స్వదేశంలో ఇంగ్లండ్ చేతిలో టెస్టు సిరీస్‌ను కోల్పోయిన న్యూజిలాండ్ ఇప్పుడు తమ పరువు కాపాడుకునేందుకు సిద్దమైంది. డిసెంబర్ 14 నుంచి హామిల్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరగనున్న మూడో టెస్టులో ఎలాగైనా గెలిచి వైట్ వాష్ నుంచి తప్పించుకోవాలని కివీస్ భావిస్తోంది.
అయితే ఈ ఆఖరి టెస్టుకు ముందు బ్లాక్‌క్యాప్స్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఓపెనర్ డెవాన్ కాన్వే మూడో టెస్టుకు దూరమయ్యాడు. తన భార్య బిడ్డకు జన్మనివ్వడంతో కాన్వే కివీస్ జట్టు నుంచి వైదొలిగాడు. ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ ధృవీకరించింది.
కాన్వే స్ధానాన్ని మార్క్ చాప్‌మన్‌తో న్యూజిలాండ్ క్రికెట్ భర్తీ చేసింది. కాగా ఈ మ్యాచ్ కోసం న్యూజిలాండ్ జట్టు బుధవారం(డిసెంబర్ 12) హామిల్టన్‌కు చేరుకోనుంది. ఇక మూడో టెస్టులో కివీస్ ఓపెనర్‌గా విల్ యంగ్ బరిలోకి దిగనున్నాడు.
గత నెలలో భారత పర్యటనలో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచిన యంగ్.. ఇంగ్లండ్ సిరీస్‌లో మాత్రం తొలి రెండు మ్యాచ్‌లకు బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఇప్పడు కాన్వే దూరం కావడంతో తుది జట్టులోకి యంగ్ ఎంట్రీకి మార్గం సుగమమైంది. కాగా తొలి రెండు టెస్టుల్లో పర్యాటక ఇంగ్లండ్ చేతిలో కివీస్ ఘోర ఓటములను చవిచూసింది.
చదవండి: IND vs AUS: 'మీరేమి టూర్‌కు వెళ్లలేదు.. దయచేసి హోటల్ గదులలో కూర్చోవద్దు'
Comments
Please login to add a commentAdd a comment