Ollie Pope's acrobatic efforts leave New Zealand batters dazed on Day 2 - Sakshi
Sakshi News home page

ENG vs NZ: క్రికెట్‌ చరిత్రలోనే అద్భుతమైన క్యాచ్‌.. చూసి తీరాల్సిందే! వీడియో వైరల్‌

Published Sat, Feb 25 2023 3:29 PM | Last Updated on Sat, Feb 25 2023 3:53 PM

Ollie Popes acrobatic efforts leave New Zealand batters dazed on Day 2 - Sakshi

వెల్లింగ్టన్‌ వేదికగా న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో ఇంగ్లండ్‌ ఆటగాడు ఓలీ పోప్ సంచలన క్యాచ్‌తో అందరిని ఆశ్చర్యపరిచాడు. పోప్ అద్భుతమైన డైవింగ్‌ క్యాచ్‌తో న్యూజిలాండ్‌ బ్యాటర్‌ హెన్రీ నికోల్స్‌ను పెవిలియన్‌కు పంపాడు. న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ 25 ఓవర్‌ వేసిన జాక్‌ లీచ్‌ బౌలింగ్‌లో నికోల్స్‌ రివర్స్‌ ‍స్వీప్‌ ఆడాడు. అయితే బంతి అనూహ్యంగా బ్యాట్‌ ఎడ్జ్‌ తీసుకుని అతడి హెల్మట్‌కు తాకి సిల్లీ పాయింట్ దిశగా వెల్లింది.

ఈ క్రమంలో అక్కడ ఫీల్డింగ్‌ చేస్తున్న పోప్‌ ఒంటి చేత్తో అద్భుతమైన స్టన్నింగ్‌ క్యాచ్‌ను అందుకున్నాడు. దీంతో 30 పరుగులు చేసిన నికోల్స్‌ నిరాశతో మైదానాన్ని వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అదే విధంగా కివీస్‌ బ్యాటర్‌ మిచెల్‌ను కూడా ఓ అద్భుత క్యాచ్‌తో పోప్ పెవిలియన్‌ పంపాడు.

36 ఓవర్‌లో లీచ్‌ బౌలింగ్‌లో సిల్లీ పాయింట్‌లో.. మిచిల్‌ ఇచ్చిన ఓ స్టన్నింగ్‌ క్యాచ్‌ను పోప్  అందుకున్నాడు. ఇక రెండో రోజు ఆటముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ 7 వికెట్ల నష్టానికి 138 పరుగులు  చేసింది. అంతకముందు ఇంగ్లండ్‌   87.1 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 435 పరుగుల వద్ద తమ తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది.
చదవండిNZ Vs Eng: చెలరేగిన ఆండర్సన్‌, జాక్‌ లీచ్‌.. కష్టాల్లో కూరుకుపోయిన కివీస్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement