IPL 2022: Marriage Is Working for Him, Moeen Ali Lauds Devon Conway - Sakshi
Sakshi News home page

IPL 2022: కాన్వేకు పెళ్లి వర్కౌట్‌ అయినట్లుంది.. మొయిన్‌ అలీ ఫన్నీ కామెంట్‌

Published Mon, May 9 2022 6:46 PM | Last Updated on Thu, Jun 9 2022 4:45 PM

IPL 2022: Marriage Is Working For Him, Moeen Ali Lauds Devon Conway - Sakshi

Moeen Ali Lauds Devon Conway: హ్యాట్రిక్‌ హాఫ్‌ సెంచరీలతో సీఎస్‌కే విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న డెవాన్‌ కాన్వేపై అతని సహచర ఆటగాడు మొయిన్‌ అలీ ఫన్నీ కామెంట్‌ చేశాడు. కాన్వే పెళ్లైనప్పటి నుంచి బ్యాటింగ్‌లో అదరగొడుతున్నాడని, అతనికి మ్యారేజీ వర్కౌట్‌ అయినట్లుందని సరదాగా వ్యాఖ్యానించాడు. ఆదివారం (మే 8) ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కాన్వే (49 బంతుల్లో 87; 7 ఫోర్లు, 5 సిక్స‌ర్లు) ఆడిన సునామీ ఇన్నింగ్స్‌పై మాట్లాడుతూ మొయిన్‌ అలీ ఈ మేరకు వ్యాఖ్యానించాడు. కాన్వే అద్భుతమైన ఆటగాడని, అతను అన్ని యాంగిల్స్‌లో షాట్లు కొట్టగల సమర్ధుడని అలీ కొనియాడాడు. 


కాగా, దక్షిణాఫ్రికాలో పుట్టి న్యూజిలాండ్‌ క్రికెటర్‌గా పేరు ప్రఖ్యాతలు గడించిన డెవాన్‌ కాన్వే.. 2022 ఐపీఎల్‌ సీజన్‌లో సీఎస్‌కేతో జతకట్టాడు. సీఎస్‌కే యాజమాన్యం అతన్ని కోటి రూపాయల బేస్‌ ప్రైజ్‌కు సొంతం చేసుకుంది. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌ ఆడిన అనంతరం ఇష్ట సఖి కిమ్ వాట్సన్‌ను మనువాడేందుకు కొన్ని రోజుల పాటు బయోబబుల్‌ను వీడిన కాన్వే.. రీఎంట్రీలో వీర లెవెల్లో రెచ్చిపోతున్నాడు. వరుస హాఫ్‌ సెంచరీలతో పరాజయాల బాట పట్టిన సీఎస్‌కేను గెలుపు ట్రాక్‌ ఎక్కించాడు. వివాహం (ఏప్రిల్‌ 23) అనంతరం స‌న్‌రైజ‌ర్స్‌తో మ్యాచ్‌లో 55 బంతుల్లో 85 ప‌రుగులు చేసిన కాన్వే.. ఆత‌రువాత ఆర్సీబీపై 37 బంతుల్లో 56, తాజాగా డీసీపై 49 బంతుల్లో 87 ప‌రుగులు స్కోర్ చేశాడు. 


చదవండి: IPL 2022: ఇష్ట సఖిని మనువాడిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ బ్యాటర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement