Devon Conway
-
ENG vs NZ: ఓటమి బాధలో ఉన్న న్యూజిలాండ్‌కు భారీ షాక్..
స్వదేశంలో ఇంగ్లండ్ చేతిలో టెస్టు సిరీస్‌ను కోల్పోయిన న్యూజిలాండ్ ఇప్పుడు తమ పరువు కాపాడుకునేందుకు సిద్దమైంది. డిసెంబర్ 14 నుంచి హామిల్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరగనున్న మూడో టెస్టులో ఎలాగైనా గెలిచి వైట్ వాష్ నుంచి తప్పించుకోవాలని కివీస్ భావిస్తోంది.అయితే ఈ ఆఖరి టెస్టుకు ముందు బ్లాక్‌క్యాప్స్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఓపెనర్ డెవాన్ కాన్వే మూడో టెస్టుకు దూరమయ్యాడు. తన భార్య బిడ్డకు జన్మనివ్వడంతో కాన్వే కివీస్ జట్టు నుంచి వైదొలిగాడు. ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ ధృవీకరించింది. కాన్వే స్ధానాన్ని మార్క్ చాప్మన్తో న్యూజిలాండ్ క్రికెట్ భర్తీ చేసింది. కాగా ఈ మ్యాచ్ కోసం న్యూజిలాండ్ జట్టు బుధవారం(డిసెంబర్ 12) హామిల్టన్‌కు చేరుకోనుంది. ఇక మూడో టెస్టులో కివీస్ ఓపెనర్‌గా విల్ యంగ్ బరిలోకి దిగనున్నాడు.గత నెలలో భారత పర్యటనలో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచిన యంగ్.. ఇంగ్లండ్ సిరీస్‌లో మాత్రం తొలి రెండు మ్యాచ్‌లకు బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఇప్పడు కాన్వే దూరం కావడంతో తుది జట్టులోకి యంగ్ ఎంట్రీకి మార్గం సుగమమైంది. కాగా తొలి రెండు టెస్టుల్లో పర్యాటక ఇంగ్లండ్ చేతిలో కివీస్ ఘోర ఓటములను చవిచూసింది.చదవండి: IND vs AUS: 'మీరేమి టూర్‌కు వెళ్లలేదు.. దయచేసి హోటల్ గదులలో కూర్చోవద్దు' -
IND vs NZ: కివీస్ 402 ఆలౌట్.. భారీ ఆధిక్యం
టీమిండియాతో తొలి టెస్టులో న్యూజిలాండ్ భారీ స్కోరు సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ సేన కంటే 356 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. బెంగళూరు వేదికగా 180/3 ఓవర్‌నైట్ స్కోరుతో శుక్రవారం నాటి మూడో రోజు ఆట మొదలుపెట్టింది కివీస్.రచిన్ రవీంద్ర సెంచరీమిడిలార్డర్ బ్యాటర్ రచిన్ రవీంద్ర సెంచరీతో చెలరేగగా.. టెయిలెండర్ టిమ్ సౌతీ అతడికి సహకారం అందించాడు. రచిన్ 157 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 134 పరుగులు చేశాడు. అతడి కెరీర్లో ఇది రెండో టెస్టు సెంచరీ. మరోవైపు.. సౌతీ 73 బంతుల్లో 65 రన్స్‌తో ఆకట్టుకున్నాడు. మిగతా వాళ్లలో మూడో రోజు గ్లెన్ ఫిలిప్స్(14) ఒక్కడే డబుల్ డిజిట్ స్కోరు సాధించాడు.ఇక గురువారం ఓపెనర్ డెవాన్ కాన్వే 91 పరుగులతో అదరగొట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 402 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా మూడేసి వికెట్లు పడగొట్టగా.. అశ్విన్ ఒక వికెట్ తీశాడు. పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. కాగా రోహిత్ సేన 46 పరుగులకే కుప్పకూలిన విషయం తెలిసిందే. ఫలితంగా న్యూజిలాండ్‌కు 356 పరుగుల ఆధిక్యం లభించింది.టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్👉తొలి టెస్టు: అక్టోబరు 16- అక్టోబరు 20👉వేదిక: ఎం. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు👉వర్షం వల్ల తొలిరోజు ఆట రద్దు👉రెండో రోజు పడిన టాస్👉టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా👉టీమిండియా తొలి ఇన్నింగ్స్: 46 పరుగులకే ఆలౌట్👉న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 402 ఆలౌట్.చదవండి: ‘కాస్తైనా సిగ్గుండాలి నీకు!: మండిపడ్డ టీమిండియా ఫ్యాన్స్ -
కాన్వే జాగ్రత్తగా ఉండు.. అతడు ఇప్పుడు డీఎస్పీ: గవాస్కర్
బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో ప్రారంభమైన మొదటి టెస్టులో భారత్‌కు ఏదీ కలిసి రావడం లేదు. వర్షం కారణంగా తొలి రోజు ఆట తుడిచిపెట్టుకుపోవడంతో రెండో రోజు(గురువారం) మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఘోర పరాభావం ఎదురైంది. న్యూజిలాండ్ బౌలర్ల దాటికి భారత్ కేవలం 46 పరుగులకే కుప్పకూలింది. 92 ఏళ్ల తమ టెస్టు క్రికెట్ హిస్టరీల భారత జట్టుకు స్వదేశంలో ఇదే అత్యల్ప స్కోర్ కావడం గమనార్హం. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ 5 వికెట్లు పడగొట్టగా.. రౌర్కీ 4 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. భారత బ్యాటర్లలో రిషబ్ పంత్(20) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్‌లో కూడా కివీస్ అదరగొడుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ 3 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది.అతడొక డీఎస్పీ..కాగా రెండో రోజు ఆట సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో కివీస్‌కు ఓపెనర్లు లాథమ్, కాన్వే మంచి ఆరంభాన్ని ఇచ్చారు. లాథమ్గా స్లోగా ఆడినప్పటకి మరో ఓపెనర్ డెవాన్ కాన్వే మాత్రం వన్డే తరహాలో తన ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు.ఈ క్రమంలో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 15వ ఓవర్ వేసిన మహ్మద్ సిరాజ్.. కాన్వేను స్లెడ్జ్ చేశాడు. ఆ ఓవర్లో మూడో బంతిని కాన్వే బౌండరీకి తరలించాడు. ఆ తర్వాత నాలుగో బంతిని డెవాన్ డిఫెండ్ చేశాడు. వెంటనే సిరాజ్ కాన్వే వైపు సీరియస్‌గా చూస్తూ ఏదో అన్నాడు. కాన్వే మాత్రం సిరాజ్ మాటలను పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఫన్నీ వ్యాఖ్యలు చేశాడు. "అతడు ఇప్పుడు డీఎస్పీ అన్న విషయం మర్చిపోవద్దు. అతనికి సహచరులు సెల్యూట్ చేశారా? లేదా? ఒక వేళ చేస్తే కచ్చితంగా నేను షాక్ అవుతాను" అని గవాస్కర్ పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్ 2024 గెలిచిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్న మహమ్మద్ సిరాజ్‌కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్-1 పోస్ట్ కింద డీఎస్పీ ఉద్యోగం ఇచ్చింది. Siraj telling his real Instagram I'd to Conway pic.twitter.com/OMTZbP4VSY— John_Snow (@MrSnow1981) October 17, 2024 -
IND vs NZ: దంచికొట్టిన కాన్వే.. టీమిండియాకు చేదు అనుభవం!
న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో టీమిండియా తడ‘బ్యాటు’కు గురైంది. స్టార్ బ్యాటర్లంతా పెవిలియన్‌కు వరుస కట్టడంతో మొదటి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే ఆలౌట్ అయింది. తద్వారా చెత్త రికార్డులతో పాటు విమర్శలూ మూటగట్టుకుంది. ఇక బౌలింగ్‌లోనూ మన వాళ్లు ప్రభావం చూపలేకపోయారు. భారత బ్యాటర్లు పరుగులు రాబట్టలేక చతికిలపడిన పిచ్‌పై కివీస్ బ్యాటర్లు మెరుగైన స్కోర్లు సాధించారు. ఓవరాల్‌గా రెండో రోజు కివీస్‌దే పైచేయి అయింది.భారీ వర్షం వల్ల తొలిరోజు ఆట రద్దుకాగా భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టులో బుధవారం మొదటి రోజు ఆట సాధ్యం కాని విషయం తెలిసిందే. ఉదయం నుంచి వర్షం కురవడంతో కనీసం టాస్ కూడా పడకుండానే తొలి రోజు ముగిసింది. షెడ్యూల్ ప్రకారం 9 గంటలకు టాస్ వేయాల్సి ఉండగా... ఆ సమయంలో భారీ వర్షం ముంచెత్తింది. దీంతో ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్లకే పరిమితమయ్యారు. కాసేపటికి వరుణుడు తెరిపినివ్వడంతో మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ ఉన్న చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ ప్రారంభం కావడం ఖాయమే అని అభిమానులు ఆశపడ్డారు.కానీ గత రెండు రోజులుగా బెంగళూరులో వర్షాలు కురుస్తుండటంతో గ్రౌండ్‌ను పూర్తిగా కవర్స్‌తో కప్పి ఉంచారు. ఈ నేపథ్యంలో మ్యాచ్‌కు ముందు ‘హాక్–ఐ’ టెక్నాలజీ పరికరాలను ఏర్పాటు చేయలేకపోయారు. దీంతో ముందస్తు లంచ్ బ్రేక్ ప్రకటించి ‘హాక్–ఐ’ పరికరాలను అమర్చే ప్రయత్నం చేశారు. అప్పటికే టీ విరామ సమయం కూడా మించి పోగా... కాసేపటికే మరోసారి భారీ వర్షం మైదానాన్ని ముంచెత్తింది. దీంతో అంపైర్లు తొలి రోజు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. రెండో రోజు కరుణించిన వరణుడుఈ క్రమంలో గురువారం కూడా ఆట మొదలవుతుందో లేదోనన్న సందేహాల నడుమ ఎట్టకేలకు వరణుడు కరుణించాడు. ఈ క్రమంలో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, ఆరంభం నుంచే వికెట్ల పతనం మొదలైంది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్(13), కెప్టెన్ రోహిత్ శర్మ (2) నిరాశపరచగా.. వన్‌డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి, సర్ఫరాజ్ ఖాన్ డకౌట్ అయ్యారు.వికెట్ల పతనంఈ క్రమంలో వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ 20 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించారు. ఇక టెయిలెండర్లలో కుల్దీప్ యాదవ్ రెండు, బుమ్రా ఒకటి, సిరాజ్ నాలుగు(నాటౌట్) పరుగులు చేశారు. దీంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 31.2 ఓవర్లు మాత్రమే ఆడి కేవలం 46 పరుగులకే కుప్పకూలింది. కివీస్ బౌలర్లలో మ్యాచ్ హెన్నీ ఐదు వికెట్లు కూల్చగా.. విలియం రూర్కీ నాలుగు, టిమ్ సౌతీ ఒక వికెట్ పడగొట్టారు.కాన్వే హీరో ఇన్నింగ్స్ఆ తర్వాత బ్యాటింగ్ మొదలుపెట్టిన న్యూజిలాండ్‌కు డెవాన్ కాన్వే శుభారంభం అందించి.. రెండో రోజు ఆట ముగిసే సరికి పటిష్ట స్థితిలో నిలిపాడు. ఓపెనర్, కెప్టెన్ టామ్ లాథమ్(15) విఫలం కాగా.. మరో ఓపెనర్ కాన్వే 105 బంతులాడి 91 పరుగులతో అదరగొట్టాడు. విల్ యంగ్ 33 పరుగులు చేయగా.. గురువారం ఆట పూర్తయ్యేసరికి రచిన్ రవీంద్ర 22, డారిల్ మిచెల్ 14 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఓవరాల్‌గా తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ భారత్ కంటే 134 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. -
సూపర్ కింగ్స్‌లోకి టీ20 వీరుడు.. ప్రకటించిన ఫ్రాంఛైజీ
న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ డెవాన్ కాన్వే సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ మరో జట్టులో భాగమయ్యాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్ 2025 ఎడిషన్‌లో ఈ వికెట్ కీపర్ బ్యాటర్ జొబర్గ్ సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించనున్నాడు. ఇందుకు సంబంధించి జట్టు యాజమాన్యం శుక్రవారం ప్రకటన విడుదల చేసింది.మూడు టీ20 లీగ్లలోకాగా డెవాన్ కాన్వే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడుతున్న విషయం తెలిసిందే. అదే విధంగా మేజర్ క్రికెట్ లీగ్‌లో టెక్సాస్ సూపర్ కింగ్స్ తరఫున బరిలోకి దిగుతున్నాడు. తాజాగా జొబర్గ్ టీమ్‌లోనూ చోటు దక్కించుకున్న కాన్వే.. సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ అన్ని టీ20 జట్లకు ఆడుతున్న క్రికెటర్‌గా నిలిచాడు.కివీస్‌తో తెగిన బంధంఇక ఫ్రాంఛైజీ క్రికెట్‌కు ప్రాధాన్యం ఇచ్చే క్రమంలో న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు సెంట్రల్ కాంట్రాక్టును కాన్వే వదులుకున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని కివీస్ బోర్డు గురువారం ధ్రువీకరించింది. మరుసటి రోజే అతడు జొబర్గ్తో ఒప్పందం కుదుర్చుకోవడం విశేషం. డెవాన్ కాన్వేతో పాటు ఫాఫ్ డుప్లెసిస్, ఇమ్రాన్ తాహిర్ సైతం వచ్చే ఏడాది జొబర్గ్కు ప్రాతినిథ్యం వహించబోతున్నారు.పొట్టి ఫార్మాట్ వీరుడుకాగా లెఫ్టాండర్ బ్యాటర్ అయిన డెవాన్ కాన్వే మేజర్ లీగ్ క్రికెట్ తాజా ఎడిషన్ టాప్ రన్ స్కోరర్లలో ఒకడిగా నిలిచాడు. ఎనిమిది మ్యాచ్‌లలో కలిపి 143.62 స్ట్రైక్‌రేటుతో 293 పరుగులు సాధించాడు. ఇందులో మూడు అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక ఓవరాల్‌గా టీ20 క్రికెట్లో ఈ సౌతాఫ్రికన్- కివీ ఓపెనర్ 187 మ్యాచ్‌లు ఆడి 6028 పరుగులు చేశాడు. ఇందులో రెండు శతకాలు, 48 అర్ధ శతకాలు ఉండటం విశేషం.ఇదిలా ఉంటే.. బొటనవేలికి గాయం కారణంగా కాన్వే ఐపీఎల్-2024కు దూరమైన సంగతి తెలిసిందే. కాగా సౌతాఫ్రికా టీ20 లీగ్ 2023లో ఆరంభమైంది. అరంగేట్ర సీజన్లో చాంపియన్‌గా నిలిచిన సన్‌రైజర్స్ ఈస్టర్న్‌కేప్.. ఈ ఏడాది కూడా టైటిల్‌ను నిలబెట్టుకుంది. మరోవైపు.. జొబర్గ్ రెండు సీజన్లలో సెమీస్‌కు అర్హత సాధించినా.. ఫైనల్లో అడుగుపెట్టలేకపోయింది.చదవండి: ’టీ20 ఫార్మాట్ క్రికెట్‌ను నాశనం చేస్తోంది.. ఇండియా మాత్రం లక్కీ’ -
టీ20 ఫార్మాట్ క్రికెట్‌ను నాశనం చేస్తోంది: పాక్ మాజీ క్రికెటర్
పొట్టి ఫార్మాట్ వల్ల క్రికెట్ నాశనమవడం ఖాయమని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ ఆందోళన వ్యక్తం చేశాడు. ఆటగాళ్ల మెదళ్లలో టీ20 అనే విషం నిండిపోవడం వల్ల సంప్రదాయ క్రికెట్‌కు ఆదరణ తగ్గే ప్రమాదం ఉందని హెచ్చరించాడు. లీగ్ క్రికెట్ వల్ల ఆయా బోర్డులు, ఆటగాళ్లకు డబ్బులు వస్తాయని.. అయితే, ఆటకు మాత్రం నష్టం చేకూరుతుందని పేర్కొన్నాడు.కాగా ఇటీవలి కాలంలో లీగ్ క్రికెట్ ఆడేందుకు చాలా మంది ప్లేయర్లు సెంట్రల్ కాంట్రాక్టును వదులుకుంటున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా న్యూజిలాండ్ క్రికెటర్లలో కెప్టెన్ కేన్ విలియమ్సన్ సహా ట్రెంట్ బౌల్ట్, లాకీ ఫెర్గూసన్ ఇప్పటికే కాంట్రాక్టును వదులుకోగా.. డెవాన్ కాన్వే, ఫిన్ అలెన్ సైతం గురువారం ఇందుకు సంబంధించి తమ నిర్ణయాన్ని వెల్లడించారు.కాసుల వర్షం వల్లేఫ్రాంఛైజీ క్రికెట్ ఒప్పందాల దృష్ట్యా కాంట్రాక్ట్ రెన్యువల్‌పై సంతకం చేసేందుకు వీరిద్దరు నిరాకరించారని కివీస్ బోర్డు వర్గాలు తెలిపాయి. ఈ విషయంపై స్పందించిన పాకిస్తాన్ మాజీ బ్యాటర్ బసిత్ అలీ యూట్యూబ్ చానెల్ వేదికగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘శ్రీలంకతో సిరీస్ సందర్భంగా న్యూజిలాండ్ జట్టుకు అందుబాటులో ఉండబోనని కాన్వే చెప్పాడు.మరో క్రికెటర్ కూడా ఇదే మాట అంటున్నాడు. ఇది కేవలం న్యూజిలాండ్ బోర్డు సమస్య మాత్రమే కాదు. క్రమక్రమంగా అన్ని దేశాల బోర్డులకు ఇలాంటి తలనొప్పులు వస్తాయి. పాకిస్తాన్ ప్లేయర్లు కూడా ఇదే బాటలో నడిచినా ఆశ్చర్యం లేదు. ఫ్రాంఛైజీ క్రికెట్ కురిపించే కాసుల వర్షం వల్లే ఆటగాళ్లు అటువైపు ఆకర్షితులవుతున్నారు.ఇండియా లక్కీనిజానికి ఈ విషయంలో ఇండియా లక్కీ అనే చెప్పాలి. ఎందుకంటే.. భారత ఆటగాళ్లు ఐపీఎల్ మినహా ఇతర టీ20 టోర్నమెంట్లు ఆడరు. ఏదేమైనా టీ20 పిచ్చి.. ఇక్కడితో ఆగదు. క్రికెట్‌ను.. ముఖ్యంగా టెస్టు క్రికెట్‌ను నాశనం చేస్తుంది. గంటల తరబడి క్రీజులో నిలబడే బ్యాటర్ల పాలిట ఇదొక విషం లాంటిది. ఇండియా మినహా దాదాపు అన్ని దేశాల జట్లు టీ20 క్రికెట్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. డబ్బు వస్తోంది.. కానీ సంప్రదాయ క్రికెట్ కనుమరుగయ్యే ప్రమాదం ఉంది’’ అని బసిత్ అలీ ఆందోళన వ్యక్తం చేశాడు.చదవండి: వీవీఎస్ లక్ష్మణ్ పదవీకాలం మరో ఏడాది పొడిగింపు -
న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ల సంచలన నిర్ణయం!
న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్లు డెవాన్ కాన్వే, ఫిన్ అలెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కివీస్ క్రికెట్ బోర్డు సెంట్రల్ కాంట్రాక్ట్‌లను వీరిద్దరూ వదులుకున్నారు. ఫ్రాంచైజీ క్రికెట్ ఒప్పందాల దృష్ట్యా కాన్వే, అలెన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వీరిద్దరూ తమ కాంట్రక్ట్ రెన్యూవల్‌పై సంతకం చేయలేదని కివీస్ క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.అయితే వీరిద్దరూ సెంట్రల్ కాంట్రాక్ట్ వదులుకున్నప్పటికి బ్లాక్‌క్యాప్స్ సెలెక్షన్‌కు మాత్రం అందుబాటులో ఉంటారని బోర్డు స్పష్టం చేసింది. ఈ డిసెంబర్లో అలెన్ బిగ్ బాష్ లీగ్‌లో ఆడనుండగా.. కాన్వే వచ్చే ఏడాది జనవరిలో సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఆడనున్నాడు. కాగా ఇప్పటికే కేన్ విలియమ్సన్, లూకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్, మిల్నే వంటి స్టార్ క్రికెటర్లు సైతం బోర్డు కాంట్రాక్ట్‌లను వదులు కున్నారు.కివీస్ సెంట్రల్ ప్లేయింగ్ కాంట్రాక్ట్ నుండి నేను వైదొలగాలని నిర్ణయించుకున్నాను. నా అభ్యర్ధను అంగీకరించినందుకు న్యూజిలాండ్ క్రికెట్‌కు ధన్యవాదాలు. ఈ నిర్ణయం నేను అన్ని ఆలోచించే తీసుకున్నాను. నా కుటంబంతో కొద్ది రోజులు గడపాలనకుంటున్నాను. అదేవిధంగా బ్లాక్క్లాప్స్ తరపున ఆడేందుకు నేను ఎప్పుడూ సిద్దంగా ఉంటాను. ఐసీసీ వరల్డ్ ఛాంపియన్షిప్ సైకిల్లో ముఖ్యమైన టెస్టు సిరీస్‌లలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పాకిస్తాన్లో జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడేండుకు కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నాని న్యూజిలాండ్ క్రికెట్ విడుదల చేసే ప్రకటనలో డెవాన్ పేర్కొన్నాడు. కాగా అఫ్గానిస్తాన్, శ్రీలంకతో టెస్టు సిరీస్‌లకు కాన్వేకు న్యూజిలాండ్ జట్టులో చోటు దక్కింది. -
పసికూనపై ప్రతాపం.. ఎట్టకేలకు తొలి విజయం.. ఏం లాభం?
టీ20 ప్రపంచకప్-2024 టోర్నీలో న్యూజిలాండ్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. ఉగాండాను చిత్తుగా ఓడించి తొలి గెలుపు నమోదు చేసింది.ఈ మెగా ఈవెంట్లో అఫ్గనిస్తాన్, వెస్టిండీస్, ఉగాండా, పపువా న్యూగినియాలో కలిసి గ్రూప్-సిలో ఉన్న న్యూజిలాండ్.. తొలి రెండు మ్యాచ్‌లలో పరాజయం పాలైంది.మొదట అఫ్గనిస్తాన్ చేతిలో 84 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన కేన్ విలియమ్సన్ బృందం.. తదుపరి వెస్టిండీస్ చేతిలో 13 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ క్రమంలో సూపర్-8 అవకాశాలు సంక్లిష్టమయ్యాయి.మరోవైపు.. అఫ్గనిస్తాన్, వెస్టిండీస్ వరుస విజయాలతో రాణించి.. సూపర్-8 బెర్తును ఖరారు చేసుకోవడంతో న్యూజిలాండ్ కథ ముగిసిపోయింది.ఈ క్రమంలో మిగిలిన రెండు నామమాత్రపు మ్యాచ్‌లలో విజయం సాధించాలని పట్టుదలగా ఉన్న కివీస్.. తాజాగా శనివారం నాటి మ్యాచ్‌లో పసికూన ఉగాండాపై ప్రతాపం చూపింది.ట్రినిడాడ్ వేదికగా టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. పేసర్లు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ టిమ్ సౌతీ(3/4), ట్రెంట్ బౌల్ట్(2/7), లాకీ ఫెర్గూసన్(1/9).. స్పిన్నర్లు మిచెల్ సాంట్నర్(2/8), రచిన్ రవీంద్ర(2/9) ఆకాశమే హద్దుగా చెలరేగారు.దీంతో ఉగాండా 18.4 ఓవర్లలో కేవలం 40 పరుగులే చేసి ఆలౌట్ అయింది. ఉగాండా ఇన్నింగ్స్‌లో టాప్ స్కోర్ 11గా నమోదైంది. ఇక అత్యంత స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 5.2 ఓవర్లలో పని పూర్తి చేసింది.ఓపెనర్ ఫిన్ అలెన్ 17 బంతుల్లో కేవలం తొమ్మిది పరుగులే చేసి అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ డెవాన్ కాన్వే(15 బంతుల్లో 22), రచిన్ రవీంద్ర(1)తో కలిసి అజేయంగా నిలిచి.. కివీస్ విజయాన్ని ఖరారు చేశాడు.ఫలితంగా వికెట్ నష్టానికి 41 పరుగులు చేసిన న్యూజిలాండ్ వరల్డ్‌కప్-2024లో పాయింట్ల ఖాతా తెరిచింది. తదుపరి జూన్ 17న పపువా న్యూగినియాతో కివీస్ జట్టు తలపడనుంది. కాగా ఉగాండాపై న్యూజిలాండ్ విజయం నేపథ్యంలో అభిమానులు మిశ్రమంగా స్పందిస్తున్నారు. ఇప్పటికైనా ఒకటి గెలిచిందని కొంతమంది సంతోషిస్తుంటే.. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభమని మరికొందరు విమర్శిస్తున్నారు. View this post on Instagram A post shared by ICC (@icc) -
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. సీజన్ మొత్తానికి దూరమైన స్టార్ ప్లేయర్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌కు భారీ షాక్ తగిలింది. గాయం నుంచి పూర్తిగా కోలుకోని కారణంగా ఆ జట్టు స్టార్ ఓపెనర్, న్యూజిలాండ్ ఆటగాడు డెవాన్ కాన్వే సీజన్ మొత్తానికే దూరమయ్యాడు. గాయం కారణంగా సీజన్ తొలి ఆరు మ్యాచ్‌లకు దూరమైన కాన్వే.. ఇప్పుడు సీజన్ మొత్తానికే దూరం కావడం ఆ జట్టుపై పెను ప్రభావం పడనుంది. కాన్వే గత రెండు సీజన్లుగా సీఎస్కేలో కీలక ఆటగాడిగా ఉన్నాడు. సీఎస్కే మరో టైటిల్ దిశగా అడుగులు వేసే క్రమంలో కాన్వే లాంటి ఆటగాడు అందుబాటు లేకపోవడం ఆ జట్టు విజయావకాశాలను బాగా దెబ్బతీస్తుంది. కాన్వే సీజన్ మొత్తానికి దూరమైన విషయాన్ని సీఎస్కే యాజమాన్యం ఇవాళ (ఏప్రిల్ 18) అధికారికంగా ప్రకటించింది. కాన్వేకు ప్రత్యామ్నాయంగా ఇంగ్లండ్ వెటరన్ పేసర్ రిచర్డ్ గ్లీసన్‌ను ఎంపిక చేసుకున్నట్లు వెల్లడించింది. గ్లీసన్‌ను సీఎస్కే కనీస ధర 50 లక్షలకు సొంతం చేసుకుంది. కాగా, సీఎస్కే ప్రస్తుత సీజన్లో 6 మ్యాచ్‌ల్లో 4 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుంది. కొత్త సారధి రుతురాజ్ సారధ్యంలో సీఎస్కే గత రెండు మ్యాచ్‌ల్లో వరుస విజయాలు సాధించింది. ఈ జట్టు రేపు (ఏప్రిల్ 19) జరుగబోయే తమ తదుపరి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. ఈ సీజన్లో సీఎస్కే ఇంకా ఎనిమిది మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. మరో నాలుగు మ్యాచ్‌లు గెలిస్తే సీఎస్కే ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖరారు చేసుకుంటుంది. Richard Gleeson - The new Super King🦁pic.twitter.com/ZPvNldEqLw — CricTracker (@Cricketracker) April 18, 2024 Welcome To CSK, RICHARD GLEESON 🦁💛 Dismissed Rohit Sharma, Virat Kohli and Rishabh Pant within his first eight balls on debut. 🔥pic.twitter.com/rF7FAnSskk — 🜲 (@balltamperrer) April 18, 2024 -
చెన్నై సూపర్ కింగ్స్‌లోకి శ్రీలంక కెప్టెన్..!?
ఐపీఎల్-2024 సీజన్‌కు చెన్నై సూపర్ కింగ్స్ స్టార్, కివీస్ వికెట్ కీపర్ బ్యాటర్ డెవాన్ కాన్వే దూరమైన సంగతి తెలిసిందే. చేతివేలి గాయం కారణంగా ఈ ఏడాది సీజన్ మొత్తానికి కాన్వే దూరమయ్యాడు. ఈ క్రమంలో అతడి స్ధానాన్ని భర్తీ చేసే పనిలో సీఎస్కే పడింది. శ్రీలంక కెప్టెన్ కుశాల్ మెండీస్‌తో కాన్వే స్ధానాన్ని సీఎస్కే భర్తీ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అతడితో సీఎస్కే ఫ్రాంచైజీ సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. కాగా ఐపీఎల్-2024 మినీ వేలంలో రూ.50లక్షల కనీస ధరతో వేలంకు వచ్చిన అతడిని ఏ ఫ్రాంచైజీ కొనుగొలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. అయితే ఇప్పుడు అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తుడంతో సీఎస్కే అతడిని తమ జట్టులోకి తీసుకునేందుకు సిద్దమైంది. మెండీస్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ముఖ్యంగా వైట్‌బాల్ క్రికెట్లో మెండీస్ దుమ్ములేపుతున్నాడు. మెండిస్ ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌లో బీజీబీజీగా ఉన్నాడు. ఛటోగ్రామ్ వేదికగా జరిగిన తొలి వన్డేలో సైతం మెండిస్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. అంతకుముందు బంగ్లాతో జరిగిన టీ20 సిరీస్‌లోనూ మెండిస్ అదరగొట్టాడు. అదేవిధంగా మెండిస్ వికెట్ కీపర్ బ్యాటర్ అయినందున తమ జట్టులోకి తీసుకోవాలని సీఎస్కే ఫిక్స్ అయినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఇక ఐపీఎల్-2024 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. చెపాక్ వేదికగా జరగనున్న తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. -
IPL 2024: కాన్వే ఔట్.. రుతురాజ్‌కు జోడీ ఎవరు..?
చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ డెవాన్ కాన్వే గాయం కారణంగా రాబోయే ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమైన విషయం తెలిసిందే. కాన్వే వైదొలగడంతో రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు సీఎస్కే ఇన్నింగ్స్‌ను ఎవరు ఆరంభిస్తారనే అంశంపై ప్రస్తుతం నెట్టింట భారీ ఎత్తున చర్చ నడుస్తుంది. ప్రస్తుతం సీఎస్కేకు అందుబాటులో ఉన్న వనరుల ప్రకారం ముగ్గురు ఆటగాళ్లను ఓపెనర్‌గా ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. వారిలో కొత్తగా జట్టులో చేరిన న్యూజిలాండ్ ఆటగాడు రచిన్ రవీంద్రకు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రచిన్ ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో ఓపెనర్‌గా సక్సెస్ సాధించాడు కాబట్టి అతన్నే రుతురాజ్‌కు జోడీగా పంపాలని మెజార్టీ శాతం సీఎస్కే అభిమానులు కోరుకుంటున్నారు. అయితే సీఎస్కే యాజమాన్యం ముందు రచిన్‌తో పాటు మరో రెండు ఆప్షన్స్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. వెటరన్లు అజింక్య రహానే, మొయిన్ అలీల్లో ఎవరో ఒకరికి ఓపెనర్‌గా ప్రమోషన్ ఇవ్వాలని ధోని యోచిస్తున్నట్లు సమాచారం. రహానేకు గతంలో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్‌గా ఆడిన అనుభవం ఉండటం అతనికి యాడెడ్ అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే రహానేకు గత సీజన్లో పేసర్లపై విరుచుకుపడిన ట్రాక్ రికార్డు కూడా ఉండటం సెకెండ్ అప్షన్ ఓపెనర్‌గా అతని పేరునే పరిశీలించే అవకాశం ఉంది. రచిన్, రహానేలతో పాటు మొయిన్ అలీ పేరును సైతం సీఎస్కే మేనేజ్మెంట్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే బ్యాటర్‌గా మొయిన్ అలీకి పెద్ద సక్సెస్ రేట్ లేకపోవడం, వయసు పైబడటం వంటి కారణాలు అతన్ని ఓపెనర్ రేసులో వెనకపడేలా చేయవచ్చు. సీజన్ ప్రారంభానికి మరి కొద్ది రోజులు మాత్రమే ఉండటంతో సీఎస్కే యాజమాన్యం అతి త్వరలో ఓపెనింగ్ స్థానాన్ని ఫైనల్ చేసే అవకాశం ఉంది. కాగా, ఈ సీజన్ ఓపెనింగ్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్.. రాయల్ ఛాలెంజ్ బెంగళూరుతో తలపడనుంది. మార్చి 22న చెన్నైలో ఈ మ్యాచ్ జరుగనుంది. చెన్నై సూపర్ కింగ్స్ పూర్తి జట్టు.. ఎంఎస్ ధోని వికెట్కీపర్బ్యాటర్ 12 కోట్లు (కెప్టెన్) డెవాన్ కాన్వే బ్యాటర్ కోటి రుతురాజ్ గైక్వాడ్ బ్యాటర్ 6 కోట్లు అజింక్య రహానే బ్యాటర్ 50 లక్షలు అజయ్ మండల్ ఆల్ రౌండర్ 20 లక్షలు నిశాంత్ సింధు ఆల్ రౌండర్ 60 లక్షలు మొయిన్ అలీ ఆల్ రౌండర్ 8 కోట్లు శివమ్ దూబే ఆల్ రౌండర్ 4 కోట్లు రాజవర్ధన్ హంగర్గేకర్ బౌలర్ 1.5 కోట్లు షేక్ రషీద్ బ్యాటర్ 20 లక్షలు మిచెల్ సాంట్నర్ ఆల్ రౌండర్ 1.9 కోట్లు రవీంద్ర జడేజా ఆల్ రౌండర్ 16 కోట్లు తుషార్ దేశ్‌పాండే బౌలర్ 20 లక్షలు ముఖేష్ చౌదరి బౌలర్ 20 లక్షలు మతీషా పతిరణ బౌలర్ 20 లక్షలు సిమ్రన్‌జీత్ సింగ్ బౌలర్ 20 లక్షలు దీపక్ చాహర్ బౌలర్ 14 కోట్లు ప్రశాంత్ సోలంకి బౌలర్ 1.2 కోట్లు మహేశ్ తీక్షణ బౌలర్ 70 లక్షలు రచిన్ రవీంద్ర బ్యాటర్ 1.8 కోట్లు శార్దూల్ ఠాకూర్ ఆల్ రౌండర్ 4 కోట్లు డారిల్ మిచెల్ ఆల్ రౌండర్ 14 కోట్లు సమీర్ రిజ్వీ బ్యాటర్ 8.4 కోట్లు ముస్తాఫిజుర్ రెహమాన్ బౌలర్ 2 కోట్లు అవినాష్ రావు ఆరవెల్లి కొట్టు 20 లక్షలు -
IPL 2024: చెన్నై సూపర్ కింగ్స్‌కు బిగ్ షాక్.. ఈ సారి కష్టమే మరి!?
ఐపీఎల్-2024 సీజన్ ఆరంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఓపెనర్, కివీస్ క్రికెటర్ డెవాన్ కాన్వే గాయం కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరం కానున్నట్లు తెలుస్తోంది. కాన్వే ప్రస్తుతం చేతి వేలి గాయంతో బాధపడుతున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20 సం డెవాన్ కాన్వే ఎడమ చేతి బొటన వేలికి గాయమైంది. .దీంతో అతడు ఆట మధ్యలోనే మైదానాన్ని వీడాడు. స్కానింగ్‌కు తరలించగా ఫ్రాక్చర్ ఉన్నట్లు తేలింది. ఈ క్రమంలో వైద్యులు అతడికి సర్జరీ అవసరమని సూచించారు. కాన్వే చేతి వేలికి త్వరలోనే శస్త్రచికిత్స జరగనుంది. ఈ నేపథ్యంలో శస్త్రచికిత్స అనంతరం అతడికి ఎనిమిది వారాల పాటు విశ్రాంతి వైద్యులు తెలిపినట్లు సమాచారం. అంటే మే వరకు కాన్వే అందుబాటులో ఉండే ఛాన్స్ లేదు. ఈ క్రమంలోనే సీజన్ మొత్తానికి డెవాన్ దూరం కానున్నాడు. కాగా గతేడాది సీఎస్కే ఛాంపియన్స్‌గా నిలవడంలో కాన్వేది కీలక పాత్ర. గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన ఫైనల్లో ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా డెవాన్ నిలిచాడు. అటువంటి అద్బుతమైన ఆటగాడు దూరం కావడం సీఎస్కేకు నిజంగా గట్టి ఎదురుదెబ్బే. ఈ సీఎస్కే తమ తొలి మ్యాచ్‌లో మార్చి 22న ఆరంభ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. చదవండి: Shreyas Iyer: కష్టాల్లో జట్టు.. తుస్సుమన్పించిన శ్రేయస్ అయ్యర్! స్టంప్స్ ఎగిరిపోయాయిగా -
NZ Vs Aus: న్యూజిలాండ్‌కు ఎదురుదెబ్బ
Australia tour of New Zealand, 2024: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు న్యూజిలాండ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ డెవాన్ కాన్వే జట్టుకు దూరమయ్యాడు. గాయం నుంచి ఇంకా కోలుకోని కారణంగా ఈ ఓపెనర్ తొలి టెస్టుకు అందుబాటులో ఉండటం లేదు. కాన్వే స్థానంలో అతడు జట్టులోకి ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ ధ్రువీకరించింది. ‘‘కీలక మ్యాచ్‌కు ముందు డెవాన్ జట్టుకు దూరం కావడం మమ్మల్ని నిరాశకు గురిచేసింది. టాపార్డర్‌లో ఇలాంటి క్లాస్ ప్లేయర్ సేవలను కోల్పోవడం కష్టంగా ఉంది. పూర్తిగా కోలుకుని అతడు తిరిగి జట్టుతో చేరతాడని నమ్మకం ఉంది’’ అని కివీస్ జట్టు హెడ్‌కోచ్ గ్యారీ స్టెడ్ పేర్కొన్నాడు. కాన్వే స్థానంలో హెన్రీ నికోల్స్‌ను ఎంపిక చేసినట్లు తెలిపాడు. కాగా మూడు టీ20లు, రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడే నిమిత్తం ఆస్ట్రేలియా.. న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా టీ20 సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన ఆసీస్.. తదుపరి టెస్టు సిరీస్‌పై కన్నేసింది. రచిన్, మిచెల్ వచ్చేస్తున్నారు మరోవైపు.. సొంతగడ్డపై పొట్టి ఫార్మాట్లో కంగారూ జట్టు చేతిలో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలని కివీస్ పట్టుదలగా ఉంది. ఇరు జట్ల మధ్య వెల్లింగ్టన్ వేదికగా గురువారం నుంచి తొలి టెస్టు మొదలుకానుంది. ఈ మ్యాచ్‌కు యువ సంచలనం రచిన్ రవీంద్ర, ఆల్‌రౌండర్ డారిల్ మిచెల్ అందుబాటులోకి రానున్నారు. ఇదిలా ఉంటే.. ఆసీస్‌తో రెండో టీ20 సందర్భంగా డెవాన్ కాన్వే ఎడమచేతి బొటనవేలికి గాయమైంది. దీంతో మూడో టీ20కి దూరంగా ఉన్న అతడు.. తొలి టెస్టుకు కూడా ఆడలేకపోతున్నాడు. ఆస్ట్రేలియాతో సిరీస్‌కు న్యూజిలాండ్ టెస్టు జట్టు: టిమ్ సౌథీ (కెప్టెన్), టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), మ్యాట్ హెన్రీ, స్కాట్ కుగెలిజిన్, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, విల్ ఓ రూర్కే, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ శాంట్నర్, నీల్ వాగ్నర్, కేన్ విలియమ్సన్, విల్ యంగ్, హెన్రీ నికోల్స్. చదవండి: Ind vs Eng: లండన్‌కు పయనమైన కేఎల్ రాహుల్.. కారణం ఇదే! -
NZ vs Aus: రచిన్ సుడిగాలి ఇన్నింగ్స్.. 19 బంతుల్లోనే!
New Zealand vs Australia, 1st T20I - Rachin Ravindra Maiden T20I fifty: ఆస్ట్రేలియాతో తొలి టీ20లో న్యూజిలాండ్ జట్టు అదరగొట్టింది. ఓపెనర్ డెవాన్ కాన్వే, ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర సుడిగాలి అర్ధ శతకాల కారణంగా భారీ స్కోరు నమోదు చేసింది. కాగా మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడేందుకు ఆసీస్.. న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య వెల్లింగ్టన్ వేదికగా తొలి టీ20 బుధవారం మొదలైంది. టాస్ గెలిచిన ఆతిథ్య కివీస్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే శుభారంభం అందించగా.. వన్‌డౌన్ బ్యాటర్ రచిన్ రవీంద్ర ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఫిన్ అలెన్ 17 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 32 రన్స్‌తో మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. కాన్వే(46 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 63) సూపర్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఇక స్పిన్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర 35 బంతులు ఎదుర్కొని 68 పరుగులు సాధించాడు. 19 బంతుల్లోనే 54 రన్స్ రచిన్ ఇన్నింగ్స్‌లో రెండు ఫోర్లు, ఆరు సిక్స్‌లు ఉన్నాయి. కాగా రచిన్‌కు టీ20లలో ఇదే తొలి అర్థ శతకం కావడం విశేషం. 29 బంతుల్లో 50 పరుగుల మార్కు అందుకున్నాడు ఈ లెఫ్టాండ్ బ్యాటర్. ఇక తాను ఎదుర్కొన్న తొలి 16 బంతుల్లో కేవలం 14 పరుగులే చేసిన రచిన్.. మిగిలిన 19 బంతుల్లో 54 పరుగులతో సత్తా చాటాడు. రచిన్ సంగతి ఇలా ఉంటే.. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన గ్లెన్ ఫిలిప్స్ 10 బంతుల్లో 19, ఐదో నంబర్ బ్యాటర్ మార్క్ చాప్మన్ 13 బంతుల్లో 18 పరుగులతో అజేయంగా నిలిచారు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో న్యూజిలాండ్ కేవలం మూడు వికెట్లు నష్టపోయి 215 పరుగులు చేసింది. ఆస్ట్రేలియాకు 216 పరుగుల విజయ లక్ష్యాన్ని విధించింది. ఇక ఆసీస్ బౌలర్లలో కెప్టెన్ మిచెల్ మార్ష్, పేసర్లు ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. Rachin Ravindra 🔥#nzvsaus pic.twitter.com/VgISIw95Ji — piyush (@piyushson17) February 21, 2024 చదవండి: IPL 2024: టెస్టులో ధనాధన్ ఇన్నింగ్స్.. సర్ఫరాజ్ రీఎంట్రీ! A chat with Wellington local Rachin Ravindra after his maiden T20I fifty 🏏 #NZvAUS pic.twitter.com/ON0wxbgQGA — BLACKCAPS (@BLACKCAPS) February 21, 2024 -
స్టార్ క్రికెటర్ ఇంట్లో విషాదం: ‘గర్భస్రావం.. మా బిడ్డను కోల్పోయాం’
Devon Conway: న్యూజిలాండ్ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాటర్ డెవాన్ కాన్వే కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. త్వరలోనే పండంటి బిడ్డను ఎత్తుకుంటామని ఆనందంగా ఎదురుచూస్తున్న కాన్వే- కిమ్ దంపతులకు శోకమే మిగిలింది. ఈ ప్రపంచంలోకి రాకుండానే.. తల్లి గర్భంలోనే పాపాయి కన్నుమూసింది. ఈ విషయాన్ని కాన్వే భార్య కిమ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ‘‘నా వ్యక్తిగత జీవితం గురించి అందరితో పంచుకోవడానికి పెద్దగా ఇష్టపడను. సిగ్గుపడాల్సిన విషయం కాదు కానీ.. గర్భస్రావం వల్ల నాలాంటి ఎంతో మంది స్త్రీలు ఎలాంటి కఠిన పరిస్థితులు ఎదుర్కొంటారో నాకు తెలుసు. అయినా, ఈ విషయాన్ని చెప్పడానికి నేనేమీ బాధపడటం లేదు. సిగ్గుపడటమూ లేదు. ఎందుకంటే.. నాలాగే ఏ మహిళకైనా ఇలాంటి విపత్కర పరిస్థితి ఎదురైతే.. ఆమె హృదయం ముక్కలైతే తట్టుకునే శక్తి ఉండాలి కదా! అందుకే నా మనసులోని భావాలను ఇలా పంచుకుంటున్నాను. ఏదో ఒకరోజు మా జీవితాల్లో మళ్లీ అద్బుతం జరుగుతుంది. తను మళ్లీ తిరిగి వస్తే బోలెడంత ప్రేమను కురిపించేందుకు మేము సిద్ధంగా ఉంటాము’’ అంటూ కిమ్ కాన్వే ఉద్వేగపూరిత నోట్ షేర్ చేసింది. అమ్మా.. నాన్నా.. ప్లీజ్ ఏడవద్దు ‘‘చిన్నారి సీతాకోక చిలుకా: నీలోనే నే జీవించాను. నీ ప్రేమలో మునిగితేలాను. అమ్మా.. నాన్నా.. ప్లీజ్ ఏడవద్దు. నేను ఎప్పటికీ మీతోనే ఉంటాను. కాకపోతే ఆకాశం నుంచి మిమ్మల్ని చూస్తూనే ఉంటాను’’ అంటూ భావోద్వేగంతో సాగే కవితను కిమ్ ఈ సందర్భంగా పంచుకుంది. కాగా జనవరి 31న కిమ్ ఈ పోస్టు పెట్టగా తాజాగా వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న కాన్వే అభిమానులు అతడి పరిస్థితి పట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్-2023లో సత్తా చాటి కాగా చాలా ఏళ్లుగా ప్రేమలో మునిగితేలిన కాన్వే- కిమ్ 2020లో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ క్రమంలో 2022లో సౌతాఫ్రికాలో సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. ఇక కివీస్ కీలక బ్యాటర్లలో ఒకడైన డెవాన్ కాన్వే.. ఐపీఎల్లో సీఎస్కేకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. గత సీజన్లో 15 ఇన్నింగ్స్‌లో 672 పరుగులు సాధించిన కాన్వే.. సీఎస్కే ఐదోసారి ట్రోఫీ గెలవడంతో కీలక పాత్ర పోషించాడు. అత్యధిక వీరుల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. చదవండి: Virat Kohli: 13 ఏళ్లలో ఇదే తొలిసారి.. మేమంతా నీతోనే! ఆర్సీబీ ట్వీట్ వైరల్ View this post on Instagram A post shared by Kim Conway (@kimble15) -
World Cup 2023, England vs. New Zealand: ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ గెలుపు (ఫోటోలు)
-
కాన్వేతో కలిసి... గెలుపు ‘రచిన్’చాడు
గత ప్రపంచకప్ ఫైనల్‌కు ప్రతీకారమా అంటే సరిగ్గా ఈ మ్యాచ్‌కు ఆ విలువ లేకపోవచ్చు. కానీ ఇంగ్లండ్‌ను తాము చిత్తు చేసిన తీరు న్యూజిలాండ్‌కు మాత్రం పూర్తి సంతృప్తినిచ్చి ఉంటుంది. దుర్బేధ్యమైన జట్టు, ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ తొలి మ్యాచ్‌లో పూర్తిగా చేతులెత్తేసింది. అటు పేలవ బ్యాటింగ్ ఆపై పసలేని బౌలింగ్‌తో తమ స్థాయిపై సందేహాలు రేకెత్తించింది. కివీస్ మాత్రం అద్భుత ఆటతో తమపై ఉన్న అంచనాలను అమాంతం పెంచేసుకుంది. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని పడగొట్టి ఆపై సునాయాస విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రపంచకప్‌లో తాము ఆడిన తొలి మ్యాచ్‌ల్లోనే అజేయ మెరుపు సెంచరీలు సాధించి కాన్వే, రచిన్ రవీంద్ర మరో 13.4 ఓవర్లు మిగిలి ఉండగానే జట్టు పేరిట గెలుపును లిఖించారు. రాహుల్+సచిన్ పేర్లను తన పేరులో ఉంచుకున్న రచిన్ అటు క్లాస్, ఇటు మాస్ ఆటను కూడా చూపించడం విశేషం. అహ్మదాబాద్: వన్డే వరల్డ్ కప్ తొలి పోరు ఏకపక్షంగా ముగిసింది. 2019 ఫైనలిస్ట్‌ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 9 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ జట్టును ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. జో రూట్ (86 బంతుల్లో 77; 4 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా, జోస్ బట్లర్ (42 బంతుల్లో 43; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించాడు. అనంతరం కివీస్ 36.2 ఓవర్లలో వికెట్ నష్టానికి 283 పరుగులు చేసింది. డెవాన్ కాన్వే (121 బంతుల్లో 152 నాటౌట్; 19 ఫోర్లు, 3 సిక్స్‌లు), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రచిన్ రవీంద్ర (96 బంతుల్లో 123 నాటౌట్; 11 ఫోర్లు, 5 సిక్స్‌లు) సెంచరీలతో చెలరేగారు. వీరిద్దరు రెండో వికెట్‌కు అభేద్యంగా 273 పరుగులు జోడించడం విశేషం. వన్డేల్లో రెండో వికెట్‌కు న్యూజిలాండ్ తరఫున ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. గప్టిల్ –విల్ యంగ్ పేరిట ఉన్న 203 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని కాన్వే–రచిన్ సవరించారు. కీలక భాగస్వామ్యం... బలమైన లైనప్, చివరి ఆటగాడి వరకు బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఉన్న ఇంగ్లండ్‌ను చూస్తే భారీ స్కోరు ఖాయమనిపించింది. తొలి ఓవర్ రెండో బంతినే బెయిర్‌స్టో (35 బంతుల్లో 33; 4 ఫోర్లు, 1 సిక్స్) సిక్సర్‌గా మలిచాడు. వరల్డ్ కప్ చరిత్రలో ‘సిక్స్’తో స్కోరు మొదలు కావడం ఇదే తొలిసారి. అయితే ప్రత్యరి్థని కట్టడి చేయడంలో కివీస్ బౌలర్లు సఫలమయ్యారు. మలాన్ (14) విఫలం కాగా, ఆ తర్వాత తక్కువ వ్యవధిలో కివీస్ మరో 3 వికెట్లు పడగొట్టింది. రవీంద్ర ఓవర్లో వరుసగా 4, 4, 6 కొట్టిన బ్రూక్ (25) తర్వాతి బంతికి వెనుదిరిగాడు. ఈ దశలో రూట్, బట్లర్ ఆదుకున్నారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 72 బంతుల్లోనే 70 పరుగులు జోడించారు. అయితే ఈ భాగస్వామ్యాన్ని హెన్రీ విడదీశాక ఇంగ్లండ్ వేగంగా వికెట్లు కోల్పోయింది. లోయర్ ఆర్డర్లో ఎవరూ ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోవడంతో స్కోరు కనీసం 300 పరుగులకు చేరువగా కూడా రాలేదు. వన్డే చరిత్రలో ఆడిన 11 మందీ కనీసం రెండంకెల స్కోరు చేయడం ఇదే మొదటిసారి కాగా... ప్రతీ ఒక్కరు అంతంతమాత్రంగానే ఆడటంతో ఇంగ్లండ్‌కు ఫలితం దక్కలేదు. ఆడుతూ పాడుతూ... స్యామ్ కరన్ వేసిన రెండో ఓవర్ తొలి బంతికే యంగ్ (0) అవుట్! దాంతో కివీస్ ఎలా లక్ష్యాన్ని ఛేదిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. కానీ కాన్వే, రవీంద్ర అసలు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. కెరీర్లో 13వ వన్డే ఆడుతూ తొలిసారి ఓపెనర్‌గా బరిలోకి దిగిన రవీంద్ర పూర్తి ఆత్మవిశ్వాసంతో ఆడగా, ఐపీఎల్ అనుభవాన్ని కాన్వే అద్భుతంగా వాడుకున్నాడు. వీరిద్దరు ప్రత్యర్థిపై బౌలర్లందరిపై ఆధిపత్యం ప్రదర్శిస్తూ చకచకా పరుగులు రాబట్టారు. 10 ఓవర్లలోనే స్కోరు 81 పరుగులకు చేరగా, చెరో 36 బంతుల్లోనే రవీంద్ర, కాన్వే అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. వీరిని కట్టడి చేయడంలో ఇంగ్లండ్ విఫలం కావడంతో 20 ఓవర్లకే స్కోరు 150 పరుగులకు చేరింది. ఆ తర్వాత ఈ జోడి ఎదురులేకుండా దూసుకుపోయింది. ముందుగా కాన్వే 83 బంతుల్లో, ఆ తర్వాత రవీంద్ర 82 బంతుల్లో శతకాలను అందుకున్నారు. ఆ తర్వాత ఇంగ్లండ్ ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేకపోగా... కివీస్ సునాయాసంగా లక్ష్యం చేరింది. విలియమ్సన్ గాయం నుంచి కోలుకోకపోవడంతో లాథమ్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. స్కోరు వివరాలు ఇంగ్లండ్ ఇన్నింగ్స్: బెయిర్‌స్టో (సి) మిచెల్ (బి) సాన్‌ట్నర్ 33; మలాన్ (సి) లాథమ్ (బి) హెన్రీ 14; రూట్ (బి) ఫిలిప్స్ 77; బ్రూక్ (సి) కాన్వే (బి) రవీంద్ర 25; మొయిన్ అలీ (బి) ఫిలిప్స్ 11; బట్లర్ (సి) లాథమ్ (బి) హెన్రీ 43; లివింగ్‌స్టోన్ (సి) హెన్రీ (బి) బౌల్ట్ 20; కరన్ (సి) లాథమ్ (బి) హెన్రీ 14; వోక్స్ (సి) యంగ్ (బి) సాన్‌ట్నర్ 11; ఆదిల్ రషీద్ (నాటౌట్) 15; వుడ్ (నాటౌట్) 13; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 282. వికెట్ల పతనం: 1–40, 2–64, 3–94, 4–118, 5–188, 6–221, 7–229, 8–250, 9–252. బౌలింగ్: బౌల్ట్ 10–1–48–1, హెన్రీ 10–1–48–3, సాన్‌ట్నర్ 10–0–37–2, నీషమ్ 7–0–56–0, రవీంద్ర 10–0–76–1, ఫిలిప్స్ 3–0–17–2. న్యూజిలాండ్ ఇన్నింగ్స్: కాన్వే (నాటౌట్) 152; యంగ్ (సి) బట్లర్ (బి) కరన్ 0; రచిన్ రవీంద్ర (నాటౌట్) 123; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (36.2 ఓవర్లలో వికెట్ నష్టానికి) 283. వికెట్ల పతనం: 1–10. బౌలింగ్: వోక్స్ 6–0–45–0, స్యామ్ కరన్ 6–2–47–1, వుడ్ 5–0–55–0, అలీ 9.2–0–60–0, రషీద్ 7–0–47–0, లివింగ్‌స్టోన్ 3–0–24–0. ప్రపంచకప్‌లో నేడు పాకిస్తాన్ X నెదర్లాండ్స్ వేదిక: హైదరాబాద్ , మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
CWC 2023 ENG VS NZ: జగజ్జేతలకు షాక్.. చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్
2023 వన్డే వరల్డ్‌కప్‌కు అదిరిపోయే ఆరంభం లభించింది. గత ఎడిషన్ ఫైనలిస్ట్‌లు ఇంగ్లండ్-న్యూజిలాండ్ మధ్య జరిగిన టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో పరుగుల వరద పారడంతో పాటు పలు ప్రపంచ రికార్డులు నమోదయ్యాయి. గత వరల్డ్‌కప్ (2019) ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో ఎదురైన అపజయానికి న్యూజిలాండ్ టీమ్ ఈ మ్యాచ్‌లో ప్రతీకారం తీర్చుకుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో కివీస్ టీమ్.. ప్రపంచ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను 9 వికెట్ల భారీ తేడాతో మట్టికరిపించి, మెగా టోర్నీలో బోణీ విజయం దక్కించుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవరల్లో 9 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేయగా.. కాన్వే (121 బంతుల్లో 152 నాటౌట్; 19 ఫోర్లు, 3 సిక్సర్లు), రచిన్ రవీంద్ర (96 బంతుల్లో 123 నాటౌట్; 11 ఫోర్లు, 5 సిక్సర్లు) అజేయమైన శతకాలతో విరుచుకుపడటంతో న్యూజిలాండ్ 36.2 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరుకుంది. చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్.. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ నిర్ధేశించిన 283 పరుగుల లక్ష్యాన్ని కేవలం 36.2 ఓవర్లలో ఛేదించిన న్యూజిలాండ్, వరల్డ్‌కప్ చరిత్రలో అత్యంత వేగంగా 280 అంతకంటే ఎక్కువ స్కోర్‌ను ఛేదించిన జట్టుగా చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్‌లో నమోదైన మరిన్ని రికార్డులు.. ఈ మ్యాచ్‌లో బెయిర్‌స్టో ఇంగ్లండ్ పరుగుల ఖాతాను సిక్సర్‌తో తెరిచి ఆల్‌టైమ్ వరల్డ్‌కప్ రికార్డును నెలకొల్పాడు. ప్రపంచకప్ చరిత్రలో తొలి పరుగులు సిక్సర్ రూపంలో రావడం ఇదే తొలిసారి. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో 11 మంది ఆటగాళ్లు రెండంకెల స్కోర్ చేశారు. 4658 వన్డేల చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. ఇది ప్రపంచ రికార్డు. వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్ తరఫున ఏ వికెట్‌కైనా అత్యుత్తమ భాగస్వామ్యం- డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర (అజేయమైన 273 పరుగులు) డెవాన్ కాన్వే న్యూజిలాండ్ తరఫున వన్డేల్లో అత్యంత వేగంగా (22 ఇన్నింగ్స్‌లు) 1000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు వరల్డ్‌కప్ అరంగేట్రంలోనే సెంచరీ చేసిన మూడో అతి పిన్న వయస్కుడిగా (23 ఏళ్ల, 321 రోజులు) రచిన్ రవీంద్ర రికార్డుల్లోకెక్కాడు. వరల్డ్‌కప్ అరంగేట్రంలో సెంచరీ చేసిన రెండో అతి పెద్ద వయస్కుడిగా (32 ఏళ్ల 89 రోజులు) కాన్వే రికార్డుల్లోకెక్కాడు. -
CWC 2023 ENG VS NZ: కాన్వే, రచిన్ మెరుపు శతకాలు.. రికార్డు భాగస్వామ్యం నమోదు
వన్డే వరల్డ్‌కప్ 2023కి అదిరిపోయే ఆరంభం లభించింది. ఈ ఎడిషన్ తొలి మ్యాచ్‌లోనే రెండు శతకాలు నమోదయ్యాయి. న్యూజిలాండ్ బ్యాటర్లు డెవాన్ కాన్వే (121 బంతుల్లో 152 నాటౌట్; 19 ఫోర్లు, 3 సిక్సర్లు), రచిన్ రవీంద్ర (96 బంతుల్లో 123 నాటౌట్; 11 ఫోర్లు, 5 సిక్సర్లు) అజేయమైన శతకాలతో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో వారు ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ తరఫున ఏ వికెట్‌కైనా అత్యుత్తమ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఈ మ్యాచ్‌లో కాన్వే, రచిన్ జోడి రెండో వికెట్‌కు అజేయమైన 273 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. ప్రపంచకప్ టోర్నీల్లో న్యూజిలాండ్ తరఫున ఏ వికెట్‌కైనా ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. 1996 వరల్డ్‌కప్‌లో లీ జెర్మాన్-క్రిస్ హారిస్ జోడి నమోదు చేసిన 168 పరుగుల భాగస్వామ్యామే ఈ మ్యాచ్‌కు ముందు వరకు ప్రపంచకప్‌ల్లో న్యూజిలాండ్ బెస్ట్ పార్ట్నర్షిప్గా ఉండింది. తాజాగా కాన్వే-రచిన్ జోడీ ఈ రికార్డును బద్దలు కొట్టి చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్‌లో 36 బంతుల్లో అర్ధసెంచరీలను పూర్తి చేసుకున్న కాన్వే, రచిన్ సెంచరీకి చేరుకునేందుకు ఎక్కువ సమయం తీసుకోలేదు. కాన్వే 83 బంతుల్లో శతక్కొడితే.. రచిన్ 81 బంతుల్లోనే సెంచరీ మార్కును చేరుకున్నాడు. వన్డేల్లో కాన్వేకు ఇది ఐదో సెంచరీ కాగా.. రచిన్‌కు తన కెరీర్ మొత్తంలోనే ఇది తొలి సెంచరీ. కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవరల్లో 9 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేయగా.. కాన్వే, రచిన్ శతక్కొట్టడంతో న్యూజిలాండ్ 36.2 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరుకుంది. -
రాణించిన బట్లర్.. రెచ్చిపోయిన కాన్వే
హండ్రెడ్ లీగ్ 2023లో భాగంగా మాంచెస్టర్ ఒరిజినల్స్‌తో నిన్న (ఆగస్ట్ 24) జరిగిన మ్యాచ్‌లో సథరన్ బ్రేవ్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఫలితంగా ఈ జట్టు ఫైనల్‌కు చేరే అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఒరిజినల్స్ జోస్ బట్లర్ (42 బంతుల్లో 45; 5 ఫోర్లు) రాణించడంతో నిర్ణీత 100 బంతుల్లో 8 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. ఒరిజినల్స్ ఇన్నింగ్స్‌లో బట్లర్ మినహాయించి ఎవరూ పెద్దగా రాణించలేదు. మాడ్సన్ (22), సాల్ట్ (17), పాల్ వాల్టర్ (12), ఓవర్టన్ (0) రెండంకెల స్కోర్లు చేయగా.. లారీ ఈవాన్స్ (2), టామ్ హార్ట్లీ (2), హ్యారీసన్ (1) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమతమయ్యారు. బ్రేవ్ బౌలర్లలో తైమాల్ మిల్స్ 3 వికెట్లు పడగొట్టగా.. రెహాన్ అహ్మద్ 2, క్రిస్ జోర్డన్, అకెర్‌మ్యాన్ తలో వికెట్ దక్కించుకున్నారు. A knock which put the Southern Brave into #TheHundred Eliminator 🙌 How good was this man today? pic.twitter.com/1hxlAuxdok — The Hundred (@thehundred) August 23, 2023 రెచ్చిపోయిన కాన్వే.. 131 పరుగుల లక్ష్య ఛేదనలో ఓపెనర్ డెవాన్ కాన్వే (40 బంతుల్లో 54 నాటౌట్; 5 ఫోర్లు, సిక్స్) రెచ్చిపోవడంతో బ్రేవ్ మరో 5 బంతులు మిగిలుండగానే 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. బ్రేవ్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ జేమ్స్ విన్స్ (25 బంతుల్లో 33; 2 ఫోర్లు, సిక్స్), ఆకెర్మ్యాన్ (21 బంతుల్లో 24 నాటౌట్; 4 ఫోర్లు), ఫిన్ అలెన్ (4 బంతుల్లో 14; 2 ఫోర్లు, సిక్స్) ఓ మోస్తరుగా రాణించగా.. డు ప్లూయ్ (2), వెథర్లీ (0) విఫలమయ్యారు. ఒరిజినల్స్ బౌలర్లలో జమాన్ ఖాన్ 2, జోష్ టంగ్, ఆస్టన్ టర్నర్ తలో వికెట్ పడగొట్టారు. కాగా, హండ్రెడ్ లీగ్ ప్రస్తుత ఎడిషన్‌లో ఓవల్ ఇన్విన్సిబుల్స్ ఇదివరకే ఫైనల్‌కు చేరుకుంది. మరో బెర్త్ కోసం మాంచెస్టర్ ఒరిజినల్స్, సథరన్ బ్రేవ్ జట్ల మధ్య పోటీ జరుగుతుంది. మిగతా జట్లన్నీ ఎలిమినేట్ అయ్యాయి. -
నిప్పులు చెరిగిన టైమాల్ మిల్స్.. "హ్యాట్రిక్" వికెట్లు.. నలుగురు డకౌట్లు
పురుషుల హండ్రెడ్ లీగ్-2023లో భాగంగా వెల్ష్‌ఫైర్‌తో నిన్న (ఆగస్ట్ 12) జరిగిన మ్యాచ్‌లో సథరన్ బ్రేవ్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెల్ష్‌ఫైర్.. టైమాల్ మిల్స్ (20-9-12-4), జార్జ్ గార్టన్ (15-9-8-3), క్రెయిగ్ ఓవర్టన్ (20-13-19-2), ఫిషర్ (20-10-24-1) ధాటికి నిర్ణీత 100 బంతుల్లో 87 పరుగులకు ఆలౌటైంది. టైమాల్ మిల్స్ హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టాడు. వెల్ష్‌ఫైర్ ఇన్నింగ్స్‌లో ప్టీవీ ఎస్కినాజీ (38) టాప్ స్కోరర్‌గా నిలువగా.. గ్లెన్ ఫిలిప్స్ (12), డేవిడ్ విల్లే (16), బెన్ గ్రీన్ (10) రెండంకెల స్కోర్లు చేశారు. స్టార్ ప్లేయర్ జానీ బెయిర్‌స్టో, వికెట్ కీపర్ జో క్లార్క్, హరీస్ రౌఫ్, డేవిడ్ పేన్ డకౌట్లయ్యారు. As it stands! 👇#TheHundred pic.twitter.com/cQMVSxwo0M — The Hundred (@thehundred) August 12, 2023 రాణించిన కాన్వే.. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బ్రేవ్.. కేవలం 59 బంతుల్లో వికెట్ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. బ్రేవ్ బ్యాటర్లు ఫిన్ అలెన్ 22 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్ సాయంతో 31 పరుగులు చేసి పేన్ బౌలింగ్‌లో విల్లేకు క్యాచ్ ఇచ్చి ఔట్ కాగా.. డెవాన్ కాన్వే (25 బంతుల్లో 35 నాటౌట్; 5 ఫోర్లు), కెప్టెన్ డు ప్లూయ్ (12 బంతుల్లో 17 నాటౌట్; ఫోర్, సిక్స్) అజేయంగా నిలిచారు. What a final 5️⃣ balls from Tymal Mills! 😮#TheHundred pic.twitter.com/E4g6HNaD2n — The Hundred (@thehundred) August 12, 2023 -
దంచికొట్టిన సీఎస్కే ఓపెనర్.. సూపర్‌కింగ్స్‌కు రెండో విజయం
మేజర్ లీగ్ క్రికెట్(MLC 2023)లో టెక్సస్ సూపర్ కింగ్స్ మరో విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం తెల్లవారుజామున(భారత కాలమాన ప్రకారం) ముంబై న్యూయార్క్‌తో జరిగిన మ్యాచ్‌లో టెక్సస్ సూపర్ కింగ్స్ 17 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ఐపీఎల్ 2023 సీజన్లో సీఎస్కే తరపున అదరగొట్టిన డెవాన్ కాన్వే మేజర్ లీగ్ క్రికెట్లోనూ అదే ప్రదర్శనను పునరావృతం చేస్తున్నాడు. తాజాగా ముంబై న్యూయార్క్‌తో మ్యాచ్‌లో కాన్వే 55 బంతుల్లో 74 పరుగులతో రాణించాడు. మిచెల్ సాంట్నర్(27 పరుగులు) మినహా మిగతావారు పెద్దగా రాణించలేకపోయారు. దీంతో టెక్సస్ సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ముంబై న్యూయార్క్ బౌలర్లలో బౌల్ట్, రబాడలు చెరో రెండు వికెట్లు తీయగా.. కీరన్ పొలార్డ్, రషీద్ ఖాన్లు తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై న్యూయార్క్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ షయాన్ జాహంగీర్ 41 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. టిమ్ డేవిడ్ 24 పరుగులు చేశాడు. టెక్సస్ సూపర్‌కింగ్స్ బౌలర్లలో మహ్మద్ మోషిన్, డేనియల్ సామ్స్‌లు చెరో రెండు వికెట్లు తీయగా.. రస్టీ థెరాన్, జియా ఉల్ హక్, డ్వేన్ బ్రావోలు తలా ఒక వికెట్ తీశారు. DEVON CON-do no wrong 🤩 🎉 Bow down to today's Player of the Match!!! 💛 #MajorLeagueCricket | @texassuperkings pic.twitter.com/OPbaXJBwPZ — Major League Cricket (@MLCricket) July 18, 2023 చదవండి: CWG 2026: 'అంత బడ్జెట్ మావల్ల కాదు'.. కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించలేం Carlos Alcaraz: అల్కరాజ్ అందమైన గర్ల్‌ఫ్రెండ్‌ను చూశారా? -
మిల్లర్ కిల్లర్ ఇన్నింగ్స్.. రసెల్ పోరాటం వృధా.. బోణీ కొట్టిన సూపర్ కింగ్స్
అమెరికా వేదికగా జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్సీ) తొలి సీజన్ నిన్నటి (జులై 13) నుంచి ప్రారంభమైంది. సీజన్ ఆరంభ మ్యాచ్‌లో టెక్సాస్ సూపర్ కింగ్స్.. లాస్ ఏంజెలెస్ నైట్ రైడర్స్‌పై విజయఢంకా మోగించింది. భారతకాలమానం ప్రకారం ఇవాళ ఉదయం ప్రారంభమైన మ్యాచ్‌లో సూపర్ కింగ్స్ 69 పరుగుల తేడాతో గెలుపొంది, ఎంఎల్సీ-2023లో బోణీ విజయం దక్కించుకుంది. మిల్లర్ కిల్లర్ ఇన్నింగ్స్.. కాన్వే సూపర్ ఫిఫ్టి.. బ్రేవో మెరుపులు ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ కింగ్స్.. కాన్వే (37 బంతుల్లో 55; 7 ఫోర్లు, సిక్స్), డేవిడ్ మిల్లర్ (42 బంతుల్లో 61; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్ధసెంచరీలతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఆఖర్లో మిచెల్ సాంట్నర్ (14 బంతుల్లో 21; 2 సిక్సర్లు), డ్వేన్ బ్రేవో (6 బంతుల్లో 16 నాటౌట్; 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. సూపర్ కింగ్స్ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ తానెదుర్కొన్న తొలి బంతికే ఔటయ్యాడు. నైట్‌రైడర్స్ బౌలరల్లో అలీ ఖాన్, లోకీ ఫెర్గూసన్ తలో 2 వికెట్లు.. సునీల్ నరైన్, ఆడమ్ జంపా చెరో వికెట్ దక్కించుకున్నారు. రసెల్ పోరాటం వృధా.. 182 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నైట్ రైడర్స్.. సూపర్ కింగ్స్ బౌలర్ల ధాటికి 14 ఓవర్లలో 112 పరుగులకే కుప్పకూలింది. సూపర్ కింగ్స్ స్పిన్నర్ మొహమ్మద్ మొహిసిన్ (4/8) నైట్‌రైడర్స్ పతనాన్ని శాశించగా.. గెరాల్డ్ కొయెట్జీ, రస్టీ థెరన్ తలో 2 వికెట్లు, కాల్విన్ సావేజ్, డ్వేన్ బ్రేవో చెరో వికెట్ పడగొట్టారు. నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్‌లో మిగతా బ్యాటర్లంతా పెవిలియన్‌కు క్యూ కడుతుంటే విండీస్ విధ్వంసర వీరుడు ఆండ్రీ రసెల్ (34 బంతుల్లో 55; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) ఒక్కడే ఒంటరిపోరాటం చేశాడు. జస్కరన్ మల్హోత్రా (22), సునీల్ నరైన్ (15) రెండంకెల స్కోర్లు చేయగా.. మిగతావారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. మార్టిన్ గప్తిల్ (0), ఉన్ముక్త్ చంద్ (4), రిలీ రొస్సో (4), జంపా (3), ఫెర్గూసన్ (1) నిరాశపరిచారు. కాగా, ఐపీఎల్ ఫ్రాంచైజీల యాజమాన్యాలే ఎంఎల్సీ జట్లను కూడా కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం.. టెక్సాస్ సూపర్ కింగ్స్‌ను, కోల్‌కతా నైట్‌రైడర్స్ యాజమాన్యం.. లాస్ ఏంజెలెస్ నైట్‌రైడర్స్‌ను సొంతం చేసుకున్నాయి. లీగ్‌లో భాగంగా రేపు (భారతకాలమానం ప్రకారం) సీటిల్ ఓర్కాస్, వాషింగ్టన్ ఫ్రీడం జట్లు.. ముంబై ఇండియన్స్ న్యూయార్క్, శాన్ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ జట్లు తలపడతాయి. -
'టైటిల్ గెలిచిన మత్తులో ఎక్కాల్సిన ఫ్లైట్ మిస్సయ్యాం'
ఐపీఎల్ 16వ సీజన్ విజేతగా సీఎస్కే నిలిచిన సంగతి తెలిసిందే. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఫైనల్లో ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇది సీఎస్కే ఐదో ఐపీఎల్ టైటిల్ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాగా సీఎస్కే విజయంలో కీలకపాత్ర పోషించిన ఓపెనర్ డెవాన్ కాన్వే చాలా రోజులకు ఒక ఆసక్తికర విషయాన్ని తెలిపాడు. ''టైటిల్ గెలిచిన సంతోషంలో చాలా వైల్డ్‌గా సెలబ్రేషన్స్ చేసుకున్నాం. అలా సెలబ్రేషన్స్‌లో మునిగిపోయిన మాలో చాలా మంది ఎక్కాల్సిన ఫ్లైట్ మిస్సయ్యాం. మొయిన్ అలీ ఫ్యామిలీతో పాటు.. డ్వేన్ ప్రిటోరియస్ కూడా తర్వాతి రోజు వెళ్లారు. మా బౌలింగ్ కన్సల్టెంట్ ఎరిక్ సిమోన్స్ కూడా ఫ్లైట్‌ను క్యాన్సిల్ చేసుకున్నాడు. మేమంతా ఒక రూమ్‌లో కూర్చొని సెలబ్రేట్ చేసుకోగా.. ధోని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యాడు. ధోనితో కలిసి గడిపిన సమయాన్ని మా అదృష్టంగా భావిస్తున్నాం.'' అంటూ తెలిపాడు. చదవండి: బ్రిజ్‌భూషణ్‌పై చార్జ్‌షీట్ దాఖలు 'నా సక్సెస్‌లో సగం క్రెడిట్ కేన్మామదే' -
PBKS Vs CSK: అక్కడ ధోని.. కాన్వేను ఎవరు పట్టించుకుంటారు?
ఐపీఎల్ 16వ సీజన్లో సీఎస్కే ఓపెనర్ డెవన్ కాన్వే సెంచరీ చేసే అవకాశాన్ని వదులుకున్నాడు. 52 బంతుల్లో 92 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అయితే ధోని మాయలో ఉన్న అభిమానులు కాన్వే సెంచరీ చేసినా పెద్దగా పట్టించుకునేవారు కాదేమో. ఎందుకంటే మ్యాచ్ జరుగుతుంది చెన్నైలో. స్వయంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా కేవలం ధోని బ్యాటింగ్ చూడడం కోసమే వచ్చినట్లు సమాచారం. ధోని కూడా తనకోసం వేచి చూసిన అభిమానులకు న్యాయం చేశాడు. తొలి బంతికి పరుగు రాలేదు.. రెండో బంతికి సింగిల్.. ఇక కాన్వే సెంచరీ కోసం ధోని ఇలా చేశాడేమో అనుకునేలోపే కాన్వే మళ్లీ సింగిల్ తీశాడు. దీంతో ధోని స్ట్రైక్‌లోకి వచ్చి రెండు వరుస సిక్సర్లతో అలరించాడు. వాస్తవానికి కాన్వే కూడా తన సెంచరీ కన్నా ధోని బ్యాటింగ్ ముఖ్యమని భావించి అలా చేసి ఉంటాడు. సీఎస్కే బ్యాటింగ్ ముగిశాకా ధోని పరిగెత్తుకుంటూ వెళ్లిపోయాడు. ఈ దశలో ధోని.. ధోని అని అరిచిన ప్రేక్షకులు.. కాన్వే ఇన్నింగ్స్‌ను పట్టించుకున్న పాపాన పోలేదు. అది ధోనికున్న క్రేజ్. మాములుగానే ఈ సీజన్లో ప్రత్యర్థి జట్ల సొంత మైదానంలో సీఎస్కే మ్యాచ్‌లు జరిగినా కేవలం ధోని ఆటను చూడడం కోసమే అభిమానులు పోటెత్తుతున్నారు. ఉదాహరణకు జైపూర్‌లో రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్. అంతకముందు కోల్‌కతాలో కేకేఆర్‌తో మ్యాచ్‌లోనూ ఆయా జట్లకు మద్దతు ఇచ్చేవాళ్లకంటే కేవలం ధోనిని చూడడం కోసమే వచ్చారు. ఇక ఆదివారం పంజాబ్‌తో మ్యాచ్ చెపాక్ వేదికగా జరుగుతుందంటే ధోని క్రేజ్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. Last ball. MS Dhoni. Don't think anything else needs to be said 🙂#CSKvPBKS #IPLonJioCinema #TATAIPL | @ChennaiIPL @msdhoni pic.twitter.com/Bpa7vtDPVv — JioCinema (@JioCinema) April 30, 2023 చదవండి: ఐపీఎల్ చరిత్రలో అత్యంత పేలవమైన ఔట్ అనుకుంటా!