Moeen ali
-
Ind vs Aus: టీ20 తరహా ఇన్నింగ్స్.. వైభవ్ ఫాస్టెస్ట్ సెంచరీ
భారత యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ధనాధన్ ఇన్నింగ్స్‌తో దుమ్ములేపాడు. కేవలం 58 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్నాడు. తద్వారా అండర్-19 టెస్టు క్రికెట్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన భారత తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. అంతేకాదు.. అత్యంత పిన్న వయసులోనే ఈ ఫీట్ నమోదు చేసి ఔరా అనిపించాడు.మొయిన్ అలీ తర్వాతచెన్నై వేదికగా ఆస్ట్రేలియా యువ జట్టుతో జరుగతున్న అనధికారిక తొలి టెస్టు సందర్భంగా మంగళవారం ఈ ఘనత సాధించాడు. కాగా అండర్ 19 స్థాయిలో వైభవ్ కంటే ముందు ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన క్రికెటర్ మొయిన్ అలీ. ఈ ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ 2005లో కేవలం 56 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకన్నాడు.కాగా మూడు యూత్ వన్డేలు, రెండు అనధికారిక టెస్టులు ఆడేందుకు ఆస్ట్రేలియా అండర్-19 జట్టు భారత్‌కు వచ్చింది. పుదుచ్చేరిలో జరిగిన వన్డే సిరీస్‌లో పర్యాటక జట్టును 3-0తో వైట్‌వాష్ చేసిన యువ భారత్.. చెన్నైలోని చెపాక్‌లో అనధికారిక తొలి టెస్టు మొదలుపెట్టింది.వైభవ్ రనౌట్ఆస్ట్రేలియాను తొలి ఇన్నింగ్స్‌లో 293 పరుగులకు ఆలౌట్ చేసింది. అనంతరం.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 14 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 103 పరుగులు చేసింది. ఇక మంగళవారం నాటి రెండో రోజు ఆటలోనూ ఆధిపత్యం కొనసాగిస్తోంది. ఓపెనర్లు విహాన్ మల్హోత్రా 26 పరుగులతో ఆడుతుండగా.. వైభవ్ సూర్యవంశీ 62 బంతుల్లో 104 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి.అత్యంత పిన్న వయస్కుడిగా చరిత్రరెడ్బాల్ మ్యాచ్‌లో టీ20 తరహా ఇన్నింగ్స్ ఆడిన ఈ పదమూడేళ్ల కుర్రాడు.. దురదృష్టవశాత్తూ రనౌట్‌గా వెనుదిరిగాల్సి వచ్చింది. ఇక అంతకు ముందు.. ఇదే మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా చరిత్రకెక్కాడు. కేవలం 13 సంవత్సరాల 187 రోజుల్లో ఈ ఘనత సాధించి.. బంగ్లాదేశ్ ప్లేయర్ నజ్ముల్ హసన్ షాంటో (14 సంవత్సరాల 231 రోజులు) పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు.కాగా దేశవాళీ క్రికెట్లో వైభవ్ బిహార్ జట్టుకు ఆడుతున్నాడు. ఇక 12 ఏళ్ల వయసులోనే రంజీల్లో ఎంట్రీ ఇచ్చిన వైభవ్.. ఈ క్రమంలో సచిన్ టెండుల్కర్, యువరాజ్ సింగ్ పేరిట ఉన్న రికార్డును బద్దలుకొట్టాడు. వీరిద్దరు పదిహేనేళ్ల వయసులో రంజీ టోర్నీలో అడుగుపెట్టారు.చదవండి: ‘జై షా తర్వాత బీసీసీఐ కార్యదర్శి ఎవరో గానీ.. ఈసారి అక్కడ మ్యాచ్‌లు వద్దు’ -
‘టెస్టుల్లో ఐదు శతకాలు.. నా వరకు ఎక్కువే’
టెస్టు క్రికెట్లో ఐదు శతకాలు బాదినందుకు తాను గర్వపడుతున్నానని ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ అన్నాడు. మేటి బ్యాటర్ జో రూట్‌ను అనుకరించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నించానని.. అయితే అతడిలా ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్లడం తనకు సాధ్యంకాలేదని తెలిపాడు. ఎలాంటి వ్యూహాలు లేకుండానే క్రీజులోకి వెళ్లి సెంచరీలు చేయడం తనకే ఆశ్చర్యంగా ఉండేదని పేర్కొన్నాడు.మూడు ఫార్మా ట్లలో త్తా చాటిన మొయిన్ అలీకాగా స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. వన్డే వరల్డ్‌కప్, టీ20 ప్రపంచకప్ గెలిచిన ఇంగ్లండ్ జట్లలో సభ్యుడైన అలీ... తన కెరీర్లో ఎన్నో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 2014లో ఇంగ్లండ్ తరఫున అరంగేట్రం చేసిన అతడు.. పదేళ్ల కెరీర్లో 68 టెస్టులు, 138 వన్డేలు, 92 టీ20 మ్యాచ్‌లూ ఆడాడు. బంతితో, ఇటు బ్యాట్‌తో రాణించి.. టెస్టుల్లో 3094 పరుగులు చేయడంతోపాటు 204 వికెట్లు పడగొట్టాడు. అతడి ఖాతాలో ఐదు టెస్టు సెంచరీలు ఉండటం విశేషం. అదే విధంగా పరిమిత ఓవర్ల క్రికెట్లోనూ మొయిన్ అలీ తన మార్కు చూపించాడు. వన్డేల్లో 2355 పరుగులు సహా 111 వికెట్లు.. అంతర్జాతీయ టీ20ల్లో 1229 పరుగులతో పాటు 51 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అందుకే రిటైర్మెంట్తనలో క్రికెట్ ఆడే సత్తా ఇంకా మిగిలే ఉందని.. అయితే, కొత్త తరానికి అవకాశం ఇవ్వడం కోసమే రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు 37 ఏళ్ల మొయిన్ అలీ ఆదివారం వెల్లడించాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి తప్పుకొన్నా.. ఫ్రాంచైజీ క్రికెట్లో మరి కొన్నాళ్లు ఆడతానని స్పష్టం చేశాడు.ఆ విషయంలో విఫలమయ్యానుఈ నేపథ్యంలో తన టెస్టు కెరీర్ గురించి నెమరువేసుకున్న మొయిన్ అలీ.. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ నాసిర్ హుసేన్తో మాట్లాడుతూ.. ‘‘నేను ఐదు శతకాలు బాదినందుకు గర్వపడుతున్నా. కేవలం ఐదే కదా అని అందరికీ అనిపించవచ్చు. కానీ.. డౌన్ ఆర్డర్లో వచ్చి మరీ ఇలా ఆడటం నాకు ఎంతో గొప్పగా అనిపిస్తుంది.అసలేం చేయగలనో తెలియని స్థితిలో క్రీజులోకి వెళ్లి.. పరుగులు రాబట్టడం నా వరకు ఊహించని విషయమే. ఉన్న కాసేపైనా బ్యాటింగ్ చేయడాన్ని పూర్తిగా ఆస్వాదించేవాడిని. నిజానికి జో రూట్‌లా నేనూ పక్కా ప్లాన్‌తో ఆడాలని భావించేవాడిని. కానీ విఫలమయ్యాను. అప్పటికప్పుడు పరిస్థితికి తగ్గట్లుగా మారిపోవడమే నాకు తెలుసు. అయితే, ఒక్కోసారి అనుకున్న మేర పరుగులు సాధించలేకపోయాననే భావన వెంటాడేది’’ అని చెప్పుకొచ్చాడు. తన కెరీర్ పట్ల మొయిన్ అలీ సంతృప్తి వ్యక్తం చేశాడు. కాగా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ టెస్టుల్లో 12377 పరుగులు చేశాడు. ఇందులో 34 శతకాలు ఉన్నాయి. టెస్టుల్లో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో అగ్రస్థానమే లక్ష్యంగా రూట్ ముందుకు సాగుతున్నాడు.చదవండి: Ind vs Ban: అందుకే వాళ్లిద్దరికి టీమిండియాలో చోటు దక్కలేదు! -
రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్..
ఇంగ్లండ్ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. మొయిన్ అలీ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరగనున్న వైట్ బాల్ సిరీస్ జట్టు నుంచి తప్పుకున్న అనంతరం మెయిన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. అలీ ఇప్పటికే టెస్టు క్రికెట్ నుంచి రెండు సార్లు రిటైర్ అయ్యి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. కానీ ఇప్పుడు పూర్తిగా అంతర్జాతీయ క్రికెట్‌కే గుడ్‌బై చెప్పాలని అతడు డిసైడ్ అయ్యాడు. డైలీ మెయిల్లో ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ నాజర్ హుస్సేన్‌తో మెయిన్ మాట్లాడుతూ.. తన రిటైర్మెంట్కు గల కారణాన్ని వెల్లడించాడు. జట్టులో యువ ఆటగాళ్లకు ఛాన్స్ ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అలీ తెలిపాడు."నేను అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నాను. అంతర్జాతీయ స్ధాయిలో నేను మళ్లీ ఇంగ్లండ్‌కు ఆడాలంటే ఆడగలను. కానీ మళ్లీ నా నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయను. రిటైర్మెంట్ ప్రకటించడానికి కారణం నా ఫిట్నెస్ కాదు.ఇప్పటికీ నేను పూర్తి ఫిట్నెస్తో ఉన్నాను. కానీ జట్టులో యువ ఆటగాళ్లకు ఛాన్స్ ఇచ్చేందుకు నేను తప్పుకోవాలని డిసైడ్ అయ్యాను. ఇంగ్లండ్ క్రికెట్లోకి కొత్త తరం ఆటగాళ్లు రావాలని" అలీ పేర్కొన్నాడు.ఇక ఇంటర్ననేషనల్ క్రికెట్ నుంచి తప్పుకున్న అలీ... ప్రపంచవ్యాప్తంగా ఫ్రాంచైజీ క్రికెట్ ఆడనున్నాడు. ఇంగ్లండ్ తరపున 68 టెస్టులు, 138 వన్డేలు, 92 టీ20లు ఆడిన అలీ.. వరుసగా 3,094, 2,355, 1,229 పరుగులు సాధించాడు. అదే విధంగా మూడు ఫార్మాట్లు కలిపి 254 వికెట్లు పడగొట్టాడు. -
ఇంగ్లండ్‌కు బిగ్ షాక్.. బట్లర్ దూరం! కొత్త కెప్టెన్ ఎవరంటే?
