టెస్టు క్రికెట్‌లో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో అద్భుతమైన సెంచరీతో చెలరేగిన బ్రూక్.. ఇప్పుడు రెండో టెస్టులో కూడా దమ్ములేపాడు.
క్రైస్ట్ చర్చ్ వేదికగా జరుగుతున్న సెకెండ్ టెస్టులో బ్రూక్ సూపర్ సెంచరీతో మెరిశాడు. వన్డే తరహాలో తన ఇన్నింగ్స్‌ను కొనసాగించిన బ్రూక్ కేవలం 91 పరుగుల్లోనే తన 8వ టెస్టు సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.
ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 115 బంతులు ఎదుర్కొన్న బ్రూక్.. 11 ఫోర్లు, 5 సిక్స్‌లతో 123 పరుగులు చేసి రనౌటయ్యాడు. ఇక అతడి అద్భుత ప్రదర్శన ఫలితంగా ఇంగ్లండ్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 280 పరుగులకు ఆలౌటైంది.
ఇంగ్లండ్ అతడితో పాటు ఓలీ పోప్(66) హాఫ్ సెంచరీతో రాణించాడు. కివీస్ బౌలర్లలో నాథన్ స్మిత్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. విలియం ఓ రూర్క్ 3, మాట్ హెన్రీ రెండు వికెట్లు సాధించారు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన న్యూజిలాండ్‌కు ఇంగ్లండ్ బౌలర్లు చుక్కలు చూపిస్తున్నారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి కివీస్ 5 వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసింది. కివీస్ ప్రస్తుతం 194 పరుగుల వెనకంజలో ఉంది. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్సే రెండు వికెట్లు సాధించగా.. వోక్స్, అట్కిన్సన్, స్టోక్స్ తలా వికెట్ పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment