ఐపీఎల్-2023లో భాగంగా ఆదివారం గుజరాత్, చెన్నై మధ్య జరగాల్సిన ఫైనల్ మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించిన సంగతి తెలిసిందే. భారీ వర్షం కారణంగా ఆట సాధ్యం కాకపోవడంతో ఐపీఎల్ ఫైనల్‌ను రిజర్వ్ డే(సోమవారం)కు వాయిదా వేశారు. ఇక ఆదివారం ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు.
వరుణడు ఎప్పటికీ కరుణించకపోవడంతో అభిమానులు నిరాశ చెందారు. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనికి ఇదే చివరిమ్యాచ్ అని వార్తలు వినిపిస్తుండంతో.. అతడి అభిమానులు దేశం నలుమూలల నుంచి భారీగా తరలివచ్చారు. అయితే మ్యాచ్ వాయిదా పడడంతో ఫ్యాన్స్ నానా అవస్థలు పడ్డారు. తమ ఆరాధ్య క్రికెటర్ ఆడే మ్యాచ్‌ను సోమవారమైనా చూసేందుకు అహ్మదాబాద్‌లోనే ఉండాలని నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలో కొంతమంది సీఎస్‌కే ఫ్యాన్స్ ఆదివారం రాత్రం రైల్వేస్టేషన్, బస్‌స్టేషన్‌లో నిద్రించారు. మరికొంత మంది బయట రోడ్ల పక్కన ఫుట్‌పాత్‌లపై కూడా నిద్రపోయినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. కాగా మ్యాచ్ జరగనున్న అహ్మదాబాద్‌లో ప్రస్తుతం వాతావారణం పొడిగా ఉంది. ఎండ బాగా కాస్తోంది. మ్యాచ్ జరిగే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి.
చదవండి: WTC Final- Virat Kohli: ఇంగ్లండ్‌లో ఉన్నపుడు ఇలా! అదే ఇండియాలో అయితే! కోహ్లి ఫొటో వైరల్!
It is 3 o'clock in the night when I went to Ahmedabad railway station, I saw people wearing jersey of csk team, some were sleeping, some were awake, some people, I asked them what they are doing, they said we have come only to see MS Dhoni @IPL @ChennaiIPL #IPLFinal #Ahmedabad pic.twitter.com/ZJktgGcv8U
— Sumit kharat (@sumitkharat65) May 28, 2023
Comments
Please login to add a commentAdd a comment