టీ20 వరల్డ్‌కప్-2024కు ముందు ఇంగ్లండ్ జట్టుకు భారీ షాక్ తగిలే ఛాన్స్ ఉంది. ఆ జట్టు రెగ్యూలర్ కెప్టెన్ జోస్ బట్లర్ ఈ ఏడాది పొట్టి ప్రపంచకప్‌లో కొన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. అతడి భార్య లూయిస్ మూడో బిడ్డకు జన్మనివ్వనుండడంతో.. బట్లర్ పితృత్వ సెలవు తీసుకోనున్నట్లు సమాచారం.ఈ క్రమంలోనే అతడు లీగ్ దశ మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒక వేళ బట్లర్ దూరమైతే ఇంగ్లీష్ జట్టు కెప్టెన్సీ బాధ్యతలను ఆల్‌రౌండర్ మొయిన్ అలీ చేపట్టనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.ఈ మెగా ఈవెంట్లో ఇంగ్లండ్ తమ తొలి మ్యాచ్‌లో జూన్ 4న బార్బోడస్ వేదికగా స్కాట్లాండ్తో తలపడనుంది. ఇంగ్లండ్ ప్రస్తుతం టీ20 వరల్డ్‌కప్ సన్నాహాకాల్లో భాగంగా సొంత గడ్డపై నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో పాకిస్తాన్‌తో తలపడనుంది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా టాస్ పడకుండానే రద్దు అయింది.శనివారం ఇరు జట్లు మధ్య రెండో టీ20 జరగనుంది. ఈ క్రమంలో రెండో టీ20కు ముందు మొయిన్ అలీ మీడియా సమావేశంలో మాట్లాడాడు. "నేను వైస్-కెప్టెన్‌గా ఉన్నప్పుడు జోస్ బట్లర్ గైర్హజరీలో చాలా సందర్బాల్లో జట్టును నడిపించాను. ఆ సమయంలో కెప్టెన్సీ పరంగా నేను ఎటువంటి ఒత్తిడికి లోనవ్వలేదు. కొత్తగా కూడా నాకేమి అన్పించలేదు. మనం తీసుకునే నిర్ణయాలపై ఏదైనా ఆధారపడి ఉంటుంది.ఇక జోస్ భార్య మూడో బిడ్డకు జన్మనివ్వనుంది. బేబీ అనుకున్న సమయంలోనే ఈ ప్రపంచంలో అడుగుపెడుతుందని నేను ఆశిస్తున్నాను. అంతేకాకుండా జోస్ ఎక్కువ మ్యాచ్‌లకు దూరం కాకుడదని నేను కోరుకుంటున్నాని" అలీ పేర్కొన్నాడు. -
ఆల్‌రౌండ్ షోతో ఇరగదీసిన మొయిన్ అలీ.. హ్యాట్రిక్ సహా..!
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో (బీపీఎల్) కొమిల్లా విక్టోరియన్స్ ఆటగాడు, ఇంగ్లండ్ ప్లేయర్ మొయిన్ అలీ ఆల్‌రౌండ్ షోతో ఇరగదీశాడు. ఈ మ్యాచ్‌లో తొలుత మెరుపు అర్ధశతకంతో విరుచుకుపడిన మొయిన్ (24 బంతుల్లో 53 నాటౌట్; 2 ఫోర్లు, 5 సిక్సర్లు).. ఆతర్వాత హ్యాట్రిక్ సహా నాలుగు వికెట్లు (3.3-0-23-4) తీసి విక్టోరియన్స్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. మొయిన్‌తో పాటు సహచర ఆటగాడు విల్ జాక్స్ (53 బంతుల్లో 108 నాటౌట్; 5 ఫోర్లు, 10 సిక్సర్లు) సునామీ శతకంతో వీరంగం సృష్టించడంతో విక్టోరియన్స్ 73 పరుగుల తేడాతో చట్టోగ్రామ్ ఛాలెంజర్స్‌పై విజయం సాధించింది. బంగ్లా ప్రీమియర్ లీగ్‌లో మొయిన్ సాధించిన హ్యాట్రిక్ ఎనిమిదవది. మొయిన్ హ్యాట్రిక్ వికెట్లతో మ్యాచ్‌కు ముగించాడు. Moeen Ali scored a fifty and took a hat-trick in the BPL match. 🤯pic.twitter.com/yIGVsgU9Lh — Mufaddal Vohra (@mufaddal_vohra) February 13, 2024 శతక్కొట్టిన విల్ జాక్స్.. మెరుపు అర్దశతకంతో విరుచుకుపడిన మొయిన్ అలీ తొలుత బ్యాటింగ్ చేసిన కొమిల్లా విక్టోరియన్స్ జాక్స్, మొయిన్ విజృంభించడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 239 పరుగుల భారీ స్కోర్ చేసింది. విక్టోరియన్స్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ లిటన్ దాస్ (31 బంతుల్లో 60; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా అర్ధసెంచరీతో మెరిశాడు. తిప్పేసిన మొయిన్, రిషద్ హొసేన్. 240 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఛాలెంజర్స్.. మొయిన్ అలీ, రిషద్ హొసేన్ (4-0-22-4) మాయాజాలం ధాటికి 166 పరుగులకే కుప్పకూలి ఓటమిపాలైంది. ముస్తాఫిజుర్ 2 వికెట్లు తీసి విక్టోరియన్స్ విజయంలో తనవంతు పాత్ర పోషించాడు. ఛాలెంజర్స్ ఇన్నింగ్స్‌లో తంజిద్ హసన్ (41), సైకత్ అలీ (36), జోష్ బ్రౌన్ (36) మాత్రమే ఓ మోస్తరు స్కోర్లు చేశారు. -
ఇంగ్లండ్ క్రికెట్లో మరో వికెట్ డౌన్.. నెల రోజుల వ్యవధిలో నాలుగో ఆటగాడు
ఇంగ్లండ్ క్రికెట్లో మరో వికెట్ పడింది. నెల రోజుల వ్యవధిలో నాలుగో ఆటగాడు రిటైర్మెంట్ ప్రకటించాడు. యాషెస్ సిరీస్-2023 సందర్భంగా తొలుత స్టువర్ట్ బ్రాడ్, ఆతర్వాత మొయిన్ అలీ, కొద్ది రోజుల గ్యాప్‌లో ఇంగ్లండ్ టీ20 వరల్డ్‌కప్ విన్నర్ అలెక్స్ హేల్స్, తాజాగా త్రీ టైమ్ యాషెస్ సిరీస్ విన్నర్, బ్రాడ్ సహచరుడు, ఫాస్ట్ బౌలర్ స్టీవెన్ ఫిన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 2010లో అంతర్జతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన ఫిన్.. 2017 వరకు ఇంగ్లండ్ తరఫున మూడు ఫార్మాట్లలో ఆడాడు. ఈ మధ్య కాలంలో అతను మూడు సార్లు యాషెస్ సిరీస్ విన్నింగ్ టీమ్‌లో సభ్యుడిగా ఉన్నాడు. గతకొంతకాలంగా మోకాలి గాయంతో బాధ పడుతున్న ఫిన్.. తప్పనిసరి పరిస్థితుల్లో క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. తన రిటైర్మెంట్ తక్షణమే అమల్లోకి వస్తుందని ఫిన్ ఓ స్టేట్మెంట్ ద్వారా వెల్లడించాడు. గత ఏడాది కాలంగా మోకాలి గాయం బాధిస్తుందని, గాయంతో పోరాటంలో తాను ఓడిపోయానని, తప్పనిసరి పరిస్థితుల్లో క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెబుతున్నానని ఫిన్ తన స్టేట్మెంట్లో పేర్కొన్నాడు. 2005లో మిడిల్సెక్స్ తరఫున కెరీర్‌ను ప్రారంభించిన ఫిన్.. 2010-16 మధ్యలో ఇంగ్లండ్ తరఫున 36 టెస్ట్‌లు ఆడి 125 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 5 సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించాడు. 2011లో వన్డే అరంగ్రేటం చేసిన ఫిన్ 69 వన్డేల్లో 102 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 2 సార్లు 5 వికెట్ల ఘనత సాధించాడు. 2011-15 మధ్యలో 21 టీ20 ఆడిన ఫిన్ 27 వికెట్లు పడగొట్టాడు. టెస్ట్‌ల్లో ఫిన్ ఓ హాఫ్ సెంచరీ కూడా చేశాడు. కౌంటీల్లో 2005 నుంచి 2022 వరకు మిడిల్‌సెక్స్‌కు ఆడిన ఫిన్.. ఆతర్వాత ససెక్స్‌ను మారాడు. ససెక్స్ తరఫున ఫిన్ కేవలం 19 మ్యాచ్‌లే ఆడాడు. ససెక్స్‌కు ఆడుతుండగానే మోకాలి గాయం బారిన పడిన 34 ఏళ్ల ఫిన్, కెరీర్‌ను కొనసాగించలేక రిటైర్మెంట్ ప్రకటించాడు. -
Moeen Ali Unseen Photos: ట్రెండింగ్‌లో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ (ఫోటోలు)
-
రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్..
