గుజరాత్‌తో ఫైనల్ పోరుకు సీఎస్‌కే సిద్ధం (PC: IPL/CSK)
IPL 2023 Final- CSK vs GT: ‘‘కెప్టెన్ ధోని అతడి సేవలను అస్సలు ఉపయోగించుకోవడం లేదు. బ్యాటింగ్ లేదంటే బౌలింగ్ చేసే అవకాశం ఇవ్వడం లేదు. నాకు తెలిసి అతడి కోసం ప్రత్యేక ప్రణాళికలు రచించి ఉంటాడు. ఈరోజు అతడిదే అవుతుందనుకుంటున్నా’’ అని టీమిండియా మాజీ బ్యాటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీని ఉద్దేశించి ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.
10 ఇన్నింగ్స్ ఆడి
కాగా ఐపీఎల్-2023లో మొయిన్ అలీ చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, జట్టులో సీనియర్ అయిన ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్‌కు ఈ సీజన్‌లో పెద్దగా ఆడే అవకాశం రాలేదు. లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేసిన అతడు 10 ఇన్నింగ్స్ ఆడి 124 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 23.
ఇక బౌలింగ్‌పరంగా చూస్తే.. 7.50 ఎకానమీతో 9 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే.. అహ్మదాబాద్ వేదికగా ఆదివారం (మే 28) డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్- చెన్నై ఫైనల్లో తలపడనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా సీఎస్‌కే బ్యాటింగ్ ఆర్డర్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు.
మొయిన్ అలీ- ఎంఎస్ ధోని (PC: IPL)
జడ్డూ బ్యాట్‌తో మెరుస్తాడు
‘‘ధోని ఎందుకో మొయిన్ అలీ సేవలను ఉపయోగించుకోవడం లేదు. ఇక జడేజా ఈరోజు బ్యాట్‌తో మెరుస్తాడనుకుంటున్నా. ఎందుకంటే.. అహ్మదాబాద్ పిచ్‌పై అతడి బౌలింగ్ వర్కౌట్ కాకపోవచ్చు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండబోతోందనపిస్తోంది.
దూబేను అలా ట్రాప్ చేస్తారు
ఇక శివం దూబే స్పిన్ ఆడటంలో కాస్త ఇబ్బంది పడుతున్నాడు. గత మ్యాచ్‌లో నూర్ అహ్మద్ చేతికి చిక్కి పెవిలియన్ చేరాడు. కాబట్టి గుజరాత్ టైటాన్స్ ఈసారి కూడా అతడిని ఫాస్ట్ బౌలింగ్‌తో కాకుండా స్పిన్నర్లతో ట్రాప్ చేయడం పక్కా.
రహానే నంబర్ 3
మరోవైపు.. అజింక్య రహానే.. చెన్నైలో పెద్దగా ప్రభావం చూపలేదు. చెన్నై వెలుపలే అతడు ఎక్కువగా పరుగులు రాబట్టాడు. రహానే ఇక్కడ కచ్చితంగా రన్స్ సాధిస్తాడనే అనుకుంటున్నా. రహానే మూడో స్థానంలో దిగితే బాగుంటుంది.
నిజానికి సీఎస్‌కే వారి ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వేపై ఎక్కువగా ఆధారపడుతోంది. రుతు, కాన్వే అద్భుత ఫామ్‌లో ఉన్నారు. కాబట్టి మహ్మద్ షమీ వీరిద్దరని కచ్చితంగా టార్గెట్ చేస్తాడు’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.
కాగా ఈ సీజన్‌లో కాన్వే ఇప్పటి వరకు 14 ఇన్నింగ్స్‌లో 625 పరుగులు, రుతురాజ్ 14 ఇన్నింగ్స్ ఆడి 564 పరుగులు సాధించారు. ఇక గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆదివారం రాత్రి 7.30 గంటలకు సీఎస్‌కే- గుజరాత్ మధ్య టైటిల్ పోరు జరుగనుంది.
చదవండి: విరాట్ సర్, ఐయామ్ సారి, మీ కెప్టెన్సీలో ఆడాలని ఉంది.. నవీన్ ఉల్ హక్ రియాక్షన్
సూర్యను చూసి నేర్చుకో.. నాకు దాదా ఆరోజు అలా చెప్పాడు.. తిలక్ నువ్వు కూడా!
Wait till you see Cherry’s POV 💛📹#WhistlePodu #Yellove 🦁 @deepak_chahar9 pic.twitter.com/aLsrU6ALxl
— Chennai Super Kings (@ChennaiIPL) May 27, 2023
Comments
Please login to add a commentAdd a comment