వేయడంలో పోప్ విఫలమయ్యాడు. బంతి పోప్ బ్యాట్‌ను మిస్ అయ్యి వికెట్ కీపర్ చేతికి వేళ్లింది. వికెట్ కీపర్ భరత్ సైతం బంతిని అందుకోవడంలో విఫలమయ్యాడు. ఒకవేళ బంతిని అందుకుని బెయిల్స్‌ను పడగొట్టి ఉంటే పోప్ ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చెరేవాడు. రిప్లేలో క్లియర్‌గా పోప్ క్రీజుకు బయట ఉన్నట్లు కన్పించింది. వెంటనే భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఎంత పనిచేశావు భరత్ అన్నట్లు రియాక్షన్ ఇచ్చాడు. కాగా తొలి టెస్టులో కూడా పోప్‌కు అవకాశాలు ఇవ్వడంతో భారీ శతకంతో విరుచుకుపడ్డాడు. ఇప్పుడు మరోసారి ఛాన్స్ రావడంతో అందుకు టీమిండియా ఎంత మూల్యం చెల్లించుకుంటుందో వేచి చూడాలి. Early reprieve for Ollie Pope as KS Bharat missed a stumping chance! 👀#CricketTwitter #INDvENG #India #England #KSBharat pic.twitter.com/Z7dYmLHXTv — CRICKETNMORE (@cricketnmore) February 3, 2024 -
టెస్టు ర్యాంకింగ్స్‌లో దుమ్ములేపిన పోప్.. ఏకంగా! మరి రోహిత్?
ICC Mens Test Batting Rankings: ఐసీసీ మెన్స్ టెస్టు ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ బ్యాటర్ ఒలీ పోప్ సత్తా చాటాడు. టీమిండియాతో తొలి టెస్టులో అద్భుత శతకం సాధించిన అతడు.. ఏకంగా ఇరవై స్థానాలు ఎగబాకాడు. కెరీర్లో తొలిసారి అత్యుత్తమంగా 15వ ర్యాంకు సాధించాడు. కాగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్టులో ఒలీ పోప్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. రెండో ఇన్నింగ్స్‌లో 196 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. పోప్ ఇన్నింగ్స్ కారణంగానే పోప్ ఇన్నింగ్స్ కారణంగానే సొంతగడ్డపై మరింత పటిష్టమైన టీమిండియాను ఇంగ్లండ్ 28 పరుగుల తేడాతో ఓడించగలిగింది. ఈ క్రమంలో బుధవారం ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో ఈ మేరకు కెరీర్ బెస్ట్ ర్యాంకు సాధించాడని ఐసీసీ పేర్కొంది. కోహ్లి, రోహిత్ ర్యాంకులు? ఇక ఐసీసీ తాజాగా ప్రకటించిన టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో కేన్ విలియమ్సన్ అగ్రస్థానం నిలబెట్టుకోగా.. టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ఒక స్థానం మెరుగుపరచుకుని ఆరో ర్యాంకులో నిలిచాడు. భారత్ నుంచి కోహ్లి ఒక్కడే టాప్-10లో ఉన్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 12వ స్థానంలో నిలవగా.. దాదాపు ఏడాదిన్నరకాలంగా ఆటకు దూరమైన రిషభ్ పంత్ 13వ స్థానంలో నిలిచాడు. కాగా ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్టులకు కోహ్లి దూరం కాగా.. ఓపెనర్ రోహిత్ శర్మ హైదరాబాద్ మ్యాచ్‌లో విఫలమయ్యాడు. రెండు ఇన్నింగ్స్‌లో కలిపి 63 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇక ఇరు జట్ల మధ్య ఫిబ్రవరి 2 నుంచి విశాఖపట్నం వేదికగా రెండో టెస్టు మొదలుకానుంది. ఐసీసీ మెన్స్ టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్ టాప్-5లో ఉన్నది వీళ్లే 1. కేన్ విలియమ్సన్(న్యూజిలాండ్) 2. జో రూట్(ఇంగ్లండ్) 3. స్టీవ్ స్మిత్(ఆస్ట్రేలియా) 4. డారిల్ మిచెల్(న్యూజిలాండ్) 5. బాబర్ ఆజం(పాకిస్తాన్) చదవండి: Mayank Agarwal: ఆ బాటిల్ తీసుకుని తాగగానే వాంతులు.. భయంకర పరిస్థితి -
బుమ్రా బిహేవియర్ పై ఐసీసీ వార్నింగ్
-
Ind vs Eng 1st Test: బుమ్రాకు షాకిచ్చిన ఐసీసీ
India vs England, 1st Test: టీమిండియా ఫాస్ట్‌బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు అంతర్జాతీయ క్రికెట్ మండలి షాకిచ్చింది. ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో నిబంధనలు ఉల్లంఘించాడనే కారణంగా ఐసీసీ అతడిని మందలించింది. అదే విధంగా.. బుమ్రా ఖాతాలో డిమెరిట్ పాయింట్ జతచేసింది. హైదరాబాద్ టెస్టులో ఆరు వికెట్లు ఇంతకీ ఏం జరిగిందంటే... ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా టీమిండియా- ఇంగ్లండ్ హైదరాబాద్ వేదికగా తొలి టెస్టులో తలపడిన విషయం తెలిసిందే. ఉప్పల్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత పేస్ గుర్రం బుమ్రా మొత్తం ఆరు వికెట్లు తీసి సత్తా చాటాడు. బుమ్రా మ్యాజిక్.. పోప్ డబుల్ సెంచరీ మిస్ ముఖ్యంగా ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో కొరకరాని కొయ్యగా మారిన వన్‌డౌన్ బ్యాటర్ ఒలీ పోప్‌ను 196 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద(102.1వ ఓవర్) అద్భుత రీతిలో బౌల్డ్ చేశాడు. అయితే, అంతకంటే ముందు అంటే.. 81వ ఓవర్లో పోప్ వికెట్ల మధ్య పరుగు తీస్తున్నపుడు బుమ్రా కావాలనే అతడికి అడ్డంగా వెళ్లినట్లు కనిపించింది. ఈ క్రమంలో ఇద్దరూ పరస్పరం ఢీకొన్నారు. పొరపాటును అంగీకరించడంతో.. ఈ నేపథ్యంలో ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.12 నిబంధన ప్రకారం.. రూల్స్‌ను అతిక్రమించాడంటూ అంతర్జాతీయ క్రికెట్ మండలి బుమ్రాను మందలించింది. ఫీల్డ్ అంపైర్లు, సంబంధిత అధికారులు బుమ్రాదే తప్పని తేల్చగా.. బుమ్రా తన పొరపాటును అంగీకరించాడు. దీంతో ఐసీసీ అతడి ఖాతాలో ఓ డిమెరిట్ పాయింట్‌ను చేర్చింది. ఇదిలా ఉంటే.. తొలి టెస్టులో టీమిండియా 28 పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఇంగ్లండ్ ప్రస్తుతం 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇక ఇంగ్లండ్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఒలీ పోప్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇరు జట్ల మధ్య విశాఖపట్నం వేదికగా ఫిబ్రవరి 2 నుంచి రెండో టెస్టు ఆరంభం కానుంది. చదవండి: టీమిండియాకు బిగ్ షాక్: రాహుల్, జడేజా దూరం.. వాళ్లకు ఛాన్స్: బీసీసీఐ ప్రకటన -
పోప్‌పై ప్రశంసల వర్షం కురిపించిన టీమిండియా కెప్టెన్, కోచ్
హైదరాబాద్ టెస్ట్‌లో భారీ ద్విశతం (196) సాధించి, తమ ఓటమికి ప్రధాన కారణంగా నిలిచిన ఇంగ్లండ్ ఆటగాడు ఓలీ పోప్‌పై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రశంసల వర్షం కురిపించారు. మ్యాచ్ అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో వీరిద్దరూ పోప్ ఆడిన మ్యాచ్ విన్నింగ్స్ను కొనియాడారు. ద్రవిడ్ మాట్లాడుతూ.. గతంలో పలువురు విదేశీ బ్యాటర్లు భారత స్పిన్నర్లను ఇబ్బంది పెట్టిన సందర్భాలు చూశాను. కానీ పోప్‌లా భారత స్పిన్నర్లను నిలదొక్కుకోనీయకుండా ఇబ్బంది పెట్టిన బ్యాటర్లను చూడలేదు. పోప్ వైవిధ్యభరితమైన షాట్లను (రివర్స్ స్వీప్) ఎంతో సమర్థవంతంగా ఆడి భారత స్పిన్నర్లు లయ తప్పేలా చేశాడు. పోప్ ఎదురుదాడికి దిగి భారత స్పిన్నర్లను కుదురుకోనీయకుండా చేశాడు. కష్టమైన పిచ్‌పై పోప్ ఆడిన ఇన్నింగ్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రపంచంలోనే మేటి స్పిన్నర్లను పోప్ తన బ్యాటింగ్ నైపుణ్యంతో ముప్పుతిప్పలు పెట్టాడు. ఫైనల్‌గా హ్యాట్స్ ఆఫ్ టు పోప్ అంటూ ద్రవిడ్ కొనియాడాడు. మరోవైపు పోప్ గురించి భారత కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ ఇలా అన్నాడు. భారత గడ్డపై ఓ విదేశీ ప్లేయర్ ఆడిన అత్యుత్తమ ఇన్నింగ్స్‌లలో ఇది (పోప్) ఒకటని రోహిత్ కితాబునిచ్చాడు. ఇదిలా ఉంటే, ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి టెస్ట్‌లో పర్యాటక ఇంగ్లండ్.. టీమిండియాపై 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 190 పరుగుల భారీ లీడ్ సాధించినప్పటికీ ఓటమిపాలైంది. ఓలీ పోప్ మూడో ఇన్నింగ్స్‌లో అద్భుత ఇన్నింగ్స్ ఆడి భారత్ ముందు ఫైటింగ్ టోటల్‌ను ఉంచడంలో కీలకపాత్ర పోషించాడు. 230 పరుగుల లక్ష్య ఛేదనలో తడబడిన భారత్ 202 పరుగులకు ఆలౌటై, స్వదేశంలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ సిరీస్‌లోని రెండో టెస్ట్ మ్యాచ్ విశాఖ వేదికగా ఫిబ్రవరి 2 నుంచి మొదలవుతుంది. -
వాళ్లిద్దరు అత్యద్భుతం.. రోహిత్‌ను చూసే నేర్చుకున్నా: స్టోక్స్
India vs England, 1st Test: టీమిండియాతో తొలి టెస్టులో విజయంపై ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ హర్షం వ్యక్తం చేశాడు. భారత గడ్డపై సాధించిన ఈ గెలుపు వందకు వంద శాతం ఎంతో గొప్పదని వ్యాఖ్యానించాడు. ప్రతికూల పరిస్థితులను అధిగమించి సాధించిన పరిపూర్ణ విజయమని పేర్కొన్నాడు. నాలుగో రోజే ముగిసిన టెస్టు అదే విధంగా.. ఉపఖండంలో తొలిసారి కెప్టెన్ హోదాలో అడుగుపెట్టానని.. తొలి మ్యాచ్‌లోనే ఆతిథ్య జట్టును ఓడించడం సంతోషంగా ఉందన్నాడు. కాగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా హైదరాబాద్ టెస్టులో ఇంగ్లండ్ టీమిండియాను 28 పరుగుల తేడాతో ఓడించింది. ఉప్పల్‌లో తొలి రెండు రోజులు వెనుకబడ్డ స్టోక్స్ బృందం.. అనూహ్యంగా పుంజుకుని నాలుగో రోజే ఖేల్ ఖతం చేసి విజయం అందుకుంది. పరిపూర్ణ విజయం.. ఒలీ పోప్ అద్భుత శతకం(196), అరంగేట్ర స్పిన్నర్ టామ్ హార్లీ(మొత్తం తొమ్మిది వికెట్లు) కారణంగా ఊహించని రీతిలో టీమిండియాను ఓడించింది. ఈ నేపథ్యంలో స్టోక్స్ మాట్లాడుతూ.. ‘‘కెప్టెన్‌గా నేను బాధ్యతలు చేపట్టిన తర్వాత మా జట్టు విజయాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన ప్రదర్శనలతో ఆకట్టుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఇలాంటి ఘన విజయం మరింత గొప్పగా అనిపిస్తోంది. ఇండియాలో కెప్టెన్‌గా నా తొలి ప్రయత్నంలోనే గెలుపు దక్కింది. తొలి ఇన్నింగ్స్‌లో మేము పొరపడ్డ మాట వాస్తవం. అయితే, టీమిండియా స్పిన్నర్లు ఆడుతున్న తీరు.. రోహిత్ ఫీల్డింగ్ సెట్ చేస్తున్న విధానాన్ని గమనిస్తూ చాలా విషయాలు నేర్చుకున్నా. వాటిని మా వ్యూహాలకు అనుగుణంగా అమలు చేసి ఫలితం రాబట్టడం ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంది’’ అని ఆనందం వ్యక్తం చేశాడు. వాళ్లిద్దరు అత్యద్భుతం అదే విధంగా తమ విజయంలో కీలక పాత్ర పోషించిన ఒలీ పోప్, టామ్ హార్లీ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘భుజానికి సర్జరీ చేయించుకున్న తర్వాత ఒలీ పోప్ రీ ఎంట్రీలో ఇలా అదరగొట్టాడు. టామ్‌కు ఇదే అరంగేట్ర మ్యాచ్. అయినప్పటికీ తన మీద నమ్మకంతో వరుసగా ఓవర్లు వేయించాను. ప్రతికూల ఫలితం వచ్చినా పర్లేదని ముందే నిశ్చయించుకున్నా. View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) అయితే, అతడు నా నమ్మకాన్ని నిజం చేశాడు. ఉపఖండంలో అనేక టెస్టులు ఆడిన అనుభవం నాకు ఉంది. అయితే, ఓ ఇంగ్లిష్ బ్యాటర్ ఇక్కడ ఆడిన అత్యద్భుత ఇన్నింగ్స్ ఏదంటే.. ఒలీ పోప్ పేరు చెప్పొచ్చు. నిజానికి ఒకవేళ మేము ఈ మ్యాచ్‌లో ఓడిపోయినా నేను పెద్దగా బాధపడే వాడిని కాదు. వైఫల్యాలకు భయపడే వాడిని కానేకాను. ఆటగాళ్లను కావాల్సినంత ప్రోత్సాహం అందిస్తూ.. ఎల్లవేళలా వాళ్లకు మద్దతుగా నిలిస్తే ఫలితాలు వాటంతట అవే వస్తాయని నమ్ముతాను’’ అని బెన్ స్టోక్స్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించాడు. చదవండి: IND Vs ENG: ఇంట్లోనే తలవంచారు... భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మ్యాచ్ పూర్తి వివరాలు -
పోప్ సంగతి సరే.. వాళ్ల విషయంలోనూ అలా ఎందుకు?: డీకే విమర్శలు
India vs England, 1st Test : సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ను టీమిండియా పరాజయంతో ప్రారంభించింది. హైదరాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో పర్యాటక జట్టు చేతిలో 28 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఉప్పల్‌లో గురువారం మొదలైన టెస్టులో తొలి రెండు రోజులు ఆధిపత్యం కొనసాగించిన రోహిత్ సేన.. ఆ తర్వాత పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఇంగ్లండ్ విధించిన 231 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నాలుగో రోజే తలవంచి ఓటమిని ఆహ్వానించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 0-1తో వెనుకబడింది. స్వదేశంలో టీమిండియా ఇలా ఊహించని రీతిలో ఓటమిపాలు కావడంతో రోహిత్ సేనపై విమర్శల వర్షం కురుస్తోంది. వాళ్ల విషయంలోనూ డిఫెన్సివ్‌గా ఎందుకు? తొలి టెస్టులో భారత్ ఆట తీరు, రోహిత్ శర్మ కెప్టెన్సీపై వెటరన్, మాజీ క్రికెటర్లు పెదవి విరుస్తున్నారు. టీమిండియా వికెట్ కీపర్ దినేశ్ కార్తిక్ స్పందిస్తూ.. ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో భారత్ పూర్తి రక్షణాత్మక ధోరణిలో ఆడిందని విమర్శించాడు. ఒలి పోప్ వంటి బ్యాటర్ విషయంలో డిఫెన్సివ్‌గా ఉండటంలో తప్పులేదని.. కానీ.. టామ్ హార్లీ వంటి టెయిలెండర్ల విషయంలోనూ అదే తరహాలో ఆడటం సరికాదని డీకే అభిప్రాయపడ్డాడు. స్పిన్నర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ ఇంకాస్త మెరుగ్గా అటాకింగ్ చేసి ఉంటే బాగుండన్నాడు. ఈ మేరకు జియో సినిమా షోలో దినేశ్ కార్తిక్ వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాను ఇంత బేలగా చూడలేదు ఇక భారత జట్టు మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి మాట్లాడుతూ.. సొంతగడ్డపై టీమిండియా ఇంతకు ముందెన్నడూ ఇంత బేలగా చూడలేదన్నాడు. రోహిత్ సేన పూర్తిగా ఒత్తిడిలో కూరుకుపోవడం.. థర్డ్ ఇన్నింగ్స్‌లో పర్యాటక జట్టుకు 400 పైచిలుకు పరుగులు చేసే అవకాశం ఇవ్వడం తనని ఆశ్చర్యపరిచిందని అన్నాడు. భారత ఆటగాళ్ల బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే ఆడుతుంది అసలు మనవాళ్లేనా అన్న సందేహం కలిగిందని వాపోయాడు. కాగా ఇంగ్లండ్ వన్‌డౌన్ బ్యాటర్ ఒలీ పోప్ ఈ మ్యాచ్‌లో 196 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. చదవండి: IND Vs ENG: ఇంట్లోనే తలవంచారు... భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మ్యాచ్ పూర్తి వివరాలు -
పోప్ సెంచరీ తాలింపు...
తొలి టెస్టు మూడో రోజు ఆట మొదలైనప్పుడు భారత్ 175 పరుగుల ఆధిక్యంలో ఉంది. టీమ్ ఆలౌట్ అయ్యే సమయానికి ఆ ఆధిక్యం 190 పరుగులకు చేరింది. ముందుగా ఈ లోటును పూడ్చుకునే ప్రయత్నంలో బరిలోకి దిగిన ఇంగ్లండ్ శనివారం ఆట ముగిసేసరికి 126 పరుగులు ముందంజలో నిలిచింది. ప్రతికూల పరిస్థితుల్లోనూ బ్యాటర్ల పోరాటం జట్టును ఇక్కడి వరకు తీసుకొచ్చింది. ముఖ్యంగా ఒలీ పోప్ అద్భుత బ్యాటింగ్‌తో చిరస్మరణీయ ప్రదర్శన చేశాడు. ఈ ఇన్నింగ్స్‌కు ముందు భారత గడ్డపై 9 ఇన్నింగ్స్‌లలో కలిపి 154 పరుగులే చేసిన పోప్ ఈ ఇన్నింగ్స్‌లోనే దాదాపు అన్నే పరుగులు సాధించడం విశేషం. అతని స్వీప్, రివర్స్ స్వీప్ షాట్లకు భారత స్పిన్నర్ల వద్ద జవాబు లేకపోయింది. ఆధిక్యం మరీ ఎక్కువ కాదు కాబట్టి ఈ మ్యాచ్ ఇంకా టీమిండియా చేతుల్లోనే ఉంది. అయితే మారిపోతున్న పిచ్‌పై నాలుగో ఇన్నింగ్స్ సవాల్‌ను రోహిత్ బృందం ఎంత సమర్థంగా ఎదుర్కొంటుందన్నది ఆసక్తికరం. సాక్షి, హైదరాబాద్: భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో మూడో రోజు ఇంగ్లండ్ మెరుగైన ప్రదర్శన కనబర్చింది. ఓటమి ఖాయమనిపించే స్థితి నుంచి కోలుకొని ఇంకా పోరాడుతోంది. శనివారం ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 77 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 316 పరుగులు చేసింది. ఒలీ పోప్ (208 బంతుల్లో 148 బ్యాటింగ్; 17 ఫోర్లు) అజేయ సెంచరీతో చెలరేగాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ 126 పరుగులు ముందంజలో ఉంది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 421/7తో ఆట కొనసాగించిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 121 ఓవర్లలో 436 పరుగులకు ఆలౌటైంది. రవీంద్ర జడేజా (180 బంతుల్లో 87; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ అవకాశాన్ని కోల్పోయాడు. మరో 15 పరుగులు జోడించి... మూడో రోజు భారత్ తొలి ఇన్నింగ్స్ ముగిసేందుకు 11 ఓవర్లు సరిపోయాయి. ఒకేస్కోరు వద్ద జట్టు చివరి 3 వికెట్లు కోల్పోయింది. రూట్ వరుస బంతుల్లో జడేజా, బుమ్రా (0)లను అవుట్ చేయగా... తర్వాతి ఓవర్లో అక్షర్ పటేల్ (100 బంతుల్లో 44; 7 ఫోర్లు, 1 సిక్స్)ను రేహన్ బౌల్డ్ చేశాడు. రాణించిన డకెట్... తొలి ఇన్నింగ్స్‌లాగే రెండో ఇన్నింగ్స్‌లోనూ ఇంగ్లండ్ శుభారంభం చేసింది. క్రాలీ (33 బంతుల్లో 31; 4 ఫోర్లు, 1 సిక్స్), డకెట్ కలిసి చకచకా పరుగులు జోడించారు. అశ్విన్ చక్కటి బంతితో క్రాలీని అవుట్ చేసి ఈ భాగస్వామ్యాన్ని విడదీసినా... డకెట్, పోప్ జోరుగా ఆడటంతో తొలి సెషన్ ముగిసేసరికి జట్టు 6 రన్‌రేట్‌తో 15 ఓవర్లలోనే 89 పరుగులు చేసింది. అయితే లంచ్ తర్వాత భారత బౌలర్లు ఒక్కసారిగా చెలరేగిపోయారు. బుమ్రా బౌలింగ్‌లో డకెట్ ఎల్బీ అయ్యే అవకాశం ఉన్నా... భారత్ రివ్యూ తీసుకోకపోవడంతో అతను బతికిపోయాడు. రీప్లేలో బంతి స్టంప్స్‌ను తాకేదని తేలడంతో బుమ్రా తీవ్రంగా నిరాశ చెందాడు. అయితే తన తర్వాతి ఓవర్లో అద్భుత బంతితో డకెట్‌ను బౌల్డ్ చేసిన భారత పేసర్ భావోద్వేగం ప్రదర్శించాడు. జట్టు టాప్ బ్యాటర్ రూట్ (6 బంతుల్లో 2)ను కూడా తన తర్వాతి ఓవర్లోనే బుమ్రా అవుట్ చేశాడు. జడేజా బంతిని ఆడకుండా వదిలేసి బెయిర్‌స్టో (24 బంతుల్లో 10; 1 ఫోర్) బౌల్డ్ కాగా... బెన్ స్టోక్స్ (33 బంతుల్లో 6)కు వరుసగా మూడు ఓవర్లు మెయిడిన్ వేసి ఒత్తిడి పెంచిన అశ్విన్ అదే జోరులో చక్కటి బంతితో అతని ఆట కట్టించాడు. మరోవైపు పోప్ మాత్రం చక్కటి షాట్లతో పరుగులు రాబడుతూ 54 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. భారీ భాగస్వామ్యం... స్టోక్స్ ఐదో వికెట్‌గా వెనుదిరిగినప్పుడు ఇంగ్లండ్ స్కోరు 163/5. ఆ జట్టు మరో 27 పరుగులు వెనుకబడి ఉంది. ఈ దశలో భారత్ మిగిలిన వికెట్లను టపటపా పడగొట్టి మ్యాచ్‌ను ముగిస్తుందని అనిపించింది. అయితే మరో 30 ఓవర్ల పాటు పోప్, బెన్ ఫోక్స్ (81 బంతుల్లో 34; 2 ఫోర్లు) కలిసి భారత బౌలర్లను ఆడుకున్నారు. చక్కటి సమన్వయంతో బ్యాటింగ్ చేస్తూ పరుగులు రాబట్టారు. ఆరంభంలో కుదురుకునేందుకు కొంత సమయం తీసుకున్న తర్వాత ధాటిగా ఆడారు. భారత బౌలర్లలోనూ ఎవరూ వీరిని ఇబ్బంది పెట్టలేకపోయారు. దాంతో ముందుగా తొలి ఇన్నింగ్స్ లోటును పూడ్చుకున్న ఇంగ్లండ్... ఆ తర్వాత ఆధిపత్యాన్ని పెంచుకుంటూ పోయింది. ఈ క్రమంలో పోప్ 154 బంతుల్లో తన కెరీర్లో ఐదో టెస్ట్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆరో వికెట్‌కు పోప్‌తో 112 పరుగులు జత చేసిన ఫోక్స్‌ను అక్షర్ బౌల్డ్ చేయడంతో భారత్‌కు ఎట్టకేలకు ఊరట లభించింది. అయితే రేహన్ (31 బంతుల్లో 16 బ్యాటింగ్; 2 ఫోర్లు) కలిసి పోప్ మరో వికెట్ పడకుండా మూడో రోజును జాగ్రత్తగా ముగించాడు. చివరి సెషన్లో ఇంగ్లండ్ 35 ఓవర్లలో ఒకే వికెట్ కోల్పోయి 144 పరుగులు సాధించింది. 