MS Dhoni Becomes the First Player to Complete 250 Matches in IPL History - Sakshi
Sakshi News home page

#MS Dhoni: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన ధోని.. ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కాలేదు

Published Mon, May 29 2023 7:57 PM | Last Updated on Mon, May 29 2023 8:35 PM

MS Dhoni becomes the first player to complete 250 matches in IPL history - Sakshi

Photo Credit : IPL Website

ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌ చరిత్రలో 250 మ్యాచ్‌లు ఆడిన ఏకైక ఆటగాడిగా ధోని రికార్డులకెక్కాడు. ఐపీఎల్‌-2023లో భాగంగా గుజరాత్‌ టైటాన్స్‌తో జరగుతున్న ఫైనల్‌ మ్యాచ్‌ ఆడేందుకు బరిలోకి దిగిన ధోని.. ఈ ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.

ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో ధోని తర్వాత ముంబై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (243), ఆర్సీబీ వికెట్‌కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌ (242), ఆర్సీబీ విరాట్‌ కోహ్లి (237), సీఎస్‌కే రవీంద్ర జడేజా (225), పంజాబ్‌ సారధి శిఖర్‌ ధవన్‌ (217), సీఎస్‌కే మాజీ ప్లేయర్లు సురేశ్‌ రైనా (205), రాబిన్‌ ఉతప్ప (205), అంబటి రాయుడు (203), రాజస్థాన్ ఆల్‌రౌండర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ (197) వరుసగా 2 నుంచి 10 స్థానాల్లో ఉన్నారు.

ఇక ఫైనల్‌ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ధోని తొలుత బౌలింగ్‌ ఎంచకున్నాడు. క్వాలిఫియర్‌-1 ఆడిన జట్టుతోనే సీఎస్‌కే తుదిపోరులో కూడా బరిలోకి దిగింది. మరోవైపు గుజరాత్‌ టైటాన్స్‌ కూడా ఎటువంటి తమ జట్టులో ఎటువంటి మార్పులు చేయలేదు.
చదవండి: IPL 2023 Final: 'మాకంటే ఎక్కువగా బాధపడ్డారు.. ఎంటర్‌టైన్‌ చేసి తీరుతాం'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement