ట్రెంట్‌బ్రిడ్జ్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 241 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ రెండు ఇన్నింగ్స్‌ల్లో 400కు పైగా స్కోర్ చేసింది. 147 ఏళ్ల ఇంగ్లీష్ క్రికెట్ చరిత్రలో ఇలా జరగడం తొలిసారి. ఇదే మ్యాచ్‌లో విండీస్ సైతం తొలి ఇన్నింగ్స్‌లో 400కు పైగా స్కోర్ చేసింది.
టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలిసారి..
ఓ టెస్ట్ మ్యాచ్‌లో ఒకటి, రెండు, మూడు ఇన్నింగ్స్‌ల్లో 400కు పైగా స్కోర్లు నమోదు కావడం ఇదే మొదటిసారి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులు, సెకెండ్ ఇన్నింగ్స్‌లో 425 పరుగులు చేయగా.. వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 457, సెకెండ్ ఇన్నింగ్స్‌లో 143 పరుగులు చేసింది.
మ్యాచ్ విషయానికొస్తే.. 385 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వెస్టిండీస్.. యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ ఐదేయడంతో (5/41) 143 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో 400కు పైగా స్కోర్ చేయడంతో పాటు 41 పరుగుల కీలకమైన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సాధించిన విండీస్.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో చేతులెత్తేసింది.
బషీర్‌తో పాటు క్రిస్ వోక్స్ (2/28), అట్కిన్సన్ (2/49), మార్క్ వుడ్ (1/17) విండీస్ పతనాన్ని శాశించారు. విండీస్ ఇన్నింగ్స్‌లో క్రెయిగ్ బ్రాత్‌వైట్ (47), జేసన్ హోల్డర్ (37), మికైల్ లూయిస్ (17), జాషువ డసిల్వ (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు.
ఈ మ్యాచ్‌లో గెలుపుతో ఇంగ్లండ్.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ (121), సెకెండ్ ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ (51) చేసిన ఓలీ పోప్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో కవెమ్ హాడ్జ్ (120) సెంచరీతో ఆకట్టుకోగా.. ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో హ్యారీ బ్రూక్ (109), జో రూట్ (122) సెంచరీలతో సత్తా చాటారు.
Comments
Please login to add a commentAdd a comment