ఇంగ్లండ్ స్టార్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ టెస్టు క్రికెట్‌కు మరోసారి విడ్కోలు పలికాడు. లండన్ వేదికగా జరిగిన యాషెస్ ఆఖరి టెస్టు అనంతరం మొయిన అలీ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై 49 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ 2-2తో సమమైంది. ఇంగ్లండ్ విజయంలో అలీ కీలక పాత్ర పోషించాడు. మూడు వికెట్లు పడగొట్టి జట్టుకు అద్భుతమైన విజయం అందించాడు. తొలిసారి అలా.. కాగా అంతకుముందు మొయిన్ అలీ 2021 సెప్టెంబర్‌లో టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు. కానీ యాషెస్ సిరీస్-2023కు ముందు ఇంగ్లండ్ స్పిన్నర్ జాక్ లీచ్ గాయపడ్డాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో యాషెస్ మొత్తానికి అతడు దూరమయ్యాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు, టెస్టు జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్, కోచ్ మెక్కల్లమ్ నచ్చచెప్పడంతో మెయిన్ అలీ టెస్టు రిటైర్మెంట్పై తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. దీంతో అతడిని ఈ ఏడాది యాషెస్ సిరీస్‌కు ఇంగ్లండ్ సెలక్టర్లు ఎంపిక చేశారు. జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చిన అలీ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఓవరాల్‌గా యాషెస్ 2023లో నాలుగు మ్యాచ్‌లో ఆడిన మొయిన్.. 180 పరుగులతో పాటు 9 వికెట్లు సాధించాడు. ఓ వైపు చేతి గాయంతో బాధపడుతున్నప్పటికీ తన వంతు సేవలను అలీ అందించాడు. ఇదే చివరి మ్యాచ్.. ఇక మ్యాచ్ అనంతరం మొయిన్ అలీ మాట్లాడుతూ.. "రిటైర్మెంట్ విషయం గురించి స్టోక్స్ నాకు మళ్లీ మెసేజ్ చేస్తే, వెంటనే డిలీట్ చేస్తాను. నేను వచ్చిన పని పూర్తి చేశాను. ఈ సిరీస్‌ను బాగా ఎంజాయ్ చేశాను. చివరి మ్యాచ్‌ను విజయంతో ముగించడం చాలా సంతోషంగా ఉంది. స్టోక్సీ నన్ను రీ ఎంట్రీ ఇవ్వమని అడిగినప్పుడు తొలుత నో చెప్పాను. ఎందకంటే నేను ఇప్పటివరకు ఆస్ట్రేలియాపై ఎప్పుడూ బాగా ఆడలేదు. అందుకే నేను మళ్లీ ఆడను అని చెప్పా. స్టోక్స్ మాత్రం నాకు సపోర్ట్‌గా నిలిచి, నీవు అద్భుతంగా రాణించగలవని నేను ఇప్పటికీ నమ్ముతున్నాను అని అన్నాడు. దీంతో మళ్లీ రెడ్ బాల్ క్రికెట్లో ఆడేందుకు ఒప్పుకున్నాను. మళీ జిమ్మీ,బ్రాడ్‌తో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంగ్లండ్ వంటి జట్టుకు జాతీయ స్ధాయిలో ప్రాతినిథ్యం వహించినందుకు గర్వంగా ఉందని చెప్పుకొచ్చాడు. చదవండి:IND Vs WI: టీమిండియాతో టీ20 సిరీస్.. విండీస్ జట్టు ప్రకటన! సిక్సర్ల వీరుడు వచ్చేశాడు -
Ashes 4th Test: మొయిన్ అలీ డబుల్ ధమాకా
ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ సిరీస్ నాలుగో టెస్ట్ రెండో రోజు ఆటలో ఇంగ్లండ్ వెటరన్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ డబుల్ ధమాకా సాధించాడు. ఈ సిరీస్‌కు ముందే రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుని టెస్ట్ క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చిన మొయిన్.. టెస్ట్‌ల్లో 3000 పరుగులు, 200 వికెట్లు సాధించిన 16వ క్రికెటర్‌గా, నాలుగో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్‌గా రికార్డుల్లోకెక్కాడు. కెరీర్లో 67వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న మొయిన్.. 3020 పరుగులు 201 టెస్ట్ వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. మొయిన్‌కు ముందు ఇయాన్ బోథమ్ (5200 పరుగులు, 383 వికెట్లు), ఆండ్రూ ఫ్లింటాఫ్ (3845, 226), స్టువర్ట్ బ్రాడ్ (3640, 600) ఈ ఘనత సాధించారు. ఇదిలా ఉంటే, 299/8 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్.. తొలి ఇన్నింగ్స్‌లో 317 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టు ఓవర్‌నైట్ స్కోర్‌కు మరో 18 పరుగులు మాత్రమే జోడించి, మిగతా 2 వికెట్లు కోల్పోయింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ బజ్‌బాల్ అంటూ ధాటిగా ఆడుతుంది. ఆ జట్టు రెండో సెషన్ సమయానికి 23 ఓవర్లలో వికెట్ నష్టానికి 108 పరుగులు చేసింది. డకెట్ (1) ఔట్ కాగా.. జాక్ క్రాలే (60), మొయిన్ అలీ (43) క్రీజ్‌లో ఉన్నారు. డకెట్ వికెట్ స్టార్క్‌కు దక్కింది. అంతకుముందు, ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో మిచెల్ మార్ష్ (51), లబుషేన్ (51), హెడ్ (48), స్టీవ్ స్మిత్ (41), డేవిడ్ వార్నర్ (32), మిచెల్ స్టార్క్ (36 నాటౌట్). ఇంగ్లండ్ బౌలర్లలో వోక్స్ 5 వికెట్లతో చెలరేగగా.. బ్రాడ్ 2, ఆండర్సన్, వుడ్, మొయిన్ అలీ తలో వికెట్ పడగొట్టారు. -
రూట్‌ను వదలని కమిన్స్.. స్టార్క్ దెబ్బకు పల్టీలు కొట్టిన వికెట్లు
యాషెస్ సిరీస్‌లో మూడో టెస్ట్ మ్యాచ్ హోరాహోరీగా సాగుతుంది. 251 పరుగుల లక్ష్య ఛేదనలో 27/0 ఓవర్‌నైట్ స్కోర్ వద్ద నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్.. లంచ్ విరామం సమయానికి 4 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసి, లక్ష్యానికి 98 పరుగుల దూరంలో ఉంది. హ్యారీ బ్రూక్ (40), బెన్ స్టోక్స్ (7) క్రీజ్‌లో ఉన్నారు. మిస్‌ఫైర్ అయిన మొయన్ అలీ ప్రయోగం.. ఛేదనలో మొయిన్ అలీని వన్‌డౌన్‌లో దింపి ఇంగ్లండ్ మేనేజ్మెంట్ చేసిన ప్రయోగం మిస్‌ఫైర్ అయ్యింది. అలీ కేవలం 5 పరుగులు మాత్రమే చేసి, మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. స్టార్క్.. అలీని ఔట్ చేసిన విధానం అభిమానులను ఆకట్టుకుంది. వికెట్లు గాల్లో పల్టీలు కొట్టిన వైనం ఆసీస్ ఫ్యాన్స్‌కు కనువిందు చేసింది. రూట్‌ను వదలని కమిన్స్.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ (21)ను పాట్ కమిన్స్ ఫోబియా వదిలిపెట్టడం లేదు.కమిన్స్ రూట్‌ను వరుసగా మూడో ఇన్నింగ్స్‌లో కూడా ఔట్ చేశాడు. రూట్.. ఒకే బౌలర్ చేతిలో వరుసగా మూడు ఇన్నింగ్స్‌ల్లో ఔట్ కావడం ఇది మూడోసారి. గతంలో అల్జరీ జోసఫ్, స్కాట్ బోలండ్.. రూట్‌ను వరుసగా మూడుసార్లు ఔట్ చేశారు. ఓవరాల్‌గా చూస్తే..రూట్ తన కెరీర్లో అత్యధిక సార్లు (11) కమిన్స్ బౌలింగ్‌లోనే ఔటయ్యాడు. కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌట్ కాగా.. ఇంగ్లండ్ 237 పరుగులకు చాపచుట్టేసింది. అనంతరం ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 224 పరుగులకు టపా కట్టేసి ఇంగ్లండ్ 251 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో మిచెల్ మార్ష్ (118) సెంచరీ చేయగా.. మార్క్ వుడ్ 5 వికెట్లతో చెలరేగాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో బెన్ స్టోక్స్ (80) అర్ధసెంచరీతో రాణించగా.. పాట్ కమిన్స్ 6 వికెట్లతో ఇరగదీశాడు. ఆసీస్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో ట్రావిస్ హెడ్ (77) టాప్ స్కోరర్‌గా నిలువగా.. బ్రాడ్, వోక్స్ తలో 3 వికెట్లు, మార్క్ వుడ్, మొయిన్ అలీ చెరో 2 వికెట్లు దక్కించుకున్నారు. -
Eng Vs Aus: మేమింకా గెలవగలిగే స్థితిలోనే ఉన్నాం: ఇంగ్లండ్ స్టార్
The Ashes, 2023- England vs Australia, 3rd Test- Day 2- లీడ్స్: యాషెస్ సిరీస్ మూడో టెస్టు ఆసక్తికర మలుపులతో సాగుతోంది. రెండో రోజు కూడా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా పోటాపోటీగా పోరాడాయి. రెండో రోజు నాటి శుక్రవారం ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖవాజా (43), డేవిడ్ వార్నర్ (1), మార్నస్ లబుషేన్ (33), స్టీవ్ స్మిత్ (2) పెవిలియన్ చేరారు. ప్రస్తుతం ఆసీస్ ఓవరాల్ ఆధిక్యం 142 పరుగులకు చేరింది. స్టోక్స్ దూకుడు అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 68/3తో ఆట కొనసాగించిన ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 237 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా ఆస్ట్రేలియాకు 26 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. కెప్టెన్ బెన్ స్టోక్స్ (80; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఒంటిచేత్తో జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. చివర్లో మార్క్ వుడ్ (8 బంతుల్లో 24; 1 ఫోర్, 3 సిక్స్‌లు) మెరుపులు ఇంగ్లండ్ భారీ ఆధిక్యం కోల్పోకుండా కాపాడాయి. ఇక ఆసీస్ కెప్టెన్ కమిన్స్ (6/91) రాణించాడు. రెండో రోజు ఆట ముగిసే సరికి నాలుగు వికెట్లు కోల్పోయిన ఆసీస్ 142 పరుగుల ఆధిక్యంలో ఉంది. గెలవగలిగే స్థితిలోనే ఉన్నాం ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ స్పిన్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ బీబీసీతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. యాషెస్ సిరీస్ మూడో టెస్టులో తామింకా గెలవగలిగే స్థితిలోనే ఉన్నామని ధీమా వ్యక్తం చేశాడు. వికెట్ బాగుందని.. తమ జట్టు కచ్చితంగా ఈ మ్యాచ్‌లో పైచేయి సాధిస్తుందని పేర్కొన్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 200 మార్కు దాటడం తమలో సానుకూల దృక్పథం నింపిందన్నాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో తిరిగి పుంజుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశాడు. రెండు వికెట్లు పడగొట్టి ఇక ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో ఆరంభం నుంచే తాను దూకుడు ప్రదర్శించాలని నిర్ణయించుకున్నానన్న అలీ.. రెండు వికెట్లు తీయడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశాడు. కాగా రెండో రోజు ఆటలో మొయిన్ అలీ లబుషేన్, స్మిత్ వికెట్లు పడగొట్టగా.. ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజాను క్రిస్ వోక్స్, డేవిడ్ వార్నర్‌ను స్టువర్ట్ బ్రాడ్ పెవిలియన్‌కు పంపారు. ఇదిలా ఉంటే.. యాషెస్ తొలి రెండు టెస్టుల్లో పర్యాటక ఆసీస్ విజయం సాధించి 2-0తో ముందంజలో ఉన్న విషయం తెలిసిందే. చదవండి: టీమిండియాతో సిరీస్‌కు జట్టును ప్రకటించిన విండీస్.. ఆ ఇద్దరు తొలిసారి -
Ashes 2nd Test: తుది జట్టును ప్రకటించిన ఇంగ్లండ్.. అనుకున్న విధంగానే ఓ మార్పు
ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య యాషెస్ సిరీస్ 2023లో భాగంగా ఇవాల్టి నుంచి (జూన్ 28) ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానం వేదికగా రెండో టెస్ట్ ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ తమ తుది జట్టును ప్రకటించింది. ముందుగా అనుకున్న విధంగానే మేనేజ్మెంట్ స్పిన్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీని తప్పించింది. అతని స్థానంలో యువ పేసర్ జోష్ టంగ్ తుది జట్టులోకి వచ్చాడు. ఈ ఒక్క మార్పు మినహాయించి తొలి టెస్ట్ ఆడిన జట్టునే ఇంగ్లీష్ మేనేజ్మెంట్ యధాతథంగా కొనసాగించింది. ఆసీస్.. తమ తుది జట్టును ప్రకటించాల్సి ఉంది. భారతకాలమానం ప్రకారం మ్యాచ్ 3:30 గంటలకు ప్రారంభమవుతుంది. కాగా, మొయిన్ అలీ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన టంగ్.. ఇటీవలే టెస్ట్ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. యాషెస్ సిరీస్‌కు ముందు ఐర్లాండ్‌తో జరిగిన ఏకైక టెస్ట్ ద్వారా టంగ్ టెస్ట్ అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో టంగ్ 5 వికెట్లు పడగొట్టాడు. తొలి టెస్ట్ ఓటమి నేపథ్యంలో ఇంగ్లండ్ పూర్తిగా పేస్ అటాక్‌తోనే బరిలోకి దిగనుంది. ఇదిలా ఉంటే, యాషెస్ సిరీస్ 2023 తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా చిరస్మరణీయ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ బజ్‌బాల్ అప్రోచ్ అంటూ బొక్కబోర్లా పడింది. స్వయంకృతాపరాధంగానే ఆ జట్టు ఓడింది. తొలి ఇన్నింగ్స్‌లో మరిన్ని పరుగులు చేసే అవకాశం ఉన్నా ఆ జట్టు ఓవరాక్షన్ చేసి చేతులుకాల్చుకుంది. మరి ఈ మ్యాచ్‌లో అయిన ఒళ్లు దగ్గర పెట్టుకుని ఆడుతుందో లేక మరోసారి బజ్‌బాల్ అంటూ హడావుడి చేస్తుందో వేచి చూడాలి. England have announced their playing XI for the second men’s Ashes Test at Lord’s 🏏 More 👉 https://t.co/ctbQmFfLDt pic.twitter.com/zvlpdaLzYq — ICC (@ICC) June 28, 2023 -
'ఐదేళ్ల క్రితమే చెప్పాడు'.. వార్న్ బతికుంటే సంతోషించేవాడు
ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య యాషెస్ సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఐదుటెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ ఓటమి పాలైంది. ఆసీస్ రెండు వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. ఇక రెండోటెస్టు ఇరుజట్ల మధ్య జూన్ 28 నుంచి లార్డ్స్ వేదికగా జరగనుంది. అయితే ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో ఆల్‌రౌండర్ మొయిన్ అలీ అంతగా ఆకట్టుకోలేదు. దీనికి తోడు రెండో ఇన్నింగ్స్‌లో అలీ గాయపడ్డాడు. దీంతో లార్డ్స్ టెస్టుకు మొయిన్ అలీ దూరమయ్యాడు. అయితే అతని స్థానంలో ఎవరు ఊహించని రీతిలో 18 ఏళ్ల కుర్రాడికి ఈసీబీ అవకాశం ఇచ్చింది.లెగ్ స్పిన్నర్ అయిన 18 ఏళ్ల రిహాన్ అహ్మద్‌ను మొయిన్ అలీకి రీప్లేస్‌గా తీసుకోవడం ఆసక్తి కలిగించింది. అయితే ఇదే రిహాన్ అహ్మద్‌కు గతంలో ఆసీస్ దిగ్గజం షేన్ వార్న్ షేక్‌హ్యాండ్ ఇచ్చిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. రిహాన్ 13 ఏళ్ల వయసున్నప్పుడు ఒక గ్రౌండ్లో బౌలింగ్ చేస్తూ ఉన్నాడు. అతని బౌలింగ్‌ను నిశితంగా పరిశీలించిన షేన్ వార్న్.. కాసేపటికి అతని దగ్గరికి వచ్చి.. ''నిజంగా సూపర్‌గా బౌలింగ్ చేస్తున్నావ్. నేను అప్పటినుంచి నిన్ను గమనిస్తున్నా. త్వరలోనే నీ గురించి కామెంట్ చేస్తానేమో. 15 ఏళ్ల వయసులోనే నువ్వు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ ఆడే అవకాశం ఉంది.. అంతేకాదు చిన్న వయసులోనే ఇంగ్లండ్ జట్టులో చోటు సంపాదిస్తావు'' అని చెప్పుకొచ్చాడు. వార్న్ ఆ మాటలు ఏ శుభ ముహుర్తానా అన్నాడో తెలియదు కానీ అదే ఇప్పుడు నిజమయ్యింది. మొయిన్ అలీ స్థానంలో ఎంపికవడం.. అదీ ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ సందర్భంగా ఇది జరగడం రిహాన్ అహ్మద్‌ది అదృష్టం అని చెప్పొచ్చు. ఒకవేళ రెండో టెస్టులో అవకాశం లభించి మంచి ప్రదర్శన ఇస్తే మాత్రం ఇంగ్లండ్ జట్టులో శాశ్వత స్పిన్నర్‌గా పాతుకుపోయే అవకాశం రావొచ్చు. ఇక రిహాన్ అహ్మద్ తన ఎంపికపై స్పందిస్తూ.. ''ఏదో ఒకరోజు ఇంగ్లండ్‌కు ఆడుతానని తెలుసు.. కానీ ఇలా ఎంపికవుతానని ఊహించలేదు. సరిగ్గా ఐదేళ్ల క్రితం దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ నన్ను ప్రోత్సహిస్తూ చెప్పిన మాటలు ఇవాళ నిజమయ్యాయి. వార్న్ బతికి ఉంటే తప్పకుండా సంతోషించేవాడు'' అంటూ పేర్కొన్నాడు. The King Shane Warne knew. Rehan Ahmed. pic.twitter.com/pCl6oaXkk3 — M (@anngrypakiistan) June 23, 2023 చదవండి: 'రంజీలెందుకు ఆడించడం.. ఐపీఎల్‌తోనే కానిచ్చేయండి!' -
యాషెస్ రెండో టెస్టు.. ఇంగ్లండ్ జట్టులోకి యువ ఆటగాడు
యాషెస్ తొలి టెస్టులో ఓటమి పాలైన ఇంగ్లండ్.. ఇప్పుడు లార్డ్స్ వేదికగా జరిగే రెండో టెస్టుకు అన్ని విధాల సన్నద్దం అవుతోంది. రెండో టెస్టు జూన్ 28 నుంచి ప్రారంభం కానుంది. అయితే రెండో టెస్టుకు ఇంగ్లీష్ జట్టు ఆల్‌రౌండర్ మొయిన్ అలీ ఆడేది సందేహం గా మారింది. తొలి టెస్టులో మోయిన్ అలీ చేతి వేలి గాయంతో బాధపడ్డాడు. దీంతో సెకెండ్ ఇన్నింగ్స్‌లో పెద్దగా అలీ బౌలింగ్ చేయలేదు. ఈ క్రమంలో రెండో టెస్టుకు ముందు ఇంగ్లండ్ జట్టు మెనెజ్‌మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. మోయిన్ అలీ బ్యాకప్‌గా యువ లెగ్ స్పిన్నర్ రెహాన్ అహ్మద్‌ను ఇంగ్లండ్ ఎంపిక చేసింది. కాగా 18 ఏళ్ల అహ్మద్.. గతేడాది డిసెంబర్లో పాకిస్తాన్‌పై టెస్టు క్రికెట్ అరంగేట్రం చేశాడు. ఇంగ్లండ్ తరఫున టెస్టు క్రికెట్ ఆడిన అతి పిన్న వయస్కుడిగా రెహాన్ అహ్మద్ చరిత్ర సృష్టించాడు. తన అరంగేట్ర టెస్టులోనే ఏడు వికెట్లు పడగొట్టి అందరని రెహాన్ అకట్టుకున్నాడు. ప్రస్తుతం విటిలిటి టీ20 బ్లాస్ట్‌లో లీసెస్టర్‌షైర్ తరపున ఆడుతున్న రెహాన్ పర్వాలేదనపిస్తున్నాడు. ఈ క్రమంలోనే అలీ బ్యాకప్‌గా ఈయువ లెగ్గీని ఎంపిక చేశారు. చదవండి: Shayan Jahangir: 'కోహ్లికి ప్రత్యర్థిగా ఆడటమే నా లక్ష్యం.. ఎదురుచూస్తున్నా' -
మొయిన్ అలీకి బిగ్‌షాకిచ్చిన ఐసీసీ.. భారీ జరిమానా
ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీకీ ఐసీసీ బిగ్‌షాకిచ్చింది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ తొలి టెస్టులో ఐసీసీ ప్రవర్తనా నియమావళి ను ఉల్లంఘించినందుకు మొయిన్ అలీకి మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించింది. ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.20ని అలీ ఉల్లంఘించినట్లు ఐసీసీ ఓ ప్రకనటలో పేర్కొంది. అదే విధంగా అతడికి ఐసీసీ ఒక డీమెరిట్ పాయింట్ విధించింది. అలీ ఏం చేశాడంటే? ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 89 ఓవర్లో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న అలీ.. డ్రెయింగ్ ఏజెంట్‌తో తన చేతిపై స్ప్రే చేయించుకున్నాడు. అయితే ఈ సిరీస్ ప్రారంభానికి ముందే అంపైర్లు ఆటగాళ్లకు కొన్ని నిబంధనలు విధించారు. వారి అనుమతి లేకుంగా చేతికి ఎటువంటి క్రీమ్‌లు గానీ స్ప్రేలు గాని చేయకూడదు. కానీ అలీ అంపైర్ల రూల్స్‌ను అతిక్రమించడంతో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా యాషెస్ తొలి టెస్టుతోనే అలీ రీ ఎంట్రీ ఇచ్చాడు. చదవండి: Ashes 2023: మెయిన్ అలీ సూపర్ డెలివరీ.. బిత్తిరి పోయిన గ్రీన్! వీడియో వైరల్ -
మెయిన్ అలీ సూపర్ డెలివరీ..బిత్తర పోయిన గ్రీన్! వీడియో వైరల్
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరగుతున్న యాషెస్ తొలి టెస్టుతో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ అంతర్జాతీయ టెస్టు క్రికెట్లో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. రీ ఎంట్రీ ఇచ్చిన తొలి మ్యాచ్‌లోనే అద్భుతమైన బంతితో ఆస్ట్రేలియా ఆటగాడు కామెరాన్ గ్రీన్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆసీస్ ఇన్నింగ్స్ 67 ఓవర్లో అలీ తొలి బంతిని ఔట్ సైడ్ఆఫ్ దిశగా వేశాడు. ఆఫ్‌సైడ్ పడిన బంతి ఒక్క సారిగా టర్న్ అయ్యి స్టంప్స్‌ను గిరాటేసింది. దీంతో ఒక్క సారిగా గ్రీన్ బిత్తిరిపోయాడు. చేశాదేమి లేక గ్రీన్నిరాశతో పెవిలియన్‌కు చేరాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో గ్రీన్ 38 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో మెయిన్ అలీని భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ప్రశంసిచాడు. "వాటే ఏ బ్యూటీ మోయిన్" అంటూ.. గ్రీన్ ఔటైన వీడియోను భజ్జీ ట్విటర్లో షేర్ చేశాడు. ఇక యాషెస్ తొలి టెస్టు రసవత్తరంగా సాగుతోంది. ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 393/8 స్కోర్ వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 100 ఓవర్లు ముగిసే సరికి 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ఉస్మాన్ ఖ్వాజా(137), కమ్మిన్స్ ఉన్నారు. చదవండి: నేను బతికుండగా ఇలాంటి రోజు వస్తుందనుకోలేదు.. ఇంతకంటే దిగజారడం అంటే: మాజీ కెప్టెన్ What was that Moeen Ali.. 🥹#ENGvAUS #Ashes #Ashes23 pic.twitter.com/dATMqppgXQ — Abu Zaid Sarooji (@Sarooji_) June 17, 2023 What a beauty Moen ♠️ https://t.co/Rai7KEj4XN — Harbhajan Turbanator (@harbhajan_singh) June 17, 2023 -
Ashes 1st Test: సుదీర్ఘ విరామం తర్వాత ఇంగ్లండ్ బౌలర్ ఖాతాలో వికెట్
