
PC: IPL.Com
ఐపీఎల్-2022లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో డెవాన్ కాన్వేకు చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టులో చోటు దక్కకపోవడంపై నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. కోల్‌కతాతో జరిగిన తొలి మ్యాచ్‌లో కేవలం మూడు పరుగులు మాత్రమే కాన్వే చేశాడు. అయితే లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌కు మొయిన్ అలీ అందుబాటులోకి రావడంతో కాన్వేను బెంచ్‌కే పరిమితం చేశారు.
కాగా ఈ మ్యాచ్‌లో నలుగురు విదేశీ ఆటగాళ్లకు అవకాశం ఉండగా, సీఎస్కే కేవలం ముగ్గురు విదేశీ ఆటగాళ్లతో మాత్రం బరిలోకి దిగింది. కాగా ఒక్క మ్యాచ్‌లో విఫలమైనంత మాత్రాన పక్కన పెడతారా అంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఓ నెటిజన్ స్పందిస్తూ.. "డెవాన్ కాన్వేపై చాలా అంచనాలు పెంచారు. కానీ అతని ఐపిఎల్ కెరీర్‌ను ఒక మ్యాచ్‌తో ముగించారు.. డెవన్ కాన్వేకు ఇంకొక అవకాశం ఇచ్చి చూడాల్సింది.." అని కామెంట్ చేశాడు.
చదవండి: Ruturaj Gaikwad: ఎల్బీ నుంచి తప్పించుకున్నా.. రనౌట్‌కు బలయ్యాడు