110 పరుగుల వద్ద పోప్ ఇచ్చిన క్యాచ్‌ను అక్షర్ వదిలేయడం కూడా జట్టుకు కలిసొచ్చింది. స్కోరు వివరాలు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 246 ఆలౌట్; భారత్ తొలి ఇన్నింగ్స్: 436 ఆలౌట్; ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: క్రాలీ (సి) రోహిత్ (బి) అశ్విన్ 31; డకెట్ (బి) బుమ్రా 47; పోప్ (బ్యాటింగ్) 148; రూట్ (ఎల్బీ) (బి) బుమ్రా 2; బెయిర్‌స్టో (బి) జడేజా 10; స్టోక్స్ (బి) అశ్విన్ 6; ఫోక్స్ (బి) అక్షర్ 34; రేహన్ (బ్యాటింగ్) 16; ఎక్స్‌ట్రాలు 22; మొత్తం (77 ఓవర్లలో 6 వికెట్లకు) 316. వికెట్ల పతనం: 1–45, 2–113, 3–117, 4–140, 5–163, 6–275. బౌలింగ్: బుమ్రా 12–3–29–2, అశ్విన్ 21–3–93–2, అక్షర్ 15–2–69–1, జడేజా 26–1–101–1, సిరాజ్ 3–0–8–0. -
సెంచరీతో చెలరేగిన పోప్.. రసవత్తరంగా భారత్-ఇంగ్లండ్ తొలి టెస్టు
హైదరాబాద్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు రసవత్తరంగా మారింది. మూడో రోజు ఆటలో భారత్‌కు ధీటుగా బదులిచ్చిన ఇంగ్లండ్.. భారీ స్కోర్ దిశగా అడుగులు వేస్తోంది. శనివారం ఆట ముగిసేసరికి ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు కోల్పోయి 316 పరుగులు సాధించింది. ఇంగ్లీష్ జట్టు ప్రస్తుతం 126 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో యువ ఆటగాడు ఓలీ పోప్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. ఓ వైపు వికెట్లు పడతున్నప్పటికీ పోప్ మాత్రం భారత బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ ఇన్నింగ్స్‌ను ముందకు నడిపిస్తున్నాడు. పోప్ ప్రస్తుతం 148 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. అతడితో పాటు రెహాన్ ఆహ్మద్(16) పరుగులతో క్రీజులో ఉన్నాడు. కాగా అంతకముందు ఓవర్ నైట్ స్కోరు 421/7తో మూడో రోజు ఆట ప్రారంభించిన భారత్.. అదనంగా కేవలం 15 పరుగులు మాత్రమే జోడించి ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో 436 పరుగులకు ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 190 పరుగుల ఆధిక్యం లభించింది. ఇంగ్లండ్ బౌలర్లో పార్ట్‌టైమ్ స్పిన్నర్ జో రూట్ 4 వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు. చదవండి: ILT 20 2024: ఇదేమి సిక్స్‌రా బాబు.. దెబ్బకు స్టేడియం బయటకు బంతి! వీడియో వైరల్ -
రోహిత్ శర్మ కళ్లు చెదిరే క్యాచ్.. ఇంగ్లండ్ బ్యాటర్ మైండ్ బ్లాంక్ ! వీడియో
హైదరాబాద్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు ప్రారంభమైంది. టాస్ గెలిచి ఇంగ్లండ్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా ఈ మ్యాచ్‌లో తొలి రోజు ఆట సందర్భంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. అద్భుత క్యాచ్‌తో ఇంగ్లండ్ బ్యాటర్ ఓలీ పోప్‌ను హిట్‌మ్యాన్ పెవిలియన్‌కు పంపాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 15 ఓవర్లో జడేజా వేసిన నాలుగో బంతిని పోప్ డిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో బంతి ఎడ్జ్ తీసుకుని స్లిప్స్ దిశగా వెళ్లింది. అయితే స్లిప్‌లో ఉన్న రోహిత్.. డైవ్ చేస్తూ అద్భుతమైన లో క్యాచ్‌ను అందుకున్నాడు. ఇది చూసిన ఇంగ్లండ్ బ్యాటర్ బిత్తరపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోప్ ఈ మ్యాచ్‌లో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేశాడు. 21 ఓవర్లకు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసింది. చదవండి: AUS VS WI 2nd Test: కోవిడ్ ఉన్నా ఆడించారు.. కానీ, ఇలా దూరం పెట్టారు..! Whatt a Catch Rohit Sharma #RohitSharma𓃵 #Jadeja pic.twitter.com/V9oozOrEiU — Rajeshhhhh🤐 (@johnholick) January 25, 2024 -
'భారత్‌తో టెస్టు సిరీస్‌లోనూ బజ్‌బాల్ క్రికెట్ ఆడతాం.. కానీ అక్కడ'
ఇంగ్లండ్ క్రికెట్ జట్టు ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం వచ్చే ఏడాది జనవరిలో భారత్‌లో పర్యటించనుంది. హైదరాబాద్ వేదికగా జనవరి 25 నుంచి ఇరు జట్లు మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ 2023-2025లో భాగంగా ఈ సిరీస్ జరగనుంది. అయితే ఈ హైప్రొఫైల్ సిరీస్ ఆరంభానికి ముందు ఇంగ్లండ్ టెస్టు బ్యాటర్ ఓలీ పోప్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత్‌తో టెస్టు సిరీస్‌లో కూడా 'బాజ్‌బాల్'ను కొనసాగిస్తామని పోప్ థీమా వ్యక్తం చేశాడు. కాగా గత కొంతకాలంగా టెస్టుల్లో ఇంగ్లండ్ 'బాజ్‌బాల్(దూకుడుగా ఆడటం)' విధానాన్ని అనుసరిస్తున్న సంగతి తెలిసిందే. మేము ఇప్పటి వరకు టెస్టుల్లో ఏ విధంగా ఆడామో అదే కొనసాగిస్తాము. ప్రతీ మ్యాచ్‌లోనూ సెంచరీలు చేయాలని మాపై చాలా అంచనాలు ఉంటాయి. మేము సెంచరీలు చేయకపోతే విఫలమైనట్లు భావిస్తారు. కానీ భారత్ వంటి పరిస్ధితుల్లో అన్ని మ్యాచ్‌ల్లొ అది జరగకపోవచ్చు. కొన్ని పిచ్‌ల్లో 200 కొట్టినా మంచి స్కోరఖ్ అవ్వవచ్చు. భారత స్పిన్నర్ల నుంచి మా రైట్ హ్యాండ్ బ్యాటర్లకు గట్టి సవాలు ఎదురుకానుంది. అశ్విన్ ప్రపంచంలోనే అత్యుత్తమ స్పిన్నర్. అతడితో పాటు రవీంద్ర జడేజా, అక్షర్ వంటి అద్బుతమైన స్పిన్నర్లు ఉన్నారు. మేము పరుగులు సాధించాలంటే బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టడమే ఒక్కటే మార్గం. భారత్ పరిస్థితుల్లో మ్యాచ్‌లను గెలవడం అంత సులభం కాదు. కానీ గెలిచేందుకు మేము అన్ని విధాల ప్రయత్నిస్తామని ది టెలిగ్రాఫ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పోప్ పేర్కొన్నాడు. చదవండి: IND vs SA: టీమిండియా హెడ్ కోచ్ పదవిపై ద్రవిడ్ షాకింగ్ కామెంట్స్..