యాషెస్ సిరీస్ 2023 కోసం రిటైర్మెంట్ నిర్ణయాన్ని (టెస్ట్‌లు) సైతం వెనక్కు తీసుకున్న ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ.. 22 నెలల సుదీర్ఘ విరామం (650 రోజులు) తర్వాత టెస్ట్‌ల్లో తొలి వికెట్ సాధించాడు. యాషెస్ సిరీస్ తొలి టెస్ట్ రెండో రోజు ఆటలో మొయిన్.. కీలకమైన ట్రవిస్ హెడ్ (50) వికెట్ పడగొట్టాడు. హెడ్ ధాటిగా ఆడుతూ ఇంగ్లండ్ ఆధిక్యాన్ని తగ్గిస్తున్న క్రమంలో మొయిన్ అతని వికెట్‌ను దక్కించుకుని, మళ్లీ ఆసీస్‌ను కష్టాల్లోకి నెట్టేశాడు. లెగ్ సైడ్ అప్పర్ డ్రైవ్ చేసే క్రమంలో మిడ్‌వికెట్ దిశగా ఫీల్డింగ్ చేస్తున్న జాక్ క్రాలే క్యాచ్ పట్టడంతో హెడ్ పెవిలిన్ బాట పట్టాడు. Moeen Ali gets his first wicket upon returning to Test cricket. pic.twitter.com/gmSUjQtNT6— Mufaddal Vohra (@mufaddal_vohra) June 17, 2023 కాగా, మొయిన్ తన చివరి టెస్ట్ మ్యాచ్‌ను 2021 (సెప్టెంబర్) భారత పర్యటనలో ఆడాడు. అనంతరం అతను టెస్ట్‌లకు గుడ్‌బై చెప్పి పరిమిత ఓవర్ల క్రికెట్లో కొనసాగుతున్నాడు. రీఎంట్రీకి ముందు టెస్ట్‌ల్లో మొయిన్ చివరి వికెట్ రిషబ్ పంత్‌ది. ఆ మ్యాచ్ కూడా పంత్ కూడా హెడ్ లాగే 50 పరుగుల వద్ద ఔటయ్యాడు. కాగా, హెడ్ వికెట్ కోల్పోయాక కాస్త నెమ్మదించిన ఆసీస్ స్కోర్.. 56 ఓవర్లు ముగిసే సమయానికి 172/4గా ఉంది. ఉస్మాన్ ఖ్వాజా (78), కెమరూన్ గ్రీన్ (12) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఆసీస్ ఇంకా 221 పరుగులు వెనుకపడి ఉంది. 14/0 స్కోర్ వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్.. తొలి సెషన్లోనే వార్నర్ (9), లబూషేన్ (0), స్టీవ్ స్మిత్ (16) వికెట్లు కోల్పోయింది. స్టువర్ట్ బ్రాడ్‌కు 2, స్టోక్స్ ఓ వికెట్ (స్మిత్) పడగొట్టాడు. అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. రూట్ (118 నాటౌట్), జాక్ క్రాలే (61), బెయిర్‌స్టో (78) రాణించగా 393/8 స్కోర్ వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఆసీస్ బౌలర్లలో నాథన్ లయోన్ 4, హాజిల్‌వుడ్ 2, బోలండ్, గ్రీన్ తలో వికెట్ పడగొట్టారు. చదవండి: Ashes 1st Test: తొలి రోజే ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి ఇంగ్లండ్ ఓవరాక్షన్ చేసిందా..? -
'టైటిల్ గెలిచిన మత్తులో ఎక్కాల్సిన ఫ్లైట్ మిస్సయ్యాం'
ఐపీఎల్ 16వ సీజన్ విజేతగా సీఎస్కే నిలిచిన సంగతి తెలిసిందే. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఫైనల్లో ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇది సీఎస్కే ఐదో ఐపీఎల్ టైటిల్ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాగా సీఎస్కే విజయంలో కీలకపాత్ర పోషించిన ఓపెనర్ డెవాన్ కాన్వే చాలా రోజులకు ఒక ఆసక్తికర విషయాన్ని తెలిపాడు. ''టైటిల్ గెలిచిన సంతోషంలో చాలా వైల్డ్‌గా సెలబ్రేషన్స్ చేసుకున్నాం. అలా సెలబ్రేషన్స్‌లో మునిగిపోయిన మాలో చాలా మంది ఎక్కాల్సిన ఫ్లైట్ మిస్సయ్యాం. మొయిన్ అలీ ఫ్యామిలీతో పాటు.. డ్వేన్ ప్రిటోరియస్ కూడా తర్వాతి రోజు వెళ్లారు. మా బౌలింగ్ కన్సల్టెంట్ ఎరిక్ సిమోన్స్ కూడా ఫ్లైట్‌ను క్యాన్సిల్ చేసుకున్నాడు. మేమంతా ఒక రూమ్‌లో కూర్చొని సెలబ్రేట్ చేసుకోగా.. ధోని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యాడు. ధోనితో కలిసి గడిపిన సమయాన్ని మా అదృష్టంగా భావిస్తున్నాం.'' అంటూ తెలిపాడు. చదవండి: బ్రిజ్‌భూషణ్‌పై చార్జ్‌షీట్ దాఖలు 'నా సక్సెస్‌లో సగం క్రెడిట్ కేన్మామదే' -
#MoeenAli: స్టోక్స్ 'బూడిద'.. టెస్టుల్లోకి తిరిగి వచ్చేలా చేసింది
ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ ఇటీవలే టెస్ట్ రిటైర్మెంట్ను వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. అలా రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్నాడో లేదో ఈసీబీ అతన్ని ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్కోసం ఎంపిక చేసింది. ఇక జూన్ 16 నుంచి మొదలుకానున్న యాషెస్ సిరీస్ కోసం మొయిన్ అలీ సిద్ధమవుతున్నాడు. జాక్ లీచ్ గైర్హాజరీలో మొయిన్ అలీ జట్టు బౌలింగ్‌లో కీలకపాత్ర పోషించనున్నాడు. అయితే టెస్టు రిటైర్మెంట్ వెనక్కి తీసుకోవడం వెనుక ప్రధాన కారణం బెన్‌స్టోక్స్ అని మొయిన్ అలీ రివీల్ చేశాడు. స్టోక్స్ చెప్పిన యాషెస్ అనే ఒక్క పదం తనను మళ్లీ టెస్టుల్లో రీఎంట్రీ ఇచ్చేలా చేసిందన్నాడు. తొలి టెస్టు సందర్భంగా ఎడ్జ్‌బాస్టన్‌లో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మొయిన్ అలీ మాట్లాడాడు. ''స్టోక్స్ నేను సరదాగా చాట్ చేసుకుంటున్నాం. ఆ సమయంలో యాషెస్?(Ashes?) అని అడిగాడు. అయితే ఆ సమయంలో జాక్ లీచ్ గాయపడ్డాడని నాకు తెలియదు. దీంతో లోల్(Lol) అని మెసేజ్ చేశా. అంతే స్టోక్స్ నవ్వుతో అయితే సిద్ధంగా ఉండు అని పేర్కొన్నాడు. అప్పుడు ఏం అర్థం కాలేదు. ఆ తర్వాత జాక్ లీచ్ గాయపడ్డాడని తెలిసింది. ఆ తర్వాత స్టోక్స్‌కు ఫోన్ చేసి చాలాసేపు మాట్లాడాను. ఈ నేపథ్యంలో యాషెస్‌లో నీ అవసరం ఉందని స్టోక్స్ నాతో అన్నాడు. రిటైర్మెంట్ వెనక్కి తీసుకోవడంపై ఒకసారి ఆలోచించు అని తెలిపాడు. ఒక కెప్టెన్ నన్ను కన్విన్స్ చేయడానికి ప్రయత్నించడం నచ్చింది. అందునా యాషెస్ అనే పదం వినగానే నాలో ఉత్సాహం వచ్చింది.. ఆడాలని నిశ్చయించుకున్నా. ఈసీబీకి చెప్పి రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్నా. టెస్టుల్లో నా కమ్‌బ్యాక్‌కు బెన్‌స్టోక్స్ ప్రధాన కారణం అని కచ్చితంగా చెప్పగలను'' అంటూ వివరించాడు. మొయిన్ అలీ కెరీర్లో ఇప్పటివరకు 64 టెస్ట్‌లు ఆడి 195 వికెట్లు పడగొట్టి, 2914 పరుగులు సాధించాడు. ఆసీస్‌పై 11 టెస్ట్‌లు ఆడిన మొయిన్.. బ్యాటింగ్‌లో కాస్త పర్వాలేదనిపించినా, బౌలింగ్‌లో మాత్రం పూర్తిగా తేలిపోయాడు. ఇతని యావరేజ్ ఆసీస్‌పై ఏకంగా 64.65గా ఉంది. ఇక స్టోక్స్ కెప్టెన్సీలో ఇంగ్లండ్ టెస్టుల్లో దూసుకుపోతుంది. బజ్‌బాల్ విధానంతో దూకుడుగా ఆడుతున్న ఇంగ్లీష్ జట్టు స్టోక్స్ కెప్టెన్సీలో 13 టెస్టుల్లో 11 విజయాలు నమోదు చేయడం విశేషం. 2015 తర్వాతి నుంచి మరో యాషెస్ గెలవని ఇంగ్లండ్ ఈసారి ఎలాగైనా ఆసీస్‌ను ఓడించి యాషెస్‌ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. Moeen Ali's response when Ben Stokes first approached him about an Ashes comeback: "lol" 😂 pic.twitter.com/qIy8Jf6Btx — ESPNcricinfo (@ESPNcricinfo) June 13, 2023 చదవండి: అగ్రరాజ్యంలో మినీ ఐపీఎల్.. అభిమానులకు పండగే! -
ట్రెంట్ బౌల్ట్ సంచలన నిర్ణయం.. మొయిన్ అలీ బాటలోనే..!
న్యూజిలాండ్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వన్డే వరల్డ్‌కప్ 2023 కోసం న్యూజిలాండ్ జట్టులో చేరేందుకు అంగీకరించాడు. గతేడాది ఆగస్ట్‌లో న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు (NZC) సెంట్రల్ కాంట్రాక్ట్ వదులుకున్న బౌల్ట్.. బోర్డు విజ్ఞప్తి మేరకుతో మళ్లీ కివీస్ తరఫున బరిలోకి దిగేందుకు ఓకే చెప్పాడు. న్యూజిలాండ్ ప్రజలు బోల్ట్‌ను వన్డే వరల్డ్‌కప్-2023 జట్టులోకి తీసుకోవాలని బోర్డుపై ఒత్తిడి తేవడంతో NZC ఈ నిర్ణయం తీసుకుంది. న్యూజిలాండ్ బోర్డు 20 మంది ఆటగాళ్లకు 2023-24 సీజన్ సెంట్రల్ కాంట్రక్ట్ ఇచ్చిన రోజే (జూన్ 8) ఈ పరిణామం చోటు చేసుకుంది. కాగా, బౌల్ట్.. ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ లీగ్‌ల్లో పాల్గొనేందుకు, అలాగే కుటుంబంతో గడిపేందుకు గతేడాది న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు కాంట్రాక్ట్‌ను తిరస్కరించిన విషయం తెలిసిందే. 2015, 2019 వన్డే వరల్డ్‌కప్‌లలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన బౌల్ట్.. 2023 వరల్డ్‌కప్‌లో కూడా న్యూజిలాండ్ జట్టులో భాగం కావాలని ఆ దేశ ప్రజలు కోరుకున్నారు. చివరి రెండు వరల్డ్‌కప్‌లలో న్యూజిలాండ్ ఫైనల్స్‌కు చేరడంలో బౌల్ట్ కీలకపాత్ర పోషించాడు. 2015లో ఆసీస్ మిచెల్ స్టార్క్‌తో పాటు లీడింగ్ వికెట్ టేకర్‌గా (22).. 2019లో న్యూజిలాండ్ తరఫున అత్యుత్తమ బౌలర్‌గా (8 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు) నిలిచాడు. ఓవరాల్‌గా బౌల్ట్ వరల్డ్‌కప్‌లలో 21.79 సగటున 39 వికెట్లు పడగొట్టి, ఆ దేశం తరఫున మెగా టోర్నీలో అత్యధిక వికెట్లు పడగొట్టన బౌలర్‌గా రికార్డుల్లో నిలిచాడు. ఇదిలా ఉంటే, నిన్న (జూన్ 7) ఇంగ్లండ్ వెటరన్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ సైతం తన దేశ క్రికెట్ బోర్డు (ఈసీబీ) విజ్ఞప్తి మేరకు రిటైర్మెంట్ ప్రకటించాక కూడా టెస్ట్‌ల్లో ఆడేందుకు ఒప్పుకున్నాడు. ఈసీబీ మొయిన్ అలీని యాషెస్ సిరీస్‌కు ఎంపిక చేసింది. దీంతో మొయిన్ దాదాపు రెండేళ్ల తర్వాత టెస్ట్‌ల్లో ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహించనున్నాడు. మొయిన్ 2021లో టెస్ట్‌లకు గుడ్‌బై చెప్పాడు. చదవండి: ఇంగ్లండ్ క్రికెటర్ మొయిన్ అలీ సంచలన నిర్ణయం -
ఇంగ్లండ్ క్రికెటర్ మొయిన్ అలీ సంచలన నిర్ణయం
ఇంగ్లండ్ వెటరన్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 2021 సెప్టెంబర్‌లో టెస్ట్‌లకు గుడ్‌బై చెప్పిన ఇతను.. తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నాడు. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) విజ్ఞప్తి మేరకు అలీ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. దీంతో ఈసీబీ మొయిన్‌ను జూన్ 16 నుంచి ప్రారంభంకానున్న యాషెస్ సిరీస్‌కు ఎంపిక చేసింది. తొలి రెండు టెస్ట్‌లకు ఎంపిక చేసిన జట్టులోని జాక్ లీచ్ గాయపడటంతో అతని స్థానాన్ని భర్తీ చేసేందుకు మొయిన్‌ను రిటైర్మెంట్ నిర్ణయం వెనక్కు తీసుకోవాలని ఈసీబీ కోరగా, అందుకు అతను అంగీకరించాడు. కాగా, మొయిన్ 2021లో టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించాక రెడ్ బాల్‌తో కనీసం ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు కూడా ఆడలేదు. అయినా ఈసీబీ ఇతనిపై నమ్మకంతో రిటైర్మెంట్ను సైతం వెనక్కు తీసుకునేలా చేసి, జట్టులోకి ఆహ్వానించింది. మొయిన్ రాకతో ఇంగ్లండ్ బలం పుంజుకున్నట్లు కనిపిస్తున్నప్పటికీ.. ఓ విషయం మాత్రం ఈసీబీని లోలోపల కలవరపెడుతుంది. అదేంటంటే.. మొయిన్‌కు ఆస్ట్రేలియాపై చెత్త రికార్డు ఉండటం. ఆసీస్‌పై 11 టెస్ట్‌లు ఆడిన మొయిన్.. బ్యాటింగ్‌లో కాస్త పర్వాలేదనిపించినా, బౌలింగ్‌లో మాత్రం పూర్తిగా తేలిపోయాడు. ఇతని యావరేజ్ ఆసీస్‌పై ఏకంగా 64.65గా ఉంది. ఇది అతని కెరీర్ యావరేజ్‌కు రెండింతలు. కెరీర్లో ఇప్పటివరకు 64 టెస్ట్‌లు ఆడిన మొయిన్.. 195 వికెట్లు పడగొట్టి, 2914 పరుగులు సాధించాడు. యాషెస్ సిరీస్ తొలి రెండు టెస్ట్‌లకు ఇంగ్లండ్ జట్టు.. హ్యారీ బ్రూక్, బెన్ డకెట్, జో రూట్, జాక్ క్రాలే, డేనియల్ లారెన్స్, బెన్ స్టోక్స్, క్రిస్ వోక్స్, జానీ బెయిర్ స్టో, ఓలీ పోప్, జేమ్స్ ఆండర్సన్, స్టువర్ట్ బ్రాడ్, మాథ్యూ పాట్స్, జోష్ టంగ్, మార్క్ వుడ్, ఓలీ రాబిన్సన్, మొయిన్ అలీ ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య ఇంగ్లండ్ వేదికగా జరిగే యాషెస్ సిరీస్ షెడ్యూల్.. తొలి టెస్ట్, జూన్ 16-20, ఎడ్జ్‌బాస్టన్ రెండో టెస్ట్, జూన్ 28-జులై 2, లార్డ్స్ మూడో టెస్ట్, జులై 6-10, హెడింగ్లే నాలుగో టెస్ట్, జులై 19-23, ఓల్డ్ ట్రాఫర్డ్ ఐదో టెస్ట్, జులై 27-31, ఓవల్ చదవండి: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు వర్షం ముప్పు.. చివరి రెండు రోజుల్లో! -
ధోని.. అతడి సేవలను అస్సలు ఉపయోగించుకోవడం లేదు! ఫైనల్ మాత్రం తనదే!
IPL 2023 Final- CSK vs GT: ‘‘కెప్టెన్ ధోని అతడి సేవలను అస్సలు ఉపయోగించుకోవడం లేదు. బ్యాటింగ్ లేదంటే బౌలింగ్ చేసే అవకాశం ఇవ్వడం లేదు. నాకు తెలిసి అతడి కోసం ప్రత్యేక ప్రణాళికలు రచించి ఉంటాడు. ఈరోజు అతడిదే అవుతుందనుకుంటున్నా’’ అని టీమిండియా మాజీ బ్యాటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీని ఉద్దేశించి ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. 10 ఇన్నింగ్స్ ఆడి కాగా ఐపీఎల్-2023లో మొయిన్ అలీ చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, జట్టులో సీనియర్ అయిన ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్‌కు ఈ సీజన్లో పెద్దగా ఆడే అవకాశం రాలేదు. లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసిన అతడు 10 ఇన్నింగ్స్ ఆడి 124 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 23. ఇక బౌలింగ్‌పరంగా చూస్తే.. 7.50 ఎకానమీతో 9 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే.. అహ్మదాబాద్ వేదికగా ఆదివారం (మే 28) డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్- చెన్నై ఫైనల్లో తలపడనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా సీఎస్కే బ్యాటింగ్ ఆర్డర్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. మొయిన్ అలీ- ఎంఎస్ ధోని (PC: IPL) జడ్డూ బ్యాట్‌తో మెరుస్తాడు ‘‘ధోని ఎందుకో మొయిన్ అలీ సేవలను ఉపయోగించుకోవడం లేదు. ఇక జడేజా ఈరోజు బ్యాట్‌తో మెరుస్తాడనుకుంటున్నా. ఎందుకంటే.. అహ్మదాబాద్ పిచ్‌పై అతడి బౌలింగ్ వర్కౌట్ కాకపోవచ్చు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండబోతోందనపిస్తోంది. దూబేను అలా ట్రాప్ చేస్తారు ఇక శివం దూబే స్పిన్ ఆడటంలో కాస్త ఇబ్బంది పడుతున్నాడు. గత మ్యాచ్‌లో నూర్ అహ్మద్ చేతికి చిక్కి పెవిలియన్ చేరాడు. కాబట్టి గుజరాత్ టైటాన్స్ ఈసారి కూడా అతడిని ఫాస్ట్ బౌలింగ్‌తో కాకుండా స్పిన్నర్లతో ట్రాప్ చేయడం పక్కా. రహానే నంబర్ 3 మరోవైపు.. అజింక్య రహానే.. చెన్నైలో పెద్దగా ప్రభావం చూపలేదు. చెన్నై వెలుపలే అతడు ఎక్కువగా పరుగులు రాబట్టాడు. రహానే ఇక్కడ కచ్చితంగా రన్స్ సాధిస్తాడనే అనుకుంటున్నా. రహానే మూడో స్థానంలో దిగితే బాగుంటుంది. నిజానికి సీఎస్కే వారి ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వేపై ఎక్కువగా ఆధారపడుతోంది. రుతు, కాన్వే అద్భుత ఫామ్‌లో ఉన్నారు. కాబట్టి మహ్మద్ షమీ వీరిద్దరని కచ్చితంగా టార్గెట్ చేస్తాడు’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. కాగా ఈ సీజన్లో కాన్వే ఇప్పటి వరకు 14 ఇన్నింగ్స్‌లో 625 పరుగులు, రుతురాజ్ 14 ఇన్నింగ్స్ ఆడి 564 పరుగులు సాధించారు. ఇక గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆదివారం రాత్రి 7.30 గంటలకు సీఎస్కే- గుజరాత్ మధ్య టైటిల్ పోరు జరుగనుంది. చదవండి: విరాట్ సర్, ఐయామ్ సారి, మీ కెప్టెన్సీలో ఆడాలని ఉంది.. నవీన్ ఉల్ హక్ రియాక్షన్ సూర్యను చూసి నేర్చుకో.. నాకు దాదా ఆరోజు అలా చెప్పాడు.. తిలక్ నువ్వు కూడా! Wait till you see Cherry’s POV 💛📹#WhistlePodu #Yellove 🦁 @deepak_chahar9 pic.twitter.com/aLsrU6ALxl — Chennai Super Kings (@ChennaiIPL) May 27, 2023 -
జడ్డూ చిరుత పులిలా.. మొయిన్ అలీ ముసలోడిలా!
