photo courtesy: IPL
ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా ఇవాళ (మే 8) ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సీఎస్‌కే ఓపెనర్ డెవాన్ కాన్వే (49 బంతుల్లో 87; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) భారీ హాఫ్ సెంచరీతో విరుచుకుపడ్డాడు. కాన్వేకు రుతురాజ్ గైక్వాడ్ (33 బంతుల్లో 41; 4 ఫోర్లు, సిక్స్), శివమ్ దూబే (19 బంతుల్లో 32; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), ధోని (8 బంతుల్లో 21 నాటౌట్; ఫోర్, 2 సిక్స్‌లు) కూడా సహకరించడంతో ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 208 పరుగుల భారీ స్కోర్ చేసింది.
Devon Conway in the last 3 matches in IPL 2022:
— Johns. (@CricCrazyJohns) May 8, 2022
85*(55) vs SRH
56(37) vs RCB
87(49) vs DC pic.twitter.com/Smx31KLJ4P
ఈ మ్యాచ్‌లో కాన్వే హాఫ్ సెంచరీ నమోదు చేయడం ద్వారా ఓ అరుదైన క్లబ్‌లో చేరాడు. సీఎస్‌కే తరఫున వరుసగా 3 అంతకంటే ఎక్కువ హాఫ్ సెంచరీలు చేసిన మూడో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. 2021 సీజన్‌లో ఫాఫ్ డెప్లెసిస్, రుతురాజ్ గైక్వాడ్‌లు సీఎస్‌కే తరఫున వరుసగా 4 హాఫ్ సెంచరీలు సాధించగా.. ప్రస్తుత సీజన్‌లో డెవాన్ కాన్వే వరుసగా మూడు హాఫ్ సెంచరీలు బాదాడు. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో 55 బంతుల్లో 85 పరుగులు చేసిన కాన్వే.. ఆతరువాత ఆర్సీబీపై 37 బంతుల్లో 56, తాజాగా డీసీపై 49 బంతుల్లో 87 పరుగులు స్కోర్ చేశాడు.
చదవండి: IPL 2022: ఐదేసిన హసరంగ.. సీజన్ అత్యుత్తమ గణాంకాలు నమోదు
Comments
Please login to add a commentAdd a comment