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా సీఎస్కే, గుజరాత్ టైటాన్స్ మధ్య క్వాలిఫయర్-1 పోరులో ఒక ఆసక్తికర ఘటన జరిగింది. సీఎస్కే ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో ఇది చోటుచేసుకుంది. షమీ వేసిన 20వ ఓవర్ నాలుగో బంతిని మొయిన్ అలీ మిస్ చేశాడు. అయితే నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న జడేజా పరుగు కోసం చిరుత పులిలా పరిగెత్తుకొచ్చాడు. అయితే ఇది గమనించని మొయిన్ అలీ అప్పుడు క్రీజు నుంచి కదిలాడు. అయితే బంతిని అందుకున్న సాహా వికెట్ల వైపు విసరగా.. అప్పటికే జడ్డూ తన బ్యాట్‌ను క్రీజులో ఉంచాడు. ఇక్కడ అసలు విషయం ఏంటంటే.. జడేజా బ్యాట్ పెట్టేలోపు మొయిన్ అలీ ఇంకా అతని వెనకాలే ఉన్నాడు. ఒకవేళ సాహా నేరుగా నాన్‌స్ట్రైక్ ఎండ్‌వైపు బంతిని విసిరి ఉంటే మొయిన్ అలీ కచ్చితంగా రనౌట్ అయ్యేవాడే కానీ తప్పించుకున్నాడు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు..''జడ్డూ చిరుతపులిలా పరిగెత్తుకొస్తే.. మొయిన్ అలీ మాత్రం ముసలోడిలా పరిగెత్తాడు'' అంటూ కామెంట్ చేశారు. Jadeja returned from School and Moeen Ali is just going to School 😭 pic.twitter.com/9xz1SFhUpT — ♚ (@balltamperrer) May 23, 2023 చదవండి: దీపక్ చహర్ అరుదైన ఘనత.. -
మరీ ఇంత బద్దకమా.. మొయిన్ అలీపై కోపంతో ఊగిపోయిన ధోని! వీడియో వైరల్
ఐపీఎల్-2023లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో ఓటమి చవి చూసింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో 8 పరుగుల తేడాతో ఆర్సీబీ పరాజయం పాలైంది. 227 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేయగల్గింది. ఆర్సీబీ బ్యాటర్లలో కెప్టెన్ డుప్లెసిస్(62), మాక్స్వెల్(76) అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడినప్పటికీ.. విజయం మాత్రం సీఎస్కే వైపే నిలిచింది. మొయిన్ అలీపై ధోని సీరియస్ ఈ మ్యాచ్‌లో సీఎస్కే కెప్టెన్ ఎంస్ ధోని తన ప్రశాంతతను కోల్పోయాడు. ఫీల్డింగ్‌లో అలసత్వం వహించిన మొయిన్ అలీపై ఎంస్ కోపంతో ఊగిపోయాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్ 18 ఓవర్ వేసిన పతిరానా బౌలింగ్‌లో చివరి బంతికి పార్నెల్ ఎక్స్ట్రా కవర్ దిశగా షాట్ ఆడాడు. బంతికి ఎక్స్ట్రా కవర్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న మొయిన్ అలీ చేతికి వెళ్లింది. ఈ క్రమంలో పార్నెల్ సింగిల్ కోసం ప్రయత్నించాడు. అయితే నాన్‌స్ట్రైకర్‌లో ఉన్న ప్రభుదేశాయి మాత్రం పార్నెల్‌ను గమనించలేదు. పార్నెల్ గట్టిగా అరవడంతో ప్రభుదేశాయ్ వికెట్ కీపర్‌వైపు పరిగెత్తాడు. అయితే మొయిన్ బంతిని సరిగ్గా అందుకోవడంలో విఫలమయ్యాడు. అంతేకాకుండా తన పక్కనే ఉన్న బంతిని వికెట్ కీపర్‌కు త్రో చేయకుండా బద్దకంగా వ్యవహరించాడు. ఒక వేళ బంతిని వెంటనే అందుకుని వికెట్ కీపర్‌కు అతడు త్రో చేసి ఉంటే సుయాష్ ప్రభుదేశాయి రనౌట్‌గా వెనుదిరిగేవాడు. బంతిని త్రో చేయడంలో మొయిన్ అలీ అలసత్వం వహించడంతో రనౌట్ అయ్యే ప్రమాదం నుంచి సుయాష్ తప్పించుకున్నాడు. ఇక మొయిన్ అలీ పేలవ ఫీల్డింగ్‌పై ధోని ఆగ్రహాం వ్యక్తం చేశాడు. ధోని కోపంతో మొయిన్ వైపు చూస్తూ ఏదో అన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. pic.twitter.com/yeXJEpm5Ts — Billu Pinki (@BilluPinkiSabu) April 18, 2023 .@ChennaiIPL come out on top in the mid-table clash as they beat #RCB by 8 runs in highly entertaining and run-filled #TATAIPL match. 👏 👏 Scorecard ▶️ https://t.co/QZwZlNk1Tt#RCBvCSK pic.twitter.com/jlEz6KmM0V — IndianPremierLeague (@IPL) April 17, 2023 చదవండి: #MS Dhoni: వాళ్లిద్దరు ఇంకాసేపు క్రీజులో ఉంటే మేము ఓడిపోయేవాళ్లం.. 18వ ఓవర్లోనే మ్యాచ్ ముగిసేది! కానీ.. -
సీఎస్కేకు మరో బిగ్ షాక్.. కోట్లు పోసి కొన్న ఆటగాడు ఔట్..!
ఐపీఎల్-2023లో ఫోర్ టైమ్ ఛాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్‌ను గాయాల బెడద వెంటాడుతూ ఉంది. ముంబై ఇండియన్స్‌తో నిన్న (ఏప్రిల్ 8) జరిగిన మ్యాచ్ సందర్భంగా హ్యామ్‌స్ట్రింగ్ ఇంజ్యూరీ తిరగబెట్టడంతో రూ. 14 కోట్ల ఆటగాడు దీపక్ చాహర్ లీగ్‌లో తదుపరి కొనసాగేది అనుమానంగా మారగా.. తాజాగా మరో ఆటగాడు, రూ. 16.25 కోట్ల ప్లేయర్ బెన్ స్టోక్స్ బొటనవేలి గాయం కారణంగా వారం రోజులు లీగ్‌ను దూరంగా ఉంటాడని తెలుస్తోంది. సీఎస్కే మేనేజ్మెంట్ చాహర్ 4 లేదా 5 మ్యాచ్‌లకే దూరంగా ఉంటాడని చెబుతున్నప్పటికీ అతని గాయం తీవ్రత అధికంగా ఉందని సమాచారం. చాహర్ ఇదే గాయం కారణంగా గత సీజన్ మొత్తానికి దూరమైన నేపథ్యంలో ఈ సీజన్ పరిస్థితి ఏమోనని సీఎస్కే యాజమాన్యం లోలోపల ఆందోళన చెందుతుంది. చాహర్ గురించే తలలు పట్టుకున్న సీఎస్కేకు స్టోక్స్ రూపంలో మరో స్ట్రోక్ తగలడంతో బెంబేలెత్తిపోతుంది. స్టోక్స్‌కు తగిలిన గాయాన్ని చిన్నదిగా చూపించాలని ఎల్లో ఆర్మీ భావిస్తున్నప్పటికీ, ఆ జట్టు కంగారు పడుతున్న తీరు చూస్తుంటే, 16.25 కోట్ల ఆటగాడు సీజన్ మొత్తానికే దూరమవుతాడా అన్న అనుమానం కలుగుతుంది. ఇవి చాలవన్నట్లు కోట్లు పోసి సొంతం చేసుకున్న మరో ఆటగాడు మొయిన్ అలీ కూడా అనారోగ్యంగా ఉన్నాడని తెలుస్తోంది. ఒకవేళ ఇతను కూడా తదుపరి మ్యాచ్‌లకు దూరమైతే సీఎస్కే విజయావకాశాలపై భారీ ప్రభావం పడుతుంది. ఇన్ని టెన్షన్స్ మధ్య ముంబైతో మ్యాచ్‌లో రహానే రాణించడం ఒక్కటి సీఎస్కేకు ఊరట కలిగిస్తుంది. ఒకవేళ సీఎస్కే నిజంగా చాహర్, స్టోక్స్ సేవలు కొన్ని మ్యాచ్‌లకైనా సరే కోల్పోవాల్సి వస్తే, ఆ జట్టు గత సీజన్లో మాదిరే పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉండాల్సి వస్తుంది.